Dravida Munnetra Kazhagam (DMK)
-
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీలోని నటీమణులంతా ‘ఐటమ్’లు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: బీజేపీ నేతలుగా మారిన పలువురు నటీమణులపై డీఎంకే నేత సాధైయ్ సాధిక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడు బీజేపీలో ఉన్న సీనియర్ నటీమణులు ఖుష్బు, నమితా, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ‘ఐటమ్’లు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీలో మహిళ నేతలుగా ఉన్న నలుగురు నటీమణులు పెద్ద ఐటమ్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘తమిళనాడులో బీజేపీ బలపడుతుందని ఖుష్బూ చెబుతోంది. అమిత్‌షా తలపై వెంట్రుకలైనా మొలుస్తాయోమో కానీ తమిళనాడులో బీజేపీ మాత్రం వికసించదు. డీఎంకేను నాశనం చేసి బీజేపీని బలోపేతం చేసేందుకు వీళ్లు (వేశ్యలు) ఉపయోగపడతారా?. వారి వల్ల కాదు. నా సోదరుడు ఇళయ అరుణ కుష్బుతో ఎన్నోసార్లు కలిశాడు. అంటే నా ఉద్ధేశం ఆమె డీఎంకేలో ఉన్నప్పుడు ఆమెతో దాదాపు ఆరుసార్లు సమావేశాల్లో పాల్గొన్నారు.’ అంటూ విపరీత అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@arivalayam functionary Saidai Sadiq's derogatory remarks on women BJP leaders left many in the state's ruling party red-faced. Sadiq's remarks targetting leaders including @khushsundar drew sharp criticism from BJP leaders and others. Watch here : https://t.co/DVbwYrAz6G pic.twitter.com/6NpvZH6Khk — South First (@TheSouthfirst) October 28, 2022 డీఎంకే చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకురాలు ఖుష్భూ తీవ్రంగా ఖండించారు. ‘పురుషులు స్త్రీలను దుర్భాషలాడటం, అది వారి పెంపకం, వారు పెరిగిన విషపూరిత వాతావరణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. ఈ పురుషులు స్త్రీ గర్భాన్ని అవమానిస్తారు. అలాంటి పురుషులు తాము కళైజ్ఞర్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఇదేనా సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కొత్త ద్రావిడ నమూనా పాలన’ అంటూ ట్విటర్ వేదికగా సాధిక్ వ్యాఖ్యలను ఎండగడుతూ డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళిని ట్యాగ్ చేశారు. When men abuse women,it just shows wat kind of upbringing they have had & the toxic environment they were brought up in.These men insult the womb of a woman.Such men call themselves followers of #Kalaignar Is this new Dravidian model under H'ble CM @mkstalin rule?@KanimozhiDMK — KhushbuSundar (@khushsundar) October 27, 2022 దీనిపై స్పందించిన డీఎంకే నేత కనిమొళీ ఖుష్బూకి క్షమాపణలు తెలియజేశారు. మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఓ మనిషిగా, మహిళగా బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారు ఎవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా వాటిని సహించలేమన్నారు. తమ నాయకుడు సీఎం స్టాలిన్‌గానీ, పార్టీ అధిష్టానంగానీ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. అనంతరం సాధిక్ సైతం తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఎవరిని కించపరచడం తమ ఉద్ధేశం కాదని వెల్లడించారు. అయితే బీజేపీ అధిష్టానం చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. డీఎంకే మంత్రులను పందులు, జంతువులు అంటూ మాట్లాడారని, . జర్నలిస్టులను కోతులతో పోల్చాడని.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. -
డీఎంకే అభ్యర్థులుగా తెలుగు ప్రముఖులు
చెన్నై: తిరువళ్లూరు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు తెలుగు ప్రముఖులు బరిలో దిగుతున్నారు. గుమ్మిడిపూండీ డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజే గోవిందరాజన్ తెలుగువారే. గుమ్మిడిపూండి సమీపంలోని దిగువముదలంబేడు గ్రామానికి చెందిన టీజేఎస్ విద్యాసంస్థల అధినేత టీజే గోవిందరాజన్. ప్రస్తుతం ఇతను డీఎంకే జిల్లా ఇన్చార్జ్గా కూడా పనిచేస్తున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ కూడా తెలుగు మూలాలు వున్న వ్యక్తి కావడం గమనించదగ్గ విషయం. ఇతని భార్య ఇందిరా రాజేంద్రన్ టీటీడీ బోర్డు సభ్యురాలుగా వున్నారు. తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రెండోసారి డీఎంకే తరఫున పోటీచేస్తున్నారు. -
కమలా హారిస్‌కు స్టాలిన్ భావోద్వేగ లేఖ!
చెన్నై: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను అభినందిస్తూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. కమల తమిళ మూలాలను ప్రస్తావిస్తూ.. అత్యున్నత పదవికి ఎన్నికై తమిళజాతి గర్వపడేలా చేశారంటూ ప్రశంసించారు. ద్రవిడ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలా చాటేలా తన పదవీకాలంలో అగ్రరాజ్య ప్రతిష్ట మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. లింగ వివక్షకు తావులేని సమసమాజ స్థాపనకై కృషి చేసే ద్రవిడ ఉద్యమానికి కమలా హారిస్ విజయం మరింత ఊతమిచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘వణక్కం.... తమిళులు గర్వపడే విషయం ఇది. తమిళనాడు మూలాలు గల మహిళ యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం గర్వకారణం. కఠిన శ్రమ, అంకితభావంతో తమిళ మహిళ అమెరికాను పాలించగల సమర్థత కలిగి ఉందనే విషయాన్ని నిరూపించారు’’ అంటూ కమలను ఉద్దేశించి తమిళ భాషలో సోమవారం లేఖ రాశారు.(చదవండి: అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!) కాగా అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళ, తొలి నల్లజాతి మహిళగా చరిత్రకెక్కిన కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు. తమిళనాడులోని చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. కమల.. తాతయ్య పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. తల్లి పెంపకంలో స్వతంత్ర భావాలతో పెరిగిన కమలా హారిస్ న్యాయ విద్యనభ్యసించి 2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. అదే విధంగా 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. డెమొక్రటిక్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగి 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఆమెకు సోదరి మాయా హారిస్ ఉన్నారు. -
ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఆ నలుగురు ఎంపీల గొంతులో వెలక్కాయ పడింది. మింగలేక, కక్కలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పార్టీలో సభ్యత్వం...మరో పార్టీ చిహ్నంపై పోటీ...ఎంపిక చెల్లదని మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌తో మిత్రపక్ష ఎంపీల్లో ముసలం ఏర్పడింది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి ఉదయసూర్యుడి చిహ్నంపై విడుదలై చిరుతై కట్చి (వీసీకే)కి చెందిన రవికుమార్, కొంగు మక్కల్ దేశీయ కట్చికి చెందిన చిన్నరాజ్, ఎండీఎంకేకు చెందిన గణేశమూర్తి, ఐజేకేకు చెందిన పారివేందర్ గెలుపొందారు. ఇదిలా ఉండగా, డీఎంకే అధికార చిహ్నమైన ఉదయసూర్యుడి గుర్తుపై గెలుపొందిన నలుగురి గెలుపు చెల్లదని ప్రకటించాలని మక్కల్ శక్తి కట్చి అధ్యక్షులు ఎంఎల్ రవి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి చెందిన సభ్యుడు ఆ పార్టీ నుంచి వైదొలగకుండా మరో పార్టీ గుర్తుపై పోటీచేయచడం చట్టవిరుద్ధం. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు’ అని తన పిటిషన్ ద్వారా కోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు సత్యనారాయణన్, ఎన్.శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి ఆ పార్టీ చిహ్నంపై పోటీచేయడాన్ని అనుమతించడం ఎన్నికల నిబంధనలను మోసగించడం కిందకు రాదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీ పేరు, ఎన్నికల నోటిఫికేషన్ కంటే పార్టీ చిహ్నామే ప్రాధాన్యంగా మారింది. చిహ్నాన్ని చూసే ప్రజలు ఓటేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటముల కంటే నిజాయితీగా పోటీచేయడమే ముఖ్యమని న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోర్టులో ఎన్నికల కమిషన్ ప్రతినిధి తన వాదనను వినిపిస్తూ, ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరోపార్టీ తరఫున పోటీచేయరాదనే నింబధన ఉన్నప్పటికీ ఎన్నికల అధికారి ఆ నామినేషన్‌ను ఆమోదించిన పక్షంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కేసును మాత్రమే వేయాలి, ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అనేక చట్టాలు వచ్చిన సంగతిని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్, డీఎంకే, అన్నాడీఎంకే, ఆయా పార్టీల చిహ్నాలపై పోటీచేసి గెలుపొందిన కూటమి పార్టీల ఎంపీలు నవంబరు 12వ తేదీలోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ఆదేశించారు. -
ఫాసిస్ట్ బీజేపీ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్
చెన్నై: పౌర హక్కుల నేతల అరెస్టులపై వివాదం ఇంకా కొనసాగుతుండగానే తమిళనాడు తూత్తుకుడిలో మరో ఉదంతం ఆందోళన రేపింది. తమిళనాడులోని విమానాశ్రయంలో బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను చూసి ఒక మహిళా స్కాలర్ ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిందంటూ ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం విమర్శలకు దారి దాసింది. ముఖ్యంగా తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిందన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందర రాజన్ ఫిర్యాదు మేరకు కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేస్తున్న తూతుకుడికి చెందిన సోఫియా లూయిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ, తమిళనాడు పోలీసు చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పబ్లిక్ న్యూసెన్స్, ప్రజల అల్లర్లకు సంబంధించి అభియోగాలు మోపారు. అనంతరం ఆమెను 15రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సోఫియాకు మద్దతుగా స్పందించారు. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ అనే మాటలను రిపీట్ చేస్తూ ట్వీట్ చేశారు. తనను కూడా అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే..ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలని ప్రశ్నించారు. డీఎంకే నాయకులు, శ్రేణులు సోఫియాకు ఇస్తున్న మద్దతు సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. ఫాసిస్ట్ బీజేపీ డౌన్ డౌన్ హ్యాష్ ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. పోలీసు స్టేషన్లో దాదాపు తొమ్మిది గంటల పాటు సోఫియాను నిర్బంధంలో ఉంచారని ఆమె న్యాయవాది అతీసయ కుమార్ చెప్పారు. కెనడాలో ఇలాంటివి చాలా మామూలేనని కానీ మన దేశంలో ఆ స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు. తమకు ఎఫ్ఐఆర్ కాపీ అందలేదనీ, ఏ ఏ కేసులు ఉన్నాయో తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు సోఫియా అక్రమ అరెస్టుకు నిరసననగా ఆమె తండ్రి బీజీపీ, తమిళనాడు పోలీసులకు వ్యతిరేకంగా మరో ఫిర్యాదును దఖలు చేశారు. ஜனநாயக விரோத - கருத்துரிமைக்கு எதிரான தமிழக அரசின் இந்த நடவடிக்கை கடும் கண்டனத்துக்குரியது! உடனடியாக அவரை விடுதலை செய்ய வேண்டும்! அப்படி சொல்பவர்களை எல்லாம் கைது செய்வீர்கள் என்றால் எத்தனை இலட்சம் பேரை சிறையில் அடைப்பீர்கள்? நானும் சொல்கின்றேன்! “பா.ஜ.க வின் பாசிச ஆட்சி ஒழிக!” https://t.co/JoPajdrSW5 — M.K.Stalin (@mkstalin) September 3, 2018 -
స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నా
మదురై: తనను డీఎంకే పార్టీలోకి తిరిగి చేర్చుకుంటే స్టాలిన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆ పార్టీ బహిష్కృత నేత, కరుణానిధి కొడుకు అళగిరి ప్రకటించారు. ‘మేం డీఎంకేలోకి రావాలనుకుంటున్నాం. అంటే, స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించినట్లే కదా?. నాతోపాటు నా కొడుకు దురై దయానిధి సైతం పార్టీలో ఎలాంటి స్థానం కల్పించినా పనిచేసేందుకు సిద్ధం’ అని అన్నారు. ‘వచ్చే నెల 5న చెన్నైలో కరుణానిధి సమాధి వద్ద ర్యాలీ తర్వాత కార్యాచరణను నిర్ణయిస్తాం. డీఎంకే అంటే1,500 మంది కౌన్సిల్ సభ్యులు మాత్రమే కాదు. అసలైన కేడర్ అంతా నాతో ఉంది’ అని అన్నారు. -
కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్ కిరికిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్‌లోనే అంత్యక్రియలకు అనుమతించాలని డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్(ఎంజీఆర్ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్‌లో అనుమతించలేదు. ప్రోట్‌కాల్(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది. కామరాజ్, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ లాంటి వాళ్లకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్లో గందరగోళం చెలరేగగా.. సైలెంట్‌గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్ కోసమే బెంచ్ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం. -
కరుణానిధికి రాష్ట్రపతి పరామర్శ
సాక్షి, చెన్నై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదివారం మధ్యాహ్నం చెన్నై వచ్చిన ఆయన, తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌తో కలిసి నేరుగా ఆళ్వార్‌పేటలోని కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధిని పరామర్శించిన అనంతరం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిలతో రాష్ట్రపతి కాసేపు మాట్లాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కోవింద్ ట్విట్టర్లో తెలిపారు. జూలై 28 నుంచి కరుణానిధి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించడం తెలిసిందే. కాగా కరుణానిధికి ఆరోగ్యం బాగాలేదనే బాధతో పుదుకోట్టై జిల్లా కరంబకుడికి చెందిన మూడో వార్డు డీఎంకే కార్యదర్శి మనోహరన్ ఆదివారం గుండె ఆగి మరణించినట్లు సమాచారం. కరుణానిధి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మనోహరన్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. -
ఆయనో ఏజెంట్
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఓ ఏజెంట్ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని నినదించారు. సాక్షి, చెన్నై : బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సమీక్షలు, సమావేశాలు, అధికారిక కార్యక్రమాలంటూ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ జిల్లాల పర్యటనల్ని సాగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్ మరో సచివాలయంగా మారిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా, నల్ల జెండాలతో వ్యతిరేకత, నిరసన వ్యక్తంచేసినా గవర్నర్ ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో తాను ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్ నామక్కల్ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీసింది. నల్ల జెండాల్ని ప్రదర్శించిన డీఎంకే వర్గాలను బలవంతంగా పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ, ఛలో రాజ్ భవన్ నిర్ణయాన్ని హఠాత్తుగా డీఎంకే తీసుకుంది. శనివారం ఉదయాన్నే స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో డీఎంకే ఎమ్మెల్యేలు అన్భళగన్, ఎం.సుబ్రమణియన్, శేఖర్ బాబు, మాధవరం సుదర్శనం, రంగనాథన్, వాగై చంద్రశేఖర్, మోహన్, రవిచంద్రన్, అరవింద్ రమేష్‌లతో పాటు కేంద్రమాజీ మంత్రి రాజ తదితర నేతలు ఉదయాన్నే పెద్దఎత్తున కేడర్‌తో సైదాపేట కోర్టు వద్దకు చేరుకున్నారు. దూసుకొచ్చిన నేతలు పది గంటల సమయంలో అక్కడికి స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఒక్క సారిగా వాతావరణం అక్కడ మారింది. గవర్నర్ తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నామక్కల్‌లో తమ వాళ్లతో పోలీసులు వ్యవహరించిన విధానాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ నినాదాల్ని హోరెత్తించారు. ఓ వైపు నినాదాలు మిన్నంటుతుంటే, మరో వైపు ఎమ్మెల్యేలతో కలిసి డీఎంకే జెండాను చేతబట్టి రాజ్ భవన్‌వైపు స్టాలిన్ కదిలారు. పెద్ద ఎత్తున డీఎంకే కేడర్ దూసుకురావడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ భవన్‌కు అతి సమీపంలో రోడ్డును పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటుచేసి, ఎవరూ అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. అయినా, డీఎంకే వర్గాలు పోలీసుల వలయాన్ని ఛేదించే రీతిలో ముందుకు దూసుకురావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్ భవన్వైపుగా డీఎంకే వర్గాలు చొచ్చుకు రాని రీతిలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. దీంతో రోడ్డు మీద డీఎంకే వర్గాలు బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళన కారణంగా సైదా పేట నుంచి గిండి మార్గం, అడయార్ వైపుగా మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు ఆగాయి. ట్రాఫిక్‌ను క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు స్టాలిన్ సహా ఎమ్మెలేల్ని అడ్డుకుని బలవంతంగా అరెస్టుచేశారు. వీరందర్నీ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఉంచారు. స్టాలిన్ ఫైర్ స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర హక్కుల్ని గవర్నర్ కాలరాస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, మంత్రులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్‌గా ఇక్కడ అడుగు పెట్టి ఉన్న దృష్ట్యా, ఎక్కడ తమ అవినీతి బండారాలు బయట పడుతాయోనన్న భయంతో ఈ పాలకులు గవర్నర్ విషయంలో మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. ఆది నుంచి గవర్నర్ చర్యల్ని డీఎంకే అడ్డుకుంటూ వస్తోందని, ఆయన ఎక్కడికి వెళ్లినా వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన గవర్నర్, ఇష్టానుసారంగా ముందుకు సాగడాన్ని ఖండిస్తున్నామన్నారు. అందుకే నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొంటూ, ఈ సమయంలో నామక్కల్‌లో తమవాళ్ల మీద బల ప్రయోగాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు తాము శాంతియుత మార్గంలో పయనించామని, అయితే, నామక్కల్ ఘటనతో తమను గవర్నర్ రెచ్చగొడుతున్నట్టుందని ధ్వజమెత్తారు. ఇలాంటి గవర్నర్‌ను తప్పించాలని, లేదా తన పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కీలుబొమ్మలుగా గవర్నర్లు...
సాక్షి, చెన్నై : కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గతంలో తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నాటకలోనూ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేశారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఇది అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు వాజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోంది.’ అని స్టాలిన్ అన్నారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు. అంతకు ముందు ఆయన తన ట్వీటర్లో ఆయన కర్ణాటక పరిణామాలపై వరుస ట్వీట్లు చేశారు. ‘కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వనించారు. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగా, ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉంది. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు రాజ్యాంగ విలువలకు ప్రమాదకారకంగా మారుతున్నాయి’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. People of Tamil Nadu are familiar with the BJP's efforts to protect the corrupt ADMK Government, which also incidentally does not enjoy the majority support in the Legislative Assembly. Constitutional institutions and principles are under threat from these actions. — M.K.Stalin (@mkstalin) 17 May 2018 -
పరిపాలనలో మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్
-
తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎంపీ కనిమొళి ఇటీవల ఓ సమావేశంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా ప్రసంగించారు. దానిపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాది కషింశెట్టి కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ 295–ఎ, 298, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం గురించి కనిమొళి మాట్లాడుతూ.. 'దేవుడి ముందు అందరూ సమానమే అని చెబుతారు. అదంతా పచ్చి అబద్ధం. ఎక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొంటే భగవంతుడు త్వరగా ప్రత్యేక దర్శనం ఇస్తాడు. లేనిపక్షంలో 10 గంటలు, 20 గంటలు లేక రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చోవాలి. ఆ దేవుడు అంటే అంతే. శ్రీవారి హుండీ వద్ద సెక్యూరిటీ కాపలా ఎందుకు కాస్తున్నారు. నిజంగా అక్కడ దేవుడు ఉంటే ఆ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముందని' తిరుమల శ్రీవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డీఎంకే ఎంపీపై చెన్నైలోనూ పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. -
రజనీ ఉద్దేశం అదే అయితే.. రాజకీయ భవిష్యత్తే ఉండదు
సాక్షి, చెన్నై : రజనీకాంత్ పొలిటికల్ అరంగ్రేటం ఒక ఎత్తయితే.. డీఎంకే పార్టీ కురు వృద్ధుడు కరుణానిధితో భేటీ కావటం అరవ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా.. డీఎంకేకు మద్దతు ఇచ్చి పెద్ద తప్పు చేశానంటూ రజనీ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే నిన్న సాయంత్రం హడావుడిగా కరుణ నివాసానికి వెళ్లిన రజనీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనిపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతుండగా.. కరుణానిధి తనయుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. ‘‘ పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి నేతలతో ద్రవిడ భూమి తరించింది. కానీ, ద్రవిడ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకే రజనీ రాజకీయాల్లో వచ్చాడంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆయన అడ్డుకునేందుకు ముందు మేమే ఉంటాం. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం ఖాయం. గతంలో అలా ప్రయత్నించి విఫలమైనవారు చాలా మందే ఉన్నారు. కానీ, తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ చెబుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడే ఏం స్పందించలేం. పార్టీ ప్రారంభించే ముందు కేవలం సంప్రదాయ రీతిలో మాత్రమే కరుణను కలిశారు.. వేరే ఉద్దేశం లేదు. ఇంతకుముందు విజయ్‌కాంత్ కూడా పార్టీ ప్రారంభించే సమయంలో ఇలానే కరుణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు’’ అని స్టాలిన్ పేర్కొన్నారు. కాగా, కరుణానిధిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటంతోపాటు ఆరోగ్యం గురించి రజనీ వాకబు చేశారు. ఆపై తన రాజకీయ ఎంట్రీ గురించి ఆయనతో కాసేపు చర్చించినట్లు రజనీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రజనీ ఇంతకు ముందులా ట్విట్టర్లో అభిప్రాయాలను తెలియజేయటం మానుకుని.. ప్రజల్లోకి రావాలంటూ డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చెబుతున్నారు. -
ఏడేళ్లు అంటే నాకు అంత ఈజీ కాదు
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం నుంచి నిర్దోషులుగా బయటపడడంపై ప్రధాన నిందితురాలు, డీఎంకే ఎంపీ కనిమొళి సంతోషం వ్యక్తం చేశారు. ఈకేసులో ప్రధాన నిందితులు టెలికాం మాజీ మంత్రి ఏ రాజా, సహా మిగిలిన 19మందికి కేసునుంచి విముక్తి కల్పిస్తూ తీర్పు వెలువడిన వెంటనే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోపణల వెనుక అందరి కుట్ర దాగి వుందన్నారు. చివరకు న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. ఏ నేరం చేయనిదానికి తాను ఏడేళ్లు ఆరోపణలను, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో 7సంవత్సరాలు క్షోభ అనుభవాల్సి వచ్చిందన్నారు. ఎవరికైనా ఇది చాలా కష్టమనీ, తనకు సంబంధించినంతవరకు ఇది అంత ఈజీ కాదన్నారు. ఈ తీర్పు డీఎంకే వర్గాలకు మంచి ఉత్సాహాన్నిస్తుందని కనిమొళి పేర్కొన్నారు. అలాగే ఆర్కే నగర్ ఉపఎన్నికపై ఈ తీర్పు ప్రభావం పడుతుందా అని ప్రశ్నించినపుడు అలాంటిదేమీ ఉండదని కనిమొళి వ్యాఖ్యానించారు. మరోవైపు అత్యంత సంచలనం రేపిన 2జీ కుంభకోణం కేసులో నిందుతులందరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. సత్యమేయ జయతే ప్లకార్డులతో సందడి చేశాయి. కాగా తగిన ఆధారాలు చూపనందున కేసులో నమోదైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు పటియాలా హౌస్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కుంభకోణం జరిగిందనడానికి ప్రాసిక్యూషన్ ఆధారాలు చూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. -
శేఖర్‌రెడ్డి డైరీలో పన్నీర్‌సెల్వం పేరు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డికి చెందిన డైరీలో తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రుల పేర్లు ఉన్న సంగతి శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గతేడాది నవంబర్‌లో తమిళనాడులో శేఖర్‌రెడ్డి, అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీశాఖ చేసిన దాడుల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, స్థిర, చరాస్తుల పత్రాలు బయటపడ్డాయి. వీటితో పాటు ఓ డైరీని కూడా అప్పట్లో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకే ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులతో శేఖర్‌రెడ్డికి అంతర్గత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆనాటి వివరాలను నిర్ధారిస్తున్నట్లుగా పలు అంశాలను ఒక ప్రైవేటు ఆంగ్ల టీవీ చానల్ శుక్రవారం ప్రసారం చేసింది. డైరీలోని కొన్ని పేజీలు తమచేతికి వచ్చాయని చెప్పింది. వారు తెలిపిన వివరాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, మంత్రులు విజయభాస్కర్, ఎంసీ.సంపత్, తంగమణి, ఆర్పీ ఉదయకుమార్, దిండుగల్లు శ్రీనివాసన్, ఎంఆర్ విజయభాస్కర్, కేసీ కరుప్పన్నన్‌ల పేర్లు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు శేఖర్‌రెడ్డి డైరీ ద్వారా వెలుగుచూసిన వివరాలపై సీబీఐ విచారణ జరపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. -
ఆర్కే నగర్ బైపోల్.. అభ్యర్థిని ప్రకటించిన డీఎంకే
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం డీఎంకే పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత స్టాలిన్ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. తమ పార్టీ తరపున మరుదు గణేశ్ పోటీ చేయనున్నట్లు స్టాలిన్ తెలిపారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్కే నగర్) బై ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 21న ఎన్నిక, 24న కౌంటింగ్ నిర్వహించనున్నారు. -
‘వేటు’కు విరామం...!
► చర్యలు వద్దు ► స్పీకర్‌కు హైకోర్టు ఆదేశం ► డీఎంకే ఎమ్మెల్యేలకు తాత్కాలిక ఊరట ► గవర్నర్‌తో భేటీకి స్టాలిన్ నిర్ణయం సస్పెన్షన్ వేటు నుంచి డీఎంకే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి బయటపడ్డారు. మద్రాసు హైకోర్టు రూంలో తాత్కాలికంగా ఊరట లభించింది. గుట్కా కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ధనపాల్కు హైకోర్టు న్యాయమూర్తి దురై స్వామి గురువారం ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : గవర్నర్ బల పరీక్షకు ఆదేశిస్తే, సంకటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ఆ మేరకు అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్ చేయడానికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేశారు. సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. నోటీసుకు వివరణ ఇవ్వడానికి మరో పదిహేను రోజులు సమయం కావాలని ఇప్పటికే డీఎంకే సభ్యులు అసెంబ్లీ కార్యదర్శి భూపతికి విజ్ఞప్తి చేశారు. అలాగే, గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టారు. ఈ తలుపులు తెరచుకోవడంతో ప్రస్తుతానికి సస్పెన్షన్ వేటు నుంచి డీఎంకే సభ్యులకు ఊరట కల్గినట్టు అయింది. వేటుకు విరామం సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ డీఎంకే సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ గురువారం న్యాయమూర్తి దురై స్వామి నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. డీఎంకే తరపున సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ హాజరయ్యారు. నిషేధిత గుట్కాల వ్యవహారం, జోరుగా సాగుతున్న విక్రయాల వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బయట నిషేధిత వస్తువుల విక్రయాలు జోరుగా సాగుతున్న సమయంలో, ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా, వాటిని ఆధారాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉందని ఈసందర్భంగా ప్రస్తావించారు. బల పరీక్షలో నెగ్గాలన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, గుట్కా అస్త్రంతో డీఎంకే సభ్యులను సస్పెండ్ చేయడానికి ప్రయత్నాలు సాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంతలో అడ్వకేట్ జనరల్ విజయనారాయణన్ జోక్యం చేసుకుని, అసలు ఈ పిటిషన్ విచారణ యోగ్యమా..? కాదా..? అన్నది తేల్చాల్సి ఉందని వాదన వినిపించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని ఇదివరకే హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఇక్కడ గుట్కా వ్యవహారం ముడిపడి ఉందని డీఎంకే తరపున కపిల్ సిబల్ వాదన వినిపించడంతో వెనక్కు తగ్గక తప్పలేదు. వివరణ ఇవ్వడానికి సమయం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు, తదితర అంశాల్ని పరిశీలించి కోర్టుకు వివరణ ఇవ్వడానికి సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. అంతవరకు సస్పెన్షన్ విషయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని కోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ, గుట్కా వ్యవహారంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు డీఎంకే సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు లేదని అసెంబ్లీ స్పీకర్ ధనపాల్కు ఆదేశాలు ఇచ్చారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేశారు. కోర్టు అభయంతో ప్రస్తుతానికి డీఎంకే సభ్యుల సస్పెండ్‌కు విరామం పడ్డట్టే. గుట్కా విషయంగాకోర్టులో పలు పిటిషన్లు సైతం ఉన్న దృష్ట్యా, తదుపరి విచారణ సమయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయోనన్న ఎదురు చూపులు డీఎంకే వర్గాల్లో నెలకొన్నాయి. గవర్నర్ చెంతకు కోర్టు స్టేతో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తంచేశారు. కోర్టు స్టే ప్రజాస్వామ్య విజయంగా వ్యాఖ్యానించారు. మైనారిటీలో ఉన్న సీఎం పళని స్వామి బాధ్యతాయుతంగా పదవి నుంచి తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. మెజారిటీని నిరూపించుకోవాలని పదేపదే తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని, అయితే, దొడ్డిదారిన నెగ్గడానికి తమ మీద సస్పెన్షన్ వేటు వేయడానికి వ్యూహరచన చేశారని మండి పడ్డారు. ప్రస్తుతం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్‌కు లేఖల్ని సమర్పించారని అన్నారు. ఈ విషయంగా గవర్నర్‌తో భేటీకి అనుమతి కోరినట్టు తెలిపారు. పదో తేదీన అనుమతి కోరామని, అక్కడి నుంచి వచ్చే సమాధానం మేరకు తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. -
సస్పెన్షన్ రద్దు!
♦ ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత ♦ ధన్యవాదాలు తెలిపిన స్టాలిన్ ♦ అధికార, ప్రతిపక్షాలు చెట్టాపట్టాల్ ♦ వాకౌట్ లేకుండానే ముగిసిన సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్షం ఆగ్రహం, అధికార పక్షం నిగ్రహం లేదా వాగ్యుద్ధాలు వాకౌట్లో సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు, ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం, వివిధ అంశాలపై చర్చలతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ముచ్చట గొలిపాయి. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ అసెంబ్లీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు తన ప్రకటనను వెలిబుచ్చుతారని అన్నారు. ఆ తరువాత సంఘం అధ్యక్షుడు, ఉప సభాపతి పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, డీఎంకే సభ్యులు ఎస్ అంబేద్కుమార్ (వందవాశి), కేఎస్. మస్తాన్(సెంజి),కేఎస్.రవిచంద్రన్(ఎగ్మూరు), సురేష్ రాజన్ (నాగర్‌కోవిల్), కె.కార్తికేయన్ (రిషివందయం), పి. మురగన్ (వేప్పనగల్లి) కేకే. సెల్వం (ఆయిరమ్ విళక్కు)ల క్రమశిక్షణ ఉల్లంఘన నివేదికను కమిటి తరఫున అసెంబ్లీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఈ రోజే చర్చకు పెట్టాలని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మంత్రి సెంగోట్టయ్యన్ తీర్మానాన్ని ప్రతిపాదించగానే అసెంబ్లీ అభీష్టానికి వదిలేయగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమయంలో స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన సదరు ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ తనకు సమర్పించిన ఉత్తరం ఆధారంగా ఆరునెలలపాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పెండ్ కారణంగా ఈ ఆరునెలల కాలంలో ఎమ్మెల్యేల వేతనం, ఇతర ఆదాయాలు పొందలేరని క్రమశిక్షణ సంఘం ఆరోజు ప్రకటించిందని అన్నారు. అయితే సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు తనవద్దకు వచ్చి పశ్చాత్తాపపడ్డారని, ఇకపై అలా నడుచుకోమని విన్నవించుకున్నారని స్పీకర్ తెలిపారు. వారిని శిక్షించాలని అసెంబ్లీ కోరినా మన్నించి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. ఆసియా ఖండంలోనే తమిళనాడు ఆరోగ్యకరమైన రాష్ట్రంగా విరజిల్లాలని ఆశిస్తున్నట్లు స్పీకర్ పేర్కొనారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఎయిమ్స్ వైద్యశాల ఏ జిల్లాలో స్థాపిస్తారని స్టాలిన్ అడిగిన ప్రశ్నకు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ బదులిస్తూ, అన్ని జిల్లా ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో నెలకొల్పాలని కోరుతున్నారు, అయితే ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున గతనెల 24వ తేదీన ఉత్తరం రాశామని చెప్పారు. ఏదేమైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాలను సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. స్టాలిన్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను పెరోల్‌పై విడుదల చేసే అంశంలో మద్దతు కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ శుకవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెరోల్‌పై కలిసి చర్చించుకోవడం మరో విశేషం. -
కూల్చేందుకు కుట్ర!
♦ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ బేరం ♦ టీటీవీ ఆరోపణ ♦ పార్టీ వర్గాలతో సమాలోచన ♦ ప్రచారం కోసమే ఈ ఆరోపణ : స్టాలిన్ సాక్షి, చెన్నై: సీఎం ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తీవ్ర కుట్ర చేస్తున్నారని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని, కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి వివరాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ సెంగుట్టయన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ భేటీ అయ్యారు. గంట పాటు సాగిన ఈ భేటీలో కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రమే పిలిపించి ఉండడం గమనించాల్సిన విషయం. ఈ భేటీ అనంతరం టీటీవీ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, ఆ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పిలిపించారా అన్న ప్రశ్న బయలు దేరక మానదు. స్టాలిన్ తమ ఎమ్మెల్యేలతో బేరాలు సాగిస్తున్నారని టీటీవీ ఆరోపించడం గమనార్హం.ఎమ్మెల్యేలతో భేరం : ఈ సమావేశానంతరం మీడియాతో టీటీవీ మాట్లాడుతూ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్ర కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ద్రోహి పన్నీరుసెల్వంకు మద్దతుగా ఆయన కుట్రలు సాగుతున్నాయని పేర్కొన్నారు. పన్నీరు శిబిరంలోకి చేరాలని తమ శిబిరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని , కొందరితో బేరాలు సైతం సాగిస్తున్నారని ఆరోపించారు. పన్నీరు శిబిరంలోకి వెళ్లేందుకు సిద్ధం అని ఒక్క మాట చెబితే చాలు అని, వారికి కావాల్సిన వన్నీ సమకూర్చేందుకు స్టాలిన్ సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయడం లక్ష్యంగా కుట్రలు సాగుతున్నాయని, వారి కుట్రల్ని భగ్నం చేసి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా తన దృష్టికి స్టాలిన్ సాగించిన బేరాల గురించి తెలియజేశారని వివరించారు. పదిహేను మంది ఎమ్మెల్యేలకు అనేక ఆశల్ని కూడా చూపించారని ఆరోపించారు. ఇక, రెండాకుల చిహ్నం దూరం కావడం వెనక బీజేపీ కుట్ర ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఉప ఎన్నికల్లో తాను గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారం కోసం ఆరోపణ : టీటీవీ ఆరోపణలపై స్టాలిన్‌ను మీడియా ప్రశ్నించగా, ఇలాంటి వాటికి సమాధానాలు ఇచ్చి తన స్థాయిని దిగజార్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ(ప్రచారం) కోసం ఈ ఆరోపణలు టీటీవీ సందిస్తున్నారని ఎద్దేవా చేశారు. అర్హత లేని వాళ్లు చేసే వాఖ్యలను పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. -
మహిళా బిల్లుపై ఢిల్లీలో కనిమొళి పాదయాత్ర
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో డీఎంకే ఉమెన్స్ వింగ్ ఆందోళన చేపట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమైన పార్టీలు తమ గొంతు విప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగింది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. -
జాతీయ పార్టీల మద్దతు దిశగా స్టాలిన్
న్యూఢిల్లీ : తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలను రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లిన డీఎంకే, ఈ విషయంపై జాతీయ పార్టీల మద్దతును బలంగా కూడగట్టుకోవాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ భేటీ కానున్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని వారికి వివరించనున్నారు. సోనియా గాంధీ నివాసం జనపథ్ 10 వద్ద కాంగ్రెస్ టాప్ నేతలను స్టాలిన్ కలువనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ టాప్ నేతలను కలిసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సితారాం ఏచూరిని కలవాలని డీఎంకే నేత ప్లాన్ వేస్తున్నారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన స్టాలిన్, సీక్రెట్ బాలెట్కు అనుమతిచ్చి, మళ్లీ తాజాగా ఓటింగ్ నిర్వహించేలా తమిళనాడు గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన స్టాలిన్, పళని బలనిరూపణ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు తలెత్తినట్టు పేర్కొన్నారు.. తమ 89 మంది ఎమ్మెల్యేలను బయటికి పంపించేసి ఓటింగ్ నిర్వహించారని చెప్పారు. రూలింగ్ పార్టీకి అనుకూలంగా అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించారని మండిపడ్డారు. అంతకముందు ఉత్తరప్రదేశ్, జార్ఖాండ్లలో రహస్య ఓటింగ్ పద్ధతే జరిగినట్టు గుర్తుచేశారు. -
'జయలలిత మృతిపై ఇప్పటికీ అనుమానమే'
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మరోసారి పెదవి విప్పారు. జయలలతి మృతి గురించి అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇంతకుముందు అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ మరణించినప్పుడు ప్రకటనలు చేశారని, కానీ ఈమె విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రకటన చేయలేదని అడిగారు. ఇదంతా ఏదో అనుమానాస్పదంగా ఉందని అన్నారు. మరోవైపు పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం నాడు తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. అసలు ఆ రోజున రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే ఎడప్పాడి పళనిస్వామి అసలు ముఖ్యమంత్రి అయి ఉండేవారు కారని ఆయన అన్నారు. -
ఇపుడే ధర్మయుద్ధం మొదలైంది- పన్నీరు
చెన్నై: నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. అరాచకశక్తులు ఇపుడు విజయం సాధించినా తమ పోరాటం కొనసాగుతుందని సెల్వం స్పష్టం చేశారు. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఖూనీ చేశారన్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోరితే దాడిచేశారనీ, అన్యాయంగా కొట్టి, బలవంతంగా సభనుంచి లాగి పడేశారని విమర్శించారు. మాఫియా చర్యల్లో భాగంగా విశ్వాస పరీక్షను ముగించారని దుయ్యబట్టారు. అసలైన యుద్ధం మొదలైందని పన్నీరువర్గం ప్రకటించింది. డీఎంకే, కాంగ్రెస్,ఇ తరప్రతిపక్ష సభ్యులు లేకుండా ఓటింగ్ నిర్వహించడం అప్రజాస్వామికమని ఆరోపించింది. అసలైన ధర్మ యుద్ధం ఇపుడే మొదలైంది. తమపోరాటం కొనసాగుతుందని పన్నీరు వర్గం స్పష్టం చేసింది. కాగా మధ్యాహ్నం 3గంటలకు వాయిదా తరువాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో మూజువాణి ఓటింగ్‌ను కొనసాగించిన స్పీకర్ సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించారు. పళనికి మద్దతుగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు నమోదైనట్టు ప్రకటించారు. -
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. స్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి, తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని పేర్కొన్నారు. సభలోతీవ్రం గందరగోళ పరిస్థితుల మధ్య బయటికువచ్చిన డీఎంనే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదనిని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుమ ప్రారంభంనుంచీ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుంచి డీఎంకే నేతలపై మార్షల్స్ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ చేతులపై ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగా పోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా డీఏంకు నేత స్టాలిన్ కు చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆందోళన మరింత ముదిరింది. డీఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ, స్పీకర్ పోడియం వద్ద స్టాలిన్ చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితులమధ్య మార్షల్స్‌ను ఎమ్మెల్యేలను బయటకు లాగి పడేయడం కనిపించింది. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. -
సరైన సమయంలో కీలక నిర్ణయం
-
సరైన సమయంలో కీలక నిర్ణయం
- డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ - అన్నాడీఎంకే ఎప్పుడూ మా ప్రత్యర్థే సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సరైన సమ యంలో కీలక నిర్ణయం తీసుకుంటామని డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎప్పుడూ డీఎంకేకు ప్రత్యర్థేనని స్పష్టం చేశారు. ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. స్టాలిన్ అధ్యక్ష తన, ప్రధానకార్యదర్శి అన్బళగన్ నేతృత్వంలో సోమవారం చెన్నై తేనాం పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ భేటీ జరిగింది. కమిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో గంట సేపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్టాలిన్ చర్చించారు. 11 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ వివరాలను మీడియాకు స్టాలిన్ వివరించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేని కారణంగా పలు సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల గందరగోళం విద్యార్థుల్ని ఆందోళనలో పడేస్తున్నదన్నారు. రైతు ఆత్మహత్యల పర్వం సాగుతున్నా, కరువుతో ప్రజలు తల్లడిల్లుతున్నా పట్టించుకునేవాళ్లు కరువయ్యారని ధ్వజ మెత్తారు. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం తానే పదవిలో కొనసాగాలని తీవ్ర ప్రయత్నాల్లో పడి పాలనను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఇకనైనా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశపరిచి మెజారిటీ ఉన్నవారిని అధికార పగ్గాలు చేపట్టే విధంగా ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎంకేపై శశికళ చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పదవీ వ్యామోహంతో వారి మధ్య పోటీ సాగుతోందని, దొడ్డిదారిన వారిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం డీఎంకేకు లేదని స్పష్టం చేశారు. బల పరీక్ష తప్పనిసరైతే, డీఎంకే మద్దతు ఎవరికి? అని ప్రశ్నించగా... వేచి చూడండి, సరైన సమయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని బదులిచ్చారు. ఉదయం పది గంటల సమయంలో స్టాలిన్ శాసనసభకు వెళ్లడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గంట పాటుగా తన చాంబర్లో ఉన్న స్టాలిన్ మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. మరికాసేపట్లో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం సచివాలయంలోకి వస్తారన్న సమయంలో హఠాత్తుగా స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో చర్చ బయల్దేరింది. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
పన్నీర్ సెల్వంకు మొండిచేయి!
చెన్నై: తమిళనాడు నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై గవర్నర్ విద్యాసాగర్ రావు తక్షణం స్పందించాలని ప్రతిపక్ష నాయకుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందన్నారు. డీఎంకే కీలక భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గవర్నర్ వెనుక బీజేపీ ఉందని తమిళ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మెజారిటీ ఉన్నవాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్నాడీఎంకే తమ ప్రత్యర్థి అని, ఆ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. పన్నీర్ సెల్వంకు మద్దతుపై ఎలాంటి తీర్మానం చేయలేదని వెల్లడించారు. అధికార పార్టీలో నెలకొన్న సంక్షోభంలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని తెలిపారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, రైతుల ఆత్మహత్యలతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. శశికళ అక్రమాస్తుల కేసుపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కాగా, ఆపత్కాలంలో తనకు డీఎంకే అండగా నిలుస్తుందని ఆశిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆశలపై స్టాలిన్ ప్రకటనతో నీళ్లు చల్లినట్టయింది. తాము మద్దతు ఇవ్వబోమని స్టాలిన్ విస్పష్ట ప్రకటన చేయడంతో పన్నీర్ సెల్వం ఆశలకు గండిపడింది. తమిళనాడు కథనాలు చదవండి... గవర్నర్‌కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్? శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
అధికారమే లక్ష్యంగా డీఎంకే కీలక భేటీ!
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో రాజకీయ వ్యూహాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. పన్నీర్ సెల్వం, శశికళ మధ్య ‘సీఎం కుర్చీ’ కోసం పోరు జరుగుతుండగా విపక్షం డీఎంకే కూడా చర్చోప చర్చలు జరుపుతోంది. దీనిలో భాగంగా సోమవారం పార్టీ సీనియర్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించింది. ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై లోతుగా చర్చించింది. అన్నాడీఎంకేలో సంక్షోభంతో ఆ పార్టీ చీలిపోతే అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్న దానిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సమావేశంలో 11 తీర్మానాలను ఆమోదించారు. -
తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్
-
త్వరలో అధికారంలోకి డీఎంకే!
- ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు - తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ - 20 మంది ఎమ్మెల్యేలు కీలకం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? శశికళనా... పన్నీర్ సెల్వమా? అని అందరూ బుర్రబద్దలు కొట్టుకుంటున్న తరుణంలో వీరిద్దరూ కాదు తామని డీఎంకే తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం వికసిస్తుందని పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా శనివారం కొత్త చర్చకు తెరదీశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాశ్రేయస్సును కోరుకోవడం తమ పార్టీ కర్తవ్యంగా భావిస్తామని స్టాలిన్ పార్టీ శ్రేణులతో చెప్పారు. సుపరిపాలనతో ప్రజలను తమవైపు తిప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. అయితే శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య బలపరీక్ష అనివార్యమైన పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని స్టాలిన్ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో బలాబలాలు... తమిళనాడులో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిల్లో ఒక స్థానాన్ని ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేస్తారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 136 స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకుంది. జయలలిత మరణంతో ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 89 స్థానాలతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 117 కాగా మిత్రపక్షాలను కలుపుకుని అసెంబ్లీలో డీఎంకే బలం 98. ఈ నేపథ్యంలో బలపరీక్షలో నెగ్గి పన్నీర్‌సెల్వం సీఎం కాలేరని భావించే, శశికళ వద్ద ఇమడలేని 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేరదీసి డీఎంకే అధికారంలోకి రావచ్చు. ఈ ఆలోచనతోనే స్టాలిన్ వ్యాఖ్యానించారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తమిళ సీఎం ఎన్నికలో బీజేపీ పాత్ర లేదు: వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయా ల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. ప్రభుత్వ ఏర్పాటులో, సీఎం ఎన్నిక విషయంలో తమ పార్టీ కి ఎలాంటి పాత్రా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనా డులో జరుగుతున్నది ఏఐఏడీఎంకే అంతర్గత వ్యవహారమన్నారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రపతి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కేశవ స్మారక విద్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. తమిళనాడులో పరిణా మాలు బాధాకరమని.. జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభు త్వం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటు న్నారని వెంకయ్య చెప్పారు. జయలలిత తర్వాత కూడా ఏఐఏడీఎంకేతో సంబంధాలు కొనసా గించాలనే అభిప్రాయంతో ఉన్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నం దున.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మోదీతో తెలంగాణ ప్రభుత్వ అఖిలపక్ష భేటీ వాయిదా పడిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను బహిష్కరిస్తారు: మన్మోహన్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తా మంటోందని.. ఆ విధంగా చేస్తే ఆ పార్టీని ప్రజలు బహిష్కరిస్తారని వెంకయ్య నాయు డు వ్యాఖ్యానించారు. -
పట్టాల మీదకు వెళ్లిన స్టాలిన్, కనిమొళి
-
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు
-
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు: సీఎం
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని, అందువల్ల నిరసనకారులు వెంటనే తమ నిరసన ప్రదర్శనలను విరమించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. జల్లికట్టు ఆందోళనలకు నడిగర సంఘం మద్దతు పలకడం, ఏఆర్ రెహ్మాన్ ఒకరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం, డీఎంకే నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకోలు మొదలవ్వడం లాంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి సవరణలు తెచ్చే విషయమై రాజ్యాంగ నిపుణులతో వివరంగా చర్చించామని సీఎం అన్నారు. సవరణ ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ఉదయమే కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపిందని, దానికి ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి వచ్చి, జల్లికట్టుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సవరణ ముసాయిదా విషయాన్ని చర్చించేందుకు వీలుగా రాష్ట్రానికి చెందిన కొంతమంది సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. పట్టాల మీదకు వెళ్లిన స్టాలిన్, కనిమొళి డీఎంకే నేతృత్వంలో జల్లికట్టు ఆందోళనలకు మద్దతుగా రైల్ రోకో ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళి తదితరులు కూడా ప్రత్యక్షంగా ఈ ఆందోళనలలో పాల్గొన్నారు. మాంబళం రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైల్‌రోకోలో స్టాలిన్ పాల్గొనగా, ఎగ్మూర్ స్టేషన్‌కు కనిమొళి వెళ్లారు. -
జల్లికట్టు నిషేధంపై డీఎంకే నిరసన
చెన్నై : జల్లికట్టుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు అంతటా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా జల్లికట్టుకు అనుమతి ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు నిన్న తేల్చి చెప్పడంతో రాష్ట్రమంతటా ఆగ్రహావేశాలు భగ్గుమంటున్నాయి. అయితే సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వాల్సిందేనంటూ డీఎంకే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నేతృత్వంలో కార్యకర్తలు ఈ రోజు ఉదయం చెన్నై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో కనిమొళి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ తమిళ సంప్రదాయాన్ని కేంద్రం అడ్డుకుంటోందని అన్నారు. జల్లికట్టుపై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాల్సిందేనంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద డీఎంకే కార్యకర్తలు నిరసన చేపట్టారు. మరోవైపు సుప్రీంకోర్టు నిషేధం విధించినా మధురైలో 22 ఎద్దులతో జల్లికట్టు కొనసాగుతోంది. -
తమిళనాడు కేబినేట్ అత్యవసర సమావేశం
-
తమిళనాడు కేబినేట్ అత్యవసర సమావేశం
చెన్నై: తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నేడు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర కేబినేట్ బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సీఎం పన్నీర్ సెల్వం నేతృత్వంలో ఉదయం 9.30 గంటలకు మంత్రి వర్గ సభ్యులు భేటీకానున్నారు. పార్టీ చీఫ్ శశికళ ముఖ్యమంత్రి అని వదంతులు వస్తున్న నేపథ్యంలో దీనిపై కేబినేట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పార్టీ సర్వ సభ్య సమావేశం కూడా నేడు జరగనుంది. అన్నా అరివాలయంలోని డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి రెండు నెలల అనంతరం డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో పార్టీ కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ కు నిర్వాహక అధ్యక్షుడి పగ్గాలు అప్పగించే అవకాశముంది. -
స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు, కింగ్ మేకర్ ఎంట్రీ!
చెన్నై : తమిళనాట రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. జయలలిత మరణంతో ఓ వైపు అన్నాడీఎంకేలో కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతుంటే...మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోనూ వారసత్వ పోరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన (బుధవారం) డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కూడా కీలక పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కుటుంబీకులు కరుణపై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో అళగిరి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు కనిమొళికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారా? లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉండగా, ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ వాయిదా పడింది. కాగా ఈ సమావేశంలో కరుణానిధి పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత అన్బళగన్ తెలిపారు. సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు ముఖ్య బాధ్యతలు అప్పగించేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
స్టాలిన్ సహా 60 మంది ఎమ్మెల్యేలపై కేసు నమోదు
తమిళనాడు: డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు అయింది. తమిళనాడు అసెంబ్లీ నుంచి వారం పాటు డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నెల 17న అసెంబ్లీ స్పీకర్ తమపై విధించిన సస్పెన్షన్‌ను నిరసిస్తూ సచివాలయంలోనూ అసెంబ్లీ ప్రాంగణం వద్ద డీఎంకే ఎమ్మెల్యేలు, స్టాలిన్ ఆందోళన దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్ సహా 60 మంది ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం. -
డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు
తిరుచ్చి శివను నాలుగు దెబ్బలు కొట్టానన్న అన్నాడీఎంకే ఎంపీ శశికళ * కాదు ఒక్కటేనన్న శివ * ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన సాక్షి, చెన్నై: ఢిల్లీ విమానాశ్రయం వేదికగా చెంపలు పగులగొట్టేలా గొడవకు దిగిన డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీల వ్యవహారం తమిళనాడులో దుమారం రేపింది. డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, అన్నాడీఎంకేకు చెందిన శశికళ పుష్ప రాజ్యసభ సభ్యులు. ఇటీవల శివ, శశికళ సన్నిహితంగా ఉండే ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనిపై రాష్ట్రంలో చర్చ జరిగింది. ఇది సద్దుమణగకముందే వీరిద్దరు గొడవ పడ్డారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చేందుకు శివ, శశికళ వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఢిల్లీ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే గొడవ చోటు చేసుకుంది. తమ అమ్మ (జయలలిత)ను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద శివ అవహేళనగా వ్యాఖ్యలు చేయడంతో తాను నాలుగుసార్లు ఆయన చెంప పగలగొట్టినట్టు శశికళ చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివ అనుచరులు తన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో ఇద్దరు ఎంపీలు తమ పార్టీ అధిష్టానాలకు వివరణ ఇచ్చుకున్నారు. పనిగట్టుకుని గొడవ పడ్డారు.. శివ: విమానాశ్రయ సిబ్బంది తనకు మర్యాద ఇచ్చి, ఆమెకు ఇవ్వలేదన్న అసూయతోనే శశికళ పనిగట్టుకుని తనతో గొడవ పడ్డారని శివ చెప్పారు. చెన్నైకి వచ్చేందుకు బోర్డింగ్ పాస్ తీసుకుని, అత్యవసర పనిపడటంతో దాన్ని రద్దు చేసుకుని బయటకు తిరిగి వస్తున్నప్పుడు తన చొక్కా లాగి మరీ ఓ చెంప దెబ్బ కొట్టారని తెలిపారు. మహిళా ఎంపీ కావడంతో తాను కనీసం వాగ్యుద్ధానికీ దిగలేదని, భద్రతా సిబ్బంది సూచనతో బయటకు వచ్చేశానని చెప్పారు. తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి విమర్శలు, ఆరోపణలు చేసి ఉంటే, ఇలా బహిరంగంగా కొట్టే సంస్కృతి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంకే చీఫ్ కరుణానిధికి శిశ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఇక, శశికళ పోయెస్ గార్డెన్‌కు చేరుకుని సీఎం, తమ పార్టీ అధినేత్రి జయలలితకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా చుట్టుముట్టగా ఆమె మౌనంగా వెళ్లిపోయారు. -
జయ అనొద్దన్నందుకు అలిగి వెళ్లారు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి జయలలితను పేరు పెట్టి పిలవొద్దని స్పీకర్ సూచించినందుకు ప్రతిపక్షం డీఎంకే వాకౌట్ చేసింది. తమకు ఒక న్యాయం వారికి ఒక న్యాయమా అని నిలదీస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఒకసారి బడ్జెట్ సమావేశాల సమయంలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే పీఎం నరసిమన్ డీఎంకే చీఫ్ కరుణానిధి అంటూ సంబోధించాడు. దీంతో సభలో ఉన్న డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరు పెట్టి పిలవడంపై స్పీకర్ ను నిలదీశారు. దీనికి స్పీకర్ పీ ధన్ పాల్ స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రిని పేరు పెట్టి పిలవొచ్చు అని బదులిచ్చారు. ఈ సమాధానాన్ని ఆసరాగా తీసుకున్న డీఎంకే జయలలిత విషయంలో కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అలా పిలవొచ్చా అని ప్రశ్నించారు. అయితే, అలా చేయకూడదు అని స్పీకర్ బదులిచ్చారు. ఇది నా ఆర్డర్ కూడా అని ఆదేశించాడు. దీంతో ఒక్కసారిగా డీఎంకే ఎమ్మెల్యేలంతా సభలో ఆందోళన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు. స్పీకర్ ఆదేశాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలవకూడదని ఏ అసెంబ్లీలో కూడా లేదని, అలాంటిది కొత్త నిబంధనను స్పీకర్ తీసుకొస్తున్నారని ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శించారు. -
ప్రచారాలకు చెక్
* నేడు డీఎంకే ఎమ్మెల్యేల భేటీ * ఆరోపణలపై కరుణ స్పందించే అవకాశం * పార్టీ వర్గాల ఎదురు చూపు సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, వారసుడు స్టాలిన్ మధ్య అంతర్గత సమరం బయలుదేరినట్టు తమిళ మీడియాల్లో సాగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే సమయం ఆసన్నమైనట్టుంది. బుధవారం జరిగే డీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో ఈ ప్రచారాలపై కరుణానిధి స్పందించే అవకాశాలు ఉన్నాయి. దళపతి స్టాలిన్ ఏ విధంగా స్పందిస్తారో అన్న ఎదురు చూపులు బయలు దేరాయి. అధికారంలోకి వస్తే డీఎంకే అధినేత ఎం కరుణానిధి సీఎం అవుతారని ఆది నుంచి పార్టీ వర్గాలు స్పష్టం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అధికారం దూరం అయింది. బలమైన ప్రధాన ప్రతి పక్షం చేతికి చిక్కింది. ప్రధాన ప్రతి పక్ష నేతగా స్టాలిన్‌ను ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, కరుణానిధి, స్టాలిన్ల మధ్య అంతర్గత సమరం ఎన్నికల అనంతరం బయలు దేరినట్టుగా ప్రచారాలు హల్ చల్ చేస్తున్నాయి. ఔరంగ జేబుతో కరుణానిధిని పోల్చుతూ, పదవి కోసం వెంపర్లాడుతూ ఉంటే, మొగల్ సామ్రాజ్యం ఏ విధంగా పతనం అయిందో, అదే పరిస్థితి డీఎంకేకు తప్పదన్నట్టుగా స్టాలిన్ మద్దతు వర్గం సోషల్ మీడియాల్లో స్పందించడం వివాదాస్పదంగా మారింది. స్టాలిన్ మద్దతు దారులపై కొరడా ఝుళిపించేందుకు కరుణానిధి సిద్ధ పడటం,దీనిని స్టాలిన్ అడ్డుకున్నట్టుగా తమిళ మీడియాల్లో కథనాలు కోడై కూస్తున్నాయి. అదే సమయంలో కరుణానిధి కాకుండా స్టాలిన్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే అధికారం దక్కి ఉండేదన్నట్టుగా కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పరిగణించిన కరుణానిధి కినుకు వహించినట్టుగా ప్రచారం సాగుతున్నది. తండ్రి, తనయుడి మధ్య సాగుతున్న అంతర్గత సమరం పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నట్టుగా వస్తున్న ఈ ప్రచారాలకు ముగింపు పలికే రీతిలో డీఎంకే అధిష్టానం చర్యలు చేపట్టి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగా అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అవుతుండటంతో, పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో అంతర్గత సమరాలు లేవు...అవన్నీ ఒట్టి ప్రచారాలే అని చాటే దిశగా స్టాలిన్ స్పందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, తన వారసుడ్ని ఆకాశానికి ఎత్తే విధంగా కరుణానిధి ప్రసంగించే అవకాశాలు ఎక్కువే. ఈ దృష్ట్యా, బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరగనున్న పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో ప్రచారాలన్నింటికీ ముగింపు పలికి, అసెంబ్లీలో ప్రధాన బలమైన ప్రతి పక్షం అంటే, తామే అని చాటుకునే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం ఖాయం. తదుపరి 16వ తేదీ నుంచి కొత్త ప్రభుత్వంలో సాగే, తొలి శాసన సభా పక్ష సమావేశంలో అధికార పక్షంతో కలసి తమిళ ప్రగతిని లక్ష్యంగా బలమైన ప్రతి పక్షం ముందుకు సాగేనా, లేదా అధికార పక్షం దూకుడుతో ఢీ కొట్టే రీతిలో సమరం సాగించేనా అన్నది వేచి చూడాల్సిందే. -
రాజకీయాల్లోకి యువ సినీ హీరో?
పలు సినిమాలతో తమిళనాట మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న యువ హీరో ఉధయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. డీఎంకే అధినేత కరుణానిధి మనవడు, స్టాలిన్ కొడుకుగా రాష్ట్రంలో ఆయనకు క్రేజ్ ఉంది. ఉదయ్ పొలిటికల్ ఎంట్రీ నిజమేనని డీఎంకే వర్గాలు కూడా నిర్ధారిస్తున్నాయి. ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ఇటీవల 'మనిధన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఉధయనిధి క్రియాశీలక రాజకీయాల్లోకి దిగితే చిత్ర పరిశ్రమలో డీఎంకే వాదిగా ముద్రపడే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే రాజకీయాల ఊసెత్తకుండా ఇన్నాళ్లూ జాగ్రత్త పడుతూ వచ్చారు. ఆ మధ్య స్టాలిన్ కూడా తనకు వారసులుగా తన కొడుకు గానీ, కూతురుగానీ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎంకే వర్గాలు మాత్రం ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగ ప్రవేశం ఖాయం అంటున్నారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీనేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు తలకిందులైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ రాజకీయ వాతావరణానికి దూరంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ శాసనసభ్యుడిగా ధ్రువపత్రాన్ని అందుకోవడానికి వెళ్లినప్పుడు వెంటే వెళ్లారు. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి స్టాలిన్ తంజావూరు వెళ్లినప్పుడు ఆయనతో ఉదయనిధి కూడా వెళ్లారు. ఇదంతా చూస్తుంటే ఉదయనిధి స్టాలిన్ రాజకీయరంగప్రవేశం ఖాయం అనే స్వరం సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. -
తమిళనాట తెలుగు ముద్ర
► సత్తా చాటిన అభ్యర్థులు ► మాతృ భాషలో గళం విప్పేది డౌటే అసెంబ్లీకి ముగ్గురు: తమిళనాట చెన్నై మహానగరం పరిధిలో ఎక్కువ శాతం మంది స్థిర పడ్డ తెలుగు సంతతికి చెందిన వారే ఉన్నారన్న విషయం తెలిసిందే. అలాగే, ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉంటూ ఓటు హక్కును కల్గిన వారూ ఎక్కువే. అందుకే తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు తగట్టుగా తెలుగు సంతతికి చెందిన అభ్యర్థులుగా శేఖర్ బాబు(హార్బర్), రంగనాథన్(విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్), ఎం సుబ్రమణియన్(సైదాపేట)లను డీఎంకే, కాంగ్రెస్ కూటమి రేసులో దించాయి. రాజకీయంగా పార్టీల బలం, వ్యక్తిగత చరిష్మా, తెలుగు ఓటరు అండగా నిలబడడం వెరసి ఈ ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పల్లావరానికి అన్నాడీఎంకే అభ్యర్థిగా తెలుగు ప్రముఖురాలు, సినీ నటి సీఆర్ సరస్వతిపోరాడి చివరకు ఓటమి చవి చూశారు. సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగంలో నైనా సరే తెలుగువారి ముద్ర కచ్చితంగా కన్పిస్తుంది. ఆ దిశగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలుగు అభ్యర్థులు పలువురు విజయ కేతనం ఎగురవేశారు. తెలుగు వారిగా, తెలుగు సంతతికి చెందిన వారుగా పలువురు డిఎంకే, అన్నాడీఎంకేల నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కినా మాతృభాషలో తమ గళాన్ని విన్పించడం అనుమానమే. ఈ సారి తెలుగు సంతతికి చెందిన అత్యధిక శాతం మంది డీఎంకే అభ్యర్థులుగా గెలవడం గమనార్హం. విభిన్న జాతుల సమాహారంతో నిండిన రాష్ట్రంలో మాతృ భాషం తమిళం అయినా, తెలుగు వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉభయ సంయుక్త రాష్ట్రాలుగా ఉన్నప్పుడు గానీయండి, ప్రత్యేక మద్రాసు నగరంలోని గానీయండి తెలుగు వారు హవా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ వస్తున్నది. అందుకే ఇక్కడ తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగాయి. సాగుతున్నాయి. ఈ సమయంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పక్షాలకు తెలుగు ఓటరు కీలకం అయ్యాడు. అందుకే తెలుగు బలం ఉన్న చోట్ల తెలుగు వారినే రాజకీయ పక్షాలు అభ్యర్థిగా ప్రకటించాయి. ఇందులో డిఎంకే, అన్నాడీఎంకేలు ముందంజలో నిలిచాయి. సరిహద్దుల్లో సత్తా: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో అయితే, పలు నియోజకవర్గాల్లో తెలుగు అభ్యర్థుల మధ్య సమరం సాగింది. ఇంకా చెప్పాలంటే, తెలుగు ఓటర్లను చీల్చేందుకు తగ్గట్టుగా రాజకీయ ఎత్తుగడ సాగిందని పరిగణించాల్సిందే. ఇందులో గుమ్మిడి పూండి, హోసూరు , త లిలను ముందు వరసులో తదుపరి వేపనహల్లిలను పరిగణించాలి. గుమ్మిడిపూండి డిఎంకే అభ్యర్థిగా శేఖర్, అన్నాడీఎంకే అభ్యర్థిగా విజయకుమార్‌లు ఢీ కొట్టి, చివరకు తెలుగు ఓట్లు చీలడంతో విజయకుమార్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తిరుత్తణిలో అయితే, అచ్చ తెలుగు నాయకుడుగా, బీజేపీ రాష్ట్ర ఉపాథ్యక్షుడు చక్రవర్తి నాయుడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించినా, చివరకు ఐదు వేలకు పై చిలుకుల ఓట్లతో సరి పెట్టుకోక తప్పలేదు. ఇక, హోసూరు విషయానికి వస్తే, ఇద్దరు తెలుగు ఉద్దండులు ఢీ కొట్టారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గోపినాథ్‌ను అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన బాలకృష్ణారెడ్డి ఓడించి, తెలుగు మద్దతు తనకే అని చాటుకున్నారు. తలి నియోజకవర్గంలడీఎంకే అభ్యర్థిగా అచ్చ తెలుగు అబ్బాయి వై ప్రకాష్ సత్తా చాటుకున్నాడు. ఇక్కడ సీపీఐ అభ్యర్థిగా తెలుగు సంతతికి చెందిన రామచంద్రన్ ఓటమి పాలు కాక తప్పలేదు. వేపన హల్లి రేసులో అన్నాడీఎంకే అభ్యర్థి దిగిన అచ్చ తెలుగు అబ్బాయి మధుకు తెలుగు కార్డు పనిచేయనట్టుంది. ఓటమి చవి చూడక తప్పలేదు. మరి కొన్ని చోట్ల: వేలూరు, తిరువణ్ణామలై, వాణియం బాడి, జోళార్ పేట, కాట్పాడి, రాణి పేట,కీల్ పెన్నాత్తూర్, గుడియాత్తంలలోనూ తెలుగు వారు అధికం అన్న విషయం తెలిసిందే. అయితే, వీళ్లు తెలుగు చదవడం, రాయడం రాదు. తమిళంలో చదువుకున్న వాళ్లే. అయినా తెలుగు సరళంగా మాట్లాడ గలరు. అందుకే తెలుగు సంతతికి చెందిన వారైన, రాణి పేటలో డిఎంకే నేత గాంధి, తిరువణ్ణామలైలో డిఎంకే నేత ఏవి వేలులకు మద్దతు పలికారు. కీల్ పెన్నాత్తూర్లో డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగు సంతతికి చెందిన పిచ్చాండి విజయం సాధించడం విశేషం. తిరుచ్చి తూర్పులో తెలుగు సంతతికి చెందిన కే ఎన్ నెహ్రు, అరుప్పుకోట్టైలో కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్‌లు విజయ కేతనం ఎగుర వేయగా రాశిపురంలో తెలుగు సంతతికి చెందిన దురై స్వామి, మదురై పశ్చిమంలో దళపతి ఓటమి చవి చూడక తప్పలేదు. ఇక, తెలుగు నినాదంతో సీఎం జయలలిత పోటీ చేసిన ఆర్కేనగర్, తెలుగు ఓటర్లు అత్యధికంగా ఉన్న హొసూరులో పోటీ చేసిన తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కొన్ని ఓట్లు దక్కడం గమనార్హం. హొసూరులో 265, ఆర్కేనగర్లో 57 ఓట్లను ఆయన ద క్కించుకున్నారు. కాగా, తెలుగు వారుగా, తెలుగు సంతతికి చెందిన వారుగా డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన పైన పేర్కొన్న అభ్యర్థులు గెలిచినా, మాతృ భాషలో తమిళ అసెంబ్లీలో గళం విప్పేది మాత్రం డౌటే. ఇన్నాళ్లు, తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తూ వచ్చిన గోపినాథ్ ఈ సారి ఓటమి చవి చూశారు. ఆయన ప్రశ్నలకు ఇది వరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తెలుగులోనే సమాధానాలు ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు ఎన్నికైన వారిలో ఎవరైనా ఒక్కరు తెలుగు పదాలు పలికేనా అన్నది అనుమానమే. ఇందుకు కారణం, అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన వాళ్లు, ఎక్కడ అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందోనన్న భయం, డీఎంకే తరఫున గెలిచిన వాళ్లలో మౌనం పాటించే వాళ్లు తప్పని సరి. ఈ దృష్ట్యా, తెలుగు వారుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా, మాతృ భాషలో గళాన్ని విప్పలేని పరిస్థితి...! -
తమ పార్టీలు గెలవలేదని..
టీనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలవలేదని విరక్తి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పార్టీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒక ప్రకటనలో కోరారు. ఈరోడ్ నార్త్ జిల్లా, నంబియూరు యూనియన్‌కు చెందిన సుండకాంపాళయం పంచాయతీలో షణ్ముగం అనే వ్యక్తి యువజన విభాగం నిర్వాహకుడిగా పనిచేస్తుండేవాడు. ఈయన గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీంతో అతను ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోదరుని మృతితో తీవ్ర ఆవేదనకు గురయ్యానని, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొంటూ ఒక లేఖ విడుదల చేశారు. కార్యకర్తలు ఇకపై మనో నిబ్బరంతో ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడరాదని ప్రకటనలో కోరారు. డీఎండీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం: డీఎండీకే ఒక్క నియోజకవర్గంలోనూ గెలవకపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూత్తుకుడి లోని తాళముత్తునగర్ దుబ్బాస్‌పట్టికి చెందిన పళనివేలు (40) విజయకాంత్ అభిమాని. ఇతను అదే డివిజన్ ఏరియా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. ఇతను అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే-మక్కల్ నలకూట్టని ఘన విజయం సాధిస్తుందని పలువురితో చెబుతూ వచ్చాడు. అయితే గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో మక్కల్ నలకూట్టని పార్టీలు మాత్రమే కాకుండా డీఎండీకే ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపొందలేదు. దీంతో విరక్తి చెందిన పళనివేలు మద్యంలో విషం కలుపుకుని సేవించారు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు బాధితుణ్ణి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్కెట్ లో సన్ టీవీ మెరుపులు
చెన్నై: తమిళనాడులో అధికార పగ్గాలు డీఎంకే కే అన్న ఎగ్జిట్ పోల్ అంచనాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో సన్ టీవీ షేర్లు దూసుకుపోతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రతిపక్ష డిఎంకెకు సానుకూలంగా రావడంతో మంగళవారం నాటి మార్కెట్ లో సన్ టివి నెట్ వర్క్ లిమిటెడ్ షేర్లు మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. 9.5 శాతానిపై గా లాభంతో 430 రూ. దగ్గర ట్రేడవుతూ ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తప్పదని తేలడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు ఈ పేరు జోరును మరింత కొనసాగించే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ క్రమంలో 540రూ.లకు షేర్ విలువ చేరితే, 560కి చేరే అవకాశాలున్నాయని. ఈ స్థాయిని కూడా దాటి నిలదొక్కుకొని, కొనుగోళ్ల మద్దతు లభిస్తే మరింత లాభపడే అవకాశం ఉందని తెలిపారు. ఒక వేళ 560 స్థాయి దగ్గర బలంగా లేకపోతే అప్రమత్తంగా ఉండాలని విశ్లేష్లకులు సూచిస్తున్నారు. అధికార పార్టీకి 103 సీట్లు తగ్గుతాయని, డీఎంకె, కాంగ్రెస్ కూటమి 120 సీట్లకు పైగా కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధిపతి కరుణా నిధి (90) సీఎం పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. మార్చి త్రైమాసికంలో లాభాలను సాధిస్తుందనే అంచనాల నేపథ్యంలో కూడా సన్ టీవీపై మదుపర్లు దృష్టి సారించారని విశ్లేషకులు భావిస్తున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ క్యూ 4 ఫలితాలు కూడా సన్ టీవీ లాభాలకు నమూనాగా ఉంటాయని, ఇది కూడా స్టాక్ ధరలు పెరగడానికి కారణమని ఏంజిల్ బ్రోకింగ్ చెందిన మయురేష్ జోషి చెప్పారు.కాగా చెన్నైకు చెందిన సన్ టీవీ కి డిఎంకె అధ్యక్షుడు ఎం కరుణానిధి మనవడు కళానిధి మారన్ అధిపతిగా ఉన్న సంగతి తెలిసిందే. -
సాగనంపుదాం!
♦ చిత్తశుద్ధి లేని సీఎం అవసరమా ♦ జయను ఉద్దేశించి రాహుల్ విసుర్లు ♦ అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు ♦ మదురైలో రాహుల్, స్టాలిన్ ♦ మా ఇద్దరిదీ ఒకటే మార్గం అని వ్యాఖ్య ♦ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన నాలుగు గోడల మధ్య నుంచే, అన్నీ తెలుసు..అన్నట్టు నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఈ సీఎం అవసరమా? ఇక, సాగనంపుదాం.. తమిళనాడును బలోపేతం చేసుకుందామని ప్రజలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. శనివారం తమిళనాట సుడిగాలి పర్యటనల్లో సీఎం జయలలితను టార్గెట్ చేసి, అప్పుడప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి ప్రసంగాల్ని రాహుల్ హోరెత్తించారు. కామరాజర్, ఎంజీయార్ వంటి నేతల జాబితాలో స్టాలిన్ కూడా ఉన్నారంటూ వ్యాఖ్యానించి డీఎంకే వర్గాల్లో మరింత జోష్‌ను నింపారు. సాక్షి, చెన్నై: డీఎంకే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన రాకతో మదురై, కోయంబత్తూరు, చెన్నైలలో భద్రతను పెంచారు. ఆయన బహిరంగ సభ జరిగిన ప్రదేశాల్లో డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు తరలివచ్చి తమ కూటమి బంధాన్ని చాటుకున్నారు. ఊమచ్చికులం వేదికగా జరిగిన బహిరంగ సభ నిమిత్తం రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మదురైకు చేరుకున్నారు. అక్కడి కాంగ్రెస్ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. ఇద్దరు నవతరం నాయకుల్ని ఒకే వేదిక మీద చూసి డీఎంకే, కాంగ్రెస్ వర్గాలు ఆనందంలో మునిగాయి. రాహుల్, స్టాలిన్ ఊమచ్చికులం వేదికగా జరిగిన ప్రచార సభలో అన్నాడీఎంకే సర్కారును గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారోత్సవంలో స్టాలిన్‌ను కలిసానని, అయితే, ఇక్కడ ఒకే వేదిక మీద ఇద్దరం ప్రచారం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కామరాజర్, ఎంజీయార్ వంటి నేతలు ప్రజల మధ్యలో పరుగులు తీస్తుంటారని, ఆ కోవలో స్టాలిన్ కూడా ఉన్నారని కితాబు ఇచ్చారు. తామిద్దరం ఒకే మార్గంలో పయనిస్తున్నామని ప్రజా హితం తమ లక్ష్యం అని వ్యాఖ్యానించారు. తదుపరి కోయంబత్తూరు కొడీస్సియ మైదానంలో జరిగిన బహిరంగ సభలో డిఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళితో కలిసి ఓట్ల వేట సాగించారు. ఇక్కడ ముగియగానే, ఆగమేఘాలపై చెన్నైకు చేరుకున్నారు. వానగరంలోని ఓ మైదానంలో జరిగిన బహిరంగ సభలో డిఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్తో కలసి ప్రజాకర్షణ ప్రసంగాన్ని రాహుల్ హోరెత్తించారు. సాగనంపుదాం : మదురై, కోయంబత్తూరు, చెన్నై సభల్లో రాహుల్ తన ప్రసంగం అంతా అన్నాడిఎంకే అధినేత్రి, సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగా విరుచుకు పడ్డారు. మధ్య మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావన తీసుకొస్తూ శివాలెత్తారు. కామరాజర్, కరుణానిధి, ఎంజీయార్ వంటి నాయకులు ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని ఇక్కడ పరిష్కరించి ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఇక్కడున్న సీఎం నాలుగు గోడలకే పరిమితం అని ఎద్దేవా చేశారు. ఆ గోడల మధ్య ఉంటూ, అన్నీ తనకే తెలుసు అన్నట్టుగా నియంతలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని శివాలెత్తారు. తమిళనాడు దేశంలోనే బలమైన రాష్ట్రంగా ఐదేళ్ల క్రితం ఉన్నదని, అయితే, ఈ కాలంలో బలహీనం చేశారని ధ్వజమెత్తారు. ఈ కాలంలో ఇక్కడకు రావాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడ్డారని, పెట్టుబడి పెట్టే ముందు, ఇక్కడి పాలకులకు చేతుల్ని తడపాల్సిన పరిస్థితి నెలకొని ఉన్నదని మండి పడ్డారు. కేంద్రంలో యూపీఏ, రాష్ట్రంలో డిఎంకే అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ నెలకొల్ప బడ్డ పరిశ్రమల్ని బలవంతంగా మూయించడం మొదలెట్టి, పట్టభద్రుల్ని నిరుద్యోగులుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, వరద ప్రళయంలో చిక్కుకుని నరకాన్ని చవి చూసి ఉంటే, వాటి గురించి పట్టించుకోకుండా నాలుగు గోడల మధ్య నుంచి ప్రేక్షక పాత్ర పోషించిన ఈ సీఎం అవసరమా...? అవసరమా..? అని పదే పదే వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో వద్దు..వద్దు అనిపిస్తూ ప్రసంగాన్ని సాగించారు. బలంగా ఉన్న తమిళనాడును బలహీనం చేశారని, ఇప్పుడు బలమైన నాయకత్వంతో బలోపేతం చేసుకుందామని, అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు. రూ ఐదువేలు విలువగల ఉచితాల్ని ఇచ్చేసి, మద్యం రూపంలో ఒక్క కుటుంబం నుంచి రూ. 60 వేలు చొప్పు దోచుకున్న ఈ ప్రభుత్వాన్ని ఇక సాగనంపుదామన్నారు. జయలలిత జీ(గారు)....ఏమో..! నాలుగు గోడలకు పరిమితం...మోదీ..జీ ఏమోగా దేశంలోనే ఉండరంటూ, ఈ ఇద్దరూ ప్రజా వ్యతిరేకులు అని, వీరికి ప్రజా హితం గిట్టదంటూ ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలను అణగదొక్కడే లక్ష్యంగా ఈ ఇద్దరి పయనం ఉన్నదని, వీరికి ఏ మాత్రం ప్రజల మీద చిత్తశుద్ది అన్నది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంకే, కాంగ్రెస్‌లు ఇచ్చిన వాగ్దానాలన్నీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అమలు చేసి తీరుతాం అని మేనిఫెస్టోల్లోని అంశాలను కొన్ని వివరించారు. రాష్ట్రంలో మద్యనిషేధం తప్పని సరిగా అమలు అవుతుందని పేర్కొంటూ, తనకు సత్య అనే తొమ్మిది సంవత్సరాల బాలిక ద్వారా ఎదురైన అనుభవం, మద్యం రక్కసితో ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడం, చివరకు సత్య అనాథగా మిగలడం గురించి వివరించారు. మరో సత్య ఇక్కడ అనాద మార కూడదని, అందుకే మద్య నిషేధం లక్ష్యంగా బలమైన నాయకత్వాన్ని బల పరుద్దామని పిలుపు నిచ్చారు. జయ...జీకి మాత్రం పగ్గాలు ఇస్తే, ఇలాంటి సత్యలు రాష్ట్రంలో పెరుగుతారన్నది గుర్తుంచుకోవాలని, ప్రజాల కష్టాల్ని గుర్తించే నాయకుల్ని, ప్రజల్లో మమేకం అయ్యే నాయకత్వాన్ని బలపరుద్దామని, సమిష్టిగా రాష్ట్రంలో అధికారం సాధిద్దామని పిలుపు నిచ్చారు. కాగా, మదురైలో రాహుల్ ప్రసంగాన్ని ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు అనువాదించే క్రమంలో ఆయన మైక్ మూగబోయింది. తక్షనం ఆయన్ను తన పక్కకు లాక్కుని మైక్ అందించిన రాహుల్, ఇంత దగ్గర్లో నాయకులు జయ... జీ వద్ద నిలబడ గలరా..?, చెప్పండి...అదే వారికి తమకు ఉన్న తేడా, ఇదే తమ నాయకత్వం అంటూ చేసిన వ్యాఖ్యలకు జనం కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. కోయంబత్తూరు సభలో అయితే, మరో కార్యదర్శి జయకుమార్ ప్రసంగం అనువాదంలో తడబడడంతో పదే పదే ఆయనకు అంశాలను రాహుల్ గుర్తు చేస్తూ జనం చేత చప్పట్లు కొట్టించారు. ఇక, మదురై వేదికగా వణక్కం ‘స్టాలిన్’ అవర్గలే (నమస్తే స్టాలిన్ గారు) అని దళపతిని తమిళంలో కతృజ్ఞత పూర్వక ఆహ్వానం పలికారు. రాహుల్ రాకతో కాంగ్రెస్‌లో ఐక్యత వికసించినట్టుగా, నేతలందరూ వేదికల మీద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, దళపతి స్టాలిన్ తన ప్రసంగంలో జయలలిత తీరును ఎండగడుతూ ముందుకు సాగారు. -
విజయ్ అభిమానుల మద్దతు డీఎంకేకా?
సాక్షి, చెన్నై: రానున్న శాసనసభ ఎన్నిక వ్యవహారం రసవత్తరంగా మారింది. ప్రధాన రా జకీయ పార్టీలు నువ్వా? నేనా? అన్నంతగా గెలుపు కోసం తలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నటుడు విజయ్ అభిమానుల మద్దతు డీఎంకే పార్టీకా? అన్న ప్రశ్నకు అవుననే బదులు రావడం కోలీవుడ్‌లోనూ మరింత ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇళయదళపతి అభిమానులు ఇలాంటి నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు పలు కారణాలు కళ్లెదుట కనబడుతున్నాయి. ఐదేళ్లలో విజయ్ చిత్రాలు పలు సమస్యలకు గురయ్యాయి. దీనికి కారణం అన్నాడీఎంకే ప్రభుత్వమేననే నిర్ణయానికి విజయ్ అభిమానులు వచ్చినట్లు ప్రచారంలో ఉంది. దీంతో వారు అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పులి చిత్ర విడుదల సమయంలో విజయ్ ఇంటిలో ఐటీ దాడులు జరగడంలో ప్రభుత్వ ప్రయేయం ఉందని విజయ్ అభిమానుల అభియోగాలున్నాయి. ఇత్యాధి కారణాలతో అభిమానులు అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలు కురిపిస్తున్నట్లు సమాచారం. గత 2004 పార్లమెంట్ ఎన్నికల సమయంలో విజయ్ అభిమానసంఘం బీజేపీకి మద్దతు తెలిపింది. 2011 శాసనసభ ఎన్నికల్లో విజయ్,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్‌లు బహిరంగంగానే అన్నాడీఎంకేకు మద్దతు పలికారు. అలాంటిది ఈ ఐదేళ్ల కాలంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులు వారి అభిమానులకు అన్నాడీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత,అసంతృప్తిని కలిగించాయంటున్నారు. ఇలాంటి కారణాల వల్లే విజయ్ అభిమానులు డీఎంకే పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై విజయ్ అభిమాన సంఘం అధ్యక్షుడు ఆనంద్ నుంచి సమాచారం వచ్చినట్లు జిల్లా అభిమాన సంఘం సభ్యులు పేర్కొంటున్నారు. అయితే ఈ విషయమై విజయ్ గానీ,ఆయన తండ్రి ఎస్ఏ.చంద్రశేఖర్ గానీ ఎలాంటి ప్రకటన చేయకలేదన్నది గమనార్హం. -
విఐపీ రాజధాని
తమిళనాడుకు రాజధాని నగరంగా ఉన్న చెన్నై జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో హేమాహేమీలు ఎన్నికల్లో తలబడుతున్నారు. సీఎం జయలలిత, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, జాతీయ కార్యదర్శి హెచ్.రాజా, మాజీ డీజీపీ ఆర్ నటరాజ్లతో పాటు పలువురు ఈ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. సాక్షి, చెన్నై: చెన్నై జిల్లా పరిధిలో డాక్టర్ రాధాకృష్ణన్ నగర్, పెరంబూరు, కొళత్తూర్, విల్లివాక్కం, తిరువీకానగర్(రి), ఎగ్మూర్(రి), రాయపురం, హార్బర్, చేపాక్కం-ట్రిప్లికేన్ , థౌజండ్ లైట్స్, అన్నానగర్, విరుగంబాక్కం, సైదాపేట, టీనగర్, మైలాపూర్, వేళచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అత్యధిక స్థానాల్ని తమ గుప్పెట్లోకి తీసుకునేందుకు డీఎంకే కూటమి, ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక, తామూ పాగా వేస్తామంటూ బీజేపీ సిద్ధం కాగా, రేసులో దిగాం అన్నట్టుగా అభ్యర్థుల్ని ప్రజా సంక్షేమ కూటమి ప్రకటించి ఉన్నది. తెలుగు, తమిళం, బిహారి, రాజస్థానీ, మాళయాళీలు, కన్నడిగుల ఓటు బ్యాంక్‌తో పాటు ఉద్యోగ, కార్మిక, వీఐపీల ఓట్లతో నిండిన ఈ జిల్లాలో విజయ బావుటా ఎగుర వేయడం కోసం రాజకీయ పక్షాలు పరుగులు తీస్తున్నాయి. డాక్టర్ రాధాకృష్ణన్ నగర్: ఇది వీవీఐపీ నియోజకవర్గం. మళ్లీ అధికార పగ్గాలు లక్ష్యంగా పరుగులు తీస్తున్న సీఎం జయలలిత సిట్టింగ్ స్థానం. డీఎంకే అభ్యర్థగా సిమ్లా ముత్తు చోళన్ సీఎం జయలలితకు గట్టి పోటీ ఇచ్చేం దుకు సిద్ధమయ్యారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి ఈ సాథనాన్ని వీసీకేకు అప్పగించడంతో ఆ పార్టీ తరఫున ప్రొఫెసర్ వసంతి దేవి పోటీ చేస్తున్నారు. ఇక, సీమాన్ నేతృత్వంలోని నామ్‌తమిళర్ కట్చి సి.దేవి అనే హిజ్రాను రంగంలోకి దించడం గమనార్హం. పెరంబూరు: సీపీఎం సిట్టింగ్ స్థానం ఇది. మళ్లీ గెలుపు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎ సౌందరరాజన్ రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన డీఎంకే కూటమికి చెందిన పెరుందలైవర్ మక్కల్ కట్చి నేత ఎన్ఆర్ ధనపాలన్ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా వెట్రివేల్ పోటీకి దిగారు. విల్లివాక్కం: గత ఎన్నికల్లో ఈ డీఎంకే కోట అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఓటమి చవిచూశారు. ఈ సారి ఆయన ఎన్నికలకు దూరంగా ఉండడంతో, గతంలో ఇదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పలుమార్లు అసెంబ్లీ మెట్లు ఎక్కిన రంగనాథన్ పోటీకి సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా దాడి ఎం రాసు ఢీ కొడుతున్నారు. అయితే, ఈ కంచుకోటను మళ్లీ గుప్పెట్లోకి డీఎంకే తీసుకునేనా అన్నది వేచిచూడాల్సిందే. తిరువికానగర్(రి): అన్నాడీఎంకే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వి నీలకంఠం మళ్లీ రేసులో దిగారు. డీఎంకే అభ్యర్థిగా శివకుమార్ పోటీ చేస్తున్నారు. ఎగ్మూర్(రి): డీఎంకేలో ఓటమి ఎరుగని యోధుడిగా ముందుకు సాగి, గత ఎన్నికల్లో డీఎండీకే డమ్మి అభ్యర్థి నల్లతంబి చేతిలో పరిధి ఇళుంవలది చావు దెబ్బ తిన్నారు. డీఎంకే నుంచి బయటకు వచ్చి అన్నాడీఎంకేలో చేరిన ఆయనకు సీటు మళ్లీ దక్కింది. అయితే, ఈ సారి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు డీఎంకే తరఫున రవి చంద్రన్ రేసులో ఉన్నారు. రాయపురం: తిరుగులేని నాయకుడిగా అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే డి జయకుమార్ ఇక్కడ మళ్లీ రేసులో నిలబడ్డారు. వ్యక్తిగత పలుకుబడి, పార్టీ అండదండాలతో గెలుపునకు పరుగులు తీస్తున్నారు. ఆయన గెలుపునకు కల్లెం వేయడానికి డీఎంకే కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున మళ్లీ రాయపురం మనో రేసులో దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రాయపురం మనో ఈ సారి గెలుపు లక్ష్యంగా ప్రత్యేక మేనిఫెస్టోను నియోజకవర్గానికి సిద్ధం చేసి ఉన్నారు. ఇక, కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థిగా తమిళమానిల కాంగ్రెస్‌కు చెందిన బిజుషాకో పోటీకి దిగారు. హార్బర్: డీఎంకే చేతిలో ఉన్న ఈ స్థానం గత ఎన్నికల్లో అన్నాడీఎంకే గుప్పెట్లోకి చేరింది. అన్నాడీఎంకే అభ్యర్థిగా కరుప్పయ్య గత ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం ఆయన అన్నాడీఎంకేకు దూరం అయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాసన్ రేసులో నిలబడ్డారు. డీఎంకే తరఫున శేఖర్ బాబు బరిలోకి దిగారు. వ్యక్తి గత హవా, పార్టీ బలం కలిసి రానున్నడంతో గెలుపు కోసం పరుగులు తీస్తున్నారు. చేపాక్కం -ట్రిప్లికేన్: ఒకప్పుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిట్టింగ్ స్థానం. ఆయన తన మకాంను గత ఎన్నికల్లో తిరువారూర్‌కు మార్చారు. దీంతో డీఎంకే అభ్యర్థిగా అన్భళగన్ బరిలోకి దిగి విజయ ఢంకా మోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా జె. అన్భళగన్ మళ్లీ రేసులో దిగగా, ఆయన్ను ఢీకొట్టేందుకు మైనారిటీ అభ్యర్థిగా నూర్జాహాన్‌ను అన్నాడీఎంకే రేసులో నిలబెట్టింది. థౌజండ్ లైట్స్: ఇది ఒకప్పుడు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ సిట్టింగ్ స్థానం. తన మకాంను కొళత్తూర్‌కు స్టాలిన్ మార్చేయడంతో గత ఎన్నికల్లో డీఎంకేకు పతనం తప్పలేదు. అన్నాడీఎంకే అభ్యర్థిగా రేసులో నిలబడ్డ వలర్మతి మంత్రిగా ఎదిగారు. మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. డిఎంకే అభ్యర్థిగా సెల్వం పోటీలో ఉన్నారు. అన్నానగర్: డిఎంకే సీనియర్ ఆర్కాట్ వీరాస్వామి ఒకప్పుడు చక్రం తిప్పిన నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో కూటమి ధర్మానికి కట్టుబడికాంగ్రెస్కు అప్పగించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా రేసులో దిగిన గోకుల ఇందిర మంత్రి అయ్యారు. మళ్లీ ఇదే స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సారి డీఎంకే అభ్యర్థి మోహన్ మంత్రితో తలబడుతున్నారు. విరుగ్గంబాక్కం: ఈ నియోజకవర్గం వీఐపీ జాబితాలోకి చేరి ఉన్నది. బిజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆమెను ఢీ కొట్టేందుకు ప్రజా సంక్షేమ కూటమి తరపున డీఎండీకే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి మళ్లీ రేసులో ఉన్నా, అదృష్టం కలిసి వచ్చేనా అన్నది అనుమానమే. ఇక, డీఎంకే అభ్యర్థిగా ధన శేఖర్, అన్నాడీఎంకే అభ్యర్థిగా విరుగై వీఎన్ రవి రేసులో ఉన్నారు. సైదాపేట: అన్నాడీఎంకే వరుసగా ఇక్కడ విజయాలు సాధిస్తూ వస్తున్నది. రెండు సార్లు ఇక్కడ గెలిచిన సెంతమిళన్కు ఈ సారి సీటు దక్కలేదు. అన్నాడీఎంకే అభ్యర్థిగా సి పొన్నయ్య రేసులో ఉన్నారు. ఇక, ఈ సారి అన్నాడీఎంకే గుప్పెట్లో నుంచి ఈ స్థానాన్ని కైవశం చేసుకునేందుకు డీఎంకే అభ్యర్థిగా మాజీ మేయర్ ఎం సుబ్రమణ్యం బరిలో దిగారు. టీ నగర్: అన్నాడీఎంకేకు చెందిన విపి కైళైరాజన్ ఇక్కడ వరుస విజయాలతో దూసుకొచ్చారు. అయితే, ఈ సారి ఆయనకు సీటు ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున సత్యనారాయణ అలియాస్ సత్య బరిలో దిగారు. అయితే, ఈ సారి ఇక్కడ బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా రేసులో ఉండడంతో ఈ నియోజకవర్గం కూడా వీఐపీ జాబితాలోకి చేరింది. ఇన్నాళ్లు ఈ సీటును కాంగ్రెస్‌కు దారాదత్తం చేస్తూ వచ్చిన డీఎంకే ఈ సారి తమ అభ్యర్థిగా కొత్త ముఖంగా మహిళా అభ్యర్థి కనిమొళిని పోటీకి దించారు. మైలాపూర్: దీనిని కూడా వీఐపీ నియోజకవర్గంగా పరిగణించక తప్పదు. మాజీ డీజీపీ నటరాజ్ అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీకి దిగారు. తొలి సారిగా రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి ప్రజల మన్ననలు పొందేయత్నం చేస్తున్నారు. ఆయన్ను ఎదుర్కొనేందుకు డీఎంకే తరఫున కాంగ్రెస్ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. వేళచ్చేరి: గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఈ నియోజకవర్గాన్ని అన్నాడిఎంకే తన గుప్పెట్లోకి తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్‌కు సీటు నిరాకరించడంతో,అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎంిసీ మునుస్వామి రేసులో ఉన్నారు. డీఎంకే అభ్యర్థిగా నటుడు వాగై చంద్రశేఖర్ పోటీకి దిగడంతో ఇది కూడా వీఐపీ జాబితాలోకి చేరింది. కొళత్తూర్: వీవీఐపీ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం. డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ మళ్లీ తన హవాను చాటుకునేందుకు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గట్టి పోటీ ఇవ్వడంతో ఈ సారి భారీ ఆధిక్యం లక్ష్యంగా డీఎంకే వర్గాలు స్టాలిన్ కోసం ఇంటింటా తిరుగుతున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా జేసీడీ ప్రభాకర్ రేసులో దిగారు. మిగిలిన పార్టీలూ ఇక్కడ అభ్యర్థులను దించినా ప్రధాన పోటీ మాత్రం స్టాలిన్, జేసీడీ ప్రభాకర్‌ల మధ్య నెలకొంది. -
అధికారంలోకి రాగానే మద్యనిషేధం
వేలూరు: డీఎంకే పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ఆ పార్టీ ఎన్నికల సమావేశం కార్యదర్శి కనిమొళి తెలిపారు. తిరువణ్ణామలైలో మహిళా విభాగం కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి ఏవావేలు అధ్యక్షతన జరిగింది. కనిమొళి మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా టాస్మాక్ దుకాణాలు అధిక మయ్యాయన్నారు. అదే విధంగా ఐదు సంవత్సరాల్లోనే అధికంగా ప్రమాదాలు జరగడంతో మహిళలు అధికంగా వితంతువులుగా మారారన్నారు. కరుణానధి గతంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కరుణానిధికే దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం సాధించడం ఖాయమని ఇందుకు కార్యకర్తలందరూ ఏకమై కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరిని గుర్తించి సీటు కేటాయించినా అభ్యర్థి కోసం కష్ట పడకుండా పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. పార్టీలో వర్గ బేధాలు లేకుండా ఏకమై సైనికుల్లా పనిచేయగలిగితే విజయం మనవైపే ఉంటుందన్నారు. రాష్ర్టంలోని ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వంపై విరక్తితో ఉన్నారన్నారు. రాష్ర్టంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కరుణానిధిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళా విభాగం కార్యదర్శి విజయలక్ష్మి, తూర్పు జిల్లా కార్యదర్శి లక్ష్మి, జిల్లా కార్యదర్శి శివానందం, మాజీ పార్లమెంట్ సభ్యులు వేణుగోపాల్, మహిళా విభాగం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రూ.500 కోట్లు..80 సీట్లు
డీఎండీకేకు డీఎంకే బేరమని వైగో వివాదాస్పద వ్యాఖ్యలు వైగోకు కరుణానిధి నోటీసులు బీజేపీ, డీఎండీకే ఖండన చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచార యుద్ధం మొదలు కాకముందే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకంపనలు సృష్టించాడు. డీఎండీకేను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే రూ.500 కోట్లు, 80 సీట్లు ఆఫర్ చేసిందని ఆరోపణలు చేయడం కరుణానిధి శిబిరంలో కలకలం రేపింది. ఈ ఆరోపణలు తిప్పికొడుతూ వైగోపై కరుణానిధి కోర్టులో కేసు వేశారు.డీఎండీకేతో పొత్తుపెట్టుకునేందుకు డీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. డీఎంకేలో చేరడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారాలు సాగగా, కరుణానిధి సైతం ఈ ప్రచారాలను బలపరిచారు. అయితే ఆ తరువాత తమ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు విజయకాంత్ ప్రకటించారు. విజయకాంత్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత సైతం డీఎండీకే తమతో కలుస్తుందని కరుణానిధి ఆశాభావ ప్రకటనలు గుప్పించారు. ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొన్న విజయకాంత్ అకస్మాత్తుగా వైగో నాయకత్వంలోని ప్రజాసంక్షేమ కూటమిలో చేరాడు. డీఎండీకే కోసం అంతగా ప్రయత్నించని సంక్షేమ కూటమిలో విజయకాంత్ రాకతో ఆనందాలు వెల్లివిరిశాయి. ఇదే అదనుగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో డీఎంకేను అప్రతిష్ట పాలుచేసే ప్రయత్నం చేశాడు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఎద్దేవా చేశాడు. అలాగే బీజేపీ సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు, రాజ్యసభకు సీటు ఇస్తామని ఆఫర్ చేసి విఫలమైందని వ్యాఖ్యానించాడు. కరుణ ఆగ్రహం-వైగోకు నోటీసులు: డీఎంకేపై వైగో నిరాధార ఆరోపణలు చేశాడని పార్టీ అధ్యక్షులు కరుణానిధి మండిపడ్డారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కరుణానిధి తరఫున న్యాయవాది కే అళగురామన్ శనివారం నోటీసులు పంపారు. కరుణానిధి ప్రతిష్టకు కళంక ం తెచ్చేలా చేసిన వ్యాఖ్యలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుండా సివిల్, క్రిమినల్ పరువునష్టం దావాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వైగో వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసిన అభాండాలు మాత్రమేనని డీఎంకే కోశాధికారి స్టాలిన్ అన్నారు. డీఎండీకేతో తాము ఒక్కసారికూడా చర్చలు జరపలేదని, ఈ విషయాన్ని విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పష్టం చేశారని తెలిపారు. వైగో ఆరోపణలపై కరుణానిధి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. వైగోకు పంపిన కేసులను ఉపసంహరించుకోవాలని కరుణానిధిని ప్రేమలత కోరారు. సీనియర్ నేతగా మీరు ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు, అలాగే విజయకాంత్‌పై కూడా అనేక పరువునష్టం దావాలు ఉన్నాయని చెప్పారు. కోర్టు కేసులకు వైగో భయపడరు, ఎదుర్కొంటారని అన్నారు. ఖండించిన బీజేపీ: డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రివర్గంలో చోటు ఇచ్చేలా బీజేపీ బేరం పెట్టిందన్న వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ అన్నారు. బేరం పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు, విజయకాంత్ అంతటి పెద్దవాడు కాదని వైగో తెలుసుకోవాలని హితవుపలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సైతం తీవ్రస్థాయిలో ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం వైగో అవాకులు చవాకులు పేలరాదని అన్నారు. నేను సిద్ధం: వైగో కరుణానిధి ఇచ్చిన నోటీసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైగో ప్రకటించారు. వారిని కోర్టుకు రానీయండి అన్నారు. కరుణానిధి నోటీసులు ఇవ్వడం, కేసులు పెడతామని హెచ్చరించడాన్ని స్వాగతిస్తున్నానని వైగో వ్యాఖ్యానించారు. -
రాజకీయాల్లో రాణించడం తప్పా? : కుష్బూ
టీ నగర్: మహిళలను విమర్శలకు గురిచేస్తూ అడ్డుకుంటున్నారని, రాజకీయాల్లో మహిళలు రాణించడం తప్పా? అంటూ నటి కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అనేక పార్టీలు ఉండగా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారని కొందరు ప్రశ్నించగా తనకు చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఏర్పడిందన్నారు. ఇంట్లోవున్న తన గదిలో రాజీవ్ గాంధీ చిత్రాలను అతికించానన్నారు. దేశం పట్ల, ప్రజల పట్ల అధిక శ్రద్ధ కలిగిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల ఆ పార్టీలో చేరానని బదులిచ్చారు. డీఎంకే నుంచి వైదొలగిన కారణాన్ని ఇంతవరకు తెలియజేయకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించగా, అది ముగిసిపోయిన వ్యవహారమని, దానిగురించి ప్రస్తుతం ప్రస్తావించదలచుకోలేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని పేర్కొంటున్నారే అని ప్రశ్నించగా ఇప్పుడే దీన్ని నిర్ణయిస్తే ఎన్నికల కమిషన్ ఎందుకు ఎన్నికలు జరపాలంటూ ఎదురు ప్రశ్న వేశారు. మహిళలు రాజకీయంగా ఎదక్కుండా పలువురు అడ్డుపడుతుంటారని, మహిళలు రాజకీయాలలో రాణించడం తప్పా? అని ప్రశ్నించారు. -
మాకంటూ ఓటు బ్యాంకు ఉంది: కనిమొళి
కేకే.నగర్: విజయకాంత్ ఒంటరిగా పోటీ చేస్తే తమకు ఎలాంటి నష్టం ఉండదని అన్నాడీఎంకే ఓట్లన్నీ డీఎంకేకే వస్తాయని డీఎంకే ఎంపీ కనిమొళి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే ప్రధాన పార్టీలుగా ఢీకొననున్నాయి. డీఎండీకే ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలిపి 28 స్థానాలను గెలిచింది. అనంతరం డీఎండీకే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కూటమి చేరింది. అయితే ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ స్థితిలో డీఎండీకేకు డీఎంకే నుంచి పిలుపువచ్చింది. రహస్య సమావేశాలు జరిగాయి. అయితే పొత్తు కుదరలేదు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఏ పార్టీలతో కూటమి చేరాలనేది వారి వ్యక్తిగత విషయం అన్నారు. తాము కూటమి కోసం కొన్ని పార్టీలను ఆహ్వానించామని అదే విధంగా విజయకాంత్‌ను పిలిచామే కానీ అతడిని బలవంత పెట్టలేదన్నారు. అయితే విజయకాంత్ నిర్ణయం వలన డీఎంకేకు నష్టం లేదని తమకంటూ ఓటు బ్యాంక్ ఉందన్నారు. తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగలదని, కొత్త పార్టీలు, కూటమిలు తమ విజయాన్ని అడ్డుకోలేవని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఇతర పార్టీలకు ఓటు వేసి ఓట్లును నిరుపయోగం చేయరని డీఎంకేకు తమ ఓట్లును వేసి సద్వినియోగం చేసుకుంటారని కనిమొళి తెలిపారు. -
కెప్టెన్ సీఎం
సాక్షి, చెన్నై : బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలతో బుధవారం తమిళ మీడియాల్లో వెలువడ్డ సమాచారం డీఎంకే, డీఎండీకే కేడర్‌నే కాదు, కమలం వర్గాల్ని విస్మయంలో పడేశాయి. అనూహ్యంగా రాజకీయ మలుపు తిరగడంతో చర్చ బయలు దేరింది.పది శాతం ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతున్న విషయం తెలిసిందే. నాన్చుడు ధోరణి అనుసరించే విజయకాంత్ ఇంత వరకు తన మదిలో మాటను బయటకు పెట్ట లేదు. భవిష్యత్తు దృష్ట్యా,ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవడమే శ్రేయస్కరం అన్న నిర్ణయంతో ఆయన ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. అయితే, తమ వైపుకు విజయకాంత్‌ను తిప్పుకునేందుకు జాతీయ పార్టీ కమలం తీవ్రంగానే కుస్తీలు పడుతున్నది. అదే సమయంలో ఊహా జనిత కథనాలపై ఇన్నాళ్లు నోరు మెదపని డీఎంకే అధినేత ఎం కరుణానిధి మంగళవారం విజయకాంత్ తమ వెంటే అని ప్రకటించేశారు. దీంతో కమలం ఆశలు అడియాశలైనట్టు అయ్యాయి. ఒక ఒంటరిగా మిగాల్సిన పరిస్థితి వారికి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఢిల్లీలో తమిళ మీడియాతో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ , కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడినట్టుగా తమిళ మీడియాల్లో వచ్చిన సమాచారం రాజకీయంగా కొత్త మలుపును తిప్పినట్టు అయింది. కెప్టెన్ సీఎం : జవదేకర్ మాట్లాడినట్టుగా కొన్ని చానళ్లు ఫ్లాష్ ..న్యూస్‌లతో సమాచారాల్ని ప్రసారం చేశాయి. డీఎండీకే నేతృత్వంలో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు జవదేకర్ వ్యాఖ్యానించారని అందులో పేర్కొన్నారు. అలాగే, డీఎండీకేకు 50 శాతం సీట్లు, ప్రజా కూటమిలో ఉన్న వీసీకే కలిసి వస్తే కొన్నిసీట్లు, ఇతర చిన్న పార్టీలకు సర్దుబాటు పోగా, మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇక, డీఎండీకే నేతృత్వంలోని కూటమికి సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటి ంచేందుకు తాము సిద్ధం అని జవదేకర్ వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ ఫ్లాష్..న్యూస్..డీఎంకేకు షాక్ ఇచ్చినట్టు చేసింది. అలాగే, విజయకాంత్ సతీమణి ప్రేమలత పొత్తు మంతనాల్లో ఉన్నారని వ్యాఖ్యానించడంతో ఇక, పండు పక్వానికి వచ్చి పాలల్లో పడుతుందనుకుంటే, పక్కదారి పట్టిందేంటబ్బా...? అన్న డైలమాలో డిఎంకే వర్గాలు పడ్డాయి. అదే సమయంలో డీఎండీకే వర్గాలు సైతం విస్మయంలో పడ్డాయి. ప్రేమలత విజయకాంత్ జవదేకర్‌తో ఎప్పుడు సంప్రదింపులు జరిపినట్టు, ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్‌ఎప్పుడు తీసుకున్నట్టు అన్న సందిగ్ధంలో పడ్డారు. ఇక, బీజేపీ వర్గాలకు సైతం ఈ ఫ్లాష్ ..న్యూస్‌లు ఆశ్చర్యాన్ని కల్గించాయి. తమతో కనీసం సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారన్న సందిగ్దంలో పడ్డారు. చివరకు ఢిల్లీకి వ్యవహారం చేరడంతో అవన్నీ తమిళ మీడియా సృష్టిగా తేలాయి. రాజ్య సభలో జవదేకర్ ఉన్నారని, అలాంటప్పుడు ఆయన మీడియాతో ఎలా మాట్లాడటం జరిగిందంటూ ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడింది. అలాగే, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, తమతో సంప్రదింపులు జరపకుండా జవదేకర్ ఎలా ప్రకటిస్తారని, పొత్తు ,సీట్ల పందేరాల వ్యవహారాల్లో తమ ప్రమేయం కూడా ఉంటుందన్న విషయాన్ని మీడియా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన చురకలు అంటించారు. ఇక, డీఎంకే వర్గాలు మాత్రం, తమతో డీఎండీకే పొత్తును చెడగొట్టడం లక్ష్యంగానే కొన్ని మీడియాలు ఈ ఫ్లాష్.... సృష్టించి ఉన్నాయని ఆయన మండి పడుతున్నారు. కేడర్‌లో గందరగోళం సృష్టించే విధంగా వ్యవహారాలు సాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ధ్వజమెత్తారు. -
పొత్తు ప్రయత్నాలను చెడగొట్టద్దు
- మీడియాకు స్టాలిన్ చురక - రసవత్తరంగా అసెంబ్లీ పోరు - కరుణ ప్రచార పయనం - ప్రత్యేక వాహనం సిద్ధం ఊహా జనిత కథనాలతో పొత్తు ప్రయత్నాల్ని చెడగొట్టద్దని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఆ పాపాన్ని తమరెందుకు మూట గట్టకుంటారంటూ మీడియాకు చురకలు అంటించారు. ఈ సారి ప్రచార పయనానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని హంగులతో ప్రచార రథం కోయంబత్తూరులో రూపుదిద్దుకుంటోంది. సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు లక్ష్యంగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఈ సారి చాన్స్ చేజారిన పక్షంలో కష్టాలు తప్పవన్న భావనతో ప్రజలతో మమేకమయ్యే దిశగా డీఎంకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు డీఎంకేను ఇరకాటంలో పడేస్తున్నాయి. పొత్తు కసరత్తుల్లో గానీయండి, సీట్ల పందేరాల్లో గానీయండి, ఆశావహుల ఎంపికలో డీఎంకే వైఖరిని ఎత్తి చూపుతూ వస్తున్న ఈ కథనాలపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్న సమయంలో వస్తున్న కథనాలు, పొత్తు ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించే రీతిలో ఎదురు అవుతున్న పరిణామాల్ని స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. ఆదివారం తిరుచ్చి వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ప్రతినిధులకు చురకలు అంటించే ప్రయత్నాన్ని స్టాలిన్ చేశారు. ఊహా జనిత కథనాల్ని దయ చేసి కట్టి పెట్టాలని విన్నవించారు. ఈ కథనాలతో పొత్తు ప్రయత్నాలను చెడగొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. పొత్తు, సీట్ల పందేరాలన్నీ కొలిక్కి వచ్చాక, తామే స్వయంగా మీడియాను పిలిచి వివరిస్తామన్నారు. అంత వరకు ఊహా జనిత కథనాలను కట్టి బెడితే మంచిదని, ఆ పాపాన్ని తమరెందుకు మూటగట్టుకుంటారంటూ చురకలు అంటించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్నాయని, తదుపరి అధినేత అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేపడుతారని, అనంతరం పొత్తు ప్రయత్నాలు, సీట్ల పందేరాలు ఉంటాయని వివరించారు. ఇక, తాము చేస్తున్న ఫిర్యాదులపై ఈసీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూస్తామని, లేని పక్షంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అనంతరం తిరుచ్చి చేరుకున్న స్టాలిన్‌కు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. మహిళా విభాగం నేతృత్వంలో ఎన్నికల ప్రచార పర్యటనలపై జరిగిన సమావేశంలో స్టాలిన్ పాల్గొన్నారు. వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రజా సంక్షేమ సిబ్బందితో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే, సమస్యలన్ని పరిష్కరించ బడుతాయని హామీ ఇచ్చారు. కరుణ కోసం రథం : డీఎంకే అధినేత ఎం కరుణానిధి వయోభారంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల బహిరంగ సభల మినహా, ప్రచారంలోకి ఆయన వెళ్ల లేదు. అయితే, ఈ సారి రాష్ర్టంలో పర్యటించేందుకు కరుణానిధి సిద్ధమయ్యారు. తన పర్యటనకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేయిస్తున్నారు. కోయంబత్తూరులో ఈ వాహనం రూపుదిద్దుకుంటోంది. వీల్ చైర్లో కరుణానిధి ముందుకు సాగుతున్న దృష్ట్యా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఆ వాహనంలో సాగుతున్నది. హోం థియేటర్, టీవీ, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అమరికలు, మైక్రో ఫోన్, వైఫై, సౌకర్యాలతో పాటుగా డిజిటల్ టెక్నాలజీతో కూడిన అతి పెద్ద లౌడ్ స్పీకర్లు తదితర ఏర్పాట్లను అందులో చేస్తున్నారు. ఈ వాహనంలో కరుణానిధికి ఎలాంటి ఇబ్బందులు కల్గని రీతిలో అమరికలు జరుగుతుండడంతో, ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కరుణానిధి పర్యటించే అవకాశం ఉండడంతో డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
మహిళా ద్రోహి జయ: కనిమొళి
టీనగర్: స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొనడం మోసపూరిత ప్రకటనేనని డీఎంకే ఎంపీ కనిమొళి ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం రాత్రి 12.30 గంటలకు తిరుచ్చి నుంచి విమానం ద్వారా చెన్నై చేరుకున్నారు. అ క్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారని, ఇది అమలులోకి రావడం సాధ్యమేనా? అనేది సందేహాస్పదమేనన్నారు. మహిళల 50 శాతం రిజర్వేషన్లకు తగినట్లుగా స్థానిక సంస్థల నియోజకవర్గాలను పునర్విభజించాల్సి వుందన్నారు. ఇవన్నీ చేపట్టడానికే అనేక నెలలు పడుతుందని, అయితే స్థాని క సంస్థల ఎన్నికలకు స్వల్ప సమయమే వుందన్నారు. ఈ లోపున కార్యాచరణ అసాధ్యమేనని, అందువల్ల ఇది కూడా తమిళ మహిళలను మోసగించే వ్యర్థ ప్రకటనగా భావించవచ్చన్నారు. పార్లమెంటు సమావేశాల్లో శ్రీలం క నౌకాదళం చేత తమిళ జాలర్లు తరచూ దాడులకు గురవడం, జైలు నిర్బంధానికి గురికావడం, జాలర్ల పడవలను శ్రీలంక నుంచి విడిపించడం వంటి సమస్యలపై డీఎంకే వివాదాన్ని లేవదీస్తుందన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వరద నష్టానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని వత్తిడి తెస్తామన్నారు. -
మిస్ కాల్ కొట్టు..
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. వినూత్న తరహాలో మిస్డ్ కాల్ కొట్టూ, అంటూ ఫ్యాన్సీ నంబర్‌గా 7220072200ను ప్రకటించారు. ఇక ఎన్నికల బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమయ్యారు. సీట్ల పందేరానికి దళపతి స్టాలిన్ నేతృత్వంలో కమిటీని నియమించారు. * వినూత్నంగా కరుణ ప్రచారం * ప్రచారానికి 7220072200 ఫ్యాన్సీ నంబర్ * 22 నుంచి ఆశావహుల ఇంటర్వ్యూ * సీట్ల పందేరానికి ‘స్టాలిన్’ కమిటీ సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి అందరి కన్నా ముందుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లు వంటి మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్న కరుణానిధి, మంగళవారం తన ప్రత్యేక ప్రసంగం కోసం మిస్డ్ కాల్ కొట్టూ అంటూ ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ప్రకటించేశారు. వినూత్న రీతిలో ఆసక్తి గల వారు.. మిస్డ్ కాల్ కొట్టూ అంటూ మొబైల్ ఫోన్లలో ఈ ఫ్యాన్సీ నంబర్ ప్రత్యక్షం అవుతున్నాయి. దీనికి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, కొన్ని క్షణాల్లో ల్యాండ్ లైన్ నంబర్ నుంచి కాల్ రావడం, నేను మీ..కరుణానిధి అంటూ ప్రసంగం, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ముప్పై నిమిషాల పాటుగా ప్రచారం సాగుతుండడం గమనార్హం. అయితే, ప్రసంగం వినేందుకు ఓపిక ఉండాలే గానీ, మిస్డ్ కాల్ కొట్టిన వాళ్లకు మాత్రం ఎలాంటి చార్జీల భారం ఉండదు. ఇంటర్వ్యూలు : డీఎంకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన పర్వం ముగిసింది. ఇక, ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎన్నికల బరిలో దించేందుకు తగ్గ కసరత్తుల్లో కరుణానిధి నిమగ్నం అయ్యారు. ఈనెల 22 నుంచి 27వ తేది వ రకు అన్నా అరివాలయంలో ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు. 22న ఉదయం తొమ్మిది గంటలకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా, సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 23న ఉదయం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం, 24న ఉదయం తొమ్మిది గంటలకు పుదుకోట్టై, నామక్కల్, తిరుప్పూర్, సాయంత్రం నాలుగు గంటలకు కరూర్, పెరంబలూరు, అరియలూరు, 25న ఉదయం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు, సాయంత్రం విల్లుపురం, ధర్మపురి , కృష్ణగిరి, 26న ఉదయం తిరువణ్ణామలై, వేలూరు, కాంచీపురం, సాయంత్రం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహుల ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇక, 27వ తేది ఉదయం పుదుచ్చేరి, కారైక్కాల్లలోని ఆశావహుల ఇంటర్వ్యూలు జరుగుతాయని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. స్టాలిన్ కమిటీ : బలమైన కూటమి లక్ష్యంగా డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌లు డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఇక, మరికొన్ని కుల, మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలతో పాటుగా డీఎండీకే ఈ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం సాగుతున్నది. ఈ పార్టీలతో పొత్తులు ఖరారు చేయడంతో పాటుగా, సీట్ల పందేరం కొలిక్కి తెచ్చేందుకు తగ్గట్టుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నాయకులు దురై మురుగన్, టీఆర్ బాలుల కమిటీని రంగంలోకి దించనున్నారు. -
అధికారం మాదే!
‘రానున్న ఎన్నికల్లో మార్పు తథ్యం... అధికారం మాదే...!’ అని ప్రజా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా తొలి సంతకాలు ఉంటాయని ప్రకటించారు. తదుపరి అవినీతి సొమ్ముతో అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టిన ఆస్తుల్ని జప్తు చేస్తామన్నారు. * మద్యం , అవినీతి నిర్మూలనే లక్ష్యంగా తొలి సంతకం * అన్నాడీఎంకే, డీఎంకే అవినీతి ఆస్తుల జప్తు * ప్రజా కూటమి నేతల ప్రకటన * మోగిన ‘ప్రజా’ ప్రచార గంట * ప్రజా స్పందనతో ఆనందం సాక్షి, చెన్నై : ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ప్రజా సంక్షేమ కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పయనానికి శ్రీకారం చుడుతూ ప్రచార భేరికి ఈ కూటమి నేతలు వైగో, తిరుమావళవన్, జి రామకృష్ణన్, ముత్తరసన్ సిద్ధమయ్యారు. ఆదివారం కడలూరు వేదికగా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజకీయ మార్పు లక్ష్యంగా ప్రజా చైతన్య పయనం నినాదంతో ఈ ప్రచార భేరి చేపట్టారు. కడలూరులో జరిగిన తొలి ప్రచార సభకు జనం నుంచి అమిత స్పందన రావడంతో ఆ కూటమి వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, చిదంబరంలో జరిగిన మరో ప్రచార సభకు సైతం జనం తరలిరావడంతో, ఆరంభం సక్సెస్‌తో ఇక, అధికారం తమదేనన్న ధీమా ఆ కూటమి నేతల్లో నెలకొన్నట్టైంది. అధికారి మాదే : ప్రచార భేరిలో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ప్రసంగిస్తూ, ప్రజా కూటమిని చీల్చేందుకు రక రకాలుగా కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. తొలుత ఇయక్కంగా, తదుపరి కూటమిగా ఆవిర్భవించిన ఈ ప్రజా కూటమి రానున్న ఎన్నికల్లో మెగా విజయంతో అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ శుభగడియలు వచ్చాయని ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడకు ప్రజా సమూహం తరలి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు మార్చి మార్చి రాష్ట్రాన్ని గత నలభై ఏళ్లుగా దోచుకుంటూ వచ్చాయని ఆరోపించారు. దోపిడి లక్ష్యంగా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, అయితే, ఆ దోపిడీ సొమ్మును వారి నుంచి లాక్కుని ప్రజలకు ఇచ్చేందుకు తాము ముందుకు వచ్చి ఉన్నామన్నారు. ప్రజా హిత కార్యక్రమాలతో ముందుకు సాగుతూ వచ్చిన తమ కూటమి రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికార మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారని, తమ ఓటు ఆయుధంతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధం అయ్యారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం, భావి తమిళనాడును తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రజల్లోకి వచ్చిన తమ కూటమి అధికారంలోకి రాగానే, కీలక నిర్ణయాలకు సిద్ధం అయిందని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకం మద్య నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా ఉంటాయన్నారు. తదుపరి రాష్ట్రాన్ని దోచుకుని అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టుకుని ఉన్న ఆస్తుల్ని జప్తు చేసి, ప్రజలకు పంచడం లక్ష్యంగా తమ పయనం ఉంటుందని ప్రకటించారు. -
కెప్టెన్‌కి డీఎంకే గాలం
టీనగర్: తమ కూటమి నుంచి విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఆరోపించారు. ఇది సత్సంప్రదాయం కాదని మండిపడ్డారు. హెచ్.రాజా శుక్రవారం చెన్నై టీనగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని హిందువులు ఎటువంటి గొడవల్లోనూ పాల్గొనరని తెలిపారు. ముస్లిం తీవ్రవాదులు మాత్రమే రాష్ట్రంలో ఏదో ఒక ఉత్పాతాన్ని సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేసిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ప్రజలు మౌనం పాటిస్తూ, రాష్ట్రంలో ప్రతి ఏడాదీ డిసెంబర్ ఆరో తేదీన స్మారకదినం అంటూ ఉద్రిక్త వాతావరణాన్ని కలిగిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం కొత్త సంవత్సరంలో మొదటి రోజుని వాణియంబాడి న్యూటౌన్‌లో అవాంఛనీయ సంఘటనకు శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. బీజేపీకి చెందిన జిల్లా మాజీ నిర్వాహకుడు శివప్రకాశంపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. ఆంబూరు ఉద్రిక్తతకు సంబంధించి అరెస్టయిన ముస్లిం తీవ్రవాదులు బెయిలుపై విడుదలై స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాజా పేర్కొన్నారు. వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి సూచించారు. మహిళలు లెగిన్స్, జీన్స్ ధరించి ఆలయాలకు వెళ్లడాన్ని నిషేధించడం హర్షణీయమని, దీన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువులు, జలాశయాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించడం వల్లే చెన్నై నగరానికి వరదలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఆక్రమణలు డీఎంకే ప్రభుత్వ హయాంలోనే అధికంగా జరిగాయన్నారు. విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలంటూ కరుణానిధి ఆహ్వానించడంపై విలేకరులు ప్రశ్నించగా విజయకాంత్ తమ కూటమిలోనే ఉన్నారని రాజా స్పష్టం చేశారు. ఈ కూటమి ఇంకా కొనసాగుతోందన్నారు. విజయ్ కాంత్ ని డీఎంకే ఆహ్వానించడం సత్సంప్రదాయం కాదని విమర్శించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ ఉన్నారు. -
స్టాలినే వారసుడు
ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) భావి రథసారథిగా స్టాలిన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ నేతృత్వానికి స్టాలిన్ అన్ని రకాల అర్హుడని తనకు తానుగా నిరూపించుకున్నాడని కరుణ కితాబిచ్చారు. తన వారసుడు ఆయనేనని పార్టీ అధినేత కరుణానిధి మంగళవారం మరోసారి స్పష్టం చేశారు. చెన్నై: వారసత్వ రాజకీయాలు మామూలైపోయిన ఈ రోజుల్లో తమిళనాట సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేలో కరుణ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళతాయనే అంశం కొన్నేళ్లుగా నానుతోంది. 92 ఏళ్ల కరుణానిధికి వారసుని ఎంపిక అనివార్యమైంది. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై 1969లో మరణించిన తర్వాత నుంచి పార్టీ బాధ్యతలను కరుణానిధినే నిర్వర్తిస్తున్నారు. డీఎంకేలో కరుణ తర్వాత కీలకనేతగా చెలామణి అయిన ఎంజీ రామచంద్రన్ ఆయనతో విభేదించి అన్నాడీఎంకే పేరుతో మరో పార్టీ పెట్టుకోవడంతో పార్టీలో కరుణ పెత్తనానికి ఎదురులేకుండా పోయింది. రాజకీయ చతురుడిగా, మంచి వక్తగా పార్టీని పరుగులు పెట్టించిన కరుణానిధి అనేకసార్లు అధికారంలోకి తేగలిగారు. నడవలేని స్థితిలో పూర్తిగా మూడు చక్రాల వాహనానికి పరిమితమైనా అపారమైన జ్ఞాపకశక్తి కరుణకు ఒక వరంగా పరిణమించి పార్టీకి పెద్ద దిక్కుగా నేటికీ నిలిపింది. అయితే ఎప్పటికైనా డీఎంకే పగ్గాలు మరో చేతికి మారక తప్పదనే వాస్తవం వారసత్వ చర్చకు మూడేళ్ల క్రితమే తెరలేచింది. అళగిరి అవుట్‌తో లైన్‌క్లియర్.. ఆస్తి పంపకాలైనా, పార్టీ పగ్గాలైన పెద్ద కుమారుని ఆధిపత్యం షరా మామూలే. డీఎంకే అధినేత కరుణానిధికి రెండు కళ్లుగా చెలామణి అయిన పెద్ద కుమారుడు అళగిరి, రెండో కుమారుడు స్టాలిన్ మధ్య వారసత్వ పోరు బయలుదేరింది. మదురై కేంద్రంగా రాజకీయాలు నడిపే అళగిరి కంటే చెన్నైలోనే ఉండే తండ్రి కరుణకు చేరువగా నిలిచే స్టాలిన్‌దే సహజంగా పైచేయిగా మారింది. పార్టీలో స్టాలిన్ పెత్తనాన్ని సహించలేని అళగిరి తండ్రిపైనే తిరుగుబాటు చేసి పార్టీకీ దూరమై క్రమేణా బహిష్కృతుడయ్యాడు. రాజకీయ చాణక్యాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న స్టాలిన్ తన సోదరుడైన అళగిరిని తనదైన శైలిలో అడ్డు తప్పించుకున్నాడు. స్టాలిన్ వారసత్వాన్ని గతంలో కరుణ పరోక్షంగా ప్రకటించినపుడు డీఎంకేలో ఉండిన నటి ఖుష్బు విమర్శలు గుప్పించారు. అదను కోసం కాచుకుని ఉండిన స్టాలిన్ ఖుష్బు సైతం పార్టీని వీడిపోయే పరిస్థితులు కల్పించారు. ఈ రకంగా పార్టీపై ఆధిపత్యం కోసం పావులు కదుపుకుంటూ వచ్చిన స్టాలిన్ క్రమేణా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు స్టాలిన్ చేపట్టిన ‘నమక్కు నామే’ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం కరుణానిధిని ఆనందపరుస్తోంది. పార్టీ నాయకత్వానికి స్టాలిన్ తగినవాడు : కరుణ డీఎంకే అధినేత కరుణానిధి మంగళవారం తనను కలిసిన మీడియా ముందు వారసత్వంపై మరోసారి నోరువిప్పారు. డీఎంకే కేవలం ఒకరు పెట్టిన పార్టీ కాదు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య భావాలు, విలువలు కలబోసిన పార్టీ అన్నారు. ప్రజలు కోరినట్లుగానే పార్టీలో నిర్ణయాలు జరుగుతాయని ఇప్పటికే తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. పార్టీ సర్వసభ్వ సమావేశం, కార్యవర్గం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తానొక్కడిని తీసుకోజాలనని చెప్పారు. తాను ప్రకటించకుండానే పార్టీ ప్రధాన బాధ్యతలకు తగిన వ్యక్తిగా స్టాలిన్ వెలుగొందుతున్న వాస్తవాన్ని పార్టీలోని ప్రతిఒక్కరూ గుర్తించారని పేర్కొన్నారు. తద్వారా డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని కరుణానిధి మరోసారి తేల్చేశారు. -
యాక్టర్ స్టాలిన్
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మళ్లీ నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యారు. 30 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం లఘు చిత్రంలో స్వయంగా నటించేందుకు అన్నాడీఎంకేతో యాక్షన్‌కు దళపతి రెడీ అయ్యారు. సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ప్రజాకర్షణ దిశగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఓ వైపు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తనదైన శైలిలో ముందుకు సాగుతుంటే, మరోవైపు పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. నియోజకవర్గాల బాటతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, టీవీల్లో ప్రకటనల నిమిత్తం ప్రత్యేకంగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఇందులో స్వయంగా తానే నటించేందుకు సిద్ధం అయ్యారు. ప్రత్యేక ఆకర్షణ అన్నాడీఎంకే సర్కారు తీరు, ైవె ఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకె ళ్లడం కోసం ప్రత్యేక ఆకర్షణగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు స్టాలిన్ కసరత్తులు చేసి ఉన్నారు. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ముఖానికి మేకప్ వేసుకుని మరీ సిద్ధం అవుతున్నారు. నగర శివారులోని ఓ థీమ్ పార్క్‌లో ఈ లఘు చిత్రం రూపొందించబోతున్నారు. ఇందులో ఎంకే స్టాలిన్ కీలక భూమిక పోషిస్తూ, అధికార పక్షాన్ని ఎండగట్టనున్నారు. ఈ లఘు చిత్రాన్ని తొలుత కలైంజర్ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. వేదికలు, బహిరంగ సభల్లోనే అధికార పక్షాన్ని కడిగి పారేసే స్టాలిన్, ఇక ఈ లఘు చిత్రంలో తన నటన ద్వారా ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకోబోతున్నారో వేచి చూడాల్సిందే. అయితే స్టాలిన్‌కు నటన కొత్త కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కెమెరా ముందుకు రావడం ఆయనకు అలవాటే. 1987లో కరుణానిధి రూపొందించిన ఒరే రక్తం చిత్రంలో స్టాలిన్ నటించారు. ఇందులో విప్లవ యువకుడి పాత్రలో స్టాలిన్ అందరి మన్ననల్ని దక్కించుకున్నారు. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమై ప్రజాదరణ పొందిన కురింజి మలర్ ధారావాహికలో నటించి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, ఎన్నికల ప్రచార లఘు చిత్రం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే నటనతో స్టాలిన్ అలరించే అవకాశాలు ఎక్కువే. -
మద్య నిషేధం తప్పనిసరి
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టగానే మద్య నిషేధంపై తప్పని సరిగా నిర్ణయం తీసుకుని తీరుతామని డీఎంకే మహిళా మహానాడు స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసింది. 2016లో డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. సమిష్టిగా కార్యకర్తలు, నాయకులు శ్రమించాలని అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. డీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన అధినేత కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి తన దైన శైలిలో దూసుకెళ్తున్నారు. మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్న కనిమొళి, తన నేతృత్వంలో భారీ మహానాడును నిర్వహించి తన సత్తాను చాటుకునే యత్నం చేశారు. మద్యం వ్యతిరేక మహిళా మహానాడుగా కాంచీపురం జిల్లా పడప్పై సమీపంలోని కరశంగాళ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జన సందోహం తరలి వచ్చింది. ఈ మహానాడుకు హాజరైన డీఎంకే అధినేత ఎంకరుణానిధి, ఎంకే స్టాలిన్లకు ఆ పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఈ మహానాడు వేదికగా ఎంకే స్టాలిన్ ప్రసంగిస్తూ , 2016లో డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమన్నారు. అధినేత ఎం కరుణానిధి సీఎం పగ్గాలు చేపట్టి తీరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరుణానిధి తన ప్రసంగంలో మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ వ్యాఖ్యలు చేశారు. సమిష్టిగా, ఐక్యతతో నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపు నిచ్చారు. ముందుగా ఈ మహానాడు ద్వారా కొన్ని తీర్మాణాలు చేశారు. డీఎంకే అధికారంలోకి రాగానే మద్య నిషేధం లక్ష్యంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లోనైనా రాష్ట్రప్రభుత్వం మద్య నిషేధంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాం డ్ చేశారు. మద్య నిషేధంపై ప్రకటన తప్పని సరిగా చేయాల్సిందేనని పట్టుబట్టారు. మద్యంకు వ్యతిరేకంగా సాగిన నిరసనల్లో అరెస్టు చేసిన వారందర్నీ విడుదల చేయాలని, కేసులన్నీ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వాన్ని సాగనంపండి
తమిళనాడును ప్రశాంతత లేని రాష్ట్రంగా తయారుచేసిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే కోశాధికారి స్టాలిన్ కడలూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:కడలూరు జిల్లా పరంగిపేటలో శనివారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగిస్తూ, డీఎంకే అభిమానులు, సానుభూతిపరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి పథకం ప్రకారం తొలగించే కార్యక్రమం రాష్ట్రంలో సాగుతోందని ఆరోపించారు. అన్నాడీఎంకే వారిని పెద్దశాతంలో జాబితాలో చేరుస్తున్నారని అన్నారు. ప్రతి వార్డులో ప్రతి 10-15 ఓట్లలో కనీసం ఇద్దరిని తొలగిస్తున్నట్లుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. డీఎంకే హయాంలో ప్రభుత్వ పథకాల్లో పేద, బలహీన బడుగు వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లకు అమ్మ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లగా ఆ పథకాలకు తమ పేర్లు పెట్టుకుని అన్నాడీఎంకే పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలే ఏర్పడలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో 236 పథకాలను ప్రకటించగా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని ఆయన చెప్పారు. గత నాలుగేళ్ల అన్నాడీఎంకే పాలనతో ప్రజలు ఆవేదన అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతలు సున్నాగా మారాయని విమర్శించారు. ప్రగతి, ప్రశాంతతో కూడిన రాష్ట్రం కావాలంటే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆగ్రహావేశాలతో సాగిన స్టాలిన్ ప్రసంగాన్ని లక్షలాది మంది ప్రజలు ఆసక్తితో తిలకించారు. -
ఆ తీర్పును నిషేధించండి
సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్ చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషిగా బైటపడడంపై డీఎంకే న్యాయ పోరాటానికి శ్రీకారం చు ట్టింది. జయ కేసులో తాజా తీర్పు పై నిషేధం విధించాలంటూ డీఎం కే సోమవారం సుప్రీం కోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. జయపై దాఖలైన ఆదాయానికి మిం చిన ఆస్తుల కేసు విచారణ కొన్నేళ్లు చెన్నైలో మరికొన్నేళ్లు బెంగళూరులో సాగింది. మొత్తం 18 ఏళ్లపాటు సాగిన విచారణ పూర్తికాగానే కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయతోపాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు సైతం నాలుగే ళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా పడింది. తనపై వచ్చిన తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసి అనూహ్యరీతిలో జయలలిత నిర్దోషిగా బైటపడ్డారు. ఆపై జయ మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. జయ అవినీతే ప్రధాన అస్త్రంగా రాబోయే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని ఆశించి భంగపడిన డీఎంకే, జయ ఆస్తుల కేసులో తాజాగా వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని మేలో నిర్వహించిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో తీర్మానించింది. డీఎంకే సీనియర్ న్యాయవాది వీజీ ప్రకాశం నెలరోజులుగా కసరత్తు చేసి పిటిషన్ సిద్ధం చేశారు. పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ పేరున సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయ సహా నలుగురు గ్రూపుగా మారి అక్రమాస్తులను కూడగట్టారని, ఈ వివరాలను కోర్టుకు వివరించినా ఎటువంటి కారణం చూపకుండా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వారందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టారని వివరించారు. జయను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆ పిటిషన్లో కోరారు -
కరుణానిధి జన్మదిన వేడుకలకు దూరం
హొసూరు : తమిళనాడులోప్రాంతీయ పార్టీలు తమ నాయకుల జన్మదిన వేడుకలను ప్రచార ఆర్భాటంతో ఘనంగా జరుపుకొని సంతోషపడడం ఆనవాయితీ. అయితే డీఎంకే సీనియర్ నాయకుడు, కురవృద్ధుడు కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను జూన్ 3వ తేదీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ క్రిష్ణగిరి పడమర జిల్లా డీఎంకే నేతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా డీఎంకే పార్టీ స్టాలిన్, కరుణానిధి వంటి అగ్రనేతల జన్మదినవేడుకల నిర్వహణకు గతంలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించి చర్చించడం, ఆ తర్వాత సమితి స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలను, నాయకులను చైతన్యం చేసేవారు. గోడలపై ప్రచారం, రంగు రంగుల ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసేవారు. 15 రోజులు, ఒక్కొక్క సారి నెలరోజుల ముందుగానే ప్రచారం చేసేవారు. ప్రస్తుతం క్రిష్ణగిరి జిల్లా పడమర డీఎంకే కార్యదర్శి వై.ప్రకాష్ మొక్కుబడిగా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. క్రిష్ణగిరి జిల్లాలో పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలు కూడా అమలు జరపడంలో జిల్లా కమిటీ ఎందుకో మౌనంగానే ఉంది. డీఎంకే పార్టీలో జోడు పదవుల విషయంలో క్రిష్ణగిరి పడమర జిల్లా కార్యదర్శి వై.ప్రకాష్‌కు ఇష్టం లేనట్లుందని విమర్శలు వస్తున్నాయి. హొసూరు మున్సిపాలిటీలోఅనేక మంది డీఎంకే నాయకులు జోడు పదవులపై స్వారీ చేస్తున్నారని, వీరిపై పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం లేదనే వాదన డీఎంకేలోనే బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. జిల్లా పార్టీ కార్యదర్శి పదవి, జిల్లా పార్టీ యువజన అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడంతో పార్టీలో ఇతర సామాజిక వర్గాలు గుసగుసలాడుతున్నాయి. క్రిష్ణగిరి జిల్లాను తూర్పు, పడమర జిల్లాలుగా విభజించి, ఇద్దరు జిల్లా కార్యదర్శులను నియమించడంతో పార్టీలో విభేదాలు ఎగిసిపడ్డాయి. క్రిష్ణగిరిలో యువత చేతికి పార్టీ పగ్గాలను(వై.ప్రకాష్)కు అందించడంతో సీనియర్లు కొంత అలకలో ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను ఘనంగా జరపడానికి నిశ్చయించకపోవడంపై ఆయన అభిమానులు, సీనియర్ డీఎంకే నాయకులలో తీవ్ర అసహనం చోటు చేసుకొందంటున్నారు. ఆ పార్టీలో కొందరు రేపటి తరం స్టాలిన్‌దే, కరుణానిధి అవసరం ఏముంటుందనే ఆలోచనలో పడ్డారా అనే ధోరణిలో అంతా ఉన్నారని ప్రస్తుత నాయకత్వంపై పార్టీలో ఉన్న అసమ్మతివాదులు ఎత్తిచూపుతున్నారు. -
కదం తొక్కిన కరుణ సేన
సేలం : సేలం కలెక్టరేట్ వద్ద డీఎంకే సేనలు కదంతొక్కారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు అధికార పక్షం దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలతో మర్యాదగా వ్యవహరించకుంటే, ప్రతి దాడులకు తామూ సిద్ధమని హెచ్చరించారు. బుధవారం జరిగిన సేలం కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే సభ్యుడు దైవలింగంను అన్నాడీఎంకే సభ్యులు చితక్కొట్టారు. అడ్డుకునే యత్నం చేసిన ఇతర సభ్యులపై సైతం తమ ప్రతాపం చూపించారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసుల నమోదు చేశారు. అయితే డీఎంకే వర్గాలపైన అత్యధిక సెక్షన్లు నమోదు కావడం వివాదాన్ని రేపింది. అలాగే తమ కౌన్సిలర్‌పై దాడిని నిరసిస్తూ పదో వార్డు ప్రజలు సైతం తమ ఇళ్లపై నల్ల జెండాల నిరసన కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాడులకు నిరసనగా సేలం జిల్లా పార్టీ నేతృత్వంలో భారీ నిరసనను శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు. కదం తొక్కిన సేన సేలం సెంట్రల్ జిల్లా ఇన్చార్జ్ రాజేంద్రన్ నేతృత్వంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో డీఎంకే వర్గాలు, పదో వార్డు ప్రజలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ పరిసరాలు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండింది. అధికార పక్షం సభ్యుల తీరుపై ఈ నిరసనలో డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దాడులు పునరావృతం అవుతూ వస్తున్నాయని, ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే, ప్రతి దాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ మీద దాడి చేసిన వాళ్లను వదలి పెట్టి, తమ మీదే పోలీసులు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు అధికార పక్షం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని శివాలెత్తారు. దైవలింగంను హతమార్చేంత ఆగ్రహంతో అధికార పక్షం సభ్యులు తమ వీరంగాన్ని ప్రదర్శిస్తే, పొలీసులు వారిపై పిట్టి కేసులు నమోదు చేసి ఉండటం విచారకరంగా పేర్కొన్నారు. పోలీసులు తమ ధోరణి మార్చుకుని, అధికార పక్షం అడుగులకు మడుగులు వత్తకుండా, జరిగిన ఘటనను సమగ్రంగా విచారించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సభలో ఒక సభ్యుడిపై దాడి జరుగుతుంతే, మేయర్ సౌండప్పన్ చూస్తూ ఊరుకోవడం శోచనీయమని విమర్శించారు. దాడిని అడ్డుకోకుండా, చివరకు గాయపడ్డ సభ్యుడ్ని సభ నుంచి సస్పెండ్ చేయడం బట్టి చూస్తే, పథకం ప్రకారం అన్నాడీఎంకే వర్గాలందరూ కలిసి కట్టుగా దైవలింగంపై దాడి వ్యూహంతోనే వచ్చినట్టుగా అనుమానం కల్గుతోందన్నారు. అధికార పక్షం ప్రజా సమస్యలను విస్మరించిందని, అవినీతి తాండవం చేస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్ల నోళ్లను నొక్కడమే కాకుండా, ఏకంగా దాడులకు ఒడిగట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిరసనకు మాజీ ఎంపి సెల్వ గణపతి, మాజీ ఎమ్మెల్యేలు వీర పాండిరాజ, శివలింగం నేతృత్వం వహించారు. -
కన్నీళ్లు పెట్టిన కరుణ
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి విలపించారు. తన సోదరి ఇక లేదన్న సమాచారంతో కన్నీళ్ల పర్యంతం అయ్యారు. శోక సంద్రంలో మునిగిన ఆయన్ను పీఎంకే అధినేత రాందాసు, డీఎంకే వర్గాలు ఓదార్చే యత్నం చేశాయి. షణ్ముగ సుందరత్తమ్మాల్(99) భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ముత్తు వేలర్, అంజుగత్తమ్మాల్ దంపతుల కుమారుడు డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇద్దరు అక్కయ్యలు. పెద్ద అక్కయ్య పెరియ నాయకీ ఎప్పుడో కాలం చెందారు. రెండో అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాల్ అంటే, కరుణానిధికి ప్రాణం. ఆమె మాటను నేటికి కూడా ఆయన జవదాటరు. ఆమె అంటే, కరుణానిధికి గౌరవం, మర్యాద, ఆప్యాయత ప్రేమా అభిమానులు ఎక్కువే. కుటుంబ పెద్ద గా ఆమెను భావిస్తుంటారు. కరుణ కుటుం బంలో ఎదురైన అనేక సంక్లిష్ట పరిస్థితుల్ని ఆమె దారిలో పెట్టారని చెప్పవచ్చు. షణ్ముగ సుందరత్తమ్మాల్ పెద్దకుమారుడే కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత మురసోలి మారన్. అందుకే మేనల్లుడు మురసోలి మారన్ అంటే కరుణకు ఎంతో ఇష్టం. ఆయన బతికి ఉన్నంత కాలం కరుణ వెన్నంటి ఉన్నారని చెప్పవచ్చు. ఇక, మురసోలి మారన్, మల్లికా మారన్ల పిల్లలే కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ , సన్ టీవీ గ్రూప్ అధినేత కళానిధి మారన్. కరుణానిధి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన షణ్ముగత్తమ్మాల్ (99) కొంతకాలంగా వయోభారంతో బాధ పడుతున్నారు. గోపాల పురంలోని ఇంట్లో ఉంటూ వైద్య సేవలు పొందుతూ వచ్చారు. కన్నీళ్లు పెట్టిన కరుణ: బుధవారం ఉదయం పద కొండు గంటలకు షణ్ముగ సుందరత్తమ్మాల్ మరణించిన సమాచారం కరుణానిధిని శోక సంద్రంలో ముంచేసింది. వయో భారంతో బాధపడుతున్న అక్కయ్యను వా రంలో ఓ మారైనా కలిసి వెళ్లే కరుణానిధి , ఇక ఆమె లేరన్న సమచారంతో దిగ్భ్రాంతికి గురి అయ్యారు. పార్టీ కోశాధికారి, తనయుడు స్టాలిన్‌తో కలసి ఆమె ఇంటికి చేరుకుని భౌతిక కాయాన్ని చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఆమె చేతుల్ని పట్టుకుని బోరున విలపించారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కరుణానిధి సైతం వయోభారంతో ఉన్న దృష్ట్యా, ఆయన్ను అక్కడి నుంచి మరో గదికి వెంటనే తీసుకెళ్లి పోయారు. అనంతరం ఆమె భౌతిక కాయాన్ని కుటుంబీ కులు, ఆప్తుల సంద ర్శనార్థం గోపాల పురం ఇంట్లో ఉంచారు. సమాచారం అందుకున్న షణ్ముగ సుందరత్తమ్మాల్ చిన్న కుమారుడు మురసోలి సెల్వం, కోడలు సెల్వి, మనవళ్లు, మనవరాళ్లు, కుటుంబీకులు దయానిధి మారన్, కళానిధి మారన్, మూక్తా తమిళరసు, అమృతం, డిఎంకే నాయకులు దురై మురుగ న్, టీ ఆర్ బాలు, ఎ రాజ, విపీ దురై స్వామి, అన్భలగన్, శేఖర్ బాబు, ఎం సుబ్రమణియన్ తదితరులు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు : షణ్ముగ సుందరత్తమ్మాల్ భౌతిక కాయానికి గురువారం అం త్యక్రియలు జరగనున్నాయి. గోపాల పురం ఇంటి నుంచి ఉదయం పది గంటలకు ఊరేగింపుగా భౌతిక కాయాన్ని బీసెంట్ నగర్ వ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిన కరుణానిధిని పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చే పనిలో పడ్డారు. పీఎంకే అధినేత రాందాసు ఓ ప్రకటన ద్వారా తన సానుభూతి తెలియజేశారు. అక్కయ్య అంటే కరుణానిధి ఎంతో మర్యాద, ప్రేమ,ఆప్యాయతల్ని కల్గి ఉన్నారన్నారు. కష్టాల్లో కరుణానిధి వెన్నంటి ఆమె ఉన్నారని, ఆమె లేని లోటు ఆయనకు తీర్చలేనిదిగా పేర్కొన్నారు. -
దాహం తీర్చండి
అధికారంలోకి వచ్చిన వెంటనే వేలూరుకు కావేరి నీరు మహాధర్నాలో డీఎంకే కోశాధికారి స్టాలిన్ వ్యాఖ్యలు కావేరి కూట్టు తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేసి వేలూరు ప్రజలకు నీటిని అందజేయాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో వే లూరు కలెక్టరేట్ ఎదుట స్టాలిన్ అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ గత డీఎంకే ప్రభుత్వ హయాంలో వేలూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1,295 కోట్ల వ్యయంతో హొగినేకల్ తాగునీటి పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వేలూరు: డీఎంకే ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలను రద్దు చేయడమే అన్నాడీఎంకే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని వేలూరులో జరిగిన మహా ధర్నాలో డీఎంకే పార్టీ రాష్ట్ర కోశాధికారి స్టాలిన్ పేర్కొన్నారు. కావేరి కూట్టు తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు నీటిని అందజేయాలని కోరుతూ డీఎంకే ఆధ్వర్యంలో వే లూరు కలెక్టరేట్ ఎదుట స్టాలిన్ అధ్యక్షతన మహా ధర్నా నిర్వహించారు. స్టాలిన్ మాట్లాడుతూ గత డీఎంకే ప్రభుత్వంలో వేలూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1,295 కోట్ల వ్యయంతో ఓక్కెనెకల్ తాగునీటి పథకాన్ని ప్రారంభించి అందుకు తానే శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ పథకం పూర్తి చేసి 2014లో ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని అసెంబ్లీలోనే కరుణానిధి తీర్మానం చేశారన్నారు. అనంతరం మాజీ మంత్రి దురైమురగన్ ఆధ్వర్యంలో అధికారులతో చర్చించి పలు మార్లు సర్వేలు చేపట్టినట్లు వివరించారు. అయితే అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వాటిని రద్దు చేసి కావేరి తాగునీటి పథకంగా పేరు మార్చి పనులు ప్రారంభించారన్నారు. ఈ పథకాన్ని 2012 డిసెంబర్‌కు పూర్తి చేసి ప్రజలకు తాగునీటిని సరఫరా చే యాలని అయితే ఐదేళ్లవుతున్నా 25 శాతం పనులు మాత్రమే చేశారన్నారు. ఇక్కడున్న మంత్రి, కలెక్టర్లు ఏప్రిల్‌లో నీటిని సరఫరా చేస్తామని తెలిపారన్నారు. డీఎంకే ప్రభుత్వంలో క్రిష్ణగిరి, ధర్మపురి జిల్లా ప్రజల తాగునీటి కోసం రూ: 1,828 కోట్ల కేటాయించి దాదాపు 75 శాతం పనులు పూర్తి చేయడంతో ప్రభుత్వం మారడంతో 25 శాతం పనులు పూర్తి చేయకుండా నిలుపుదల చేశారన్నారు. దీనిపై తాను క్రిష్ణగిరి ప్రజలతో చర్చించి ధర్నా చేస్తానని ప్రకటించడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకాన్ని ప్రారంభించారన్నారు. 2011-13 వరకు కావేరి తాగునీటి పథకం పనులు వేలూరు జిల్లాలో 21 శాతం మాత్రమే జరిగాయని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడేమో ఈ నెల 14వ తేదీ నుంచి కావేరి నీటిని సరఫరా చేస్తామని తెలుపుతున్నారన్నారు. అదెలా సాధ్యమో తెలపాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను పూర్తిగా రద్దు చేయడానికి అన్నాడీఎంకే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందన్నారు. వేలూరు కలెక్టర్ నందగోపాల్ కాట్పాడి సమీపంలో ఉగాది వేడుకలకు వెళ్లి సొంతంగా కారు నడిపి ప్రమాదానికి గురైతే ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై విచారణ చేపడతామన్నారు. కావేరి తాగునీటి పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని అసెంబ్లీలోను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో డీఎంకే పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దురైమురుగన్, జిల్లా కార్యదర్శులు నందకుమార్, గాంధీ, దేవరాజ్, కార్పొరేషన్ కార్యదర్శి కార్తికేయన్, పట్టణ కార్యదర్శి రామలింగం పాల్గొన్నారు. డీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభం ధర్నా అనంతరం వేలూరు గ్రీన్ సర్కిల్ సమీపంలో డీఎంకే పార్టీ కార్యాలయాన్ని స్టాలిన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో చర్చించారు. ఆయనతో పాటు దురై మురుగన్, జిల్లా కార్యదర్శులు గాంధీ, నందకుమార్ ఉన్నారు. కలెక్టరేట్ ఎదుట స్తంభించిన ట్రాఫిక్ సోమవారం కావడంతో వేలూరు కలెక్టరేట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమస్యలతో కూడిన విన్నపాలను సమర్పిస్తారు. డీఎంకే ధర్నాతో కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో వాహనాలు కలెక్టరేట్ చేరుకునేం దుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఏమిటీ వివక్ష?
ఇంతకీ కార్పొరేషన్ మేయర్ ఏమయ్యారు? ఎక్కడకు వెళ్లారు? అని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రశ్నల వర్షం కురిపించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న అగ్రి కృష్ణమూర్తికి ఓ న్యాయం, తప్పును ఎత్తి చూపిన ట్రాఫిక్ రామస్వామికి మరో న్యాయమన్నట్లుగా వివక్ష చూపితే సహించబోమన్నారు. కార్పొరేషన్, ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్టాలిన్ నేతృత్వంలో బుధవారం ఐనావరంలో భారీ నిరసన జరిగింది. సాక్షి, చెన్నై: చెన్నై పరిధిలోని కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రాతిని థ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వారానికి ఓ మారు తన నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నా లు చేస్తున్నారు. అయితే, తన నియోజకవర్గానికి ఎమ్మె ల్యే నిధులతో కేటాయించిన పనులను ముందుకు తీసుకెళ్లడంలో కార్పొరేషన్ వర్గాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం మీద అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన స్టాలిన్ కొళత్తూరు ప్రజలతో కలసి భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. కొళత్తూరు నుంచి వేలాది మందితో భారీ ర్యాలీగా ఐనావరంలోని కార్పొరేషన్ మండల కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ ప్రయత్నాన్ని వీడారు. గుంపులు గుంపులుగా వేలాది మంది ఐనావరం కార్యాలయం వద్దకు చేరుకుని ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలోనే బైఠాయించారు. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. మేయర్ ఎక్కడ? దోమల నుంచి రక్షించేదెవరు? డెంగీ, స్వైన్ ఫ్లూను కట్టడి చేయలేరా? మెట్రో పనులు సాగేనా...?అంటూ పాలకులను ప్రశ్నించారు. మేయర్ ఎక్కడ: నిరసను ఉద్దేశించి స్టాలిన్ ప్రసంగిస్తూ, ఈ నిరసన కోసం పది రోజుల క్రితమే అనుమతి కోరామన్నారు. అయినా అనుమతి ఇవ్వకుండా ర్యాలీని అడ్డుకున్నారని, నిరసన సభను అడ్డుకునే యత్నం చేశారని మండి పడ్డారు. దీన్ని బట్టి చూస్తే అణగదొక్కే ప్రయత్నాలు ఏ మేరకు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని శివాలెత్తారు. నగరంలో ప్రజా సమస్యలు, పథకాలు, ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, అయితే, మేయర్ పత్తా లేకుం డా పోవడం విచారకరమన్నారు. తాను మేయర్‌గా ఉన్నప్పుడు ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించానని, అయితే, ఈ మేయర్ ఎక్కడున్నారో...అంతు చిక్కడం లేదని ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏ విధంగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందో, అదే బాటను మేయర్ కూడా అనుకరిస్తున్నట్టుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఒక ఎమ్మెల్యేగా తనకు కల్పించిన అన్ని హక్కుల్ని కాలరాస్తున్నారని మండి పడ్డారు. తన నిధులతో రూ. 6 కోట్ల మేరకు పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటే, ఇంత వరకు రూ.కోటి పనులు కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విల్లివాక్కం వంతెన కోసం తాను రాసిన లేఖకు కేంద్రం స్పందించి రూ.7 కోట్లను కేటాయించింద న్నారు. అయితే ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క వంతెనను, ఏ ఒక్క నిర్మాణాల్ని చేపట్టి దాఖలాలు లేవ ని విమర్శించారు. అసెంబ్లీలో జయలలిత 110 నిబంధనల మేరకు ప్రకటనల మీద ప్రకటనలు ఇచ్చి చివరకు ప్రజలకు ‘111’ పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశా రు. అగ్రి కృష్ణమూర్తి హత్యారోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేస్తూ, ఆయన మీద ఇంత వరకు ఏ ఒక్క కేసు పెట్టక పోవడం శోచనీయమని విమర్శించారు. అగ్రి విషయంలో మెతక వైఖరి అనుసరిస్తూ, తప్పును ఎత్తి చూపిన ట్రాఫిక్ రామస్వామిని మాత్రం జైల్లో పెట్టి చిత్ర హింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాళ్లకు ఓ న్యాయం... మరొకరికి మరో న్యాయం అన్నట్టుగా ఈ పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పాలకులకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, ప్రజలందరూ ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నిరసనలో డీఎంకే నాయకులు శేఖర్ బాబు, రంగనాథన్, గిరి రాజన్, ఐసీఎఫ్ మురళి పాల్గొన్నారు. -
దళపతికి శుభాశీస్సులు
సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆదివారం 63వవసంతంలోకి అడుగు పెట్టారు. తన తండ్రి, పార్టీ అధినేత ఎం.కరుణానిధి, కుటుంబీకుల సమక్షంలో, అభిమానుల కోలాహలం మధ్య బర్త్‌డేను స్టాలిన్ ఘనంగా జరుపుకున్నారు. దళపతి బర్త్‌డేను పురస్కరించుకుని వాడ వాడల్లో డీఎంకే వర్గాలు వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. ఎం కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో ఎదిగిన ఎంకే స్టాలిన్ పార్టీ బలోపేతం లక్ష్యంగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అధినేత కరుణానిధి దూతగా పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. అశేష అభిమానుల్ని, మద్దతుదారుల్ని కల్గిన స్టాలిన్ బర్త్‌డేను ప్రతి ఏటా యువజనోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం 63వ వసంతంలోకి స్టాలిన్ అడుగు పెట్టడం పార్టీ వర్గాలకు, ఆయన మద్దతుదారులు, అభిమానులకు పండుగే. అందరి నోట దళపతిగా పిలవడే స్టాలిన్ బర్త్‌డేను వాడ వాడల్లో డీఎంకే వర్గాలు ఘనంగా నిర్వహించాయి. వాడవాడల్లో పార్టీ జెండాల్ని ఎగుర వేశారు. అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ ప్రసంగాల్ని, డీఎంకే ప్రగతిని చాటే పాటలను హోరెత్తించారు. 63 కిలోల కేక్‌లను కట్ చేశారు. పేదలకు పలు చోట్ల 63 రకాల వస్తువులను అందజేశారు. స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. ఉదయాన్నే గోపాలపురం చేరుకున్న స్టాలిన్ తల్లిదండ్రుల ఆశీస్సుల్ని అందుకున్నారు. తండ్రి, పార్టీ అధినేత ఎం కరుణానిధి స్టాలిన్ అలింగనం చేసుకుంటూ ముద్దాడి మరీ అభినందించారు. తల్లి దయాళు అమ్మాల్ ఆశీస్సులు అందుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలసి స్టాలిన్ కేక్ కట్ చేశారు. ఆళ్వార్ పేటలోని ఇంట్లో సతీమణి దుర్గా, తనయుడు ఉదయ నిధి, కోడలు కృతికతో కలసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వైఎంసీఏ మైదానంలో జరిగిన వేడుకల్లో స్టాలిన్ పాల్గొన్నారు. మెరీనా తీరంలోని అన్నా సమాధిని, వెప్పేరిలోని పెరియార్ స్మారక మందిరాన్ని స్టాలిన్ సందర్శించారు. అక్కడ నివాళులర్పించినానంతరం వైఎంసీఏ మైదానంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన తన బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. యువజన విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి వేదిక మీద 63 కిలోల కేక్‌ను కత్తిరించినానంతరం ప్రతి కార్యకర్త, నాయకుడి నుంచి శుభాకాంక్షల్ని స్టాలిన్ అందుకున్నారు. స్టాలిన్ స్వయంగా కలుసుకోవడంతో పెద్ద ఎత్తున్న రాష్ట్ర నలమూలల నుంచి డీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. అన్ని మతాలకు చెందిన మత పెద్దలు స్టాలిన్‌ను ఆశీర్వదించారు. పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు.ఇదే వేదిక మీద తన సోదరుడికి ఎంపీ కనిమొళి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. అంటరానితనం నిర్మూలన : ఈ వేదికపై స్టాలిన్ ప్రసంగిస్తూ తన బర్త్‌డేను ఇక, యువజనదినోత్సవంతో పాటుగా అంటరానితనం నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అధినేత ఎం కరుణానిధి నేతృత్వంలో డీఎంకే బలం రోజు రోజుకు మళ్లీ పెరుగుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి కార్యకర్త సైనికుడి వలే మరింత శ్రమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తే, అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
అలాంటి ఆశ లేదు
మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ తనకు ఎంతమాత్రం లేదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి చెప్పారు. పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు పాటుపడుతానన్నారు. స్టాలిన్ సీఎం పీఠం ఎక్కడానికి మార్గం సుగమం చే సే రీతిలో పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చారు. చెన్నై,సాక్షి ప్రతినిధి:వృద్ధాప్యంతో రోజు రోజుకూ బలహీనపడుతున్న కరుణానిధికి వారసుడు ఎవరనేది రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ పార్టీలో స్టాలిన్‌ది పైచేయిగా మారిపోగా, కుటుంబంలో కరుణ పెద్దకుమారుడు అళగిరి, స్టాలిన్ మధ్య వారసత్వ యుద్ధమే సాగుతోంది. వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం కోసం స్టాలిన్ వేసిన పాచికలకు అళగిరి బలయ్యారు. స్టాలిన్ వ్యూహంతో అళగిరికి కరుణతో విభేదాలు ముదిరిపోగా పార్టీ నుంచి బిహ ష్కరించే పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా కరుణకు స్టాలిన్ మరింత సన్నిహితుడయ్యారు. ప్రతి పార్టీ సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో కరుణ సీఎం కావడం ఖాయమని స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి పీఠంపై తన ఆసక్తిని పరోక్షంగా గుర్తుచేస్తూనే ఉన్నారు. అనేక సమావేశాల్లో కరుణ సైతం స్టాలిన్ తన వారసుడని పరోక్షంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ దశలో స్టాలిన్ జన్మదినోత్సవాలు శనివారం చెన్నై వైఎంసీఏ మైదానంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 20 వేల మందికి రూ.1కోటి విలువైన వస్తువులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కరుణ నిర్వేదపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది స్టాలిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నానని, భవిష్యత్తులో రాజకీయ గడ్డు పరిస్థితులు ఎదురైతే వాటిని అధిగమించి రాజకీయాల్లో ముందుకు సాగేందుకు స్టాలిన్‌కు కొన్ని మెళకువలు తప్పవని అన్నారు. ఎవరిని చేరదీయాలి, ఎవరిని దూరంగా ఉంచాలి, ఏ నేతతో ఎలా నడుచుకోవాలో స్టాలిన్‌కు తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం వేదికగా భావిస్తున్నానన్నారు. పేదల కష్టనష్టాలు తెలుసుకున్నందునే విలువైన వస్తువులు ఉచితంగా పంచుతున్నామని, వీటిని స్వీకరించిన వారు స్టాలిన్ మరిన్ని జన్మదినాలు జరుపుకునేలా దీవించాలని కోరారు. తన కంటే ముందు ప్రసంగించిన వారు తాను ఆరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆశించారని, అయితే తనకు అటువంటి ఆశలేదని చెప్పారు. డీఎంకేని మరింత పటిష్టం చేయాలనేదే తన లక్ష్యమని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి పార్టీ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను మరిస్తే రాష్ట్రంలో కృత ఘు్నలుగా మిగిలిపోగలమని హెచ్చరించారు. అన్నాదురై తమ్ముళ్లుగా గర్వపడుతూ ఆయన ఆశయాలు నెరవేర్చాలని, పార్టీ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని కోరారు. ఒకటి, రెండురోజులు పార్టీ సమావేశాలను నిర్వహించి విశ్రమించరాదని, నిరంతరం ప్రజల కోసం పోరాడాలని అన్నారు. తమిళం వర్ధిల్లాలి, పార్టీ వర్ధిల్లాలి అనే నినాదాన్ని నలుచెరగులా చాటాలని పిలుపునిచ్చారు. తాను ఇక పార్టీకే పరిమితం ముఖ్యమంత్రి పీఠం స్టాలిన్‌కు అంకితం అనే సంకేతాలను కరుణ ఇచ్చారు. -
సీట్లివ్వకుంటే ఎలా?
* స్టాలిన్‌కు మొర * 18 మంది నేతల్లో అసంతృప్తి సాక్షి, చెన్నై : అధిష్టానం నిర్ణయం డీఎంకే సీనియర్లలో అసంతృప్తిని రగుల్చుతోంది. జిల్లా కార్యదర్శుల పదవుల ఎన్నికల్లో కోట్లు కుమ్మరించాల్సి వచ్చిందని, అలాంటప్పుడు తమకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వకుంటే ఎలా? అని పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ప్రశ్నించే పనిలో పలువురు నేతలు పడ్డారు. డీఎంకేలో సంస్థాగత ఎన్నికల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. 65 జిల్లా కార్యదర్శుల పదవుల భర్తీ జోరందుకుంటోంది. రోజుకు కొన్ని జిల్లాలు చొప్పున ఎంపిక చేసి అధినేత కరుణానిధి పర్యవేక్షణలో ఎన్నికలు సాగుతున్నాయి. 31 జిల్లాలకు మాత్రం కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే విధంగా ఎన్నికలు సాగుతున్నాయి. మిగిలిన 34 జిల్లాల్లో పార్టీలో ఆయా జిల్లాల్లో పలుకుబడి కల్గిన నేతలు, సీనియర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలు ఏక గ్రీవం అయ్యాయి. అయితే, జిల్లా కార్యదర్శుల ఎన్నికల బరిలో నిలబడి గెలిచిన వాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి తేల్చారు. ఇందుకు తగ్గ హామీ పత్రాన్ని ఆయా కార్యదర్శుల నుంచి తీసుకుని ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ చర్యలు ఆయా నేతల్లో అసంతృప్తిని రగుల్చుతున్నాయి. జిల్లా కార్యదర్శుల ఎన్నికల్లో గెలుపొందేందుకు నాయకులు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ఆయా జిల్లాల్లో కాకుండా చెన్నైలో ఏర్పాటు చేసి ఉండడంతో తమ మద్దతుదారులు, తమకు అనుకూలంగా ఓట్లు వేసే నాయకుల్ని ఇక్కడకు తీసుకురావడంతో పాటుగా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాల్ని కల్పిస్తున్నట్టు సమాచారం. గెలుపు లక్ష్యంగా కొన్ని చోట్ల తాయిలాలు సైతం పంపిణీ చేసినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు గాని, తమ కుటుంబలోని వ్యక్తులకు గానీ సీట్లు ఇవ్వమని అధిష్టానం స్పష్టం చేయడాన్ని అనేక మంది నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టాలిన్‌కు వినతి: అధిష్టానం హామీ పత్రానికి ప్రధానంగా స్టాలిన్ మద్దతు సీనియర్లు ఇరకాటంలో పడ్డారు. 18 మంది నాయకులు జిల్లాల కార్యదర్శుల పదవుల్ని చేజిక్కించుకున్నారు. అయితే, పార్టీకి ఏళ్ల తరబడి సేవల్ని అందిస్తున్న తమకు ఇతర పదవులు దక్కవన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. దీంతో హామీ పత్రం వ్యవహారంలో ఎన్నికల అనంతరం మార్పులు చేర్పులకు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ వద్ద మొర పెట్టుకునే పనిలో పడ్డారు. వేర్వేరుగా ఆ నేతలు స్టాలిన్‌ను కలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటుగా తమకు పదవులు దక్కే విధంగా అధినేత కరుణానిధిపై ఒత్తిడి తెచ్చి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. అదే సమయంలో డీఎంకే నుంచి బయటకు వెళ్లిన నెపోలియన్ బీజేపీల చేరడం, మరి కొందరు తన బాటలో నడవనున్నట్టు ఆయన ప్రకటించడాన్ని డీఎంకే అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నది. ఎక్కడ వలసలు బయలు దేరుతాయోనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని హామీ పత్రం విషయంలో స్వల్ప మార్పులకు కరుణానిధి యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తన వద్దకు వచ్చే సీనియర్లకు సంస్థాగత ఎన్నికల అనంతరం తదుపరి చర్యలు తీసుకుందామన్న భరోసా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. -
నేను రె‘ఢీ’
‘అసెంబ్లీకి వచ్చేందుకు నేను రెడీ..ధైర్యముంటే నా కోసం ప్రత్యేకంగా సీటు వేయించు’ అంటూ ముఖ్యమంత్రికి డీఎంకే అధినేత కరుణానిధి సవాల్ విసిరారు. పెద్ద పెద్ద నాయకుల్నే చూశానని, తన గుండె ధైర్యం చూస్తే తట్టుకోలేవని, దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. * ధైర్యముంటే సీటు వేరుుంచు * పన్నీరుకు కరుణ సవాల్ * దిగజారొద్దని హితవు సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి వయోభారంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన వీల్ ఛైర్లో కూర్చునే ఆయన ఎక్కడికైనా వెళతారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక జార్జ్‌కోటను అసెంబ్లీగా ఎంపిక చేసుకుంది. అక్కడ కరుణ వీల్ ఛైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ ఛైర్లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డీఎండీకేకు వెనుక డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు. అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమా వేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే పన్నీరు సెల్వాన్ని ఉద్దేశించి కరుణానిధి వ్యాఖ్యలు చేయడం, ఇందుకు దీటుగా పన్నీరు బదులివ్వడం ఇటీవల చోటు చేసుకుంది. ధైర్యముంటే అసెంబ్లీలో అడుగు పెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలును తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు. సీటు వేయించు: అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని, అందుకు తగ్గ ధైర్యం ఉందా..? అని సీఎం పన్నీరు సెల్వానికి సవాల్ విసిరారు. ప్రజా సమస్యల్ని ఎత్తి చూపే బాధ్యత ప్రతి పక్షానికి ఉందన్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పన్నీరు సెల్వం తనకే నీతులు చెప్పేంతగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హెచ్చరించారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహా మహులే సమాధానాలు ఇవ్వలేక తడపడ్డ సందర్భాల ఉన్నాయని, ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతతో, హుందాగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. -
సాక్షికి మురసోలి కితాబు
చెన్నై: ‘సాక్షి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన వార్తకు మురసోలి పత్రికలో ప్రాధాన్యత కల్పించారు. ఈనెల మూడో తేదీన చెన్నైలో ఈలం తమిళులకు మద్దతుగా డీఎంకే నేతృత్వంలో భారీ ఆందోళన జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు తరలి వచ్చారుు. కరుణానిధి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన సాక్షి చెన్నై పత్రికలో ప్రథమంగా ప్రచురితమైంది. అయితే ఈ నిరసన పేలవంగా సాగినట్లు ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనానికి మురసోలిలో ప్రత్యేక కథనం శనివారం ప్రచురించారు. ఇతర భాషా పత్రికలు సైతం ఈలం తమిళులకు మద్దతుగా నిలుస్తూ , డీఎంకే నిరసనను ప్రథమంగా ప్రచురిస్తే తమిళ పత్రిక వ్యతిరేకత వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఆ కథనంలో ఖండించారు. ఆ నిరసన విజయవంతం అయినట్టుగా సాక్షిలో వచ్చిన ఫోటో, వార్తల క్లిప్పింగ్‌ను మురసోలి పత్రిక ప్రథమంగా ప్రచురించి సాక్షిని చూడండంటూ పేర్కొనడం విశేషం. కాగా ఈ మురసోలి తమిళ పత్రిక డీఎంకే అధినేత అయిన కరుణానిధికి, డీఎంకే పార్టీకి చెందినది కావడం విశేషం. -
రచ్చబండ ప్రచారం!
- డీఎంకే యూత్ నిర్ణయం - ప్రజల్లో మమేకానికి స్టాలిన్ పిలుపు పలు అంశాలపై తీర్మానం రచ్చబండ ప్రచార సభలకు డీఎంకే యువజన విభాగం నిర్ణయించింది. ప్రజల్లో మమేకమై, వారి మన్ననల్ని అందుకుని అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా యువజనుల చేత డీఎంకే కోశాధికారి ఎంకే.స్టాలిన్ ప్రతిజ్ఞ చేయించారు. పలు అంశాలపై తీర్మానించారు. సాక్షి, చెన్నై:డీఎంకేకు వెన్నెముకగా యువజన విభాగం వ్యవహరిస్తోంది. ఈ విభాగానికి డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్ ప్రధాన కార్యదర్శిగా ఏళ్ల తరబడి వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ విభాగంలోని నాయకులకు ప్రమోషన్ కల్పించే విధంగా పార్టీ ప్రక్షాళ పర్వంలో పదవులు అప్పగించేందుకు స్టాలిన్ పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లోపు యువజన విభాగాన్ని మరింత పటిష్టవంతం చేయడం, ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టే రీతిలో కార్యాచరణను సిద్ధం చేశారు. దీనిపై చర్చించి యువజన నేతల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి పంపించే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన నేతలతో చెన్నైలో శుక్రవారం స్టాలిన్ సమావేశమయ్యారు. ప్రచారం : అన్నా సాలైలోని అన్భగం అన్నా మండ్రంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా యువజన నేతలు తరలి వచ్చారు. డీఎంకే కోశాధికారి, యువజన ప్రధాన కార్యదర్శి ఎంకే.స్టాలిన్, సంయుక్త కార్యదర్శులు ఎం.సుబ్రమణియన్, సుగవనం నేతృత్వం వహించారు. ఆయా జిల్లాల్లోని సమస్యలు, యువజన విభాగాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న వారి వివరాల్ని సేకరించారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల్ని వివరించారు. యువజన నేతలు సమష్టిగా ముందుకు వెళ్లాల్సిన విధానం, అసెంబ్లీ ఎన్నికల్లోపు ప్రజల్లో చొచ్చుకు వెళ్లే రీతిలో వ్యవహరించాల్సిన అంశాల్ని చర్చించారు. అలాగే, యువజన నేతలకు ప్రమోషన్లు దక్కనున్న దృష్ట్యా, ఆ విషయంగా ప్రస్తావన సాగినట్టు తెలిసింది. చివరకు రచ్చ బండ ప్రచారాలతో ప్రజల్ని ఆకర్షించే విధంగా కొన్ని తీర్మానాలు చేశారు. తీర్మానాలు అన్నా జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కవితలు, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహించేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో తొలి విడతగా జిల్లా స్థాయిపోటీలు, 18, 19 తేదీల్లో మలి విడత పోటీ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరపనున్నారు. ముల్లై పెరియార్ డ్యామ్ హక్కుల పరిరక్షణ సాధనలో పార్టీ అధినేత కరుణానిధి పాత్ర ఉందని వివరిస్తూ, ఆయనకు కతృజ్ఞతలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పౌష్టికాహర పథకం ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిరక్షణ నినాదంతో పోరాటాలకు నిర్ణయించారు. ప్రజా సమస్యలపై పాలకుల్ని నిలదీసే విధంగా కార్యక్రమాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వ విధానాల్ని, వైఫల్యాల్ని, అరచాకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కరపత్రాల పంపిణీ, వీధి సభల్ని విస్తతృ పరచనున్నారు. అలాగే, రచ్చబండ ప్రచారం పేరుతో ప్రతి రోజూ తమతమ ప్రాంతాల్లోని యువజన నేతలు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. -
రాజ్యసభకు నవనీతకృష్ణన్
- అన్నాడీఎంకే అధినేత్రి జయ ప్రకటన - జూలై 3న ఎంపిక తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) చైర్మన్‌గా ఉన్న నవనీతకృష్ణన్ అన్నాడీఎంకే తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికయ్యూరు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత ఆయన పేరును గురువారం రాత్రి ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇటీవల మృతిచెందిన విష యం తెల్సిందే. దీంతో రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్థానం ఖాళీ అరుు్యంది. డీఎంకే రాజ్యసభ సభ్యు లు సెల్వగణపతి అవినీతి ఆరోపణల కారణంగా శిక్ష పడడంతో ఆయన రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో తమిళనాడులో ఒక స్థానం ఖాళీ ఏర్పడింది. ఒడిస్సాకు చెందిన శశిభూషణ్ బేర్, రబీనారాయణ మహాపాత్ర స్థానాలు ఖాళీ అయ్యూరు. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యూరు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, 118 ఓట్లు దక్కించుకున్నవారే రాజ్యసభకు ఎంపికవుతారు. అన్నాడీఎంకేకు 153 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రాతిపదికన అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైనట్లే. రాజ్యసభకు రాజీనామా చేసిన సెల్వగణపతికి 2016 జూన్ 29 వతేదీ వరకు గడువు ఉంది. అప్పటి వరకు నవనీతకృష్ణన్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతారు. ఇదిలా ఉండగా రాజ్యసభ ఎన్నికల కోసం ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 24వ తేదీన పరిశీలన, 26వ తేదీన ఉపసంహరణ పూర్తిచేసి జూలై 3న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం లెక్కింపు నిర్వహించి విజేత పేరును ప్రకటిస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు 10 మంది సభ్యులుండగా, నవనీత కృష్ణన్ గెలుపుతో ఆ బలం 11కు పెరగనుంది. -
సేలం లోక్‌సభ నియోజకవర్గంలో అంతా కొత్తవారే
ఇదో రికార్డు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న వారంతా కొత్తవారే. మొదటిసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన వారే. తమిళనాడులోని సేలం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీలన్నీ కొత్త అభ్యర్థులకే అవకాశమిచ్చాయి. ఇక్కడి నుంచి ఏఐఏడీఎంకే తరఫున పనీర్‌సెల్వం, డీఎంకే నుంచి ఉమారాణి, కాంగ్రెస్ నుంచి మోహన్ కుమార మంగళం, ఆప్ నుంచి సతీశ్‌కుమార్‌లు పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఏడుసార్లు గెలుపొందింది. 2009లో మాత్రం ఏఐఏడీఎంకే అభ్యర్థి సెమ్మాలై గెలుపొందారు. సంవత్సరం క్రితం ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆడిటర్ రమేశ్ హత్యకు గురయ్యారు. దాంతో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలని, రమేశ్ హత్యానంతర సానుభూతి ఓట్లు, మోడీ ప్రభావంతో ఈజీగా గెలుస్తామని బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకత్వాన్ని అభ్యర్థించారు. కానీ పొత్తుల లెక్కల్లో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ డీఎండీకేకు కేటాయించింది. డీఎండీకే అభ్యర్థి సుధీశ్ కూడా రాజకీయాలకు, ఎన్నికలకు కొత్తవాడే. -
అన్నయ్య భేటీపై స్పందించని తమ్ముడు
చెన్నై: తన అన్నయ్య ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలవడాన్ని అప్రాధాన్య వార్తగా కొట్టిపారేశారు ఆయన తమ్ముడు స్టాలిన్. అనవసరమైన వార్తలు చదవనని, అవసరంలేని వాటి గురించి పట్టించుకోనని చెప్పారు. అనవసర వార్తల గురించి చర్చించనని స్పష్టం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అళగిరి భేటీ గురించి అడిగినప్పుడు ఆయనీవిధంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అళగిరికి డీఎంకే పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రధానితో ఆయన భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు సొంతంగా పార్టీ పెట్టేందుకు మద్దతుదారులతో అళగిరి చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమ్ముడితో వారసత్వ పోరుగా కారణంగానే ఆయనకు టిక్కెట్ దక్కలేదు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు అళగిరిపై డీఎంకే సస్పెన్షన్ వేటు కూడా వేసింది. -
మరో కొత్త పార్టీ?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం స్టాలిన్, అళగిరి మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీ నుంచి అళగిరి బహిష్కరణకు గురయ్యూరు. ఆయన మద్దతుదారుల్లో పలువురు అళగిరి వెంట నడిచారు. మరి కొందరు స్టాలిన్‌కు మద్దతు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక అళగిరి రోజుకో వ్యాఖ్యతో వార్తల్లో వ్యక్తిగా అవతరించారు. పార్టీతోపాటు నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కు బెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సీట్లను అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు సంధించారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని డీఎంకే అధిష్టానం పట్టించుకునే పరిస్థితిలో లేదు. తన మద్దతుదారులను స్వయంగా వెళ్లి కలుస్తూ వస్తున్న అళగిరి, డీఎంకేలో ఒకప్పుడు సేవలు అందించి, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న వాళ్లను కలుపుకు వెళ్లే యత్నంలో ఉన్నారు. మద్దతుదారులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నా, ఏదేని వేడుకలకు ఆహ్వానించినా హాజరవుతూ, వారికి తానున్నానన్న భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు అళగిరి డీఎంకేను చీల్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.చీలిక: డీఎంకేలో చీలిక దిశగా అళగిరి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. పార్టీలో స్టాలిన్ వర్గం తిరస్కరించిన వారిని ఏకం చేయడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఆయన పర్యటన చాప కింద నీరులా సాగుతోందంటున్నారు. అదే సమయంలో తన మద్దతుదారులుగా ఉన్న రితీష్, నెపోలియన్, పళిని మాణిక్యం, ఆది శంకర్, జయ దురై, ెహ లన్ డేవిడ్ సన్లకు మళ్లీ సీటు ఇవ్వకుండా స్టాలిన్ అడ్డుపడ్డారన్న సమాచారంతో అళగిరి మరింత ఆక్రోశంతో ఉన్నారు. పార్టీకి సేవలు అందించిన వారందరినీ పక్కన పెట్టిన దృష్ట్యా, వారిని కలుపుకుని తన సత్తా చాటుకునేందుకు అళగిరి సిద్ధం అవుతున్నారు. కొత్త పార్టీ: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే భవిష్యత్తు తేలడం ఖాయం అన్న ధీమాతో అళగిరి ఉన్నారు. డిపాజిట్లు గల్లంతైన పక్షంలో తన సత్తాను చాటుకుంటూ తెరపైకి కొత్త పార్టీని తెచ్చే వ్యూహంతో అళగిరి ఉన్నాట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాగో రానున్న ఎన్నికల్లో డీఎంకేకు పతనం తప్పదంటూ పదే పదే చెప్పుకొచ్చిన అళగిరి, ఆ ఎన్నికల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు బలం చేకూరే రీతిలో సోమవారం అళగిరి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు నెలల్లో: ఒకప్పుడు డీఎంకేకు సేవలు అందించి, తాజాగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పంబళ్ నల్ల తంబిని ఉదయం అళగిరి పరామర్శించారు. 25 వాహనాలతో కాన్వాయ్ రూపంలో కాంచీపురం జిల్లా పరిధిలోని పల్లావరం వైపుగా అళగిరి దూసుకెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ అక్కడి డీఎంకే నాయకుడు కరుణాకరన్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగినా పట్టించుకోలేదు. నేరుగా నల్ల తంబి ఇంటికి వెళ్లిన అళగిరి గంట పాటుగా అక్కడున్నారు. అనంతరం వెలుపలకు వచ్చిన అళగిరిని మీడియా కదిలించగా, డీఎంకేపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు. కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నట్టుందే..? అని మీడియా ప్రశ్నించగా లేదు అని సమాధానం ఇచ్చారు. తమరి మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టాలని ఆశిస్తున్నట్టుందే..? అని ప్రశ్నించగా, వారందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మద్దతుదారుల అభీష్టం మేరకు తన నిర్ణయాలు ఉంటాయని, రెండు నెలల్లో కొత్త పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేయడం విశేషం. -
అళగిరిని పక్కన పెట్టిన డీఎంకే
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్‌తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అళగిరికి టికెట్ వస్తుందా, రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలి జాబితాలో ఈ జాబితాలో కరుణానిధి తనయుడు 8 మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్‌లకు టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు.