Devineni Umamaheshwar Rao
-
మద్యం కేసులో టీడీపీ నేత ‘ఉమా’ అనుచరుడు
రెడ్డిగూడెం: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అనుచరుడు అయ్యంకి బాలస్వామి అక్రమ మద్యం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించి, విక్రయిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న సమాచారం మేరకు ఓ టీడీపీ నాయకుడిని రెడ్డిగూడెం పోలీసులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. రెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు సోమవారం వివరాలు వెల్లడించారు. రెడ్డిగూడెం మండలంలోని బూరుగగూడెం గ్రామంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలించిన మద్యంను నిల్వ ఉంచారని అందిన సమాచారం మేరకు రెడ్డిగూడెం ఎస్ఐ డి.ఆనంద్‌కుమార్ తన సిబ్బందితో కలసి దాడి చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరుడు, బూరుగగూడెం గ్రామానికి చెందిన నిందితుడు అయ్యంకి బాలస్వామి తన ఇంటికి సమీపంలో నిల్వ చేసిన రూ.68,120 విలువ చేసే 524 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కాగా భారీగా తెలంగాణ మద్యాన్ని పట్టుకుంటున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
అనుభవం లేదు.. సమర్థతా లేదు
సాక్షి, అమరావతి: ఏ రంగంలో అయినా, ఏ సంస్థలో అయినా ఉన్నత స్థానానికి వెళ్లాలంటే దానికి సంబంధించి ఎంతోకొంత అనుభవం ఉండాలి. దాన్ని నిర్వహించే సమర్థత ఉండాలి. అలాంటివేమీ లేకుండా.. అప్పటివరకు దాంతో సంబంధంలేని చలసాని ఆంజనేయులు ఒక్కసారిగా విజయ డెయిరీ చైర్మన్‌గా అందలం ఎక్కేశారు. దీనికి టీడీపీకి చెందిన మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ వ్యూహమే కారణమని చెబుతున్నారు. దాసరి బాలవర్థనరావు చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు ఆంజనేయుల్ని రంగంలోకి దించారు. అప్పటివరకు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ఎలాంటి సంబంధంలేని ఆయన్ని 2017లో ఆయన సొంత గ్రామం బాపులపాడు మండలం కాకులపాడు పాల సొసైటీకి చైర్మన్‌గా చేశారు. వెంటనే విజయ డెయిరీ డైరెక్టర్‌గా రంగంలోకి దింపి పాలకవర్గంలోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బాలవర్థనరావును పక్కకునెట్టి మండవ జానకిరామయ్య స్థానంలో ఆంజనేయుల్ని చైర్మన్‌గా ఎన్నుకునేలా చేశారు. దీంతో వేలాది మంది పాడి రైతుల భవితవ్యంపై ఏమాత్రం అవగాహనలేని వ్యక్తికి పగ్గాలిచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుడు నిర్ణయాలు సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చివేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తనకు రాజకీయంగా లబ్ధి కలుగుతుందనే కారణంతో దేవినేని ఉమా ప్రతిష్టాత్మకమైన సంస్థకి చలసాని ఆంజనేయుల్ని చైర్మన్‌గా చేసేలా చక్రం తిప్పి రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని పలు సొసైటీల చైర్మన్లు ఆరోపిస్తున్నారు. ఎన్నో అవకతవకలు.. ఏ సంస్థలో అయినా ఉద్యోగులకు ఇచ్చే ఇంక్రిమెంట్లకు ఒక విధానం ఉంటుంది. కానీ, విజయ డెయిరీలో మాత్రం చైర్మన్ తనకు కావాల్సిన వాళ్లకి ఒకలా, మిగిలిన ఉద్యోగులకు మరోలా ఇవ్వడంపై సంస్థలో దుమారం రేగుతోంది. తాను చెప్పినట్లు నడుచుకునే వారికి 15–20 శాతం ఇంక్రిమెంట్ ఇస్తూ మిగిలిన వారికి తూతూమంత్రంగా ఇస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. అంతేకాక.. ► 25 ఏళ్లుగా డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తికి సంస్థలో జరిగే వివిధ పనుల కాంట్రాక్టుల్ని ఎలాంటి టెండర్లు లేకుండా చైర్మన్ కట్టబెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ► ఇలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు చిల్లింగ్ సెంటర్, కళ్యాణ మండపం మరమ్మతుల పనుల్ని అతనికి అప్పగించారు. ► తాను చైర్మన్ అయ్యాక తనకు అనుకూలమైన అధికారుల్ని నియమించుకునే విషయంలో నిబంధనలకు పాతరేశారు. ► ఉదా.. హెరిటేజ్ సంస్థ తొలగించిన ఇద్దరిని డీజీఎం స్థాయిలో లక్షల జీతాలకు నియమించడంపై పలు సొసైటీల చైర్మన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ► ఇలా స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా చైర్మన్ మాత్రం తాను డెయిరీని అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై పూర్తిస్థాయి విచారణ జరిగితే అక్రమాలు బట్టబయలవుతాయని పాడి రైతులు చెబుతున్నారు. ‘సాక్షి’ కథనంతో ఉలికిపాటు.. సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ‘సాక్షి’ మంగళవారం సంచికలో ప్రచురితమైన ‘‘పా‘పాల’ పుట్ట’’ కథనంతో చైర్మన్.. ఆయనకు మద్దతుదారులు ఉలిక్కిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని చైర్మన్ ఒక పత్రికా ప్రకటన తయారుచేసి జిల్లాలోని వివిధ పాల సొసైటీలకు పంపి మీడియా సమావేశాలు పెట్టించారు. ఇవేమీ తమకు తెలీదని కొందరు తప్పించుకున్నారు. సంస్థలోని పలువురు డైరెక్టర్లతో విజయవాడలో మీడియా సమావేశం పెట్టి తనకు అనుకూలంగా మాట్లాడించారు. ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాలకు వారు సమాధానం చెప్పకుండా చైర్మన్‌ను పొగడడానికి తాపత్రయపడ్డారు. భూముల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై వివరణ ఇవ్వకుండా గత పాలకవర్గం నుంచి భూములు కొంటున్నారంటూ కొత్త వాదన లేవనెత్తారు. అలాగే, విజయ పార్లర్లలో బయట ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ వ్యాపార సూత్రమని సమర్ధించుకున్నారు. రైతులకివ్వాల్సిన బోనస్ చెల్లించకపోవడం, కమీషన్ల కోసం జరిపిన కొనుగోళ్లు వంటి అంశాలపై డొంకతిరుగుడు వివరణలు ఇచ్చారు. మొత్తం మీద అవాస్తవాలు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేదల ఇళ్లకు కంకర రాకుండా టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అక్రమ మైనింగ్‌కు పాల్పడి దోచుకున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ఇప్పుడు మందిని వెంటేసుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నాడని మంత్రి, ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. వైఎస్సార్సీపీ నేత కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్లు ఎల్లోమీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2014–19 మధ్య జరిగిన మైనింగ్‌కు సంబంధించిన గూగుల్ చిత్రాలను మంత్రి విడుదల చేశారు. దాడి జరిగింది మాపైనే.. గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుకు బుద్ధిరాలేదు. మైనింగ్‌లో అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఉమా మీద ఎవరూ దాడి చేయలేదు. ఉమాయే 100 మందిని వెంటబెట్టుకుని వెళ్లి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేశారు. చివరికి తనపై దాడి జరిగిందని డ్రామా నడిపించారు. ఎల్లో మీడియాలో గగ్గోలు పెట్టారు. వాస్తవంగా వైఎస్సార్సీపీ నాయకుడు దుర్గాప్రసాద్ కారుపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. దళిత యువకుడు సురేష్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీడీపీ నేతలు జరిగిన దాన్ని మసిపూసి మారేడు కాయచేస్తూ మాట్లాడారు. కొండపల్లి ప్రాంతంలో 1978 నుంచి మైనింగ్ జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఎన్నడూ లేనంతగా అక్రమ మైనింగ్ జరిగింది. ఉమా మైలవరం ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సమయంలో 70 శాతం మేరకు మైనింగ్ జరిగినట్లు మ్యాప్‌ల్లో కనిపిస్తోంది. అధికారం పోగానే కొత్తరాగం అందుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణాలకు కంకర దొరకకూడదు, నిర్మాణాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. – వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే అరాచకం సృష్టించేందుకే వెళ్లిన ఉమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణానికి కంకర దొరక్కుండా ఆగిపోవాలని తెలుగుదేశం పార్టీ కుట్రచేస్తోంది. ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మైనింగ్ పేరుతో చేస్తున్న హైడ్రామా అసలు ఉద్దేశం ఇదే. గడ్డమణుగు గ్రామంలో మంగళవారం దళితులు, ప్రజలను దుర్భాషలాడిన దేవినేని తనపైనే దాడిచేశారని బొంకడం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్సీపీ నాయకుడి కారును దేవినేని అనుచరులు ధ్వంసం చేస్తే.. ఆయన కారే ధ్వంసమైనట్టు ఎల్లో మీడియా సాయంతో దుష్ప్రచారం చేస్తున్నాడు. అరాచకం సృష్టించేందుకే మైనింగ్ ప్రాంతం సందర్శన పేరుతో వెళ్లిన ఉమా అక్కడ మా పార్టీ కార్యకర్తలపై దాడిచేయడమే కాకుండా దళితులు, పోలీసులను దుర్భాషలాడాడు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 1978 నుంచే మైనింగ్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దేవినేని ఉమా ఎమ్మెల్యే, మంత్రి అయ్యాకే 70 శాతం మైనింగ్ జరిగినట్లు గూగుల్ పటాల ద్వారా తెలుస్తోంది. అక్కడి కాంట్రాక్టర్లను, క్రషర్స్ యజమానులను బెదిరించి, కమీషన్ల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. ఇవ్వకపోతే అది ఫారెస్ట్ ల్యాండ్ అంటూ రాయించి 2018లో పనులు ఆపించాడు. డబ్బులు దండుకున్నాక రెవెన్యూ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తితో అది రెవెన్యూ భూమేనని, మైనింగ్ చేసుకోవచ్చని స్టే ఇప్పించాడు. ఓడిపోయిన తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైనింగ్ చేస్తున్నాడంటూ బురద చల్లుతున్నాడు. వాస్తవాలేంటో తేల్చమని పోలీసులను కోరుతున్నాం. రైతు కష్టం తెలిసిన వ్యక్తి జగన్ రైతులకు పౌరసరఫరాలశాఖ రూ.3,300 కోట్లు బకాయి పడిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. సీఎం జగన్ తాను చెప్పినట్టే రూ.1,600 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. కేంద్రం నుంచి రూ.2,800 కోట్లు వచ్చాయి. పూర్తిగా కట్టాల్సిన డబ్బుల్లో రూ.3,200 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. మిగిలినవి త్వరలోనే విడుదల చేస్తాం. రైతన్న కష్టం తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్. టీడీపీని బీజేపీలో విలీనం చేసేందుకు చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడు. ఇంకో ఏడాదిలో ఇది జరుగుతుంది. చంద్రబాబు సింగపూర్‌కో, మలేసియాకో వెళ్తాడు. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగస్వామ్యం కావద్దని ఆ పార్టీ కార్యకర్తలను కోరుతున్నాం. – కొడాలి నాని, మంత్రి రాత్రిపూట పరిశీలనకు వెళ్లారా? రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఛీకొట్టి ఓడించినా బుద్ధి మారలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేతితో ఓటమిని జీర్ణించుకోలేక దేవినేని ఉమా కుట్ర చేస్తున్నారు. మైనింగ్ అక్రమాలు జరిగితే ఉమా అధికారుల దృష్టికి తీసుకురాకుండా అనుచరులతో కలిసి రాత్రిపూట పరిశీలనకు ఎందుకు వెళ్లారు? అక్రమాలు జరిగితే రాత్రులు పరిశీలనకు వెళ్లటంపై ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలపై ఉమా దాడిచేశారు. ఏదో రకంగా స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై బురదజల్లే ప్రయత్నం చేయటం హేయం. చిల్లరతత్వంగా వ్యవహరిస్తున్న దేవినేని ఉమా ఇకనైనా ఇలాంటి డ్రామాలు ఆపాలి. పదేపదే అసత్యాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేయటం అలవాటైన ఆయనకు నిజాలు రుచించవు. మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు వాస్తవాలు వెల్లడించినా ఉమా డ్రామాలాడటం విడ్డూరంగా ఉంది. – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే అన్నీ దోచుకుతిన్నది ఉమానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు సొల్లు మాటలు మాట్లాడటం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు కూడా మిగలవు. డ్రామా ఆర్టిస్టు దేవినేని సొల్లు ఉమా నిన్నటి నుంచి కొత్త డ్రామాకు తెరతీశాడు. చంద్రబాబు అండ్ కో ఇలాగే ప్రవర్తిస్తుంటే గ్రామాల నుంచే కాదు.. రాష్ట్రం నుంచే తరిమితరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో గనులు, ఇసుక, మట్టి దగ్గర నుంచి ఆఖరికి బూడిద వరకు మొత్తం దోచుకుతిన్నది దేవినేని ఉమానే. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి దోచుకున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గ్రావెల్ తవ్వించింది, అమ్ముకున్నది కూడా దేవినేని, టీడీపీ నేతలే. ఇసుక దోచుకున్నది వారే. అధికారంలో ఉన్న ఐదేళ్లు దోచుకుని, దాచుకుని, మళ్లీ మా ప్రభుత్వంపై నిందలు వేస్తారా? మాది స్వచ్ఛమైన పారదర్శక ప్రభుత్వం. సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ వారు తప్పుచేసినా వదిలిపెట్టారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి దేవినేని ఉమా, ఆయన అనుచరులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను తిడితే ఊరుకుంటారా?ఉమాపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి, శిక్ష విధించాలి. అసలు అక్రమ క్వారీయింగ్ జరగటంలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్ల స్థలాల మెరక కోసం తెచ్చుకుంటున్నామని చెప్పి ప్రజలు అడ్డగిస్తే నెపం వైఎస్సార్సీపీపై వేస్తారా? కారు అద్దాలు పగలగొట్టుకుని, కారులో కూర్చొని, తనపై దాడి జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. – జోగి రమేశ్, ఎమ్మెల్యే -
సీఎం వీడియో మార్ఫింగ్ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేసి ప్రదర్శించిన ట్యాబ్ విషయంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దాటవేత ధోరణినే కొనసాగిస్తున్నారు. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విచారణ సందర్భంగా తన ట్యాబ్ పోయిందని ఉమా బదులిచ్చినట్టు తెలిసింది. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ కేసులో ఉమాను ఇప్పటికే రెండు పర్యాయాలు సీఐడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా మూడోసారి 9 గంటలపాటు జరిగిన విచారణలోనూ ఉమా పాతపాటే పాడినట్టు విశ్వసనీయ సమాచారం. గంటల తరబడి సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ట్యాబ్ పోయిందని ఉమా చెప్పడంతో మీరు నిజం చెబితే సరే.. ట్యాబ్‌పోతే ఎలా కనిపెట్టాలో తమకు తెలుసని సీఐడీ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్యాబ్‌ను గుర్తిస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలిసింది. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఎవరి నిర్వహణలో ఉందని, సోషల్ మీడియాలో పెట్టే పోస్టింగ్‌లకు ఆదేశాలు ఎవరు ఇస్తారని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ పోస్టింగ్‌లను సోషల్ మీడియాలో ఎలా అనుమతిస్తారని, వాటిని ఎవరు రూపొందిస్తారని ఆరా తీసినట్టు తెలిసింది. సోషల్ మీడియా నిర్వహణ, పోస్టింగ్‌లపై ఏమైనా మార్గదర్శకాలున్నాయా? నియమ నిబంధనలు పాటిస్తారా? అంటూ ప్రశ్నించినట్టు తెలిసింది. అనేక ప్రశ్నలకు ఉమా దాటవేత ధోరణే అవలంభించడంతో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో దర్యాప్తును కొనసాగించాలని సీఐడీ నిర్ణయించినట్టు సమాచారం. విచారణ అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న హైకోర్టులో జరిగే విచారణలో అన్ని విషయాలను నివేదిస్తానని చెప్పారు. -
దేవినేని ఉమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ...!
-
దేవినేని ఉమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ...!
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమాకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 29న సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దేవినేని ఉమాకు పలుమార్లు సీఐడీ నోటీసులు పంపించింది. అయితే, దేవినేని ఉమా సీఐడీ విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈనెల 7న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. కాగా నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై కేసు నమోదు నమోదు చేశారు. ఈ నెల 7న ప్రెస్ మీట్లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. చదవండి: పరారీలో దేవినేని ఉమా.. -
పరారీలో దేవినేని ఉమా..
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం సీఐడీ బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశారు. ఇక ఉమా ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్లో సీఎం జగన్ మాట్లాడినట్టు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమాపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఐడీ నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 10న ఉమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. 464, 465, 468, 469, 470, 471, 505, 120 బీ సెక్షన్ల కింద దేవినేని ఉమాపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15, 19న విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. చదవండి: మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’ -
బ్రేకింగ్: బాబు, ఉమపై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు
గొల్లపూడి: తెలుగు వాడి చరిత్ర దేశంలో లిఖించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు. గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు. -
చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు..
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు' అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: దురుద్దేశంతోనే నకిలీ పీడీఎఫ్: వైవీ సుబ్బారెడ్డి 'లచ్చల్ లచ్చల్ ఇళ్లు తామే నిర్మించేశాం - పంపిణీ మర్చిపోయాం అంటున్నాడు చంద్రబాబు. నీవు ఇళ్లు నిర్మిస్తే పచ్చ బ్యాచ్ కు పంచకుండా ఉంటావా బాబూ? లేని నగరాన్నే గ్రాఫిక్స్‌లో సృష్టించి వాటాలు పంచినోడివి. బొంకరా బొంకరా బాబు అంటే కరోనా వ్యాక్సిన్ తానే తయారు చేశానన్నాడంట' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మరో ట్వీట్లో దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. 'వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సీఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి' అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు.. -
నోరు అదుపులో పెట్టుకోకుంటే ఉమా భరతం పడతాం
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరకరమైన భాష వాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆయన భరతం పడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఉమా తన భాషను మార్చుకోకుంటే ఆయన తోక కత్తిరిస్తానని, తానే ఆయన ఇంటికి వెళతానని అన్నారు. ‘స్వయం ప్రకటిత మేధావి యనమల, అచ్చోసిన ఆంబోతు అచ్చెన్నాయుడు, లోకజ్ఞానం లేని లోకేష్, బొంకే బుచ్చయ్య, పిచ్చికుక్క లాంటి పవన్ కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు’ అని రమేష్ ధ్వజమెత్తారు. ‘పోలవరం కట్టిందెవర్రా..’ అంటూ ఉమా నోరు పారేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ పీఎస్ శ్రీనివాస్‌తో సంబంధం లేదన్నారే! చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై ఆదాయ పన్ను శాఖ దాడులు చేస్తే అతనితో తమకేం సంబంధం లేదని, అతనేమీ టీడీపీ వాడు కాదన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు శ్రీనివాస్ వద్ద రూ.2 లక్షలే దొరికాయి, 12 తులాల బంగారమే దొరికిందని ఎందుకు మాట్లాడుతున్నారని రమేష్ ప్రశ్నించారు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు బయట పడ్డాయని, ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయని ఐటీ శాఖ మీడియాకు, ప్రజలకు తెలియజేసిన విషయం టీడీపీ నేతలు చూడలేదా? అని నిలదీశారు. ‘ఏబీసీడీలు రాని కొందరు, బుద్ధి లేని బుద్దా వెంకన్న లాంటివారు కూడా ట్వీట్లు పెడుతున్నారు’ అని మండిపడ్డారు. డబ్బులు చంద్రబాబు, లోకేష్, శ్రీనివాస్ ఇళ్లల్లో ఉంటాయా? వారు డబ్బులను దారి మళ్లించి అకౌంట్లలో వేసుకుంటారని రమేష్ అన్నారు. బీసీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసం చేసిందని అచ్చెన్నాయుడు అంటున్నారని.. సచివాలయ ఉద్యోగాల్లో 2.65 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే ఉన్నారని, మార్కెటింగ్, దేవాలయ పాలకమండళ్లలో 50 శాతం బడుగుబలహీనవర్గాలకే పదవులిచ్చినట్టు జోగి రమేష్ వివరించారు. -
పూల ఖర్చు వృథా అయినట్టేనా బాబూ..!
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. శాసనమండలిలో ఏదో సాధించారని పూల వర్షం కురిపించినవారంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారట అని ఎద్దేవా చేశారు. రాజధాని సంగతి దేవుడెరుగని.. ఇప్పుడు మండలికే ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారని అన్నారు. పూల ఖర్చు వృథా అయినట్టేనా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టుముట్టిందేమిటి విజనరీ? అని ఎద్దేవా చేశారు. ('పప్పు నాయుడి రాజకీయ జీవితం ముగిసినట్టే') కాగా మరో ట్వీట్లో.. మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్‌లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా? ('కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదు') -
ధ్వజమెత్తిన మంత్రి కొడాలి నాని
సాక్షి, విజయవాడ: చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తనకు పిల్లను ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, ఎన్టీఆర్ దగ్గర పదవిని, పార్టీని లాక్కున్న నీచుడు, నికృష్టుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవుడిని సైతం రాజకీయ కోణంలో చూసే వ్యక్తి చంద్రబాబు అని, మద్యం రేటు, తిరుపతి లడ్డు రేటుపైనా రాజకీయాలు చేసే దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారని దుయ్యబట్టారు. 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటo దారుణమన్నారు. మంత్రి కొడాలి నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి అలిపిరి కొండవద్ద తల కొట్టుకొని క్షమాపణ చెప్పే స్థితి చంద్రబాబు తెచ్చుకున్నారని, ఆంబోతుల్లాంటి పెయిడ్ ఆర్టిస్టుల విషయంలో చంద్రబాబుకు కొదవేమీలేదన్నారు. ఐదు వేలు, పది వేలు రూపాయలు ఇస్తే ప్రెస్మీట్లు పెట్టే సన్నాసులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిదించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పాతాళoలో పడేసినా చంద్రబాబుకు బుద్ధి రావడం లేదన్నారు. రాజకీయల్లోకి రావటానికి వదినను చంపిన వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు అని ఆరోపించారు. ‘బోండా ఉమా గతంలో అసెంబ్లీ సాక్షిగా నన్ను పాతేస్తా అన్నప్పుడు చంద్రబాబు ఏమాయ్యారు?’ అని ప్రశ్నించారు. అప్పుడు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శిస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. తిరుమలను కించపరిచినట్టు తనపై కేసులు పెట్టారన్న వార్తలు వస్తున్నాయని, తాను కేసులకు భయపడబోనని పేర్కొన్నారు. ‘నేను తిరుపతికి వెళ్ళినప్పుడల్లా శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటాను. చంద్రబాబు ఎన్నిసార్లు తలనీలాలు సమర్పించుకున్నారు? తిరుమలకు ఆయన ఎన్నిసార్లు నడిచి వెళ్ళారు’ అని ప్రశ్నించారు. తిరుమల విషయంలో తెలుగుదేశం, బీజేపీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, తిరుమలకు వెళ్లాలంటే బీజేపీ, టీడీపీ సభ్యత్వం ఉంటేనే, కమ్మ కులం క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటేనే వెళ్లాలన్న చందంగా ఆ పార్టీల నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేవుడు మీద నమ్మకంతోనే గుడికి వెళ్తారని తెలిపారు. తిరుమల వేంకటేశ్వరస్వామికి తండ్రీకొడుకులు పట్టువస్త్రాలు సమర్పించిన అరుదైన అదృష్టం వైఎస్ కుటుంబానికి దక్కిందని గుర్తు చేశారు. తాము వేసుకునే డ్రెస్సులపైనా టీడీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవినేని ఉమా గతంలో మంత్రిగా కన్నా చంద్రబాబు వద్ద సూట్‌కేసులు మోసే బ్రోకర్‌గా పని చేశారని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్ డబ్బులు చంద్రబాబుకు, పప్పునాయుడికి ఇచ్చే బ్రోకర్‌గా ఉమా వ్యవహరించారని దుయ్యబట్టారు. స్వర్ణకారుల ఆత్మహత్యలు కూడా ఇసుక కొరత వల్లే జరిగాయని నారా లోకేష్ అనడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. కొన్నిరోజులు ఆగితే కోడెల శివప్రసాదరావు కూడా ఇసుక కొరత వల్ల చనిపోయారనే విధంగా లోకేష్ తయ్యారయ్యారని, తెలుగుదేశం పార్టీని ఆయన రాజకీయ సమాధి చేస్తున్నారని విమర్శించారు. -
దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకో..
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై వైస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు పంట అని అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ ఉమ గతంలో బీరాలు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 2018 నాటికి పోలవరం ఎక్కడ పూర్తి చేశారో దేవినేని ఉమా చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేసిన అవినీతి నచ్చకనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రివర్స్ టెండరింగ్ చేపట్టారని గుర్తు చేశారు. దేవినేని ఉమా వెకిలి చేష్టలు చూసి కేసీఆర్ ఉమా ఆడో మగో తెలియదన్నారని, ఇప్పుడు అదే నిజమవుతోందని వ్యాఖ్యానించారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారని, జగన్మోహన్రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదన్నారు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్‌కు సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలపట్ల గౌరవంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదాంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇకనైనా దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉందని, తెలంగాణలో కనుమరుగైన ఆ పార్టీకి జాతీయ పార్టీ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమీషన్లు తీసుకున్నారో వెల్లడించేందుకు ఆ కమీషన్లు ఇచ్చినవారు త్వరలో మీడియా సమావేశం పెడుతున్నారని తెలిపారు. మైలవరం నియోజకవర్గం పనుల్లో నారా లోకేష్ 5 శాతం, ఉమా 3 శాతం చొప్పున కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైలు జీవితం తప్పదని హెచ్చరించారు. -
దేవినేని ఉమకు చేదు అనుభవం..
సాక్షి, విజయవాడ : వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన టీడీపీ నాయకుడు దేవినేని ఉమాహేశ్వరావుకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని గొల్లపూడి కరకట్ట వరదలతో ముంపుకు గురైన విషయం తెలిసిందే. దీంతో ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్లిన దేవినేని ఉమకు స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయనను అక్కడి స్థానికులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించారు. దీంతో దేవినేని అనుచరులు నిలదీసిన స్థానికులను, మహిళలపై బెదిరించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ నేతల వరద రాజకీయాలు.. మరోవైపు వరద ముంపును రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలపై వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్లుగా నిండని ప్రాజెక్టులు ఇప్పడు నీటితో నిండేసరికి కడుపు మండి టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకున్న వ్యక్తికి వరద వస్తుందని ముందుచూపు లేదా అంటూ ఎద్దేవా చేశారు. వరద తాకిడికి భయపడి చంద్రబాబు హైదరాబాదుకు పారిపోయారని, చిత్తశుద్ధి ఉంటే ఆయన తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లకు కోసం అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు... ప్రజలకు, కార్మికులకు కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 75 రోజులలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి 80శాతం హామీలను అమలు చేశారని అన్నారు. -
‘ఉమా నోరు అదుపులో ఉంచుకో’..
సాక్షి, కృష్ణా : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. ‘ఉమా నీ నోరు అదుపులో ఉంచుకోవడం మంచిది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ కెమెరాలతో వరద ఉధృతిని అంచనాలు వేస్తుంటే తమపై తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలంటూ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడే వరదలను మ్యాన్ మేడ్ వరదలుగా అభివర్ణించటం నీకే సాధ్యమైంది. అమరావతి రాజధాని మా ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఉంటుంది. లేనిపక్షంలో నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతావా?. గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను మూయించాల్సిన అవసరం మాకు లేదు’’ అని స్పష్టం చేశారు. -
‘ఆయన చిల్లర రాజకీయాలు మానుకోవాలి’
సాక్షి, తాడేపల్లి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ధ్వజమెత్తారు. దేవినేని రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయిందని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై దేవినేని ఉమ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘ఇసుక దందా చేస్తున్నారన్న ఆరోపణలను నిరూపించగలరా? ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే దేవినేని రాజకీయాలనుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్ విసిరారు. గతంలో ఇసుక మాఫియాపైనే దేవినేని బతికారన్నారు. కృష్ణా జిల్లాలో దేవినేని అండతో డీగ్యాంగ్ విచ్చలవిడిగా దోచుకుందని ఆరోపించారు. గతంలో మైలవరం నియోజకవర్గంలో జరిగిన దోపీడీపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా ఎక్కడా జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో 90 ఆవులు చనిపోయాయని, దానిని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో 28 గోవులు చనిపోయినప్పుడు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం గోశాల ఘటనపై విచారణ జరిపి.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. -
అసత్యారోపణలు మానకుంటే నాలుక కోస్తా...
-
‘ఆయన లాంటి దద్దమ్మను ఎక్కడా చూడలేదు’
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా లాంటి చేతకాని దద్దమ్మను తాను ఎక్కడా చూడలేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. అసత్యారోపణలు మానకుంటే మాజీ మంత్రి నాలుక కోస్తానంటూ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీకొడుకులిద్దరూ దివాళా తీయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా ఆ ఇద్దరిలో మార్పు రావటం లేదన్నారు. అర్ధం లేని ట్వీట్లతో లోకేష్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాలారిష్టాలని అధిగమించి ప్రజాసంక్షేమాన్ని చూస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు అభివృద్ధికి సహకరించకపోగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అవినీతి రహిత రాష్ట్రం కోసం వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తుంటే నీతిలేని బాబు అవాకులు చవాకులు పేలుతున్నారని కోప్పడ్డారు. నిబంధనలకు విరుద్దంగా నవయుగకి పనులు కేటాయించి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన ఆర్ధిక సమస్యలనుంచి రాష్టాన్ని గాడిలో పెట్టేపనిలో ప్రభుత్వం ఉందన్నారు. లోకేష్ ఓ మాలోకంలా తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. అవకాశం ఉన్నచోటల్లా టీడీపీ పెద్దలు దోచేశారని, ఆఖరికి పేదవాడి కోసం ఏర్పాటుచేసిన క్యాంటీన్ల పథకంలోనూ కాసులకక్కుర్తిని వదలలేదన్నారు. మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి ఆకలి తీర్చే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. -
అవినీతి వల్లే టెండర్లు రద్దు
విజయవాడ: టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు అవినీతిమయంగా జరిగినందువల్లే టెండర్లను రద్దు చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం కాంట్రాక్టుల్లో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు. డబ్బులు దండుకుని నవయుగకు కాంట్రాక్టు పనులు అప్పగించారన్నారు. టెండరుదార్లతో చంద్రబాబు స్వయంగా మాట్లాడి నవయుగకు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజాధనం వృథా కాకూడదనే నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాఫర్ డ్యామ్ కట్టి పోలవరాన్ని తాను కట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోలవరాన్ని సొంత హెరిటేజ్ సంస్థలా వాడుకున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూసి తట్టుకోలేక చంద్రబాబు, దేవినేని ఉమా ముఖ్యమంత్రి జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు, ఇతర నాయకులు ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఇక మీదట సహించేది లేదన్నారు. -
‘బాబు, ఉమకు ఉలుకెందుకు..’
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండర్లు పిలిస్తే చంద్రబాబు, దేవినేని ఉమకు ఉలుకెందుకని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు, పోలవరం కాంట్రాక్టర్లు ట్రాన్స్ట్రాయ్, నవయుగ సంస్థతో కుమ్మక్కై రేట్లు పెంచేసి వాటాలు పంచుకున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమను చెంచాగా పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రాజెక్టులో అడ్డంగా దోచుకున్నారన్నారు. దోపిడీని అరికట్టేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తుంటే దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. సొంత వదిన చావుకు కారణమైన దేవినేని ఉమ సీఎం జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిని వెలికి తీసి బాబు దోపిడీని బయటపెడతామన్నారు. -
సీఎం ఇంటి పక్కనే కృష్ణా నదిని పూడ్చి.. కబ్జా!
సాక్షి, అమరావతి : కృష్ణా నదిని పూడ్చి కబ్జా చేసిన ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరిశీలించారు. కృష్ణా నది గర్భంలో ఐల్యాండ్ నిర్మాణం కోసం.. ఇప్పటికే చాలాభాగం పూడ్చివేశారు. నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఇసుక బస్తాలతో కరకట్ట కూడా వేశారు. దీనిపై వారం క్రితం సాక్షిటీవీలో వరుస కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించారు. ఇసుక బస్తాలను తొలగించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, మర్రి రాజశేఖర్, నందిగం సురేష్, మేరుగ నాగార్జున తదితరులు కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రాజధాని పేరుతో ప్రభుత్వ భూములను, కొండలను, గుట్టలను కొట్టేశారని, ఇప్పుడు కృష్ణా నదిని కూడా వదలడం లేదని మండిపడ్డారు. కృష్ణానదిని పూడ్చివేసి కబ్జా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇళ్ల పక్కనే కృష్ణానదిని పూడ్చివేసి కబ్జా చేస్తుంటే.. వారికి ఇది తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఈ కబ్జా వ్యవహారం వెనుక చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్, దేవినేని ఉమ తదితరుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం కృష్ణానది పూడ్చి వేసిన ప్రాంతం ప్రభుత్వ భూమి అయినప్పటికీ.. ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం ఆ భూమి చుక్కపల్లి ప్రసాద్‌కు చెందిందని చెబుతున్నారని, కృష్ణా నది పూడ్చివేసి ఆక్రమించడానికి ప్రయత్నించిన చుక్కపల్లి ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దేవినేని ఉమ, చంద్రబాబుపై కేసు నమోదు చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కృష్ణానది పూడ్చివేత, కబ్జాపై విచారణ చేపడతామని తెలిపారు. కృష్ణానది మధ్యలో కట్టడాలు చేపడుతుంటే సీఆర్డీఏ అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. -
ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటే!
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీలో గెలుపుపై ధీమా సన్నగిల్లుతోంది. మంత్రి దేవినేని ఉమ హ్యాట్రిక్ ఆశలపై ప్రజావ్యతిరేకత నీళ్లుకుమ్మరిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మంత్రిగారి అవినీతి.. అనుయాయుల దందాలు ఈ ఎన్నికల్లో తమ కొంపముంచుతున్నాయనే అంచనాలతో టీడీపీ డీలాపడింది. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న ప్రధాన నియోజకవర్గాల్లో కృష్ణాజిల్లా మైలవరం ఒకటి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు మంత్రి దేవినేని ఉమ, మరోవైపు మాజీమంత్రి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ తలపడ్డారు. గెలుపుపై ఇరువర్గాలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో.. మైలవరంలో విజేత ఎవరూ అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో 2 లక్షల 59 వేల 500 మంది ఓటర్లుండగా.. వీరిలో స్త్రీలు 1,30,812, పురుషులు 1,28,673. టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన దేవినేని ఆశలు ఆవిరేనని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రజలకు బాగా దగ్గరైన వసంత కృష్ణప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతోనే దేవినేనికి గట్టిపోటీ ఎదురయ్యిందని, ఈసారి దేవినేని ఉమ గెలుపు డౌటేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గట్టి ప్రత్యర్థిని ఎన్నికల్లో ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో మంత్రి దేవినేని ఉమ చివరికి అధికార దుర్వినియోగానికి ప్రయత్నించడం కూడా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం అయ్యింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌పై తప్పుడు కేసులు పెట్టించేందుకు మంత్రి దేవినేని చేసిన ప్రయత్నం అభాసుపాలై.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలతను మరింత పెంచింది. మైలవరం నియోజకవర్గంలో మంచినీటి సమస్యను, మామిడి రైతుల కష్టాలను, సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా మంత్రిదేవినేని ఉమ అయిదేళ్లపాటు నడిపిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇదే క్రమంలో అక్రమ మైనింగ్ ద్వారా ఆయన అనుయాయులకు కోట్ల రూపాయలను దండుకునే అవకాశం కల్పించడం, ఇసుక, మట్టి తవ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం, చివరికి అనుమతిలేని బోట్లతో అమాయకుల ప్రాణాలు పోయేందుకు కారణమవ్వడం వంటి అంశాలు అనేకం తెలుగుదేశం పార్టీకి ప్రతికూలంగా మారాయి. జన్మభూమి కమిటీల కారణంగా అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కకపోవడం, పైరవీ కారులు, అనర్హులకే పెన్షన్ల నుంచి పక్కాగృహాల వరకు కట్టబెట్టడం మొదలైన అంశాలు మంత్రి దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పని స్థితిని తెచ్చిపెట్టాయని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందనే ప్రచారం జరుగుతోంది. ధన ప్రభావం అధికంగా కనిపించిన నియోజకవర్గాల్లో మైలవరంకూడా నిలుస్తోంది. మంత్రి దేవినేని ఉమ అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శలు చేశాయి. దాంతో మైలవరం ప్రజలు...అధికార టిడిపిపై తీవ్ర అసంతృప్తితో రగిలి పోయారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోపై అభిమానం పెంచుకున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో అధిక శాతం అంశాలు తమకు ప్రతికూలంగా కనిపిస్తుండటంతో తెలుగుదేశం నేతలు నిరుత్సాహంలో పడ్డారు. -
దేవినేని ఉమా ఒక దద్దమ్మ
పట్నంబజారు(గుంటూరు): రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు ఇటు కాని దద్దమ్మ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. ఖూనీకోరులని ముద్ర వేయించుకున్న వ్యక్తులు, ఇసుక స్మగ్లర్లు, కీసర బ్రిడ్జిని ఇనుము ముక్కలా అమ్ముకున్న దుర్మార్గులు, వదిన చావుకు కారణమైన వ్యక్తులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిలపై వ్యాఖ్యలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఉమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పట్టాభిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ కొద్ది రోజుల వ్యవధిలో అయిన వారికి దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరో వైపు ఇసుక దోపిడీలు చేసే మంత్రి దేవినేని ఉమా, క్రైస్తవ ఆస్తులను దోచుకునే మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటని మండిపడ్డారు. అవినీతికి కేంద్ర బిందువులైన మంత్రుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఉమా ఉన్నారని, ఆలీబాబా నలభై దొంగల్లో ప్రథముడు ఆయనేనని చెప్పారు. 2018 నాటికల్లా పోలవరం పూర్తి చేస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన దేవినేని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకుంటే తగిన బుధ్ధి చెబుతామని హెచ్చరించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విచిత్ర పరిస్ధితులు దాపురించాయని, వేసవి సెలవులకు వెళితే.. పారిపోయారని వైఎస్ జగన్‌పై వ్యాఖ్యలు చేయటం, వక్రభాష్యాలు పలకటం సిగ్గుచేటన్నారు. ఓడిపోతామన్న భయంతో అధికారులు, వైఎస్సార్సీపీపై లేనిపోని అభాండాలు మోపుతున్న చంద్రబాబు సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ నైతిక విలువలు ఏ మాత్రం లేకుండా టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. -
మంత్రిగారి మాయ.. కమీషన్ల యావ
టెండర్ నోటిఫికేషన్ జారీ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి దేవినేని ఉమా.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆస్థాన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు.. ఆ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. సింగిల్ బిడ్ దాఖలైతే.. జీవో 94 ప్రకారం టెండర్‌ను రద్దుచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తోపాటు మరో కాంట్రాక్టర్‌తో ఐదు శాతంలోపు అంటే.. 4.89 శాతానికి ఒకరు.. 4.99 శాతానికి మరొకరితో షెడ్యూలు దాఖలు చేయించేలా ఒప్పందం చేసుకున్నారు. 4.89 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి.. తద్వారా రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి మంత్రి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, అమరావతి: నీటి లభ్యతపై హైడ్రాలజీ విభాగం క్లియరెన్స్ ఇవ్వలేదు.. అయినా 50 వేల ఎకరాలకు నీళ్లందించే ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రూ.325 కోట్లతో పూర్తయ్యే పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)ను రూ.495 కోట్లుగా నిర్ణయించి ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. అనంతరం రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి ప్రణాళిక రచించారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోటా కింద సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేసిన కోటపాడు– చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకం ఈ దందాకు కేంద్రంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గోదావరి నది నుంచి 15.50 టీఎంసీల నీటిని పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 2008లో రూ.1,700.57 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచి.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.8 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరికరించే పనులకు సెప్టెంబరు 3, 2016న రూ.4,909 కోట్లతో అనుమతిచ్చారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల కింద 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వకుండా దానిని పక్కన పెట్టి.. ఆ నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను గోదావరి–పెన్నా నదుల అనుంధానం తొలి దశ పేరుతో రూ.6,020 కోట్లతో ఇటీవల పనులు చేపట్టారు. తాజాగా చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువపై కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో 89.90 కి.మీ వద్ద 50 క్యూసెక్కులను ఎత్తిపోసేలా కోటపాడు, 98.20 కి.మీ వద్ద 100 క్యూసెక్కులు ఎత్తిపోసేలా చనుబండ, 100.50 కి.మీ వద్ద మూడు దశల్లో 800 క్యూసెక్కులు ఎత్తిపోసేలా విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, చాట్రాయి, నూజివీడు మండలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లందించడానికి రూ.698.90 కోట్లతో పథకాన్ని చేపట్టడానికి సర్కార్ అనుమతిచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుంటే.. ఇదే జిల్లా మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమాపై ఆ వ్యతిరేకత తారస్థాయికి చేరింది. నీళ్లు ఇస్తున్నట్లు మాయచేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు భారీఎత్తున కమీషన్లు కొట్టేయడానికే ఎన్నికలకు ముందు తన కోటా కింద దేవినేని ఉమా ఈ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించుకున్నట్లు ఆ శాఖ అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు.. ఈ ఎత్తిపోతలకు హైడ్రాలజీ విభాగం అనుమతివ్వలేదు. ఇదేమీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతలపై ముందుకెళ్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. రూ.170 కోట్లు పెంచేశారు.. ఇదిలా ఉంటే.. కోటపాడు–చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతలపూడి ప్రధాన కాలువపై 89.90 కి.మీ వద్ద కోటపాడు సమీపంలో 1.42 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు రూ.45 కోట్లు.. అలాగే, 98.20 కి.మీ వద్ద చనుబండ సమీపంలో 2.832 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పనులకు రూ.90 కోట్లు.. 100.50 కి.మీ వద్ద విస్సన్నపేట–1 ఎత్తిపోతలలో భాగంగా 9.911 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు, విస్సన్నపేట–2 ఎత్తిపోతల కింద 8.495 క్యూమెక్కుల నీటిని, విస్సన్నపేట–3లో 4.247 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు రూ.190 కోట్లకు మించి వ్యయంకాదని అధికారులు తేల్చారు. అంటే.. ఈ మొత్తం ఎత్తిపోతల పనులను రూ.325 కోట్లతో పూర్తిచేయవచ్చు. కానీ, రూ.495 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీచేయడం గమనార్హం. -
మంత్రి ఉమా స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారు!
సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు తాయిలాలతో ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మరో మేనిఫెస్టో కమిటీ అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. కంత్రి మంత్రి దేవినేని ఉమా తనస్థాయి మరచి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, దాసరి జైరమేశ్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని పేర్కొన్నారు. టీడీపీలో రాముడి సంతతి పోయి రావణ సంతతి వచ్చిందని, టీడీపీలో అందరూ రావణులే మిగిలారని కృష్ణప్రసాద్ మండిపడ్డారు. మంత్రి ఉమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏం చేయలేదని, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఏదో చేసినట్టు ఆయన హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ళు మంత్రిగా ఉండి పేదలకు పట్టాలు ఇవ్వకుండా.. ఉమా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని, ఆయన ఓటమి తప్పదని పేర్కొన్నారు. మంత్రి ఉమాకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల్లో బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.