టీడీపీలో భగ్గుమన్న ఫ్యాక్షన్ | TDP Leaders Brutal murder | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న ఫ్యాక్షన్

Published Fri, Jul 22 2016 2:27 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీలో భగ్గుమన్న ఫ్యాక్షన్ - Sakshi

టీడీపీలో భగ్గుమన్న ఫ్యాక్షన్

ఇద్దరు దారుణహత్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం:  అనంతపురంలో పాతకక్షలు భగ్గుమన్నాయి. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం అనుచరులు, టీడీపీ నాయకులు గోపీనాయక్, వెంకటేశ్ నాయక్‌లను అదే పార్టీకి చెందిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హతమార్చారు.
 
వెంటపడి వేటకొడవళ్లతో..
గోపీనాయక్, సోదరుడి కుమారుడు వెంకటేశ్‌నాయక్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై అనంతపురం నుంచి వారు నివాసముంటున్న చంద్రబాబు నాయుడు కాలనీ వైపు వెళుతున్నారు. రుద్రంపేట శివారులోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా మరో ద్విచక్రవాహనంపై వస్తున్న దుండగులు వీరి వాహనాన్ని ఢీకొట్టించారు. దీంతో వారు కిందపడిపోయారు. వెనుక ఆటోలో వచ్చిన ప్రత్యర్థులు వీరిని వెంబడించి వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో దాడి చేయడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందా రు. ఈ హత్యలకు పాల్పడిన అక్కులప్ప, అమర్ టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
ప్రభాకర్ చౌదరి
చంపించారు..

గోపీనాయక్, వెంకటేశ్‌నాయక్‌లను అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి చంపించారని వెంకటేశ్‌నాయక్ తండ్రి నారాయణనాయక్, గోపీనాయక్ సోదరుడు కుమార్‌నాయక్ ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement