Student Activities
-
ఏం పిల్లలండీ బాబు..! స్కూల్ జైల్ అట! ఏకంగా అమ్మేసేందుకు ప్లాన్
స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. పోనీ టీచర్ చదువులు చెప్పకపోతే కంప్లైంట్ చేస్తారు. అదీ కాకపోతే మౌళిక సదుపాయాలు సరిగా లేకపోతే అమ్మనాన్నలకు చెబుతారు. కానీ అమెరికాలో ఓ స్కూల్ పిల్లలు చేసిన పనికి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పిల్లలు చేసిన పనేంటంటే..! అమెరికాలోని మేరీలాండ్‌లో మీడే సీనియర్ హై స్కూల్ అనే పేరు గల పాఠశాల ఉంది. ఇందులో పిల్లలకు ఏం అనిపించిందో తెలియదు కానీ స్కూల్‌నే అమ్మకానికి పెట్టారు. స్థానిక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ 'జిల్లో'లో రూ.34.7లక్షలకు బేరం పెట్టారు. 12,458 గజాల స్కూల్ బిల్డింగ్ 'సగం పని చేసే జైల్' గా పేర్కొని లిస్టింగ్ చేశారు. ఈ జైళ్లో 15 బాత్రూమ్లు, ప్రత్యేకమైన కిచెన్, ప్రైవేట్ బాస్కెట్ బాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాదు అక్కడక్కడ సగం నిర్మాణంలో ఉన్న గోడలు ప్రాణాలను తీస్తాయని తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాతపూర్వకంగా వెబ్సైట్లో తెలిపారు. ఈ వినూత్నమైన లిస్టింగ్‌ను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. ఇంత మంచి ఆస్తిని ఇంత తక్కువకు అమ్ముతున్నారేంటని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. కొనుగోలుదారులు ఇలాంటి అవకాశాలను వదలుకోబోరని తెలిపారు. పిల్లలు చేసిన కొంటె పనితో స్కూల్ యాజమాన్యానికి చెమటలు పట్టినంత పనైంది. లిస్టింగ్ చేసిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్ నుంచి ఆ లిస్టింగ్‌ను తొలగించినట్లు తెలిపింది. తమ పిల్లలు క్రియేటివిటీకి ఆశ్చర్యపోయినప్పటికీ.. మరీ ఇంత తక్కువ డబ్బులకు లిస్టింగ్ చేయడం వింత కలిగించిందని ఓ ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తెలిపారు. ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
నిబంధనలకు విరుద్ధం!..జుట్టు కత్తిరించిన ప్రిన్స్‌పాల్
Principal Cuts Students Hair: ఇంతవరకు మనం పిల్లలు మాట వినకపోతే అత్యంత దారుణంగా పిల్లలను కొట్టడం వంటి వాటి గురించి విన్నాం. అంతెందుకు కొంతమంది టీచర్లు పిల్లలను సరిగా చదవడం లేదంటూ వేరే విద్యార్థులతో పోలుస్తూ తిట్టడం వంటి ఘటనలు చూశాం. కానీ ఇక్కడొక ప్రిన్స్‌పాల్ నిబంధనలకు విరుద్ధం అంటూ ఎంత పని చేశాడో చూడండి. (చదవండి: వృక్షాన్ని వివాహం చేసుకున్న మహిళ!...ఎందుకో తెలుసా!!) మహారాష్ట్రలోని పాల్ఘర్లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ చాలా మంది విద్యార్థులకు జుట్టు పెంచవద్దు అని పదేపదే హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో వారికి హెయిర్ కట్ చేయించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు పొడవాటి జుట్టుతో తరగతులకు వస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని మీడియాకి తెలిపారు. అయితే ఈ ఘటన పై పలువురుతల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్స్‌పాల్ చర్యను ఖండించారు. (చదవండి: ప్రధాని ఫోటో తొలగించాలంటూ పిటిషన్.. లక్ష జరిమానా వేసిన హైకోర్టు!) -
చరిత్ర సృష్టించిన రష్మీ సామంత్
లండన్ : భారత్‌కు చెందిన రష్మీ సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021–22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. సిలబస్ డీకాలనైజేషన్, డీకార్బొనైజింగ్ అనే రెండు ప్రధానాంశాలను ఆమె తన మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. బేమ్ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్) వర్గానికి చెందిన ఆమె బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని కూడా తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు. -
పొలాస స్టుడెంట్స్ అదుర్స్..
సాక్షి, జగిత్యాల: వ్యవసాయ విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ‘పొలాస’ విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు ఏ క్రీడా పోటీల్లో పాల్గొన్నా ఓవరాల్ చాంపియన్ షిప్‌లతో పాటు వ్యక్తిగత బహుమతులు గెలుచుకుంటూ రాష్ట్రంలోని మిగతా వ్యవసాయ కళాశాలలకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల జనవరి 19 నుంచి 24 వరకు హైద్రాబాద్‌లో నిర్వహించిన వ్యవసాయ వర్సిటీ రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల్లో 20 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకొని, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. కళాశాల ప్రాంగణంలోనే ఆటస్థలం సాధారణంగా ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఆటలంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ వీరిని ఆటల వైపు తీసుకువచ్చి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జరిగే అన్ని ఆటల పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు హాస్టళ్లలో సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు వారిని గ్రౌండ్‌కు తీసుకొస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోనే ఆట స్థలం ఏర్పాటు చేసి, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, షటిల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో రన్నింగ్, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, హై జంప్, షాట్‌పుట్ తదితర ఆటల్లో విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఓవరాల్ చాంపియన్ షిప్ కూడా సాధించారు. అశోక్‌కుమార్ అనే విద్యార్థి అథ్లెటిక్స్‌లో వ్యక్తిగతంగా ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించాడు. సాంస్కృతిక పోటీల్లోనూ సత్తా ఒక్క క్రీడా పోటీల్లోనే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం తమ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు. రంగోళి, కార్టూన్ మేకింగ్, స్పాట్ పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ విభాగాల్లో శ్రావణి అనే విద్యార్థిని అనేక బహుమతులు గెలుచుకుంది. పలువరు విద్యార్థులు సోలో క్లాసికల్ డ్యాన్స్, క్విజ్, తెలుగు ఉపన్యాసం, ఇంగ్లిష్ ఉపన్యాసం విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. విద్యార్థిని మానస రెడ్డి మార్షల్ ఆర్ట్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. జాతీయస్థాయిలో విజయాలు జాతీయ స్థాయి పోటీల్లో సైతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2011లో మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాజశేఖర్ ప్రథమ, అథ్లెటిక్స్‌లో మహేశ్ ప్రథమ స్థానంలో నిలిచారు. 2009లో మహారాష్ట్రలోని పర్భనిలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాజు, రవీందర్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నీలకంఠ రాజరుషి 10 క్రీడా విభాగాల్లో సత్తా చాటి, రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్ చాంపియన్‌గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి క్విజ్‌లో ఏఎస్.అభిరామ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో బాలికల విభాగంలో మా విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. అథ్లెటిక్స్‌లో, సాంస్కృతిక పోటీల్లో చాలామంది సత్తా చాటారు. వారు జాతీయ స్థాయిలోనూ రాణిస్తారన్న నమ్మకం ఉంది. – డాక్టర్ కేబీ.సునీతాదేవి, అసోసియేట్ డీన్, పొలాస -
సంప్రదాయ షోయగం
-
పచ్చని ఒడి.. సర్కారు బడి
సాక్షి,పెద్దవూర : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే పచ్చదనం పందిళ్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలను నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టమే. పాఠశాలల్లో ఇలాంటి వాతావరణమే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొక్కలు పెట్టినట్లుగా ఫొటోలకు ఫోజిచ్చి మరుసటి నాటినుంచి వాటి సంరక్షణను పూర్తిగా మరిచిపోతున్నారు అధికారులు. దీంతో నాటిన మొక్కలు నాటినట్లుగానే ఎండిపోతున్నా యి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వన నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంది. లెక్కల్లో మాత్రం ఈ సంవత్సరం ఇన్ని లక్షల మొక్కలు నాటాము అని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకోవడం తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకో వడం లేదు. ఒక మంచి పనిని పక్క వ్యక్తితో చే యించాలంటే ఆ పని తాను చేసి చూపించి ఆదర్శవంతంగా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుందనే విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టారు మండలంలోని చలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం త్రిపురనేని లక్ష్మీప్రభ. అలాంటి వా తావరణాన్ని కోరుకోవడటమే కాదు దానిని సాకా రం చేసుకుని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపారు. నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని వాటిని సంరక్షించారు. గత నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పర్చుకుంది. రకరకాల మొక్కలు పాఠశాల ఆవరణలో హెచ్ఎం లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు ఔషద మొక్కలు, పూల మొక్కలు గాని కనిపిస్తే చాలు వాటిని కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి వాటిని విద్యార్థులచే నాటిం చి విద్యార్థులకు దత్తత ఇస్తుంటారు. నాటిన మొక్కలను సైతం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గావిస్తూ సంరక్షిస్తుంటారు. ఇష్టంతో పెంచుతున్నా .. మేడంలు, సార్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పటంతో ప్రతి ఒక్కరము తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నాము. ఒకరికి ఒకరు పోటీపడుతూ పాఠశాల సెలవుదినాలలోనూ స్కూలుకు వచ్చి మొక్కలకు నీటిని పోసి పెంచుతున్నాము. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కలు చెట్లు అయ్యాయి. – బూరుగు అనూష, 4వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.. మొక్కలు నాటి వాటిని పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణను విద్యార్థులకు అప్పగించాము. నిత్యం వారికి సలహాలు ఇస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతూ మొక్కలను సంరక్షిస్తున్నాము. – కె.నాగరాజు, ఉపాధ్యాయుడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. పచ్చదనం అంటే నాకు ఎంతో ఇష్టం. పాఠశాలను పచ్చదనంతో నింపాలని అనుకున్నాను. హరితహారంలో భాగంగా నీడనిచ్చే కొన్ని మొక్కలను నాటాము. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, ఔషద మొక్కలను బయటినుంచి కొనుగోలు చేసి నాటించాను. – త్రిపురనేని లక్ష్మీప్రభ, హెచ్ఎం, పీఎస్ చలకుర్తి -
అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి
మిన్నెసోటా: అమెరికాలోని మిన్నెయాపోలిస్ నగరంలో అక్కడి కాలమానం ప్రకారం నవంబర్ 7న భార్గవ్ రెడ్డి ఇత్తిరెడ్డి(25) అనే తెలుగు విద్యార్థి ఆకస్మికంగా మృతిచెందాడు. గుండెపోటు రావడంతో తోటి స్నేహితులు దగ్గరలోని మెడికల్ సెంటర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఇత్తిరెడ్డి భార్గవ్ రెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో భార్గవ్ ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉద్యోగం వెతుక్కునేందుకు టెక్సాస్ నుంచి మిన్నెయాపోలిస్ నగరానికి ఇటీవల మారాడు. చిన్నవయసులోనే మృతిచెందడం విషాదకరమని తోటి స్నేహితులు తెలిపారు. ఎప్పుడూ ఇతరులకు సహాయపడే మనస్తత్వం భార్గవ్‌దని స్నేహితులు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భార్గవ్ రెడ్డి మృతి విషయం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
చదవకుండానే ఫీజు కట్టమంటూ వేధింపులు
విశాఖపట్నం, చోడవరం: తాను కాలేజీలో చదవక పోయినా ఫీజు చెల్లించాలని వేధిస్తుండడంతో పాటు తన ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఓ గిరిజన విద్యార్థిని చోడవరం తహసీల్దార్, పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసింది. కొయ్యూరు మండలం బట్టపనుకుల గ్రామానికి చెందిన బాధిత విద్యార్థిని జంపా సునీత కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 2016లో తాను ఇంటి వద్ద ఉండగా చోడవరం ఫోర్ ఎస్ కాలేజీకి చెందిన కొంత మంది సిబ్బంది వచ్చి తమ కాలేజీలో డిగ్రీ చదవడానికి చేరాలని కోరారని చెప్పింది. అప్పటికే తాను ఇంటర్ పూర్తిచేయడంతో డిగ్రీ బీకాంలో చేరాలని భావించానని, అయితే కాలేజీకి వచ్చి వివరాలన్నీ ఇస్తానని చెప్పినప్పటికీ తనపై ఒత్తిడి చేసి ముందుగా టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు ఇస్తేనే కాని సీటు రిజర్వు చేయలేమని చెప్పి సర్టిఫికెట్లు తీసుకెళ్లారని తెలిపింది. ఆ తర్వాత మా కుంటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఆ కాలేజీతో పాటు ఏ కాలేజీలోనూ చేరలేదని చెప్పింది. ఇచ్చిన సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళదామంటే చార్జీలకు కూడా డబ్బులేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత కాలేజీకి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగానని, ఏడాది ఫీజు రూ.15వేలు చెల్లిస్తేనే కాని సర్టిఫికెట్లు ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. ఎంత ప్రాథేయపడినా ఇవ్వలేదని ఆమె వాపోయింది. ఈవిషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పానని, అంత డబ్బులేకపోవడంతో ఇప్పటి వరకు రాలేదని, తమ గ్రామంలో ఇంటర్ చదువుపై ఉద్యోగ అవకాశం రావడంతో సర్టిఫికెట్లు కావలసి ఉండడంతో మళ్లీ కాలేజీ వెళ్లి అడిగితే ఇప్పుడు రూ.30వేలు చెల్లించమంటున్నారని తెలిపింది. నేను కాలేజీలో చేరకుండా, కనీసం ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్లకుండా, ఎక్కడా సంతం చేయకపోయినా ఎలా ఫీజు అడుతున్నారో అర్థం కావడం లేదని, తన సర్టిఫికెట్లు అన్యాయంగా ఉంచేసుకున్న ఫోర్ ఎస్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ విషయమై చోడవరం డిప్యూటీ తహసీల్దార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేసి ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్లు ఇప్పించాలని సునీత కోరింది. -
ఇద్దరు విద్యార్థుల మృత్యువాత
ఆటపాటలతో మిత్రుల మధ్య ఆనందం పంచుకుంటున్న ఇద్దరు విద్యార్థులను మంగళవారం విధి కాటేసింది. కాలువ రూపంలో ఒకరిని, బావి రూపంలో మరొకరి మృత్యువు మింగేసింది. అప్పటి వరకు సరదా కబుర్ల మధ్య నవ్వులు చిందించిన ఆ యువకులను అనంతలోకాల్లో కలిపేసింది. నకరికల్లు మండలం చేజర్లలో ఒక్కగానొక్క 18 ఏళ్ల కుమారుడు కాలువలో పడి మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు వేదన హృదయవిదారకంగా మారింది. రాజుపాలెం మండలం అనుపాలెంలో చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన 15 ఏళ్ల విద్యార్థిని బావి మింగేయడంతో అమ్మమ్మ, తాతయ్యల గుండె తల్లడిల్లింది. గుంటూరు, చేజర్ల(నకరికల్లు): కాలువలో జారి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని చేజర్లలో మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేజర్ల గ్రామానికి చెందిన గాడిదమళ్ల రాజేశ్వరి, నాగేశ్వరరావు దంపతులకు రవిశంకర్(19)తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు మిత్రులతో కలసి అద్దంకి బ్రాంచి కెనాల్ కాలువ గట్టుకు వెళ్లాడు. అక్కడ కాలు జారడంతో కాలువలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో కాలువలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అతి కష్టం మీద మృత దేహాన్ని బయటికి తీశారు. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించారు. ‘అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా నాయనా’ అంటూ ఆ తల్లి తల్లడిల్లింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జీ అనీల్‌కుమార్ తెలిపారు. చేజర్ల గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచి కాలువలో ఈ నెలలోనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాలువపై రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బావిలో పడి.. అనుపాలెం(రాజుపాలెం): కాలు జారి బావిలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని అనుపాలెంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పురంశెట్టి నవీన్(15) అనుపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బావి దిమ్మె మీద కూర్చొని ఉండడంతో పొరపాటున జారి బావిలో ఉన్న బురదలో కూరుకుని ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నవీన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. -
9,10కీ ఓకే..
సాక్షి, నేలకొండపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల మధ్య తారతమ్యం ఉండొద్దని.. అందరూ సమానమనే భావన కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం.. యూని ఫాంలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే అందించే యూనిఫాం.. ఇకనుంచి 9,10వ తరగతి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున అందించే డ్రెస్‌లకు సంబంధించిన క్లాత్ పాఠశాలలకు చేరగా.. ఇందుకయ్యే కుట్టు కూలిని ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9,10వ తరగతి విద్యార్థులకు కూడా అందించేందుకు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మేలు జరగనుంది. 255 ప్రభుత్వ పాఠశాలల్లో 9,10వ తరగతి విద్యార్థులు 20వేల మంది ఉన్నారు. వీరిలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వీరికి ప్రతి ఏటా రెండు జతల చొప్పున దుస్తులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే యూనిఫాంలకు సంబంధించిన క్లాత్ చేరింది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానం అనంతరం దుస్తులు కుట్టిచ్చి విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టారు. ఖర్చు ప్రభుత్వానిదే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అన్ని తరగతుల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. పాఠశాలల్లో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించగా.. ఆ మేరకు సరిపోయేంత వస్త్రం పాఠశాలలకు చేరింది. దుస్తులు కుట్టించే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఒక్కో జతకు రూ.50 చొప్పున దర్జీకి చెల్లించనున్నారు. రెండు జతలు అందిస్తాం.. జిల్లాలో 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు త్వరలోనే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అన్ని పాఠశాలలకు క్లాత్ పంపించాం. సాధ్యమైనంత త్వరగా కుట్టించి విద్యార్థులకు రెండు జతల చొప్పున అందించేలా చర్యలు చేపట్టాం. జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. – మదన్మోహన్, డీఈఓ నిర్ణయం మంచిదే.. 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా మంచిదే. తల్లిదండ్రులకు కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రభుత్వమే రెండు జతల యూనిఫాం అందించడం మంచి నిర్ణయం. దుస్తులు అందించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలి. – కీర్తి, పదో తరగతి విద్యార్థిని, నేలకొండపల్లి అందరికీ యూనిఫాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గతంలో 8వ తరగతి వరకే యూనిఫాంలు వచ్చేవి. ప్రస్తుతం 9,10వ తరగతి విద్యార్థులకు ఇవ్వడం సంతోషకరం. మా పాఠశాలలో మొత్తం 96 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు. ఎస్ఎంసీ తీర్మానంతో దర్జీకి క్లాత్ అందించాం. – వి.లక్ష్మి, నేలకొండపల్లి హైస్కూల్ హెచ్ఎం -
ఫీజు చెల్లించిందెందరు?
సాక్షి, హైదరాబాద్: - హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ తమ వద్ద ఉన్న 450 మంది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకుంది. బోర్డు వెబ్‌సైట్‌లోని కాలేజీ లాగిన్‌కు వెళ్లి మొదటి విడతలో అందులోని 250 మంది విద్యార్థుల జాబితాను సెలెక్ట్ చేసి, ఫీజు చెల్లింపు ఆప్షన్ క్లిక్ చేసి వారి పరీక్ష ఫీజును చెల్లించింది. అయితే ఆ చెల్లింపు పూర్తయ్యాక తమ లాగిన్‌లో ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించారు.. ఇంకా ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించాలి.. అనే జాబితా వేర్వేరుగా రావాలి. కానీ ఆ వివరాలేవీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కాలేజీ యాజమాన్యం తలపట్టుకుంది. - ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ.. విద్యార్థులకు సంబంధించిన రూ. 50 వేల ఫీజు చెల్లించారు. బోర్డు వెబ్సైట్లో రూ. 50 వేలు చెల్లించినట్లు ఉంది. కానీ బోర్డు అకౌంట్‌కు చేరింది రూ. 20 వేలు మాత్రమే. ఇలా తప్పుల తడకగా సమాచారం ఉన్న కాలేజీలు వెయ్యి వరకు ఉన్నట్లు తెలిసింది. - ఇలా రాష్ట్రంలోని లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, వారి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయి. వచ్చే మార్చిలో పరీక్షలకు హాజరయ్యే దాదాపు 11 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఇప్పటివరకు ఎంత మంది ఫీజులు చెల్లించారో.. ఎంత మంది చెల్లించలేదోనన్న వివరాలు తెలియక యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. పరీక్ష ఫీజులకు సంబంధించిన సాఫ్ట్వేర్ సమస్యతో ఈ గందరగోళం నెలకొంది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన బోర్డు ఉన్నతాధికారులు ఓ ప్రైవేటు సంస్థకు విద్యార్థుల డేటా, రిజల్ట్ ప్రాసెస్ పనులను అప్పగించడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినట్లు ఆన్లైన్లో లేకపోతే రేపు పరీక్షల సమయంలో వారికి హాల్‌టికెట్లు రావు. దీంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని, ఓ ప్రైవేటు సంస్థకు డేటా ప్రాసెసింగ్ పనులను అప్పగించినందునే సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి సూచించినా పట్టించుకోకపోగా, అదే సాఫ్ట్వేర్ సంస్థను వెనకేసుకు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొంచి ఉన్న ప్రమాదాన్ని బోర్డు కార్యదర్శికి చెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయినట్లు తెలిసింది. బోర్డు పరీక్షల విభాగంలో మరికొంత మంది సిబ్బంది కూడా అదే బాట పడుతున్నట్లు సమాచారం. ఆది నుంచీ అక్రమాలు, అడ్డగోలు విధానాలే.. రాష్ట్రంలో ఏటా దాదాపు 11 లక్షల మంది విద్యార్థుల వివరాలు, వారి అడ్మిషన్లు, పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేట్ చేయడం, పరీక్ష ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను చూడాల్సిన సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. భారీగా ముడుపులు పుచ్చుకొని సామర్థ్యంలేని సంస్థకు పనులను అప్పగించి బోర్డు అధికారులు భారీ తప్పిదానికి కారణమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 11 లక్షల మంది విద్యార్థుల డేటా ప్రాసెస్ చేయాల్సి ఉండగా, కేవలం 3 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్ చేస్తే చాలన్న నిబంధనను.. సదరు సాఫ్ట్వేర్ సంస్థకు అనుగుణంగా రూపొందించి భారీ తప్పిదం చేశారు. టెక్నికల్ సామర్థ్యాలను పట్టించుకోకుండా మూడేళ్ల కోసం రూ. 4.5 కోట్ల పనులను అప్పగించారు. టెండరు నిబంధనల ప్రకారం.. సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు గత సంవత్సరపు పరీక్షల డేటా ప్రకారం ఫలితాలు ప్రాసెస్ చేయాల్సి ఉంది. కానీ ఆ పనిని కూడా ఆ సంస్థ చేయలేదు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల సమాచారం సేకరణ పనులను కూడా చేయలేదు. జూన్‌లో ప్రవేశాలు మొదలైనా జూలై వరకు కూడా చేయలేదు. బోర్డు కార్యదర్శి సదరు సంస్థనే వెనకేసుకొచ్చారు. నిర్ణీత గడువులో పని చేయకపోయినా పట్టించుకోలేదు. టెండరు నిబంధనల ప్రకారం కనీసం జరిమానా వేయలేదు. 9 లక్షల మంది ఫీజుపై గందరగోళం... ప్రభుత్వ సంస్థ అయిన సీజీజీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమాచారం సేకరించి దాన్ని తాము ఎంపిక చేసి సంస్థకు అప్పగించారు. కనీసం ఆ సేకరించిన సమాచారం ప్రకారమైనా పక్కాగా విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టిందా.. అంటే అదీ లేదు. పక్కాగా ప్రోగ్రాంను రూపొ ందించలేదు. దీంతో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి బోర్డుకు ఫీజు చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. చివరకు అక్టోబర్ 16న ప్రారంభించారు. ఈ నెల 24తో ముగిసే నాటికి లక్ష మంది విద్యార్థుల ఫీజుల చెల్లింపు వివరాలు కూడా బోర్డుకు అందలేదు. కానీ బోర్డు అధికారులు మాత్రం 2.13 లక్షల మంది విద్యార్థుల ఫీజు వివరాలు వచ్చాయని చెబుతున్నారు. మరి మిగతా 9 లక్షల మంది విద్యార్థుల ఫీజుల వివరాలపై గందరగోళమే నెలకొంది. ఈనెల 31 వరకు గడువు పొడిగించినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ కాలేజీ నుంచి ఎంత మంది విద్యార్థుల ఫీజులు వచ్చాయి అన్నది బోర్డుకే తెలియని గందరగోళం నెలకొంది. అంతేకాదు కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వారు విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేశారు కానీ బోర్డుకు ఎంత మంది ఫీజులు చేరాయి.. ఇంకా ఎంత మంది ఫీజులు చెల్లించాలన్న విషయంలో స్పష్టత లేకుండాపోయింది. బోర్డు చుట్టూ ప్రదక్షిణలు బోర్డు వెబ్‌సైట్‌లోని తమ కాలేజీ లాగిన్లోకి వెళితే ఆ వివరాలేవీ రావడం లేదని కొన్ని యాజమాన్యాలు, వస్తున్న వివరాల్లోనూ అనేక తప్పులు ఉన్నాయని మరికొన్ని యాజమాన్యాలు, డబ్బులు చెల్లించినా అప్డేట్ కాలేదని ఇంకొన్ని కాలేజీలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అయినా బోర్డు అధికారులు కానీ, సెక్రటరీ కానీ కనీసం స్పందించడం లేదని వారు వాపోతున్నారు. చివరకు ఈ గందరగోళం పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయారు. ఆ విభాగంలోని మరికొందరు అధికారులు అదే బాటపట్టారు. ఈ వ్యవహారంలో బోర్డు కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం నెలకొందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసి, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
తల్లిదండ్రులు మందలించారని..
జంగారెడ్డిగూడెం: తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలంలో కలకలం రేపింది. జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న పోకల నాగ దుర్గా ప్రసాద్(18) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదవు విషయంలో తల్లిదండ్రులు మందలించడంతో శనివారం సాయంత్రం స్థానిక ఆర్టిఏ కార్యాలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. తమది నిరుపేద కుటుంబం అని, తన కుమారుడు ఇంటర్మీడియట్లో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడని పేర్కొన్నాడు. గతంలో కంటి ఆపరేషన్ జరగడంతో అప్పటి నుండి ఒక కంటికి దృష్టిలోపం ఏర్పడి చదువులో వెంకబడ్డాడని దానితో మొదటి సంవత్సరం సబ్జెక్ట్‌లకు సంబంధించి మూడు సబ్జెక్టులు వరకు పాస్ అవ్వాల్సి ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే రెండో సంవత్సరం సరిగా చదవటం లేదని కళాశాల యాజమాన్యం తెలియజేయడంతో తన కుమారుడ్ని పిలిచి చదువుకోక పోతే ఇబ్బంది పడాల్సివస్తుందని చెప్పానన్నాడు. తన ఆవేదనను అర్ధం చేసుకోలేని కుమారుడు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకున్నాడని విలిపించాడు. ఈ కేసును అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
టీచర్‌పై ఇనుపరాడ్‌తో విద్యార్ధి దాడి..
సాక్షి, న్యూఢిల్లీ : పాఠశాలకు హాజరుకావడం లేదని,పుస్తకాలు తీసుకురావడం లేదని మందలించినందుకు టీచర్‌పై ఎనిమిదో తరగతి విద్యార్థి ఇనుప కడ్డీతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. గాయపడిన టీచర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతుండగా, నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. సాకేత్ ప్రాంతంలోని వీర్ చందర్ సింగ్ గర్హేల్ ప్రభుత్వ పాఠశాలలో గత కొద్ది రోజులుగా స్కూల్‌కు హాజరు కానందుకు ఎనిమిదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు శ్యామ్ సుందర్ చౌధరి మందలించారు. విద్యార్థి బ్యాగ్‌ను పరిశీలించిన శ్యామ్ సుందర్‌కు అందులో ఇనుప రాడ్ కనిపించడంతో తీవ్రంగా మందలించి తన టేబుల్‌పై దాన్ని ఉంచారు. మరోసారి ఇనుప కడ్డీని విద్యార్థి తన బ్యాగ్‌లో వేసుకోవడంతో ఆగ్రహించిన టీచర్ దాన్ని తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా, విద్యార్థి ఇనుప రాడ్‌తో దాడికి తెగబడ్డాడు. విద్యార్థి దాడితో టీచర్ కన్ను, చెవు, తలపై గాయాలయ్యాయి. దాడి అనంతరం స్కూల్ ప్రహరీ గోడను దూకి నిందితుడు పారిపోయాడు. స్కూల్ ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విద్యార్థి దాడి చేసేందుకు సిద్ధమై స్కూల్‌కు వచ్చాడని వెల్లడించారు. -
జేఎన్టీయూహెచ్ విద్యార్థ్ధి ఆత్మహత్యాయత్నం
కేపీహెచ్‌బీకాలనీ: జేఎన్టీయూహెచ్ అనుసరిస్తున్న డిటైన్డ్ విధానంతో విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ విద్యార్థి బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి దూకేందుకు యత్నించిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మినారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలోని స్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న రషీద్ అనే విద్యార్థి గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి సమీపంలోని నిర్మాణంలో ఉన్న మధుకాన్ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కిన అతను తనకు న్యాయం చేయకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న భవనంపైకి ఎక్కి అతన్ని మాటల్లో పెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రషీద్ మాట్లాడుతూ మూడు నెలలుగా డిటైన్డ్ విధానం ఎత్తివేయాలని ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నాడు. మూడు నెలలుగా పస్తులుంటూ అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా తమకు మాత్రం న్యాయం చేయడంలేదని ఆరోపించాడు. జేఎన్టీయూహెచ్ విధానాల్లో లోపాలు ఉన్న పట్టించుకోకండా కేవలం విద్యార్థులను క్రెడిట్స్ తక్కువ వచ్చాయని డిటైన్డ్ చేస్తుస్తూ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు రషీద్‌ను స్టేషన్‌కు తరలించి కేసునమోదు చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా..... డిటెన్షన్ విధానంపై జేఎన్టీయూహెచ్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీ పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన డిటైన్ట్ విద్యార్ధులు ఆందోళనలో పాల్గొని యూనివర్శిటీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారితో రిజిస్ట్రార్ యాదయ్యను కలిసి వినతిపత్రం ఇప్పించారు. అయితే అధికారులు క్రేడిట్స్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారని విద్యార్ధి నాయకులు పేర్కొన్నారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సాయికిరణ్, సంతోష్‌లతో పాటు పలువురు విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఈసారైనా కాంగ్రెస్ టికెట్ లభించేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఉస్మానియా విద్యార్థి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. టికెట్ల ఖరారు ప్రక్రియ కీలక దశకు చేరుకోవడం, రేపోమాపో పార్టీ అభ్యర్థుల జాబితా వస్తుందంటూ ప్రచారం జరుగుతుండటంతో ఈసారైనా తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈసారి టికెట్లు ఆశిస్తున్న 10 మంది విద్యార్థి నేతల్లో ఇద్దరు లేదా ముగ్గురిని అధిష్టానం కరుణిస్తుందనే అంచనాతో ఆశావహులు తమ వంతు లాబీయింగ్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ భంగపాటే... తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక విశ్వవిద్యాలయాల నుంచి ముఖ్యంగా ఉస్మానియా నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇందులో ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిశోర్ లాంటి వారు టీఆర్ఎస్వీలో క్రియాశీలకంగా పనిచేసి కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. వారితోపాటు ఉద్యమంలో దీటుగా నిలిచిన మరికొందరు విద్యార్థి నేతలు ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుండగా మరికొందరు 10 నెలల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. వారిలో ఓయూలో ఎన్ఎస్యూఐలో కీలకంగా పనిచేస్తున్న మానవతారాయ్‌తోపాటు మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్, పున్నా కైలాశ్ నేత, దరువు ఎల్లన్న, చరణ్ కౌశిక్, క్రిశాంక్, దుర్గం భాస్కర్, బాల లక్ష్మి, కేతూరి వెంకటేశ్, చారగొండ వెంకటేశ్ తదితరులున్నారు. మానవతారాయ్, చరణ్, కైలాశ్, సత్యం, రాజారాంలు పార్టీ అధికార ప్రతినిధులుగా కూడా పనిచేస్తున్నారు. మిగిలిన వారూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే వారిలో కొందరు గత ఎన్నికల సమయంలోనే టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. క్రిశాంక్, ఎల్లన్నల పేర్లు కంటోన్మెంట్ స్థానం నుంచి చివరి వరకు ఉన్నా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతంకు కేటాయించారు. మిగిలిన వారికి అవకాశం రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ అధిష్టానం ఓయూ విద్యార్థి నేతల్లో ఒకరిద్దరికి కచ్చితంగా అవకాశం కల్పిం చే యోచనలో ఉందని, పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టుల్లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎవరెక్కడ..? ఉస్మానియా విద్యార్థి నేతలు ఆశిస్తున్న స్థానాల్లో సగం రిజర్వుడు నియోజకవర్గాలే ఉన్నాయి. మానవతారాయ్ (సత్తుపల్లి లేదా కంటోన్మెంట్), మేడిపల్లి సత్యం (చొప్పదండి), దరువు ఎల్లన్న (ధర్మపురి), దుర్గం భాస్కర్ (బెల్లంపల్లి), క్రిశాంక్ (కంటోన్మెంట్), చారగొండ వెంకటేశ్ (అచ్చంపేట)లు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలను ఆశిస్తున్నారు. మిగిలిన వారిలో రాజారాం యాదవ్ (ఆర్మూరు), పున్నా కైలాశ్ నేత (మునుగోడు), చరణ్ కౌశిక్ యాదవ్ (ఉప్పల్), బాలలక్ష్మి (జనగాం), కేతూరి వెంకటేశ్ (కొల్లాపూర్)లున్నారు. -
చిన్నారిని కొట్టిచంపిన టీచర్
బందా/లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ టీచర్ ఎనిమిదేళ్ల చిన్నారిని గొడ్డును బాదినట్టు బాదడంతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన బందా జిల్లాలోని సాదిమదన్పూట్ గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మంగళవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామనీ, ఘటనకు కారణమైన టీచర్ జైరాజ్‌ను అరెస్టు చేశామని పోలీస్ అధికారి ఎల్బీ కుమార్ పాల్ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. -
కలెక్టర్ అవుతావనుకుంటినే..
అమ్మా... మీ కష్టం వృథా కానివ్వను... కష్టపడి సివిల్స్ చదివి కలెక్టర్ అవుతా. మీ ఆశయాన్ని నెరవేరుస్తా అని చెప్పి మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా? నాన్నా’ అంటూ శివరాజ్కమార్ (19) తల్లి వరలక్ష్మీ గుండెలవిసెలా రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ‘దేవుడా ఎంత పని చేశావయ్యా! చెట్టంత కొడుకును తీసుకెళ్లి ఈ తల్లికి కడుపుకోత మిగిల్చావా? మేం ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశావు’ అంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కణేకల్లు (అనంతపురం): కణేకల్లులోని శ్రీ సిద్ధప్ప దేవాలయ సమీపాన నివాసముంటున్న మంగలి రామాంజినేయులు, వరలక్ష్మీ దంపతుల కుమారుడు శివరాజ్‌కుమార్ (19) హైదరాబాద్‌లోని షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దసరా పండుగకు సెలవులివ్వడంతో స్వగ్రామానికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు హెచ్చెల్సీకి వెళ్లాడు. చాలాసేపు ఈతకొట్టి సరదాగా గడిపాడు. చివరగా మరోసారి ఈత కొడదామని అందరూ నీళ్లలోకి దూకారు. అప్పటికే బాగా అలసిపోయిన శివరాజ్‌కుమార్ నీటి ఉధృతికి తట్టుకోలేకపోయాడు. నీటిప్రవాహంలో కొట్టుకుపోయాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హెచ్చెల్సీ వెంబడి రెండు రోజులపాటు గాలించినా జాడ కనిపించలేదు. ఎట్టకేలకు శనివారం ఉదయం బొమ్మనహాళ్ మండలం వన్నళ్లి వద్ద శవమై తేలాడు. లక్ష్యం చేరుకోక మునుపే తిరిగిరాని లోకాలకు.. కాలువలో లభించిన శవాన్ని కుటుంబ సభ్యులు నేరుగా కణేకల్లు ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తీసుకొచ్చారు. ఎప్పుడూ నవ్వుతూ కన్పించే శివరాజ్‌కుమార్ విగతజీవిగా కన్పించడంతో తల్లి భరించలేకపోయింది. భవిష్యత్తులో అండగా ఉంటానన్న కొడుకే లేకపోతే ఈ జీవితం తనకెందుకని, దేవుడా ఎందుకింత పెద్ద శిక్ష వేశావయ్యా అంటూ సొమ్మసిల్లిపడిపోయింది. ‘నాన్నా... నాకు సివిల్స్ అంటే ఇష్టం... హైద్రాబాద్‌లో ఐఏఎస్ అకాడమీలో చదువుకుంటానని చెబితే.. ‘సరే నాన్న చదువుకో అన్నానే. నీ లక్ష్యం నెరవేరకనే అందరినీ వీడి ఎలా వెళ్లిపోయావు కుమార్’ అంటూ రోదిస్తున్న తండ్రిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శివరాజ్‌కుమార్ మృతితో కణేకల్లులో విషాదఛాయలు అలుముకొన్నాయి. నాయిబ్రహ్మణులుందరూ దగ్గరుండి పోస్టుమార్టం చేయించి అంత్యక్రియలు నిర్వహించారు. శివరాజ్‌కుమార్ మరణవార్త తెలుసుకుని ఐఏఎస్ అకాడమీలో చదువుతున్న అతని స్నేహితులు 20 మంది కణేకల్లుకు హుటాహూటిన వచ్చారు. పండుగకు వెళ్లి వస్తానని చెప్పి తమ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవడం బాధగా ఉందని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కణేకల్లు పోలీసులు శవాన్ని పోస్టుమార్టం చేయించి, కేసు నమోదు చేశారు. కొడుకు లక్ష్యం కోసం శ్రమించిన తండ్రి పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న మంగళి రామాంజినేయులు కుల వృత్తి చేసుకుంటూ భార్యా, పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు అంకిత తొమ్మిదవ తరగతి చదువుతోంది. హిందూపురం సమీపంలో కొడిగెనహళ్లి ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకున్న కుమారుడు శివరాజ్‌కుమార్ తన జీవిత లక్ష్యం కలెక్టర్ అని, తనను హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో చదివించాలని కోరడంతో తండ్రి సరేనన్నాడు. ఆర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పిల్లల చదువు కోసం రామాంజినేయులు నిరంతరం కష్టపడ్డాడు. షైన్ ఇండియా ఐఏఎస్ అకాడమీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివరాజ్‌కుమార్ దసరా పండుగ కోసం ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి సరదా కోసం వెళ్లిన శివకుమార్ అనంత లోకాలకు వెళ్లి పోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భాంతికి లోనయ్యారు. చదువులో తనకు ఇన్స్పిరేషన్గా ఉన్న అన్న అకస్మాత్తుగా మృతి చెందడంతో అంకిత బోరున విలపిస్తోంది. -
విద్యార్థినిపై అసభ్య ప్రవర్తన
ఇబ్రహీంపట్నం : ఫేస్బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. బెదిరింపులు.. అనంతరం సెల్ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరిం చారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ముగ్గురి మధ్య పంచాయతీ నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లైంగిక దాడి జరగలేదు : సీపీ ఓ టీవీ చానల్లో మంగళవారం ప్రచారమైనట్లుగా ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ హోటల్లో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. చానల్లో గ్యాంగ్ రేప్ వార్త చూసిన వెంటనే తాము అప్రమత్తమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. హోటల్‌కు వచ్చి వెళ్లిన యువతి ఆచూకి తెలుసుకుని ఆమెతో మాట్లాడామని.. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో హోటల్‌కు వెళ్లినమాట వాస్తవమేనని.. అతనితోపాటు మిత్రులు ఇద్దరు హోటల్‌రూమ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించగా.. ప్రతిఘటించి వారి బారి నుంచి బయటపడ్డానని వివరించారని చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని భయపడి కేసు పెట్టలేదని ఆమె వివరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నగరానికి దూరంగా ఉన్నారని.. రాగానే కేసు పెట్టమని కోరామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీడీపీవి జుగుప్సాకర రాజకీయాలు
ఉయ్యూరు (పెనమలూరు) : టీడీపీ జుగుప్సాకర రాజకీయాలు చేయడం నీచాతి నీచమని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు మండలంలోని చినఓగిరాల గ్రామానికి చెందిన దాసరి నాగ శ్రావణి ఓ కార్పొరేట్ పాఠశాల భవనంపై నుంచి పడి మృతి చెందడం, పార్థసారథి బాధిత కుటుంబానికి అండగా నిలిచి ఆ యాజమాన్యంతో మాట్లాడి రూ.8 లక్షలు నష్ట పరిహారం, విద్యార్థిని తల్లికి ఉద్యోగానికి ఒప్పించి వివాదాన్ని పరిష్కరించారు. ఈ ఘటనను జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కలిసి ఆ పాఠశాల యాజమాన్యంపై ఒత్తిడి చేయించి మొదట అంగీకరించిన రూ.4 లక్షలు, ఉద్యోగం మాత్రమే ఇస్తామని చెప్పించడంతో బాధితులు పార్థసారథిని కలిసి తమ గోడును వినిపించారు. ఈ విషయంలో యాజమాన్యం కూడా మొదటి ఒప్పందాన్నే చేస్తామని మాట మార్చడంతో ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ.4 లక్షలను పార్థసారథి సోమవారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ మేరకు తన సొంత డబ్బును ప్రజలందరి సమక్షంలో అందజేశారు. అధికార మదంతో బెదిరిస్తారా?.. ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకుండా ఎక్కడ పార్థసారథికి పేరు వస్తుందో అనే దుగ్దతో అధికార మదంతో పాఠశాల యాజమాన్యాన్ని బెదిరిస్తారా.. అని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లానన్నారు. ఆ సమయంలో దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు రూ.20 లక్షలు పరిహారం కావాలని, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయని చెప్పారు. న్యాయం కావాలా, కేసు కావాలా.. అని అడిగితే న్యాయమే చేయాలని బాధితులు కోరితేనే చైతన్య యాజమాన్యంతో మాట్లాడానని చెప్పారు. అందరి సమక్షంలోనే మాట్లాడి ఒప్పందాన్ని చెప్పానన్నారు. పేదలకు న్యాయం జరిగిందని భావించకుండా ఎమ్మెల్యే ఆ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కేసులు పెడతామని బెదిరించి నష్టం చేయాలని చూశారన్నారు. ఎవరితో మాట్లాడావో కాల్ లిస్ట్ పెట్టాలంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయించడం సిగ్గు చేటన్నారు. ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఏమని బెదిరించాడో ముందు చెబితే తానెవరితో మాట్లాడింది.., తన కాల్ లిస్ట్‌ను చూపుతానన్నారు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎంక్వైరీ వేయించుకుని తెప్పించుకోవచ్చని సవాల్ విసిరారు. చలసాని పండు ఇలా దిగజారలేదు.. గతంలో నియోజకవర్గంలో టీడీపీ నేతలెవ్వరూ నీచంగా దిగజారుడు రాజకీయాలు చేయలేదని పార్థసారథి గుర్తు చేశారు. ‘నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేశా. నాపై రెండు సార్లు పోటీ చేసిన పండు ఇప్పుడున్న ఎమ్మెల్యే కంటే బలమైన వ్యక్తి. కానీ మేం ఏ రోజూ దిగజారి రాజకీయాలు చేయలేదు. హుందాతనంగానే నడుచుకుని సద్విమర్శలు చేసుకున్నాం. పేదల విషయంలో న్యాయబద్ధంగానే వ్యవహరించాం. ఎమ్మెల్యేగా గెలిచాక బోడె పూర్తిగా చండాలపు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదు. గ్రామీణ వాతావరణాన్ని చెడగొట్టడమే అవుతుంది.’ అని అన్నారు. ‘దాన కర్ణుడినని చెప్పుకునే బోడె.. నేను సాయం చేయడంలో జాప్యం ఉంటే.. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంలో తప్పులేదు. లేదా టీడీపీలో ఉన్న వారంతా అపర కోటీశ్వరులే కదా.. బాధిత కుటుంబానికి ఉదార స్వభావంతో సాయం చేయవచ్చు కదా’’ అని పార్థసారథి ప్రశ్నించారు. ఎవరిని బెదిరించారో, కాల్ లిస్టులేంటో అంతా త్వరలోనే బయటపెడతానన్నారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), ఉయ్యూరు, పెనమలూరు మండలాల అధ్యక్షులు దాసే రవి, కిలారు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి గారపాటి నాని, నాయకులు దోనేపూడి సాంబయ్య, మంచికంటి నాగేశ్వరరావు, మత్తే భాను, గన్నే ధనుంజయ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘నువ్వు నా కోడలు ఫ్రెండ్ కదా?’
సమయం: శనివారం సాయంత్రం 4.23 గంటలు ప్రాంతం: అనంతపురంలోని సాయినగర్ మూడో క్రాస్ ఏం జరిగింది: ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తోంది. అయితే.. : అప్పుడే ఓ 50 ఏళ్ల వ్యక్తి బైక్‌పై వచ్చి ఆ అమ్మాయితో మాట కలిపాడు. సంభాషణ సాగిందిలా: ‘నువ్వు నా కోడలు ఫ్రెండ్ కదా? కాదంకుల్. నీవెక్కడ చదివావు. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్. అదే కాలేజీలోనే నా కోడలు చదువుకుంది. నువ్వు మా అమ్మాయి ఫ్రెండే కదా? హా.. అయుండొచ్చేమో అంకుల్. ఎక్కడికి వెళ్తున్నావు. బస్టాండ్‌కు అంకుల్. అవునా.. నేనూ అటువైపే వెళ్తున్నా. నా బైక్‌లో డ్రాప్ చేస్తా పదా? అంటూ అమ్మాయిని బైక్‌పై తీసుకెళ్లాడు. ఆ తర్వాత : అమ్మాయ్.. భోజనం చేశావా? చేశానంకుల్.. అవునా, అయితే స్నాక్స్ తిందాం అని కమలానగర్‌లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయమని చెప్పి పంపించేశాడు. ఇదేం బుద్ధి: అవును. నగరపాలక సంస్థలో ఉద్యోగి బాగోతమిది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. మాట కలిపి ముగ్గులోకి దించడమే ఇతని పని. ప్రధానంగా హాస్టళ్ల వద్ద కాపు కాసి ట్రాప్ చేయడంలో ఇతను దిట్ట. ఎవరికీ తెలియదా: ఆ శాఖలో ఇతని వ్యవహారం తెలియని వారుండరు. గతంలో ఓ సారి ఇతనిపై చర్యలు తీసుకున్నా మళ్లీ అదే వేటలో పడ్డాడు. అనంతపురం న్యూసిటీ: అవినీతి, అక్రమాలకు చిరునామాగా మారిన నగరపాలక సంస్థలో ఓ ఉద్యోగి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒంటరి మహిళలైనా.. ఏదైనా పని మీద నగరానికి వచ్చే విద్యార్థినులైనా ఇతని కంటపడితే అంతే సంగతులు. ఇతని వయస్సు దాదాపు 50 ఏళ్లు. అయినప్పటికీ తన కూతురు వయస్సు ఉన్న పిల్లల వెంటపడి మరీ మాట కలుపుతాడు. అసలు విషయం తెలుసుకొని.. మాయ మాటలతో వారి జీవితాలతో ఆడుకుంటాడు. ఇలా ట్రాప్ చేసిన అమ్మాయిలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు చర్చ జరుగుతోంది. మహిళా చైర్పర్సన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరపాలక సంస్థలో ఈ కామాంధుడి వ్యవహారం ఆనోటా ఈనోటా నానుతున్నా ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కనీసం విధులకు కూడా సక్రమంగా హాజరు కాని ఈ ఉద్యోగి పట్ల అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వెనుక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫీసుకు ఎప్పుడొస్తాడో తెలియదు.. ఎప్పుడు వెళ్తాడో తెలియదు.. బైక్ వేసుకొని తన వేటలో నిమగ్నమయ్యే ఈ ఉద్యోగిని కనీసం ప్రశ్నించే సాహసం కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం. శనివారం ఇతను ట్రాప్ చేయబోయిన విద్యార్థి విషయానికొస్తే.. పక్క జిల్లాలో చదువుతున్న ఈ అమ్మాయి నగరంలో వైద్యం చేయించుకుని అక్కడికి వెళ్లే ఉద్దేశంతో సొంతూరు నుంచి వచ్చింది. ఇలాంటి అమాయక అమ్మాయిలు.. తోడు లేకుండా నగరానికి వచ్చే విద్యార్థినులు కనిపిస్తే చాలు నగరపాలక సంస్థకు చెందిన ఆ ఉద్యోగిలోని మరో మనిషి మేల్కొంటాడు. ప్రస్తుతం ఈ అమ్మాయితో మొదటి పరిచయం కావడంతో.. ఫోన్ నెంబర్ తీసుకొని వదిలేశాడు. ‘సాక్షి’ శనివారం ఈ ఉద్యోగిని ఫాలో చేయడంతో పాటు.. చివరగా ఆ అమ్మాయితో మాట్లాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిమూర్తినగర్, ఆర్టీఏ కార్యాలయం, విద్యుత్‌నగర్, ఎస్వీ డిగ్రీ కళాశాల, సాయినగర్ హాస్టళ్ల వద్ద స్కూటీ వేసుకొని తిరిగే ఈ కామంధుడి విషయంలో కనీసం పోలీసులైనా ఓ కన్నేస్తారని ఆశిద్దాం. ఫిర్యాదు చేస్తే చర్యలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తప్పుదోవపట్టించే పనులు చేస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వాళ్లు నగరపాలక సంస్థలో ఎవరున్నా సరే వదిలేది లేదు. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు గోప్యంగా ఉంచి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – పీవీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
ఒత్తిడితో బతుకులు చిత్తు
కామారెడ్డి క్రైం: విద్యార్థి దశలోనే ఎదురవుతున్న ఒత్తిళ్ళకు యువత చిత్తవుతున్నారు. ఇక్కడితో అంతా అయిపోయింది, ఇంక చేసేదేమి లేదనే నైరాశ్యంలోనికి వెళ్లిపోతున్నారు. చదువుల పేరిట అటు విద్యాలయాల్లో, ఇంట్లో పెద్దలు నిర్దేశిస్తున్న లక్ష్యాలను చేరుకుంటామో లేదోనన్న బెంగ ఎంతో మంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. అలాంటి బలహీనమైన క్షణాలు వారిని మృత్యువైపు అడుగులు వేయిస్తున్నాయి. ఎంత చదివినా మార్కులు తక్కువగా వస్తున్నాయనే బాధలో కొందరు, పరీక్ష బాగా రాయలేకపోయామని మరికొందరు, ఫలితాలు నిరాశపరిచాయని ఇంకొందరు ఇలా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 11 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపెడుతోంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదురై మనోవేదనకు గురైనా భవిష్యత్తుపై భరోసాతో ముందుకుసాగాల్సిన విషయాన్ని గుర్తించాల్సి ఉంది. పిల్లలను ఉన్నతస్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అదే సమయంలో పిల్లల శక్తి సామర్థ్య్లాలను సైతం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైన విషయాల్లో తోడ్పాటును అందించాలి. సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పిల్లలపై ఏ మాత్రం ఉందో గుర్తించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టసమయాల్లో మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా వారి భుజం తట్టాల్సిన అవసరాన్ని తల్లిదండ్రుల గుర్తించాలి. వీటి విషయాల్లో నిర్లక్ష్యం చేస్తూనే పిల్లల నుంచి ఉత్తమ ఫలితాలను ఆశించడం అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే.... పరీక్షలు బాగా రాయ లేదని, అందరితో సమనంగా చదవలేకపోతున్నాననీ, మార్కులు తక్కువగా వస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే భయాందోళనలు విద్యార్థుల్లో పెరిగాయి. ఇవే కొన్ని సందర్భాల్లో అత్మహత్యలకు కారణమవుతున్నాయి. తల్లిదండ్రులు, గురువులు వారి మానసిక పరిస్థితిని సకాలంలో గుర్తించక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. వారం క్రితం రెండు రోజుల వ్యవధిలో బానుసవాడలో ఓ 8వ తరగతి చిన్నారి, కామారెడ్డిలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12న మోర్తాడ్ మండలంలో సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం. గత మార్చిలో తాడ్వాయికి చెందిన హారిక అనే ఇంటర్ విద్యార్థిని పరీక్షలో ఫెయిలయ్యానని ఉరేసుకుంది. రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన సుప్రియ(19) అనే విద్యార్థిని టెట్ పరీక్షలు బాగా రాయలేదనే బాధలో ఉరేసుకుంది. ఉప్పల్వాయి గ్రామానికి చెందిన కుమ్మరి రజిత(25) అనే యువతి వీఆర్ఓ పరీక్ష బాగా రాయలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అడ్లూర్‌కు చెందిన సుస్మిత(18) టెట్‌లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్థాపం చెంది రైలు కిందపడి ప్రాణం తీసుకుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రవళిక(19) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా జిల్లాలో ఈ యేడాది ఇప్పటిదాక జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 20 ఏళ్లలోపు వారు 20 మంది ఉన్నారు. మాధ్యమాల ప్రభావం... ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల ప్రభావం యువతపై ఎంతగా పడుతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అశ్లీలతను చూపించే వెబ్సైట్లు విద్యార్థి దశనుంచే యువతను పెడదారి పట్టిస్తున్నాయి. హైస్కూల్ స్థాయి నుంచి యువత మొబైల్ ఫోన్లను చేత పట్టుకుని నిమగ్నమవుతున్నారు. కళాశాలల్లో ఫోన్లను నిరాకరించే విషయంలో యాజమాన్యాలు దృష్టి సారించడం లేదు. ఎక్కడున్నా స్మార్ట్ఫోన్లలో కాలక్షేపం చేస్తూ సమయాన్ని వృథా చేసుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిన యువతరం అదే టెక్నాలజీతో పెడదారి పట్టడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. తద్వారా చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లను తమ పిల్లలను దూరంగా ఉంచాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక సినిమాల ప్రభావం ఏ విధంగా ఉన్నదో ఇటీవలి జగిత్యాలలో ఇద్దరు యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూస్తే తెలుస్తుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం బిచ్కుందకు చెందిన పురుషోత్తం(19) అనే యువకుడు ఓ వివాహితను ఫోన్లో వేధించగా పెద్దలు పంచాయితీ పెట్టి మందలించారు. దీంతో మనస్థాపం చెందిన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి దశలో యువతపై సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం పడుతోందని ఇలాంటి సంఘటనలతో స్పష్టమవుతోంది. బాధ్యతగా వ్యవహరించాలి.. తమ పిల్లల చదువులు, వారి ప్రవర్తనల విషయంలో జరుగుతున్న సంఘటనలు తల్లిదండ్రుల బాధ్యతలను గుర్తు చేస్తున్నాయి. ప్రశాంతమైన క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడంతో పాటు వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సాహం అందించాలని పలువురు సూచిస్తున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసి కుటుంబాలు పెరిగాయి. నిత్యం విధులు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లలతో కలిసి సమయాన్ని గడపడం లేదు. వారికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎందరో యువత మానసికంగా కృంగిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తప్పనిసరిగా పిల్లలతో తల్లిదండ్రులు సమయాన్ని కేటాయిస్తూ వారి కష్ట, సుఖాల్లో అండగా నిలుస్తూ ఆలోచనలను పంచుకుంటే జరిగే తప్పిదాలను అరికట్టవచ్చు. వారి సమస్యలను తెలుసుకుని ప్రోత్సహించాలి. తప్పుదారిలో వెళ్తే దిశానిర్దేశం చేయాలే గానీ ఒత్తిళ్లకు గురి చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ఒత్తిడికి గురిచేయొద్దు.. పోటీ ప్రపంచంలో యాజమాన్యాలు, తల్లిదండ్రులు చదువు ఒక్కటే చూస్తున్నారు. పిల్లల సామర్థ్యానికి మించి ఒత్తిడికి గురి చేయొద్దు. వారి సామర్థ్యాలను సమస్యలను అర్థం చేసుకుని ప్రోత్సహించాలి. వారిలో అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. – లక్ష్మీనారాయణ, డీఎస్పీ, కామారెడ్డి -
ఆరేళ్ల బాలికపై ఉపాధ్యాయుడి రేప్
కోల్‌కతా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తన విద్యార్ధిని పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. కోల్‌కతాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఆరేళ్ల విద్యార్ధినిని రేప్ చేశాడు. దారుణ విషయం తెల్సుకున్న బాలిక కుటుంబసభ్యులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఆందోళన చేపట్టారు. పాఠశాలలోకి వెళ్లేందుకు బాలిక బంధువులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డకున్నారు. దీంతో బంధువులు, స్థానికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో 10 మంది పోలీసు సిబ్బంది, ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడినట్లు డీసీపీ కల్యాణ్ ముఖర్జీ తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
హెచ్‌సీయూలో ఏబీవీపీ ఘన విజయం
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఘన విజయం సాధించింది. 2018–19 విద్యా సంవత్సరానికి విద్యార్థి సంఘ ఎన్నికల పోలింగ్‌ను శుక్రవారం నిర్వహించగా ఓట్ల లెక్కింపును శనివారం చేపట్టారు. రాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థిదళ్ కూటమి అభ్యర్థులంతా ఘన విజయం సాధించాచినట్లు హెచ్‌సీయూ అధికారులు తెలిపారు. ఫలితాలు ప్రకటించగానే ఏబీవీపీ, ఓబీసీఎఫ్, సేవాలాల్ విద్యార్థి దళ్ కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రెసిడెంట్‌గా నాగ్‌పాల్ విజయం హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్, హెచ్‌సీయూ విభాగం మహిళా కన్వీనర్, సైకాలజీలో పీహెచ్డీ చేస్తున్న ఆర్తి నాగ్‌పాల్ తన సమీప ప్రత్యర్థి ఎర్రం నవీన్‌కుమార్‌పై 334 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆర్తికి 1,663 ఓట్లు రాగా నవీన్‌కు 1,329 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసిన అమిత్ కుమార్ çతన సమీప ప్రత్యర్థి పి.పారితోశ్పై 247 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అమిత్‌కు 1,505 ఓట్లు లభించగా పారితోశ్కు 1,258 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసిన ధీరజ్ సంగోజి తన సమీపç ప్రత్యర్థి అభిషేక్కుమార్పై 127 ఓట్లతో విజయం సాధించారు. ధీరజ్‌కు 1,573 ఓట్లురాగా అభిషేక్‌కు 1,446 ఓట్లు లభించాయి. సంయుక్త కార్యదర్శి పదవికి పోటీచేసిన ఎస్. ప్రవీణ్‌కుమార్ తన సమీప ప్రత్యర్థి అనుమపెస్ కృష్ణన్‌పై 39 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శి పదవికి పోటీచేసిన అరవింద్ ఎస్ కుమార్ తన ప్రక్రితి చక్రవర్తిపై 233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరవింద్‌కు 1,475 ఓట్లు రాగా చక్రవర్తికి 1,242 ఓట్లు పోల్ అయ్యాయి. క్రీడా కార్యదర్శి పదవికి పోటీ చేసిన కె. నిఖిల్రాజ్ తన సమీప ప్రత్యర్థి శ్యామ్యూల్ ఈను రాగ్ నాలామ్పై 139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిఖిల్‌కు 1,467ఓట్లు రాగా, శ్యామ్యూల్‌కు 1,328 ఓట్లు లభించాయి. నోటాకు 983 ఓట్లు హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో నోటాకు గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఆరు పదవులకే 983 ఓట్లు పోల్ కావడం విశేషం. అ«ధ్యక్ష పదవికి 95, ఉపాధ్యక్ష పదవికి 216, ప్రధాన కార్యదర్శికి 144, క్రీడా కార్యదర్శికి 199, సాంస్కృతిక కార్యదర్శికి 133, సంయుక్త కార్యదర్శికి 196 ఓట్లు పోల్ అయ్యాయి. -
రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక, కోలారు: పట్టాలపై నడుస్తూ రైలుకు ఎదురెళ్లి పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఉదంతం శుక్రవారం నగరంలోని కారంజికట్ట రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకుంది. నగరంలోని హరోహళ్లిలో నివాసం ఉంటున్న మేఘ మేరిస్ (17) నగరంలోని మదర్ థెరెసా కళాశాలలో డిప్లోమా చదువుతోంది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటినుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన మేఘామేరిస్.. ఉదయం 6 గంటల సమయంలో బెంగుళూరుకు వెళ్లే ప్యాసింజెర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసులు ఉదయం 9 గంటలకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మేఘామేరిస్ ఆత్మహత్యకు అసుల కారణాలు ఇంతవరకు తెలియలేదు. -
నారాయణ కాలేజీలో కొట్లాట.. విద్యార్థికి తీవ్ర గాయాలు
సాక్షి, విజయవాడ : నారాయణ కాలేజీలో విద్యార్థుల విభేధాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాధర్‌రెడ్డి అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. బాత్రూమ్లో వేసి కళాధర్‌ను చితకొట్టారు. బాధితుడి వీపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెల 29వ తేదీన జరిగింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నలుగురు విద్యార్థులపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
శార్ధా యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
విద్యార్థుల ఘర్షణ: యూనివర్సిటీలో టెన్షన్
న్యూఢిల్లీ: భారత్, అఫ్ఘానిస్తాన్ విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ యూనిర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణల్లో కశ్మీర్‌కు చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శార్ధా యూనివర్సిటీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శార్ధా యూనివర్సిటీలో సోమవారం నాడు ముగ్గురు అఫ్ఘానిస్తాన్ విద్యార్థులు ఓ భారత విద్యార్థిని చితకబాదిన దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచారు. అంతేకాకుండా రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన భారత విద్యార్థులు కొంతమంది అఫ్ఘాన్ విద్యార్థులపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో హింసను ప్రేరేపించేలా ఉన్న దృశ్యాలను సోషల్ మీడియాలో ఉంచినందుకు యూనివర్సిటీ అధికారులు ముగ్గురు అఫ్ఘాన్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో భాగంగా.. గురువారం నాడు కశ్మీర్ యువకుడిని అఫ్ఘాన్‌కు చెందిన విద్యార్థిగా భావించిన భారత విద్యార్థులు అతనిపై దాడికి దిగారు. ఈ దాడిలో అతడికి తీవ్రంగా గాయాలయినట్టు తెలుస్తోంది. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యూనివర్సిటీ వెలుపల బలగాలను మోహరించిన పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న 350 మంది విద్యార్ధులపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధికారులు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేశారు. ఆదివారం వరకు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. -
విద్యార్థిని డస్టర్‌తో కొట్టిన టీచర్
నాగోలు: ఉపాధ్యాయురాలు విద్యార్థిని డస్టర్‌తో కొట్టడంతో తల పగిలి తీవ్ర గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. వివరాలు... ఎల్బీనగర్ గుంటి జంగయ్యనగర్ కాలనీకి చెందిన నరేష్ జీహెచ్ఎంసీలో పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు నిఖిల్(6) కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో నిఖిల్ అల్లరి చేయడంతో తెలుగు ఉపాధ్యాయురాలు సుజాత డస్టర్‌తో కొట్టింది. దీంతో నిఖిల్ తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉపాధ్యాయులు ఆ విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఎల్బీనగర్ పోలీసులకు, సరూర్‌నగర్ ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయురాలిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అందరు ఎందుకు ఫొటో తీయడానికి పోటీ పడుతున్నారు
-
వీళ్లంతా మీ ఫొటో తీస్తున్నారేందుకు..?!
లండన్ : అప్పుడప్పుడు చిన్న పిల్లలు అడిగే అమాయకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత తేలికేం కాదు. అలాంటి సందర్భాల్లో చాలామంది ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారు. ఇదే పరిస్థితి బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్కి ఎదురయ్యింది. కానీ ఆమె చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక నెటిజన్ల హృదయాలను గెల్చుకుంది. ఈమధ్యే ప్రసూతి సెలవులు ముగించుకున్న కేట్ మిడిల్టన్ వెస్ట్ లండన్‌లో సయేర్స్ క్రాఫ్ట్స్ ఫారెస్ట్ స్కూల్‌ని, వైల్డ్ లైఫ్ గార్డెన్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు కేట్‌ని ఫొటో తీయడానికి పోటీ పడ్డారు. ఈ హడావుడి చూసిన పిల్లలకు ‘ఏంటి ఈమె ప్రత్యేకత.. అందరు ఎందుకు ఈమెని ఫొటో తీయడానికి ఇంతలా పోటీ పడుతున్నారు’ అనే అనుమానం మొదలయ్యింది. సందేహం అయితే వచ్చింది కానీ ఎవరూ దాన్ని బయటపెట్ట లేదు. కానీ ఓ చిన్నారి మాత్రం ధైర్యంగా ‘వీళ్లంతా ఎందుకు మిమ్మల్ని ఫోటో తీస్తున్నారు’ అని కేట్‌ని అడిగింది. అందుకు యువరాణి నవ్వుతూ ‘వారంతా నన్ను ఫొటో తీయడం లేదు.. నిన్ను ఫొటో తీస్తున్నారు. ఎందుకంటే నువ్వు చాలా ప్రత్యేకం కదా’ అంటూ సమాధానం చెప్పారు. కేట్ చెప్పిన సమాధానం ఆ చిన్నారినే కాక అక్కడున్న వారిని కూడా సంతోషపెట్టింది. కేట్ సమాధానం విన్న నెటిజన్లు ‘ఎంతైనా ముగ్గురు పిల్లలకు తల్లి కదా..! పిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగానే తెలిసి ఉంటుందం’టూ ప్రశంసిస్తున్నారు. అంతేకాక ‘అవును మరి అంత చిన్న బుర్రకు కేట్ యువరాణి అని.. అందుకే ఫొటో తీస్తున్నారంటే ఎలా అర్థమవుతుంది.. అర్థమవ్వకపోగా మరిన్ని సందేహాలు తలెత్తే అవకాశం ఉందం’టూ కామెంట్ చేస్తున్నారు. -
ఎన్ఐటీలో ఫుడ్‌పాయిజన్
సాక్షి, నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు బైఠాయించారు. క్యాంపస్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు రెండురోజుల క్రితం ఫుడ్‌పాయిజన్ కావడంతో దాదాపు వంద మందిపైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బయట తినొచ్చిన వారే ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారని కళాశాల సిబ్బంది ఆరోపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మిగతా ఎన్ఐటీలతో పోల్చుకుంటే ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయని, హాస్టల్ వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎన్ఐటీ యాజమాన్యం దిగొచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు హామినిచ్చారు. తమ సమస్యల పరిష్కారానికై యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మరోవైపు తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో నాగ్‌పూర్ ఎన్ఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
విద్యార్థుల నిరసన చూసి భయమేస్తోందా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఉద్యోగాలు, భవిష్యత్తు కోసం ఆందోళనకు దిగిన విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం తనకు బాధ కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుంచి అనుమతి తీసుకొని నిరసన ప్రదర్శన చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. విద్యార్థుల నిరసనలు, పోరాటాలు చూసి భయమేస్తోందా చంద్రబాబు అని వైఎస్ జగన్ నిలదీశారు. నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేసేవిధంగా చంద్రబాబు మభ్యపెడుతుండటాన్ని వ్యతిరేకిస్తూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులను విజయవాడలో పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. It's disheartening to hear about the students who were arrested, for raising their concerns on unemployment and their future, even after taking permission from the concerned authorities. @ncbn are you threatened by student protests now? pic.twitter.com/6eYw2WlaGU — YS Jagan Mohan Reddy (@ysjagan) 3 October 2018 -
‘మేం నటులం.. తీవ్రవాదులం కాదు’
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన మూవీ ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి సత్తా చాటింది. తాజాగా ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఈ సినిమా ప్రేరణతో తమ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు రావటంతో మరోసారి ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనపై హీరో కార్తికేయ స్పందించాడు. తమ సినిమాలో హీరో ఆత్మహత్య చేసుకునే సన్నివేశం అసలు లేదని.. క్లైమాక్స్‌లో కూడా ఇందునే హీరోను చంపిస్తుంది.. కానీ తాను బలవన్మరణానికి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చాడు. సినిమా దర్శకులు ఎప్పుడు తమ సినిమా చూపి చేడిపోండి అని తీయరు. విద్యార్థులు ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చుట్టుపక్కల వారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చదవండి : ఆర్ఎక్స్ 100 సినిమానే ప్రేరణ -
విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి..
-
ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం దీక్ష
-
లేటు వయసులో ఘాటు ప్రేమలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు.. అయితే కళ్లు మాత్రమే కాదు వయసు కూడా లేదనేలా రెండు జంటలు వ్యవహరించాయి. పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన రెండు ప్రేమజంటలు తమిళనాడులోనే తలదాచుకోవడం, వరుసగా రెండు సంఘటనలు చోటుచేసుకోవడం కాకతాళీయమైనా విచిత్రమే. అంతేగాక రెండు సంఘటనల్లోనూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యవార్లే విద్యార్థుల పట్ల అనుచితంగా వ్యవహరించడం శోచనీయం. 40 ఏళ్ల టీచర్, 15 ఏళ్ల విద్యార్థితో పరార్ ఆమె టీచర్, అతడు పదోతరగతి విద్యార్థి. పవిత్రమైన గురుశిష్య సంబంధాన్ని అపవిత్రంగా మార్చివేసి ప్రేమ మోజులో పారిపోయి తమిళనాడులో తలదాచుకుని ఉన్నారు. కేరళ రాష్ట్రం ఆలప్పుళా సమీపం సేర్తళాముగమ్మా అనే ప్రాంతంలోని ప్రయివేటు ఇంగ్లిషు మీడియం పాఠశాలలో 300 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థి, అదే పాఠశాలలోని 40 ఏళ్ల ఉపాధ్యాయురాలు సన్నిహితంగా మెలగసాగారు. పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని చెరిపివేశారు. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెకు పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆమెకు విద్యార్థి మాటలు ఎంతో ఆనందాన్ని ఇవ్వడంతో ఇటీవల ఖరీదైన సెల్‌ఫోన్ కూడా కొనివ్వగా ఇళ్లకు వెళ్లిన తరువాత కూడా ఇరువురూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఈనెల 23 వ తేదీన విద్యార్థి అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో సదరు ఉపాధ్యాయిని సైతం కనపడక పోవడంతో ఇద్దరూ కలిసి పారిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని వర్కలాలో ఉన్నట్లు పోలీసులు వెళ్లగా ఈలోగా వారు తప్పించుకున్నారు. ఇంకా వారికోసం గాలిస్తున్న తరుణంలో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ఉన్నట్లు బుధవారం సమాచారం అందింది. కేరళ పోలీసులు హుటాహుటిన గురువారం కన్యాకుమారికి చేరుకోగా అప్పటికేవారు జారుకున్నారు. కన్యాకుమారి నుంచి మదురై, ఊటీ, కొడైక్కెనాల్ పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చని అంచనావేసి గాలింపు ముమ్మరం చేశారు. ‘మాది వాంఛలు లేని పవిత్ర ప్రేమ’ పంజాబ్ రాష్ట్రం నుంచి పారిపోయి రామేశ్వరంలో పోలీసులకు బుధవారం పట్టుబడిన చిత్రమైన ప్రేమజంట ‘తమది కామవాంఛలు లేని పవిత్ర ప్రేమ’ అని పోలీసులు, పెద్దలతో వాదించిన విషయం గురువారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే.. పంజాబ్ రాష్ట్రంలోని అపోకర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జయ్‌కృష్ణన్ (65) తన వద్ద ట్యూషన్ వచ్చే మగత్ (20) అనే విద్యార్థినిపై మమకారం పెంచుకున్నాడు. భార్య చనిపోగా, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెను కలిగి ఉన్న జయ్‌కృష్ణన్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో మగత్ను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు. రిటైరైన తరువాత కూడా మగత్కు ఆర్థిక సహకారం చేయడం, ఇంటికి పిలిపించుకుని మరీ ట్యూషన్లు చెప్పడం, ఇద్దరూ కలిసి భోంచేయడం పరిపాటిగా తయారై ప్రేమగా మారింది. ఈనెల 11వ తేదీన జయకృష్ణన్ రూ.25వేల తన పింఛన్ సొమ్ముతోపాటు ఇంటిలోని నగదును తీసుకురాగా ఇద్దరూ ఇళ్లు వదిలి పారిపోయారు. అనేక ప్రాంతాలు తిరుగుతూ రెండురోజుల క్రితం తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. తండ్రి, కుమార్తెలమని చెప్పి ప్రయివేటు అతిథిగృహంలో రూము తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పంజాబ్, రామేశ్వరం పోలీసులకు బుధవారం వారు పట్టుబడ్డారు. ఇద్దరి మధ్య చనువు పెరిగిపోవడంతో ఏడాది క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకుని రహస్య కాపురం సాగిస్తున్న విషయం బయటపడింది. ఎన్నాళ్లీ దొంగకాపురం, స్వేచ్ఛగా కలిసి జీవిద్దామనే ఆలోచనతోనే పంజాబ్ నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడ్డారు. ‘మాది పవిత్ర ప్రేమ’ :జయకృష్ణన్, మగత్ మాది పవిత్రమైన ప్రేమ.. తప్పుపట్టే పని మేం చేయలేదని వారిద్దరూ పోలీసుల వద్ద సమర్థించుకున్నారు. ‘‘శారీరక సుఖం కోసం మగత్ను పెళ్లి చేసుకోలేదు, భార్యను కోల్పోయిన దుఃఖంలో ఉన్న నాపై మగత్ అత్యంత అభిమానం చూపించింది. ఇదే మాఇద్దరి మధ్య ప్రేమకు కారణం’’ అని జయకృష్ణన్ చెప్పాడు. ‘‘చిన్నవయసు నుంచే నా పట్ల చూపిన ఆదరణే జయకృష్ణన్ అంటే విలువపెంచేలా చేసిందని మగత్ తెలిపింది. కాలక్రమేణా నాకు తెలియకుండానే ఆయనంటే ప్రేమ ఏర్పడింది. నా ప్రేమ తప్పని తెలిసినా ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. బతికితే అతనితోనే బతుకుతాను, భర్తను నా నుంచి విడదీయవద్దు’’అని పోలీసుల వద్ద మగత్ పెద్దగా విలపించింది. పంజాబ్‌కు వెళ్లడం ఇష్టం లేదని, అక్కడికి వెళితే తమని చంపేస్తారని, తాను మేజర్‌ను కావడం వల్ల ఎవరితోనైనా జీవించే హక్కు తనకుందని మగత్ పోలీసుల వద్ద వాదించింది. అయితే వారిద్దరినీ పంజాబ్ పోలీసులకు అప్పగించాలని రామేశ్వరం కోర్టు తీర్పు చెప్పడంతో విధిలేక తిరుగు ప్రయాణమయ్యారు. -
విద్యార్థి కన్నుమీద బెత్తం దెబ్బ
శ్రీకాకుళం, కొత్తూరు: పాఠశాలల్లో బెత్తాలు వినియోగించి విద్యాబోధన చేయవద్దని చట్టాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ఆ పాఠశాలలో బెత్తం ఉపయోగించి విద్యాబోధన చేయడంతో ఓ విద్యార్థి కన్ను మీద బెత్తం దెబ్బ పడటంతో అతడి కన్ను ప్రమాదకరంగా మారింది. బాధిత విద్యార్థి చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాతల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాతల గ్రామానికి చెందిన మజ్జి బాబూరావు పదో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం చేయడంతో బాబూరావు సోమవారం పాఠశాలకు సెలవు పెట్టి మంగళవారం వెళ్లాడు. సోమవారం పాఠశాలకు ఎందుకు రాలేదని పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు కామేశ్వరి బెత్తంతో బాబూరావును కొట్టింది. బెత్తం దెబ్బ బాబూరావు కుడికన్ను మీద బలంగా తగలడంతో కన్ను వాపురావడంతో పాటు ఎరుపు రంగుగా మారింది. ఆ సమయంలో పాఠశాల చివరి పీరియడ్ కావడం, అందుబాటులో హెచ్ఎం భాస్కరరావు లేకపోవడంతో విద్యార్థి నేరుగా ఇంటికి వచ్చి అన్నయ్య రాజేశ్వరరావుకు జరిగిన విషయాన్ని వివరించాడు. పాఠశాల సమయం పూర్తికావడంతో ఉపాధ్యాయురాలిని అడగలేక పోయామని చెప్పారు. పాఠశాలకు ఐదుగురు సెలవు పెట్టారని, అందరికీ బెత్తంతో కొట్టినప్పటికీ నాకు మాత్రం బలంగా ఉపాధ్యాయురాలు కొట్టారని బాబూరావు వివరించాడు. కంటి మీద కొట్టడంతో ఆందోళన కలిగిస్తుందని విద్యార్థి అన్నయ్య తెలిపాడు. ఏ రోజు కూడా తన తమ్ముడు బాబూరావు పాఠశాలకు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండలేదన్నారు. పిల్లలను బెదిరించాలి తప్ప ఈ విధంగా కొట్టడం బాధాకరంగా ఉందన్నారు. కాగా, ఈ విషయంపై ఉపాధ్యాయురాలు కామేశ్వరిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు అందుబాటులో లేకపోవడంతో పాటు సెల్ ఫోన్‌కు ఫోన్ చేసిన లిఫ్టు చేయకపోవడంతో హెచ్ఎం భాస్కరరావు వద్ద ప్రస్తావించగా సంఘటన జరిగిన సమయంలో తాను పాఠశాలలో లేనని చెప్పారు. జరిగిన సంఘటనపై ఉపాధ్యాయురాలు, బాధిత విద్యార్థి తనకు తెలపలేదని అన్నారు. -
తొమ్మిదో తరగతి విద్యార్థిపై దారుణం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిపై తన క్లాస్మేట్ సహా ఇద్దరు బాలురు స్కూల్ ప్రాంగణంలోనే లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్ధి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది మే-జూన్‌లో పాఠశాల నిర్వహించిన సమ్మర్ క్యాంప్ సందర్భంగా తన క్లాస్మేట్ సహా వేరే సెక్షన్ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారని తూర్పు ఢిల్లీ డీసీపీ పంకజ్ సింగ్ చెప్పారు. పాఠశాల భవనంలోని మూడో అంతస్తులో కంప్యూటర్ ల్యాబ్ పక్కనే ఉన్న ఖాళీ గదిలోకి తనను తీసుకువెళ్లిన ఇద్దరు బాలురు లైంగికంగా వేధించారని విద్యార్థి ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి నిందితులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడన్నారు. జరిగిన విషయం తల్లితండ్రులకు చెప్పగా వారి చొరవతో బాలుడు నిందితులపై ఫిర్యాదు చేశాడు. -
హోదా కోసం ప్రాణత్యాగం : వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన అన్నకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది మహేంద్ర(14) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న వైఎస్ జగన్ ఈ సంఘటన తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తప్పక ప్రత్యేకహోదా సాధిస్తుందని ఆయన తెలిపారు. కాబట్టి యువత సంయమనం పాటించాలని ఎటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని కోరారు. -
సీబీఎస్ఈ టాప్ ర్యాంకర్‌పై సామూహిక అత్యాచారం
-
‘ఏకరూపం’ అందేదెప్పుడు?
ఆదిలాబాద్‌రూరల్: సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాఠశాల ప్రారంభంలోనే విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ.. హామీగానే మిగిలిపోయింది. పాఠశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించిన దాఖాలాలు కనిపించడం లేదు. వేలాది మంది విద్యార్థులు పాత దుస్తులతోనే నెట్టుకొస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చదువుకుంటున్న 17,893 మంది విద్యార్థులు కొత్త దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యంగా పంపిణీ.. బీసీ సంక్షేమ వసతి గృహంలో చదువుకునే విద్యార్థుల దుస్తులు ఇటీవలనే కుట్టు పూర్తయింది. గత రెండు రోజుల కిందట కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు దుస్తువులు తీసుకెళ్లగా మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థుల అందించే దుస్తులు ప్రస్తుతం దర్జీల వద్ద కుట్టు దశలో ఉన్నాయి. దర్జీలకు కుట్టుకు సంబంధించిన చార్జీ కుదరకపోవడంతో ఆలస్యం జరిగిందని తెలుస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థులు.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 54 వసతి గృహాలు ఉండగా ఇందులో బాలికల వసతి గృహాలు 16 ఉండగా ఇందులో 8,272 మంది బాలికలు ఉన్నారు. 38 బాలుర వసతి గృహాల్లో 9,621 మంది బాలురు ఉన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాలు 9 ఉండగా ఒకటి బాలికల వసతి గృహం ఉంది. ఇందులో 42 మంది ఉన్నారు. బాలుర వసతి గృహాలు 8 ఉండగా ఇందులో 540 మంది విద్యార్థులు ఉన్నారు. దళిత సంక్షేమ శాఖ పరిధిలో 20 వసతి గృహాలు ఉండగా ఇందులో 3 బాలికల వసతి గృహాలు ఉండగా 510 మంది బాలికలు ఉన్నారు. 17 బాలుర వసతి గృహాలు ఉండగా 970 మంది విద్యార్థులు ఉన్నారు. మరో నెల రోజులు పట్టే అవకాశం.. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఐటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాల విద్యార్థులకు దుస్తుల పంపిణీకి మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులను గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి రెడీమేడ్ అందించనుందని, మిగితా రెండు జతల దుస్తువులను జిల్లాలోని 30 మంది దర్జీలకు కుట్టు కోసం అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జత కుట్టు కూలీకి రూ. 45 చొప్పున అందించనున్నారు. కొంత మంది హెచ్‌డబ్ల్యూవోలు తీసుకెళ్లారు.. ఎస్సీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ దుస్తులను అందజేశాం. బీసీ విద్యార్థులకు సంబంధించిన దుస్తులు కుట్టు పూర్తి అయి ఇటీవలనే తమ శాఖకు చేరుకున్నాయి. సగం మంది బీసీ వసతి గృహాల హెచ్‌డబ్ల్యూవోలు వాటిని తీసుకెళ్లారు. మరికొంత మంది తీసుకెళ్లాల్సి ఉంది. వాటిని సైతం విద్యార్థులకు అందేలా చూస్తాం. – ఆశన్న, బీసీ, ఎస్సీ, అభివృద్ధి శాఖల అధికారి, ఆదిలాబాద్ కుట్టు కోసం అందించాం రెండు జతల దుస్తులను కమిషనరేట్ నుంచి రేడిమేడ్ అందించనున్నారు. మిగితా రెండు జతలకు సంబంధించిన క్లాత్ 15 రోజుల కిందటనే సరఫరా అయింది. దుస్తువులు కుట్టుడు అయిన వెంటనే ఆయా వసతి గృహాలకు పంపిణీ చేస్తాం. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. – చందన, డీడీ గిరిజన సంక్షేమ శాఖ, ఉట్నూర్, ఆదిలాబాద్ -
రాజ్‌భవన్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: రాజ్‌భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ సామాజిక విద్యార్థి ఉద్యమకారుడు బొప్పని ఈశ్వర్‌గా గుర్తించారు. ఆత్మహత్యాయత్నం చేయబోయ ముందే తాను చెప్పదలచుకున్న విషయాలను ఈశ్వర్ లేఖలో ప్రస్తావించాడు. తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలాలని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులకు ఏం చేశారో చెప్పాలని యువకుడు డిమాండ్ చేశాడు. తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలనిదే ముందస్తు ఎన్నికలకు ఎలా వెళతారని ఈశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను బ్రిటీష్ వారితో పోల్చారు..రాజ్‌న్యూస్‌ను వాడుకుని పక్కనపెట్టారు.. కోదండరాం సార్‌ను ఆడు అని ఎవడు అని పరుషపదజాలంతో మాట్లాడారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చదువుకు దూరం అయ్యారు..ఉద్యోగాలకు దూరం అయ్యారు..అలాంటి ఉద్యమకారులకు జీవనాధారం ఏది అని ప్రశ్నించారు. నేను ప్రాణ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు ఉద్యమం చేయడానికి సిద్ధమా అని లేఖ ద్వారా అడిగారు. -
చెరువులో దూకి విద్యార్థిని ఆత్మహత్య
మేడ్చల్: కీసర మండలం చీర్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో నివాసముంటున్న నిత్యానంద్ కుమార్తె సోనీ(24) ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామ సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఓ విషయంలో తండ్రి మందలించాడని మనస్తాపం చెంది..ఐ యామ్ గోయింగ్ టు డై అని స్నేహితురాలికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఉదయం కాలేజీకి వచ్చి బ్యాగ్‌ను కాలేజీలోనే సోనీ వదిలి వెళ్లిపోయింది. సోనీ, స్వగ్రామంలోని గీతాంజలి కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకలి చదువులు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం మూడేళ్లుగా ప్రకటిస్తున్నా.. అమలుకు నోచుకోవడంలేదు. జూలైలో రాష్ట్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పలు అంశాలు చర్చించిన విషయం తెలిసిందే. ఇంటర్ విద్యార్థులతో పాటు డిగ్రీ, డైట్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలు గడుస్తున్నా మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేకుండా పోయింది. పథకం ఎప్పుడు అమలు చేస్తారో అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువుకోవడానికి ఆయా మండల కేంద్రాలకు, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. దీంతో మధ్యాహ్న భోజనం కళాశాలలో అందిస్తే రెండుపూటలు కళాశాలలో ఉండి చదువుకునే వీలుంటుంది. కొంతమంది టిఫిన్ బాక్సులు తీసుకొస్తుండగా, మరికొంత మంది పస్తులుండి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో.. ఆదిలాబాద్ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా మూడు డిగ్రీ కళాశాలలు, ఒక డైట్ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్‌లో దాదాపు 5 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో దాదాపు 8 వేల వరకు విద్యార్థులు, పాలిటెక్నిక్ కళాశాలలో 2వేల మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇందులో అధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ప్రతీ రోజు ఉదయం కళాశాలకు చేరుకోవాల్సి ఉండడంతో అల్పాహారం తీసుకుని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కనీసం టిఫిన్ బాక్సులు సైతం తీసుకురావడానికి సమయం దొరకకపోవడంతో వారు మధ్యాహ్నం పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఎదిగే వయస్సులో విద్యార్థులు సమయానికి భోజనం చేయకపోవడంతో అనారోగ్యానికి గురవుతారని వైద్యులు పేర్కొంటున్నారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య.. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఉదయం పూట హాజరు శాతం అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి చాలా మంది విద్యార్థులు ఆకలిని తట్టుకోలేక ఇంటిబాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం తగ్గి ఉత్తీర్ణత శాతంపై ప్రభావం చూపుతోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కొంత మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పస్తులుండి ఆటలాడుతూ కనిపిస్తుంటారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలైతే సర్కారు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. గత రెండేళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అమలుకు నోచుకోవడంలేదు. ఇంటి నుంచి కళాశాలకు నడిచిరావడంతో ఉదయం 9 గంటలకే బయల్దేరాల్సి వస్తోంది. దీంతో టిఫిన్ బాక్సులు తీసుకురాలేని దుస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం ఆకలి కారణంగా చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నాం. కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే నాలాంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.– నందన, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయకపోవడంతో టిఫిన్ బాక్సు తెచ్చుకోని వారు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. – జి.లావణ్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆదిలాబాద్ -
సోఫియాను అరెస్ట్ చేయడం అక్రమమే..!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయంలో సోమవారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన 28 ఏళ్ల విద్యార్థిని లోయిస్ సోఫియాను అరెస్ట్ చేయడంపై రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెల్సిందే. ఇక్కడ ఎవరికి పట్టని విషయం ఏమిటంటే ఆ విద్యార్థినిపై రెండు బెయిలబుల్ సెక్షన్లతోపాటు ఓ నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసును దాఖలు చేయడం. అది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో నిర్లిప్తంగా ఉండే న్యాయవ్యవస్థ.. సోఫియా అరెస్టు విషయంలో తమిళనాడు పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నా పట్టించుకోలేక పోయింది. విమానాశ్రయంలో ‘బీజేపీస్ ఫాసిస్ట్ గవర్నమెంట్ డౌన్‌డౌన్’ అంటూ కెనడాలో పీహెచ్డీ చేస్తున్న సోఫియా గట్టిగా నినాదాలు చేయడంతో తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసాయి సౌందరరాజన్ ఆమెతో గొడవ పెట్టుకున్నారు. అంతుకుముందు విమానంలో కూడా ఆమె అలాగే నినాదాలు చేశారని, అక్కడ తాను మౌనంగా ఉన్నానని, విమానాశ్రయంలోకి వచ్చాక అలా నినాదాలు చేయడం సబబేనా అని ప్రశ్నించగా, మళ్లీ నినాదాలు చేస్తానంటూ చేసిందని బీజేపీ నాయకురాలు ఫిర్యాదు చేశారు. విమానంలో సోఫియా నినాదాలు చేసిందనడానికి సాక్ష్యం లేదుగానీ, విమానాశ్రయంలో వారిద్దరికి మధ్య గొడవ జరగడం, సోఫియా నినాదాలు చేయడం, పోలీసులు సోఫియాను నిర్బంధంలోకి తీసుకోబోతే అటు వారికి, గొడవ చేస్తున్న బీజేపీ నాయకురాలికి తోటి ప్రయాణికులు సర్ది చెప్పడం, సోఫియాను వదిలేయాల్సిందిగా కోరడం అందుబాటులో ఉన్న వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకురాలు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు సోఫియాపై భారతీయ శిక్షాస్మతిలోని 290, తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) సెక్షన్లతోపాటు భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ప్రజల ముందు న్యూసెన్స్ సృష్టించినందుకు 290వ సెక్షన్ పెడతారు. ఇది బెయిలబుల్ సెక్షన్. బాండు చెల్లించి పోలీసు స్టేషన్లోనే బెయిల్ తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే 200 రూపాయలు జరిమాన విధిస్తారు. తమిళనాడు పోలీసు చట్టంలోని 75 (1,సీ) మొదటిదానికన్నా కొంచెం తీవ్రమైనది. ఇది కూడా బెయిలబుల్ సెక్షనే. ప్రజలు తిరుగాడే బహిరంగ ప్రదేశంలో, ఆఫీసుల్లో, కోర్టుల్లో, అమ్యూజ్మెంట్ పార్కుల్లో, రవాణా వాహనాల్లో, ప్రయాణికుల బోట్లలో, నౌకల్లో ఎవరైనా హింసాత్మకంగా లేదా గట్టిగా పెడబొబ్బలు లేదా అరుస్తూ ఎవరినైనా బెదిరిస్తూ లేదా దుర్భాషలాడుతూ లేదా అవమానిస్తూ ప్రజల మధ్య అశాంతికి కారణమైతే ఈ సెక్షన్‌ను అమలు చేయాలి. సోఫియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేసినందున ఆమెపై ఈ రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం కొంత మేరకు సమంజసమే. అయితే ఆమెపై భారతీయ శిక్షాస్మతిలోని 505 సెక్షన్ కింద కూడా కేసు పెట్టారు. ప్రజలకు చేటు చేసే ప్రకటనలు ఇచ్చినందుకు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. ఇది నాన్‌బెయిలబుల్ సెక్షన్ అవడం వల్ల సాధారణంగా ఈ సెక్షన్ కింద పోలీసులు అరెస్టులు చేస్తారు. ఈ సెక్షన్ కింద కూడా తమకు అధికారం ఉందికదా అని అరెస్టులు చేయవద్దని 1994లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి–జోగిందర్ కుమార్ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ‘అరెస్ట్ చేసే అధికారం ఉందికదా అని ఏ పోలీసు అధికారి ఎవరిని అరెస్ట్ చేయరాదు. ఎందుకు అరెస్ట్ చేయక తప్పలేదో అరెస్ట్ చేసిన అధికారి ఆ తర్వాత రుజువు చేసుకోగలగాలి. హత్యలాంటి పెద్ద నేరం చేసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. అరెస్టులు, పోలీసుల కస్టడీ వ్యక్తుల ఆత్మగౌరవానికి, పరువుకు ఎనలేని నష్టం కలిగిస్తాయి. ‘కాగ్నిజబుల్ నేరం చేసినా అరెస్ట్ చేయరాదు. నిందితుడు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం ఉన్నప్పుడు, జనం మధ్య తిరగేందుకు అవకాశం ఇస్తే జనానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నప్పుడు, పదే పదే నేరాలకు పాల్పడినప్పుడు అరెస్ట్‌లు చేయవచ్చు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడమే కాకుండా ‘నేషనల్ పోలీసు కమిషన్’కు ఈ విషయమై ఓ నివేదికను పంపించింది. సుప్రీంకోర్టు సూచించిన ఈ మార్గదర్శకాల ప్రకారం సోఫియాను పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కేసును తక్షణం పరిశీలించిన జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎస్. తమిల్సెల్వీ యాంత్రికంగా సోఫియాను 15 రోజులు రిమాండ్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో నిందితురాలిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ పోలీసు అధికారులను నిలదీయాల్సిన న్యాయమూర్తే రిమాండ్ ఉత్తర్వులు జారీ చేస్తే చట్టం ఎంత చక్కగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ నాయకురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు, ఆమె, ఆమె పార్టీ కార్యకర్తలు విమానాశ్రయంలో తమను నానా దుర్భాషలాడారంటూ సోఫియా తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఏ విధంగానూ స్పందించకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో! -
సోఫియాను అరెస్ట్ చేయడం అక్రమమే..!
-
ఈ బంధం.. ఎందరికో ఆదర్శం
పేదరికంతో తాను చదువుకోలేక పోయాననే బాధను దిగమింగుకుని.. ఓ శిష్యున్ని తన కష్టార్జితంతో ఉన్నత శిఖరాలకు చేర్చిన ఓ గురువు జీవత గాథ ఇది. నా శిష్యుడిని గొప్ప శాస్త్రవేత్తను చేయాలనే ఆ గురువు తపన.. గురువు లక్ష్యానికి అనుగుణంగా శిష్యుడి కష్టం.. వెరసి ఈ అనుబంధం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గురు శిష్యుల బంధంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.... కష్టాల కడలిని జయించి.. జనగామ : వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి చెందిన నాసం రాజయ్య, సరోజని దంపతుల కుమారుడు నాసం రమేష్ 7వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. పేదరికంలో పుట్టిన ఆ బిడ్డకు మంచి విద్యను అందించాలనే తపనతో తల్లిదండ్రులు గీతాంజలి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించారు. కూలీ పని చేస్తూ కొడుకును చదివించుకున్నారు. చదువుకోవాలనే తపన ఉన్నా... ఆర్థికంగా వెనకబడి.. తల్లిదండ్రులతో కలిసి పనికి వెళ్లేవాడు. పని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశాడు. ఈ సమయంలోనే కొంతమంది స్నేహితులు, గురువులు కొంతం రవీందర్, బొల్లెబోయిన. కిషోర్, బండి. శ్రీనివాస్, వంగ రవీందర్.. రమేష్‌ను వెన్నుతట్టి ముందుకు నడిపించారు. గీతాంజలి స్కూల్లోనే పీఈటీగా(ప్రైవేటు) పోస్టింగ్ ఇప్పించారు. విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే... రమేష్ పోలీసు జాబ్ కోసం అహోరాత్రులు కష్టపడి చదివాడు. రెండున్నరేళ్ల పాటు స్కూల్లోనే పని చేస్తూ... 2004లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. శిష్యుడికి చేయూత.. గీతాంజలి స్కూల్లో నాసం రమేష్ పని చేస్తున్న సమయంలో సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి రమేష్ చదువుకునే వాడు. బుట్టి రమేష్‌కు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడే తన తండ్రి గుండె పోటుతో చనిపోయాడు. అప్పటి నుంచి తల్లి మల్లికాంబ కూలీ పని చేస్తూ.. కొడుకును చదివించింది. కుటుంబ పోషణ భారమవడంతో.. కుమారుడిని ఏడో తరగతిలోనే చదువు మాన్పించే ప్రయత్నం చేసింది. దీంతో అదే పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న గురువు నాసం రమేష్‌ను శిష్యుడు బి.రమేష్ (విద్యార్థి) కలిసి.. తన బాధను చెప్పకున్నాడు. అప్పటి నుంచి ఆ విద్యార్థిని నాసం రమేష్ తన సొంతఖర్చులతో బాగా చదివించాడు. తాను చేరలేని లక్ష్యాన్ని శిష్యుడైనా చేరుకోవాలనే లక్ష్యంతో ప్రోత్సహించాడు. బుట్టి రమేష్ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఏపీలోని కర్నూల్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్‌లో జీవరసాయన శాస్త్రంలో ఉస్మానియా రీజియన్‌లోనే మొదటి ర్యాంకు సాధించాడు. ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో అడ్మిషన్ లభించింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. శిష్యుడు రమేష్ పూణేలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్’ గేట్లో 129 ఆల్ ఇండియా ర్యాంక్‌తో పాటు ఐసీఎంఆర్, జేఆర్ఎఫ్ సాధించి.. తనపై గురువు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులోనే రమేష్‌కు క్యాన్సర్‌పై రీసెర్చ్ చేయడానికి అవకాశం రావడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సైనికుడిగా నేను, శాస్త్ర వేత్తగా నా శిష్యుడు.. భారతమాత రుణం తీర్చుకోవాలి. మా మనసులు వేరైనా.. ఆలోచన, లక్ష్యం, కష్టం, బాధ్యత మాత్రం ఒక్కటిగా పంచుకున్నాం. నేను నెరవేర్చలేకపోయిన ఆశయాన్ని మా శిష్యుడు సాధిస్తున్నాడు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాత.. శిష్యుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మా పదహారేళ్ల ప్రయాణంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. వాటిని ఇష్టంగా స్వీకరిస్తూ.. ముందుకు వెళ్లాం. నా శిష్యుడిని గొప్ప శాస్త్ర వేత్తగా తయారుచేసి, జీవశాస్త్రంలో నోబెట్ బహుమతి సాధించేలా చేయాలన్నదే నా లక్ష్యం. – నాసం రమేష్, గురువు, సీఆర్పీఎఫ్ జవాన్ రమేష్సార్ మార్గదర్శకత్వమే నాకు బలంతల్లి బడికి వద్దురా బిడ్డా అన్న సమయంలో రమేష్ సార్ కనిపించి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ రోజును నేను మరచిపోలేను. రమేష్ సర్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావడానికి కావాల్సినవి పట్టుదల, మార్గదర్శకత్వం. నాకు పట్టుదల ఉంది, రమేష్ సార్ నాకు మార్గదర్శనం చేశారు. అదే నా బలమైంది. సాధారణ విద్యార్థిని అయినా.. నా గురువు గొప్పమనిషిగా నన్ను తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు కొనసాగించారు. జీవితంలో వైఫలాలు ఉన్నా.. తనకు మాత్రం ఏ లోటు చేయలేదు. కుటంబ సభ్యుడిగా ఆరాధించారు. నా బంధువులు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరూ కూడా అండగా నిలబడలేదు. తన ప్రతి విజయం వెనక సార్ ప్రోత్సాహం కనిపిస్తుంది. గురువు అనే వ్యక్తి తనకు ఉన్న లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోయినా.. ఆ లక్ష్యాలను చేరుకునేలా గొప్ప విద్యార్థులను తయారు చేయగలరని నిరూపించాడు మా రమేష్ సార్. – బుట్టి రమేష్, శిష్యుడు -
ఫాసిస్ట్ బీజేపీ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్
చెన్నై: పౌర హక్కుల నేతల అరెస్టులపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే తమిళనాడు తూత్తుకుడిలో మరో ఉదంతం ఆందోళన రేపింది. తమిళనాడులోని విమానాశ్రయంలో బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను చూసి ఒక మహిళా స్కాలర్ ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిందంటూ ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం విమర్శలకు దారి దాసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిందన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందర రాజన్ ఫిర్యాదు మేరకు కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న తూతుకుడికి చెందిన సోఫియా లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ, తమిళనాడు పోలీసు చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పబ్లిక్ న్యూసెన్స్, ప్రజల అల్లర్లకు సంబంధించి అభియోగాలు మోపారు. అనంతరం ఆమెను 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సోఫియాకు మద్దతుగా స్పందించారు. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అనే మాటలను రిపీట్ చేస్తూ ట్వీట్ చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే..ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలని ప్రశ్నించారు. డీఎంకే నాయకులు, శ్రేణులు సోఫియాకు ఇస్తున్న మద్దతు సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. పోలీసు స్టేషన్లో దాదాపు తొమ్మిది గంటల పాటు సోఫియాను నిర్బంధంలో ఉంచారని ఆమె న్యాయవాది అతీసయ కుమార్ చెప్పారు. కెనడాలో ఇలాంటివి చాలా మామూలేనని కానీ మన దేశంలో ఆ స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. తమకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదనీ, ఏ ఏ కేసులు ఉన్నాయో తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు సోఫియా అక్రమ అరెస్టుకు నిరసననగా ఆమె తండ్రి బీజీపీ, తమిళనాడు పోలీసులకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును దఖలు చేశారు. ஜனநாயக விரோத - கருத்துரிமைக்கு எதிரான தமிழக அரசின் இந்த நடவடிக்கை கடும் கண்டனத்துக்குரியது! உடனடியாக அவரை விடுதலை செய்ய வேண்டும்! அப்படி சொல்பவர்களை எல்லாம் கைது செய்வீர்கள் என்றால் எத்தனை இலட்சம் பேரை சிறையில் அடைப்பீர்கள்? நானும் சொல்கின்றேன்! “பா.ஜ.க வின் பாசிச ஆட்சி ஒழிக!” https://t.co/JoPajdrSW5 — M.K.Stalin (@mkstalin) September 3, 2018 -
కబళించిన మృత్యువు
తూర్పు గోదావరి,నెల్లిపాక (రంపచోడవరం): సరదాగా చేపల వేటకు వెల్లిన ఇద్దరు బాలురిని మృత్యువు కబళించింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఎటపాక మండలం కన్నాయిగూడెం పంచాయతీ చెన్నంపేటలో తీరని విషాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండి వీరభద్రం, గుండి చినరాజు అన్నదమ్ముల పిల్లలు. వీరభద్రం పెద్ద కుమారుడు రామకృష్ణ(10), చినరాజు ఒక్కగానొక్క కుమారుడు సాయికిరణ్(13), కల్లూరి నవీన్ (17) కలిసి ఆదివారం ఉదయం.. చెన్నంపేట వద్ద గోదావరి, వాగు సంగమంలో చేపలు పట్టేందుకు గేలాలు తీసుకుని వెళ్లారు. వాగు దాటి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు నవీన్.. రామకృష్ణ చేయి పట్టుకుని నీటి లోతును గమనిస్తూ మెల్లిగా వాగు దాటిస్తున్నాడు. ఈ క్రమంలో ఒడ్డున ఉన్న సాయికిరణ్ అకస్మాత్తుగా వారిద్దరి సమీపంలో నీటిలోకి దూకాడు. ఊహించని ఈ పరిణామంతో కంగారు పడిన నవీన్, రామకృష్ణ పట్టు తప్పి వాగులో మునిగిపోయారు. వారితోపాటు సాయికిరణ్ కూడా మునిగిపోయాడు. ఎట్టకేలకు యువకుడైన నవీన్ బయటపడి ఒడ్డుకు చేరాడు. రామకృష్ణ (10), సాయికిరణ్ (13) గల్లంతయ్యారు. దీంతో నవీన్ అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్లి సమీపంలోని కొందరికి విషయం తెలిపాడు. గ్రామంలోకి వెళ్లి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నగ్రామస్తులు వాగులో కొద్దిసేపు గాలించారు. చివరకు ఇద్దరు బాలుర మృతదేహాలను వెలికితీశారు. అన్నదమ్ములిద్దరూ అనుకోని రీతిలో వాగులో పడి మృతి చెందటంతో చెన్నంపేట గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామకృష్ణ చంద్రంపాలెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సాయికిరణ్ అదే పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదివి గత ఏడాది నుంచి చదువు మానేశాడు. బిడ్డల మృతితో తల్లిదండ్రుల, బంధువులు బావురుమంటూ పెద్ద పెట్టున విలపించారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ నాయకులు రమేష్‌నాయుడు, బొజ్జయ్య, కడియం రామాచారి పరామర్శించి, రూ.6 వేల ఆర్థిక సాయం అందించారు. -
విద్యార్థిపై ‘నారాయణ’ ప్రిన్సిపాల్ దాష్టీకం
సాక్షి, అమరావతిబ్యూరో : నారాయణ విద్యా సంస్థలకు చెందిన ఓ ప్రిన్సిపాల్ దాష్టీకానికి విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అల్లరి చేస్తున్నాడంటూ ప్రిన్సిపాల్ కర్రతో ముఖంపై మోదడంతో విద్యార్థి కింద పడి రెండు పళ్లు విరిగిపోయి తీవ్ర రక్తస్రా వమైంది. ఓ వైపు విద్యార్థి తీవ్ర గాయాలపాలయినా ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ స్కూల్ రాష్ట్ర మంత్రి నారాయణకు సంబంధించిన విద్యా సంస్థ కావడంతో వెంటనే రంగంలోకి దిగిన యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులను బెదిరించి మీడియా దృష్టికి రాకుండా తీవ్ర ఒత్తిడి పెంచారు. ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న రమేష్ బాబు కుమారుడు రోహిత్‌సాయి నూజివీడు నారాయణ ఈ టెక్నో బ్రాంచ్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం క్లాస్ రూంలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారని టీచర్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుచేశాడు. ఆగ్రహించిన ప్రిన్సిపల్ క్లాస్‌రూంలోకి వెళ్లి కర్రతో రోహిత్ మొహంపై బలంగా మోదడంతో విద్యార్థి కిందపడ్డాడు. ఈఘటనలో విద్యార్థి రోహిత్‌కు రెండు పళ్లు విరిగి రక్రస్రావం అయింది. విద్యార్థికి వైద్యచికిత్స చేయించకపోగా సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంచారు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు వెంటనే వైద్య చికిత్స కోసం నూజివీడుకు తరలించారు. తమ బిడ్డపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను తండ్రి నిలదీయడంతో స్కూల్ యాజమాన్యం రంగంలోకి దిగి ఈ విషయాన్ని మీడియాకు చెప్పవద్దంటూ వారిపై బెదిరింపులకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సృందన ఉండదని బెదిరింపులకు దిగడంతో ఒత్తిళ్లకు తలొగ్గిన తల్లిదండ్రులు మౌనం దాల్చారు. చిన్న దెబ్బే తిగిలింది విద్యార్థికి చిన్న దెబ్బే తగిలింది. ఎలాంటి ప్రమాదం లేదు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడాం. ఏ సమస్యా లేదు. – మహేష్, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ -
టీచకుడు!
వలేటివారిపాలెం (కందుకూరు అర్బన్): విద్యాబుద్ధులు చెప్పి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. వారం నుంచి ఓ చిన్నారిని లైంగికంగా వేధిస్తూ పైశాచిక అనందం పొందుతున్నాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ విద్యార్థిని లోలోపలే మథనపడుతోంది. ఉపా«ధ్యాయుడి చేష్టలకు భయపడిన చిన్నారి వెనుక బెంచిలో కూర్చుంటుండగా ముందు బెంచిలో కూర్చోవాలని, లేకుంటే పాఠశాలకు కూడా రాలేవని భయపెట్టిన కీచక ఉపాధ్యాయుడి ఉదంతమిది. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వలేటివారిపాలెం మండలం నేకునాంపురం ప్రాథమిక పాఠశాలలో ఎస్సీ కాలనీకి చెందిన బాలిక ఐదో తరగతి చదువుతోంది. పాఠశాలలో ఉపా«ధ్యాయుడిగా పనిచేస్తున్న ఉన్నం వెంకటేశ్వర్లు అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. చిన్నారితో ఏ విధంగానైనా కామవాంఛ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. ప్రధానోపాధ్యాయుడు సెలవులో ఉన్నప్పుడు 5వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయంలో ఆ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. వెనుక బెంచిలో కూర్చొని ఉన్న బాలికను ఉపాధ్యాయుడు తన దగ్గరకు పిలిపించుకొని చెప్పరాని చోట్ల చేతులతో తన ఇష్టం వచ్చినట్లు తాకేవాడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలతో విద్యార్థిని హడలి పోయేది. వాస్తవానికి 5వ తరగతి విద్యార్థులకు హెచ్ఎం పాఠాలు బోధిస్తారు. ఆమె రెండు రోజులు సెలవు పెట్టడంతో విద్యార్థులు రోజంతా కీచక ఉపాధ్యాయుడి వద్దే కూర్చోవాల్సిన పరిస్థితి. అతడికి అవకాశం రావడంతో సదరు విద్యార్థిని పట్ల వికృత చేష్టలు మొదలు పెట్టాడు. తనకు నచ్చినట్లు నడుచుకోవాలని, లేకుంటే చంపేస్తానని బెదిరించేవాడని విద్యార్థిని తన తల్లికి చెప్పుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. సెలవులు ముగించుకుని హెచ్ఎం పాఠశాలకు రావడంతో కీచక ఉపాధ్యాయుడి వికృత చేష్టలు గురించి గ్రామస్తులు ఆమెకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం స్పందించి తాజా మాజీ సర్పంచ్‌ను పిలిపించి పాఠశాలలో జరుగుతున్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా ఇన్చార్జి ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈఓ రాంబాబు పాఠశాలకు వచ్చి బాధిత విద్యార్థినితో శనివారం మాట్లాడారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ప్రకటించారు. గ్రామస్తుల ఆందోళన కీచక ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అతడిని వెంటనే ఆరెస్టు చేసి విధుల నుంచి తొలగించాలని డిమండ్ చేశారు. పట్టణ ఎస్ఐ వేమన సంఘటన స్థలానికి చేరుకొని బాధిత విద్యార్థినితో ప్రత్యేకంగా మాట్లాడి కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు. -
రోడ్డెక్కిన విద్యార్థులు
పాలకొండ రూరల్ : బస్సులు సక్రమంగా రావటంలేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. పాలకొండ–పార్వతీపురం రహదారిలో అట్టలి గ్రామం వద్ద గురువారం బైఠాయించారు. ఆర్టీసీ యాజమాన్యం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాకేష్‌వర్మ, పవన్‌కుమార్, రాకేష్, శ్రావణి తదితరులు మాట్లాడుతూ వందలాది రాయితీ బస్‌పాసులు అందించిన ఆర్టీసీ సం స్థ తమకు అవసరమైన సర్వీసులు నడపటం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం తాము బస్సుల కోసం ఎదురుచూసి ఇబ్బందులు పడుతున్నామన్నారు. సకాలంలో బస్సులు రాక, వచ్చిన బస్సులు స్టాప్ల వద్ద ఆపకపోవటంతో కళాశాలలకు, పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నామన్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేక రోడ్డెక్కాల్సి వచ్చిందని వాపోయారు. అంతర్ రాష్ట్ర రహదారిపై విద్యార్థులు నిరసనకు దిగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్పందించి సర్ధిచెప్పటంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. ఖండ్యాం మార్గంలో ఆర్టీసీ బస్సు నడపాలి రేగిడి : మండలంలోని ఉంగరాడమెట్ట నుంచి ఖండ్యాం వెళ్లే ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు నడపాలంటూ పలు గ్రామాల విద్యార్థులు గురువారం ఆందోళనబాట పట్టారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాలకొండ నుంచి ఖం డ్యాం వరకు నడుస్తున్న బస్సు ఇటీవల అధికా రులు నిలిపివేయడంతో ప్రధాన రహదారికి ఆనుకున్న గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నా విష యం తెలుసుకున్న ఎస్సై జీ భాస్కరరావు తన సిబ్బందితో వెంటనే అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఖండ్యాం మార్గంలో బస్సు వేయించేందుకు ఆర్టీసీ డీఎంతో మాట్లాడుతానని, విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లిపోవాలని చెప్పడంతో వీరంతా ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో ఖండ్యాం, వన్నలి, ఉప్పర్నాయుడువలస, చాటాయివలస, వండానపేట, కేఎంవలస, సంతకవిటి మండలం కొండగూడెం, మాదవరాయపురం తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
పప్పన్నమే..
ఎదిగే పిల్లలు.. శారీరక, మానసిక ఎదుగుదల పాఠశాలలోనే జరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందాలి. పుష్టిగా భోజనం అందిస్తే విద్యార్థి అన్ని రకాలుగా ఎదిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ధరల ప్రభావం విద్యార్థుల భోజనంపై పడింది. ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం సూచించిన మెనూ ఎక్కడా పాటించడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందలేదు. కుల్కచర్ల వికారాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ధరల మంట అంటుకుంది. ధరలు భారీగా పెరగడంతో ఏజెన్సీల నిర్వాహకులు కూరగాయలను కొనలేకపోతున్నారు. దీంతో విద్యార్థుల భోజనంలో కూరగాయలు కనిపించడం లేదు. విద్యార్థులకు కేవలం పప్పుచారు, అన్నం వడ్డిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. కూరగాయలు ధరల ప్రభావం మధ్యాహ్న భోజనంపై తీవ్రంగా పడింది. పెరిగిన కూరగాయల ధరలు మధ్యాహ్న భోజనంపై ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్లో అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలను కొని వండితే అప్పుల పాలు కావాల్సిందేనని నిర్వాహకులు అంటున్నారు. దీంతో విద్యార్థులకు పప్పన్నం వడ్డిస్తున్నారు. ఈ భోజనాన్ని విద్యార్థులు సగం కడుపుకే తింటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. అర్ధాకలితో విద్యార్థుల సతమతం బడుల్లో మధ్యాహ్న భోజనం రుచి లేకపోవడంతో పిల్లలు కడుపునిండా తినడం లేదు. రోజూ పప్పుచారే వడ్డిస్తుండడంతో పిల్లలు చాలామంది ఇళ్లకు వెళ్లి తింటున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చే పిల్లలు సగం ఆకలితో ఉంటున్నారు. ఈ విషయ మై మధ్యాహ్న భోజన నిర్వాహకులను అడిగితే కూరగాయల ధరలు పెరగడంతో పప్పు వండుతున్నామని బదులిస్తున్నారు. పెరిగిన ధరలతో కూరగాయలు కొనుగోలు చేస్తే అప్పుల పాలు కావాల్సిందేనన్ని నిర్వాహకులు వాపోతున్నారు. పెరిగిన ధరలు ప్రభుత్వం పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తుండగా.. అయితే పెరిగిన కూరగాయల ధరలతో విద్యార్థులకు చారన్నమే దిక్కవుతోంది. కూరగాయాలు కిలో రూ.60కి చేరాయి. దీంతోభోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం నిర్వహించలేమని చేతులెత్తేస్తున్నారు. పప్పుతో చేసిన చారును మాత్రమే వడ్డిస్తున్నారు. చాలా పాఠశాలల్లో నీళ్ల చారే వడ్డిస్తున్నారు. పచ్చిమిరపకాయలు రూ.120, టమాటా కిలో రూ.60పైనే ఉంటున్నాయి. బీర కాయ, పాలకూర, వంకాయ, క్యారెట్‌తోపాటు ఆకుకూరల ధరలు భారీగానే పెరిగాయి. ఈ నేపథ్యంలో చాలా పాఠశాలల్లో మిర్చి, టమాటాలను అసలే వాడడం లేదు. ఇది మెనూ మెనూలో భాగంగా సోమ, గురువారం గుడ్డు, సాంబారు అందించాలి. మంగళ, శుక్రవారాల్లో ప ప్పు, కూరగాయలతో భోజనం ఉండాలి. బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో మధ్యాహ్నం భోజనం ఇవ్వాలి. ఒక్కో విద్యార్థికి 75 గ్రాముల కూర ఇవ్వాలని నిబంధన. అయితే కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ఎక్కడా కూడా మెనూ పాటించడం లేదు. భోజనం మోతాదు ఇది.. మధ్యాహ్న భోజనం పథకాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 1 నుంచి 5వ తరగతుల వారికి ఒక్కొక్కరికి ప్రభు త్వం రోజుకు రూ.4.13, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.6.18 పైసలు చెల్లిస్తోంది. గుడ్డు ఉన్న రోజు రూ.4 అదనంగా అందిస్తారు.మెనూ తప్పనిసరిగా పాటించాలి ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రభు త్వం సూచించిన మెనూ పా టించాలి. అలా పాటించ ని మధ్యాహ్న భోజనం ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. బిల్లులు నిలిపివేస్తాం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా మెనూ అమలయ్యేలా చూడాలి. – అబిబ్హమ్మద్, కుల్కచర్ల మండల విద్యాధికారి -
శ్రీచైతన్యలో మరో విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: సరూర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేట శ్రీ చైతన్య మహిళా జూనియర్ కాలేజీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు యత్నించిన విషయాన్ని గమనించిన సిబ్బంది హుటాహుటీనా దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చూడగా అప్పటికే చనిపోయింది. అర్చన స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం. కాలేజీ డీన్ మమతా తిట్టడంతోనే ఆత్మహత్య చేసుకుందని సమాచారం. విద్యార్థి కుటుంబసభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థినికి న్యాయం చేయాల్సిందే..
విశాఖ క్రైం/బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులే.. విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటం అత్యంత హేయమని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలతో సమానంగా చూడాల్సిన వారే ఇలా అరాచకాలకు పాల్పడితే విద్యార్థులకు రక్షణ ఎక్కడుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డాబాగార్డెన్స్‌లోని విశాఖ ఒకేషనల్ కాలేజీ కరస్పాండెంట్ గాది వెంకటసత్య నరసింహకుమార్ అలియాస్ కుమార్ తనను వేధించినట్లు బాధిత విద్యార్థిని ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లింది. బాధితురాలికి న్యాయం జరిగేలా కలెక్టర్, నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డిని ఆయన ఆదేశించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి సోమవారం ఉదయం కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. కుమార్‌పై చర్యలు తీసుకొని బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని కోరారు. నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు లైంగిక వేధింపులకు పాల్పడిన కళాశాల కరస్పాండెంట్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి సోమవారం మధ్యాహ్నం నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డాను కోరారు. ఈ మేరకు బాధితురాలతో కలిసి సీపీకి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కేసులో రాజకీయ నాయకులు ఉన్నారని సీపీ దృష్టికి తీసుకువెళ్లగా ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కరస్పాండెంట్ కుమార్, ప్రిన్సిపాల్ గ్లోరీ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారన్నారు. తమ చేతుల్లో మీ భవిష్యత్ ఉందని విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని కలెక్టర్‌ను కోరామని తెలిపారు. అలాగే కాలేజీకి అనుమతులు లేకుండా వందల మంది విద్యార్థులను చేర్చుకొని వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరే కాలేజీలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాగే బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులే నిందితులకు కొమ్ముకాసేలా వ్యవహరించడం శోచనీయమన్నారు. బాధిత మహిళ ఫిర్యాదును వెంటనే స్వీకరించి తగు చర్యలు తీసుకోవల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయటానికి కొంత సమయం పడుతుందని కలెక్టర్ చెప్పారని, ఆ సమయంలోగా న్యాయం చేయకపోతే వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ బాధిత విద్యార్థి చదువు పూర్తిచేసేంత వరకు యాజమాన్యం ఖర్చులు భరించాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించేంత వరకు అండగా ఉండాలన్నారు. సీపీ, కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, దక్షిణ సమన్వయకర్త కోలా గురువులు, విశాఖ పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బి.కాంతారావు, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. -
విద్యార్థినిపై అత్యాచారం.. హత్య!
హైదరాబాద్: రోజూలాగే ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు సాయంత్రం నుంచి కూతురు కోసం పరిసర ప్రాంతమంతా గాలిస్తున్న తల్లిదండ్రులకు సోమవారం విగతజీవిగా కనిపించింది. హైదరాబాద్ మేడిపల్లి ఠాణా పరిధిలోని బడంగ్‌పేటలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలై ఉండటంతో దుండుగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన అనసూయ, ప్రభు కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. బడంగ్‌పేటలోని రాజీవ్ గృహకల్ప 10వ బ్లాక్‌లో మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె వేవూరి వైష్ణవి (14) జిల్లెలగూడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతిరోజూలాగే ఆదివారం ఉదయం ఆరు గంటలకు వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తల్లి అనసూయ సాయంత్రం ఇంటికి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో విష యం దినసరీ కూలీగా పనిచేసే భర్తకు తెలిపింది. దీంతో వీరు స్థానికులతో కలసి వైష్ణవి స్నేహితులను, బంధువులను వాకబు చేసినా జాడ తెలియలేదు. దీంతో రాత్రి ఏడు గంటలకు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే సోమవారం ఉదయం ఆరు గంటలకు రాజీవ్ గృహకల్పలోని అంగన్వాడీ భవనం పక్కన ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనసూయ, ప్రభు దంపతులకు విషయాన్ని తెలియజేశారు. వారు అక్కడి వెళ్లి చూడగా తల, ముఖం, శరీరంపై తీవ్రగాయాలతో వైష్ణవి జీవచ్ఛవంగా పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు గుండెలు బాదు కుని రోదించడం అందరినీ కలచివేసింది. ఆటోలో తీసుకొచ్చి మృతదేహాన్ని పడేశారు... దుండగులు వైష్ణవిని ఉదయాన్నే కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం చేసిన అనంతరం ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి ఆమెను నీటిలో ముంచి శ్వాస ఆగిపోయేలా చేసి చంపినట్లు భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే ఆమెను శరీరంపై తీవ్ర గాయాలై ఉంటాయని అనుమానిస్తున్నారు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక మృతదేహా న్ని ఆటోలో తీసుకువచ్చి డ్వాక్రా భవనం పక్క న పడేసి వెళ్లిపోయి ఉండచ్చని భావిస్తున్నా రు. ఘటనాస్థలంలో ఆటో టైర్ల అచ్చులను గమనించిన పోలీసులు ఓ ఆటోవాలాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని మీర్‌పేట ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. తెలిసినవారి పనేనా? డ్వాక్రా భవనం పక్కనే కమ్యూనిటీ చర్చి ఉంది. చర్చికి నలువైపుల సీసీ కెమెరాలు ఉన్నాయి. అయితే దుండగులకు ఈ సీసీ కెమెరాల సంగతి ముందే తెలిసి ఉంటుందని అందుకే ఆటోను చర్చి ముందు నుంచి కాకుండా గల్లీల నుంచి తీసుకువచ్చి.. అదేదారిలో వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. అంటే రాజీవ్ గృహకల్పలో ఉండే వారేగాక ఆ ప్రాంతం గురించి తెలిసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, ఇది కచ్చితంగా తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు. -
వసతి..వ్యథే..!
సంక్షేమ హాస్టలే తమ ఇల్లని సంబరపడ్డారు. అధికారులే తమ సంరక్షకులని భావించారు. హాస్టల్ అధికారులే పెద్ద దిక్కని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస వసతులు కరువయ్యాయి. తిండి సరిగా లేదు. ఫ్యాన్ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. ఆరుబయట స్నానాలు, అరకొర అద్దె భవనాలు, మెనూ పాటించక పోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు సంక్షామానికి గురయ్యాయి. దీంతో విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. హాస్టళ్ల సమస్యలపై సాక్షి ప్రత్యేక కథనం. నెల్లూరు రూరల్: పేద విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తామని ఊదరకొడుతున్న టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నేటికి అద్దె భవనాల్లో చాలీచాలని గదుల్లో చదువుతూ కాలం వెల్లదీస్తున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, బాత్రూంలు, మరుగుదొడ్ల మరమ్మతుల కోసం నిధుల విడుదల జాప్యం వల్ల హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయి. తలుపులు విరిగి, ఉన్న వాటికి కన్నాలు పడ్డాయి. మరి కొన్నింటికి తలుపులు లేకుండా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఏడాదికి ఒక్క సారైనా హాస్టల్‌కు రంగులు వేయించడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు, అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 73 ఎస్సీ హాస్టళ్లు, 79 బీసీ హాస్టళ్లు, 23 ఎస్టీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో 19,645 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇందులో 22 బీసంక్షేమ హాస్టళ్లు చాలీచాలని వసతులతో అద్దె భవనాల్లో కాలం వెల్లదీస్తున్నారు. వసతుల కల్పనలో విఫలం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వంతోపాటు అధికారులు విఫలమయ్యారు. చాలీచాలని గదుల్లో విద్యార్థులు తమ పెట్టెలు, వస్తువుల వద్దే నిద్రిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చదువుకోవడానికి సరైన వసతులు లేక తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సివస్తోంది. కొన్ని కిటికీలకు రెక్కలు లేకపోవడంతో దోమలు గదుల్లోకి చేరుతున్నాయి. కొన్ని గదుల్లో ఫ్యాన్లు ఉన్నా తిరగకపోవడంతో దోమల దాటికి విద్యార్థులకు సరిగా నిద్రపట్టడం లేదు. దుప్పట్లు పంపిణీ చేయకపోవడంతో చలిలో జాగారం చేస్తున్నారు. ఇనుపపెట్టెలను 2008వ సంవత్సరంలో అందజేసినట్లు అధికారులే చెబుతున్నారు. ఉన్నవి విరిగిపోయి వంగిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. వాటిలో దుస్తులు కానీ, పుస్తకాలు కానీ దాచుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు వాపోతున్నారు. కొత్తగా వచ్చిన వారు పాత పెట్టెలలోనే వస్తువులు భద్రపరచుకుంటూ కాలం వెళ్లతీస్తున్నారు. వసతి గృహాల్లో ఎలుకలు వాటిని చిందర వందర చేస్తున్నాయి. ఎలుకల వల్ల కొన్ని వసతి గృహాల్లో కంటి మీద కునుకు లేకుండాపోతోంది. భద్రత కరువు బాలికల వసతి గృహాల్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులకు రక్షణ కరువైంది. వాచ్మన్లను ఏర్పాటు చేయకపోవడంతో బాలికలు అభద్రతాభావంతో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంతో పలు హాస్టళ్లలో రాత్రి వేళ్లల్లో ఆగంతకులు, ఆకతాయిలు, మందుబాబులు చొరబడినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. బాలికల హాస్టళ్లలో పురుషులను సిబ్బంది, ట్యూటర్లుగా నియమించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ సిబ్బంది సరిపోవడం లేదంటూ పలు హాస్టళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. విద్యార్థులపై అగాయిత్యాలు జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే మోనూ ఎలా.. వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచింది. ఇందులో భాగంగా హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్‌తోపాటు గురుకుల విద్యాలయాలు, ఆశ్రమ స్కూళ్లు, చిల్డ్రన్స్ హోంలు, ఆనంద నిలయాలకు వర్తింపచేశారు. పెంచిన మెస్ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి కొత్త మెనూ అమల్లోకి వచ్చింది. మారిన మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు కోడికూర, ప్రతి రోజూ పాలు, గుడ్లు, మారిన అల్పాహారంలో పూరీ, ఇడ్లీ వడ్డించాలని కొత్త మెనూను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో స్కేల్ ఆఫ్ రేషన్ ఇచ్చినా ధరలు మాత్రం ఇవ్వకపోవడంతో తామేం చేయాలో అర్థం కావడం లేదని వార్డెన్లు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు ఇప్పుడు మెస్ చార్జీల పెంపునకు చాలా తేడా ఉంది. ఒక్కో విద్యార్థిపై రూ.40పైగా అదనంగా భరించాల్సి వస్తుందని వార్డెన్లు వాపోతున్నారు. ఈ మెనూ అమలు సాధ్యం కాదని అధికారులు, వార్డెన్లు చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. తప్పని ఎక్కిళ్లు.. హాస్టళ్లకు దాతలు ఇచ్చిన ఆర్వోప్లాంట్లు మరమ్మతులకు గురికావడంతో మూలనపడ్డాయి. విద్యార్థులకు గ్లాసుల పంపిణీ లేదు. భోజనం చేసే సమయంలో మంచినీరు అందుబాటులో లేకపోవడంతో చేతిపంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని ప్లేట్లు పగుళ్లిచ్చాయి. ఆరుబయటకే.. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపుగదులు లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానం చేస్తున్నారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరుబయటకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో బయటకు వెళితే విషపురుగుల బారిన పడుతామేమోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో పందులు తిరుగుతున్నాయి. దీంతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ అంటూ బహిరంగ మలవిసర్జన వద్దని, పారిశుద్ధ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటనలు చేయడం తప్ప సంక్షేమ హాస్టళ్లలో సరిపడిన మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసతుల లేమి కారణంగా హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే జిల్లాలో 80 హాస్టళ్లు మూతపడ్డాయి. మౌలిక వసతుల కల్పనకు చర్యలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్టెలు, దుప్పట్లు అందజేశాం. మరుగుదొడ్ల నిర్మాణం, పాత భవనాల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే వాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తాం. ప్రతి హాస్టల్‌కు వాచ్‌మన్ నియమించడంతోపాటు, బాలికల వసతిగృహాలకు భద్రత పెంచాం. పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన మెనూలో కొంత ఇబ్బంది తలెత్తినప్పటికీ పూర్తిస్థాయిలో మెనూ అమలు చేయాలని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. – డి.మధుసూదనరావు, ఉప సంచాలకులు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ -
చిన్నారిపై టీచర్ అమానుషం
హైదరాబాద్, జీడిమెట్ల: ఓ టీచర్ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బోర్డు వైపు చూడడంలేదన్న కారణంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయురాలు చేయిచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన మేరకు.. చింతల్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి కుమారుడు రత్నవర్దన్‌రెడ్డి(6) ఏన్‌ఆర్‌ఐ టాలెంట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం రత్నవర్ధన్ బోర్డు వైపు చూడకుండా దిక్కులు చూస్తున్నాడన్న నెపంతో టీచర్ సునీత రత్నవర్దన్ చేతులపై కొట్టింది. సాయంత్రం ఇంటికి తీసుకువెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి చూసేసరికి విద్యార్థి చేతులపై వాతలు ఉన్నాయి. టీచర్ సునీతను అడగగా క్లాసులో బోర్డు వైపు చూడటంలేదని సమాధానం చెప్పింది. దీంతో విషయంపై బాలుడి తండ్రి ప్రశాంత్ రెడ్డి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీచర్‌పైవెంటనే చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
ఆగని కన్నీళ్లు...అంతులేని ఆవేదన
కళ్లముందు కదలాడుతున్న తమ బిడ్డల జ్ఞాపకాలు చెదిరిపోతాయేమోనని ఆ తల్లి దండ్రులు రెప్పలైనా వాల్చడంలేదు.. తెరలు తెరలుగా ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున బంధించి బిడ్డలు చెప్పిన ఊసులను, వారి అల్లరిని పదేపదే గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణమ్మకు కానుకేస్తానంటూ చిల్లర డబ్బులు తీసుకెళ్లి ఆ తల్లి గర్భంలోనే కడతేరారా అయ్యా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పరామర్శకు వచ్చిన తమ బిడ్డల స్నేహితులను చూసి ‘మాపై పిల్లలు అలిగారమ్మా.. అందుకే తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ పొగిలిపొగిలి ఏడ్చారు. ఇసుకాసురులు నదీగర్భంలో పాతాళానికి తవ్విన గోతులు తమ బిడ్డలను మింగేశాయన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక.. కడుపుకోతతో ఎలాబతకాలో అర్థంకాక శూన్యంలోకిబేలగా చూస్తున్నారు. తాడేపల్లి రూరల్: నలుగురు విద్యార్థుల మరణంతో చిర్రావూరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బిడ్డల్ని పొగొట్టుకున్న తల్లిదండ్రులు గర్భశోకంతో తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా తీరంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. తల్లిదండ్రుల దుఃఖాన్ని అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు. కొడుకుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోతున్నారు. గురువారం గుండిమెడ ఇసుక రీచ్‌లో గుంతలో పడి మృతిచెందిన వారిని పరామర్శించేందుకు బంధువులతో పాటు, వడ్లపూడి నాగార్జున హైస్కూల్ విద్యార్థులు, చిర్రావూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చిర్రావూరు గ్రామానికి చేరుకున్నారు. తొలుత నీలం క్రాంతికుమార్, శశివర్ధన్ తల్లిదండ్రుల్ని పరామర్శించారు. కొడుకులు ఉన్న ఫొటోను పట్టుకుని చూపిస్తూ కన్నీరుమున్నీరుగా తండ్రి విలపించాడు. ఆకుకూరలు అమ్ముతూ తన కొడుకులను విద్యావంతుల్ని చేయాలనుకున్నానంటూ బావురుమన్నాడు. నాన్నా, అమ్మా ఒక్కరోజైనా మాతోపాటు ఇంటివద్ద ఉండమని బ్రతిమలాడేవారని...అలా లేకుండా ఉన్నందుకు మా మీద కోపగించుకొని శాశ్వతంగా దూరమయ్యారు అంటూ చిన్న కొడుకు అమ్మాయి వేషధారణతో ఉన్న ఫొటో చూపించి దుఃఖించాడు. పిల్లలు సైతం ఆ తల్లితండ్రుల్ని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తల్లి శేషకుమారి దుఃఖించి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అమ్మా.. అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు విద్యార్థులు తర్వాత మలమంటి దినేష్ ఇంటికి వెళ్లారు. అతడి తమ్ముడు సాయి అమ్మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు... అన్నయ్య ఎక్కడకెళ్లాడు అని అడగడంతో ఆ తల్లి దుఃఖాన్ని కట్టడిచేయడం ఎవరివల్లా కాలేదు. తన కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్, వేసిన పెయింటింగ్ చూపించి భోరున విలపించింది. తాను కౌలురైతైనప్పటికీ, ఆస్తిపాస్తులు లేకపోయినా తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నానంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్కగానొక్కకొడుకు మరణంతో శోకం విద్యార్థులు అక్కడ నుంచి తాటికోరు సాం బయ్య, లక్ష్మికి ఇంటికి వెళ్లారు. ఒక్కగానొక్క కొడుకు శివ మరణంతో వారు తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా నదికి వెళ్తానమ్మా అని అడిగేముందు ఆకలవుతుందంటూ చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చానని, టిఫిన్ తినకుండానే కృష్ణమ్మను చూసేందుకు పరుగులు తీసాడని సాంబయ్య విలపించాడు. కొడుకు తిరిగి మరలా వచ్చి అమ్మా కృష్ణమ్మకు దణ్ణం పెట్టుకోవాలి, కానుక వేయాలి అంటూ వెనక్కు వచ్చి డబ్బులు తీసుకువెళ్లాడని, తీరా ఆ కృష్ణమ్మ ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోయాడని విద్యార్థులు, టీచర్ల ముందు తల్లి వాపోయింది. విద్యార్థులు మృతి చెందారన్న సం ఘటన తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లితండ్రులను పరామర్శించేందుకు చిర్రావూరు తరలిరావడం విశేషం. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం తాడేపల్లి రూరల్: నలుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం గురువారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి రూ.2లక్షలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. బాధితులను పరామర్శించేందుకు చిర్రావూరు వచ్చిన మంత్రులు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఒక్కొక్క కుటుంబానికీ లక్ష రూపాయలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక్కొక్కరికీ రూ.25 వేలు, గంజి చిరంజీవి నలుగురు కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. -
నాలుగో రోజుకి చేరిన సిబీఐటీ విద్యార్థుల ఆందోళన
-
ఫీజులు పెంచొద్దు
మణికొండ: కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజులనే చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల పాటు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం దిగిరాకపోవటంతో గురువారం ఏకంగా పరీక్షలను సైతం బహిష్కరించి రోడ్డెక్కారు. గండిపేట మండల కేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని యాజమాన్యం అప్పట్లో పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు. దాంతో రాష్ట్ర హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న పలు కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విదంగా రూ.2లక్షలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో సీట్లు పొందిన ఎ కేటగిరీ విద్యార్థుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని సర్క్యులర్ జారీచేయడంతో అప్పట్లో విద్యార్థులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరీ విద్యార్థుల నుంచి పెంచిన ఫీజలు చెల్లించాలని నిర్ణయించారు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాటపట్టారు. కళాశాల ప్రాంగణంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్థుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్థులు ఆరోపించారు. -
చిర్రావూరు.. కన్నీటి ఏరు
ఊరు.. ఊరంతా కన్నీటి ఉప్పెనైంది. బుధవారం తూరుపు దిక్కు తొలి పొద్దు పొడుపుతో తెల్లారిన చిర్రావూరు.. సాయంకాలం వేళ పగిలిన గుండెల విషాదాన్ని మోసుకుంటూ పడమటి దిక్కున వాలిపోయింది. తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన నలుగురు విద్యార్థుల ప్రాణాలను గుండిమెడ వద్ద కృష్ణానదిలో తవ్విన మృత్యు అగాధం మింగేసింది. ఉదయాన్నే.. అమ్మా ఆడుకుంటామంటూ వెళ్లిన బిడ్డల ఆకలిని తమ పేగుల్లో నింపుకొని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు.. గుండె పగిలే విషాదం గుమ్మం వద్దే ఎదురొచ్చింది. కృష్ణమ్మ ఒడ్డున కన్నీటి ఒత్తులతో మిణుకు మిణుకుమంటున్న వారి ఆశ.. ఆయువు తీరిన దేహాలను చూసి అక్కడే ఆవిరైపోయింది. నవ్వుల గలగలలతో తన చెంతకు చేరిన విద్యార్థులను చూసి మురిసిన కృష్ణమ్మ.. మునిగిపోతున్న బిడ్డల ప్రాణాలను కాపాడలేక బాధాతప్త సెలయేరై కదిలిపోయింది. నలుగురు బిడ్డల మృత్యు ఘోష నలుదిక్కులా ప్రతిధ్వనిస్తుండగా చలించిన ప్రతి హృదయం గుండెలు బాదుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. తాడేపల్లిరూరల్: ఇసుక క్వారీ గుంతలు నలుగురు విద్యార్థులను కబళించాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మృతి చెందిన నలుగురు చిర్రావూరుకు చెందిన వారే. దీంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో నదీ తీరానికి చేరుకుని గల్లంతైన వారి కోసం అక్కడే పడిగాపులు కాశారు. ఉదయం 8 గంటల సమయంలో సంఘటన జరగ్గా, మధ్యాహ్నం ఒంటి గంటకు, అనంతరం మరో మూడు గంటల తేడాతో నాలుగు మృతదేహాల్ని సహాయక బృందాలు బయటకు తీశాయి. తాడేపల్లి మండల పరిధిలోని గుండిమెడ గ్రామ పరిధి ఇసుక క్వారీ గుంతల వద్ద బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వరద నీరు రావడంతో తాడికోరు శివ (15) స్నేహితులతో కలసి కృష్ణానదికి వెళ్లాలని అనుకున్నాడు. బాబాయి తాడికోరు సురేష్‌కు విషయం చెప్పాడు. అతడు తన గూడ్స్ ఆటో తీసుకుని బయలుదేరాడు. ఇంటి పక్కనే నివాసం ఉండే నీలం క్రాంతి (15), నీలం శశివర్ధన్ (9), మలమంటి దినేష్ (10), హర్షిత, శివపార్వతి, పవన్‌సాయి కూడా ఆటో ఎక్కారు. సురేష్ కృష్ణానది తీరానికి రాగానే బహిర్భూమికి వెళ్తూ ఆటోలో నుంచి ఎవరిని దిగవద్దని హెచ్చరించాడు. నది మధ్యలో రోడ్డులా కనిపించడంతో నీలం క్రాంతి, నీలం శశివర్ధన్, మలమంటిæ దినేష్, తాటికోరు శివ అక్కడకు వెళ్లారు. రోడ్డు మధ్యలో కొంత భాగంలో నీళ్లు ప్రవహించడంతో అది దాటి అవతల ఒడ్డుకు వెళదామని నీలం క్రాంతి దిగగా, నీటి ఒరవడికి కొట్టుకుపోసాగాడు. అది చూసిన శశివర్దన్ పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కూడా జారిపోయాడు. వారిద్దర్నీ రక్షిద్దామని శివ, దినేష్‌లు ప్రయత్నించగా వారు కూడా నీటిలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన సురేష్ పెద్దగా కేకలు వేస్తూ పారుతున్న నీటి వద్దకు వెళ్లినా వారిని రక్షించలేకపోయాడు. వెంటనే బంధువులకు సమాచారం అందించగా.. అందరూ కృష్ణానది వద్దకు పరుగులు పెట్టారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామస్తులు కొంత మంది గుంతల్లో దిగి కాపాడాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు నివారణ దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి పిలిపించారు. వారు మర బోట్లు, రోప్‌ల సాయంతో రెండు గంటలపాటు ముమ్మరంగా గాలించగా తొలుత నీలం క్రాంతి, మరో ఇరవై నిమిషాల వ్యవధిలో నీలం శశివర్ధన్ మృతదేహాలు దొరికాయి. గ్రామస్తుల సాయం ఇక ఎంత గాలించినా మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియకపోవడంతో సంఘటన జరిగిన క్వారీ గుంతల వద్ద గ్రామస్తులు ఇసుక బస్తాలను వేశారు. పొక్లెయిన్ సహాయంతో మట్టిని పోసి నీటి ప్రవాహం సాగకుండా అడ్డుకట్ట కట్టారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా రంగంలోకి దిగాయి. మధ్యాహ్నం 3.50 గంటలకు దినేష్, శివ మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ దళాలు బయటకు తీసుకొచ్చాయి. గుండెలు పగిలేలా రోదించిన తల్లిదండ్రులు తమ కొడుకుల మృతదేహాలను చూసి శివ తల్లి లక్ష్మి, క్రాంతి కుమార్, శశివర్దన్ల తల్లి శేషకుమారి, దినేష్ తల్లి నాగలక్ష్మిలు స్పృహ తప్పి అక్కడే కుప్పకూలిపోయారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. స్థానిక ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, వైఎస్సార్ సీపీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడేపల్లి, మంగళగిరి మండల పార్టీ కన్వీనర్లు పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, యువజన నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, చిర్రావూరు పార్టీ కన్వీనర్ మేకల సాంబశివరావు, యువజన నాయకులు బాజీ గంగాధర్ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే పరామర్శ నలుగురు విద్యార్థులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులతో ఫోన్లో సంప్రదించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. మంగళగిరి టౌన్ : కృష్ణా నదిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిన చిన్నారుల కుటుంబసభ్యుల్ని బుధవారం రాష్ట్రమంత్రి నక్కా ఆనందబాబు మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున సాయంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ పాపం ఎవరిది ? తాడేపల్లి రూరల్: ముక్కుపచ్చలారని నాలుగు నిండు ప్రాణాలు... ముగ్గురు తల్లులకు కడుపుకోత... శోకసముద్రంలో యావత్తు గ్రామం... బలి తీసుకుంది అక్రమ ఇసుక క్వారీ గుంతలు... ఈ పాపం ఎవరిది? ఆ తల్లుల కడుపుకోతకు బాధ్యులెవరు? అధికారపార్టీ నేతలా? లేక వారికి వత్తాసు పలుకుతున్న అధికారులా? నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. గుండిమెడ గ్రామ పరిధిలోని ఇసుక క్వారీ వద్ద బుధవారం పరవళ్లు తొక్కే కృష్ణమ్మను చూసేందుకు వెళ్లిన నలుగురు విద్యార్థులు ఇసుక క్వారీ గుంతల్లో పడి మృతి చెందారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గ్రామస్తులు, స్థానిక మత్స్యకారులు 7 గంటల పాటు వెదికి మృతదేహాల్ని వెదికితీశారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉండటంతో శోకసముద్రంలో మునిగిపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తాడిచెట్టు లోతు ఉన్న ఆ గుంతల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాల్ని వెదికేందుకు అష్టకష్టాలు పడ్డాయి. గల్లంతైన వారిలో ఒకరైన నీలం క్రాంతికుమార్ మృతదేహాన్ని 12:55 గంటలకు బయటకు తీశారు. పెద్ద కొడుకు మృతదేహాన్ని చూడగానే తండ్రి రమేష్ హత్తుకొని గుండెలు పగిలేలా దుఃఖించారు. తల్లి శేషకుమారి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెకు అక్కడే ఉన్న వైద్య బృందం సేవలందించింది. ఈలోగా రెండో కొడుకు శశివర్ధన్ మృతదేహాన్ని 1.45గంటలకు బయటకు తీశారు. తల్లి చూడకుండానే అక్కడనుంచి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించడంతో ఆమె బాధ అంతా ఇంతా కాదు. మరబోట్లతో వెతుకలాట క్వారీలో అనుమతుల ప్రకారం 3 అడుగులు మేర ఇసుకను తీయాలి. అయితే, క్వారీని నడుపుతున్న టీటీపీ నేతలు 30 అడుగుల వరకు తీయడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాల్ని వెదకడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. మరబోట్లను తెప్పించినా ఫలితం లేకపోయింది. చివరకు కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహాలను వెలికితీసే కృష్ణ అనే మత్స్యకార యువకుణ్ణి తీసుకువచ్చి వెదికించారు. మొదట మలమంటి దినేష్ మృతదేహం లభించింది. తల్లితండ్రులు విగతజీవిగా మారిన తమ కొడుకును చూసుకుని భోరున విలపించారు. ‘ఎక్కడికీ వెళ్లనివాడివి ఈరోజు బయటకు ఎందుకొచ్చావురా నాన్నా’ అంటూ కొడుకును హత్తుకొని రోదించారు. ‘నా కొడుకు చచ్చిపోలేదు.. ఇంకా బతికే ఉన్నాడు.. ఆసుపత్రికి తీసుకువెళ్లండంటూ అక్కడున్న వారిని కాళ్లావేళ్లా బతిమిలాడడంతో ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టారు. అనంతరం 3:55 గంటలకు తాడికోరు శివ మృతదేహాన్ని గజ ఈతగాడు కృష్ణ బయటకు తీసుకువచ్చాడు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి రోదనలు మిన్నంటాయి. కొడుకు నురగలు కక్కుతుండడంతో ‘బతికే ఉన్నాడు...వైద్యం చేయించ’డంటూ పోలీసులను బ్రతిమిలాడింది. ఆమె బాధను చూడలేక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నీటిలో మునిగినప్పుడు కాపాడేందుకు చేసే ప్రక్రియనంతా చేశారు. అయినప్పటికీ తన కొడుకు బతికే ఉన్నాడని ఆ తల్లి రోదన మిన్నంటడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చనిపోయాడని నిర్ధారించిన తర్వాత ఆమె ఆసుపత్రి వద్దే కుప్పకూలింది. ఇంతమంది తల్లులకు గర్భకోశాన్ని మిగిల్చిన టీడీపీ నేతలు ఆర్చుకొని, తీర్చుకొని అక్కడకు వచ్చారు. పైపైన హడావుడి చేసి, కపట సానుభూతి చూపించారు తప్పా ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఒక పొక్లెయిన్‌ను కూడా పిలిపించలేదు. గ్రామస్తులు, పోలీసులు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గ్రామస్తులు చేయిచేయి కలిపి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. వారు కట్ట వేసిన గంట తర్వాత పొక్లెయిన్ వచ్చి పైపైన సరిచేసి వెనుదిరిగి వెళ్లింది. అధికార పార్టీ నేతలు కృష్ణమ్మకు తూట్లు పొడిచి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కూడా కనీసం కనికరం లేకుండా వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీబీఐటీ కళాశాలలో రగడ
-
అక్రమ ఇసుక తవ్వకాలకు నలుగురు విద్యార్థులు బలి
-
కడుపు కోత
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు వెళ్లిన విద్యార్థులను మృత్యువు కబళించింది. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వడంతో.. అక్కడ ఏర్పడ్డ తాటి చెట్టంత లోతైన గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు గల్లంత య్యారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు స్నేహితులు కూడా నీటమునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామానికి చెందిన నీలం రమేశ్, శేషకుమారిల కుమారులు క్రాంతి(15), శశివర్ధన్ (9), తాడికోరు సాంబశివరావు, లక్ష్మి దంపతుల కుమారుడు శివ (15), మల్లంపాటి కృష్ణ, నాగలక్ష్మి దంపతుల కుమారుడు దినేష్ (10), మరో ముగ్గురు చిన్నారులు ఆటోలో వరదను చూసేందుకు గుండిమెడ గ్రామంలోని నది ఒడ్డుకు వెళ్లారు. ఆటోను నది ఒడ్డున ఆపి, డ్రైవర్ సురేశ్ బహిర్భూమికి వెళ్లాడు. నీలం క్రాంతి, శశివర్ధన్, శివ, దినేశ్ నది వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుకను తరలించేందుకు వేసిన రోడ్డులో వెళుతున్న క్రాంతి లోతైన ఇసుక గుంతల్లో పడిపోయాడు. క్రాంతిని కాపాడేందుకు శివవర్ధన్ ప్రయత్రించాడు. అయితే ఇద్దరూ నీటిలో జారిపోతూ భయంతో కేకలు వేశారు. స్నేహితులను కాపాడేందుకు దినేశ్, శివ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నీటిలోకి దిగడంతో వారు కూడా నీటమునిగి గల్లంతయ్యారు. దీనిని గమనించిన సురేశ్ హుటాహుటిన వచ్చి నలుగురిని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. దీనిపై సమాచారం అందుకున్న గుండిమెడ గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా గుంతలు 20 నుంచి 30 అడుగులు ఉండటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొద్దిసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు బుధవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో నీలం క్రాంతి మృతదేహాన్ని వెలికితీశారు. 1.45 గంటలకు నీలం శశివర్ధన్ మృతదేహాన్ని వెలికితీశారు. అయితే ఎంత గాలించినా దినేశ్, శివ ఆచూకీ దొరకలేదు. చివరకు స్థానిక మత్స్యకారులు ముమ్మరంగా గాలించి నీటి అడుగున చిక్కుకున్న మల్లంపాటి దినేశ్ మృతదేహాన్ని, శివ మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో వెలికితీశారు. మృతిచెందిన తమ కుమారులను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా, ఘటనా స్థలానికి వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విద్యార్థుల మృతిపట్ల సంతాపం తెలియజేశారు. ఆ సమయంలో గల్లాజయదేవ్‌ను, స్థానిక టీడీపీ నేతలను గ్రామస్థులు నిలదీశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ చెప్పారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి.. మృతిచెందిన నలుగురు విద్యార్థుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. కుమారులు క్రాంతి, శశివర్ధన్ ఇద్దరు మృతిచెందడంతో తల్లిదండ్రులు నీలం రమేశ్, శేషకుమారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విగతజీవులుగా ఉన్న కుమారులను చూసి తల్లిదండ్రులు స్పృహ తప్పిపడిపోయారు. అక్రమ ఇసుక తవ్వకాల నిగ్గు తేల్చాలి – వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల కన్వీనర్ దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామ పరిధిలోని ఇసుక రీచ్‌లో తాడిచెట్టు లోతు తవ్విన ఇసుక గుంతల్లో మృతి చెందిన నలుగురు చిన్నారులే ఇందుకు సాక్ష్యమన్నారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. గతంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ తెలిపిందని గుర్తు చేశారు. నలుగురు చిన్నారుల ప్రాణాలు కోల్పోయారని, వారి తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారో సీఎం చంద్రబాబు చెప్పాలని వేమారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. చిన్నారుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు పాటిబండ్ల కృష్ణమూర్తి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, మేకల సాంబశివరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
ఏడాదికి రూ.70 లక్షల వేతనం
ఒక సాదాసీదా ఎలక్ట్రిషియన్ కొడుకు... అప్పటికే మూడు సార్లు అనుకున్న లక్ష్యం విఫలమైంది. అయినప్పటికీ ఎక్కడా కూడా పట్టు వదలలేదు. ఎలాగైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిరంతరం శ్రమించాడు. ఎట్టకేలకు ఆ విద్యార్థి చెంతకే ఓ అమెరికన్ కంపెనీ వచ్చి వాలింది. ఆ విద్యార్థిని వదులుకోలేక భారీ ప్యాకేజీతో తన కంపెనీలోకి నియమించుకుంది. ఆ విద్యార్థే జామియా మిల్లియా ఇస్లామియా(జేఎంఐ)కు చెందిన మహమ్మద్ ఆమీర్ అలీ. అతడి స్టోరీ యువతరానికి స్ఫూర్తిదాయకం. జేఎంఐ స్కూల్ బోర్డు పరీక్షల్లో అలీ మంచి మార్కులు సంపాదించాడు. కానీ మూడేళ్ల పాటు బీటెక్ కోర్స్‌లో సీటే దొరకలేదు. తొలి ప్రయత్నంలో నిరాశ. ఆ తర్వాత రెండు సార్లు విఫలమే. అయినప్పటికీ ఎక్కడ కూడా పట్టువిడవలేదు. మూడు సార్లు విఫలమనంతరం అలీ ఆశలకు కాస్త ఊరటనిస్తూ.. జేఎంఐలో డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత లభించింది. అప్పటికే పలుమార్లు విఫలమైన అనంతరం జేఎంఐలో సీటు దక్కించుకున్న అలీ.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా సాధించాలనుకున్నాడు. భవిష్యత్తు తరం వారికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రాజెక్ట్ వర్క్‌చేయడం ప్రారంభించాడు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సరియైన ఛార్జింగ్ సదుపాయాలు లేవు. వీటిపై ఎక్కువగా దృష్టిసారించాడు అలీ. ఒకవేళ అలీ ప్రాజెక్ట్ విజయవంతమైతే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా కంపెనీ ఫ్రిసన్ మోటార్ వ్రెక్స్ గుర్తించింది. జేఎంఐ వెబ్సైట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్‌ను చూసిన ఫ్రిసన్ వెంటనే యూనివర్సిటీ అధికారులను సంప్రదించింది. స్కైప్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా నెల పాటు అలీతో నిరంతరం కమ్యూనికేషన్ జరిపిన ఫ్రిసన్.. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంజనీర్‌గా తన కంపెనీలోకి నియమించుకుంది. వేతనం ఎంత అనుకుంటున్నారు? వింటే మీరే ఆశ్చర్యపోతారు. 1,00,008 డాలర్లు అంటే సుమారు 70 లక్షల రూపాయలన్నమాట. ఒక జామియా విద్యార్థికి ఈ మేర వేతనంతో ఉద్యోగం దొరకడం ఇదే తొలిసారి. జేఎంఐ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీ అని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అలీ తండ్రి శంషాద్ అలీ జేఎంఐలోనే ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరాలు ఎలా పనిచేస్తాయని తనను చాలాసార్లు అలీ అడుగుతుండే వాడని శంషాద్ చెప్పారు. -
ఇంజనీరింగ్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
-
వసతిగృహం కోసం ఆందోళన
పాలకొండ : స్థానిక నగర పంచాయతీలో బీసీ బాలికల వసతిగృహం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాలకొండ ప్రధాన రహదారిలో ర్యాలీ సోమవారం నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు, సీపీఐ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ బీసీ విద్యార్థినులు పలు కళాశాలల్లో చదువుతున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా వసతి గృహంలో 37 మంది బీసీ విద్యార్థినులు చేరి పలు కళాశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అయితే.. ఈ ఏడాది నుంచి ఎస్సీ వసతి గృహంలో బీసీ విద్యార్థినులు ఉండటాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉండేందుకు వసతిలేక, కళాశాలలకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటూ చదువులు కొనసాగిస్తున్నారని, ప్రస్తుతం వీరి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. తక్షణమే పాలకొండలో బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రెడ్డి గున్నయ్యను కలిసి పరిస్థితి వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. సమస్యను కలకర్ట్ దృష్టికి తీసుకు వెళ్లానని, బీసీ వసతి గృహం మంజూరుకు చర్యలు తీసుకునేందుకు ఆయన హమీ ఇచ్చారని వివరించారు. అంతవరకు ఇతర వసతి గృహల్లో ఈ విద్యార్థినులను ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : మెడికల్ కౌన్సిలింగ్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ విద్యార్థులు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులను పెనుమలూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తప్పించుకోబోయి..
-
పోలీసులను చూసి.. స్కూటీని పక్కన ఆపేసి!
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో ఏడు వేర్వేరు చోట్ల శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36/10 చౌరస్తాలో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య, జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 డైమండ్ హౌజ్ వద్ద బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. ముత్తు, జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో ట్రాఫిక్ ఇంజనీరింగ్ సెల్ సీఐ ఆది ముత్తి, బీవీబీపీ జంక్షన్లో సైఫాబాద్ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ చౌరస్తాలో మారేడుపల్లి ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, నీరూస్ జంక్షన్లో ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సీఐ రామలింగ రాజు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. మోతాదుకు మించి మద్యం సేవించిన 149 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 74 ద్విచక్ర వాహనాలు, 49 కార్లు ఉన్నాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. తప్పించుకోబోయి కిందపడ్డ విద్యార్థి... సనత్‌నగర్‌లో నివసించే సిహెచ్. సిద్దార్థ్ అనే ఇంజనీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లోస్నేహితులతో కలిసి మద్యం పార్టీ అనంతరం స్కూటీపై రోడ్ నెం. 10 మీదుగా వెళ్ళడానికి వస్తున్నాడు. అదే సమయంలోరోడ్ నెం.36/10 చౌరస్తాలో పోలీసుల తనిఖీలు జరుగుతుండటంతో స్కూటీని ఓ పక్కన ఆపి నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు. తన స్నేహితుడిని రమ్మని చెప్పి మళ్ళీ రోడ్డుకుఅవతలి వైపు నుంచి స్కూటి పార్కింగ్ చేసిన వైపు వెళ్తూ మధ్యలోడివైడర్ను దాటడానికి ప్రయత్నిస్తుండగా డివైడర్ ఎత్తుగా ఉండటంతో తట్టుకొని కిందపడ్డాడు. దీంతో కాలువిరిగింది. పోలీసులు గమనించి ఏం జరిగిందని ఆరా తీస్తే జరిగిన విషయం చెప్పాడు. వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రోల్ మోడల్.. మేరీకోమ్
ఆ అమ్మాయి పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్‌లో రాణిస్తోంది. తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది.ఆమే సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న హర్మీత్ సేఠి. రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంగెలుచుకున్న హర్మీత్... బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు సొంతంచేసుకుంది. రాంగోపాల్‌పేట్: తల్లిదండ్రుల సహకారం, బాక్సింగ్ కోచ్ ప్రోత్సాహంతో హర్మీత్ సేఠి బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. మారేడుపల్లికి చెందిన హర్మీత్ తండ్రి హర్మీందర్ సింగ్ కూడా బాక్సర్. ఆయన గతంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. అలాగే బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం బాక్సింగ్ కోచ్‌గా, ఫిటనెస్ ట్రైనర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి బాటలో పయణిస్తున్న హర్మీత్... బాక్సింగ్‌పై ఆసక్తితో 2016లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేరింది. అక్కడ కోచ్ కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న ఆమె అనేక పతకాలు, అవార్డులు సొంతం చేసుకుంది. 2017లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటికీ మారేడుపల్లిలోని నెహ్రూనగర్ పార్కులో జీహెచ్ఎంసీ కోచ్ కృష్ణ దగ్గరే శిక్షణ తీసుకుంటోంది. జాతీయపోటీలకు... తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆగస్టు 13–15 వరకు ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్స్ గర్ల్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించింది. ఇందులో హర్మీత్సేఠి ఈ ఏడాది బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు అందుకుంది. అంతేకాకుండా 54 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంసాధించింది. దీంతో ఆమె జాతీయ సబ్ జూనియర్స్చాంపియన్షిప్కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 2–8 వరకు నాగ్‌పూర్‌లో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. రోల్ మోడల్.. మేరీకోమ్ బాక్సింగ్ రాణి మేరీకోమ్ నా రోల్ మోడల్. మేరీకోమ్‌లా నేనూ భారత్‌కు పతకాలు సాధించి పెట్టాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచే నాకు బాక్సింగ్ అంటే ఇష్టం. అందుకే ఇందులోకి వచ్చాను. నా తల్లిదండ్రులు, కోచ్ కృష్ణ గారు నన్నెంతోప్రోత్సహిస్తున్నారు. – హర్మీత్ సేఠి -
తెలంగాణ విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: కేరళ వరదల్లో చిక్కుకున్న ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మౌర్య రాఘవ్(ఖమ్మం), శరణ్ శ్రావణ్(వరంగల్) క్షేమంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ కార్యాలయ అధికారులు తెలిపారు. వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం విద్యార్థినులు, కొట్టాయం కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే విద్యార్థినులకు రైలు టికెట్లు బుక్ చేశామని, వారు సోమవారం తెలంగాణకు బయల్దేరుతారని వెల్లడించారు. -
ఎందుకీ వివక్ష...
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల పట్లవివక్ష చూçపుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో మధ్యాహ్న భోజానాన్ని పెడతామని ప్రకటన చేసింది. అమలులో వివక్ష చూపుతోంది. అడ్మిషన్ల సమయంలో పలు ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి.. ‘మీ పిల్లలను మా కళాశాలల్లో చేర్పించండి.. మధ్యాహ్న భోజనం పెట్టిస్తాం’ అని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం కేవలం ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజనమని ప్రకటించింది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లితండ్రులు మా పిల్లలకు ఎందుకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏమి చెప్పాలో తెలియక అధ్యాపకులు తల పట్టుకుంటున్నారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కళాశాలలు ప్రారంభమయ్యాక కేవలం ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తోంది. ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టడం లేదు.దీంతో వేలమంది పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం ఈ నెల 6 నుంచి ప్రారంభించారు. ఎయిడెడ్ కళాశాలల్లో ఇంకా అమలు కాలేదు. పాఠశాలలకు సరఫరా చేసే ఏజెన్సీలకే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పెట్టే ఏజెన్సీలకు చెందిన వారే కళాశాలలకు భోజనం అందించాలని ఇంటర్‌బోర్డు అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. రెండు శాఖల మధ్య సమన్వయలోపం, సరైన ప్రభుత్వ ఉత్తర్వులు లేని కారణంగా చాలా రోజులు విద్యార్థులకు భోజనం అందలేదు. ఈ నెల 4న జిల్లా పర్యటకు వచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు కడప నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం అందుతుందా అని విద్యార్థులు ప్రశ్నించగా అందడం లేదని చెప్పారు. వెంటనే విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కావాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు ఆయన ఆదేశం ప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజజాన్ని అమలు చేస్తున్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో అమలెక్కడ ప్రభుత్వ చెప్పిన ప్రకారం మొదట్లో కొన్ని ఎయిడెడ్ కళాశాలల్లో(వేంపల్లి, బద్వేల్, పొద్దుటూరు తది తర ప్రాంతాల్లో) మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. తరువాత ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలకు మాత్రమే మధ్యాహ్న భోజనం అని జీఓ విడుదల చేసింది. దీంతో ఎయిడెడ్ కళాశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అపేశారు. జిల్లావ్యాప్తంగా 20 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 5,605 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మధ్యాహ్న భోజనం అందడం లేదు. మేమేం పాçపం చేశామని.. మాకెందుకు బువ్వపెట్టరని పలువురు విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఆలోచించాలి ఈ విద్యార్థిని పేరు నందిని. లక్కిరెడ్డిపల్లె మండలం నేను లక్కిరెడ్డిపల్లెలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇం టర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. నిత్యం పది కిలోమీటర్ల నుంచి కార్యి యర్ తీసుకుని కళాశాలకు వస్తాను. మధ్యాహ్నం భోజనం చేసే సమయానికి అన్నం చల్లగా పోతుంది. తినాలంటే కష్టంగా ఉంది. ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయలి. – నందిని, ద్వితీయ ఇంటర్ బైపీసీ మధ్యాహ్న భోజనం పెట్టాలి నేను ఎల్ఆర్పల్లిలోని ఓ ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నా. మాది చాగులగుట్టపల్లె గ్రామం. దాదాపు 8 కిలోమీటర్ల నుంచి వస్తాను. ఒక్కోసారి టైమ్ అయిపోతుందని క్యారియర్ తెచ్చుకోకుండా రావాల్సి వస్తుంది. ప్రభుత్వం చెప్పినట్లుగా మధ్యాహ్న భోజనం పెడితే బాగుంటుంది. – నాగార్జున, ఇంటర్, చాగులగుట్టపల్లె ఎయిడెడ్ కళాశాలల్లో భోజనం పెట్టాలి ప్రభుత్వ కళాశాలల చదువుకున్న విద్యార్థుల మాదిరిగా ఎయిడెడ్ కళాశాలల్లో కూడా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఇందులో చదువుకునే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. ఈ విషయం గురించి అధికారులు, ప్రభుత్వం ఆలోచించాలి. – వి. రామమోహన్‌రెడ్డి, ప్రెసిడెంట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఎంప్లాయీస్ అసోసియేషన్ -
విద్యార్థిని ఆత్మహత్య
హస్తినాపురం (హైదరాబాద్): ఇంటర్ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, అర్ధవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి సచివాలయనగర్‌లో ఉంటూ ఆటోనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె నాగసాయి ప్రసన్నలక్ష్మీ(17) పనామా గోడౌన్స్ సమీపంలోని శ్రీగాయత్రి కళాశాలలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది, తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈసారి వస్తా..
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు తాను ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. తన రాక కోసం అధికారికంగా అనుమతి తీసుకోవాలని ఆయన విద్యార్థి నేతలకు సూచించారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలోని 15 మంది ఓయూ విద్యార్థి నేతల బృందం మంగళవారం రాహుల్‌ని కలిసింది. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితిని వివరించారు. టీఎస్పీఎస్సీలో అధికారికంగా రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులే రాష్ట్రంలో 14 లక్షల మందికి పైగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వ తీరుతో వారంతా నైరాశ్యంతో ఉన్నారని తెలిపారు. జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన ఒక్క గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా కోర్టులో ఆగిపోయిందని, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా తప్పుల తడకగా ఇస్తున్నారని, వాటిని కోర్టులు నిలిపివేస్తున్నాయని చెప్పారు. దీని వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని రాహుల్‌కు వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పగా, రాహుల్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కష్టాలు తీరతాయని, ఎవరూ బాధపడవద్దని హామీ ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన 10 మంది విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ అవకాశం కల్పించిందని, అటు పార్టీ పదవుల్లోనూ, ఇటు అసెంబ్లీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపులోనూ ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో ఓయూ విద్యార్థి నేతలకు పార్టీ ఆఫీస్ బేరర్ల నియామకంలోనూ, టికెట్ల కేటాయింపులోనూ ఉన్న అవకాశాలను పరిశీలించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాహుల్ సూచించారు. రాహుల్‌ను కలిసిన వారిలో విద్యార్థి నేతలు చరణ్‌కౌశిక్, దరువు ఎల్లయ్య, దుర్గం భాస్కర్, బాలలక్ష్మి, అర్జున్‌బాబు, శ్రీధర్‌గౌడ్, చెనగాని దయాకర్, బొమ్మా హనుమంతరావు, పుప్పాల మల్లేశ్, పున్నా కైలాశ్ నేత, విజయ్‌కుమార్, కేతూరి వెంకటేశ్, లోకేశ్‌యాదవ్, మదన్ ఉన్నారు. బీసీ బిల్లు పెడితే మద్దతిస్తాం బీసీ సంక్షేమ సంఘం నేతలకు రాహుల్ హామీ సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం హరిత ప్లాజాలో ఆర్.కృష్ణయ్య రాహుల్‌గాంధీని కలిసి బీసీల సమస్యలపై వివరించారు. పేరుకే ప్రజాస్వామ్యమని, ఏ రంగంలోనూ బీసీలకు న్యాయం జరగడంలేదని కృష్ణయ్య వాపోయారు. ఉద్యోగ రంగంలో 9శాతం, రాజకీయరంగంలో 14 శాతం, పారిశ్రామిక, కాంట్రాక్టు రంగంలో ఒక శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా అని రాహుల్‌గాంధీని కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే మేం అధికారంలోకి రాగానే బీసీ బిల్లు, రాజకీయ రిజర్వేషన్ల బిల్లు పెడతామని రాహుల్ హామీ ఇచ్చారని కృష్ణయ్య పేర్కొన్నారు. రాహుల్ బస్సులోనే... హరితప్లాజాలో కలిసి తిరిగివెళ్తున్న కృష్ణయ్యను తన బస్సులోకి రావాలని రాహుల్ చేయిపట్టి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీకి బీసీ సమస్యలపై కృష్ణయ్య వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో 50 శాతం, పంచాయతీరాజ్‌లో 34 శాతం నుంచి 52 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, బీసీ అభివృద్ధికి ప్రత్యేక స్కీంను రూపొందించాలన్నారు. అదేవిధంగా బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ ఎత్తేయాలని, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 27శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్ర స్థాయిలో రూ.60వేల కోట్ల బడెŠజ్ట్తో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. -
నోరు మూస్కో లేదంటే..
శ్రీనగర్ : దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత ఉమర్ ఖలీద్‌పై సోమవారం ఢిల్లీలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శ్రీనగర్‌కు చెందిన షహలా రషీద్ షోరా అనే మహిళా విద్యార్థి కార్యకర్తకు కూడా ఫోన్లో బెదిరింపు సందేశాలు వచ్చాయి. మాఫియా డాన్ రవి పూజారి తనను బెదిరించడానికి ప్రయత్నించాడని ఆమె తెలిపింది. దాంతో తాను రవి పూజారి మీద పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు అతని మీద కేసు కూడా నమోదు చేశారని తెలిపింది. వివరాల ప్రకారం రవి పూజారి అనే మాఫియా డాన్. విద్యార్థి కార్యకర్త అయిన షహలా రషీద్ షోరా ఫోన్‌కు ‘నువ్వు నోరు మూసుకో.. లేకపోతే మేమే శాశ్వతంగా నీ నోటిని మూయిస్తాము. ఇదే విషయాన్ని ఉమర్ ఖలీద్, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీలకు కూడా చెప్పు. మాఫియా డాన్ రవి పూజారి అంటూ సందేశం పంపిచాడు. దాంతో షహలా రషీద్ అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకా రవి పూజారి పంపిన సందేశాన్ని స్క్రీన్‌షాట్ తీసి ట్విటర్లో పోస్టు చేశారు. Meanwhile, got this death threat from right-wing Hindutvawadi fundamentalist Ravi Poojary. He warns Umar Khalid, Jignesh Mevani and me to shut up! Threat by SMS #DigitalIndia pic.twitter.com/NaC0m3nb5M — Shehla Rashid (@Shehla_Rashid) August 13, 2018 -
సైబరాబాద్‌లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్
సాక్షి, సిటీబ్యూరో: విద్యార్థులు నేరాల బాట పట్టకుండా సమాజాన్ని సానుకూల ధృక్పథంతో చూడాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు ‘స్టూడెంట్ పోలీసు క్యాడెట్’(ఎస్పీసీ) ప్రాజెక్టును అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చెడు అలవాట్లకు దూరంగా సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసుల్లా తీర్చిదిద్దితే ఎక్కడా ఎటువంటి నేరాలకు అస్కారం ఉందడదనే భావనతో ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అమలుచేస్తున్న ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మియాపూర్, శివరాంపల్లి, మైలార్‌దేవ్‌పల్లిలోని మూడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎస్పీసీ ప్రాజెక్టుపై సోమవారం అవగాహన కల్పించనున్నారు. రెండేళ్ల వ్యవధి గల ఈ ప్రాజెక్టుకు ఎంపికైన ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులకు చట్టాలతో పాటు పోలీసింగ్ వ్యవస్థ, సమాజంలోని సామాజిక సమస్యలపై పూర్తి అవగాహన కలిగించనున్నారు. పోలీసులతో పాటు అటవీ, అగ్నిమాపకశాఖ, మహిళ, శిశు సంక్షేమ శాఖ, విద్యా విభాగాలకు చెందిన అధికారులు కూడా పాఠాలు బోధించనున్నారు. సమాజహితులుగా... బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తయారుచేసిన పాఠ్యాంశాల్లో భాగంగా ట్రాఫిక్ నియమాలతో పాటు రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తారు. బాల్యవివాహలు, మహిళలు, పిల్లల భద్రతపై పాఠాలు చెబుతారు. అవినీతి నిరోధానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. ప్రకృతి విపత్తుల వేళ పౌరుడిగా వ్యవహరించాల్సిన తీరును కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. చట్టాలపై అవగాహన కలిగిస్తారు. సమాజంలో పెరుగుతున్న నేరాలను నిరోధించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు, నేరగాళ్లకు పడుతున్న శిక్షలను కూడా పూర్తి స్థాయిలో తెలియ చెబుతారు. కమ్యూనిటీ పోలీసింగ్ పనితీరును వివరిస్తారు. జీవితంలో కష్టాలు ఎదురొచ్చినప్పుడూ ఒత్తిడికి లోనవకుండా వ్యవహరించాల్సిన తీరు, టీమ్ స్పిరిట్‌తో నలుగురికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతారు. నేషనల్ క్యాడెట్ కాప్స్ (ఎన్సీసీ) తరహాలో విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ (అవుట్డోర్), స్టడీ క్లాసెస్ (ఇండోర్), జిల్లా రాష్ట్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్స్ నిర్వహించనున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులు ఒకటి ఫిజికల్ ట్రైనింగ్, మరొకటి పరేడ్ కోసం అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనున్నారు. అవసరమైతే వలంటీర్లుగా వీరు సేవలను పోలీసులు ఉపయోగించుకోనున్నారు. 2010లో కేరళలోని 127 పాఠశాలల్లో అమలుచేసిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో దేశవ్యాప్తంగా గతేడాది నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో చేయాలని సూచించింది. దీనిద్వారా విద్యార్థులు నేరబాట పట్టకుండా, ఉగ్రవాద భావజాలాల్లో చిక్కుకోకుండా ఉంటారని, సమాజంపై పూర్తిస్థాయి అవగాహన ఉంటుందని పేర్కొనడంతో అన్ని రాష్ట్రాలు ఎస్పీసీ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేస్తున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు విద్యార్థులకు సామాజిక స్పృహ కలిగించే బాధ్యతను తీసుకున్నారు. వీరికి ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లు తదితర సామగ్రిని అందజేయనున్నారు. ప్రతి వారం ఒక్కో గంట అవుట్డోర్ కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
తెలతెలవారుతుండగా చదువులమ్మ ఒడిలో చావుకేక. విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ టాపర్‌గా పేరు తెచ్చుకున్న అమ్మాయి జీవితం ఎవ్వరూ ఊహించని విధంగా అర్ధంతరంగా ముగియడం తోటి విద్యార్థినులకు షాక్ ఇచ్చింది. ఉరికి వేలాడుతున్న స్నేహితురాలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అనంతపురం సెంట్రల్: ‘అనంత’లో ఇంటర్ విద్యార్థిని మృతి కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లికి చెందిన వెంకట లక్ష్మి, సూర్యనారాయణ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె నాగేశ్వరి(17) అనంతపురం నగర శివారులోని ఎస్ఎల్ఎన్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి గదిలో నిద్రించిన నాగేశ్వరి శనివారం తెల్లవారుజామున వసతిగదులకు (డార్మెటరీ) సమీపంలో ఉన్న ల్యాబ్ గదిలో ఫ్యానుకు చీరతో వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. తోటి విద్యార్థినులు గమనించి కళాశాల యాజమాన్యానికి విషయం చేరవేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల యాజామన్యం కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమందించారు. తల్లిదండ్రులు హుటాహుటిన అనంతపురం చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కళాశాల వద్ద ఉద్రిక్తత తమ కుమార్తె మృతికి యాజమాన్యమే కారణమని నాగేశ్వరి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, సూర్యనారాయణ బంధువులతో కలిసి కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం 6.30 గంటలకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారని, తాము వచ్చేలోగానే మృతదేహాన్ని మార్చురీకి తరలించేయడం అనుమానాలు కలిగిస్తోందని ఆరోపించారు. అమ్మాయిల హాస్టల్‌కు పురుష వార్డెన్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నాగేశ్వరి చనిపోయిన వెంటనే వార్డెన్ ఎలా పారిపోతారని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు బుర్రా జయరవర్దన్‌రెడ్డి, సీమకృష్ణ, రామన్న, లింగారెడ్డి, రవీంద్రరెడ్డి, వెంకటప్ప తదితరులు ఆందోళనకు మద్దతు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పీడీఎస్‌యూ నాయకులు విజయ్ను స్పెషల్‌పార్టీ పోలీసులు కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనతో కళాశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు రాజశేఖర్, ఆరోహణరావు, విజయభాస్కర్‌గౌడ్, పదుల సంఖ్యలో ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం సదరు విద్యార్థి నేత సర్వజనాస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు.