ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. మంత్రి దేవినేని, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని గురువారం యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న అట్లూరి ప్రవిజ, ఆమె భర్త జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న భూమికి సంబంధించి దేవినేని కుటుంబానికి, ప్రవిజ దంపతులకు గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో బాధితులు విజయవాడలో పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.