
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీ ఫలక్ నుమా పోలీస్ పరిధిలోని వట్టెపల్లిలో చోటుచేసుకుంది. వివరాలివి.. ఫలక్ నుమా రౌడీషీటర్ ఈసా(35)పై శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు తళ్వార్లతో దాడి చేశారు. సంఘటన స్థలంలోనే ఈసా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ యాదగిరి, ఏసీపీ సయ్యద్ ఫైయాజ్ సంఘటన స్థలం చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మర్చరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.