morphed video
-
Vijayawada: ఐ-టీడీపీపై సీఐడీ కేసు
సాక్షి, విజయవాడ: ఐ-టీడీపీపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తన వీడియోని మార్ఫింగ్ చేసినట్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై విచారణ చేపట్టి ప్రాథమికంగా ఆ వీడియో మార్ఫింగ్ అని తేల్చారు. ఈ క్రమంలో ఐ-టీడీపీ సహా మరికొందరిపై పలు సెక్షన్లతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఐటీ (66t), IPC 465, 469, 471, 153(a), 505(2), 120(b) సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చదవండి: (సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ) -
అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కథ కంచికి!
ఇంటర్నెట్లో సైట్లను బ్లాక్ చేసినా మన దేశంలో అశ్లీల కంటెంట్ వీక్షణకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటున్నాయి. ఆఖరికి సోషల్ మీడియా అకౌంట్లలోనూ వీటి హవా నడుస్తోంది. అయితే ఇకపై ఇలాంటి ఆటలు సాగవు!. అశ్లీల కంటెంట్‌తో పాటు మార్ఫింగ్ వీడియోల తొలగింపు కోసం స్వయంగా రంగంలోకి దిగింది కేంద్రం. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల, మార్ఫింగ్ వీడియోల పని పట్టేలో కేంద్ర ప్రభుత్వం తలమునకలైంది. వివిధ ప్లాట్‌ఫామ్‌లలోని అకౌంట్లపై వేట(టు) మొదలైంది. ఈ మేరకు కేంద్ర సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ.. ట్విటర్, ఫేస్బుక్, టెలిగ్రాం అకౌంట్లలో సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్, అశ్లీల వీడియోల అంశాన్ని ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయా అకౌంట్లను తాత్కాలికంగా లేదంటే పూర్తిగా నిషేధించడమో చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడుతున్నాయి కూడా. ఆ క్లిప్‌తో గుర్రు! గతంలో పోర్న్ సైట్ల బహిరంగ వీక్షణపై కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు టెలికామ్ ఆపరేటర్ల సహకారంతో ఈ చర్యకు ఉపక్రమించింది. అయినప్పటికీ ఇతర మార్గాల ద్వారా అశ్లీల కంటెంట్ వైరల్ అవుతూ వస్తుండగా.. ఎప్పటికప్పుడు చర్యల ద్వారా కట్టడి చేస్తూ వస్తోంది కేంద్రం. ఇదిలా ఉంటే ట్విటర్లాంటి సామాజిక మాధ్యమాల్లో సైతం అసభ్య, అశ్లీల, మార్ఫింగ్, ఫేక్ వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ విషయంలో పలు ఫిర్యాదులు అందడంతో సీరియస్ అయిన కేంద్రం.. ఐటీ రూల్స్ 2021 ద్వారా కట్టడికి ప్రయత్నిస్తూ వస్తోంది. అయినా కూడా కంటెంట్ వ్యాప్తి ఆగడం లేదు. కేవలం ఏజ్ లిమిట్ పర్మిషన్తో యూజర్లను ఆయా ప్లాట్‌ఫామ్స్ అనుమతిస్తుండగా.. కేంద్రం మాత్రం ఇది కుదరని కరాకండిగా చెప్తోంది. ఇంతలో క్యాబినేట్ భేటీ సంబంధిత క్లిప్ మార్ఫింగ్ అయ్యి మరి సర్క్యులేట్ అవుతుండడంపై కేంద్రం గరం అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఫటాఫట్ చర్యలు ప్రత్యేకించి కొన్ని అకౌంట్లు, పేజీలు, ఛానెల్స్ నుంచే అశ్లీల కంటెంట్, వర్గాల మధ్య చిచ్చు పెట్టే తరహా కంటెంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ మేరకు ఆయా ప్లాట్‌ఫామ్స్ నుంచి సరైన స్పందన లేకపోతుండడంతో స్వయంగా సమాచార మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. త్వరగతిన రంగంలోకి దిగిన కేంద్రం.. 73 ట్విటర్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. నాలుగు యూట్యూబ్ ఛానెళ్లను తొలగించింది. ఇన్స్టాగ్రామ్ గేమ్‌ను తొలగించిందని తెలుస్తోంది. కేవలం తొలగించడమే కాదు.. ఇలాంటి చేష్టలకు పాల్పడే బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చెబుతోంది కేంద్రం. ఆడవాళ్ల కోసం.. మరోవైపు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇతరత్ర కంటెంట్‌ను వ్యాప్తిచెందిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఈ మేరకు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ మేనేజ్మెంట్లకు అలాంటి అకౌంట్ల విషయంలో జాప్యం చేయకుండా(విచారణ, దర్యాప్తు పేరుతో కాలయాపన చేయకుండా) త్వరగతిన యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ప్రత్యేకించి ప్రముఖుల మార్ఫింగ్, అభ్యంతరకర, నకిలీ కంటెంట్ విషయంలో త్వరగతిన స్పందించాలని కోరింది. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నిరంతర పర్యవేక్షణ ద్వారా చర్యలకు ఉపక్రమించాలని తెలిపింది. టెక్నాలజీ(ఫేక్, మార్ఫింగ్) కట్టడికి టెక్నాలజీనే విరుగుడుగా ఉపయోగించాలని సూచిస్తోంది. వీపీఎన్ల నిషేధం! ట్విటర్, టెలిగ్రామ్ లాంటి అకౌంట్లతో పాటు వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్)లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా ఇంటర్నెట్లో విచ్చలవిడిగా అశ్లీల, అభ్యంతరకర, నిషేధిత కంటెంట్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీపీఎన్ అకౌంట్ల నిషేధంపై కేంద్రం నజర్ పెట్టింది. ప్రత్యేక టూల్స్ ద్వారా అకౌంట్లపై నిఘా కొనసాగించాలంటూ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఒత్తిడి తెస్తోంది. దేశంలో వీపీఎన్ సేవలు, డార్క్ వెబ్ వాడకాన్ని పరిశీలించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ట్రాకింగ్, నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. ఇది వరకే హోం మంత్రిత్వ శాఖను కోరిన విషయం తెలిసిందే. మరోవైపు అశ్లీల సైట్ల డొమైన్ల(ఎప్పటికప్పుడు మారుస్తూ ఇంటర్నెట్లో దర్శనమివ్వడం!) విషయంలోనూ కఠిన నియంత్రణ ద్వారా కట్టడి చేయాలని అనుకుంటోంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ వేసవి లోపే అశ్లీల, మార్ఫింగ్ వీడియోల కట్టడిపై కేంద్రం పట్టు సాధించే అవకాశం ఉంది. చదవండి: 20 ఏళ్లుగా పరారీలో డాన్.. ఎలా దొరికాడో తెలిస్తే సంబరపడతారు -
‘హాయ్ బేబీ’ అంటూ వలపు వల.. టెంప్ట్ అయ్యారా కొంప కొల్లేరే..!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యూజర్ల సంఖ్య పెరగడంతో సైబర్ కేటుగాళ్ల దీన్నే అదునుగా మార్చుకుని నెట్టింట ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బు వస్తాయంటూ ఆశ చూపి మోసం చేస్తుండగా, మరికొందరు ఆన్లైన్లో పరిచయం పెంచుకుని కాస్త సన్నిహిత్యంగా మెలిగిన తర్వాత మన ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. బాధితుడికి ఫేస్బుక్ అకౌంట్‌కి ఓ యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించగానే కాస్త క్లోజ్‌గా మెలుగుతూ అతని వాట్సాప్ నెంబర్‌ను పంపాలని కోరడంతో బాధితుడు పంపాడు. కొన్ని రోజుల తర్వాత సదరు వ్యక్తి నుంచి అభ్యంతరకర కంటెంట్‌తో ఉన్న వీడియో అతనికి వచ్చింది. ఏంటని చూడగా.. అందులో అడల్ట్ కంటెంట్ వీడియోని మార్ఫ్డ్ చేసి బాధితుడి ముఖాన్ని పెట్టారు. దీనీ చూసిన అతను షాక్‌కి గురయ్యాడు. ఆ వీడియో పంపిన తర్వాత నిందితుడు డబ్బుల కోసం బెదిరింపులు మొదలుపెట్టాడు. భయంతో బాధితుడు రూ.1,96,000 వరకు సమర్పించుకున్నాడు. ఇంకా పంపాలని బెదించగా బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు రట్టు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉపయోగించిన నెంబర్లు అస్సాంకు చెందినవిగా, వాటిని రాజస్ధాన్‌లోని భరత్పూర్ జిల్లా నుంచి వాడినట్టు గుర్తించారు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా వేదికల్లో యువతుల పేరుతో పరిచయం పెంచుకుని బాధితుల వద్ద డబ్బుల గుంజుకోవడమే పనిగా పెట్టుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. చదవండి: ఘోరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై.. కజిన్ అత్యాచారం -
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
పోర్న్ వీడియో: అందులో ఉన్నది తాను కాదంటూ ఏడ్చిన నటి
ప్రస్తుతం ఇంటర్నెట్లో తన పేరుతో వైరలవుతోన్న పోర్న్ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు మలయాళ నటి రమ్యా సురేష్. ఈ క్రమంలో ఫేస్బుక్ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. కన్నీరు పెట్టారు రమ్యా సురేష్. ‘‘ఇంటర్నెట్లో వైరలవుతన్న పోర్న్ వీడియోలో ఉంది నేను కాదు. అసలు ఈ వీడియో గురించి నాకు తెలియదు. ఓ స్నేహితురాలు చెప్పడంతో ఆ వీడియోను నేను చూశాను. అది చూసి కుప్పకూలిపోయాను. ఎందుకంటే వీడియోలో ఉన్న యువతికి, నాకు చాలా పోలికలున్నాయి. సడెన్‌గా చూసినవారేవరైనా ఆ వీడియోలో ఉంది నేనే అనుకుంటారు. నా గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అందులో ఉన్నది నేను కాదని గుర్తించగలరు.. మిగతావారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో గురించి అప్పుజలోని పోలీస్ స్టేషన్లో, సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు రమ్యా సురేశ్ తెలిపారు. ‘‘వీడియోలో ఉన్నది నేను కాదని నాకు తెలిసు. నా భర్త కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అది చాలు. అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను. పోలీసులు కూడా నాకు చాలా మద్దతుగా ఉన్నారు. ఈ వీడియోని షేర్ చేసిన వారిని గుర్తించామన్నారు పోలీసులు’’ అని తెలిపారు రమ్యా సురేష్. ‘‘పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఇంటికి వచ్చే సరికి నా ఫేస్బుక్ పేజ్‌కి చాలా మెసేజ్‌లు వచ్చాయి. నా స్నేహితులు కాల్ చేస్తున్నారు. మాట్లాడలంటే చాలా భయం వేస్తుంది. ఏం అంటారో అనిపిస్తుంది. నేను ఎక్కడా రాజీపడలేదు కాబట్టే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని నాకు తెలుసు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే.. వీడియోలో ఉన్నది నేను కాదు. నా మాట నమ్మండి.. నా గురించి తప్పుగా అనుకోకండి’’ అని కోరారు రమ్యా సురేష్. కుటుంబ సభ్యుల మద్దతు తనకు పూర్తిగా ఉందని త్వరలోనే ఈ సమస్య నుంచి బయటపడతానని రమ్యా సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె చివరిసారిగా నయనతార, కుంచాకో బోబన్ నిజాల్ చిత్రంలో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. చదవండి: ఫోన్లో మెసేజ్‌లను తొలగించిన నటి -
పరారీలో దేవినేని ఉమా..
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. చదవండి: మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’ -
అసభ్య టిక్‌టాక్ వీడియో విడుదల
టీ.నగర్: తెన్కాశి జిల్లా సురండై సమీపం కళాశాల విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి, టిక్‌టాక్‌లో విడుదల చేసిన యువకుని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తెన్కాశి జిల్లా సురండై సమీపంలోగల కూలిపత్తు అరుణాచలపురం గ్రామానికి చెందిన కన్నన్ (19). తొమ్మిది చదివి జులాయిగా తిరుగుతున్నాడు. ఇలాఉండగా, తాను తెన్కాశి సమీపం ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నట్టు తెలిపి అనేక మంది విద్యార్థినులతో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత వారిని ఏకాంత స్థలంలో వీడియోలు తీసి మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు సోమవారం కన్నన్ను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. చిన్నారుల అసభ్య వీడియోల విడుదల హోటల్ యజమాని అరెస్టు ఫేస్బుక్లో చిన్నారి బాలికల అసభ్య వీడియోలను పోస్ట్ చేసిన ఈరోడ్ హోటల్ యజమానిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈరోడ్ పాప్పాత్తికాడు ప్రాంతానికి చెందిన యోగేశ్వరన్ (35) అవివాహితుడు. ఇతను ఈరోడ్ మేట్టూరు రోడ్డులో హోటల్ నడుపుతున్నాడు. గత ఏడాది ఇతను తన ఫేస్బుక్ అకౌంట్లో బాలికల అసభ్య ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేశారు. దీని గురించి చెన్నిమలై పోలీసుస్టేషన్లో పోలీసుగా పనిచేస్తున్న ప్రకాశ్ వీరప్పన్ చత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి యోగేశ్వరన్ను మంగళవారం అరెస్టు చేసి, ఈరోడ్ సబ్ జైల్లో నిర్బంధించారు. ఇంటర్నెట్లో అసభ్య వీడియోలు.. ఇంజినీర్ అరెస్టు ధర్మపురిలో బాలికల అసభ్య ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తూ వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ధర్మపురి జిల్లా వెన్నాంపట్టి ప్రాంతానికి చెందిన చోళరాజన్ కుమారుడు శీను (26). హొసూర్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇతను బాలికల అసభ్య ఫొటోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసు ఏడీజీపీ రవికి ఫిర్యాదు అందింది. అతని ఉత్తర్వుల మేరకు పోలీసులు విచారణ జరిపి, శీనును అరెస్టు చేశారు. -
మహిళతో సీనియర్ ఎస్పీ శృంగార సంభాషణ!
నోయిడా: ఉత్తరప్రదేశ్ గౌతంబుద్ధనగర్ ఎస్సెస్పీ వైభవ్‌కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఆయన శృంగారపరమైన చాటింగ్ చేస్తున్న మూడు వీడియోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో ఆయన మాట్లాడిన మహిళ ఎవరో చూపించలేదు. కానీ మరో డివైస్‌తో ఆమె ఫోన్ స్క్రీన్‌ను రికార్డింగ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఈ వివాదంపై సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీసు అయిన వైభవ్ కృష్ణ స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా ఈ మార్ఫింగ్ వీడియోలును ఆన్లైన్లో స్ప్రెడ్చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది వ్యవస్థీకృత నేరాలపై, ఎక్స్టార్షన్ రాకెట్‌పై తను కఠినమైన చర్యలు తీసుకున్నానని, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ శక్తులే ఈ విధంగా కుట్రపన్ని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఈ వీడియోలపై ఆన్లైన్లో లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. మరోవైపు నోయిడా పోలీసులు ఈ వీడియో లీకేజ్ అంశంపై గుర్తు తెలియని వ్యక్తులపై అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శక దర్యాప్తు జరిపేందుకు మీరట్ జిల్లాకు కేసును బదిలీ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ స్పీడ్ గుట్టు రట్టు!
-
రైలు స్పీడ్‌ను పెంచిన గోయల్ గుట్టు రట్టు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇదో పక్షి, ఇదో విమానం....మేక్ ఇక్ ఇండియా కార్యక్రమం కింద నిర్మించిన సెమీ స్పీడ్ ట్రెయిన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాంతి వేగంతో దూసుకుపోతున్న దశ్యం’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆదివారం నాడు ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన ఈ వీడియోను తన అధికార ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లోనూ పోస్ట్ చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ‘భారత్‌లో తయారైన ప్రపంచ శ్రేణి రైలును చూడడం ఆనందంగా ఉంది. ఈ ఘనత ప్రత్యేకంగా భారతీయ రైల్వేకే దక్కుతుంది’ అనే సందేశంతో పియూష్ గోయల్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల ఆధారంగా బీజేపీ ఎంపీకి చెందిన ‘రిపబ్లిక్ టీవీ’ అమోఘం, అద్భుతం అంటూ ఏకంగా ఓ వార్తా కథనాన్ని నడిపింది. అయితే సామాజిక మీడియాల్లో చక్కర్లు కొట్టిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ వీడియోపై కాసేపటికే దుమారం చెలరేగింది. ‘పియూష్ గోయల్ గారు మీరు అప్లోడ్ చేసిన వీడియో ఒరిజనల్ కాదు, ఒరిజనల్ వీడియాలో ఉన్న రైలు స్పీడ్‌ను రెట్టింపు చేసి వీడియోను మీరు విడుదల చేశారు. ది రెయిల్ మెయిల్ యూటూబ్ ఛానల్లో ఒరిజనల్ వీడియో ఉంది చూసుకోండీ’ అంటూ ఓ ట్వీట్ వెలువడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే నకిలీ వార్తలను, మార్ఫింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు కనిపెట్టి బయటపెట్టే ‘ఆల్ట్ న్యూస్ డాట్ ఇన్’ పియూష్ గోయల్ విడుదల చేసిన వీడియో, ఒరిజనల్ వీడియో చూడండంటూ పక్క పక్కన రెండు వీడియోలను జతచేసి విడుదల చేసింది. అంతే...పియూష్ గోయల్‌పై సోషల్ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తాయి. ఓ పక్షి, ఓ విమానం ఏం కర్మ! ఎడ్ల బండి కూడా వేగంగా పరుగెత్తుతుందంటూ కొందరు, మోదీ ప్రభుత్వం హయాంలో పియూష్ గోయల్ వల్ల వేగంగా పరుగెత్తుతున్న ఎడ్లబండి అంటూ మార్పు చేసిన ఎడ్ల బండి వీడియోను మరొకరు పోస్టు చేశారు. కోడి, కాకి, బాతు రైలుపై వెళుతున్న చిత్రాన్ని, గాల్లో ఎగురుతున్న రైలు చిత్రాలను కొందరు పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు గోయల్ 2 ఎక్స్ వేగాన్ని పెంచిన వీడియోను చూపించారు. మున్ముందు 6 ఎక్స్ వీడియోను చూపించి చైనాను అధిగమించిన భారత బుల్లెట్ రైలు అని చూపిస్తారు’ అంటూ ఇంకొకరు వాఖ్యానం చేశారు. ‘ఈ రైలు మార్గంలో ఇక ఆదాయం పెరుగుతుంది’ అంటూ పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యను ఒకరు ప్రస్తావిస్తూ ‘ఎందుకు పెరగదు! టిక్కెట్ కలెక్షన్లను వీడియోతీసి 4ఎక్స్ స్పీడ్‌లో చూస్తే సరిపోతుంది’ అని ఒకరు వ్యాఖ్యానించారు. దూసుకుపోతున్న రైలు వీడియోను హర్యానాలోని అసావ్టీ రైల్వే స్టేషన్లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే వార్తలను పియూష్ గోయల్ పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. అనేక సార్లు చేశారు. ఆయన్ని ఎవరు మందలించినట్లు లేదు. -
మార్ఫింగ్ వీడియోతో బ్లాక్మెయిల్
బార్మర్: మార్ఫింగ్ చేసిన వీడియోతో మహిళను బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను లక్ష్మణ్‌రామ్, జంజారామ్ గా గుర్తించారు. బార్మర్ జిల్లాలోని ధోరిమన్నా ప్రాంతానికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు. అశ్లీల దృశ్యాలతో తమ చిత్రాలను మార్ఫింగ్ చేసి తనతో పలువురు మహిళలను బ్లాక్మెయిల్ చేశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన వీడియోలను ఇతరులకు కూడా నిందితులు పంపిణీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తునట్టు చెప్పారు.