విషాదం: యువతి, యువకుడు ఆత్మహత్య | Young man And young woman Commits Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

విషాదం: యువతి, యువకుడు ఆత్మహత్య

Published Fri, Apr 20 2018 6:21 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Young man And young woman Commits Suicide In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ :  ఇంట్లో ఎవరులేని సమయంలో ఓ యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నగరంలోని ఖైరతాబాద్ సీబీఐ క్వార్టర్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. వర్షశ్రీ(22), మహేశ్వర రెడ్డి(25)లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహేష్‌ ఉరివేసుకోగా, యువతి కిటికీకి బట్ట బిగించుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కుటుంబ సభ్యులు అందరూ బంధువుల పెళ్లికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement