చెన్నై: పౌర హక్కుల నేతల అరెస్టులపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే తమిళనాడు తూత్తుకుడిలో మరో ఉదంతం ఆందోళన రేపింది. తమిళనాడులోని విమానాశ్రయంలో బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను చూసి ఒక మహిళా స్కాలర్ ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిందంటూ ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం విమర్శలకు దారి దాసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిందన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందర రాజన్ ఫిర్యాదు మేరకు కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న తూతుకుడికి చెందిన సోఫియా లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ, తమిళనాడు పోలీసు చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పబ్లిక్ న్యూసెన్స్, ప్రజల అల్లర్లకు సంబంధించి అభియోగాలు మోపారు. అనంతరం ఆమెను 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
డీఎంకే చీఫ్ స్టాలిన్ సోఫియాకు మద్దతుగా స్పందించారు. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అనే మాటలను రిపీట్ చేస్తూ ట్వీట్ చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే..ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలని ప్రశ్నించారు. డీఎంకే నాయకులు, శ్రేణులు సోఫియాకు ఇస్తున్న మద్దతు సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
పోలీసు స్టేషన్‌లో దాదాపు తొమ్మిది గంటల పాటు సోఫియాను నిర్బంధంలో ఉంచారని ఆమె న్యాయవాది అతీసయ కుమార్ చెప్పారు. కెనడాలో ఇలాంటివి చాలా మామూలేనని కానీ మన దేశంలో ఆ స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. తమకు ఎఫ్‌ఐఆర్ కాపీ అందలేదనీ, ఏ ఏ కేసులు ఉన్నాయో తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు సోఫియా అక్రమ అరెస్టుకు నిరసననగా ఆమె తండ్రి బీజీపీ, తమిళనాడు పోలీసులకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును దఖలు చేశారు.
ஜனநாயக விரோத - கருத்துரிமைக்கு எதிரான தமிழக அரசின் இந்த நடவடிக்கை கடும் கண்டனத்துக்குரியது! உடனடியாக அவரை விடுதலை செய்ய வேண்டும்!
— M.K.Stalin (@mkstalin) September 3, 2018
அப்படி சொல்பவர்களை எல்லாம் கைது செய்வீர்கள் என்றால் எத்தனை இலட்சம் பேரை சிறையில் அடைப்பீர்கள்?
நானும் சொல்கின்றேன்!
“பா.ஜ.க வின் பாசிச ஆட்சி ஒழிக!” https://t.co/JoPajdrSW5
Comments
Please login to add a commentAdd a comment