
సాక్షి, హైదరాబాద్ : ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఖైరతాబాద్‌లోని బీజేఆర్ నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు శివకిరణ్ అనే యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బోరబండకు చెందిన శివకిరణ్‌గా గుర్తించారు. హత్య కేసుతో పాటు చాలా కేసుల్లో శివకిరణ్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment