
మృతురాలు అర్షిత( అంతర్ చిత్రంలో పాత చిత్రం)
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో ఎమ్మెస్సీ చదువుతున్న అర్షిత అనే విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది. నల్లగండ్లలోని హిమసాయి లేక్ వ్యూ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎమ్మెస్సీ సెమిస్టర్‌లో రెండు సార్లు ఫెయిల్ అవడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
14వ అంతస్తు నుంచి దూకడంతో అర్షిత శరీరంలోని ఎముకలు విరిగి ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడ్డాయి. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హిమసాయి అపార్ట్మెంట్‌కు అర్షిత ఎందుకు వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అర్షిత మృతదేహాన్నిపోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment