(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు.
ఈ నెల 7న ప్రెస్ మీట్‌లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు.
చదవండి: మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’
Comments
Please login to add a commentAdd a comment