మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే: దేవినేని
విజయవాడ: ఏపీసిసి చీఫ్ రఘువీరారెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును బ్రోకర్ అని రఘువీరా చేసిన వ్యాఖ్యలను దేవినేని తప్పుపట్టారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు మరో పదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందేనని దేవినేని అన్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో అవకతవకలు ఉన్నాయని మీకు తెలుసు.. వాటిపై సీబీఐ విచారణకు సిద్దమేనా అంటూ రఘువీరాకు దేవినేని ఉమా సవాల్ విసిరారు.