'ఫ్యాక్షన్ నడిపిన రెండు గ్రూపులు టీడీపీలోనే'
అనంతపురం : టీడీపీ నేతలు జేబుదొంగల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ధనవంతులకే టీడీపీ నేతలు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. 1994-2004 వరకూ కాంగ్రెస్ కార్యకర్తలను ఊచకోత కోసిన ఘటన చంద్రబాబుదేనని మండిపడ్డారు.
జిల్లాలో ఫ్యాక్షన్ నడిపిన రెండు గ్రూప్లు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాయని రఘువీరా అన్నారు. టీడీపీ వెబ్సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలను మాఫీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్ రుణమాఫీకి జత చేస్తున్నా టీడీపీ నేతలు దద్దమ్మల్లా ఉంటున్నారని రఘువీరా ధ్వజమెత్తారు.