faction
-
పోలీసులు వచ్చే లోపే తిరగబడి కొట్టండి
సాక్షి, అమరావతి: ‘మృగాల కంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. పోలీసులు వచ్చే లోపే ప్రజలు తిరుగుబాటు చేసి వారిని కొట్టాలి’ అంటూ సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చెప్పారు. సభలో ప్రవేశ పెట్టిన వివిధ బిల్లులు, తీర్మానాలపై ఆయన మాట్లాడారు. గతంలో ఇంతకంటే కష్టమైన పరిస్థితులు చూశానని, హైదరాబాద్‌లో ఉగ్రవాదం, విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్ , విజయవాడలో రౌడీయిజం ఉండేదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను అణచివేశామన్నారు. ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్‌తో డ్రగ్స్ వచ్చాయని, దానిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో నేరాలన్నీ గంజాయి మత్తులోనే చేస్తున్నారని, కాలేజీ పరిసరాల్లోకి కూడా గంజాయి వెళ్లిందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మార్చడం కష్టమని అన్నారు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని జగన్ ప్రోత్సహించారని ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్లో సొంత మనుషులను పెట్టి సోషల్ మీడియాలో పని చేయించుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా లాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. సివిల్ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారన్నారు. ఎవరినైనా లాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారని, అంటే ‘సాక్షి’లో పని చేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారని అన్నారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారన్నారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. తాము తెచ్చిన యాంటీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎక్కడ భూమి కబ్జా చేసినా, ప్రయత్నించినా, బెదిరించినా శిక్షిస్తామని, భూమి కబ్జా చేయలేదని కూడా వారే నిరూపించుకోవాలని అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని, ఇసుక అక్రమాలకు, బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని హోం మంత్రి అనితకు సూచించారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2,812 పోలీస్ వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.859 కోట్ల బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు, రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.వివేకా హత్యపై అధికారులూ అదే చెప్పారువివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఉదయం సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారని, తానూ దానిని నమ్మానని, అధికారులు, విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారని చంద్రబాబు అన్నారు. అక్కడి సీఐని మేనేజ్ చేశారని, రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్ క్లీన్ చేసి మృతదేహాన్ని వెంటనే ఫ్రీజర్‌లో పెట్టారన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలిందన్నారు. గిరిజన మ్యూజియంకు అల్లూరి పేరుభోగాపురం విమానాశ్రయానికి, అక్కడి గిరిజన మ్యూజియంకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకూ కేంద్రంపై పోరాడతామని తెలిపారు. దేవాలయాల కమిటీల్లో విశ్వ బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కోరారు. శాసనసభలో బుధవారం ఆమోదించి మండలికి పంపిన నాలుగు బిల్లులు యధాతథంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు గురువారం శాసన సభలో చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ గురువారం సభలో ప్రవేశపెట్టారు. మంత్రి సవిత, పలువురు రాయలసీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలును బెస్ట్ టౌన్‌గా మార్చడంలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యాలయాలు కూడా అక్కడే ఉంటాయన్నారు. వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు, తిరుపతి, ఇక్కడ అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు.హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే రాయలసీమకు మహర్దశ వస్తుందని చెప్పారు. అనంతపురానికి బెంగళూరు ఎయిర్‌పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదన్నారు.చెత్త యూజర్ చార్జీలు, కాంట్రాక్టర్ల లబ్ధిపై విచారణ: మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో చెత్తపై యూజర్ చార్జీల వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.5 లక్షల ఉద్యోగాలు: మంత్రి లోకేశ్వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ఏ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్ పాలïÜలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో 53 కంపెనీలు, రూ.17 వేల కోట్ల పెట్టుబడి, 96,220 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. -
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్‌గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు అది ఎప్పటికీ అంతమవుతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఓ ప్లాన్ బెడిసికొట్టింది. చేసింది ఎవరు , చేయించింది ఎవరు ? ఎవరు ఎవరిని టార్గెట్చేశారన్న విషయం తెలిసి కూడా వాళ్లు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ? ఇంతకీ ఈ ఫాక్ష్యన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెరెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయకక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టు కోసం ఇరువర్గాలు సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. పోలింగ్ తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవీ, భూమాకుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, అతడు తృటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నంద్యాలజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతికారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌ని చంపేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడంలేదు. సరికదా కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట. అందుకే బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవీ సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. -
అరెస్టు కానున్న నేతలు వీరే: ఆప్
కోల్‌కతా: మమత ఆరోపణలు వాస్తవమేనని ఆప్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లోపు విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ ఏదోలా జైలుపాలు చేయాలని మోదీ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఆరోపించారు. తొలుత తమ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేయజూస్తోందన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 95 శాతం విపక్ష నేతలపైనే కావడం మోదీ సర్కారు కక్షపూరిత వైఖరిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ‘‘ఇండియా కూటమి ఆవిర్భావంతో బీజేపీ వణికిపోతోంది. అందుకే విపక్ష కూటమిలోని అగ్ర నేతలందరినీ లక్ష్యంగా చేసుకుందని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ‘‘కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేయడం మోదీ సర్కారు లక్ష్యం. వారి తర్వాత జాబితాలో కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, శివసేన, ఎన్సీపీల అగ్ర నేతలున్నారు’’ అని ఆరోపించారు. -
రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదు.. ఫార్మింగ్.. చూసి కళ్లు తెరవండయ్యా
సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్ జిల్లా అంటేనే ఫ్యాక్షన్ చరిత్రకు పర్యాయపదంగా చెప్పుకునేవారు అనేకమంది. కాలక్రమంలో ఫ్యాక్షన్ హత్యలు కనుమరుగయ్యాయి. హత్యలే కాదు, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. 1990 దశకంలో 119 ఫ్యాక్షన్ గ్రామాలు జిల్లాలో ఉంటే, ప్రస్తుతం 60 గ్రామాల్లో మాత్రమే ఫ్యాక్షన్ వాసన అడపాదడపా కనిపిస్తోంది. 2022లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా జిల్లాలో నమోదు కాలేదన్న వాస్తవాన్ని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి ఫ్యాక్షన్ క్రమేపీ తెరమరుగవుతుందన్నది సుస్పష్టం. అందుకు ప్రధాన కారణం విద్యాధికులు పెరగడమే. పుష్కరకాలం క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రధాన తోడ్పాటుగా నిలిచింది. రైతు కుటుంబాల నుంచి వేలాది మంది విద్యావంతులయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో ఆర్థిక పరపతి పెరగడం, ఆయా కుటుంబీకులు పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. ప్రధానంగా హార్టికల్చర్ పంటల సాగు గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ఆదాయం గడిస్తుండడంతో ఫ్యాక్షన్ మూలాలను వదిలేశారు. పైగా మెట్ట ప్రాంతానికి కృష్ణా జలాలు వచ్చి చేరడంతో జిల్లా ‘కల్చర్’ పూర్తిగా మారిపోయిందనడంలో సందేహం లేదు. నాడు నెత్తుటి మరకలు.. నేడు పచ్చని పంటలు.. అడవిచెర్లోపల్లె ఒకప్పుడు ఫ్యాక్షన్ గ్రామం. ఇప్పుడు ఆ గ్రామంలో విదేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటను యువరైతు గంగిరెడ్డి పండిస్తున్నాడు. తన సోదరుడు అస్వస్థతకు గురైతే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లిన గంగిరెడ్డికి డిశ్చార్జి సందర్భంగా డాక్టర్లు డ్రాగన్ ఫ్రూట్స్ వాడడం చాలా మంచిదని చెప్పారు. వారి సూచన మేరకు కొనుగోలు చేస్తే ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ ధర రూ.150 పలికింది. ఆ పండు ధర గంగిరెడ్డి మదిలో పడింది. పంట సాగుపై అధ్యయనం చేశాడు. ఎలాంటి రకం పెడితే మన ప్రాంతంలో దిగుబడి సాధించవచ్చో తెలుసుకున్నాడు. తమిళనాడు నుంచి మొక్కలు తెప్పించి సక్సెస్‌ఫుల్‌గా దిగుబడి సాధిస్తున్నాడు. ప్రస్తుతం టన్ను రూ.1.5 లక్షలు ధర పలుకుతుండగా, ఎకరాకు 7 టన్నులు తక్కువ లేకుండా దిగుబడి సాధిస్తున్నాడు. ఫ్యాక్షన్ గ్రామంలో ఆదర్శ రైతుగా గంగిరెడ్డి నిలుస్తున్నాడు. ఈ విధంగా యువకులు, విద్యాధికులు హార్టికల్చర్ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పులివెందుల అరటి.. విదేశాలకు ఎగుమతి.. పులివెందుల ప్రాంతంలో పండించే అరటి పంట మంచి నాణ్యత కలిగి ఉంటోంది. అరటి రైతులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రతి రోజు కొన్ని వందల టన్నులు తరలివెళ్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాలలో మంచి డిమాండ్ ఉంటోంది. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రైతులు వారు పండించిన పంటలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. మన దేశంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, మహరాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు పులివెందుల ప్రాంత అరటి వెళ్తోంది. ఈ ప్రాంత అరటికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కింది. సాధారణంగా అరటి పండ్లు ఏడు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి అరటి పండ్లు 14రోజుల వరకు నిల్వ ఉంటాయని రైతులు వివరిస్తున్నారు. కృష్ణాజలాల రాకతో.. ‘మెట్ట ప్రాంతంలో కృష్ణాజలాలు పారించిన రోజు నా జన్మ ధన్యం’ అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించారు. వాస్తవంగా కృష్ణా జలాలు రాయలసీమకు రావడంతో సీమ ప్రజల తలరాత మారుతోంది. ఎప్పుడూ కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లా పంటలతో కళకళలాడుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్‌లో నీరు పుష్కలంగా ఉంది. కృష్ణా జలాల కారణంగా ఆక్వా ఉత్పత్తుల పట్ల సైతం జిల్లా వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా చేపల పెంపకంపై దృష్టి సారించారు. చాపాడు, వీరపునాయునిపల్లె, కొండాపురం, ముద్దనూరు, బి.మఠం, బి.కోడూరు మండలాల పరిధిలో చేపల పెంపకం సాగిస్తున్నారు. క్రమేపీ ఈ రంగంలోనూ రైతులు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధులయ్యారు. ఎప్పుడూ రక్తచరిత్ర పేరుతో బురద చల్లే సినీ ప్రముఖులకు కూడా జిల్లా వాసులు సవాల్ విసురుతున్నారు. మా కల్చర్ మారిందని నిరూపిస్తున్నారు. యువ రైతు పేరు మూలి గంగిరెడ్డి. వీరపునాయునిపల్లె మండలం అడవిచెర్లోపల్లె గ్రామం. ఇతర దేశాల్లో పండించే డ్రాగన్ ఫ్రూట్ పంటపై దృష్టి పెట్టాడు. ఎకరాకు రూ.4లక్షలు పెట్టుబడి వెచ్చించి, 4 ఎకరాల్లో పంట సాగు చేశాడు. రాయలసీమ ప్రాంతానికి అనువైన తైవాన్ పింక్ రకం వేస్తే ఇక్కడి వాతావరణానికి తట్టుకోగలదని తెలుసుకొని తమిళనాడు నుంచి మొక్కలు తెచ్చుకున్నాడు. పట్టువదలని గంగిరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ పంట దిగుబడిలో సక్సెస్ అయ్యాడు. దిగుబడికి తగ్గట్టుగా ధర ఎప్పటికీ తగ్గకుండా ఉండడంతో గణనీయంగా ఆదాయం గడిస్తున్నాడు. ప్రస్తుతం ఆసక్తి ఉన్న రైతులకు ఆయనే అంట్లు కట్టి మొక్కలను అందిస్తున్నాడు. జి.పవన్‌కుమార్‌రెడ్డి ఎంబీఏ చదివాడు. అమెరికాలో వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగించేవాడు. స్వగ్రామం అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం యనమవాండ్లపల్లె. అమెరికాలో ఎంత సంపాదిస్తున్నా తృప్తిలేదు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు మట్టి వాసనపై మమకారం పోలేదు. వ్యవసాయంపై మక్కువతో అమెరికా నుంచి వచ్చి సంబేపల్లె మండలంలోని దేవపట్లకు చెందిన తన బావ ఆవుల హర్షవర్దన్‌రెడ్డి పొలంలో 30 ఎకరాలు బొప్పాయి పంటసాగు చేశాడు. నాణ్యమైన పంట కోసం మహరాష్ట్ర నుంచి 786 రకం బొప్పాయి నారు తెప్పించాడు. ఒక కోతకు 60 టన్నులు పంట దిగుబడి రానున్నట్లు అంచనా వేస్తున్నాడు. ఒకసారి పంట సాగుచేస్తే 10 నుంచి 15 కోతలు రానున్నాయి. పంటల సాగులో ఆదర్శంగా నిలుస్తుండటంతో మండల రైతులు శభాష్ అంటున్నారు. -
అందరికీ ఆదర్శం.. చెన్నమరాజుపల్లె గ్రామం
ప్రొద్దుటూరు క్రైం : కొన్నేళ్ల క్రితం వరకు ఆ గ్రామం నిత్యం ఫ్యాక్షన్ గొడవలతో అట్టుడుకుపోయేది. ఆ ఊరు పేరెత్తితేనే చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్లు హడలెత్తిపోయే పరిస్థితి. ఒకానొక సమయంలో వేరే ఊరి అమ్మాయిని ఆ గ్రామానికి ఇవ్వాలన్నా భయపడిపోయేవాళ్లు. ఫ్యాక్షన్ తో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాక గ్రామస్తులు బిక్కు బిక్కు మంటూ జీవనం సాగించేవారు. ఆ గ్రామం ఎక్కడో మారు మూల ప్రాంతంలో లేదు. వైఎస్సార్ జిల్లాకు వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కుందూ నది ఒడ్డున..పచ్చని పొలాల మధ్యన ఉన్న ఆ ఊరే చెన్నమరాజుపల్లె. ఫ్యాక్షన్ ఘర్షణలు గ్రామాభివృద్ధిని పడేలా చేశాయి. పగలు, ప్రతీకారేచ్ఛల మధ్య పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఊ ఊళ్లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామం ఉపాధిబాటలో పయనిస్తోంది. మంచాల అల్లిక గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ఫ్యాక్షన్ వద్దు ప్యాషన్ ముద్దు అనే నినాదంతో గ్రామస్తులు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నారు. 1970 నుంచి 12 ఫ్యాక్షన్ హత్యలు ప్రొద్దుటూరు మండలంలోని చెన్నమరాజుపల్లెలో 1970లో ఫ్యాక్షన్ మొదలైంది. గ్రామాధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్ గొడవల్లో ఇప్పటి వరకు 12 మంది హత్యకు గురయ్యారు. ఇవి గ్రామంలో జరిగిన హత్యలే. గ్రామ ఫ్యాక్షన్ గొడవలకు అనుబంధంగా ఇతర ప్రాంతాల్లోనూ చాలా మంది హత్యకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య మొదలైన గ్రామాధిపత్య పోరుతో ఈ హత్యల పరంపర కొనసాగింది. ఈ క్రమంలోనే ఆలయ భూముల కోసం కొన్నేళ్ల పాటు హత్యలు, ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది. 1970లో ఇద్దరు, 71లో ఇద్దరు, 72లో ఒకరు, 79లో ముగ్గురు, 99లో ఒకరు, 2011 ముగ్గురు హత్యకు గురయ్యారు. 1970 నుంచి 79 వరకు 8 మంది ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయారు. తర్వాత 20 ఏళ్ల పాటు చెన్నమరాజుపల్లెలో ఎలాంటి గొడవలు లేవు. అంతా సద్దుమణిగి అభివృద్ధి వైపు అడుగులు పడుతున్న సమయంలో పాతకక్షలు ఒక్కసారిగా మళ్లీ భగ్గుమన్నాయి. 1999–2011 మధ్య నలుగురు హత్యకు గురయ్యారు. 1999 నుంచి గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. గ్రామ స్వరూపాన్నే మార్చేసిన అల్లికలు మంచాల అల్లికలు చెన్నమరాజుపల్లె గ్రామ స్వరూపాన్నే మార్చేశాయని చెప్పవచ్చు. 450 కుటుంబాలున్న ఈ గ్రామంలో వ్యవసాయం, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. భూస్వాములైతే గ్రామంలో ఎక్కువ మంది సన్నకారు రైతులే ఉన్నారు. రాందాసు అనే వ్యక్తి మొదట్లో ఇనుప పైపుల మంచాల అల్లికలు చేసేవాడు. రామలక్షుమ్మ అతని వద్ద అల్లిక పని నేర్చుకుంది. సుమారు 15 ఏళ్ల క్రితం వరకు ఐదారుగురు ఈ పని చేసేవారు. మంచాలను అల్లడానికి సమీపంలోని ప్రొద్దుటూరుకు వెళ్లేవారు. రాను రానూ అల్లిక పని చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతి రోజు ప్రొద్దుటూరుకు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని వారు భావించారు. దీంతో మంచాల ఫ్రేంలు, వైరు పంపిస్తే ఇంటి వద్దనే అల్లి పంపిస్తామని కొందరు గ్రామస్తులు దుకాణ యజమానులకు తెలిపారు. ఇందుకు వారు అంగీకరించి ఇనుప ఫ్రేంలు, వైర్‌ను చెన్నమరాజుపల్లెకు పంపించసాగారు. 4–5 ఏళ్ల వరకు 20 కుటుంబాలు మాత్రమే అల్లిక పని చేసేవారు. ఇంట్లోనే ఉంటూ ఈ పని చేయడం మిగతా వారిని ఆకర్షించింది. దీంతో గ్రామంలోని ఇతర మహిళలు, పురుషులు అల్లిక పని నేర్చుకునేందుకు మక్కువ చూపసాగారు. కొందరు గ్రామంలోనే తెలిసిన వారి వద్ద పని నేర్చుకోగా, ఇంకొందరు ప్రొద్దుటూరుకు వెళ్లి నేర్చుకున్నారు. ప్రస్తుతం 75 శాతం కుటుంబాలు అల్లిక పనిని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. చాలా మంది మహిళలు ఈ వృత్తిలో చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. నెమలి, చిలుక, పుష్పాలు, హంస, చిలక ఇలా అనేక రకాల డిజైన్లతో అల్లికలు చేస్తున్నారు. ఆర్థికంగా పరిపుష్టి చెన్నమరాజుపల్లె గ్రామంలోని అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. ప్రొద్దుటూరులో ఫర్నీచర్ దుకాణాలు, మంచాల ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇక్కడ తయారైన మంచాలు రాయలసీమ వ్యాప్తంగా సరఫరా అవుతుంటాయి. ఇనుప ఫ్రేంలు మాత్రమే తీసుకొని వెళ్లే వారు కొందరుంటే, అల్లిన మంచాలను తీసుకెళ్లేవారు ఎక్కువ శాతం ఉన్నారు. చెన్నమరాజుపల్లె గ్రామం అల్లికలకు ప్రసిద్ధిగాంచడంతో ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీ, దుకాణ యజమానులు ఈ పనిని వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడ ప్రతి రోజు 1500 నుంచి 2000 మంచాలు తయారుఅవుతాయని గ్రామస్తులు చెబుతున్నారు. మూడు రకాల వైర్లతో మంచాలను అల్లుతారు. లావుగా ఉన్న వైర్‌తో మంచం అల్లినందుకు రూ. 120 నుంచి 150, సన్నటి వైర్‌తో అల్లితో రూ. 280– 300, మహారాష్ట్ర వైర్‌తో మంచం అల్లితే రూ. 1000–1200 కూలిగా ఇస్తారు. లావు వైర్‌తో ఒక్కో వ్యక్తి రోజుకు 5 మంచాల వరకు అల్లుతారని చెబుతున్నారు. సన్నటి వైర్‌తో అయితే 2 లేదా మూడు మంచాలు అల్లుతామన్నారు. నలుగురు, ఐదుగురు ఉన్న కుటుంబాల్లో అయితే ఎక్కువ సంఖ్యలో మంచాలను అల్లుతున్నారు. కొన్నేళ్ల నుంచి పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరులలోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు యువకులు ఆర్మీ, పోలీసు, బ్యాంకు, ట్రాన్స్‌కో. సచివాలయ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. గ్రామస్తుల్లో మార్పు రావడం సంతోషాన్ని ఇస్తుంది ఫ్యాక్షన్ గొడవలతో అభివృద్ధికి దూరంగా ఉన్న చెన్నమరాజుపల్లె గ్రామస్తుల్లో మార్పు రావడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. అల్లిక పనులతో వారి కుటుంబాలతో పాటు గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు. పోలీసు శాఖ తరపున వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. – సంజీవరెడ్డి, రూరల్ ఎస్ఐ, ప్రొద్దుటూరు పిల్లలను బాగా చదివించుకుంటున్నాం కొన్నేళ్ల క్రితం వరకు గ్రామంలో అభివృద్ధి ఊసే లేదు. ఫ్యాక్షన్ గొడవల్లో అనేకమందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా గ్రామంలో గతంలో నాటి పరిస్థితులు లేవు. మంచాల అల్లిక పనులతో గ్రామం ఉపాధి బాట పట్టింది. పిల్లలను బాగా చదివించుకుంటున్నాం. – ఎన్ వెంకటసుబ్బయ్య, చెన్నమరాజుపల్లె ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా ఆరేళ్ల నుంచి అల్లిక పని చేస్తున్నా. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి పని చేసుకోవడం బాగుంది. మా గ్రామంలో ఎక్కువ మందికి ఉపాధి దొరకడం సంతోషంగా ఉంది. – దేవి, చెన్నమరాజుపల్లె ఆరుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాం మాకు ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అందరం అల్లిక పని చేసేవాళ్లం. అల్లిక పని ద్వారా వచ్చిన డబ్బుతో కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాం. ఇద్దరు కుమారుల్లో వెంకటగ్రేస్ ఆర్మీలో సైనికుడిగా, చైతన్యకుమార్ లైన్మెన్గా పని చేస్తున్నారు. – గుర్రమ్మ, చెన్నమరాజుపల్లె -
నీకు ఎలాంటి అధికారం లేదు: పళనిస్వామి బహిరంగ ప్రకటన
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ మేరకు పన్నీర్‌సెల్వంకు ఇక మీదట పార్టీ కో-ఆర్డినేటర్ కాదంటూ ఈపీఎస్ ఓ లేఖ రాశారు. ఇకపై ఓ.పన్నీర్‌సెల్వం.. అన్నాడీఎంకే పార్టీ కో-ఆర్డినేటర్ కాదని, ఇద్దరి ఆమోదం తర్వాత ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ భేటీ(జూన్ 23న) రసాభాసకు కారణం పన్నీర్ సెల్వమేనని పళని స్వామి ఆరోపించారు. 2021, డిసెంబర్ 1న పార్టీ రూపొందించిన ప్రత్యేక చట్టాలను పన్నీర్‌సెల్వం ఉల్లంఘించారని, జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా పోలీసులను.. కోర్టును ఆశ్రయించారని, భేటీలో గందరగోళంతో పాటు కీలక తీర్మానాల ఆమోదానికి కొందరు కార్యకర్తల ద్వారా అడ్డుతగిలారని.. కాబట్టి పన్నీర్‌సెల్వం ఇకపై అన్నాడీఎంకే పార్టీ కో ఆర్డినేటర్ కొనసాగే అర్హత లేదని పళనిస్వామి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. స్థానిక ఎన్నికలకు సంబంధించి.. అభ్యర్థుల పేర్లతో ఓపీఎస్ పంపిన లేఖను సైతం పళనిస్వామి పక్కనపెట్టారు. గడువు ముగిశాక పంపిన పేర్లను పరిశీలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు పళనిస్వామి. ఇదిలా ఉంటే.. పళనిస్వామి పంపిన లేఖలో తనను తాను పార్టీ హెడ్‌క్వార్టర్స్ సెక్రటరీగా పేర్కొనగా.. ఓపీఎస్‌ను కోశాధికారిగా(ట్రెజరర్) ప్రస్తావించారు. కిందటి ఏడాది ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలో పన్నీర్ సెల్వంను కో-ఆర్డినేటర్‌గా, పళనిస్వామిని జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎనుకున్నారు. అయితే పళనిస్వామి పార్టీ అధికారం అంతా ఒకరి చేతుల్లోనే ఉండాలని వాదిస్తుండగా, పన్నీర్‌సెల్వం మాత్రం పాత విధానం కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాడు. -
కుట్ర భగ్నం: ఫ్యాక్షన్ మంటను చల్లార్చిన పోలీసులు
పత్తికొండ టౌన్ / తుగ్గలి: జిల్లా ఫ్యాక్షన్ జోన్ పోలీసులు ఓ వ్యక్తి హత్య కుట్రను భగ్నం చేశారు. తుగ్గలి మండల కడమకుంట్ల గ్రామానికి చెందిన ఊటకంటి అమరనాథరెడ్డిని హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు సుఫారీ ఇచ్చారు. పక్కా సమాచారంతో రెండురోజుల కిందట ఫ్యాక్షన్ జోన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం పత్తికొండ పోలీసు స్టేషన్లో సీఐ రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. 1998లో కడమకుంట్ల గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు ఊటకంటి లక్ష్మీకాంతరెడ్డి, విశ్వనాథశర్మ హత్యకు గురయ్యారు. ఈ కేసులో హనిమిరెడ్డితో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. ఈ హత్యలకు ప్రతీకారంగా 2011లో పగిడిరాయి కొత్తూరు సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద హనిమిరెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఇరువర్గాలు రాజీ అయినా పాతకక్షలు అలాగే ఉండిపోయాయి. ఈ క్రమంలో ఆరు నెలల కిందట లక్ష్మీకాంతరెడ్డి కుమారుడు రాంభూపాల్‌రెడ్డిపై హనిమిరెడ్డి కుమారుడు అమరనాథరెడ్డి పత్తికొండ సమీపంలో జీపుతో ఢీకొట్టి హత్యాయత్నానికి ప్రయత్నించాడని పత్తికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనల నేపథ్యంలో అమరనాథ్‌రెడ్డిని అంతమొందించేందుకు ప్రత్యర్థులు కుట్రపన్ని చివరకు పోలీసులకు చిక్కారు. రూ. 4 లక్షలకు సుఫారీ.. అమరనాథ్‌రెడ్డిని హత్య చేసేందుకు హనిమిరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడమకుంట్ల బొగ్గుల సుధాకర్‌తో పాటు సురేష్, సోమశేఖరరాజు కుట్ర పన్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ములకలపెంటకు చెందిన ఎద్దుల వీరాంజినేయులుతో రూ. 4 లక్షలకు సుఫారీ మాట్లాడారు. ఈ మేరకు రూ. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. కాగా నెలలు గడుస్తున్నా పని పూర్తిచేయక పోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరాంజినేయులుపై సుధాకర్ ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం నిఘా వర్గాలకు తెలియడంతో ఫ్యాక్షన్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గత నెల 31వ తేదీన వీరాంజినేయులతో పాటు సుధాకర్, సురేశ్, సోమశేఖరరాజును అదుపులోకి విచారణ చేశారు. సోమవారం నిందితులను పత్తికొండ కోర్టులో హాజరు పరుచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. సమావేశంలో ఫ్యాక్షన్ జోన్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సోమ్లానాయక్, జొన్నగిరి ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఉన్న కడమకుంట్ల గ్రామంలో ఈ ఘటన అలజడి రేపింది. -
చంద్రగిరికి చిత్తూరు రౌడీయిజం..!
చిత్తూరు, తిరుపతి రూరల్: చిత్తూరు రౌడీ రాజకీయం చంద్రగిరికి విస్తరిస్తోంది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో కత్తులు, రాడ్డులు సైరవిహారం చేస్తున్నాయి. వరుస దాడులతో పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోతున్నారు. మొన్న చంద్రగిరి మండలం మొరవపల్లిలో దళితుడైన పుట్టా రవిపై జరిగిన దాడిని మరవకముందే, నిన్న తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ను చితకబాదిన ఘటన కళ్లేదుటే ఉండగానే, తాజాగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద నిఖిల్పైన పులివర్తి నాని అనుచరులు కత్తులు, రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్రయత్నించడమే అతను చేసిన తప్పు. కత్తులు, రాడ్లలతో దాడి దామినేడుకు చెందిన నిఖిల్ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆదివారం ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాడు. నాని ఫ్లెక్సీ తప్ప మరొక పార్టీ వ్యక్తుల వారివి ఉండకూడదని దామినేడుకు చెందిన పులివర్తి నాని అనుచరుడు రాఘవ అక్కడ రచ్చ చేశాడు. ఫ్లెక్సీని తీసివేయాలని హుకుం జారీ చేశాడు. నిఖిల్ పట్టించుకోకపోవడంతో రాఘవతో పాటు అతని అనుచరులు నిఖిల్, అతని ఫ్రెండ్ వంశీపై రాడ్లు, కత్తులు, కర్రలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర రక్త గాయాలతో ఉన్న నిఖిల్, వంశీని స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. పులివర్తి నాని అనుచరుడు రాఘవపై తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భయపెడుతున్న కొత్త సంస్కృతి ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతోనే దాడుల సంస్కృతి పెరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. చంద్రగిరికి వచ్చిన కొత్త సంస్కృతి వల్ల పల్లెల్లో ప్రశాంతత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకుడు ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాడని మండిపడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఈ దాడులు, హత్యయత్నం ఘటనలపై చిత్తూరు, తిరుపతి అర్భన్ ఎస్పీలు సీరియస్ అయ్యారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త సంస్కృతిని చంద్రగిరి నుంచి తరిమివేయాలని, ప్రోత్సాహించే నాయకులకు తగిన గుణపాఠం తప్పదని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. -
కక్ష
ప్రేమలు కనుమరుగౌతున్నాయి. అసూయలు కక్షలైపోతున్నాయి. కుతంత్రాలు కాటికి తీసుకెళ్తున్నాయి. కుటుంబాలు కల్లోలమౌతున్నాయి. ప్రేమలు పునఃపరిమళిస్తే కక్షలు కటకటాలదాకా పోవు. అతను ఇంటికి లేడు... ఊరికి లేడు... అదృశ్యమయ్యాడు. అతను భార్యకు లేడు.. పిల్లలకు లేడు... అదృశ్యమయ్యాడు. అతను ఉద్యోగానికి లేడు... జీతానికి లేడు... అదృశ్యమయ్యాడు. చావులో ఒక నిర్థారణ ఉంది. మనిషి పోయాడని ఏడ్వొచ్చు. అదృశ్యమైతే ఉన్నట్టా.. లేనట్టా... బతికినట్టా... చచ్చినట్టా.1998. గోదావరి ఖని.‘లెక్కల సారు వచ్చాడా?’ అడిగాడు రాజేష్.నైట్‌డ్యూటీకి రెడీ అవుతున్నాడతడు. బొగ్గుబావిలో అతని ఉద్యోగం. ఇప్పుడు వెళితే తెల్లారిన తర్వాత వస్తాడు.‘వస్తాడు లేండి. వస్తే టీ ఇస్తాను’ అంది భార్య రాణి.ఇద్దరికీ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది. వాడిప్పుడు టెన్త్ క్లాస్. క్రికెట్లో పడి లెక్కల్లో బాగా వెనుకబడ్డాడు. ప్రీ పబ్లిక్ పరీక్షల్లో వాడి మార్కులు చూసి స్కూలు మాస్టారినే బతిమిలాడి ట్యూషన్ పెట్టించాడు రాజేష్. రోజూ ఇంటికొచ్చి లెక్కలు చెప్పాలని అందుకు గౌరవమైన డబ్బు ఇస్తానని ఒప్పంది.స్కూలు మాస్టారు గణేష్ సార్‌కి ఇది కొత్తేగాని బ్యాచిలర్‌గా రూముకు వెళ్లి చేసేదేముందని ఒప్పుకున్నాడు.ఇంటి ముందు టీవీఎస్ అలికిడి అయ్యింది.‘అదిగో వచ్చినట్టున్నాడు’ అంది రాణి. గణేష్ సార్ రాజేష్‌ను చూసి విష్ చేసి ట్యూషన్ చెప్పడానికి కేటాయించిన ముందు గదిలోకి నడిచాడు. అప్పటి వరకూ టీవీ చూస్తున్న కొడుకు కుమార్ కూడా లేచి పుస్తకాలు తీసుకొని గదిలోకి వెళ్లాడు.వాళ్లను సంతృప్తిగా చూసుకొని స్కూటర్ తీసుకొని డ్యూటీకి బయలుదేరాడు రాజేష్.గణేష్ సార్‌కు టీ ఇవ్వడానికి కిచెన్‌లోకి వెళ్లింది రాణి. రెండు నెలలు గడిచాయి. ఒకటో తేదీ వచ్చింది. జీతం తెచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది ఇచ్చాక గణేష్ సార్‌కు ఇవ్వాల్సింది కూడా భార్యకు ఇచ్చి ఇచ్చేయమన్నాడు రాజేష్.‘అలాగే’ అంది రాణి.ఆ తర్వాత భర్త ఏం చేస్తాడో ఆమెకు తెలుసు. ఒక వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని రెండు రోజులు ఊరికి వెళ్లి వస్తాడు. ఊళ్లో తల్లి ఉంటుంది. తమ్ముడు, మరదలు ఉంటారు. వాళ్లనుపలకరించి అక్కడే ఓ రెండు రోజులు ఉండి డబ్బులిచ్చి వస్తాడు. ‘ఇవాళ వెళుతున్నారా?’ అడిగింది.‘వెళ్లాలిగా వచ్చేస్తాలే. వాణ్ణి టీవీ చూడనివ్వకు’ అని చెప్పి బయలుదేరాడు.భర్త వెళ్లిన దారిలోనే చూస్తూ నిలుచుంది రాణి.భర్త వీధి చివర కనుమరుగయ్యాడు. అయినా అలాగే నిలుచుంది. ఐదు నిమిషాల తర్వాత గణేష్ సార్ వస్తూ కనిపించాడు.సంతృప్తిగా కిచెన్‌లోకి నడిచింది. రెండు రోజులు గడిచాయి.రాజేశ్ ఇంటికి రాలేదు. నాలుగురోజులు గడిచినా రాలేదు. రాణి కంగారుపడింది. సెల్ఫోన్లు లేని రోజులవి. ఐదో రోజు తానే అత్తగారింటికి వెళ్లింది. ‘అదేంటి... ఒక్కరోజే ఉండి పనుందని వెళ్లాడే’ అంది అత్త.రాణి హతాశురాలయ్యింది. ఈలోపు మరిది రమేశ్ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ‘కంగారు పడకు వదినా! అన్న కోసం వెదుకుదాం’ అన్నాడు.అంతా కలిసి గోదావరిఖనికి వచ్చారు. రాజేశ్ కనిపించడం లేదన్న వార్త వాడ మొత్తం పాకింది. ఇరుగూ పొరుగువారు, మిత్రులు వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మరోవైపు పనిచేసే వెళ్లి వాకబు చేశాడు రమేశ్. అక్కడా సమాచారం ఏమి చెప్పలేదని వారు చెప్పారు. బావి కాడ కూడా ఎవరికీ ఏమీ తెలియదట’ అని చెప్పాడు ఇంటికొచ్చింది.రాణి, రాజేష్ తల్లి ఏడుపు అందుకున్నారు. ‘నా కొడుకు ఏమయ్యాడు దేవుడో’...అందరి సలహా మేరకు పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఎంక్వయిరీ మొదలైంది. రాజేశ్ ఎలాంటివాడు? వైవాహిక జీవితం ఎలా ఉంది? శత్రువులెవరైనా ఉన్నారా? లేక కావాలని వెళ్లిపోయాడా? అన్న విషయాలపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. చాలామందిని ప్రశ్నించినా ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగం, చక్కటి భార్య, చదువుకుంటున్న కొడుకు, సమాజంలో గౌరవం అన్నీ బానే ఉన్నాయి. అలాంటపుడు రాజేశ్ ఏమైనట్లు? ఇంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎస్.ఐ. రెండు రోజులు గడిచాయి.చిన్నకొడుకు రమేష్‌తో కలిసి స్టేషన్‌కి వచ్చింది రాజేష్ తల్లి.‘సార్. మా రాజేశ్ నుంచి ఉత్తరం వచ్చింది’ అంటూ పోస్ట్ కార్డ్ తెచ్చి ఎస్.ఐకి చూపించింది. వెనక్కి తిప్పి చూశాడు. కరీంనగర్ స్టాంప్ ఉంది. ‘నేను బానే ఉన్నాను.. నా గురించి వెతక వద్దు’ అని రాసి ఉంది అందులో.‘ఇది మీ అబ్బాయి రాతేనా’ అడిగాడు.‘మా అబ్బాయి రాతే’ అంది తల్లి.‘మరి ఇంకేటి?’ అన్నాడు.ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి.‘సార్... కొడుక్కి ఏదైనా అయితే తల్లి మనసు ఊరికే ఉండదు. కొట్టుకుంటుంది. ఈ ఉత్తరం చూసినా నా మనసు కుదుట పడలేదు. కొట్టుకుంటూనేఉంది. నా కొడుకు బతికి ఉన్నాడని నేననుకోవడం లేదు. చెప్పకుండా ఎటో వెళ్లాల్సిన అవసరం వాడికి లేదు. నాకు మా కోడలి మీదే అనుమానంగా ఉంది. వాడు మాయమయ్యాడన్న బాధ ఆమెలో కొంచెం కూడా లేదు. పైగా మా మనవడికి ట్యూషన్ చెప్పేందుకు వచ్చే టీచర్‌తో కలివిడిగా ఉంటోంది.’ అంది. వెంటనే గణేష్ సార్ మీద నిఘా పెట్టారు పోలీసులు. రాజేష్ కనపడకుండా పోయినప్పటి నుంచి అతను ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు.అతన్ని స్టేషన్‌కి తీసుకొచ్చారు పోలీసులు. చాలాసేపు విచారించారు. ‘తండ్రి కనిపించడం లేదని ఆ కుర్రాడు డిస్ట్రబ్ అయి ఉన్నాడు. ఈ గోలలో ట్యూషన్ ఎందుకని వెళ్లడం లేదు’ అన్నాడు గణేష్ సార్.‘రాణితో నీకు ఎలాంటి పరిచయం’ అడిగాడు ఎస్.ఐ.‘అయ్యో.ఆమె చాలా మంచిదండీ’ అన్నాడు గణేష్.అతను అబద్దం చెబుతున్నట్లుగా ఎస్.ఐకి అనిపించలేదు. ‘ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు’ అని హెచ్చరించి వదిలేసాడు. కథ మళ్లీ మొదటికొచ్చింది. గణేశ్ సార్ కాదు... రాణి పాత్ర లేదు. మరి, రాజేశ్ అదృశ్యం వెనక ఎవరి హస్తం ఉందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఎస్.ఐకి టేబుల్ మీద అమాయకంగా ఉన్న పోస్ట్‌కార్డ్ వెక్కిరిసూ కనిపించింది. ఆ పోస్ట్‌కార్డ్ తీసుకొని రంగంలోకి దిగాడు ఎస్.ఐ. మొదట ఒక టీమ్‌ను కరీంనగర్ పంపాడు. కాని అక్కడ రాజేష్ ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాలు దొరకలేదు. తర్వాత దానిని తీసుకెళ్లి్ల రాజేశ్ పని చేసే గనిలో, సొంతూళ్లో అతని మిత్రులకు చూపించాడు. ‘ఇది రాజేష్ రాతే’ అని అందరూ చెప్పారు.మరైతే అతడు ఎలా ఎందుకు అదృశ్యమయ్యాడనేది పెద్ద మిస్టరీగా ఉంది ఎస్.ఐకి.ఇక ఒక్క స్నేహితుడు మిగిలాడు.అతడికి లెటర్ చూపించాడు ఎస్.ఐ. అతడు ఆ అక్షరాలు చూసి ‘ఇవి రాజేష్వి కావు’ అన్నాడు.‘ఎలా చెప్పగలవు?’ అన్నాడు ఎస్.ఐ.ఒక అక్షరం చూపిస్తూ ‘ఇది రాజేష్ ఇలా రాయడు. కాని ఈ లెటర్ రాసింది మాత్రం ఈ ఊరి వాళ్లే’ అన్నాడు. రెండు రోజులు పోలీసులు ఎవరి కదలికల మీద నిఘా పెట్టాలో వారి మీద పెట్టారు. మూడో రోజు తెచ్చి లోపల వేశారు. అతడే రమేష్. రాజేష్ తమ్ముడు.‘చెప్పు ఈ లెటర్ ఎందుకు రాసావు?’ ప్రశ్నించాడు ఎస్.ఐ.‘ఇది మా అన్న రాసిందే, కావాలంటే కింద సంతకం ఉంటుంది చూసుకోండి’ అన్నాడు రమేష్.‘అది నువ్వే రాసావు. అందులో ‘క’ అనే అక్షరం కాస్త డిఫరెంటుగా ఉంది.‘మీ ఊరు మొత్తంలో అలా రాసేది నువ్వొక్కడివే. అది నీ తప్పు కాదు మీకు చదువు నేర్పిన తెలుగు మాస్టారుది. ఆయన కర్ణాటక వ్యక్తి. అతని వద్ద అక్షరాలు దిద్దిన నువ్వు ‘క’ అక్షరాన్ని కన్నడలో రాసినట్లుగా రాస్తావు. కాలక్రమంలో నీ మిత్రులందరూ ఆ అలవాటు మార్చుకున్నా మధ్యలోనే చదువు మానేసిన నువ్వుమాత్రం ఇప్పటికీ అలాగే రాస్తున్నావు’ అన్నాడు ఎస్.ఐ.రమేశ్ ముఖంలో రంగులు మారాయి.అదే అదనుగా లాగిపెట్టి చెంపకు ఒక్కటి అంటించాడు ఎస్.ఐ.ట్రీట్మెంట్ పనిచేసింది.. నిజం కక్కేసాడు రమేశ్.‘ఆ లెటర్ రాసింది నేనే.. మా అన్నను చంపింది కూడా నేనే’...విషయాలు ఒక్కొక్కటి చెబుతున్నాడు.. ‘రాజేశ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడేది కాదు. చదువులో వాడెప్పుడూ ఫస్టే. నాకు చదువు రాదని అంతా గేలి చేసేవారు. ఇంట్లో వాళ్లు కూడా వాడే గ్రేట్ అంటూ పొగిడేవారు. పెద్దయ్యాక వాడు సింగరేణిలో ఉద్యోగం సంపాదించాడు. నాకు చదువు అబ్బకపోవడంతో ఊళ్లోనే పొలం పనులు చూసుకునేవాడిని. మా అన్న ఊరికి వచ్చిన ప్రతీసారి ఇంకెప్పుడు బాగుపడతావంటూ తిట్టేవాడు. పైగా వాడు ఊళ్లోకి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు అంతా అతని చుట్టే మూగేవారు. ఇవన్నీ మా అన్న మీద ఈర్ష్య పెరిగేలా చేసాయి. అన్నకు సమాజం ఇస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేక పోయాను. చంపాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు మా అన్న తిరిగి ఊరు నుంచి బయల్దేరినప్పుడు బస్టాపు వద్ద దిగబెడతానని నమ్మబలికాను. మాటలు చెబుతూ గోదావరిఖని దాకా తీసుకెళ్లాను. దారిలో ఓ పాడుపడిన బావి ఉంది. అక్కడ ఎవరూ ఉండరు. అక్కడే అన్నను కత్తితోపొడిచి చంపి, శవానికి రాళ్లుకట్టి బావిలో పడేసాను. నాపై అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డాను. వదిన మా ఇంటికి వచ్చి అన్న గురించి చెప్పాక నింద వదిన– ట్యూషన్ మాస్టారుపై పడేలా అమ్మకు చాడీలు చెప్పాను. అయినా నేరం బయటపడుతుందని భయమేసి పక్కదోవ పట్టించడానికి కార్డు రాసి కరీంనగర్లో పోస్ట్ చేసి వచ్చాను. మా అన్న రైటింగ్ నా రైటింగ్ ఒక్కలాగే ఉంటుంది. కాని క అక్షరం నన్ను పట్టించింది’ అంటూ తల ఒంచుకున్నాడు.మరునాడు ఆ పాడుబడ్డ బావి నుంచి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని బయటికి తీసారు పోలీసులు.కోర్టు రమేష్‌కు యావజ్జీవం వేసింది. సొంత అన్న మీద ద్వేషం పెంచుకుని చేసిన పిచ్చి పని వల్ల ఆ తల్లికి ఇద్దరు కొడుకులు దూరమయ్యారు. రాణికి ఇది కోలుకోని దెబ్బ అయినా భర్త స్థానంలో ఉద్యోగం రావడంతో కొడుకును భర్త ఆశయాలకు తగినట్టుగా తీర్చిదిద్ద గలిగింది. కొడుకును చూసుకుంటూ జీవితం గడుపుతోంది. – అనిల్‌కుమార్ భాషబోయిన -
తెలుగు తమ్ముళ్ల కక్ష సాధింపు
సాక్షి, తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తమ అక్రమాలకు అడ్డొస్తున్నారనే అక్కసుతో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సీఐ రాజశేఖర్‌ను సస్పెండ్ చేయించారు. నగరంలో అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న పేకాట, అవినీతిని అక్రమాలను రాజశేఖర్ అడ్డుకుంటున్నారు. తమ ఆటలు సాగడం లేదన్న కోపంతో ఆయనపై తెలుగు తమ్ముళ్లు కక్ష కట్టారు. కొన్నిరోజుల క్రితం టీడీపీ నేతల ఒత్తిడితో రాజశేఖర్‌ను ఉన్నతాధికారులు విఆర్‌లోకి పంపించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ప్రస్తావించారు. రాజశేఖర్ గురించి సభలో ప్రస్తావించడంతో టీడీపీ నాయకులు కక్ష సాధింపుతో సీఐను అదేరోజు ఏకంగా సస్పెండ్ చేయించారు. రాజశేఖర్‌ను తామే సస్పెండ్ చేయించినట్టు టీడీపీ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మీడియా ముఖంగా ప్రకటించారు. విఆర్‌లోకి కాదు ఏకంగా సస్పెండ్ చేయించామని గొప్పలు పోయారు. తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే ఎలా ఊరుకుంటామని ఎదురు ప్రశ్నించారు. ఈ మాటలను బట్టి టీడీపీ కక్ష సాధింపులో భాగంగానే సీఐ రాజశేఖర్‌పై చర్య తీసుకున్నారని స్పష్టమయింది. -
బెంగళూరుపై మోదీ కక్ష సాధింపు: రాహుల్
సాక్షి, బెంగళూరు: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ బెంగళూరుపై కక్ష సాధిస్తున్నారు. సిలికాన్ సిటీని చెత్త నగరంగా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడ ఎన్నోమార్లు పర్యటించినా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెంగళూరు నగరంలో రోడ్ షో నిర్వహించారు. పలుచోట్ల తన ప్రసంగాల్లో మోదీపై ఎదురుదాడికి దిగారు. మోదీ ప్రసంగాలకు ఎవరూ మోసపోరన్నారు. మోదీ ప్రధాని పదవిలో ఉన్నాననే సంగతి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు 2019లో తాను ప్రధాని కూడా అవుతానని పునరుద్ఘాటించారు.హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన బీజేపీకి అవకాశం ఇవ్వరాదని ప్రజలను కోరారు. అనంతరం బసవనగుడిలో ప్రాచీన దొడ్డ గణపతి ఆలయంలో రాహుల్ పూజలు చేశారు. చిక్కపేటె ప్రాంతంలో హజరత్ మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్నారు. అవినీతి విషయంలో కర్ణాటకలో ప్రస్తుత కాంగ్రెస్‌పై గత బీజేపీ పాలనే తేలిగ్గా విజయం సాధిస్తుందని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ హయాం (2008–13)లో జరిగిన అవినీతిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో పోల్చుతూ పలు గణాంకాలను ట్విటర్లో విడుదల చేశారు. -
ప్రకాశం జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు
-
కక్ష పెంచుకుని చంపేశాడు..
రాజమహేంద్రవరం క్రైం: స్థానిక గోదావరి గట్టున ఉన్న సులభ కాంప్లెక్‌లో జరిగిన వృద్ధుడి దారుణ హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మంగళవారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. ఈనెల రెండోతేదీన రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మార్కండేయ స్వామి గుడి సమీపంలో ఉన్న సులభ కాంప్లెక్స్‌లో కృష్ణా జిల్లా గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామానికి చెందిన వీర వెంకటేశ్వరరావును ఖమ్మం జిల్లా ముస్తాబ్నగర్కు చెందిన తోట వీరబాబు పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశాడని ఎస్పీ వివరించారు. ఈనెల రెండోతేదీ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తోట వీరబాబు గోదావరి గట్టుపై గల మార్కండేయ స్వామి ఘాట్ వద్ద కు వచ్చాడని, ఫ్లాట్‌ఫాంపై పడుకొని ఉన్న ఒక సాధువును భయపెట్టి అతడి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు లాక్కొంటుండగా వెంకటేశ్వరరావు(బాబాయ్) వారించాడు. అక్కడ ఉన్న స్థానికులు కార్తీక్, ప్రసాద్ అనే వ్యక్తుల సహాయంతో తోట వీరబాబును కొట్టారు. దీంతో కక్ష పెంచుకున్న వీరబాబు వెంకటేశ్వరరావును హత్య చేయాలనే ఉద్దేశంతో గోకవరం బస్టాండ్ వద్దగల పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ పోయించుకొని మార్కండేయ స్వామి గుడి వద్ద గల సులభ కాంప్లెక్ వద్దకు మధ్యాహ్నం చేరుకుని సులభ్ కాంప్లెక్స్ కేబిన్‌లో నిద్రిస్తున్న వెంకటేశ్వరరావుపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించి హత్య చేశాడని తెలిపారు. ఈ కేసును సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి. రామకృష్ణ, ఆద్వర్యంలో వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్లోని విజయ టాకీస్ సందులో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరవెంకటేశ్వరరావును హత్య చేసింది తానేనని అంగీకరించాడని తెలిపారు. నేరప్రవృత్తిగల నిందితుడు నిందితుడు తోట వీర బాబు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. డబ్బులు అవసరమైనప్పుడు ఘాట్లు మెట్లపై పడుకునే సాధువుల వద్ద లాక్కోని పారిపోతుంటాడని తెలిపారు. ఇతని పై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఓపెన్ చేసి దానిని విజయవాడకు బదిలీ చేస్తామని ఎస్పీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రవీంద్ర, ఎస్సై రాజశేఖర్, ఏఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ చిన్నారావు, కె. నెహ్రు, కానిస్టేబుల్ ప్రదీప్, వీరబాబులను ఎస్పీ అభినందించారు. -
పాతకక్షలతో మర్మాంగాన్ని కోశాడు
నంగునూరు(సిద్దిపేట): పాత కక్షలతో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తి మర్మాంగాన్ని కోసిన ఘటన నంగునూరు పరిధిలోని రాంచంద్రాపూర్‌లో జరిగింది. మూడు రోజుల కింద జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం..రామచంద్రాపూర్‌కు చెందిన మతిస్థిమితం సరిగా లేని పందిల్ల రవీందర్‌రెడ్డిని అదే గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మూడు రోజుల కిందట ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి పురుషాంగాన్ని కత్తితో కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు రవీందర్‌రెడ్డిని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మొదట పరిహారం ఇస్తానని చెప్పిన నారాయణరెడ్డి తరువాత మాటమార్చడంతో శనివారం బాధితుడి బంధువు నాయిని రాజిరెడ్డి రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
గన్‌జాటం!
♦ స్టేటస్ సింబల్‌గా తుపాకీ ♦ జిల్లాలో కనిపించని ఫ్యాక్షన్, నక్సలిజం ♦ అయినా పెరిగిన దరఖాస్తులు ♦ లైసెన్స్ జారీలో ఆచితూచి అడుగులు ♦ అదుపుతప్పితే ముప్పే ♦ లోతుగా విశ్లేషిస్తున్న పోలీసులు అనంతపురం అర్బన్ : చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్ లేదు.. నక్సలిజం జాడ కనిపించట్లేదు.. ప్రత్యేకంగా ముప్పు ఉన్నట్లు ఎవరూ ముందుకు రాలేదు.. ఇక ప్రజాప్రతినిధులకు ఎలాగూ ప్రభుత్వం గన్మెన్లను కేటాయిస్తోంది. ఇవన్నీ పరిశీలిస్తే ప్రత్యేకంగా ఎవరికీ గన్‌తో పని లేదనేది సుస్పష్టం. అయితే గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తున్నట్లు ఇటీవల కాలంలో చేసుకున్న దరఖాస్తులను చూస్తే అర్థమవుతుంది. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 400 మందికి గన్ లైసెన్స్‌లు ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే లైసెన్స్ ఉండి రెన్యూవల్ కోసం 51 మంది దరఖాస్తు చేశారు. ఈ రెండింటికీ 74 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఇందులో 8 మందికి లైసెన్స్ మంజూరయింది. 11 మంది దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించగా.. 55 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. స్టేటస్ కోసమేనా.. ఒకప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ జాడ ఉంది. ఆ క్రమంలో కొందరు తమ ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందనే ఉద్దేశంతో గన్‌లైసెన్స్ పొందారు. ప్రస్తుతం జిల్లాలో ఫ్యాక్షన్ సద్దుమణిగింది. అదేవిధంగా ఒకప్పుడు నక్సలిజం కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ క్రమంలో ఆయా కారణాలు చూపిస్తూ గతంలో కొందరు గన్‌లైసెన్స్ పొందినా.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఫ్యాక్షనిజం, నక్సలిజం కనుమరుగయ్యింది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ప్రత్యేకంగా 1+1 తక్కువ కాకుండా, వారి స్థాయిని బట్టి గన్మెన్లను కేటాయిస్తోంది. ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వారికీ గన్మెన్లను మంజూరు చేస్తున్నారు. వీరే కాకుండా కొత్తగా లైసెన్స్ కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు అవుతుండటం చూస్తే గన్ సంస్కృతికి పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. గన్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావిస్తుండటం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. సూక్ష్మ పరిశీలన తర్వాతే మంజూరు గతంలో గన్ లైసెన్స్‌ని అప్పటి పరిస్థితుల ఆధారంగా ఇచ్చేవారు. ప్రస్తుతం జిల్లా పరిస్థితులు పూర్తిగా మారడంతో లైసెన్స్ మంజూరులో అధికారులు సూక్ష్మ పరిశీలన చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి నేపథ్యం, వారికి నిజంగా ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందా? వారు చూపుతున్న కారణంలో నిజం ఎంత? గన్ లేకపోతే ప్రాణ హాని ఉంటుందా? పోలీసు ప్రొటెక్షన్ కలిగి ఉన్నారా? ఒకవేళ ఇప్పటికే కలిగి ఉన్న లైసెన్స్‌కి నిర్ణీత గడువులో రెవెన్యూవల్కి దరఖాస్తు చేసుకున్నారా? ఇలా దరఖాస్తుదారునికి సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అన్ని విధాల సంతృప్తి చెందితేనే లైసెన్స్ మంజూరు చేయడం.. లేదా రెన్యూవల్ చేయడం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లైసెన్స్‌లకు రెకమండ్ చేయట్లేదు గన్ లైసెన్స్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రెకమెండ్ చేయడం లేదు. రెన్యూవల్కి వచ్చిన దరఖాస్తులను విచారణకు పంపుతాం. కొందరు లైట్ థ్రెట్ ఉందంటున్నారు. అందులో వారు పేర్కొన్న కారణాల ప్రకారం థ్రెట్ ఉందా లేదా అనేది పరిశీలిస్తాం. ఆ తర్వాతే రెన్యూవల్ చేస్తాం. నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత లైసెన్స్‌లకు రెకమెండ్ చేయలేదు. బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్స్ చాలా మంది ఉన్నారు. వారికి మాత్రమే రెకమెండ్ చేస్తున్నాం. – జి.వి.జి.అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ -
పాతక్షక్షల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ
♦ కత్తులతో పరస్పర దాడి ♦ ఇద్దరికి తీవ్రగాయాలు: జీజీహెచ్‌కు తరలింపు గుంటూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో నరుక్కున్న ఘటన శుక్రవారం మండలంలోని గోరంట్లలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరంట్ల గ్రామంలోని ఓ ఆలయ కమిటీ నిర్వహణపై రెండు వర్గాల మధ్య వివాదం ఉండేది. గురువారం వినాయక ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనోత్సవానికి రెండో వర్గం వ్యక్తులు వచ్చారని ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో రెండో వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి జరిగింది. దాడిపై రెండో వర్గం వారు శుక్రవారం ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శుక్రవారం రాత్రి తిరిగి వివాదం రాజుకుంది. గ్రామంలోని రైస్‌మిల్ సెంటర్లో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు వాదనకు దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసి ఒక వర్గానికి చెందిన జుజ్జులూరి లక్ష్మీనారాయణ, జుజ్జులూరి విజయరాజు, వేముల రాణి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గ్రామస్తులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై మండల నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ వాహనం ఎదుటే వివాదం.. ? గురువారం ఫిర్యాదు చేసిన ఘటనలో విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన పోలీస్ వాహనం ఎదుటే వివాదం జరిగినట్లు సమాచారం. గురువారం దాడిచేసి గాయపరిచినవారిని పట్టించేందుకు పోలీసులతో పాటు సెంటర్‌కు వచ్చిన వ్యక్తులపై ప్రత్యర్థులు పోలీసుల ఎదుటే కత్తులతో దాడిచేసి గాయపరిచారని తెలిసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా పోలీసులు చూసీచూడన్నట్లు ఉన్నారని, దీంతోనే దాడిచేసి గాయపరిచిన ఐదుగురు వ్యక్తులు పరారయ్యారని సమాచారం. గురువారం దాడి జరిగిన తర్వాత ఇరువర్గాలను శుక్రవారం ఉదయం స్టేషన్‌కు పిలిపించి విచారించి కేసు నమోదు చేస్తే దాడులు జరిగేవి కాదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
ఫ్యాక్షన్ నిర్మూలన మొదటి ప్రాధాన్యత
- కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఘట్టమనేని శ్రీనివాస్ కర్నూలు : ఫ్యాక్షన్ నిర్మూలనే నా మొదటి ప్రాధాన్యత... ఎర్ర చందనం స్మగ్లింగ్, మట్కాపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ అన్నారు. కర్నూలు బి.క్యాంప్‌లోని కార్యాలయంలో బుధవారం ఆయన డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు సిల్వర్‌జుబ్లీ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నాని, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. పాలనాపరమైన విషయాల్లో ఎస్పీలకు అండగా ఉంటానన్నారు. అనంతరం ఎస్పీ గోపీనాథ్ జట్టి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు, ఇతర అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఘట్టమనేని ఉద్యోగ ప్రస్థానం... ఘట్టమనేని శ్రీనివాస్ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్లు. 1986లో కర్నూలు జిల్లా లొద్దిపల్లెలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షలో మంచి ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో డీఎస్పీగా నియమితులయ్యారు. అనంతరం ప్రొద్దుటూరు, కడప డీఎస్పీగా, హైదరబాదులో ఏసీపీగా, అడిషనల్ డీసీపీగా, మెదక్‌లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. శాంతిభద్రతలు, ఆపరేషన్లలో భాగంగా ఆఫ్రికా, యూఎస్ఏ, స్వీడన్ దేశాలకు వెళ్లారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం రూరల్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై డీఐజీగా కర్నూలుకు వచ్చారు. -
చదువుతోనే ఫ్యాక్షన్ అంతం
- ఎస్పీ ఆకే రవికృష్ణ - తండ్రి జ్ఞాపకార్థం కప్పట్రాళ్ల విద్యార్థులకు నగదు బహుమతులు కర్నూలు: ప్రతి ఒక్కరు చదువుకొని ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని దత్తత గ్రామం కప్పట్రాళ్లకు చెందిన హైస్కూల్ విద్యార్థులకు ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. కప్పట్రాళ్ల హైస్కూలులో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రంగడు (9.3), శివగణేష్ (9.3), వలిబాషా (9.2) విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతిని కుటుంబ సమేతంగా ఎస్పీ అందజేశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన 57 మంది విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులతో ఎస్పీ సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో సివిల్స్ పరీక్షలపై విద్యార్థులకు పలు విషయాలు వివరించి అవగాహన కల్పించారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే గ్రూప్స్‌కు ప్రిపేర్ కావచ్చన్నారు. ఎలా చదవాలి, ఏ విధంగా సమర్థం కావాలి, ఏయే పుస్తకాలు చూసుకోవాలి, ఎలా రాయాలనే విషయాలను విద్యార్థులకు వివరించారు. తాను కూడా ప్రభుత్వ స్కూలులోనే చదివానన్నారు. కప్పట్రాళ్ల హైస్కూల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న 50 మంది విద్యార్థులకు టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమంలో భాగంగా యోగా, నైతిక విలువలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అబ్బాయిలకు ఇండస్ స్కూలులో, అమ్మాయిలకు మాంటిస్సొరి స్కూలులో వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బేబిరాణి, ఇంచార్జి మరియానంద, అధ్యాపకుల బృందం ఆసిఫ్ అలీ, ఆంజనేయులు, చక్రవర్తి, శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రామాంజలి తదితరులు పాల్గొన్నారు. -
నిష్పక్షపాతంగా విచారణ
– చెరుకుల పాడు గ్రామంలో ఎస్పీ పర్యటన – నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ – వెల్దుర్తి ఎస్ఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు వెల్దుర్తి రూరల్: చెరుకులపాడు నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు హత్య కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. ప్రత్యేక విచారణ అధికారిగా డోన్ డీఎస్పీ బాబా ఫకృద్దీన్‌ను నియమించామన్నారు. ఆదివారం ఆయన చెరుకులపాడు గ్రామంలో పర్యటించారు. హత్య అనంతరం గ్రామ పరిస్థితులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని హతుడు సాంబశివుడు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నారాయణరెడ్డి అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.అలాగే నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి, కుమారుడు మోహన్‌రెడ్డిలను వారి స్వగృహానికెళ్లి పరామర్శించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. హత్యకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్కెచ్‌లు వేశారు.. ఫోన్లలో ఎవరి ద్వారా సమాచారమందుకున్నారు.. ఎవరికి సమాచారమందించారు..తదితర అన్ని కోణాల్లో విచారణ జరుపుతామన్నారు. నిందితుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టుకు అప్పీలు చేసినట్లు చెప్పారు. హత్యకు సంబంధించి వివరాలు, సమాచారం తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా తన నంబరు 9440795500ను సంప్రదించాలన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హత్యలతో రక్తం చిందించడం మానవ ధర్మం కాదని, ప్రతీ మనిషి తన రక్తాన్ని ఆపదలో ఉన్న ఇతరులకు దానం చేయడానికి వాడాలని సూచించారు. ఎస్ఐపై శాఖా పరమైన చర్యలు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి అలసత్యం ప్రదర్శించిన వెల్దుర్తి ఎస్ఐ తులసీనాగప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎస్ఐపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ చేపట్టాలని డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు తాను ఐదు మెమోలు ఎస్ఐకు జారీ చేసినట్లు డోన్ డీఎస్పీ.. ఎస్పీకి తెలిపారు. ఫిర్యాదులివీ.. నారాయణరెడ్డి హత్యకు పరోక్ష కారణం ఎస్ఐ తులసీప్రసాదేనని ప్రదీప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తన భర్త హత్యలో కేఈ శ్యాంబాబుతో పాటు ఎస్ఐ పాత్ర ముఖ్యంగా ఉందంటూ కంగాటి శ్రీదేవి ఎస్పీ ఎదుట వాపోయారు. తాను దళిత మహిళా సర్పంచ్, గర్భవతినని తెలిసినా గ్రామంలో పరిస్థితులపై పిర్యాదుకు వెళితే స్టేషన్లోనే అవమానాలకు గురిచేసి, అసభ్యంగా మాట్లాడాడని సర్పంచ్ అపర్ణ, ఆమె భర్త శివ ఫిర్యాదు చేశారు. సివిల్ పంచాయితీలు చేస్తూ పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి, అగస్టీన్, ప్రశాంత్ తదితరులు ఎస్ఐపై ఆరోపణలు గుప్పించారు. -
ఫ్యాక్షన్ నిర్మూలనతోనే పారిశ్రామికాభివృద్ధి
గవర్నర్ నరసింహన్ అనంతపురం సెంట్రల్ : ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే ఏ ప్రాంతమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. తొలుత జిల్లా స్థితిగతులు, నేరాలు, కారణాల గురించి ప్రొజెక్టర్ ద్వారా ఎస్పీ రాజశేఖరబాబు వివరించారు. మూడేళ్ల నుంచి నేరాలు తగ్గుముఖం పట్టాయని, జిల్లాకు చెడ్డపేరు తెస్తున్న ఫ్యాక్షన్ హత్యలు గత రెండేళ్లలో ఒక్కటీ జరగలేదని తెలిపారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ఒక ప్రాంతం పారిశ్రామికంగా, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే భద్రత ముఖ్యమన్నారు. భద్రతకు భరోసా, ప్రశాంత వాతావరణం కల్పించేది పోలీసులేనన్నారు. టెక్నాలజీని వాడుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని సూచించారు. నేర పరిశోధనల్లో నైపుణ్యత కనబరిచి దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల బాధలు, సమస్యలను సావధానంగా విని.. వారికి భరోసా కల్పించాలన్నారు. పోలీసులు చట్టానికి అతీతులనే భావన పోవాలని హితవుపలికారు. యంత్రాలుగా మారిపోరాదని, కుటుంబ సంక్షేమం, పిల్లల అభివృద్ధికి తగిన సమయం కేటాయించాలని సూచించారు. జిల్లాలో పోలీసు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుండడం అభినందనీయమన్నారు. జిల్లాకేంద్రంలో పునరుద్ధరించిన కన్వెన్షన్‌హాలు, కోదండరామాలయం, నర్సరీ, కమాండ్కంట్రోల్ తదితర నిర్మాణాలు భేషుగ్గా ఉన్నాయన్నారు. సమావేశంలో కలెక్టర్ వీరపాండియన్, అదనపు ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీలు, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌కు ఘన వీడ్కోలు అనంతపురం అర్బన్ : గవర్నర్ నరసింహన్ జిల్లాలో రెండు రోజుల పర్యటనను ముగించుకుని మంగవారం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ రాజశేఖర్‌బాబు, అనంతపురం ఆర్డీఓ మలోల, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. జ్ఞాపిక కూడా అందజేశారు. -
పనిచేయకుంటే నిలదీయండి
- కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు పనిచేయకుంటే నీలదీయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కర్నూలు వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాక్షన్‌కు దూరంగా అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ఏ పని కావాలన్నా తనను కాలవాలని సూచించారు. కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల్లోని విబేధాలను పరిష్కరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కేంద్రమంత్రి సుజనా చౌదరికి సూచించారు. అంతకముందు తెలుగు యువత ఆధ్వర్యంలోమంత్రిని సన్మానించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బీటీనాయుడు, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ఎమ్మెల్యే మణిగాంధీ, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నందికొట్కూరు ఇన్చార్జీలు మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడ్, మాండ్ర శివానందరెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జెడ్పీ వైఎస్ చైర్మన్ పుష్పావతి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, నాగేశ్వరయాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి.. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా కర్నూలు చేరుకున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి కలెక్టరేట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా సూదేపల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పల్లెల్లో ఫ్యాక్షన్‌ను ఉసిగొల్పుతున్నారు
-
పల్లెల్లో ఫ్యాక్షన్‌ను ఉసిగొల్పుతున్నారు
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు ఫ్యాక్షన్‌ను ఉసి గొల్పుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన వేంపల్లి మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రామిరెడ్డి ఎదుగుదలను సహించలేకనే టీడీపీ వాళ్లు ఆయనను హత్య చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అండతోనే ఈ దురాగతానికి ఒడిగట్టారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ''చంద్రబాబు సిగ్గుతో తల వంచుకోవాలి. రాజకీయాలు చేసేటపుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలి. ప్రజలు మనకు తోడుగా ఉండాలంటే వాళ్ల గుండెల్లో స్థానం సంపాదించాలి గానీ, రాజకీయమంటే చంద్రబాబు నిజంగా ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో దారుణంగా ఈ మాదిరిగా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించే కార్యక్రమాన్ని దగ్గరుండి చేయిస్తున్నారు. రామిరెడ్డి కుటుంబం ఉసురు ఆయనకు తగులుతుంది. ఒక మనిషి చనిపోతే ఇంతమంది బాధపడేవాళ్లు ఉన్నారంటే.. వాళ్లందరి ఉసురు చంద్రబాబుకు తగలకుండా పోదు. రాజకీయం అంటే హత్యలు, ఫ్యాక్షనిజం కాదు, మనసులలో స్థానం సంపాదించుకోవడమేనని చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థం కావాలి, దేవుడు మొట్టికాయలు వేయాలని కోరుతున్నా.'' -
ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకోం
ధర్మవరం : ‘అధికార పార్టీ నాయకుల ఆగడాలు అడ్డుకుంటాం. అలాగని ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తామంటే చూస్తూ ఊరుకోమని’ వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కనగానపల్లి మండలం యలక్కుంట్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణకు వెళ్లిన ఆయనపై అక్రమ కేసులు బనాయించారు. ఈ కేసులో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పొంది, జామీన్లను అందజేసేందుకు ధర్మవరం కోర్టుకు శుక్రవారం వచ్చారు. రాప్తాడు, ధర్మవరం నియోజవకర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. న్యాయమూర్తికి జామీన్లు అందజేసిన అనంతరం తోపుదుర్తి మీడియాతో మాట్లాడారు. నాలుగునెలల వ్యధిలోనే మూడు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ నాయకులు చట్టాలను చేతిలోకి తసుకుని, అధికారులను శాసిస్తున్నారని, పోలీసులు ఉన్నతాధికారులను మంత్రుల అనుచరులు, వారి డ్రైవర్లు కూడా బెదిరిస్తున్నారన్నారు. తమ దందాలకు వంతపాడాలని ఒత్తిడికి గురిచేస్తూ నీతి నిజాయితీగా పనిచేసే అధికారులను కూడా నిస్సహాయస్థితిలోకి నెట్టివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖరరెడ్డి హయంలో జిల్లాలో ఫ్యాక్షన్‌ను సమూలంగా నిర్మూలించేందుకు స్టీఫెన్ రవీంద్ర లాంటి నిజాయితీగల ఆఫీసర్లను నియమించారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు కేబుల్ సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రసారం చేసే ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం దారుణమన్నారు. మీడియా ప్రతినిధులు కూడా ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించేలా వ్యవహరించాలి కానీ, వ్యక్తులను ఆరాధించడం.. వారిని హీరోలుగా చిత్రీకరించడం తగదన్నారు. కౌన్సిలర్ నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాప్తాడు, సీకేపల్లి, మండల కన్వీనర్లు రామాంజినేయులు, గోవిందరెడ్డి, కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
నలుగురు టీడీపీ నేతలకు జీవిత ఖైదు
ముద్దనూరు: వైఎస్సార్ జిల్లా ముద్దునూరు మండలంలో ఫ్యాక్షన్ గ్రామంగా పోలీసుల రికార్డులకెక్కిన గంగాదేవిపల్లెకు చెందిన టీడీపీ నేతలు(మాజీ మంత్రి పీఆర్ వర్గీయులు) వెన్నపూస యుగంధర్‌రెడ్డి, వెన్నపూస గంగాధర్‌రెడ్డి, వెన్నపూస చిన్నరెడ్డి, వేమిరెడ్డి బాలచెన్నారెడ్డి అలియాస్ బాలుడులకు ఓ హత్యకేసులో ప్రొద్దుటూరు సెషన్స్ కోర్టు సోమవారం జీవిత ఖైదు విధించింది. ముద్దనూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అప్పటి ఆప్కాబ్ డైరక్టర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడైన పెద్దరెడ్డిని 2009 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన గంగాదేవిపలె ్లచీనీ తోటలో ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులైన 5 మందిలో నలుగురికి మేజిస్ట్రేట్ జీవితఖైదు విధించారు. మరో నిందితుడిపై కేసు కొట్టి వేశారు. -
ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ – ఘనంగా వాల్మీకి మహర్శి జయంతి ఉత్పవాలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి డీ హుసేన్‌సాహెబ్ అధ్యక్షతన ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వమించారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన అధికారులు, నాయకులు వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫాక్షన్ రాజకీయాలకు ఎంతో మంది బోయలు బలైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వాల్మీకి తన కుటుంబం, పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, త్వరలో పలు పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వాల్మీకి కులానికి చెందిన 10, ఇంటర్, డిగ్రీ చదివిన 500 మందికి వారికి వివిధ రంగాల్లో శిక్షణను ఇప్పించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వాల్మీకి జయంతి నాటికి రాష్ట్ర క్యాబినేట్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుందనే ఆశాభావాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్, బీసీ కార్పొరేషన్ ఈడీ కే లాలాలజపతిరావు, ఆర్డీఓ రఘుబాబు, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, సాంఘీక సంక్షేమశాఖ డీడీ యు ప్రసాదరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, పలు వాల్మీకి సంఘాలకు చెందిన నాయకులు ఎం సుభాష్ చంద్రబోస్, పద్మజానాయుడు, వలసల రామక్రిష్ణ, బుర్రా ఈశ్వరయ్య, బాల సంజన్న, గూడూరు గిడ్డయ్య, పులికొండన్న, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మాదన్న తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి నేత జూటూరు రమణ వాల్మీకి వేషాన్ని ధరించి ఆకట్టుకున్నారు. వీఆర్పీఎస్ నాయకులు..బీవై రామయ్య..కలెక్టర్ విజయమోహన్ ను సన్మానించారు. వాల్మీకిలందరూ నా బంధువులే: ఎస్పీ జిల్లాలోని 5 లక్షల మంది వాల్మీకులు తన బంధువులేనని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న నేపథ్యంలో వాల్మీకులు తనకు చాలా దగ్గరయ్యారన్నారు. వాల్మీకులకు ఎలాంటి కష్టం వచ్చినా తనకు ఫోన్ చేయాలని, లేదా తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని కోరారు. గతం కంటే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగు పడిందన్నారు. ఎసీ్ట రిజర్వేషన్ సాధనతోనే మార్పు: బీవై రామయ్య వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేరుస్తేనే వారి జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. రాష్ట్రంలోని వాల్మీకుల పట్ట ప్రాంతీయ విబేధాలు ఉన్న కారణంగా ఎనిమిది జిల్లాల్లోని వాల్మీకులు విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులను ఎసీ్ట జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి నేడు నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్‌కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రత్యేక నిధులు రావడం లేదన్నారు. -
కత్తులు వదిలేసి.. చేతులు కలిపి
– లోక్‌అదాలత్‌లో దుర్వేశి, చిందుకూరు ఫ్యాక్షన్ నేతలు రాజీ – ప్రమాణం చేయించిన డీఎస్పీ – పోలీస్, న్యాయమూర్తుల చొరవ నంద్యాల: దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఠాల పోరులో కొందరు బలి కాగా.. మరికొందరు జైలు పాలయ్యారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఫ్యాక్షన్‌తో జీవితాలు నాశనమవుతాయే కాని సాధించిందేమీ లేదని తెలుసుకున్న ముఠా నేతలు రాజీ పడ్డారు. కత్తులను పక్కకు విసిరేసి, చేతులు కలిపారు. ఇకపై చంపుకోవడం, నరుక్కోవడం వద్దని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి మోహన్‌రావు, డీఎస్పీ హరినాథరెడ్డి, న్యాయమూర్తులు పోలీసు అధికారి సమక్షంలో గడివేముల మండలంలోని ఫ్యాక్షన్ గ్రామాలైన చిందుకూరు, దుర్వేశి గ్రామాల్లోని ఇరువర్గీయులు రాజీపడ్డారు. ఇకపై ఎలాంటి పగ, ప్రతీకారాలకు వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశారు. గడివేముల మండలం చిందుకూరులో గతంలో సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. గడివేములలో ఒక రెవెన్యూ అధికారి ఇంట్లో ఉన్న వెంకటేశ్వరరెడ్డిపై వెంకటకృష్ణారెడ్డి వర్గం దాడి చేసి హత్య చేసినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ హత్య జరిగిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వెంకటేశ్వరరెడ్డి హత్యా అనంతరం ఆయన భార్య అనసూయమ్మ రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా గెలిచారు. తర్వాత ఈమె వర్గీయులు దారి కాచి వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురిని హత్య చేశారు. వెంకటేశ్వరరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టి వేసింది. కాని తనదనంతరం జరిగిన హత్య కేసుల్లో కొంత మంది నిందితులు జీవిత ఖైదు శి„క్షను కూడా అనుభవించి, బయటకు వచ్చారు. దుర్వేశి గ్రామంలో గతంలో సర్పంచ్ శివారెడ్డిని నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ జంక్షన్ సమీపంలో ప్రత్యర్థులైన దుర్వేశి గొల్ల కృష్ణుడు వర్గీయులు హత్య చేశారు. దీని ప్రతీకారంగా శివారెడ్డి వర్గీయులు జరిపిన ప్రతీకార దాడుల్లో 8 మంది హత్యకు గురయ్యారు. ఈ కేసుల్లో కూడా కొంత మంది శిక్షను అనుభవించారు. పోలీసు, న్యాయమూర్తుల సమక్షంలో రాజీ: ఫ్యాక్షన్‌తో అయిన వారికి దూరమై, జైలు పాలై కొంత మంది నరకాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరికొందరు ఆర్థికంగా చితికి పోయి, పేదరికం కష్టాలను అనుభవిస్తున్నారు. దీంతో దుర్వేశి గ్రామానికి చెందిన ప్రత్యర్థులు గొల్ల కృష్ణుడు, దామోదర్‌రెడ్డి వర్గీయులు కొందరు చిందుకూరు గ్రామంలోని అనసూయమ్మ, వెంకటకృష్ణారెడ్డి వర్గీయులు వీరు రాజీ పడాలని లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. జిల్లా జడ్జి మోహన్‌రావు, సబ్ జడ్జి నాగేశ్వరరావు, జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శైలజ, డీఎస్పీ హరినాథరెడ్డి సమక్షంలో వీరు తాము రాజీ పడుతున్నామని చెప్పారు. ఇకపై ఎలాంటి గొడవలకు, ప్రతీకారాలకు వెళ్లమని, ప్రశాంత జీవితాన్ని గడుపుతామని చెప్పారు. డీఎస్పీ హరినాథరెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఫ్యాక్షన్ గ్రామాల నేతలు రాజీ కావాలని, ప్రశాంత జీవితాన్ని గడపుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
మనది విలన్ టైప్... అందుకే...
ఉత్తమ విలన్ ఇది నా రాజ్యమే...ఇక్కడ పగలేగానీ ప్రేమలుండవు. కక్షలేగానీ కనికరాలుండవు ఒక్కసారి టైమ్‌మిషన్‌లోకి వెళ్లి 1991లో ఆగండి. దగ్గర్లో ఉన్న థియేటర్లో ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా చూడండి. ఆ సినిమాలో పొట్ట చెక్కలయ్యేలా నటించే నటుల్లో జయప్రకాష్‌రెడ్డి కూడా ఉంటారు. ఆయన ఊత పదం ‘తూ....చ్’ ‘నీ యెంకమ్మ’లాగే బాగా పాప్లర్ అయింది. పె....ద్దగా నవ్వి... ‘మనది విలన్ టైప్. అందుకే అలా నవ్వాను.... తూ....చ్’ అనే డైలాగ్ విసురుతారు. ఇంకాస్త వెనక్కి వెళ్లండి. సరిగ్గా 1988లో ఆగండి. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా మరొక్కసారి చూడండి. జయప్రకాష్ ఎస్పీగా కనిపిస్తారు. ఆయన డైలాగ్ ఒకసారి వినండి... ‘హ్యాండ్సప్... చేతుల్లో ఉన్నది కింద పెట్టు. చేతులు ముందుకు పెట్టు. చెడుగుడు ఆడేస్తా....’ జయప్రకాష్‌రెడ్డి పేరుకి విలన్‌గా కనిపించినా... ఆయన డైలాగ్‌లకు భయం కంటే ముందు నవ్వే వస్తుంది. ఆయన విలనిజంలో కామెడీ అంతర్లీనమై కితకితలు పెడుతుంది. అయితే... ఇదంతా ఒకప్పటి సంగతి. సరిగ్గా చెప్పాలంటే... ‘ప్రేమించుకుందాంరా’ సినిమా ముందు సంగతి. ఈ సినిమా తరువాత... జయప్రకాష్‌రెడ్డిని తెర మీదే కాదు... తెర బయట చూసి కూడా భయపడ్డారు చాలా మంది! జయప్రకాష్‌కు చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడడం అంటే తెగ పిచ్చి. రొటీన్‌గా అయితే ‘ఇదేమి పిచ్చి? చదువుకోకపోతే ఆడుక్కు తింటావు. నాటకాలు అన్నం పెట్టవు’ అనే డైలాగు కోపంగా వినిపించాలి. కానీ ఆ ఇంట్లో మాత్రం ఎలాంటి డైలాగ్ వినిపించలేదు. జయప్రకాష్‌రెడ్డి నాన్నగారు పోలీసు అధికారి. నటుడు కూడా. ఆయనలోని నటుడు కొడుకులోని నటుడిని ఎక్కడా నిరాశ పరచలేదు. కొడుకుతో కలిసి స్వయంగా నాటకాలు వేశాడు ఆ తండ్రి! నాటకాలు వేసినంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయలేదు జయప్రకాష్. చదువులోనూ ముందుండేవాడు. డిగ్రీ... ఆ తరువాత టీచర్ ట్రైనింగ్... ఆ తరువాత లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అంతమాత్రాన... ఆయనలోని నటుడు ఊరుకుంటాడా? పాఠాలు పాఠాలే... నాటకాలు నాటకాలే! ఒకసారి నల్లగొండలో జయప్రకాష్‌రెడ్డి బృందం ‘గప్‌చుప్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి నారాయణరావుకు జయప్రకాష్ నటన బాగా నచ్చింది. ఇదే విషయాన్ని రామానాయుడుతో చెప్పారు. రామానాయుడు ఈ నాటక బృందాన్ని హైదరాబాద్‌కు పిలిపించుకొని ‘గప్‌చుప్’ చూశారు. ఆయనకు కూడా జయప్రకాష్ రెడ్డి నటన బాగా నచ్చింది. అలా జయప్రకాష్‌కు ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. అయితే జయప్రకాష్‌కు పెద్దగా పేరు రాలేదు. కెరీర్ ఊపందుకోలేదు. అటు చూస్తేనేమో... అప్పులు అంతకంతకు పెరిగి పోతున్నాయి. బాగా ఆలోచించుకున్న తరువాత... బ్యాక్ టు పెవిలియన్ అని డిసైడ్ అయ్యారు. లెక్కల మాస్టారుగా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికి... వెంకటేష్ ‘ప్రేమించుకుందాం రా’ సినిమాకు విలన్ కోసం వెదుకుతున్నారు. బాలీవుడ్లో ఎవరైనా ఉన్నారా? అని కూడా వెదుకుతున్నారు. రామానాయుడు మాత్రం జయప్రకాష్‌రెడ్డి పేరు చాలా గట్టిగా సూచించారు. అప్పటికి జయప్రకాష్ స్టార్ విలన్ కాదు... ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. టైమ్ అంటే ఇదేనేమో! ‘‘పొరపాటున కూడా కామెడీ కనిపించకూడదు. ఔట్ అండ్ ఔట్ సీరియస్‌గా చేయాలి’’ అని చెప్పాడు డెరైక్టర్ జయంత్. సీరియస్‌గా కాదు... ప్రేక్షకులు వణికిపోయేలా విలనిజాన్ని ప్రదర్శించి ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నారు జయప్రకాష్. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంత ఎత్తు, భారీ కాయం, పెద్ద మీసాలు... అమ్మో జయప్రకాష్‌రెడ్డి! తూ...చ్ అని తెగ నవ్వించిన జయప్రకాష్‌రెడ్డి ఎంత పెద్ద విలన్‌గా ఎదిగారు... ఎంతలా భయపెట్టారు!! -
అక్కడేమైనా ఫ్యాక్షన్ గొడవలున్నాయా?
– ముచ్చుమర్రిలో 144 సెక్షన్ విధింపుపై బైరెడ్డి ప్రశ్న – పుష్కర నిధుల్లో 90శాతం.. నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణ జూపాడుబంగ్లా: కృష్ణాపుష్కరాలకు సంబంధించి చేపడుతున్న పనులు పూర్తిగా అవినీతి మయమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాలయ నిధులు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా 90శాతం నేతల జేబుల్లోకి వెళ్తుండగా పదిశాతం మాత్రమే పనులకు వెచ్చిస్తున్నారని విమర్శించారు. జూపాడుబంగ్లా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాపుష్కరాలకోసం కేటాయించిన నిధుల్లో అత్యధికం కోస్తాంధ్రకే విడుదల చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో కేవలం కంటి తుడుపు చర్యగా నిధులు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. పనులు నాసీరకంగా చేపట్టడంతో నిర్మించిన వారం రోజులకే కృష్ణార్పణమయ్యాయన్నారు. పుష్కరఘాట్ల నిర్మాణంలో ముందుచూపు లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం, కలెక్టర్ ఇంటి నుంచి తెచ్చినవైతే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. 144 సెక్షన్ ఎందుకు.. ముచ్చుమర్రిలో పుష్కరఘాట్ వద్ద 144 సెక్షన్ విధించడంపై బైరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఏమైనా మతపరమైన గొడవలు ¯ð లకొన్నాయా, ఫ్యాక్షన్ తగాదాలు ఏర్పడ్డాయా అని ప్రశ్నించారు. అలాంటివేమీ లేనప్పుడు 144 సెక్షన్ ఎందుకు విధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆచార వ్యవహారాల జోలికి వస్తే సీఎం చంద్రబాబుకు తగినగుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముచ్చుమర్రి గ్రామంలో ఎవరికి ఏమిజరిగినా అందుకు బాబే బాధ్యుడన్నారు. ఎవ్వరడ్డుకున్నా ఈనెల 12న వెయ్యిమంది ముత్తయిదువులతో గ్రామంలో విగ్రహ ఊరేగింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైఫూద్దీన్, రషీద్మియ్య, ఉసేనయ్య, శ్రీనివాసరెడ్డి, బాలనారాయణ, చెక్కరసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
కక్షలను ప్రేరేపిస్తున్న పరిటాల వర్గం
కనగానపల్లి: వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ కక్షలను ప్రేరేపించేందుకు పరిటాల వర్గం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం అనంతపురంలోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తన సొంత రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి పరిటాల సునీత ఎలాంటి కృషి చేయలేదని అన్నారు. ఆగస్టు నాటికి హంద్రీనీవా జలాలను ఈ ప్రాంతంలోని 1,160 చెరువులకు అందిస్తామంటూ హామీలు గుప్పించిన మంత్రి... తన మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. ఈ విషయం పక్కదారి పట్టించేందుకు మంత్రి తనయుడు శ్రీరాం, అనుచరులు పథకం ప్రకారం నియోజకవర్గం లో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం మాదిరి గానే నియోజకవర్గాన్ని మొత్తం సమస్యాత్మక ప్రాంతంగా మార్చి తమ పబ్బం గడుపుకునేందుకు పథకం వేశారని ఆరోపించారు. అధికార టీడీపీ వైఫల్యాలపై ప్రజలు చైతన్యవంతులై ఎక్కడికక్కడ నిలుదీస్తుంటే సహించలేక ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు పోలీసులను ఉపయోగిస్తున్నారని, ఇందుకు ధర్మవరం డివిజన్లోని పోలీస్ అధికారులు అండగా నిలవడం శోచనీయమని అన్నారు. పరిటాల వర్గీయుల దురాగతాలకు చెక్ పెట్టేందుకు రాప్తాడు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. -
ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం
ఏ చిన్న ఘటన జరిగినా సహించేది లేదు పోలీసులకు డీఐజీ, ఎస్పీ హెచ్చరిక అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. అనంతపపురం రుద్రంపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల నేపథ్యంలో ఎస్పీ రాజశేఖరబాబుతో కలసి స్థానిక పోలీస్‌కాన్ఫరెన్స్ హాల్లో అనంతపురం సబ్‌డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఏ చిన్న ఘటన జరిగినా సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సబ్ డివిజన్లోని ఫ్యాక్షనిస్టుల గురించి ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై నిత్యం నిఘా ఉంచాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని తరచూ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని సేకరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. సమాజంలో అరాచకాలు సృష్టించే వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా రౌడీయిజం జిల్లాలో ఎక్కడా కన్పించరాదన్నారు. ప్రశాంతతకు భంగం కలిగించే రౌడీషీటర్లను స్టేషన్లకు పలిపించి తీవ్రంగా హెచ్చరించాలని సూచించారు. భూ కబ్జాదారులపై నిఘా వేయాలని, బైండోవర్లు, కౌన్సెలింగ్‌లు చేపట్టాలన్నారు. రక్షక్, బ్లూకోట్స్ సహా టెక్నాలజీని ఉపయోగించి కేసుల్లో పురోగతి సాధించాలని సూచించారు. అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ గంగయ్య, డివిజన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు. -
టీడీపీలో భగ్గుమన్న ఫ్యాక్షన్
ఇద్దరు దారుణహత్య సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం అనుచరులు, టీడీపీ నాయకులు గోపీనాయక్, వెంకటేశ్ నాయక్‌లను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు. వెంటపడి వేటకొడవళ్లతో.. గోపీనాయక్, సోదరుడి కుమారుడు వెంకటేశ్‌నాయక్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై అనంతపురం నుంచి వారు నివాసముంటున్న చంద్రబాబు నాయుడు కాలనీ వైపు వెళుతున్నారు. రుద్రంపేట శివారులోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా మరో ద్విచక్రవాహనంపై వస్తున్న దుండగులు వీరి వాహనాన్ని ఢీకొట్టించారు. దీంతో వారు కిందపడిపోయారు. వెనుక ఆటోలో వచ్చిన ప్రత్యర్థులు వీరిని వెంబడించి వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందా రు. ఈ హత్యలకు పాల్పడిన అక్కులప్ప, అమర్ టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభాకర్ చౌదరి చంపించారు.. గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌లను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి చంపించారని వెంకటేశ్‌నాయక్ తండ్రి నారాయణనాయక్, గోపీనాయక్ సోదరుడు కుమార్‌నాయక్ ఆరోపించారు. -
కక్షతో ఖలీ పూజలు
ప్రపంచ ప్రఖ్యాత రెజ్లర్ ది గ్రేట్ ఖలీ కోలుకున్నాడు. ఆదివారం జరుగనున్న మ్యాచ్‌లో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులపై రివేంజ్ తీర్చుకోవడానికి అతను సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా శనివారం డెహ్రాడూన్‌లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించాడు. ఈ పూజలో ఖలీతోపాటు అతని అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ బల్దానీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఖలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఫైట్ సందర్భంగా రింగ్ బయట ఉన్న మరో ఇద్దరు విదేశీ రెజ్లర్లు కూడా వచ్చి ఖలీని కుర్చీతో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మొత్తం ముగ్గురు కెనడాకు చెందిన రెజ్లర్లు ఖలీని కుర్చీతో కొట్టడమే కాక బలంగా పంచ్లివ్వడంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందిన ఖలీ శనివారం కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ‘ది గ్రేట్ ఖలీ షో’లో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైట్ కోసం సిద్ధమవుతున్నాడు. తనపై దాడి చేసిన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటానని తన తదుపరి ఫైట్‌లో దెబ్బకు దెబ్బ కొట్టి తన సత్తా చాటుతానని ఖలీ ఇప్పటికే ప్రకటించాడు. 7.1 అడుగుల ఎత్తుతో చూడడానికే రెజ్లర్లకు దడ పుట్టించేలా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీసు ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించాడు. భారత్ పేరును రెజ్లింగ్ ద్వారా ఖండాతరాలు దాటేలా చేశారు. -
ప.గో. జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు
-
భయం.. భయం..!
ఆ గ్రామ ప్రజలకు కక్షలు.. కార్పణ్యాలంటే తెలియదు. ప్రజలంతా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవనం సాగించేవారు. ఏమైందో తెలియదుకానీ చేతబడి అనుమానం ఊరిలో చిచ్చు రేపింది. క్షణికావేశంతో ఓ వృద్ధుడిని రాళ్లతో కొట్టి చంపేలా చేసింది. ఇంతలో మృతుడి ఆత్మ తిరుగుతోందనే పుకార్లు జనాన్ని మరింత వణికిస్తున్నాయి. దీంతో కొందరు గ్రామంలోని ఆలయాల్లోనే నిద్ర చేస్తున్నారు. మరికొందరు గ్రామం నుంచి వలస వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. నెల రోజుల వ్యవధిలో తీవ్ర అశాంతి.. అలజడి రేగిన ఊరే గురజాల మండలంలోని గోగులపాడు. ఈ ఊర్లో ఈ దుస్థితికి కారణం మూఢ నమ్మకాలే అని తెలుస్తోంది. గుంటూరు :గురజాల మండలంలోని గోగులపాడు గ్రామంలో భయం రాజ్యమేలుతోంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కొందరు వ్యక్తులు చేతబడులు చేసి అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నారనే వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. దీనికి తోడు 20 రోజులుగా పది మంది మహిళల ఒంట్లోకి గ్రామ దేవతలు వచ్చి చేతబడి చేస్తున్న వారి అంతు చూడాలంటూ గ్రామస్తులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో 15 రోజులుగా 200 మంది గ్రామస్తులు పది బృందాలుగా ఏర్పడి రాత్రి సమయంలో గ్రామ పొలిమేరల్లో తిరుగుతూ చేతబడులు చేయకుండా కాపలా కాశారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ వెళ్లిన తరువాత శాంతి కోసం పూజలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇదిఇలా ఉండగా ఆదివారం గ్రామస్తులు ఊరి పొలిమేరల్లో తిరుగుతుండగా, క్షుద్ర పూజలు చేస్తూ ఇద్దరు కనిపించడంతో వారిని చితకబాదారు. దీంతో తమతో పూజలు చేయిస్తోంది గురవారెడ్డి అంటూ వారు చెప్పడంతో గ్రామస్తులంతా గురువారెడ్డి ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి రాళ్ళతో పళ్లు ఊడగొట్టి తీవ్రంగా కొట్టారు. ఇదే సమయంలో పూనకం వచ్చిన మహిళ అతన్ని హతమారిస్తేగాని ఊరికి మంచి జరగదని చెప్పడంతో విచక్షణ కోల్పోయిన గ్రామస్తులు గురువారెడ్డిని రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. దీంతో ఈ ఘటనకు కారణమైన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారెడ్డి మృతి చెందినప్పటికీ గ్రామ ప్రజల్లో మాత్రం భయం వీడలేదు. గురువారెడ్డి ఆత్మ గ్రామంలో తిరుగుతోందనే పుకార్లతో ప్రజలు చీకటి పడితే ఇళ్ల తలుపులు మూసుకుంటున్నారు. కొందరైతే దేవాలయాల్లో నిద్ర చేస్తూ పూజలు చేస్తున్నారు. మరికొందరు ఊరి నుంచి వలస వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. -
వరంగల్ లో ' రియల్ ' కక్షలు
-
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తులతో దాడి
-
రావెల చుట్టూ అసమ్మతి ఉచ్చు
మంత్రి రావెల వైఖరిపై మండిపడుతున్న ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలోని కార్యక్రమాలకు సహాయనిరాకరణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బాహాటంగా విమర్శలు రెండు వర్గాలు విడిపోయిన వట్టిచెరుకూరు మండలం జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్తో సైతం విభేదాలు రాష్ట్ర మంత్రి రావెలకు అసమ్మతివర్గం తలపోటుగా తయారైంది. తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోనే నాయకులు వేరు కుంపటి పెట్టటం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో తన అనుయాయులు అనుకుంటున్న వారు సైతం అసంతృప్తిగా ఉండడం ఆయనకు మింగుడుపడని అంశంగా మారింది. సెగ్మెంట్ అభివృద్ధి సమావేశంలో ఓ మహిళా నేత సీరియస్‌గా హెచ్చరించడం ఆయనపై ఉన్న ఆగ్రహానికి అద్దం పట్టింది. గుంటూరు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుపై మండల ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ నేతలకు పదవులు ఇప్పించే విషయంలో మంత్రి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదింట మూడు మండలాల్లో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో మంత్రి వ్యవహార శైలి ఆశాజనకంగా లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో చూస్తామంటూ ఒకరిద్దరు మండల ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. మరో వైపు అసమ్మతినేతల కుంపటికి పార్టీలోని మిగిలిన నేతలు మద్దతు పలుకుతూ రావెలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. మంత్రి వ్యతిరేక వర్గం సహాయ నిరాకరణ... మంత్రి రావెల వైఖరిని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల జెడ్పీటీసీలు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. వట్టిచెరుకూరు మండల అధ్యక్ష పదవి విషయంలో రావెలకు మండల నాయకులకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకుడు డొక్కలపూడి శ్రీహరిని కాదని అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న షేక్ హసన్ మాస్టారునే కొనసాగించడం వివాదంగా మారి మండలం రెండు వర్గాలుగా విడిపోయింది. మంత్రి వ్యతిరేక వర్గం నేతలు పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ సహాయ నిరాకరణ చేస్తున్నారు. గురువారం మండలంలోని ఇంజనంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ప్రారంభోత్సవ సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకోగా, మంత్రి తన వ్యతిరేక వర్గంపై పోలీస్ పవర్‌ను వినియోగించి ఓ కార్యకర్తను అదు పులో ఉంచే విధంగా చేశారు. ఇది కార్యకర్తలకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. చాపకింద నీరులా.... కాకుమాను జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జానీమూన్ కూడా రావెల పట్ల ఎడముఖం, పెడముఖంగా ఉన్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో కాకుమాను ఎంపీడీవో పావులూరి బాలమ్మను బదిలీ చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పట్టుబట్టగా, అందుకు మంత్రి ససేమిరా అనడంతో ఎంపీడీవో అక్కడే కొనసాగుతున్నారు. దీంతో అసమ్మతి పైకి కనిపించకపోయినప్పటికీ, చాపకింద నీరు లా పాకుతోందని ప్రజలు చెబుతున్నారు. దీనికితోడు చైర్పర్సన్ జానీమూన్ మంత్రి పుల్లారావు సూచనల మేరకు నడుచుకుంటున్నారని, పాలనాపరమైన అంశాల్లో జానీమూన్ పుల్లారావు సూచనలు, ఆదేశాలు పాటిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రూరల్‌లో తిరుగుబావుటా... గుంటూరు రూరల్ మండలంలో అయితే ఏకంగా ఆ మండల ప్రథమ పౌరురాలే మంత్రి రావెలపై తిరుగుబావుటా ఎగురవేశారు. త్వరలో జరగనున్న టీడీపీ జన చైతన్య యాత్రకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు. గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి పార్టీలో క్రియాశీలకంగా వ్యహరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంత్రి వర్గానికి కంటకింపుగా మారి, అవకాశం వచ్చిన ప్రతీసారీ ఆమెపై మంత్రికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లాపరిషత్ సమావేశపు హాలులో నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి రావెలకు, ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. జిల్లాపరిషత్ సభ్యులు కానివారు సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ లక్ష్మీకుమారి భర్తను ఉద్దేశించి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఒక్క లక్ష్మీకుమారి భర్త వరకు పరిమితం చేసి మిగిలిన మహిళా ప్రజాప్రతినిధుల భర్తలకు వర్తింప చేయకుండా సమావేశాన్ని కొనసాగించారు. దీంతో లక్ష్మీకుమారి మంత్రితో వాగ్వాదానికి దిగటమే కాకుండా త్వరలో జరగనున్న జనచైతన్య యాత్రలకు మండలానికి ఎలా వస్తారో చూస్తానని మంత్రిపై మండిపడ్డారు. అనుకూల వర్గం ఉన్నా లేదు ఉపయోగం.. నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో మంత్రికి అనుకూల వర్గం ఎక్కువగానే ఉన్నప్పటికీ, వారంతా ఆయన వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని భావిస్తే, అసలు అందుబాటులోనే లేకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించాలని, పట్టువిడుపు, సంయమనంతో వ్యవహరించాలని వారంతా మంత్రికి సూచిస్తున్నారు. -
కక్షలొద్దు.. ప్రగతే ముద్దు
కప్పట్రాళ్ల(దేవనకొండ) : కక్షలకు స్వస్తి పలికి అభివృద్ధి పథంలో నడవాలని కప్పట్రాళ్ల గ్రామస్తులకు కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్, ఎస్పీ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఈ గ్రామాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న విషయం విదితమే. గ్రామంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారుల దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన వారు బుధవారం గ్రామంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. జెడ్పీ నిధులు రూ.48.40 లక్షలతో అదనపు తరగతి గదులకు కలెక్టర్ భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజు ఆధ్వర్యంలో జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడారు. కప్పట్రాళ్లలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఎస్పీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. గ్రామస్తులు కూడా కక్షలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి సహకరించాలన్నారు. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో దేవనకొండ మండలంలో హంద్రీనీవా పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో వాటర్‌షెడ్ పనులు చేపట్టేందుకు రూ.2.30 కోట్లు నిధులు ఉన్నప్పటికీ రూ.13 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ నిధులో నాలుగు నెలల్లోపు పాంపాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచుతామన్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయిస్తామనపి హామీనిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతుండగా పాఠశాల విద్యార్థులు తమకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్.. కర్నూలు నుంచి బోర్వెల్ను తెప్పించి పాఠశాల ఆవరణలో బోరును వేయించారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణానికి జెడ్పీ నిధులను కేటాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. ఇక నుంచి గ్రామ ప్రజలు గతాన్ని పూర్తిగా వదిలి వేయాలని సూచించారు. కొత్త జీవితంలోకి మారాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, జిల్లాలోనే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు తనకు సహకరించాలన్నారు. గతంలో కక్షలకు బలైన కుటుంబాల దీనగాథను, అలాగే ఇటీవల కక్షల్లో కూరుకుపోయి జైలుపాలైన వారి కుటుంబాలను పరామర్శించానన్నారు. అప్పుడు తనకు చాలా బాధను కలిగిందన్నారు. అందుకే కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చానన్నారు. ప్రతి ఒక్కరూ శాంతిస్థాపనే లక్ష్యంగా ముందడుగు వేయాలని కోరారు. గ్రామంలో ప్రతి వీధిలో మొక్కలను నాటుకోవాలన్నారు. గ్రామంలో లక్ష మొక్కలు నాటడడమే లక్ష్యంగా ప్రజలు ముందుకు రావాలని కోరారు. పిల్లలను బాగా చదివించాలన్నారు. అలాగే బాగా చదివి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా కప్పట్రాళ్ల గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా కక్షల్లో చిక్కుకొని పోయారన్నారు. ఎన్నో కుటుంబాలు ఫ్యాక్షన్ కక్షలకు బలయ్యాయయన్నారు. అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎస్పీ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదన్నారు. జిల్లా వైద్యాధికారిణి నిరుపమ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్వీఎం ఈఈ ప్రతాప్‌రెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేస్, అడిషనల్ ఎస్పీ బాబురావు, డోన్ డీఎస్పీ పి.ఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటాసుబ్బారావు, ఎస్ఐ మోహన్కిశోర్, తహశీల్దార్ వెంకటశివరామయ్య, వాటర్‌షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్లు మిథున్చక్రవర్తి, మధుసూదన్, ఏపీఎం వీరన్న, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఉచ్చీరప్ప, గ్రామ ఉప సర్పంచ్ రాముడుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కక్షలు మానండి.. కలం పట్టండి
- దత్తత గ్రామం కప్పట్రాళ్లను సందర్శించిన ఎస్పీ ఆకే రవికృష్ణ - ‘మార్పు కోసం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సు - రెండు నెలల్లో గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల ఏర్పాటుకు కృషి కర్నూలు : కక్షలు మాని కలం పట్టి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం కప్పట్రాళ్ల ప్రజలు, విద్యార్థులకు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో ఎస్పీ శుక్రవారం కప్పట్రాళ్లను సందర్శించారు. గ్రామంలో పర్యటించి ప్రజలు, విద్యార్థులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు దశాబ్దాలుగా గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల వల్ల వైరి వర్గాల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్యాక్షన్ గొడవల్లో మృతి చెందిన కుటుంబాలకు, జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తుల కుటుంబాల పిల్లల చదువుల పట్ల సహాయ, సహకారాలు అందిస్తామని ఎస్పీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన సరస్వతీ పూజకు హాజరై విద్యార్థులకు, గ్రామ ప్రజలకు డయల్ 100 గురించి అవగాహన కల్పించారు. డయల్ 100 పేరుతో ముద్రించిన నోటు పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. గ్రామంలో ఏవైనా సమస్య ఉంటే డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. మార్పు కోసం పేరుతో గ్రామంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా ఓపెన్ చేసి అందులో ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం గ్రామంలో పర్యటించి మహిళలు యువతీ యువకులు, విద్యార్థులు, వృద్ధులతో వేరు వేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కక్షలు వీడి గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉంటూ స్మార్ట్ గ్రామంగా కప్పట్రాళ్లను తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంతమంది మహిళలు మరుగుదొడ్ల విషయం, విద్యార్థులు పాఠశాల గదుల విషయం ఎస్పీ దృష్టికి తీసుకురాగా కప్పట్రాళ్లలో వంద శాతం అక్షరాస్యత సాధించడానికి తనవంతు కృషి చేస్తానని, అలాగే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని మే నెలలోపు ఏర్పాటు చేసుకునేలా పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఫ్యాక్షన్ ప్రభావం వల్ల హైస్కూల్‌కు భవనం లేని గ్రామంగా కప్పట్రాళ్లను గుర్తించామని పై అధికారులతో చర్చించి భవనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు విడుదల చేసినప్పటికీ ఫ్యాక్షన్ కక్షల వల్ల ఆ నిధులు గ్రామానికి చేరువ కాలేదని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకురాగా హైస్కూల్ భవన నిర్మాణానికి తిరిగి నిధులు రాబట్టేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ‘ మార్పు కోసం’ పేరుతో కప్పట్రాళ్లలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్సును స్వయంగా పరిశీలిస్తున్న ఎస్పీ ఏమైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పా కక్షలు పెంచుకుని నష్టపోకూడదని మహిళలకు సూచించారు. దాదాపు రెండు గంటల పాటు గ్రామంలో సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. డోన్ డీఎస్పీ పీఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బారావు, కప్పట్రాళ్ల గ్రామ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ఐ మోహన్ కిశోర్, పోలీస్ సిబ్బంది ఎస్పీ వెంట గ్రామంలో పర్యటించారు. -
రాజధానిపై ప్యాక్షన్ పంజా
తాడేపల్లి రూరల్ :నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంపై ఫ్యాక్షన్ ముఠాలు కన్నేశాయా..? అనంతరపురం గూండాలు తాడేపల్లిలో అడుగుపెట్టారా..? భూ కబ్జాలకు తెర తీసి, ఉనికి చాటుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారా...? ఈ అనుమానాలు రాజధాని ప్రాంతమైన తాడేపల్లి ప్రజలను కలవరపెడుతున్నాయి. తాడేపల్లి బైపాస్‌లోని కొన్ని దుకాణాలు ఫ్యాక్షనిస్టులకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ జెండాలతో కొందరు హల్చల్ చేయడం వీటన్నిటికీ బలం చేకూర్చుతోంది. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా వెలుగొందిన అనంతపురం నేత ముఖ్య అనుచరులు కొందరు తాడేపల్లి ప్రాంతంలో పాగా వేసి ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు సీతానగరం, మహానాడు తదితర ప్రాంతాల్లో అసైన్డ భూములను ఇక్కడి చోటామోటా నాయకులు మార్చి, మార్చి అమ్ముతూ.. సొమ్ము చేసుకుంటూ ఉండేవారు. ఈ దందా ఆ ప్రాంతానికే పరిమితమైంది. అనంతపురం మాఫియా మాత్రం భూ దందాలు మొదలెట్టిందని, తాడేపల్లి డాక్టర్స్ ప్లాజా సమీపంలో ఓ స్థలాన్ని ఆక్రమించి, గోడలు నిర్మించిందని స్థానికులు చెబుతున్నారు. ఇదేమని ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై దౌర్జన్యానికి దిగినట్లు తెలిసింది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అనంతపురం నేత ప్రధాన అనుచరుడొకరు మరో 20 మందితో కలిసి, తాడేపల్లిలో మకాం వేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇక్కడ సీసాల కంపెనీ యాజమానిని ఈ ముఠా సభ్యులు బెదిరించి, డబ్బు డిమాండ్ చేశారని, దీనిపై బాధితుడు స్థానిక నాయకులను ఆశ్రయించి, రక్షణ కోరారని తెలిసింది. వీఐపీలు తిరిగే ప్రాంతంలో నిఘా కరువు.. ఆరంభంలోనే ఉనికి చాటుకుంటే కాబోయే రాజధానిలో తమకు అడ్డే ఉండదని, భూ దందాలతో ఆరంభించి, కిరాయి హ త్యల దాకా కొనసాగించాలనే ఆలోచనతో అనంతపురం ముఠా ఉన్నట్టు వినికిడి. ఈ ముఠాకు ఓ అరటి గెలల దుకాణం నిర్వాహకుడు ఆశ్రయం ఇచ్చినట్లు కొందరు చెబుతున్నారు. వీరికి అధికార పార్టీ అండదండలున్నాయని, బెజవాడ గూండాల సహకారం కూడా తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన ఓ ముఠా చాప కింద నీరులా ఫ్యాక్షనిజాన్ని విస్తరింపచేస్తుంటే రక్షక భటులకు తెలియలేదా.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వీఐపీలు తిరిగే రాజధాని ప్రాంతంలో అపరిచితుల రాకపోకలతో ఊహించని దుర్ఘటన జరిగితే, పరిస్థితి ఏమిటని, ప్రశాంత వాతావరణంలో కల్లోలం రేగక ముందే గట్టి భద్రత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఫ్యాక్షన్ రూపుమాపుతాం
కూడేరు/ ఆత్మకూరు/అనంతపురం క్రైం: అనంతపు రం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పూర్తిగా రూపుమాపి.. అన్నివి ధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం ఆయన కూడేరు, ఆత్మకూరు, కణేకల్లు పోలీసుస్టేషన్ భవనాలను, అనంతపురం అగ్నిమాపక కేంద్రంలో రూ.37 లక్షలతో ని ర్మించిన నూతన భవనాన్ని, పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, మెన్‌బ్యారక్, కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. జిల్లా పో లీసు కార్యాలయ ఆవరణలో ఁపోలీసు కంట్రోల్ రూం * నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూకబ్జాలను, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. పోలీసు సే ్టషన్లను కార్పొరేట్ ఆఫీసులు లాగా నిర్మిస్తామన్నారు. ప్రజలు పోలీసుస్టేషన్, కోర్టు మెట్లు ఎక్కకుండా గ్రామాల్లో ప్రశాంతంగా జీవించాలన్నారు. పోలీసులు కూడా ప్రజలకు అండగా నిలవాలన్నారు. గ్రామాల్లో గొడవలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో మార్పును పోలీసులే తేవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక హంగులతో అగ్నిమాపక కేంద్రాలు నిర్మిస్తామన్నారు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలన్నారు. అమాయకులను కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలన్నారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రజలు గొడవలకు దూరంగా, అభివృద్ధికిదగ్గరగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ విప్ కాలవ శ్రీనివాసులు, జెడ్పీ చైర్మన్ చమన్, డీజీపీ రాముడు, ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ శమంతక మణి, మేయర్ స్వరూప, మాజీ ఎమ్మెల్యే కేశవ్, ఐజీ గోపాలకృష్ణ, డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ రాజశేఖర్‌బాబు, అగ్నిమాపక శాఖ ఐజీ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల సమస్యలు పరిష్కరించండి.. జిల్లాలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్, నాయకులు వెంకటకృష్ణ, సుధాకర్‌రెడ్డి, హరి, మసూద్‌వలి, భారతి, సూర్యకుమార్ తదితరులు అనంతపురంలో వినతిపత్రం అందజేశారు. పోలీసుల తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకం వర్తింపజేయాలని, జిల్లాకు టీఏ బడ్జెట్ పెంచాలని, పెండింగ్ ఉన్న టీఏ మొత్తం విడుదల చేయాలని, శిథిలావస్థకు చేరుకున్న పోలీసు క్వార్టర్స్‌లను మరమ్మతులు చేయించాలని కోరారు. సిబ్బంది కొరత అధిగమించేలా చూడాలన్నారు. వారాంతపు సెలవు విషయాన్ని పరిశీలించాలన్నారు. త్వరితగతిన పదోన్నతులు కల్పించాలన్నారు. అగ్నిమాపకశాఖలో పని చేస్తున్న హోంగార్డుల జీతాలు పెంచాలని ఆ శాఖ డీజీ సాంబశివరావును కోరారు. -
'ఫ్యాక్షన్ నడిపిన రెండు గ్రూపులు టీడీపీలోనే'
అనంతపురం : టీడీపీ నేతలు జేబుదొంగల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. ధనవంతులకే టీడీపీ నేతలు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. 1994-2004 వరకూ కాంగ్రెస్ కార్యకర్తలను ఊచకోత కోసిన ఘటన చంద్రబాబుదేనని మండిపడ్డారు. జిల్లాలో ఫ్యాక్షన్ నడిపిన రెండు గ్రూప్‌లు ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నాయని రఘువీరా అన్నారు. టీడీపీ వెబ్సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోను ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు రుణమాఫీ అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలను మాఫీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్ రుణమాఫీకి జత చేస్తున్నా టీడీపీ నేతలు దద్దమ్మల్లా ఉంటున్నారని రఘువీరా ధ్వజమెత్తారు. -
దౌర్జన్యాలు ఆపండి
అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని దాడులు చేస్తారా.. దళితులని కూడా చూడకుండా దౌర్జన్యాలు చేస్తారా.. ఇక మీ దౌర్జన్యాలు ఆపండి.. లేదంటే తగిన గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 18వ తేదీ దళితులపై జరిగిన దాడి విషయంపై గురువారం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర నారాయణ, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎగ్గుల శ్రీనివాసులు క లిశారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం వారు మీడియాతో మట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులైన దళితులపై విచక్షణా రహితంగా దాడులకు దిగుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యాక్షన్‌ను తరిమికొడతామని చెప్పిన ముఖ్యమంత్రి దానిని మరింత ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మహిళలు వణికిపోతూ.. తమకు రక్షణ లేదంటూ.. బోరున విలపిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదురించడానికి దళితులకు అండగా జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. దాడిలో గాయపడిన దళిత కుటుంబాలకు నష్ట పరిహారం వచ్చే విధంగా ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది జేసీ బ్రదర్స్ పనే.... వీరాపురంలో జరిగిన ఘటనపై జేసి బ్రదర్స్ హస్తం ఉందని జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాడిపత్రి ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో పని చేస్తున్న వందలాది మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. న్యాయం చేస్తాం : ఎస్పీ వీరాపురంలో దళితులపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని, వారికి పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా రాజశేఖర్‌బాబు హామీ ఇచ్చారు. సంఘటన అనంతరం ఆ గ్రామంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నేతలు దిలీప్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం నేత బండి పరుశురాం, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పెన్నోబులేసు, పురుషోత్తమ్ ఉన్నారు. -
అనుమానం పెనుభూతం
బేతపూడి (ఫిరంగిపురం) అనుమానం పెనుభూతమైంది. పదేళ్ల దాంపత్య జీవితంలో ఇటీవల అనుమానం బీజం మొగ్గతొడిగింది. ఈ క్రమంలో భర్త తన భార్యపై కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోకలిబండతో తలపై మోది దారుణంగా హతమార్చిన సంఘటన బేతపూడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు విస్తుపోయారు. ఎస్ఐ పి.ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మారపాకల నరసింహారావు వంట పనిచేస్తుంటాడు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భార్యాపిల్లలతో గుంటూరు జిల్లాకు వలస వచ్చాడు. వినుకొండ సమీపంలోని చీమలమర్రిలో కొన్నాళ్లు ఉండి సత్తెనపల్లికి మారాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాయలచెరువుకు చెందిన కోరంపల్లి నాగన్న కుమారుడు గురుప్రసాద్ వంట పని వద్ద పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో పదేళ్ల క్రితం తన పెద్దకుమార్తె సుజాతను గురుప్రసాద్‌కు ఇచ్చి వివాహంచేశాడు. అల్లుడిని కూడా తనతోపాటు వంట పనులకు తీసుకువెళుతుండేవాడు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకిలో నివాసం ఉన్నారు. గురుప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమారులు గణేష్, లోకేష్ ఉన్నారు. అక్కడే గురుప్రసాద్ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం నరసింహారావు మృతిచెందడంతో ఆయన భార్య ఈశ్వరమ్మ పెద్దకుమార్తె సుజాత ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఏడునెలల క్రితం మండలంలోని బేతపూడి గ్రామానికి గురుప్రసాద్ కుటుంబం వచ్చి అద్దెఇంట్లో ఉంటోంది. అత్తంటి బంధువుల సహకారంతో న్యూడిల్స్ బండి పెట్టుకుని గురుప్రసాద్ జీవనోపాధి పొందుతున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న గురుప్రసాద్ దాంపత్య జీవితంలో ఇటీవల భార్యపై ఆయనకు అనుమానం కలిగింది. పక్క ఇంటి వ్యక్తి ఒకరు తన ఇంటి మెట్ల వద్ద తచ్చాడుతూ గురుప్రసాద్‌కు కనింపించాడు. ఈ ఘటన తన భార్యపై అనుమానాన్ని కలిగించింది. ఇదే విషయం భార్యను అడగ్గా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పది రోజుల క్రితం పిల్లలిద్దరినీ తీసుకుని గురుప్రసాద్ స్వగ్రామం రాయలచెరువు వెళ్లాడు. రెండువర్గాల పెద్దలు సర్దిచెప్పి వెంటనే ఇక్కడకు తీసుకువచ్చారు. అయినా భార్యపై అనుమానం తొలిగిపోలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. శుక్రవారం ఉదయం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లగా.. ఈశ్వరమ్మ సరుకులు కోసం సత్తెనపల్లి వెళ్లింది. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన గురుప్రసాద్ ఒంటరిగా ఉన్న భార్య సుజాత తలపై రోకలిబండతో గట్టిగా మోది పరారయ్యాడు. పాఠశాలకు వెళ్లిన ఇద్దరు పిల్లల్లో చిన్నకుమారుడు లోకేష్ ఇంటికి వచ్చి తల్లి వద్దకు వెళ్లాడు. రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి ఆరేళ్ల లోకేష్ కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశాడు. చట్టుపక్కలవారు గమనించి సుజాత తల్లి ఈశ్వరమ్మకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామనౌకరి షేక్ ఖాదర్‌వలి ఎస్ఐ పి.ఉదయబాబుకు తెలియపర్చారు. వెంటనే ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్ష సాధింపు
30 ఏళ్ల నాటి బోరుకు ‘వాల్టా' నోటీసులిప్పించిన టీడీపీ నాయకులు బత్తలపల్లి : మండలంలోని డి.చెర్లోపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దరూరి రామకృష్ణపై ఆ గ్రామ టీడీపీ నాయకులు కక్ష సాధింపునకు పాల్పడ్డారు. ఎన్నికల్లో సహకరించలేదన్న అక్కసుతో ఏళ్ల క్రితం వేసిన బోరు బావికి వాల్టా చట్టం కింద నోటీసులు జారీ చేయించారు. బాధితుడు కథనం మేర కు.. చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో రామకృష్ణ 30ఏళ్ల క్రితం బోరు వేసుకున్నా డు. వెయ్యి చీనీ చెట్లు, 600 జామ చెట్లు, ఐదెకరాల్లో టమాట పంట సాగు చేశాడు. ఈ క్రమంలో వాల్టా చట్టం అతిక్రమించారంటూ గత నెల 29న రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. స్థానిక టీడీపీ నాయకులు రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చి నోటీసులు ఇప్పించారని బాధితుడు వాపోయాడు. బోరు నీటితోనే పంటలు కాపాడుకుంటున్నామని, తమకు అన్యాయం జరిగితే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని వాపోయాడు. రెవెన్యూ అధికారులు ఈ సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని కోరా డు. కాగా నదిలో దాదాపు 100 నుంచి 120 మంది రైతులు బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారన్నారు. ఈ సమస్యపై మండల వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జ్ తహశీల్దార్ సురేష్‌బాబును కలిశారు. గత 30 ఏళ్లకు పైబడి రైతులు ఇక్కడి నదీ పరీవాహక ప్రాంతంలో బోర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారని, వారి పొట్టకొట్టవద్దని విన్నవిం చారు. చిత్రావతిలో వేసిన బోర్లు, పంటల సాగును వివరించారు. గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోసే ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని, నోటీసుకు వివరణ ఇచ్చేందుకు 3 వారాలు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో రాతపూర్వకంగా అర్జీ ఇవ్వాలని తహశీల్దార్ సూచించారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోల్లపల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, ముష్టూరు నరసింహారెడ్డి, జయరామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు గుజ్జెల వెంగళరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కృష్ణా, రామకృష్ణ, ముసలయ్య, నారాయణస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఫ్యాక్షన్’.. ప్లాన్.!
అమలాపురం టౌన్ : ఆ యువకుల వయస్సు పాతికేళ్ల లోపే. అయినా వారు ఫ్యాక్షన్ తరహాలో ప్రత్యుర్థులను హతమార్చేలా పథక రచన చేశారు. ప్రత్యర్థి కదలికలను సెలఫోన్ల ద్వారా తెలుసుకుంటూ మారణాయుధాలతో దాడి చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థి కాస్త తెలివిగా తప్పించుకున్నాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అచ్చం ఫ్యాక్షన్ సినిమాలోని సన్నివేశాన్ని తలపిస్తున్న ఈ సీన్ అమలాపురం సమీపంలో జరిగింది. గత నెల 27వ తేదీ రాత్రి అమలాపురం సమీపం ఈదరపల్లిలో ఓ వర్గానికి చెందిన రౌడీషీటర్ కొలగాని స్వామినాయుడును హతమార్చేందుకు ప్రత్యర్థి రౌడీషీటర్ రవిరాజా పినిశెట్టి వర్గానికి చెందిన కొందరు యువకులు పథకాన్ని రూపొందించడం, అది విఫలం కావడం తెలిసిందే. ఆ హత్యాయత్నానికి పథక రచన చేసిన రౌడీషీటర్లు, నేరస్తులను శుక్రవారం పట్టణ సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై యాదగిరి, సిబ్బంది అరెస్టు చేశారు. మారణాయుధాలు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం ఆ కేసు వివరాలను సీఐ విలేకర్లకు వెల్లడించారు. హత్యకు ఇందుపల్లి వంతెన ఎంపిక రౌడీషీటర్ స్వామినాయుడును అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి వంతెనపై హత్య చేసేందుకు ఆ రోజు రాత్రి రౌడీషీటర్ రవిరాజా పినిశెట్టి వర్గీయులు ఆరుగురు యువకులు సెల్ఫోన్ల సహకారంతో పథకాన్ని సిద్ధం చేశారు. ఈదరపల్లి పంచాయతీ వద్ద కిషోర్ తన సెల్ఫోన్లో నాయుడి కదలికలను ఎప్పటికప్పుడు ఇందుపల్లి వంతెన మీద కారులో మారణాయుధాలతో ఉన్న మిత్రులకు చేరవేసేవాడు. ఇది గమనించిన నాయుడు తన మిత్రుడి సహాయంతో కిషోర్ సెల్‌ను తీసుకోవడంతో పాటు అతడిని బంధించాడు. దీంతో నాయుడి హత్యా పథకం బయటపడింది. కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యా పథకం విఫలమైంది. ఇందుపల్లి వంతెనపై మాటు వేసిన రౌడీలు పరారయ్యారు. లేకుంటే నాయుడు ప్రత్యర్థుల చేతిలో హతమై ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. మారణాయుధాలతో పట్టుబడ్డ నిందితులు అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుల్లో ఒకడైన కంచిపల్లి మణికంఠ కొంకాపల్లి రోడ్డు అబ్బిరెడ్డివీధిలో ఉండగా పట్టణ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం దాడి చేసి అరెస్ట్ చేశారు. వీరిలో అంబాజీపేటకు చెందిన బొక్కా ఉదయ్‌కుమార్, అమలాపురం ఏవీఆర్నగర్కు చెందిన పతివాడ నాగేంద్ర (రౌడీషీటర్), అబ్బిరెడ్డివీధికి చెందిన మండు అనిల్ అనే రెట్ట (రౌడీషీటర్), కంచిపట్ల మణికంఠ, అమలాపురం గనికమ్మ గుడి ప్రాంతానికి చెందిన మహ్మద్ నబీ అనే బబ్బులను అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. ఈ పథకానికి మూల కారకుడైన రవిరాజా పినిశెట్టిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే హత్య పథకం సమయంలో పట్టుబడ్డ కిషోర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి కూడా... హత్యా పథకంలో పాల్గొన్న ఏడుగురు యువకులు 25 ఏళ్ల లోపు వారే కాగా, వీరిలో ఉదయ్‌కుమార్ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హత్యాయత్నం కేసుతోపాటు పలు దొంగతనాలు, ఈవ్‌టీజింగ్ కేసులు ఇతడిపై ఉన్నాయి. హత్యా పథకానికి ముందు వీరు అనకాపల్లి వెళ్లి మారణాయుధాలు కొనుగోలు చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చొరవ చూపిన ఎస్సై యాదగిరి, హెడ్‌కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, జి.కృష్ణసాయిలను డీఎస్పీ వీరారెడ్డి, సీఐ శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. -
టీడీపీ వచ్చాకే పెరిగిన ఫాక్షన్
టీజీ వెంకటేష్.. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టాక కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో ఎంత మందిని చంపించావో తెలియదా? అని కేఈ కృష్ణమూర్తిని బహిరంగంగానే ప్రశ్నించారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, అతనికి ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు కేఈ సోదరులేనన్నారు. అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి భయపెడుతున్నారని, అందుకు భయపడేది లేదన్నారు. ఫ్యాక్షన్‌ను రెచ్చగొడుతున్నా తాము భయపడే సమస్యే లేదన్నారు. కేడీసీసీబీ చైర్మన్ పదవి కోసం సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన డెరైక్టర్లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కేడీసీసీబీ చైర్మన్ పదవిని వదులుకోబోమని పేర్కొన్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎవరైనా సరే ఊరుకునేది లేదని టీజీ, కేఈలనుద్దేశించి అన్నారు. ఇసుక, గనులను దోచుకుంటున్నారు.. జిల్లాలో ఉన్న ఇసుక, గనులను కేఈ సోదరులు దోచుకుంటున్నారని కోట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి లెసైన్సులు ఉన్నా.. దౌర్జన్యంగా వాటిని లాక్కుంటున్నారని విమర్శించారు. అధికారులను బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం జిల్లా ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల, వేదావతి, పలు ఎత్తిపోతల పథకాలన్నీ కాంగ్రెస్ ప్రారంభించినవేనని గుర్తు చేశారు. టీడీపీ ఉంటే జిల్లా నాశనమై పోతుందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, చెరుకులపాడు నారాయణరెడ్డి, అహ్మద్ అలీఖాన్, శ్రీశైలం నియోజక వర్గ ఇన్చార్జ్ షబానా తదితరులు పాల్గొన్నారు. -
అన్నంత పనీ చేశాడు
- మామను నరికి చంపిన అల్లుడు - కట్నం కేసులో జైలుకు పంపాడని దారుణం జియాగూడ: కట్నం వేధింపుల కేసులో జైలుకు పంపాడన్న కక్షతో మామ ప్రాణం తీశాడో దుర్మార్గుడు. హత్య చేస్తానని హెచ్చరించి మరీ అతిదారుణంగా నరికి చంపాడు. కుల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఆర్.కరణ్కుమార్సింగ్ కథనం ప్రకారం... పురానాపూల్ దుర్గానగర్ నివాసి టి.మనోహర్ సింగ్(49) ఛెత్త్తాబజార్ ఎస్బీహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి హారతిని కుల్సుంపురా 2జే బస్టాండ్ వద్ద ఉంటున్న రాంసింగ్ కుమారుడైన సిటీ సివిల్ కోర్టు ఉద్యోగి ఆనంద్‌సింగ్(24)కు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కట్నం కింద 40 తులాల బంగారం, రూ. 2 లక్షల నగదు ఇచ్చారు. వీరికి ఏడాది పాప ఉంది. కాగా, ఆనంద్‌సింగ్ అదనపు కట్నం అడుగుతుండటంతో మనోహర్సింగ్ ఇటీవల మారుతి వ్యాన్‌ను కొనిచ్చాడు. అయినా సంతృప్తి చెందని ఆనంద్‌సింగ్ అదనపు కట్నం తెమ్మని భార్య హారతిని కాల్చుకు తింటున్నాడు. అనుమానంతో ఆమెను నిత్యం మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడు. పలుమార్లు నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మామ మనోహర్సింగ్ రెండు నెలల క్రితం సీసీఎస్‌లో వరకట్నం వేధింపుల కేసు పెట్టాడు. పోలీసులు ఆనంద్‌సింగ్‌ను జైలుకు పంపారు. దీంతో కక్షగట్టిన ఆనంద్‌సింగ్ వారం రోజులుగా మామను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు. అన్నట్టుగానే మామను హత్య చేసేందుకు పథకం వేశాడు. మామ ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడనే విషయం ముందే పసిగట్టిన అతను శనివారం ఉదయం పురానాపూల్ చౌరస్తా దిగువన ఉన్న రోడ్డు వద్ద మరికొందరితో కలిసి మాటు వేశాడు. ఉదయం 9.30కి పురానాపూల్‌లో పాలప్యాకెట్లు కొనుగోలు చేసి దుర్గానగర్ కు స్కూటర్‌పై వస్తున్న మామ మనోహర్సింగ్పై ఒక్కసారిగా దాడి చేసి, కత్తులతో నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని గోషామహల్ ఏసీపీ రాంభూపాల్సింగ్, కుల్సుంపురా ఇన్స్పెక్టర్ కరణ్కుమార్సింగ్ పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. -
పౌరుషాల గడ్డ
-
'ఆ హత్యకేసులో మాకెలాంటి సంబంధం లేదు'
కర్నూలు : నందికొట్కూరు మార్కెట్‌యార్డు వైస్ చైర్మన్ సాయిఈశ్వరుడు హత్యకేసుతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని బైరెడ్డి రాజశేఖరరెడ్డి సతీమణి బైరెడ్డి భారతి అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే తన భర్తపై హత్యకేసు నమోదు చేశారని ఆమె మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాగా సాయి ఈశ్వరుడు హత్యకేసులో బైరెడ్డి రాజశేఖరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 15న సాయి ఈశ్వరుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై 16వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక బైరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన గన్మెన్లను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో బైరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది.కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాయి ఈశ్వరుడు ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు. -
పదేళ్ల పగ
ఫ్యాక్షన్ ప్రాంతంగా ముద్ర పడిన నందికొట్కూరు నియోజకవర్గంలో తమ ఆధిపత్యం చూపించుకునేందుకు ప్రత్యర్థులు నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడిని అంతమొందించినట్లు తెలుస్తోంది. కొన్ని వ్యవహారాల్లో అంతర్గతంగా అడ్డుపడుతున్నాడనే కారణంతోపాటు తమ సత్తాను చాటుకునేందుకు దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడుగా 1989 నుంచి 2002 వరకు కొనసాగిన సాయి ఈశ్వరుడిపై ముచ్చుమర్రి స్టేషన్లో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరుగతంలో దాడి చేయించి కొనప్రాణంతో వదిలివేశారు. అనంతరం అతని ఇంటి పైకప్పును పెకలించి ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఆ ఇంటి మొండి గోడలు ఆ సంఘటనకు సాక్ష్యాలుగా మిగిలి ఉన్నాయి. ఆయన ఫ్యాక్షన్‌కు దూరంగా దశాబ్ద కాలంపాటు కర్నూలులోనే ఉంటూ ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో హత్యకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. ఎన్నికల వేళ ఫ్యాక్షన్ హత్యతో స్థానిక నాయకులు వణికిపోతున్నారు. పదేళ్లుగా ఒక్కొక్కరు ఫ్యాక్షన్ రక్కసి నుంచి బయటపడిన నాయకులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఈ హత్యతో బరిలో నిలిచేందుకు కూడా జంకుతున్నారు. మరో వైపు గతంలో తమపై ఉన్న పాత కేసులు తవ్వుతారేమోనని భయాందోళన చెందుతున్నారు. అంతా నిశ్శబ్దం : సాయి ఈశ్వరుడు హత్యోదంతంతో ముచ్చుమర్రిలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. గ్రామంలో ప్రజలు మరొకరితో మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన సెల్‌ఫోన్ గ్రామానికి చెందిన చికెన్ బాషదిగా వెలుగు చూడటంతో బెరైడ్డి సిద్ధార్థరెడ్డి ముఖ్య అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. స్పెషల్ పార్టీ పోలీసు బలగాలు ముచ్చుమర్రిలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నాయి. ఉదయం నుంచి గ్రామంలో కవాతు చేస్తూ ప్రజలు గుంపులుగా లేకుండా చెదరగొడుతున్నాయి. హత్య స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు గ్రామంలో అనుమానితులుగా శ్రీనివాసరెడ్డిని విచారించారు. బెరైడ్డి సిద్ధార్థరెడ్డి కారు డ్రైవర్ హరినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన వెంటనే దుండగులు ఓ ఆటోలో పారిపోగా ఆ ఆటో డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ నరసింహారెడ్డి ఆదివారం ముచ్చుమర్రిని సందర్శించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ పార్టీ బలగాలను ఆయన ఆదేశించారు. -
పచ్చని పల్లెల్లో నెత్తుటేరులు
పచ్చని పంటపొలాలతో విలసిల్లే వీణవంక మండలంలో ప్రతీకార జ్వాలలు ఎగసిపడుతున్నాయి. సున్నితమైన మండలంగా రికార్డుల్లో చోటు దక్కించుకున్న ఈ ప్రాంతం ఇటీవల జిల్లాలోనే అతి సమస్యాత్మకంగా మారింది. రాజకీయ కక్షలు, భూవివాదాలు, ప్రేమకలాపాలకూ హత్యలనే ఆయుధాలుగా ఎంచుకుంటుండడంతో ఇక్కడ ఫ్యాక్షన్ పగలు కోరలు చాస్తున్నాయి. మూడు నెలల్లోనే మూడు భీకరమైన హత్యలు, రెండు అనుమానాస్పద మరణాలు, బీభత్సమైన సంఘటనలు, గతేడాదిలో రెండు హత్యలు స్థానికంగా వణుకు పుట్టిస్తున్నాయి. మండలంలోని నర్సింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాలరాజు హత్యను మరవకముందే తాజాగా బుధవారం అర్ధరాత్రి అయిలాబాద్కు చెందిన తాటి చంద్రయ్యనుకొందరు అగంతకులు బీరు సీసాలతో పొడిచి చంపడం మరోసారి సంచలనం రేకెత్తించింది. ఫ్యాక్షన్ కక్షలకు బలి ఈ నెల 5న రాజకీయకక్షలతో నర్సింగాపూర్ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాల్రాజును ప్రత్యర్థులు గొడ్డలతో దారుణంగా నరికి చంపారు. ఇది ఆ గ్రామ సర్పంచ్ జడల రమేష్, అతని బావమరిది, మరో వ్యక్తి చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. వీరికి ఆశ్రయం ఇచ్చాడని సీపీఐ జిల్లా మాజీ కార్యద ర్శి మర్రి వెంకటస్వామిపై, కుట్ర పన్నాడని మాజీ దళ కమాండర్ పోశమల్లుపై కేసు నమోదు చేశారు. ఇలా మండలంలో ఏదో ఒక సంఘటనతో ప్రజలు భయబ్రాంతుకు గురవుతున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారో! మావోయిస్టు ప్రాబల్యంలో వీణవంక మండల ం చాలా సంఘటనలకు చిరునామాగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్ల వరకు స్తబ్ధుగానే ఉంది. ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు, అనుమానాస్పద మరణాలు స్థానికంగా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇది పోలీసుల పాత్రపై అనుమానం రేకెత్తిస్తున్నాయి. మామిడాలపల్లిలో హత్యకు గురైన వెంకటేశ్వర్లు సంఘటనలో భారీమొత్తం చేతులు మారాయనే నేపథ్యంలో లోకాయుక్త, హెచ్ఆర్సీలో పోలీసులపై ఫిర్యాదులు అందాయి. మిగతా సంఘటనల్లో మాత్రం పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్టు చేస్తున్నా.. వరుస ఘటనలు అంతుబట్టకుండా ఉన్నాయి. సివిల్ తగాదాలు, భూముల పంచాయతీలు, బందోబస్తుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్న పోలీసులు.. శాంతిభద్రతలపై గ్రామాల్లో అవగాహన కల్పించకపోవడం ఇలాంటి సంఘటనలకు కారణమనే అభిప్రాయాలున్నాయి. హత్యకేసులలో నిందితులుగా పేర్కొంటూనే చార్జీషీటులో లొసుగులకు సహకరిస్తున్నందునే నిందితులు శిక్షల నుంచి బయటపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న పగలు పచ్చని మండలంలో ఇలాంటి హత్యలు ఫ్యాక్షన్‌ను తలపిస్తున్నాయి. మాజీ ఎంపీటీసీ బాలరాజుది రాజకీయ కక్షలతో చేసిన హత్యగా పోలీసులే నిర్ధారించారు. ఇనుపచువ్వలు, గొడ్డళ్లతో చంపడం ఫ్యాక్షన్కక్షలకు అద్దం పట్టింది. చల్లూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.50వేలకు కాంట్రాక్ట్ మర్డర్ చేయడం సంచలనమైంది. తాజాగా బుధవారం తాటి చంద్రయ్యను సైతం బీరుసీసాలతోనే హత్య చేయడం బీభత్సం సృష్టించింది. వేధింపులకు అబల బలి డిసెంబర్ 15న అత్తింటివారి వేధింపులతో మామిడాలపల్లికి చెందిన ఎడ్ల కవిత అనుమానాస్పద స్థితిలో ఊరేసుకుని మృతి చెందింది. ఇది గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంకా మిస్టరీయే.. 2012 నవంబర్ 22న అర్ధరాత్రి మామిడాలపల్లిలోని వేంకటేశ్వరాలయంలో నిద్రిస్తున్న జోగు వెంకటేశ్వర్లు అనే భక్తుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. ఈ కేసు ఇప్పటికీ వీడలేదు. మృతుని కుటుంబసభ్యులు మాత్రం కేసును పోలీసులే తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల హెచ్ఆర్సీ, లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అనుమానమే..! డిసెంబర్ 4న కనపర్తిలో ప్రేమ వేధింపులతో బీఫార్మసీ విద్యార్థిని కర్నె నవీన అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో శవమై తేలింది. ఈ సంఘటనకు అదే గ్రామానికి చెందిన యువకుడే కారణమని ఆరోపణలు ఉన్నాయి. వరుస సంఘటనలు 1992లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ ప్లీనరీ సమావేశాలను అప్పటి మంథని ఏరియా దళ కమాండర్ రామన్న, మానేరు ఏరియా దళ కమాండర్ గోపన్న ఆధ్వర్యంలో అచ్చంపల్లిలో నిర్వహించింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారం మేరకు పోలీసులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు, షెల్టర్ ఇచ్చిన ఇంటి యజమాని రాజిరెడ్డి మృతిచెందారు. ఇది దేశంలోనే అతి పెద్ద ఎన్కౌంటర్. ఏడాది తిరగకముందే 1993లో అదే గ్రామంలో ఇన్ఫార్మర్ నెపంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాపిరెడ్డి, అతడి కుమారుడు మహిపాల్‌రెడ్డి, ఆలేటి మహేందర్‌రెడ్డిని ఉగాది పండుగ రోజే పీపుల్స్‌వార్ పార్టీ మంథని ఏరియా బాధ్యతలు తీసుకున్న పద్మక్క ఆధ్వర్యంలో కాల్చి చంపింది. ఇది జిల్లాలో సంచలనం రేపింది. 1995 ప్రాంతంలో ఇదే పల్లెకు చెందిన పత్రికా విలేకరి అలిగివెళ్లి రవీందర్‌రెడ్డి తెలంగాణ జన సభలో చురుకైన కార్యకర్తగా ఎదుగుతున్నాడు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 32 రోజులు తీవ్ర ఉద్యమాన్ని చేపట్టాడు. జనసభలో అంచెలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో 2001 అగస్టులో మెదక్ జిల్లా సిద్దిపేటలో దుండగులు సజీవ దహనం చేశారు. ఇది రాజకీయ హత్యేనని అప్పట్లో ఆరోపణలు వెల్లువడ్డాయి. ఆ కేసు నేటి వరకు మిస్టరీ వీడలేదు. 2008లో కనపర్తిలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆస్తి కోసం పరమేశ్వర్ అనే వ్యక్తి సొంత బావమరిది భార్య కొండూరి శ్రీలత, ఆమె కుతురు సంతోషి(12)ని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. మూడేళ్ల క్రితం బొంతుపల్లిలో కొడుకులు పోషించడం లేదని మనస్తాపంతో వృద్ధుడు చదువు వెంకట్రామిరెడ్డి తానే చితి పేర్చుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటనపై అప్పట్లో ఓ మంత్రి అసెంబ్లీలో చర్చించారు. ఇది ప్రతి ఒక్కరి హృదయాలను కలిసివేసింది. ఇప్పలపల్లిలో గతేడాది మంత్రాల నెపంతో సొంత నానామ్మను మనుమడు తిరుపతి రోకలిబండతో అతికిరాతకంగా హత్య చేశాడు. డిసెంబర్ 27న చల్లూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి, రమేశ్ కలిసి రూ.50వేల కాంట్రాక్టుకు వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన బొల్లు రణధీర్‌రెడ్డి అనే యువకుడిని దారుణంగా హత్య చేసి కాల్చివేశారు. -
పాత కక్షలతోనే రౌడీషీటర్ హత్య
టెక్కలి, న్యూస్‌లైన్: పాత కక్షలు.. భూ తగదాలే రౌడీషీటర్ కోళ చంద్రరావు హత్యకు కారణమని ఏఎస్పీ బి.డి.వి.సాగర్ చెప్పారు. టెక్కలికి చెం దిన చంద్రరావును హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోళ లవకుమార్, పీత రాము, పీత రమణబాబు, మండల సురేష్, భాస్కర్ బరోడా ఈ హత్య చేశారని తెలిపారు. వీరికి మాజీ సర్పంచ్ కోళ అప్పన్న, అదే వీధికి చెందిన న్యాయవాది కోళ ధనుం జయ శ్రీనివాస్ సహకరించినట్టు తమ విచారణలో తేలిందని వివరించారు. అసలేం జరిగిందంటే.. చేరివీధికి చెందిన చంద్రరావుకు, అదే వీధికి చెం దిన బంధువు కోళ భీమారావు కుటుంబాల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం భీమారావు, అతని కుమారుడు వాసుదేవరావు ను హత్య చేయడంతో పాటు మరో కుమారుడు ఎర్రన్నపై హత్యాయత్నం కేసుల్లో చంద్రరావు నిందితుడు. లవకుమార్‌ను హతుడు, అతని కు మారులు కామేశ్వరరావు, వసంతరావు తరచూ వేధింపులకు గురి చేసేవారు. దీంతో చంద్రరావును మట్టుబెట్టాలని లవకుమార్ పథకం పన్నాడు. ఈ నెల 20న సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై మెళియాపుట్టి రోడ్డు వైపు వెళ్తున్న చంద్రరావును చేరివీధి సమీపంలోని గొడగలవీధి వద్ద కత్తులతో దాడి చేశారు. కత్తులను సమీపంలోని వంశధార కాలువలో పడేసి పాతనౌపడ రైల్వేస్టేషన్ నుంచి పరారయ్యూరు. నిందితులను ఆముదాలవలస రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని, అందులో ఒకరు పరారీలో ఉన్నారని ఏఎస్పీ వెల్లడించారు.