అళగిరిని పక్కన పెట్టిన డీఎంకే
చెన్నై: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో అళగిరికి టికెట్ వస్తుందా, రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలి జాబితాలో ఈ జాబితాలో కరుణానిధి తనయుడు 8 మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్లకు టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు.