brutal murder
-
దారుణ హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
శ్రీనివాసపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి తాలూకాలోని పాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప (38) హత్యకు గురైంది. పాళ్య గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి భార్య రూప సోమవారం మధ్యాహ్నం పశువులు మేపడానికి ఇంటి నుంటి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ సమయంలో సంబందీకులకు గ్రామ సమీపంలోని చురువునహళ్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కాలువ వద్ద రూప రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శ్రీనివాసపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన జరిపారు. హత్య జరిగిన రోజునే నిందితుడిని అరెస్టు చేశారు. ఇదే గ్రామానికి చెందిన ఆనందప్ప నాయక్‌ను హంతకుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆనందప్ప నాయక్‌కు హతురాలు రూపతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతురాలు రూప, ఆనందప్ప నాయక్‌ల మధ్య ఈ మధ్య వైషమ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందప్ప నాయక్ రూపను గొంతుకోసి హత్య చేసినట్టు తెలిసింది. హత్యపై స్పందించిన భర్త శ్రీరామరెడ్డి తాను సాయంత్రం భార్య రూపకు ఫోన్ చేసిన సమయంలో మొబైల్ స్విఛాఫ్ వచ్చింది. తన భార్య రూప ఆనందప్ప నాయక్‌ల మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవని హత్య ఎందుకు జరిగిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉందన్నారు. కోలారు ఎస్పీ బి నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ నందకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రచించి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
స్నేహితుడితో కలిసి భర్తను చంపిన భార్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రమేష్ కుమార్ అనే వ్యాపారి కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. కారులో హత్య చేసి మృతదేహాన్ని అక్కడి ఓ కాఫీ ఎస్టేట్‌లో పడేసి కాల్చేశారు. ఈ నెల 3న చోటుచేసుకున్న ఈ ఘాతుకానికి ఆయన భార్య నిహారిక సూత్రధారిగా తేలింది. ఈమెతో పాటు ప్రి యుడు, స్నేహితుడిని శనివారం అరెస్టు చేసిన కొడగు పోలీసులు హతుడి కారును స్వా«దీనం చేసుకున్నారు. కొడగు ఎస్పీ ఆర్.రామరాజన్ చెప్పిన వివరాల ప్రకారం.. నిహారిక స్వస్థలం యాదాద్రి– భువనగిరి జిల్లా మునీరాబాద్. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత హరియాణాకు చెందిన మరో వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుంది. అక్కడ నివసిస్తుండగా ఓ చీటింగ్ కేసులో భార్యాభర్తలు జైలుకు వెళ్లారు. జైలులో ఉండగా హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వీరికి పరిచయమైంది. ఆ మహిళను కలవడానికి తరచూ జైలుకు వచ్చే ఆమె కుమారుడు అంకుర్ రాణాతోనూ స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండో భర్తను కూడా నిహారిక వదిలేసి.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేష్ కుమార్ (54)ను వివాహం చేసుకుంది. బెంగళూరులో నివసిస్తూ ఓ ప్రముఖ సంస్థలో పని చేసేది. రూ.8 కోట్లు కాజేయాలని.. ఏపీలోని కడప జిల్లా వాసవీ నగర్ నుంచి బెంగళూరులోని రామమూర్తి నగర్లో వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడిన నిఖిల్ మైరెడ్డితో నిహారికకు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో రమేష్ కుమార్ ఇటీవల తన స్తిరాస్థిని విక్రయించగా వచి్చన రూ.8 కోట్లు కాజేయాలని నిహారిక పథకం పన్నింది. రమేష్‌ను హత్య చేసేందుకు అంకుర్ రాణాను సంప్రదించింది. ఈ నెల 1న అంకుర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్న నిహారిక తన భర్త వద్ద ఉంది. 3వ తేదీన తమను బెంగళూరులో దింపి రావాలంటూ భర్తకు కోరింది. దీనికి అంగీకరించిన రమేష్ కుమార్ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో ఇద్దరినీ తీసుకుని బయలుదేరారు. అంకుర్ కారు నడుపుతుండగా.. పక్క సీటులో రమేష్, వెనుక నిహారిక కూర్చున్నారు. మార్గంమధ్యలో హైవేపై కారు ఆపి.. ఊపిరి ఆడకుండా చేసి రమే‹Ùను హత్య చేశారు. మృతదేహాన్ని కారులోనే ఉంచి బెంగళూరులోని హోరామావూ ప్రాంతం వరకు వెళ్లారు. మృత దేహాన్ని కాల్చేసి.. ఆపై నిఖిల్‌ను సంప్రదించిన నిహారిక తన భర్త రమే‹Ùకుమార్ హత్య విషయం చెప్పింది. అతడి సలహా మేరకు మృతదేహాన్ని ఊటీ సమీపంలోని సుంటికొప్పలో ఉన్న కాఫీ ఎస్టేట్‌లోకి తీసుకువెళ్లారు. పెట్రోల్ పోసి నిప్పింటించి అక్కడి నుంచి కారులో ఉడాయించారు. ఈ నెల 8న సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కొడగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు వివిధ ప్రాంతాల్లోని దాదాపు 500 సీసీ కెమెరాల్లో ఈ నెల 1 తేదీ నుంచి రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఓ కెమెరాలో కారు కదలికలతో పాటు దాని నంబర్ కూడా పోలీసులకు కనిపించింది. దీని ఆ«ధారంగా హైదరాబాద్ వచి్చన కొడగు పోలీసులు హతుడి వివరాలు సేకరించారు. ఆపై నిహారిక, నిఖిల్‌లను బెంగళూరులో, అంకుర్‌ను హరియాణాలో అరెస్టు చేశారు. వీరి కారుతో పాటు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. -
మహిళ దారుణ హత్య
నందికొట్కూరు: మండల పరిధిలోని నాగటూరు గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం సాయంత్రం మహిళ దారుణ హత్యకు గురైంది. నాగటూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహులు, శిరీష (26) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మొక్కజొన్న పొలం పనులకు వెళ్లిన శిరీషను సొంత మామ గొల్ల కురుమన్న హత్య చేసినట్లు తెలుస్తోంది. పంట కోత కోసిన చేనులో కంకులు ఏరుతున్న సమయంలో బండరాయితో తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు, సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిరాలి సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు మామపై హత్య కేసు, భర్త నరసింహులు, అత్త మహేశ్వరి, ఆడపచులపై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు టౌన్ సీఐ తెలిపారు. కాగా గొల్ల కురుమన్నపై 2017లో ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కురుమన్నను ఎన్కౌంటర్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు అనాథలయ్యారు. -
Hyderabad: మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
మియాపూర్: ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వైజాగ్‌కు చెందిన బండి స్పందన(29)దీప్తీ శ్రీనగర్ కాలనీలోని సీబీఆర్ ఎస్టేట్‌లో అపార్ట్మెంట్లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న స్పందన తల్లి నమ్రత సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఆమె కుమార్తెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా బెడ్రూమ్లో స్పందన రక్తపు మడుగులో కనిపించింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
మహిళ దారుణ హత్య
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కొన్నాళ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడగా ఆయన కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించి వివరాలు... బైరవునిపల్లి గ్రామానికి చెందిన కోళ్ల సైదమ్మ(47)తో ఆమె భర్త దూరంగా ఉంటుండగా, సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓప్రైవేట్ పాఠశాల హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం సెలవులు కావడంతో స్వగ్రామమైన బైరవునిపల్లి వచ్చింది. అదే గ్రామానికి చెందిన సొంటి శ్రీను తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమెను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి కొట్టినట్లు తెలిసింది. ఈనేపథ్యాన శుక్రవారం కూడా సైదమ్మ ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను వెళ్లి గొడవకు దిగాడు. ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో మూడు చోట్ల బలంగా పొడిచాడు. ఆపై చేతులను కత్తితో ఇష్టానుసారంగా కోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైదమ్మ రక్తపు మడుగులో పడి పోయింది. దీంతో స్థానికులు ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా శ్రీను సైతం అదే కత్తితో పొడుచుకోగా పేగులు బయటకు రావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆయనను ఖమ్మం తరలించగా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉండగా, సెలవుల్లో ఇంటికి రాకుండా కోదాడలో ఉన్నా బతికేదని వారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.భారీ బందోబస్తుహత్య జరగడంతో బైరవునిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సైదమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు హత్య చేసిన శ్రీను కోసం గ్రామంలో గాలించారు. కానీ ఆయన సైతం ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుసుకున్న వారు ఆగ్రహంతో ఉండగా.. ఎలాంటి ఘటనలు జరగకుండా ఖమ్మం రూరల్ సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యాన నేలకొండపల్లి, ముదిగొండ ఎస్సైలు తోట నాగరాజు, నరేష్, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని ఇద్దరు యువకుల దారుణహత్య
కడ్తాల్: వాట్సాప్ గ్రూపు లొల్లి ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్‌లోని ఓ విల్లాలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గోవిందాయిపల్లికి చెందిన బీజేపీనేత జల్కం రవి ఇటీవల బటర్ ఫ్లై వెంచర్‌లోని ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టేట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ నెల 4న సాయంత్రం బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్నేహితులతో కలిసి రవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ ఫోటోలను రవి తన గ్రామా నికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గోవిందాయిపల్లికి చెందిన గుండెమోని శివగౌడ్(25), శేషగారి శివగౌడ్(27)లు రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. దీంతో 5వ తేదీన సాయంత్రం రవి వీరిద్దరిని తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అప్పటికే రవి వద్ద బీజేవైఎం నాయకుడు పల్లె రాజుగౌడ్ ఉన్నాడు. నలుగురూ మద్యం తాగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను ఎందుకు తొలగించారు..? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు అని రవి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆగ్రహానికిలోనైన రవి, పల్లె రాజుగౌడ్ కత్తులలో దాడి చేసి గుండెమోని శివగౌడ్, శేషగారి శివగౌడ్‌ను చంపేశారు. అనంతరం విల్లాకు తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బటర్ ఫ్లై సిటీలోని ఆ విల్లాకు వెళ్లి తాళం పగులగొట్టారు. లోపల రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహాలను పరిశీలించి, క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. గుండెమోని శివగౌడ్ హైదరాబాద్‌లోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తుండగా, శేషుగారి శివగౌడ్ డ్రైవర్‌గా పనిచేస్తునట్టు తెలిసింది. యువకుల హత్యలకు వాట్సాప్ వివా దమే కారణమా.. మరేదైనా ఉందా..? అని గ్రామస్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం– హైదరాబాద్ జాతీ య రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో రెండుగంటలకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో హైదరాబాద్ వెళుతున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జెడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీసింగ్ మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్‌కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన సహజీవనం
గుంటూరు ఈస్ట్: మహిళ దారుణ హత్యకు గురైన ఘటన నగరంలో కలకలం రేపింది. పాత గుంటూరు ఎస్హెచ్ఓ రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర కాలనీలో నివసించే ఆశ ఆరు నెలల కిందట రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చింది. మొదట శివ అనే వ్యక్తిని వివాహం చేసుకుని విడిపోయింది. అనంతరం దుర్గారావుతో సహజీవనం చేసి విడిపోయింది. ఆశకు నలుగురు పిల్లలు ఉన్నారు. గతంలో మూడో వ్యక్తితో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆశ ఓ వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మూడు వంతెనల వద్ద దుర్గారావు వారిని అడ్డకున్నాడు. తనతో తిరిగి సహజీవనం చేయాలని కోరాడు. ఆశ అందుకు నిరాకరించింది. దీంతో దుర్గారావు బెదిరించాడు. అయితే, అనూహ్యంగా ఎంప్లాయీస్ కాలనీ మెయిన్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున నడిరోడ్డుపై శవమై కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. చెత్త డబ్బాలో పెట్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన వివాహిత శ్వేత ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైంది. పాయింట్ కుక్ ప్రాంతంలోని మిర్కా వేలో ఇటీవల ఈ దారుణం చోటు చేసుకుంది. విక్టోరియా బిక్లీలోని కచ్చా రోడ్డు పక్కన చెత్త డబ్బాలో ఉన్న మృతదేహాన్ని విక్టోరియా పోలీసులు గుర్తించారు. తర్వాత హతురాలి భర్తే వచ్చి లొంగిపోవడంతో అతన్ని అరెస్టు చేశారు. మీడియా కథనాల ప్రకారం.. నగరంలోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత బాల్శెట్టి గౌడ్ కుమార్తె మధుగాని చైతన్య అలియాస్ శ్వేత కొన్నేళ్ల క్రితం వరికుప్పల అశోక్ రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇతను కూడా హైదరాబాద్ వాసే అని తెలుస్తోంది. కాగా వీరి పెళ్లిని ఇరుపక్షాల కుటుంబాలూ అంగీకరించలేదని సమాచారం. కత్తితో పొడిచి, బెడ్‌షీట్‌లో చుట్టి.. వివాహానంతరం అశోక్‌రాజ్, శ్వేత ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తమ ఇంట్లోనే శ్వేతను కత్తితో పొడిచి చంపిన అశోక్ శవాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలో పెట్టాడు. తన వాహనంలో ఆ డబ్బాను పెట్టుకుని మిర్కా వేకు 82 కిమీ దూరంలో ఉన్న బిక్లీ ప్రాంతంలోని ఓ నిర్మానుష్యమైన కచ్చా రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు. అనంతరం తన కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చాడు. బాలుడిని తమ ఇంట్లో వదిలేసి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఈ లోపు బిక్లీ ప్రాంతానికి చెందిన స్థానికులు అనుమానాస్పదంగా పడి ఉన్న చెత్త డబ్బాను గుర్తించారు. దీంతో విక్టోరియా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం పరీక్షలకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే హతురాలు శ్వేత అని, ఆమె భర్త తన కుమారుడితో కలిసి ఇటీవలే హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిన అశోక్ విక్టోరియా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో వారు అశోక్‌ను అరెస్టు చేశారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా.. శ్వేత మృతదేహంతో కూడిన డబ్బా పడున్న మార్గం పెద్దగా వినియోగంలో ఉండదని, రోజుకు కేవలం రెండుమూడు వాహనాలు మాత్రమే తిరుగుతూ ఉంటాయని బిక్లీలోని స్థానికులు అక్కడి మీడియాకు చెప్తున్నారు. మిర్కా వే ప్రాంతంలో తరచుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్వేత... ఇరుగుపొరుగు వారికి అవసరమైనప్పుడు, కీలక రోజుల్లో భోజనం తదితరాలను అందజేసేదని తెలుస్తోంది. దీంతో ఆమె హత్య విషయం తెలిసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. శ్వేత వ్యవహారశైలిని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారని ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించే అవకాశం లేదని, అక్కడే అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. -
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్‌ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువతి దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో మా గృహం వెనుక ఓ యువతి దారుణ హత్యకు గురయ్యింది. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలు మా గృహంలో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ మాఝి(23)గా గుర్తించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి నకిటిగుడ గ్రామానికి చెందిన ఈమె ఐదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం మా గృహం వెనుక కాలిపోయిన యువతి మృతదేహాన్ని గుర్తించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పొలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పొస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియలేదు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి బాలేదార్ మాఝి తన కుమార్తెను దారుణంగా తగులబెట్టి హత్య చేశారని పొలీసులకు ఇచ్చిన ఫిర్యాదులొ పేర్కొన్నారు. -
భార్యకు ఎఫైర్.. అతడిని చంపాకే ఇంట్లో అడుగుపెడతానని శపథం
కడప అర్బన్ : కడప నగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం సముదాయంలోని ఓ గదిలో ఆదివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్ఐసీ వారి ఈడీఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. తన వద్ద పార్ట్ టైంగా పని చేస్తున్న వ్యక్తిని హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. కడప నగరంలోని నిరంజన్‌నగర్‌లో చిట్వేలి భవానీశంకర్(30) తన భార్య బాబాబీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి జీవనం సాగించే వాడు. భవానీశంకర్ 14వ డివిజనల్లో వలంటీర్‌గా, అతని భార్య 13వ డివిజన్లో వలంటీర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు భవానీశంకర్ ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల్ఐసీలోని ఓ గదిలో ఎల్ఐసీ వారి ఈడిఎంఎస్ డిజిటలైజేషన్ విభాగం టీం లీడర్‌గా వున్న గుజ్జలి మల్లికార్జున దగ్గర పార్ట్‌టైం జాబ్ చేసేవాడు. వారిద్దరూ స్నేహితులు. ఈ విభాగంలో గతంలో భవానీశంకర్ భార్య బాబాబీ కూడా పని చేసేది. ప్రస్తుతం మల్లికార్జున దగ్గర భవానీశంకర్‌తోపాటు మల్లికార్జున భార్య శైలజ, మల్లికార్జున స్నేహితుడు, ఆటోడ్రైవర్ రంజిత్‌కుమార్ పని చేస్తున్నారు. మల్లికార్జునకు, కలసపాడుకు చెందిన తన అక్క కుమార్తె శైలజకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె సంతానంగా ఉంది. వివాహేతర సంబంధమే ప్రధాన కారణం భవానీశంకర్‌ను అతని స్నేహితుడు మల్లికార్జున, మరో వ్యక్తి వల్లూరు మండలం పాపాఘ్నినగర్కు చెందిన రంజిత్‌కుమార్ అనే ఆటోడ్రైవర్‌తో కలిసి దారుణంగా హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటనకు కేవలం వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. భవానీశంకర్, మల్లికార్జున భార్య శైలజతో వివాహేతర సంబంధం కలిగి వున్నాడని తెలుసుకున్నాడు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి తన భార్య శైలజతో గొడవపడ్డాడు. ఈ నెల 12 తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో తన భార్య శైలజతో భవానీశంకర్‌ను చంపిన తరువాతే ఇంటిలో అడుగుపెడతానని శపథం చేసి వెళ్లాడు. హత్య చేసేందుకు పథకం రచించాడు. తనతోపాటు వున్న రంజిత్కుమార్తో కలిసి ఆటోలో చింతకొమ్మదిన్నె మండలానికి వెళ్లాడు. అక్కడి నుంచి వైవీ స్ట్రీట్‌కు వచ్చి కత్తి, కొడవలిని తీసుకున్నాడు. తాను పని చేస్తున్న ఎల్ఐసీ ఆఫీసుకు వచ్చాడు. భవానీశంకర్‌కు ఫోన్ చేసి అత్యవసరంగా ఆఫీసుకు రావాలని పిలిచాడు. అతను గదిలోకి రాగానే గడియపెట్టి కత్తి, కొడవలితో దారుణంగా పొడిచాడు. అతను తేరుకునేలోపే మెడ, ఛాతీ, వీపు భాగాలపై కర్కశంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడివుండగా.. రంజిత్కుమార్తోపాటు బయటకు వచ్చి పరారయ్యాడు. ఈ సంఘటన ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న హతుని భార్య బాబాబీ, తన బంధువులతో పాటు మృతదేహం వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, సీఐ ఎన్.వి నాగరాజు, ఎస్ఐలు మధుసూదన్‌రెడ్డి, రంగస్వామి, సిద్దయ్యలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితులు పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం. -
గనుల శాఖ మహిళా అధికారి హత్య
బనశంకరి: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర గనులు, భూ విజ్ఞానశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ(40) అనే అధికారిణి దారుణహత్యకు గురయ్యారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆమె ఆఫీసు నుంచి దొడ్డకళ్లసంద్రలోని తన అపార్టుమెంటులోని ఫ్లాటుకు చేరుకున్నారు. కొంతసేపటికి గుర్తుతెలియని దుండగులు చొరబడి ఆమెను గొంతుకోసి, చంపి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో 8 గంటల సమయంలో స్నేహితులు వచ్చి చూశాక దారుణం వెలుగులోకి వచ్చింది. సుబ్రమణ్యనగర పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె భర్త, ఇంటర్ చదివిన కొడుకు సొంతూరైన శివమొగ్గలోని తీర్థహళ్లి తాలూకాలో ఉంటారు. -
ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
కోలారు: మైనర్ బాలున్ని మరో మైనర్ బాలుర గుంపు చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కోలారు నగరంలోని పీసీ కాలనీలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా దుష్ప్రభావం, బాలలు, యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తికి ఈ హత్య అద్దం పడుతోంది. కోలారు శాంతి నగర్‌కు చెందిన కార్మికుడు అరుణ్, సుశీల కుమారుడు కార్తీక్ సింగ్ (17) హత్యకు గురైన బాలుడు. వివరాలు.. కార్తీక్‌సింగ్ నగరంలోని కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాడు. పీసీ కాలనీకి చెందిన మరో మైనర్ బాలునికి కార్తీక్సింగ్తో గొడవలు ఉన్నాయి. నిందితుడు, అతని స్నేహితులు కార్తీక్ సింగ్‌కు పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తెలిపి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలోకి పిలిపించారు. అక్కడ అతన్ని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. కత్తితో గొంతు కోసి పరారయ్యారు. రక్తపుమడుగులో మృతదేహం పడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుని నేరాల బాట వేమగల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీస్ మురుగన్ కుమారుడు దిలీప్ అలియాస్ షైన్ సూత్రధారి అని ప్రచారం సాగుతోంది. దిలీప్ గత ఫిబ్రవరి నెలలో కూడా ఒకసారి కత్తితో ఒకరిపై దాడి చేశాడు, దీనిపై కోలారు నగర పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా, పోలీసు కొడుకే అని సర్దిచెప్పి పంపారు. ఇతడు గంజాయికి బానిసై స్నేహితులతో కలిసి దౌర్జన్యాలు చేసేవాడు. సుమారు 8 నెలల కిందట కూడా కార్తీక్ సింగ్‌ని తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి వైరల్ చేశారు. పోలీసుల గాలింపు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఎస్ఎన్ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. హంతకులు పరారీలో ఉండి వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు 3 తనిఖా బృందాలను ఏర్పాటు చేశారు. ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. కఠినంగా శిక్షించాలి: కార్తీక్ తల్లి నా కుమారున్ని ఆ దుండగులే పిలుచుకుని వెళ్లారు. నేను కొంతసేపటికి కార్తీక్ మొబైల్‌కు ఫోన్ చేసినప్పుడు స్విచాఫ్ వచ్చింది. కార్తీక్‌ను ఎవరో కొట్టి చంపారని తరువాత మాకు తెలిసినవారు చెప్పారు. హంతకులకు కఠిన శిక్షలు విధించాలి. -
లాడ్జిలో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: లాడ్జిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో ఎస్ఎస్ రెసిడెన్సీ లాడ్జిలో ఆదివారం ఉదయం బళ్లారికి చెందిన నవీన్ (26), ఏలూరుకు చెందిన ప్రవీణ్ రెండో ఫ్లోర్‌లోని 211 గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రూమ్‌లో ఏసీ సరిగ్గా రాకపోవటంతో వారు మూడో ఫ్లోర్‌లోని 303కు మారారు. ఇద్దరు కలిసి రాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో వారి మధ్య ఘర్షణ జరగడంతో ప్రవీన్ నవీన్‌ను కత్తితో మెడపై పొడవటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ► సోమవారం ఉదయం గది ఖాళీ చేయాలని చెప్పేందుకు వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టగా నవీన్ బెడ్‌పై రక్తపు మడుగులో కనిపించాడు. దీంతో వారు కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. నవీన్ మృతదేహం పక్కన పడి ఉన్న మద్యం బాటిళ్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుడు ప్రవీణ్ కోసం గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. -
రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య
అమీర్‌పేట: పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్ మరో ఇద్దరితో కలిసి ఓ యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన తరుణ్ (22) డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. సోమవారం రాత్రి అతను బాపూనగర్‌లో దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఓ స్నేహితుడు వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీ షీటర్ షేక్ షరీఫ్, మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతూ ఉన్నాడు. తరుణ్ కూడా వారితో కూర్చున్నాడు. కొద్ది సేపటి తర్వాత షరీఫ్ తరుణ్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో షరీఫ్ వెంట ఉన్న వ్యక్తులు తరుణ్‌పై దాడి చేశారు. దీంతో బాపూనగర్‌కు వెళ్లిన తరుణ్ దాడి విషయాన్ని తన స్నేహితుడికి చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్‌ను వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వచ్చాడు. తరుణ్ రాయితో షరీఫ్‌ను కొట్టడంతో అతను తరుణ్ కణతపై బలంగా కొట్టాడు. కిందపడి పోయిన తరుణ్‌పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అతడి అరుపులు స్థానికులు అక్కడికి చేరుకునేలోగా షరీఫ్ అతడి అనుచరులు పారి పోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్‌ను పోలీసులతో కలిసి అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవీస్, ఎసీపీ వెంకటేశ్వర్రావు, సీఐ రాంప్రపాదరావు పరిశీలించారు. పథకం ప్రకారమే హత్య: హత్యకు గురైన తరుణ్ ,రౌడీ షీటర్ షరీఫ్ మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ నేపథ్యంలో తరుణ్‌ను హత్య చేసి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. నాలుగు నెలల క్రితం కూడా ఫరీష్ తరుణ్‌కు కొట్టి సెల్ ఫోన్ పగలకొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో తరుణ్‌పై మరింత ఆగ్రహం పెంచుకున్నాడు. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.నీ అంతు చూస్తానంటూ షరీఫ్ తరుణ్‌ను తరుచూ బెదిరించేవాడని స్నేహితులు తెలిపా రు. ఇందులో భాగంగానే పథకం ప్రకారం దసరా పండుగ రోజున తరుణ్‌ను దాసారం బస్తీకి పిలిపించి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య దారుణ హత్య
హైదరాబాద్: అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నందున పోలీసులకు లొంగిపోవాలని సూచించినందుకు ఓ రౌడీషీటర్‌ను మరో రౌడీషీటర్ కత్తులతో పొడిచి హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన టార్గెట్‌లో మరో ఇద్దరు ఉన్నారని.. వారిని హత్య చేసిన అనంతరం లొంగిపోతానంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్ డైరీఫామ్ ప్రాంతానికి చెందిన ఖూనీ గౌస్ రౌడీషీటర్. ఇతనిపై ఇప్పటికే హత్య, హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీలు, భయబ్రాంతులకు గురి చేయడం తదితర కేసులు నమోదై ఉన్నాయి. గతంలో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన ఖూనీ గౌస్ గత నెలలో బయటికి వచ్చాడు. బయటికి వచి్చన అనంతరం తన గ్యాంగ్‌తో పాత సామ్రాజ్యాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన కదలికలపై పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి ఐదు రోజుల క్రితం అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డైరీఫామ్ వద్ద పాలను విక్రయించే ఓ వ్యక్తి దుకాణంపై దాడి చేశాడు. షాపును పట్టపగలే తగులబెట్టాడు. అడ్డొచ్చిన వారిని కత్తులతో బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు..నిందితున్ని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా..రాజేంద్రనగర్‌కు చెందిన మరో రౌడీషీటర్ సర్వర్ (30) ఇటీవల ఖూనీ గౌస్‌ను కలిసి గొడవలు వద్దని, పోలీసులకు లొంగిపోవాలని సూచించాడు. దీంతో ఖూనీ గౌస్ శుక్రవారం రాత్రి కలుద్దామంటూ సర్వర్‌కు తెలిపాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సర్వర్‌కు ఫోన్ చేసి జనప్రియ వెంచర్ ప్రాంతంలోని మొండి ఖత్వా ప్రాంతానికి రావాలని తెలిపాడు. సర్వర్ అక్కడికి వెళ్లగానే.. తననే పోలీసులకు లొంగిపోమంటావా...అంటూ కత్తులతో విక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో సర్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడే ఉన్న ఇతర స్నేహితులతో ‘మరో ఇద్దరు తన టార్గెట్ అని..వారిని చంపిన అనంతరం పోలీసులకు లొంగిపోతానని’ తెలిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పుడే అరెస్టు చేసి ఉంటే... ఐదు రోజుల క్రితం డైరీఫామ్ వద్ద జరిగిన దాడిలో నిందితుడైన ఖూనీ గౌస్‌ను అరెస్ట్ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగింద ని ఆరోపించారు. ఖూనీ గౌస్ అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తాడని... గతంలో అత్తాపూర్, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పీడీ యాక్ట్ అనంతరం జైలు నుంచి విడుదలైన ఖూనీ గౌస్‌పై నిఘా లేకపోవడంతో ఈ సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంలో వెంట నే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని మూడేళ్ల చిన్నారిని చిత్ర హింసలకు గురి చేసి అతి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అనిత మంగళవారం తీర్పు చెప్పారు. 2022 ఆగస్టులో ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోహన్‌నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకోగా ఇన్స్పెక్టర్ జహంగీర్‌యాదవ్ నేతృత్వంలో ఎస్సై సురేందర్ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... నిజామాబాద్ జిల్లా, బిచ్పల్లి మండలం, ధర్మారం గ్రామానికి చెందిన కొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతుతకు పవన్(7), భరత్‌కుమార్(3)లు అనే ఇద్దరు సంతానం. పెళ్లికి ముందేనాగలక్ష్మికి ఇదే జిల్లా మాధవనగర్ గ్రామానికి చెందిన ముస్తాల రవితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చి పార్సిగుట్ట మున్సిపల్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ వర్కర్‌గా పని చేసేవాడు. ఇదే సమయంలో నాగలక్ష్మి కూడా హైదరాబాద్ వెళ్లి ఏదో పని చేసుకుని బతుకుదామని భర్తకు నచ్చజెప్పి హైదరాబాద్ తీసుకువచి్చంది. ఇద్దరు పిల్లలతో కలిసి రవి నివాసానికి కొద్ది దూరంలోని మోహన్‌నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శివకుమార్‌కు రవి పెయింటర్‌గా పని ఇప్పించాడు. నాగలక్ష్మి పెద్ద కుమారుడు పవన్ స్కూల్‌కు వెళ్తుండగా చిన్న కుమారుడు భరత్(3) పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్‌కు వెళ్లేవాడు. భర్త పనికి వెళ్లిన సమయంలో రవి నాగలక్ష్మి ఇంటికి వచ్చి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. అయితే భరత్ తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి అతడి అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి పథకం పన్నారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి భర్త శివకుమార్‌తో రవికి ఫోన్ చేయించి అంగన్వాడీ సెంటర్లో ఉన్న తన చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లమని చెప్పించింది. దీంతో అతను భరత్‌ను ఇంటికి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో అతడికి తీవ్ర రక్త విరోచనాలు అయ్యాయి. ఆ తర్వాత రవి శివకుమార్‌కు ఫోన్ చేసి భరత్ కురీ్చపై నుంచి కిందపడ్డాడని తీవ్ర గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో శివకుమార్ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా నాగలక్ష్మి ఏడుస్తూ నటించింది. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం చేయించగా బాలుడి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవిని అదుపులోకి తీసుకుని విచారించగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి నాగలక్షి్మతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు నాగలక్ష్మి, రవిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవిని దోషిగా నిర్ధారిస్తూ యావజీవ కారాగార శిక్ష విధించింది. -
వృద్ధురాలి దారుణ హత్య
తూర్పు గోదావరి: కోరుకొండ మండలం కణుపూరులో తల్లోజు పార్వతి (75) దారుణ హత్యకు గురైంది. తన ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రించిన ఆమె బుధవారం ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉంది. కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.ఉమా మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కణుపూరు మెయిన్ రోడ్డు బ్రహ్మాలవీధిలో పార్వతి నివాసం ఉంటోంది. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన మూడో కుమారుడు వెంకటేశ్వర్లు ఇంట్లో టీవీ సీరియల్ చూసింది. అనంతరం నాలుగో కుమారుడు వీరబాబు ఉంటున్న తన ఇంటికి వచ్చి నిద్రించింది. బుధవారం తెల్లవారేసరికి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూజ్ బృందాలు వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించాయి. రక్తపు మరకలు ఉన్న నైటీని ఆ ఇంటి లోపల షెడ్లో గుర్తించాయి. బలమైన కర్రతో కొట్టి.. పోలీసు డాగ్ తొలుత ఇంటి నుంచి బయటకు వచ్చి మెయిన్ రోడ్డు మీదుగా సమీప ఇంటి వైపునకు పరుగులు తీసింది. తర్వాత మృతురాలి ఇంటి ఆవరణలోని షెడ్డులోకి వెళ్లింది. అనంతరం రోడ్డు మీదకు వచ్చింది. అలాగే క్లూజ్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, మృతిరాలి తలపైనున్న మరకలను పరిశీలించింది. తలపై బలమైన కర్ర లేదా రాడ్డుతో కొట్టి చంపిఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను విచారణ చేస్తున్నారు. తల్లోజు పార్వతికి తొమ్మిది మంది సంతానం. వారిలో ఐదుగురు కూతుర్లు, నలుగురు కుమారులున్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కావడంతో వేరే గ్రామాల్లో ఉంటున్నారు. కుమారుల్లో చిన్నవాడితో పాటు ఉమ్మడి ఇంట్లో పార్వతి నివసిస్తోంది. ఆమె భర్త సుబ్బారావు గతంలోనే మృతి చెందాడు. -
ఇంటిపై కన్నేసి.. ఎన్నారైని చంపేసి!
హైదరాబాద్: నగరంలో ఉన్న స్థిరాస్తుల క్రయవిక్రయం పేరుతో ఓ ఎన్నారైకి చేరువయ్యాడు. ఆయన ఇంటిపై కన్నేసి సొంతం చేసుకోవాలనుకున్నాడు.. దాన్ని ఖరీదు చేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నాడు.. తన పథకాన్ని అమలు చేస్తూ అతడిని దారుణంగా చంపేశాడు.. గోపాలపురంలో ఉన్న సరోజినీదేవి రోడ్‌లోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ వ్యవహారమిది. ఈ దారుణంలో పాలు పంచుకున్న అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలతో పాటు రాజేష్‌ను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పౌరసత్వం రావడంతో విక్రయాలు... పద్మారావునగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాతగా పనిచేశారు. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని నిర్ణయించారు. అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన రవి కాట్రగడ్డతో ఇప్పటికీ స్నేహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అంజిరెడ్డి తన ఆస్తుల విక్రయం విషయం ఆయనకు ఎనిమిది నెలల క్రితం చెప్పి అమెరికా వెళ్లారు. రవి ఈ అంశాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారు. నెల రోజుల క్రితం భార్యతో తిరిగి వచి్చన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజే‹Ùను తీసుకువచ్చారు. ఇంటిపై మక్కువను గుర్తించి.. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌లోని ఇల్లు తనకు నచి్చందని, తాను ఖరీదు చేస్తానని అంజిరెడ్డితో పాటు ఆయన భార్యతోనూ నమ్మబలికాడు. 1986లో కట్టిన ఆ ఇంటిపై భార్యాభర్తలకు ఉన్న మక్కువను గుర్తించిన రాజేష్.. వారిని బుట్టలో వేసుకునేలా మాట్లాడాడు. ఆ ఇంటిని పడగొట్టనని, మరింత అందంగా తీర్చుదిద్దుతానని తరచూ చెబుతుండేవాడు. సైదాబాద్‌లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్.. దాన్ని ఖరీదు చేయడానికి ఓ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పాడు. తమ ఆస్తుల్ని విక్రయించిన ఇద్దరు మహిళలు ఇది ఖరీదు చేయడానికి అంగీకరించారంటూ అంజిరెడ్డితో చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్ వారితో చెప్పాడు. దీంతో భార్య వెళ్లగా.. అంజిరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. పథకం ప్రకారం డ్రాఫ్ట్ సిద్ధం చేసి.. ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్ భావించాడు. దీనికోసం రెండు విడతల్లో ఆయనకు రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వయోవృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డి మేడ్చల్‌లోని అద్వైత్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా ఖరీదు చేయాలని భావించారు. గత నెల 29 ఉదయం పద్మారావునగర్‌కు వెళ్లిన రాజే‹Ù... అంజిరెడ్డిని తీసుకుని మేడ్చల్ వెళ్లారు. అక్కడ ఉండగా ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసిన భార్యతో అంజిరెడ్డి అదే విషయం చెప్పారు. ఆ తర్వాత మోకిలాలో ఉండే కుమారుడు శ్రీచరణ్‌రెడ్డి ఎన్నిసార్లు ప్రయతి్నంచినా అంజిరెడ్డి ఫోన్ కలవలేదు. అంతా కలిసి హత్య చేశారు.. అంజిరెడ్డి, రాజేష్ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు వేర్వేరు కార్లలో జీఆర్ కన్వెన్షన్ ఉన్న డీమార్ట్ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. బేస్మెంట్– 3లో అంజిరెడ్డి కారు పార్క్ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆపై మృతదేహాన్ని బేస్మెంట్–3లోని ఆయన కారు వద్దకు తీసుకువచ్చి పడేశారని అనుమానిస్తున్నారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు చరణ్‌కు ఫోన్ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. హుటాహుటిన వచి్చన ఆయన బేస్మెంట్–3లో కారు పార్క్ చేసి ఉండటం, దాని పక్కనే అంజిరెడ్డి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించారు. గోపాలపురం పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలతో హత్యగా తేల్చారు. రాజేష్ సహా అయిదుగురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్‌కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు -
రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
కరీంనగర్: రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి, కార్పొరేషన్ 39వ డివిజన్ ఖాజీపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేకల లింగయ్య సోమవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సమస్యాత్మక భూములను కొంటూ.. వాటిని పరిష్కరించి.. విక్రయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ఓ భూమి విషయంలో లింగయ్యకు.. మరికొందరికి వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో లింగయ్య రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో పెంపుడు కుక్కతో ప్రధాన రహదారి నుంచి పవర్‌ప్లాంట్‌కు వెళ్లే దారిలో వాకింగ్ చేస్తున్నారు. అప్పటికే మాటువేసిన దుండగులు లింగయ్యపై వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్సై జీవన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కృష్ణాష్టమి రోజే హత్యకు ప్లాన్..? లింగయ్యను హత్య చేసేందుకు నిందితులు కృష్ణాష్టమి రోజే ప్రత్యర్థులు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. అనంతరం వినాయక చవితి పండుగపూట రోడ్లపై ఎవరూ ఉండరని, హత్యకు అదే అనువైన సమయమని దుండగులు భావించినట్లు సమాచారం. సుమారు 12 రోజులపాటు గస్తీ నిర్వహించి.. వాకింగ్‌కు వెళ్లే సమయం అనుకూలమని నిందితులు నిర్ధారించుకుని పక్కా ప్లాన్ ప్రకారమే రాత్రి సమయంలో లింగయ్య వాకింగ్ చేస్తుండగా.. వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నాడు అన్న.. నేడు తమ్ముడు ఖాజీపల్లికి చెందిన మేకల లింగయ్యతో కలిపి ఐదుగురు అన్నదమ్ములు. లింగయ్య అన్న రాజయ్య 1991 ఏప్రిల్ 4న పొలం పనులకు వెళ్లి ఇంటికొస్తుండగా ఇంటి సమీపంలోనే ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. కుటుంబంలో చిన్నవాడైన మేకల లింగయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తాజాగా అతడి హత్య జరిగిన 32 ఏళ్ల తర్వాత లింగయ్యను కూడా అలాగే హతమార్చడం స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీస్ పహారా మధ్య ఖాజీపల్లి లింగయ్య హత్యలో ఓ అనుమానితుడి ఇంటి ప్రహరీని లింగయ్య కుటుంబసభ్యులు కూల్చివేశారు. దీంతో ఖాజీపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. లింగయ్య అంత్యక్రియల సమయంలోనూ గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పహారా కొనసాగించారు. డాగ్‌స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బాధితుడి కూతురు మేకల సుప్రజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల కోసం ప్రత్యేక బలగాలు గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య
ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్‌గూడెం నుంచి పాఠశాలకు బైక్‌పై వెళుతూ హత్యకు గురయ్యాడు. కారుతో బైక్‌ను ఢీకొట్టి.. వెంకటచారి బైక్ పై వెళుతుండగా నాయకన్గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్‌గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్‌రెడ్డి , ఎస్పై రమేష్‌కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు.