
మహిళా ద్రోహి జయ: కనిమొళి
టీనగర్: స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి జయలలిత పేర్కొనడం మోసపూరిత ప్రకటనేనని డీఎంకే ఎంపీ కనిమొళి ధ్వజమెత్తారు. ఆమె ఆదివారం రాత్రి 12.30 గంటలకు తిరుచ్చి నుంచి విమానం ద్వారా చెన్నై చేరుకున్నారు. అ క్కడ ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రకటించారని, ఇది అమలులోకి రావడం సాధ్యమేనా? అనేది సందేహాస్పదమేనన్నారు. మహిళల 50 శాతం రిజర్వేషన్లకు తగినట్లుగా స్థానిక సంస్థల నియోజకవర్గాలను పునర్విభజించాల్సి వుందన్నారు.
ఇవన్నీ చేపట్టడానికే అనేక నెలలు పడుతుందని, అయితే స్థాని క సంస్థల ఎన్నికలకు స్వల్ప సమయమే వుందన్నారు. ఈ లోపున కార్యాచరణ అసాధ్యమేనని, అందువల్ల ఇది కూడా తమిళ మహిళలను మోసగించే వ్యర్థ ప్రకటనగా భావించవచ్చన్నారు.
పార్లమెంటు సమావేశాల్లో శ్రీలం క నౌకాదళం చేత తమిళ జాలర్లు తరచూ దాడులకు గురవడం, జైలు నిర్బంధానికి గురికావడం, జాలర్ల పడవలను శ్రీలంక నుంచి విడిపించడం వంటి సమస్యలపై డీఎంకే వివాదాన్ని లేవదీస్తుందన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో వరద నష్టానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని వత్తిడి తెస్తామన్నారు.