M Karunanidhi
-
హిందూ మతం: ఇవేమి తిప్పలు స్టాలిన్ బాబు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని, మత వ్యతిరేకులం అస్సలు కాదని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఏప్రిల్ 9వ తేదీన దక్షిణ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమది హిందూ వ్యతిరేక పార్టీ కాదని, హిందూయిజం ఒక్క భారతీయ జనతా పార్టీ సొత్తు కాదని అన్నారు. ఒక దశలో ఆయన డీఎంకే హిందూత్వ పార్టీ కాకపోతే డీఎంకేలో ఉన్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన ఎందుకు పదే పదే హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోంది? అందుకు దారితీసిన కారణాలు ఏమిటీ? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతిస్తున్న ‘ద్రావిడార్ కళగం’ అధ్యక్షుడు కే. వీరమణి గత మార్చి 27వ తేదీన ఓ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో సంచలనం సృష్టించిన ‘పొలాచ్చి సెక్స్ కుంభకోణం’ కేసు నిందితులను హిందువులు ఆరాధించే శ్రీకష్ణుడితో పోల్చారు. అందుకు హిందూ మక్కల్ కాట్చి అనే పార్టీ ఏప్రిల్ నాలుగో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి బీజేపీ, పాలకపక్ష ఏఐఏడీఎంకే.. డీఎంకే, ద్రావిడార్ కళగంలు హిందూ వ్యతిరేకులంటూ విమర్శిస్తూ వస్తున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్ 1920లో ఓ సామాజిక ఉద్యమంలో భాగంగా ద్రావిడార్ కళగంను ఏర్పాటు చేశారు. డీఎంకేగానీ, అన్నా ఏఐఏడీఎంకేగానీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చాయి. హిందువులను, హిందువుల ఆచారాలను విమర్శిస్తూనే ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎదిగాయి. డీఎంకే నాయకుడు, స్టాలిన్ తండ్రి ఎం. కరుణానిధి నాస్తికుడు. ఏ రోజున గుళ్లూ గోపురాలు దర్శించలేదు. నాస్తికుడిగానే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న స్టాలిన్ సోదరి కనిమోళి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పైగా తండ్రి కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో పలు మత కార్యక్రమాలు జరిగేవని చెబుతున్నారు. హిందు వ్యతిరేకులు అన్న ముద్ర పడితే ఎక్కడ ఓట్లు రాలవేమోనన్న భయం పట్టుకున్నది వారికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమంటే ఇదేనేమో! -
కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన సోనియా గాంధీ
సాక్షి, చెన్నై : దివంగత నేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కాంస్య విగ్రహాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అన్నా అరివాలయంలోని డీఎంకే ప్రధాన కార్యాయంలో జరిగిన కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రముఖ జాతీయ నాయకులు పాల్గొన్నారు. డీఎంకే అధ్యక్షుడు, కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రజనీకాంత్, శత్రుఘ్నసిన్హా, సీతారాం ఏచూరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైగోలతో పాటు తదితర జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యారు. -
బిర్యానీ లేదన్నందుకు రెచ్చిపోయారు..!
-
బిర్యానీ లేదన్నందుకు రెచ్చిపోయారు.. వైరల్ వీడియో!
సాక్షి, చెన్నై: డీఎంకే కార్యకర్తలు బరితెగించారు. కేవలం బిర్యానీ లేదని చెప్పినందుకు ఓ హోటల్ నిర్వాహకులను చితకబాదారు. డీఎంకే అధినేత, కురువృద్ధుడు ఎం కరుణానిధి ఆరోగ్యం విషమించి.. ఆస్పత్రిలో చేరిన రోజే.. డీఎంకే కార్యకర్తలు ఇలా రౌడీయిజానికి దిగారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చెన్నై విరుగంబాకంలోని ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ హోటల్లో ఐదురోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎంకే కార్యకర్తలు హోటల్‌కు వచ్చి తమకు బిర్యానీ కావాలని ఆర్డర్ చేశారు. అయితే, బిర్యానీ లేకపోవడంతో అదే విషయాన్ని వారికి హోటల్ సిబ్బంది చెప్పారు. దీంతో డీఎంకే కార్యకర్తలు చెలరేగిపోయి.. హోటల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి.. వారిని చితకబాడారు. కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోటల్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీటీవీ పుటేజ్ ఆధారంగా డీఎంకె కార్యకర్తలను గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలపై డీఎంకే వేటువేసింది. -
కలైంజర్ ఆరోగ్యంపై పుకార్లు
డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై బుధవారం పుకార్లు సాగాయి. ఇందుకు తగ్గట్టుగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు గోపాలపురంలో వైద్యుల హడావుడి పెరగడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో పుకార్లు షికార్లు చేశాయి. చివరకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియా ముందుకు వచ్చి వదంతుల్ని నమ్మ వద్దని సూచించారు. సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి రెండేళ్లుగా అనారోగ్యం సమస్యలు, వయోభారంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గోపాలపురంలోని మొదటి అంతస్తులో ఉన్న గదికే ఆయన పరిమితం అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన వెన్నంటి ఉన్నారు. ప్రధాన వీఐపీలు ఎవరైనా వచ్చిన సందర్భంలో కరుణానిధి గుమ్మం వరకు వచ్చి అభిమానులకు అభివాదం తెలిపిన సందర్భాలు అనేకం. అదే సమయంలో కలైంజర్ ఆరోగ్యంపై తరచూ ఉత్కంఠ, ఆందోళనలు, పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత వారం ఆయన కావేరి ఆస్పత్రిలో అడ్మిట్ కావడం ఆందోళనకు దారి తీసింది. చివరకు ఆయనకు గొంతు భాగంలో అమర్చిన ట్యూబ్‌ను తొలగించినట్టు వైద్యలు ప్రకటించడంతో డీఎంకే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు జోరందుకున్నాయి. ఇందుకు తగ్గట్టుగా గోపాలపురానికి వైద్యులు వచ్చి వెళ్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. కరుణకు జ్వరం వదంతులు జోరందుకోవడంతో గోపాలపురం వైపుగా డీఎంకే వర్గాల రాక పెరిగింది. దీంతో మీడియాల్లో హడావుడి ఊపందుకుంది. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై వివరణ కోరేందుకు గోపాలపురానికి పోటెత్తారు. తొలుత వివరణ ఇచ్చే వాళ్లెవరూ లేక పోవడంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మీడియా ముందుకు వచ్చారు. కరుణానిధి ఆరోగ్యంగానే ఉన్నారని, వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు. వైద్యులు రాక గురించి ప్రశ్నించగా, ఆయనకు స్వల్ప జ్వరం వచ్చిందని, అందుకే వైద్యులు వచ్చి పరీక్షించి వెళ్లారన్నారు. వైద్యులు అందించిన చికిత్సతో కరుణానిధికి జ్వరం కూడా తగ్గిందని, ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన వద్దని పేర్కొన్నారు. కలైంజర్ విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొంటూ, ఈ వదంతుల్ని ఎవరో పనిగట్టుకుని సృష్టిస్తున్నట్టుందని మండిపడ్డారు. -
అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్ ఏమన్నారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి.. జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. జయలలిత కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందివ్వాలని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆదివారం జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఈ రోజు ఉదయం ఆమెకు సర్జరీ చేశారు. అయినా పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. -
‘జయలలిత అనారోగ్యంపై వదంతులు’
-
‘జయలలిత అనారోగ్యంపై వదంతులు’
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ప్రభుత్వం అడ్డుకట్టవేయాల్సిన అవసరముందని డీఏంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. జయలలిత అనారోగ్యంకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘గతంలోనే చెప్పినట్టుగా జయలలిత సిద్ధాంతాలతో నేను విభేదిస్తున్నాను. అయితే అనారోగ్యం బారిన పడిన ఆమె త్వరగా కోలుకుని అధికార విధులకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జయలలిత అనారోగ్యంపై కొంతమంది అవాంఛిత వదంతులు ప్రచారం చేస్తున్నందున అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్లు విడుదల చేయాల’ని ఆయన సూచించారు. ‘సోషల్ మీడియాలో కొంత మంది వ్యక్తులు జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్నారు. అధికారిక ప్రకటన చేసి వీటికి అడ్డుకట్టవేయాలి. ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఫొటోలు మీడియాకు విడుదల చేసి వదంతులు వ్యాపింపజేయకుండా చేయాల’ని కరుణానిధి అన్నారు. 68 ఏళ్ల జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా ఈ నెల 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మరిన్ని రోజులు చికిత్స అవసరమని ఆమెకు వైద్యులు సూచించారు. -
మరో వెయ్యి మూత
టాస్మాక్ దుకాణాల మూతకు సిద్ధం పరిశీలనకు శ్రీకారం పట్టినంబాక్కంపై కరుణ ఆగ్రహం మరో వెయ్యి టాస్మాక్ మద్యం దుకాణాల మూతకు తగ్గ కసరత్తుల్లో రాష్ర్ట ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజలకు ఇబ్బంది కరంగా ఉన్న ప్రాంతాల్లోని టాస్మాక్‌ల గుర్తింపు పరిశీలనకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టినంబాక్కం టాస్మాక్ మూతకు పట్టుబడుతూ సాగుతున్న నిరసనలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేదం అన్న వాగ్దానాన్ని అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జె.జయలలిత ఇచ్చిన విషయం తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టగానే, మద్య నిషేధంపై దృష్టి పెడుతూ, తొలుత పని వేళల్ని రెండు గంటల పాటుగా తగ్గించారు. తదుపరి ఐదు వందల టాస్మాక్ దుకాణాల మూతకు చర్యలు చేపట్టి, గత నెలాఖరులో ఆ దుకాణాలకు శాశ్వతంగా తాళం వేశారు. ఐదు వందల దుకాణాలకు తాళం పడ్డా, మద్యం విక్రయాల్లో మాత్రం ఏ మాత్రం తగ్గుదల లేదు. పని వేళలు తగ్గినా, దుకాణాలు మూత బడ్డా, విక్రయాల రూపంలో రాబడి ఏ మాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో మరో వెయ్యి దుకాణాల మూతకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఉన్నది. ఇందుకు తగ్గ ఆదేశాలు రాష్ట్ర మార్కెటింగ్‌కు శాఖకు జారీ చేసి ఉన్నారు. మరో వెయ్యి: ప్రస్తుతం ఐదు వందల దుకాణాలు మూత పడ్డ దృష్ట్యా, మరో వెయ్యి దుకాణాల్ని మూయడానికి తగ్గ పరిశీలనకు శ్రీకారం చుట్టారు. దుకాణాల మూత కసరత్తులో భాగంగా, ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బందికరంగా దుకాణాలు ఉన్నాయో పరిశీలించి, నివేదిక సిద్ధం చేయడానికి జిల్లాకు ముగ్గురితో కూడిన కమిటీలు మంగళవారం రంగంలోకి దిగాయి. ఆలయాలు, పాఠశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోని టాస్మాక్ మద్యం దుకాణాలతో పాటుగా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ఉన్న దుకాణాల్ని మూసి వేయడం లక్ష్యంగా తాజా పరిశీలించనున్నారు. ఈ నెలాఖరులోపు పరిశీలన ముగించి ఈ కమిటీలు ఆయా జిల్లాల కలెక్టర్లకు నివేదికలు సమర్పించనున్నాయి. ఆ నివేదికల్ని కలెక్టర్లు పరిశీలించి, తదుపరి మార్కెటింగ్‌శాఖకు పంపిస్తారు. తదుపరి ఎక్కడెక్కడ వెయ్యి దుకాణాల్ని మూసి వేయాలో అన్న నిర్ణయాన్ని మార్కెటింగ్ శాఖ తీసుకుంటుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లేదా, సెప్టెంబరు వరకు సాగే అవకాశాలు ఉన్నాయి. మరో వెయ్యి దుకాణాల మూతకు తగ్గ కసరత్తుల్లో మార్కెటింగ్ శాఖ నిమగ్నం అయితే, పట్టినంబాక్కం టాస్మాక్ దుకాణం మూతకు రోజుల తరబడి సాగుతున్న నిరసనలపై ఎందుకు స్పందించరంటూ ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ప్రశ్నించారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుకాణాన్ని మూసి వేయకుండా, పోలీసు భద్రత నడుమ విక్రయాలు సాగించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. -
నేరాల నగరం చెన్నై
చెన్నై నగరం నేరాలకు నిలయంగా మారుతోందని, ఇందుకు పోలీసు శాఖ నిర్లక్ష్యమే కారణమని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీనగర్: చెన్నై నగరం నేరాలకు నిలయంగా మారుతోందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు పోలీసు శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో నగరంలో చోటు చేసుకున్న వివిధ నేరాల జాబితాను వివరించారు. ఆ జాబితా ఇలా ఉంది. ఈ నెల 2న చెన్నై నందనంలోని వస్త్ర వ్యాపారి ఇంట్లో రూ. కోటి విలువైన నగలు, నగదు చోరీకి గురయ్యాయి... అదే విధంగా ఉసిలంపట్టి సమీపంలో అక్కాతమ్ముళ్ల హత్య జరిగింది. 3న తిరుచ్చుళిలో డీఎంకే యూనియన్ కోశాధికారి హత్య .. 4న తాంబరం ప్రాంతంలో ముగ్గురు మహిళల నుంచి చైన్ స్నాచింగ్... తిరువన్నామలై జిల్లా, ముళువంబట్టు గ్రామంలో అంధుని కుమార్తె 13 ఏళ్ల విద్యార్థిని అశ్వినిపై అత్యాచారం ఆపై హత్య ... 7న అంబత్తూరు పండ్ల వ్యాపారి ఇంట్లో రూ. రెండున్నర లక్షల చోరీ... చెన్నై పెరియమేడులోని ఫైనాన్స్ యజమాని హత్య... 8న పట్టుకోట్టై వరదరాజ పెరుమాళ్ ఆలయంలో రెండు కిలోల బంగారు నగల చోరీ ... ఆరణిలో ఐదు దుకాణాల్లో చోరీ ... పెరియమేడు పోలీసుస్టేషన్ సమీపంలో ఆర్టీఐ చట్ట సలహాదారు ఇలంగో హత్య... చెన్నై మనపాక్కంలో ఏడు కొత్త కార్ల చోరీ... విల్లివాక్కంలో తాళం వేసిన ఇంట్లో 15 సవర్ల నగలు చోరీ... అరియలూరు సమీపాన తమిలర్ నీతి కట్చి నిర్వాహకులు మురుగేశన్ హత్య... 9న కోవైలో మాజీ డీఎస్పీ ఇంట్లో 30 సవర్ల నగలు చోరీ... వడపళనిలో బ్యాంకు ఉద్యోగి నాగేశ్వరరాజ్ హత్యా జరిగాయని కరుణానిధి ఆ ప్రకటనలో వివరించారు. ఈ జాబితాలో వివాహేతర సంబంధాల వల్ల జరిగిన హత్యలను చేర్చలేదని తెలిపారు. చెన్నై, పరిసర ప్రాంతాల్లో గత 10 రోజుల్లో జరిగిన హత్యలు, చోరీలు, చైన్ స్నాచింగ్‌లు తదితర నేరాలను పరిశీలిస్తే అసలు పోలీసు శాఖ పనిచేస్తోందా? అనే సందేహం కలుగుతోందన్నారు. అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రాన్ని శాంతివనంగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని, నేరాలను అరికట్టి శాంతి భద్రతలను పరిరక్షిస్తామని ప్రకటించారని అయితే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. ఆదిలోనే హంసపాదు అన్న విధంగా ప్రభుత్వం పనిచేసే తీరు ఇదేనా? అంటూ జయలలిత ప్రభుత్వంపై మండిపడ్డారు. చెన్నై నగరం కిరాయి మూకల గుప్పెట్లో నడుస్తోందా? అన్న సందేహం ఏర్పడుతోందని తెలిపారు. -
కరుణే సీఎం!
అవినీతి రహిత పాలన తథ్యం ఆ నోట్ల కట్టలతో అనుమానాలేన్నో అరవకురిచ్చిలో స్టాలిన్ సుడిగాలి పర్యటనతో ప్రచారం సాక్షి, చెన్నై: ఆరోసారి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి సీఎం కాబోతున్నారని ఆ పార్టీ దళపతి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, కమీషన్ రహిత పాలనను అందిస్తామని వ్యాఖ్యానించారు. కరూర్, తిరుప్పూర్‌లలో పట్టుబడ్డ నోట్ల కట్టలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. అరవకురిచ్చిలో బుధవారం స్టాలిన్ సుడిగాలి పర్యటన చేశారు. తంజావూరు, అరవకురిచ్చిలలో ఎన్నికలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇక్కడ సాగిన ఓటుకు నోట్ల కట్టల వ్యవహారాన్ని ఎన్నికల యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. విచారణకు రెండు ప్రత్యేక బృందాల రంగంలోకి దిగాయి. ఇక్కడకు అదనపు పారామిలటరీ బలగాల్ని పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అరవకురిచ్చి బరిలో ఉన్న తమ అభ్యర్థి కేసీ పళనిస్వామికి మద్దతుగా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలో రోడ్‌షో రూపంలో చక్కర్లు కొట్టారు. అక్కడక్కడ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ 232 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడబోతున్నాయని వ్యాఖ్యానించారు. అధినేత కరుణానిధి ఆరో సారి సీఎం కావడం తథ్యం అని ఇప్పటికే ధ్రువీకరించ బడిందని, మరికొన్ని గంటల్లో అధికార పూర్వక ప్రకటన వెలువడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఇక్కడి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ ఇది వరకు కరూర్ నుంచి పోటీ చేశారని, అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న సమాచారంతో మకాంను ఇక్కడికి మార్చరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రవాణామంత్రిగా బస్సు చార్జీల్ని పెంచడం మొదలు ఆ శాఖలో చేతికి అందింది దోచుకోవడం వరకు పనితనాన్ని ప్రదర్శించిన సెంథిల్ బాలాజీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తాను వేషం మార్చానంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారని గుర్తు చేశారు. తానేమీ వేషం మార్చలేదని, మనకు మనమే సమయంలో విద్యార్థులు, యువతతో కలిసి సాగించిన సమీక్షలు, సమావేశాల అనంతరం తాను కూడా విద్యార్థిగా, యువతగా మారినట్టు వ్యాఖ్యానించారు. తానేదో షూటింగ్‌ల కోసం ఈ వేషం మార్చలేదని, మీటింగ్‌ల కోసం అన్నది గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులు వడ్డీ మాఫీ చేయాలని తనను కోరారని, ఇదే విషయాన్ని అధినేత కరుణానిధి దృష్టికి తీసుకెళ్లగా, ఏకంగా రుణాల్ని మాఫీ చేద్దామని చెప్పినట్టు వివరించారు. ప్రజాహిత పాలన మరికొన్ని గంటల్లో రాబోతోందని, అవినీతి , కమీషన్ రహిత సుపరిపాలనను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే నియోజకవర్గంలో తమ అభ్యర్థి కలైయరసన్కుమద్దతుగా ఎండీఎంకే నేత వైగో ప్రచారం సాగించారు. -
డీఎంకే @118-120!
సీఎం కరుణేనని మక్కల్ ఆయువగం సర్వే గెలుపునకు మరింతగా శ్రమించండి కార్యకర్తలకు కరుణ లేఖ సొంత గడ్డలో ప్రచారం తమిళనాడు తదుపరి సీఎం డీఎంకే అధినేత ఎం కరుణానిధి అని మక్కల్ ఆయువగం స్పష్టం చేసింది. లయోలా కళాశాల విద్యార్థులతో కూడిన ఈ బృందం గతంలోనూ ఎన్నికలకు ముందుగా జరిపిన సర్వేలు కొంత మేరకు సఫలీకృతం కావడం గమనార్హం. డీఎంకే 118-120 సీట్లను కైవశం చేసుకుంటుందని, తదుపరి స్థానంలో అన్నాడీఎంకే 98 సీట్ల వరకు దక్కించుకుంటుదని తమ సర్వే వివరాల్ని శుక్రవారం ఆ సంస్థ నిర్వాహకుడు రాజనాయగం ప్రకటించారు. చెన్నై : రాష్ర్టంలో ప్రజా నాడి ఈ సారి అంతు చిక్కడం లేదు. దీంతో సర్వేల గోల తారా స్థాయికి చేరి ఉన్నది. ఇప్పటికే పలు సంస్థలు సంఘాలు సర్వేలు జరిపి ఉన్నాయి. ఇందులో కొందరు డీఎంకే, అంటే మరి కొందరు అన్నాడీఎంకేకు జై కొట్టి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు, ఎన్నికలకు ముందుగా లయోల విద్యార్థులతో కూడిన మక్కల్ ఆయువగం సంస్థ రాష్ట్రంలో సర్వేలు చేపట్టడం జరుగుతూ వస్తున్నది. చెన్నైకు చెందిన ఈసంస్థ అభ్యర్థుల జాబితా విడుదల, నామినేషన్ల పర్వం ముగియడం, ప్రచారం తారా స్థాయికి చేరి, చివరి క్షణాలకు చేరడం వరకు పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో సర్వే సాగించి ఉన్నది. ఇందుకు తగ్గ వివరాల్ని శుక్రవారం చెన్నై ప్రెస్‌క్లబ్‌లో ఆ సంస్థ నిర్వాహకుడు రాజనాయగం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా నాడి డిఎంకే వైపుగానే ఉందని వివరించారు. ఆ పార్టీకి 118-120 సీట్లు రావడం ఖాయం అని వ్యాఖ్యానించారు. ఆ కూటమిలోని కాంగ్రెస్‌కు ఎనిమిది లేదా పది సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. ఇక, అన్నాడీఎంకేకు 98లోపు సీట్లు, డీఎండీకే ప్రజా సంక్షేమ కూటమికి ఎనిమిది లోపు దక్కే అవకాశాలు ఉన్నాయని వివరించారు. డిఎంకేకు 42. 7 శాతం, అన్నాడీఎంకేకు 36.6 శాతం మంది మద్దతు ఇచ్చి ఉన్నారని, ఈ దృష్ట్యా, తదుపరి సీఎం పగ్గాలు కరుణానిధి చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. గతంలో ఇదే సంస్థ పలు సర్వేలు సాగించింది. ఇందులో అనేకం దరిదాపుల్లో సఫలీకృతం అయినా, చివరి క్షణంలో ఓటరు నాడి ఎలా ఉంటుందో చెప్పలేం... గెలుపు కోసం శ్రమిద్దాం: అన్నాడీఎంకేలో ఓటమి భయం పెరిగిందని, అందుకే ఓటుకు నోట్ల కట్టల్ని చల్లుతున్నారంటూ డిఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు. ఆ నోట్ల గురించి ఆలోచించ వద్దని, ఓట్లు ఎలా రాబట్టాలో అన్న విషయంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు కరుణానిధి లేఖ రాశారు. డిఎంకేకు అనుకూలంగా వాతావరణం మారి ఉండడంతో దాడులకు, జులుంలకు అన్నాడీఎంకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఓటమి తప్పదన్న భయంతో నోట్ల కట్టల్ని చల్లుతున్నారన్న విషయం గురించి పట్టించుకోవద్దని, ఓటర్లను ఆకర్షించి ఎలా డీఎంకేకు అనుకూలంగా మలచుకోవాలో అన్న నినాదంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని విన్నవించారు. ఇక, తన సొంత గడ్డ, తాను పోటీలో ఉన్న తిరువారూర్ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు కరుణానిధి తీవ్ర ప్రచారం చేశారు. రోడ్‌షో రూపంలో గ్రామ గ్రామన తిరుగుతూ గెలిపించాలని విన్నవించారు. ఇక, శనివారం సాయంత్రం మూడు గంటలకు చింతాద్రి పేటలో జరిగిన సభతో తన ఎన్నికల ప్రచారాన్ని కరుణానిధి ముగించనున్నారు. ఈ సమయంలో ఆయన చేయబోయే ప్రసంగం మీద సర్వత్రా దృష్టి పెట్టి ఉన్నారు. -
మేము రెడీ.. మరి వాళ్లో!
సాక్షి, చెన్నై: అధికారంలోకి రాగానే, తమ వాళ్లకు చెందిన మద్యం తయారీ పరిశ్రమలన్నీ మూత వేయడానికి సిద్ధమయ్యామని డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి అంటున్నారు. ఇది, తానొక్కదాన్నే చెప్పడం లేదని, ఆయా సంస్థలకు చెందిన వాళ్లూ రెడీ అయ్యారని వ్యాఖ్యానిస్తూ, మరి మిడాస్కు తాళం ఎప్పుడు పడుతుందో అని ప్రశ్నించారు. రాష్ర్టంలో సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో అన్ని పార్టీలు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే కూడా ఉంది. అన్నాడీఎంకే మాత్రం దశల వారీ అన్న నినాదాన్ని ప్రకటించి ఉన్నది. డీఎంకే అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యనిషేధం లక్ష్యంగా చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించి, ప్రజల్లోకి ఆ నినాదాన్ని తీసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, డిఎంకేకు చెందిన నాయకులు అన్నాడీఎంకే వర్గాలపై, అన్నాడీఎంకే నాయకులు డీఎంకే వర్గాలకు సవాళ్లు విసురుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం, అధికారంలోకి రాగానే తమ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అని డీఎంకే నినాదం అందుకోగా, మరీ తమరెప్పుడు అంటూ అన్నాడీఎంకే మద్యం ఫ్యాక్టరీ యజామానుల్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి, ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే తమ వాళ్లందరూ మద్యం ఫ్యాక్టరీలను మూసి వేయడానికి సిద్ధం అయ్యారని వ్యాఖ్యానించారు. ఈ మాట అన్నది తాను మాత్రమే కాదు అని, సంబంధిత వ్యక్తులు కూడా స్పష్టం చేసి ఉన్నారన్నారు. అయితే, తాము రెడీ అయ్యామని, అలాంటప్పుడు వాళ్లకు చెందిన ‘మిడాస్’ ఎప్పుడు మూసి వేయబోతున్నారో ప్రశ్నించడంటూ మీడియాకు సూచించారు. అన్నాడీఎంకే వర్గాలకు చెందిన మిడాస్లో అనేక బ్రాండ్ల మద్యం తయారు అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు మద్యం సరఫరా అవుతున్నది. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న మిడాస్ను ఎప్పుడు మూస్తారో అంటూ కనిమొళి ప్రశ్నించడం విశేషం. అయితే, డీఎంకే అధికారంలో వస్తే, సర్వాధికారాలు వారి చేతికి వచ్చినట్టే. అలాంటప్పుడు ‘మిడాస్’ను మూయించ లేరా..?, మరీ, వాళ్లే ఎందుకు తాళం వేసుకోవాలో..? అని పెదవి విప్పే వాళ్లే అధికం. -
మౌనం వీడండి!
ప్రధానికి కరుణ సూచన కొనసాగుతున్న దాడులు తనిఖీలు ముమ్మరం సాక్షి, చెన్నై: తమిళనాట ఎన్నికల్లో అధికార పక్షం అవినీతి సొమ్ము బయట ప డుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి సూచించారు. ఇప్పటి కైనా మౌనం వీడి తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నగదు బట్వాడా లక్ష్యం గా ఈసీ కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది రూపాయల మేరకు నగదు పట్టుబడుతున్నా, ఇంత వరకు కేసులు మాత్రం నమోదు కాలేదని చెప్పవచ్చు. ఇవన్నీ అన్నాడీఎంకే వర్గాలకు చెందిన సొమ్ముగా మీడియాల్లో కథనా లు వెలువడుతూ వస్తున్నాయి. ఆదివా రం కూడా పెద్ద ఎత్తున నగదు, తాయిలాలు పట్టుబడ్డాయి. మదురైలో రెండాకుల చిహ్నంతో కూడిన 60 ఫ్రిడ్జ్‌లు, నాట్రాంపల్లిలో రెండాకుల చిహ్నంతో కూడి రూ. కోటి 11 లక్షలు విలువగల వస్త్రాలు, కడలూరులో మంత్రి సంపత్ ఇంటికి సమీపంలో మినీలారీలో ఉన్న వస్తువులు, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం ఇలాక బోడి నాయకనూరులో రెండు లారీల్లో తీసుకొచ్చిన చీరలు, టో పీలను, పందలూరులో ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, రాశిపురంలో అన్నాడీఎంకేకు చెందిన నాయకుడి పరిశ్రమ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అ యితే, ఇంతవరకు పట్టుబడ్డ నగదు, వస్తువులు, వస్త్రాలు ఎవరివో అన్న వివరాలు మాత్రం బయటకు రావడం లే దు. కేసులు కూడా నమోదు కాలేదని చె ప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇదే అంశాల్ని ఎత్తి చూపుతూ డీఎంకే అధినే త ఎం కరుణానిధి ఎన్నికల యంత్రాం గానికి ప్రశ్నల్ని సంధించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రజ ల తరఫున నిలదీస్తూ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకే సర్కారు ఐదేళ్లల్లో సాగించిన అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు. పట్టుబడుతున్న నగదు, తాయిలాలు అన్నీ ఆ పార్టీ వారికి చెందినవిగా సంకేతాలు వ స్తున్నాయని, అయితే, ఇంత వరకు వివరాలు ప్రకటించక పోవడం శోచనీయమన్నారు. తమిళనాట సాగిన అవినీతి అక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టాలని సూచి స్తూ, తాజాగా సాగుతున్న వ్యవహారాల పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌ నంగా ఉన్నారో అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి కల్పించుకోవద్దని హితవు పలికారు. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు..
ఐల్యాండ్ గ్రౌండ్ వేదికగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్నికల్లో భాగంగా ప్రసంగించనున్నారు. మే ఐదో తేదీన సాయంత్రం జరిగే బహిరంగ సభకు లక్షల మందిని సమీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లును డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు గురువారం పరిశీలించారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్ని డీఎంకేతో కలిసి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎంకే కేటాయించిన 41 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఆయా అభ్యర్థులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. వీరికి మద్దతుగా డీఎంకే తరఫున కరుణానిధి,దళపతి స్టాలిన్, ఎంపీ కనిమొళి ప్రచారం చేస్తున్నారు. గురువారం కరుణానిధి తిరుచ్చిలో పర్యటించి ఓటర్లను తనకు మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. అలాగే, మరో మూడు వారాల్లో అన్నాడీఎంకేను సాగనంపేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇక, దళపతి స్టాలిన్ చెన్నైలో సుడిగాలి పర్యటన చేశారు. అన్నాడీఎంకేకు అన్ని స్థానాల్లోనూ పతనం ఖాయం అని జోస్యం చెప్పారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పయనానికి ఏఐసీసీ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు మే ఐదో తేదీన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ చెన్నై, పుదుచ్చేరిల్లో పర్యటించనున్నారు. తదుపరి రాహుల్ గాంధీ రాష్ర్టంలో పర్యటించనున్నారు. సోనియా పర్యటన తేధీ ఖరారు కావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై కాంగ్రెస్, డీఎంకే వర్గాలు దృష్టి పెట్టాయి. ఒకే వేదికపై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఒకే వేదికపై కొన్నేళ్ల తర్వాత ప్రత్యక్షం కాబోతున్నారు. ఇందుకు వేదికగా చెన్నై ఐల్యాండ్ గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. ఐదో తేదీ సాయంత్రం ఇక్కడ భారీ బహిరంగ సభ, కాంగ్రెస్ అభ్యర్థులు, డీఎంకే అభ్యర్థుల పరిచయంతో సోనియా గాంధీ, కరుణానిధిల ప్రసంగం సాగబోతున్నది. లక్ష మందిని సమీకరించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నాయి. ఉదయం ఐల్యాండ్ గ్రౌండ్లో ఏర్పాట్లకు సంబంధించి డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అభ్యర్థి శేఖర్ బాబు, కాంగ్రెస్ అభ్యర్థులు రాయపురం మనో, కరాటే త్యాగరాజన్ పరిశీలన జరిపారు. అదే రోజు సోనియా గాంధీ పుదుచ్చేరిలోనూ పర్యటించనున్నారు. 30 స్థానాల్ని కల్గి ఉన్న పుదుచ్చేరిలో కాగ్రెస్ 20, డీఎంకే పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ఇరు పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఉదయం ప్రచార బహిరంగ సభ జరగనున్నది. ఇందులో సోనియాగాంధీ పాల్గొననున్నారు. అయితే, కరుణానిధి పాల్గొంటారా... అన్నది ఖారారు కావాల్సి ఉంది. వయోభారంతో ఉన్న కరుణానిధి పుదుచ్చేరి నుంచి ఆగమేఘాలపై మళ్లీ చెన్నైకు రావాలంటే సమస్యలు తప్పవు. అందుకే పుదుచ్చేరి సభకు ఆయన దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువే. -
'నాకున్న ఆస్తి నా ఇద్దరు భార్యలే'
చెన్నై: తనకున్న ఆస్తి తన ఇద్దరు భార్యలేనని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి అన్నారు. తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి తన ఆస్తులకు సంబంధించిన వివరాలను సమర్పించారు. తనకు స్థిరాస్తులు, వ్యవసాయ భూములు లేవని ఆయన పేర్కొన్నారు. తనకున్న ఆస్తి ఇద్దరు భార్యలు దయాళు అమ్మాళ్, రాజాత్తి అమ్మాళ్లు మాత్రమేనని తెలిపారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.62.99 కోట్లని చెప్పారు. రెండో భార్య రాజాత్తి అమ్మాళ్కు రూ.11.94 కోట్ల అప్పున్నట్లు పేర్కొన్నారు. 2014-15లో తన ఆదాయం రూ. 1.21 కోట్లు మాత్రమేనని, తన చేతిలో ప్రస్తుతం రూ .50 వేలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే తన చరాస్తులు అన్ని కలిపి రూ.13.42 కోట్లుగా చూపించారు. 92 ఏళ్ల కరుణానిధి తిరువరూర్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. తన భార్యల ఆస్తుల విలువ రూ.41.13 కోట్లుగా 2011 ఎన్నికల్లో చూపించారు. -
అంతా అమ్మే!
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజా సంక్షేమ కూటమి అలియాస్ కెప్టెన్ టీంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయోనన్న ప్రశ్న బయలు దేరింది. ఇంతకీ వీరంతా కలసి కట్టుగా ముందుకు సాగుతారా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో నెలకొంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ నాయకుల ఆదివారం భిన్న స్వరాలు పలకడం గమనార్హం. ఒక్కో నేత ఒక్కో వ్యాఖ్యలు, నియోజకవర్గాల ఎంపిక వ్యవహారాల్లోనూ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోంది. అన్నాడీఎంకే సర్కారు, సీఎం జయలలిత తీరుపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగానే దుయ్యబట్టారు. అంతా..అమ్మే అంటూ సాగుతున్న పర్వాన్ని గుర్తు చేస్తూ సైటె ర్లతో విరుచుకు పడ్డారు. ఒక కేంద్ర మంత్రి ఇలా తీవ్రంగా దుయ్యబడుతూ స్పందిస్తుంటే, సమాధానం ఏమిటో అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రశ్నించారు. అన్నాడీఎంకేలో గానీయండి, ప్రభుత్వంలో గానీయండి సర్వం అమ్మే(జయలలిత). ఆమెను ధిక్కరిస్తే పదవి ఊడుద్ది. అలాగే, ఢిల్లీ నుంచి ఎంతటి వారొచ్చినా, అమ్మ దర్శనం కోసం వేచిచూడాల్సిందే. అమ్మ అనుమతిస్తే తప్ప సచివాలయం గేట్లు, పోయెస్ గార్డెన్ తలుపులు తెరుచుకోవు. ఈ విషయాల్ని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించిన వాళ్లు అరుదే. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే మంత్రుల్ని, సీఎం తీరును బహిరంగంగా సెటైర్లతో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించడం సర్వత్రా విస్మయానికి గురి చేసి ఉన్నది. అదే సమయంలో ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం ఏమిటంటూ ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి నిమగ్నమయ్యారు. పీయూష్ సెటైర్లు: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బహిరంగంగా అన్నాడీఎంకే సర్కారును టార్గెట్ చేసి విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ విరుచుకు పడడం చర్చనీయాంశంగా మారింది. కేబినెట్ పదవిలో ఉన్న మంత్రి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సెటైర్లతో అన్నాడీఎంకేను ఎన్నికల సమయంలో ఇరకాటంలో పెట్టే యత్నం చేశారని చెప్పవచ్చు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు చెంప పెట్టుగా పీయూష్ తన గళాన్ని విప్పి ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో విద్యుత్ పథకాల గురించి చర్చించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తనకు సమానం అని, అయితే, తమిళనాడు విషయానికి వచ్చే కొద్ది, అక్కడ అధికార మార్పుతోనే కొత్త పథకాల అమలు సాధ్యం అవుతుందేమో..? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు చేపట్టి 22 నెలలు అవుతోందని గుర్తు చేస్తూ, ఈ కాలంలో అక్కడి సీఎంను సంప్రందించేందుకు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సి ఉందని విమర్శించారు. ఎట్టకేలకు ఓ మారు అనుమతి దక్కినా, తదుపరి అటు వైపు నుంచి స్పందన లేదని, అక్కడి విద్యుత్ మంత్రిని ప్రశ్నిస్తే...అంతా...అమ్మ..అమ్మే అని దాట వేత ధోరణి అనుసరిస్తున్నారని...ఇదే ప్రజాహితం అని మండిపడ్డారు. తమిళనాడులో విద్యుత్ ప్రగతిని కాంక్షించే పథకాలు అమలు చేద్దామనుకుంటే, అక్కడి ప్రభుత్వం అనుమతి కోసం తానేదో వేచి చూడాల్సినంతగా పరిస్థితి ఉందని, ఇలా కొనసాగడం మంచి పద్ధతి కాదని, ఇకనైనా మారండి లేదా మార్పుతోనైనా ముందుకు సాగడంటూ పరోక్షంగా అన్నాడీఎంకే పతనాన్ని కాంక్షిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఒక కేంద్ర మంత్రి ఇలా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పించడాన్ని అస్త్రంగా చేసుకున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రభుత్వాన్ని నిలదీసే పనిలో పడ్డారు. సమాధానం ఏమిటో : రాష్ట్రానికి పథకాలు రానివ్వకుండా అడ్డుకునే విధంగా ప్రభుత్వమే వ్యవహరిస్తున్నదంటూ కేంద్ర మంత్రి విమర్శిస్తుండడం బట్టి చూస్తే, ఇక్కడ ఏ మేరకు పాలన సాగుతోందో అర్థం చేసుకోవచ్చని ఓ ప్రకటనలో కరుణానిధి మండి పడ్డారు. కేంద్ర మంత్రి సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం, సీఎం జయలలిత ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారని నిలదీశారు. బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటే, ఏ మేరకు అనుమతి కోసం ప్రయత్నాలు చేసి విసిగి ఉంటారో స్పష్టం అవుతోందని మండి పడ్డారు. ఒక్క విద్యుత్ శాఖ మంత్రి తన ఆవేదనను వ్యక్తం చేసి ఉంటే, మిగిలిన కేంద్ర మంత్రులు ఈ ప్రభుత్వంతో సంప్రదింపులకు మరెన్ని కష్టాలు పడుతున్నారో పీయూస్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సిందేనని జయలలితకు డిమాండ్ చేశారు. -
భిన్న స్వరాలు
ఆహ్వానం మాత్రమే స్టాలిన్ వ్యాఖ్యతో గందరగోళం అధినేత వ్యాఖ్యల వక్రీకరణ కరుణతో జవహరుల్లా సమావేశం వైగొ సెటైర్లు డీఎండీకేతో పొత్తు వ్యవహారంగా డీఎంకేలో భిన్న స్వరాలు బయలు దేరాయి. అధినేత కరుణానిధి చర్చలు అని వ్యాఖ్యానించిన సమయంలో దళపతి స్టాలిన్ కేవలం ఆహ్వానంతో సరిపెట్టడం గందరగోళానికి దారి తీసింది. ఇదే అదనుగా డీఎంకేలో సాగుతున్న పరిణామాలపై ఎండీఎంకే నేత వైగో సెటేర్లు వేసే పనిలో పడ్డారు. ఇక తమ మద్దతు మీకే అంటూ కరుణానిధితో ఎంఎంకే నేత జవహరుల్లా భేటీ అయ్యారు. చెన్నై : అధికారమే లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన రాజతంత్రాల్ని ప్రయోగించే పనిలో పడ్డారు. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక బిజీలో ఉన్న కరుణానిధి సోమవారం మీడియా ముందుకు వచ్చారు. డీఎండీకే తమతో దోస్తీ కట్టడం ఖాయం అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, అందుకు తగ్గ చర్చలు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. తాను రాను బాబోయ్ ...! అంటూ, ఒంటరి..! నినాదంతో డీఎండీకే అధినేత విజయకాంత్ ముందుకు సాగుతున్నా, డీఎంకేను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నా, కరుణానిధికి అవి పట్టనట్టుందని, పొత్తు కోసం దిగజారినట్టున్నారన్న వ్యంగ్యాస్త్రాలు సంధించే వాళ్లు పెరిగారు. అపర రాజకీయ మేధావి కరుణానిధి డీఎండీకే కోసం ఇంతగా ప్రాకులాడడం ఏమిటో ...? అని పెదవి విప్పే వాళ్లు పెరిగారు. వ్యంగ్యాస్రాలు : వ్యంగ్యాస్త్రాలు, పెదవి విప్పే వాళ్లు పెరిగిన సమయంలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు భిన్న స్వరాలతో గందరగోళానికి దారి తీసి ఉన్నది. డీఎండీకేకు కేవలం ఆహ్వానం మాత్రం పలికామేగానీ, ఇంత వరకు ఎలాంటి చర్చలు జరపలేదంటూ స్పష్టం చేశారు. ఎప్పుడో ఆహ్వానాన్ని తమ అధినేత కరుణానిధి పలికారే గానీ, కొత్తగా మరో మారు ఆహ్వానించ లేదని, చర్చలకు నిర్ణయించ లేదని వివరించారు. ఇదే విషయాన్ని తమ అధినేత కరుణానిధి వ్యాఖ్యానిస్తే, దానిని వక్రీకరించి వార్తలు, కథనాలు వెలువరించి ఉన్నారంటూ నిందల్ని మీడియా మీదకు నెట్టేయడం గమనార్హం. ఈ భిన్న స్వరాలు డీఎంకే కేడర్‌లో గందరగోళం రేపగా, కొన్ని పార్టీలు ఇదే అదునుగా డీఎంకే టార్గెట్ చేసి విమర్శలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డాయి. విడ్డూరం: ఎండీఎంకే నేత వైగో మీడియాతో మాట్లాడుతూ అధినేత కరుణానిధి చేసిన వ్యాఖ్యల్ని ధిక్కరించి మరీ దళపతి స్టాలిన్ తన స్వరాన్ని పలకడం విడ్దూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సోదర సమానులైన కరుణానిధి ఏమో, చర్చలు అంటారు, ఆయన దళపతి ఏమో కేవలం ఆహ్వానం అంటారు..!. ఇంతకీ డీఎంకేలో ఏమి జరుగుతున్నదో అన్న ప్రశ్న బయలు దేరిందని అనుమానం వ్యక్తం చేశారు. కరుణానిధి వ్యాఖ్యల్ని ధిక్కరించి మరీ స్టాలిన్ తన స్వరాన్ని పెంచుతూ, స్పందించడం బట్టి చూస్తే, కుటుంబ చట్రంలో రాజకీయ మేధావి చిక్కినట్టు ఉన్నారేమో అని పేర్కొన్నారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ ఓ మీడియాతో పేర్కొంటూ, డీఎండీకేను అక్కున చేర్చుకునే పరిస్థితిలో డీఎంకే దళపతి స్టాలిన్ లేరన్న విషయం స్పష్టం అవుతోందన్నారు. అందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉన్నారని, అదే సమయంలో రెండు రోజుల క్రితం అధికారంలో వాటా ఇవ్వం అన్న విషయాన్ని కూడా డీఎండీకేను ఉద్దేశించే స్టాలిన్ స్పందించినట్టుందని వ్యాఖ్యానించారు. సీఎం లేదా డిప్యూటీ సీఎం, అధికారంలో వాటా కోసం డీఎండీకే నేత విజయకాంత్ ఎదురు చూస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనని, అందుకే కాబోలు ఆ పార్టీని దగ్గరకు రానివ్వకుండా స్టాలిన్ వ్యూహ రచనల్లో ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై స్పందిస్తూ, డీఎండీకే తమ వైపునకు వస్తుందన్న నమ్మకాన్ని కరుణానిధి వ్యక్తం చేయడం, దానికి స్టాలిన్ మరో గళాన్ని విప్పడం వారి వారి వ్యక్తి గతం అని వ్యాఖ్యానించారు. అయితే, విజయకాంత్ దోస్తీకి సిద్ధ పడ్డ పక్షంలో, డీఎండీకే గొడుగు నీడన డీఎంకే నడవాల్సి ఉంటుందన్న విషయాన్ని కరుణానిధి గుర్తించాలని, ఇదే విజయకాంత్ అభిమతంగా చమత్కరించారు. కరుణతో జవహరుల్లా : ఓ వైపు భిన్న స్వరాల గందరగోళం చర్చ సాగుతున్నా, వాటితో తమకు పని లేదన్నట్టు మనిదయనేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) నేతలు డీఎంకే అధినేత కరుణానిధితో సమావేశం అయ్యారు. ఆ పార్టీ నేత జవహరుల్లా నేతృత్వంలో ప్రతినిధుల బృందం మధ్యాహ్నం గోపాలపురం మెట్లు ఎక్కారు. తమ మద్దతు మీకే అంటూ కరుణానిధికి లేఖను సమర్పించారు. డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయానికి శ్రమిస్తామని హామీ ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు విషయంగా దళపతి స్టాలిన్‌తో సమావేశం అయ్యేందుకు ఈ బృందం నిర్ణయించింది. -
కరుణలో ఓటమి భయం
చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఘోర పరాజయం భయం పట్టుకుని ఉన్నదని ఎండీఎంకే నేత వైగో ఎద్దేవా చేశారు. అందుకే డీఎండీకే కోసం తీవ్రం గా పాకులాడుతున్నారని విమర్శించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో ప్రేమి‘కుల’ చిచ్చుకు శంకర్ బలైన విషయం తెలిసిం దే. నడి రోడ్డులో వందలాది మం ది జనం చూస్తుండగా సాగిన ఈ పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, శంకర్‌ను హతమార్చిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంక్షేమ కూటమి నేతృత్వంలో వళ్లువర్ కోట్టంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ తదితరులు పాల్గొన్నారు. పరువు హత్యల్ని ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ డీఎంకేలో ఓటమి భయం బయలు దేరి ఉన్నదని ఎద్దేవా చేశారు. ఘోర పరాజయం తమకు తప్పదని గ్రహించిన ఆ పార్టీ అధినేత కరుణానిధి డీఎండీకే జపం చేస్తున్నారని విమర్శించారు. సోదర సమానులైన కరుణానిధి లాంటి రాజకీయ మేధావి పరిహాసానికి గురి కాకూడదన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. అయితే ఆయన తెలిసో, తెలియకనో డీఎండీకే తమ వైపే.. తమ వైపే అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. నిన్నటి రోజు కూడా దోపిడీ ముఠాతో పొత్తు ప్రసక్తే లేదని విజయకాంత్ స్పష్టం చేసి ఉంటే, ఇప్పుడేమో ఆయన వస్తారన్న నమ్మకాన్ని కరుణానిధి వల్లించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. -
పొత్తు ప్రయత్నాలను చెడగొట్టద్దు
- మీడియాకు స్టాలిన్ చురక - రసవత్తరంగా అసెంబ్లీ పోరు - కరుణ ప్రచార పయనం - ప్రత్యేక వాహనం సిద్ధం ఊహా జనిత కథనాలతో పొత్తు ప్రయత్నాల్ని చెడగొట్టద్దని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఆ పాపాన్ని తమరెందుకు మూట గట్టకుంటారంటూ మీడియాకు చురకలు అంటించారు. ఈ సారి ప్రచార పయనానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అన్ని హంగులతో ప్రచార రథం కోయంబత్తూరులో రూపుదిద్దుకుంటోంది. సాక్షి, చెన్నై : రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు లక్ష్యంగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఈ సారి చాన్స్ చేజారిన పక్షంలో కష్టాలు తప్పవన్న భావనతో ప్రజలతో మమేకమయ్యే దిశగా డీఎంకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు డీఎంకేను ఇరకాటంలో పడేస్తున్నాయి. పొత్తు కసరత్తుల్లో గానీయండి, సీట్ల పందేరాల్లో గానీయండి, ఆశావహుల ఎంపికలో డీఎంకే వైఖరిని ఎత్తి చూపుతూ వస్తున్న ఈ కథనాలపై డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశావహుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్న సమయంలో వస్తున్న కథనాలు, పొత్తు ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టించే రీతిలో ఎదురు అవుతున్న పరిణామాల్ని స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. ఆదివారం తిరుచ్చి వెళ్తూ, మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో ప్రతినిధులకు చురకలు అంటించే ప్రయత్నాన్ని స్టాలిన్ చేశారు. ఊహా జనిత కథనాల్ని దయ చేసి కట్టి పెట్టాలని విన్నవించారు. ఈ కథనాలతో పొత్తు ప్రయత్నాలను చెడగొడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. పొత్తు, సీట్ల పందేరాలన్నీ కొలిక్కి వచ్చాక, తామే స్వయంగా మీడియాను పిలిచి వివరిస్తామన్నారు. అంత వరకు ఊహా జనిత కథనాలను కట్టి బెడితే మంచిదని, ఆ పాపాన్ని తమరెందుకు మూటగట్టుకుంటారంటూ చురకలు అంటించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు సోమవారంతో ముగియనున్నాయని, తదుపరి అధినేత అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చేపడుతారని, అనంతరం పొత్తు ప్రయత్నాలు, సీట్ల పందేరాలు ఉంటాయని వివరించారు. ఇక, తాము చేస్తున్న ఫిర్యాదులపై ఈసీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూస్తామని, లేని పక్షంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అనంతరం తిరుచ్చి చేరుకున్న స్టాలిన్‌కు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. మహిళా విభాగం నేతృత్వంలో ఎన్నికల ప్రచార పర్యటనలపై జరిగిన సమావేశంలో స్టాలిన్ పాల్గొన్నారు. వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం ప్రజా సంక్షేమ సిబ్బందితో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే, సమస్యలన్ని పరిష్కరించ బడుతాయని హామీ ఇచ్చారు. కరుణ కోసం రథం : డీఎంకే అధినేత ఎం కరుణానిధి వయోభారంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల బహిరంగ సభల మినహా, ప్రచారంలోకి ఆయన వెళ్ల లేదు. అయితే, ఈ సారి రాష్ర్టంలో పర్యటించేందుకు కరుణానిధి సిద్ధమయ్యారు. తన పర్యటనకు వీలుగా ఉండేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని సిద్ధం చేయిస్తున్నారు. కోయంబత్తూరులో ఈ వాహనం రూపుదిద్దుకుంటోంది. వీల్ చైర్లో కరుణానిధి ముందుకు సాగుతున్న దృష్ట్యా, అందుకు తగ్గ ఏర్పాట్లు ఆ వాహనంలో సాగుతున్నది. హోం థియేటర్, టీవీ, విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అమరికలు, మైక్రో ఫోన్, వైఫై, సౌకర్యాలతో పాటుగా డిజిటల్ టెక్నాలజీతో కూడిన అతి పెద్ద లౌడ్ స్పీకర్లు తదితర ఏర్పాట్లను అందులో చేస్తున్నారు. ఈ వాహనంలో కరుణానిధికి ఎలాంటి ఇబ్బందులు కల్గని రీతిలో అమరికలు జరుగుతుండడంతో, ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా కరుణానిధి పర్యటించే అవకాశం ఉండడంతో డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
ఇక సమరమే
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 22వ తేదీ నుంచి నామినేషన్లు మే 16న పోలింగ్, 19న ఓట్ల లెక్కింపు తమిళనాడు, పుదుచ్చేరీలకూ ఒకే షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికల గంట మోగింది. రాజకీయపార్టీల గుండెల్లో గెలుపు ఓటముల గుబులు మొదలైంది. రాజకీయ పార్టీలు, ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. తమిళనాడు, పుదుచ్చేరీ రాష్ట్రాల్లో మే 16న పోలింగ్ జరుగుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్జైదీ ఢిల్లీలో ప్రకటన చేయడం ద్వారా సమరశంఖం పూరించారు. శుక్రవారం నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. చెన్నై : రాష్ట్రంలోని రాజకీయపార్టీలను అధికార అందలం ఎక్కించేది అసెంబ్లీ ఎన్నికలే. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేదా డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, వామపక్షాల వంటి జాతీయ పార్టీలైనా, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, తమాకా తదితర ప్రాంతీయ పార్టీలైనా అన్నాడీఎంకే, డీఎంకేల వెనక నడవాల్సిందే. అయితే 2011 నాటి ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. గత ఎన్నికల్లో జయలలిత, కరుణానిధి మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రంగంలో ఉండగా, ఈసారి వారిద్దరితోపాటు డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ బరిలో ఉన్నారు. డీఎండీకే, బీజేపీ, అన్నాడీఎంకే, తమాకాలు పొత్తుల విషయంలో ఇంకా ఊగిసలాట ధోరణినే కొనసాగిస్తున్నాయి. కింగ్‌ను (ముఖ్యమంత్రి) కావాలని పట్టుపడుతున్న విజయకాంత్ ఓ మెట్టుదిగి డీఎంతో పొత్తు కుదిరితే ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీలు మిత్రపక్షాలు మారుతాయని కొందరు అంచనావేస్తున్నారు. డీఎండీకేను ఒకవైపు బీజేపీ, మరోవైపు డీఎంకే, ప్రజాస్వామ్య కూటమిలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. మిత్రపక్షాలు ఎవరో, ప్రతిపక్షాలు ఎవరో ఇంకా రాజకీయ పార్టీలు తేల్చుకోకముందే ఎన్నికల గంట మోగేసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉరుకులు పరుగులు మొదలైనాయి. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలు తిరిగి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు ప్రారంభించాల్సిన తరుణంలో రెండుమూడు రోజుల్లో పొత్తుల కసరత్తును ముగించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ జాగ్రత్త : రాజేష్ లఖానీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినందున కోడ్ అమలులోకి వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ప్రకటించారు. ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రకటనలు చేయకూడదని ఆదేశించారు. ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు తమ ఉత్తర్వులలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయరాదని సూచించారు. వాహనాల తనిఖీలు వెంటనే ప్రారంభించామని, అనధికార నగదు, ఇతర వస్తువులు ఉంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు వినియోగించరాదని అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎటువంటి చర్యలను సహించబోమని పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం తరపున గత కొంతకాలంగా ఆర్థిక సహాయం పంపిణీ సాగుతోందని, ఇకపై పంపిణీ చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈవీఎంలో ఓటువేసి వేసిన తరువాత తమ ఓటు సరైన అభ్యర్థికి పడిందా అని తనిఖీ చేసుకునే వెసులుబాటును ఆ యంత్రాల్లో కల్పించామని తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూలు : ఏప్రిల్ 22వ తేదీన నామినేషన్లు ప్రారంభం ఏప్రిల్ 29వ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగింపు ఏప్రిల్ 30 వ తేదీన నామినేషన్ల పరిశీలన మే 2వ తేదీలోగా నామినేషన్ల ఉపసంహరణ మే 16వ తేదీన పోలింగ్ మే 19వ తేదీన ఓట్ల లెక్కింపు మే 21వ తేదీతో ఎన్నికల ప్రక్రియకు తెర -
బీజేపీతో పొత్తుకు చాన్సే లేదు
సాక్షి, చెన్నై : ఎన్నికల కసరత్తుల్లో ఈసీ దూసుకెళ్తోంటే, పొత్తుల మంతనాల్లో రాజకీయ పక్షాలు పరుగులు తీస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే, బీజేపీ మధ్య కొత్త బంధం కుదిరినట్టు ప్రచారం బయలు దేరడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పొత్తుకు చాన్సే లేదంటూ డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఖరాకండిగా తేల్చారు. ఇక అవన్నీ వ్యూహాలేనని బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న లక్ష్యంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. కాంగ్రెస్, డీఎండీకేలతో కలిసి ఈ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ సిద్ధమైనా, డీఎండీకే నుంచి బహిరంగంగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ, డీఎండీకే, బీజేపీ, డీఎండీకేలతో కూటమి ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు తగ్గట్టుగానే పరోక్ష వ్యాఖ్యల్లో పలువురు కమలనాథులు నిమగ్నం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు కారణం కమలం వెంట నడిచే పార్టీలు రాష్ట్రంలో లేని దృష్ట్యా, ఇక డీఎంకే నీడన చేరక తప్పదన్న కథనాలు బయలు దేరాయి. అలాగే, బీజేపీ డీఎండీకే, డీఎంకే కూటమి ఆవిర్భవించే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకు కుంది. అయితే, వీటిని డీఎంకే , బిజేపీ, డీఎండీకే వర్గాలు ఖండించ లేదు. ఈ పరిస్థితుల్లో ఆథ్యాత్మిక గురువు రవి శంకర్ తో డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ బుధవారం చెన్నైలో భేటీ కావడం తదుపరి పొత్తు ప్రచారాలకు బలం చేకూరే రీతిలో కథనాలు విస్తృతం అయ్యాయి. బీజేపీ, డీఎంకేల మధ్య కొత్త బంధం కుదిరినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇది కాస్త కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చినట్టు అయింది. అదే సమయంలో ఇక, బంధం కుదిరినట్టేనని, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకతో సీట్ల పందేరాలు కొలిక్కి వచ్చినట్టే అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ కొత్త ప్రచార రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్చేయడంతో దీనికి ముగింపు పలికేందుకు డిఎంకే దళపతి స్టాలిన్ రంగంలోకి దిగారు. నీడ కోసం ఎదురు చూస్తున్న కమలం ఆశల్లో నీళ్లు చల్లే విధంగా స్పందించారు. బీజేపీ తో పొత్తుకు చాన్సే లేదంటూ కరాఖండిగా తేల్చారు. ఖండించిన స్టాలిన్: డిఎంకే దళపతి స్టాలిన్ మనకు మనమే నినాదంతో చెన్నైలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన్ను మీడియా చుట్టుముట్టింది. కమలంతో పొత్తు కుదిరినట్టుగా వస్తున్న సమాచారాల మీద ప్రశ్నించింది. ఇందుకు స్టాలిన్ కాస్త ఘాటుగానే స్పందించారు.ఎవరు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద శఠేర్లు, వ్యంగ్యాస్త్రాలు సందించిన వాళ్లంతూ ఇప్పడు తమ వెంట నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బిజేపితో పొత్తు గురించి ఎలాంటి సమాచారం లేదు అని, అందుకు తగ్గ అవకాశాలు లేదని స్పష్టం చేశారు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని తేల్చారు. రవి శంకర్‌తో తన భేటి వ్యక్తిగతం మాత్రమేని పేర్కొన్నారు. చెన్నైకు వచ్చినప్పుడు కలుస్తానని ఆయన పేర్కొన్న మేరకు ఈ భేటి జరిగిందే గానీ, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు అని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరగనున్న ఆయన కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపు నిచ్చారని, అయితే, ఎన్నికల బిజీలో ఉన్నందున తిరస్కరించినట్టు సూచించారు. డిఎంకే కూటమి పై అధినేత కరుణానిధి ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేయబోతున్నారని ముగించారు. అవన్నీ వ్యూహాలు మాత్రమే : డిఎంకే నీడన చేరాలన్న ఆశ బీజేపీ ఉన్నట్టు సంకేతాలు ఉన్నా, చివరకు అది బెడిసి కొట్టడం కమలానికి ఓ షాక్కే. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రం కొత్త వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. ఇంత వరకు పొత్తు ప్రయత్నాల్లో తాము దిగ లేదని , ప్రస్తుతం వస్తున్న వార్తలు, కథనాలు అన్నీ వ్యూహాలు, ప్రచారాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తు వ్యవహారాలను ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని, అధిష్టానం ఆదేశాల మేరకు తమ పయనం అని స్పందించారు. ఇక, రవి శంకర్ , స్టాలిన్ల భేటి వారి వ్యక్తిగతం అని, ఇక, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. -
రేసులో కనిమొళి
సాక్షి, చెన్నై : దరఖాస్తుల పర్వంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ల కోసమే కాదు... రేసులో కనిమొళి సైతం దిగినట్టున్నారు. ఆమె తమ నియోజకవర్గంలో అంటే.. తమ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు చేస్తున్న మద్దతుదారులు పెరుగుతున్నారు. అయితే కని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే.డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి. తన గారాల పట్టిని రాజ్యసభకు పంపించి ఉన్నారు. ఎన్నికల సమయాల్లో తాను సైతం అంటూ ప్రచార బరిలో దిగుతూ వచ్చిన కనిమొళి ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల బరిలో మాత్రం దిగలేదు. ఈ సారి పార్టీ పరంగా ఆమెకు పెద్దపీట వేసి ఉన్నారు. మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆ విభాగం బలోపేతానికి శ్రమిస్తూ వస్తున్న కనిమొళిని తాజాగా ఎన్నికల కదనరంగంలోకి దించేందుకు మద్దతుదారులు సిద్ధం అయ్యారు. డీఎంకే దరఖాస్తుల పర్వంలో కరుణానిధి, స్టాలిన్లు తమ నియోజకవర్గంలో అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని పోటీ పడి మరీ దరఖాస్తులు సమర్పిస్తూ వస్తున్న డీఎంకే నాయకులు సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తున్నది. తాజాగా ఆ రేసులో తానూ అన్నట్టుగా కనిమొళి రంగంలోకి దిగినట్టుంది. కరుణానిధి, స్టాలిన్‌లతో పాటుగా కనిమొళి కోసం దరఖాస్తులు దాఖలు అవుతోండడం ఇందుకు నిదర్శనం. కనిమొళి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాలని ఆశిస్తూ, ఆమె తమ నియోజకవర్గం అంటే, తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని వేలాది రూపాయలు పెట్టి దరఖాస్తుల్ని కొని మద్దతు పలికే పనిలో కొందరు డీఎంకే వర్గాలు పడ్డాయి. గురువారం కనిమొళి కోసం చెన్నై రాయపురం నియోజకవర్గం, మదురవాయిల్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటూ దరఖాస్తులు దాఖలు కావడం విశేషం. ఇక డీఎండీకే వంతు: అన్నాడీఎంకే, డీఎంకే దరఖాస్తుల పర్వం ముగింపు దశలో ఉండగా, పీఎంకే శ్రీకారం చుట్టి ఉన్నది. ఇక డీఎండీకే వంతు వచ్చినట్టుంది. డీఎండీకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తుల దాఖలుకు తేదీని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. ఫిబ్రవరి ఐదో తేదీ ఉదయం పది గంటల నుంచి దరఖాస్తుల్ని కోయంబేడు కార్యాలయంలో విక్రయించనున్నారు. ఫిబ్రవరి 14 సాయంత్రం ఐదు గంటల్లోపు పూర్తి చేసిన దరఖాస్తుల్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక, జనరల్ స్థానానికి దరఖాస్తు రుసుంగా రూ.10 వేలు, రిజర్వుడు స్థానానికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పుదుచ్చేరిలో పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు జనరల్‌కు రూ.5 వేలు, రిజర్వుడుకు రూ.2500 చెల్లించి దరఖాస్తు స్వీకరించాల్సి ఉంటుందని విజయకాంత్ ప్రకటించారు. -
కోర్టుకు హాజరైన కరుణానిధి
-
కోర్టుకు హాజరైన కరుణానిధి
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి (92) సోమవారం చెన్నై కోర్టుకు హాజరయ్యారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. కరుణానిధి వెంట ఆయన కూతురు కనిమొళి, చిన్న కొడుకు స్టాలిన్ ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ కేసు విచారణను మార్చి 10 వ తేదీకి వాయిదా వేసింది. డీఎంకే మేగజైన్లో ప్రచురించిన ఓ వ్యాసంలో తన పరువుకు భంగం కలిగేలా రాశారని ఆరోపిస్తూ గతేడాది జయలలిత పరువు నష్టం దావా వేశారు. కాగా జయ ఆరోపణలను కరుణానిధి ఖండించారు. -
కోర్టుకు వెళ్తున్నా!
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ పరువు నష్టం దావా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కానున్నానని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి వెల్లడించారు. స్టే పొందేందుకు అవకాశం ఉన్నా, చట్టం మీదున్న గౌరవంతో కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే ఆధారరహిత ఆరోపణలు చేసినా, కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా ఎదుర్కొవాల్సిందే. ఆ దిశగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులు, అనేక పత్రికలు ఈ దావాల విచారణల్ని ఎదుర్కొంటూ వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ వార పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని మురసోలి పత్రిక ద్వారా డీఎంకే అధినేత కరుణానిధి ఘాటుగా స్పందించారు. ఆ కథనంలోని ఆరోపణలన్ని ప్రశ్నిస్తున్నట్టు వ్యాఖ్యల్ని సందించారు. దీంతో ఆ వార పత్రికతో పాటు డీఎంకే అధినేత కరుణానిధిపై కూడా ప్రభుత్వ తరపున న్యాయవాదులు కన్నెర్ర చేశారు. సీఎం జయలలిత పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించారంటూ వేర్వేరుగా దావాలను కోర్టులో వేశారు. ఈ దావాల విచారణ చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో సాగుతున్నాయి. విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కరుణానిధికి గత వారం కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో విచారణకు కరుణానిధి నేరుగా హాజరయ్యేనా లేదా, న్యాయవాదుల ద్వారా సమాధానం పంపించడం లేదా, కోర్టుకు హాజరు కాకుండా హైకోర్టు ద్వారా స్టే పొందుతారా..? అన్న ప్రశ్న బయలుదేరింది. అయితే, ఆ మార్గాల్ని పక్కన పెట్టిన కరుణానిధి నేరుగా కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ, తాను కోర్టు విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉన్నట్టు ప్రకటించారు. చట్టం మీదున్న గౌరవంతో సోమవారం జరగనున్న విచారణకు నేరుగా హాజరయ్యేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. కోర్టు సమన్లు తనకు అందాయని, అయితే, విచారణకు హాజరు కాకుండా స్టే తీసుకుంటామని న్యాయవాదులు తనకు సలహా ఇచ్చినట్టు గుర్తుచేశారు. అయితే, ఆ మార్గాన్ని పక్కన పెట్టి కోర్టుల మీదు, న్యాయ, చట్టాల మీదున్న గౌరవంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్టు వివరించారు. తన మీద దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. -
విచారణకు ఆదేశించండి!
సెంబరంబాక్కం చెరువు నుంచి ఒకే సమయంలో భారీ ఎత్తున నీటి విడుదలతోనే చెన్నై అతలాకుతలమైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్‌ను కలుసుకున్నారు. చెన్నై : సెంబరంబాక్కం చెరువు పుణ్యమా చెన్నై ముని గిందన్న సంకేతాలతో ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు బయలు దేరాయి. విచారణ కమిషన్ నియమించాలని పట్టుబడుతూ రాజకీయపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలుసుకుని విచారణకు ఆదేశించాలని విన్నవించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేత దురై మురుగన్, ఎంపీ కనిమొళి తదితరులు సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యకు వినతి పత్రం అందజేశారు. చెన్నై అతలాకుతలం కావడం, ఇందుకు ప్రధాన కారణంగా సెంబరంబాక్కం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం గురించి వివరించారు. కూవంనదిలో లక్ష గణపుటడుగుల మేరకు నీళ్లు వదలి పెట్టడంతో ఆ నది ఉగ్రరూపం దాల్చి ఉన్నదని పేర్కొన్నారు. సెంబరంబాక్కం గేట్లను ముందుగానే ఎత్తివేయడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం ఎదురు చూసి, చివరకు భారీ ఎత్తున బయటకు పంపడంతో చెన్నై పెను ప్రళయాన్ని ఎదుర్కొన వలసి వచ్చిందని వివరించారు. ముందుగానే నీటి విడుదల జరిగి ఉంటే, ఇంత పెద్ద నష్టాన్ని , కష్టాన్ని చెన్నై ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని ఆ వినతి పత్రం ద్వారా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. -
కోర్టుకు రండి
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసులో విచారణకు హాజరు కావాలని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి చెన్నై మొదటి సెషన్స్‌కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 18వ తేదీన కోర్టుకు రావాలని సమన్లు జారీ చేశారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా కథనాలు ప్రచూరించినా, ఆరోపణలు గుప్పించినా పరువు నష్టం దావాలు కోర్టుల్లో దాఖలవుతున్న విషయం తెలిసిందే. ఆ మేరకు ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఓ వార పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఎంకే అధినేత ఎం.కరుణానిధి స్పందించారు. ఆ పార్టీకి చెందిన మురసోలి పత్రికలో తనదైన శైలిలో రాసిన కథనాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణించారు. సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేశారంటూ ఓ వార పత్రిక మీద, కరుణానిధి మీద, మురసోలి పత్రిక యాజమాన్యం మురసోలి సెల్వం మీద పరువు నష్టం దావాలు వేశారు. చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలైన ఈ దావాలు గురువారం విచారణకు వచ్చాయి. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదన విన్పించారు. వాదన అనంతరం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కోర్టుకు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ న్యాయమూర్తి ఆదినాథన్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 18న కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు రావాలంటూ ఆ వార పత్రిక యాజమాన్యంకు సమన్లు జారీ అయ్యాయి. -
కరుణ అభయం
వరద బాధితులకు తాను ఉన్నానన్న అభయాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చారు. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయకాల పంపిణీ వేగవంతం చేయాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, చిదంబరంలో జోరు వానలోనూ బాధితుల్ని డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. సాక్షి, చెన్నై : వరద బాధితుల సహాయార్థం డీఎంకే వర్గాలు సహాయక చర్యల్లో దూసుకెళుతున్నారు. పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయం అరివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి లారీలు, ఇతర వాహనాల్లో సహాయకాలు వచ్చి చేరుతున్నాయి. వీటన్నింటిని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు. ఈ పనుల్ని దగ్గరుండి మరీ కరుణానిధి పరిశీలిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించారు. వీల్ చైర్లో ఉన్న కరుణానిధి తన వాహనం నుంచి వరద బాధిత ప్రాంతాల్ని పర్యటించారు. ఆయా ప్రాంతాల్ని పరిశీలిస్తూ, తొలుత చింతాద్రి పేటలోని నెడుంజెలియన్ నగర్లో పర్యటించారు. అక్కడి బాధితులకు తాను ఉన్నాన్న అభయాన్ని ఇచ్చారు. సహాయకాలను ఇంటింటికి తీసుకెళ్లి చేర్చాలని అక్కడి పార్టీ వర్గాలను ఆదేశించారు. తదుపరి ఆ పరిసరాల్లో సహాయకాలను డీఎంకే వర్గాలు పంపిణీ చేశాయి. అనంతరం సైదాపేట మరై మలై అడిగళార్ వంతెన వద్ద నుంచి దెబ్బ తిన్న ప్రాంతాల్ని పరిశీలించారు. అక్కడి నుంచి అడయార్ , కోట్టూరు పురంలలో పర్యటించి బాధితుల్ని ఓదార్చారు. త్వరితగతిన ఇంటింటికి సహాయకాలను అందించాలని ఆయా ప్రాంతాల్లోని నేతల్ని ఆదేశించారు. ఇక, తన పర్యటనలో భాగంగా కడలూరులో బుధవారం ఎంకే స్టాలిన్ పర్యటించారు. చిదంబరంలో జోరు వానలోనూ ముందుకు సాగుతూ బాధితుల్ని పరామర్శించారు. సహాయకాలను అందజేశారు. సోత్తుపాడి, కురింజి పాడి మీదుగా కడలూరులో ఆయన పర్యటన సాగింది. -
తగ్గేది లేదు
సాక్షి, చెన్నై: ఎన్ని దావాలైనా వేసుకోండి... తగ్గేది మాత్రం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి హెచ్చరించారు. తన మీద తాజాగా వేసిన పరువు నష్టం దావాను న్యాయ పరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదేని వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా, కథనాలు ప్రచురించినా, మంత్రుల మీద వేత్తి చూపించినా తక్షణం వారి మీద అధికార న్యాయవాదులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అనేక మీడియా సంస్థలపై పరువు నష్టం దావాలు దాఖలు చేసి ఉన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్షనేత విజయకాంత్, పలువురు డీఎండీకే ఎమ్మెల్యేలతోపాటుగా అనేక పార్టీలకు చెందిన వాళ్ల మీద ఇలాంటి దావాలు అనేకం కోర్టుల్లో దాఖలు అయ్యాయి. ఆయా నేతలు తమను ఆశ్రయించడంతో కొన్నింటి విచారణలకు హైకోర్టు బ్రేక్ వేసి ఉంది. ఈ దావాల దాఖలు తాజాగా కొత్తేమీ కాదు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో దాఖలు కావడం, తదుపరి అధికారంలోకి వచ్చే వాళ్లు వాటిని కొట్టించడం సహజం. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఓ వార పత్రిక, డీఎంకే అధినేత ఎం.కరుణానిధిపై రెండు రకాల దావాల ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై గురువారం కరుణానిధి స్పందించారు. తగ్గేది లేదు: అధికారం చేతిలో ఉంది కదా అని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఓ విధంగా, ప్రతికూలంగా వ్యవహరిస్తే మరో విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు ఉదాహరణ పత్రికలు, మీడియానే అంటూ వివరించారు. కొన్ని పత్రికలు, మీడియా సంస్థల మీద పదే పదే కేసులు వేయడం బట్టి చూస్తే, వారికి అణగిమణిగి ఉండాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్టుందని విమర్శించారు. తప్పును ఎత్తి చూపితే చాలు తక్షణం దావాలు వేసేస్తున్నారని పేర్కొన్నారు. వార్తలు, కథనాలు వస్తే వివరణ ఇచ్చుకోవాల్సింది పోయే కోర్టుల్ని ఆశ్రయిస్తుండడం శోచనీయమని విమర్శించారు. నాలుగు సంవత్సరాల్లో తన మీద ఎన్నో దావాలు వేశారని గుర్తు చేశారు. గత వారం ఓ వార పత్రికలో వచ్చిన కథనాన్నే తాను ఎత్తి చూపించానని తెలిపారు. అయితే, తన మీద కూడా కేసు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని దావాలైనా వేసుకోండి, వాటన్నింటినీ చట్ట పరంగా ఎదుర్కొంటానని, ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపించడంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. బెదిరింపులా?: జయలలితకు వ్యతిరేకంగా కథనాన్ని ప్రచురించిన వార్తా పత్రికకు బెదిరింపులు వస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పోలీసులు, అన్నాడీఎంకే వర్గాలు ఈ బెదిరింపులు ఇస్తున్నట్టుగా, ఆ వార పత్రిక ఫేస్‌బుక్‌ను సైతం హ్యాక్ చేసి ఉన్నట్టు సమాచారం వెలువడుతోంది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో పోలీసులు ఏకంగా మీడియా ప్రతినిధుల్ని పిలిపించి మరీ తస్మాత్ జాగ్రత్త అంటూ ముందస్తు హెచ్చరికలు చేస్తున్నట్టు ఓ పత్రిక సైతం కథ నాన్ని ప్రచురించింది. ఇందులో టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, పీఎంకే నేత రాందాసు తీవ్రంగా తమ ఖండన వ్యక్తం చేసి ఉండడం గమనార్హం. -
కరుణ విసుర్లు!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడ్ని చూసినా.. అధికార పగ్గాలు తమవేనని, ‘సీఎం’ కాబోతున్నామంటూ ఆశతో పల్లకిలో ఊగిసలాడుతున్నారంటూ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎద్దేవా చేశా రు. ప్రతిపక్ష పార్టీలపై సెటైర్లు విసురుతూ గురువారం ఆయన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేలు అతి పెద్ద పార్టీలు. ఇన్నాళ్లు ఈ రెండు పార్టీలే మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయి. జాతీయ, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ రెండు పార్టీల గొడుగు నీడన చేరాల్సింది. అయితే, ఈసారి ఎవరికి వారు అన్నట్టుగా ప్రతి పక్షాలు అధికారం ఆశలతో ఉరకలు తీస్తున్నాయి. మార్పు నినాదంతో పీఎంకే అధినేత రాందాసు తన తనయుడి అన్భుమణిని సీఎం చేయాలన్న ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు. ఇక, తానే తదుపరి సీఎం అన్నట్టుగా ప్రధాన ప్రతి పక్ష నేత, డీఎండీకే అధినేత విజయకాంత్ సంక్షేమ పథకాల పంపిణీ నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇక, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలు, ఎంఎంకేలు ఒకే వేదికగా పయనం సాగిస్తూ అధికారం తమేదేనని జబ్బలు చరిచే పనిలో పడ్డాయి. ఇక జాతీయ పార్టీలు బీజేపీ , కాంగ్రెస్ సైతం వేర్వేరుగా ఒంటరి పయనం సాగించి, తమ పార్టీకి చెందిన వారిని సీఎం అభ్యర్థిగా ప్రకటించే వ్యూహాలతో ఉన్నాయి. ఇలా ప్రతి పక్ష పార్టీలన్నీ అధికార తమదేనని, కాబోయే సీఎంలు తామంటే తామేనన్న ఆశల పల్లకీలో ఊగిసలాడుతుండటంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి ప్రతి పక్షాల తీరు ఆగ్రహాన్ని తెప్పించినట్టుంది. అందుకే ఓ ప్రకటనలో విమర్శలు కురిపించారు. అందరిదీ ‘సీఎం’ ఆశే :రాష్ట్రంలోని పార్టీల తీరు చూస్తుంటే, హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కొన్ని పార్టీలు తాము అధికారంలోకి వచ్చేసినట్టు, సీఎం కుర్చీలో కూర్చోబోతున్నట్టుగా వ్యాఖ్యలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. రాష్ర్టంలో అద్వాన పాలన సాగుతున్నదని, ప్రజలకు ఈ ప్రభుత్వంతో ఒరిగిందేమి లేదని ఆరోపిస్తూ చిట్టా విప్పారు. మంత్రులు దోపిడీ లక్ష్యంగా పయనం సాగుతున్నారని, అధికారులు ఎవరు వస్తే...పోతే..తమకేం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు ఎవరికీ పట్టడం లేదని, అందరికీ తాము బాగుంటే చాలు, తమ ఆశలు నెరవేరితే చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఒకరేమో అధికారంలోకి వచ్చేశాం అంటూ, మరొకరేమో తదుపరి సీఎం తానే అంటూ వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, వీరందరికీ ప్రజల మీద ఏ మేరకు చిత్త శుద్ది ఉందో స్పష్టం అవుతోందన్నారు. ప్రతి పక్షాల మధ్య ఐక్యత కొరవడడంతోనే పాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అష్టకష్టాలకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ధనం, పత్రికా బలం ఉంటే చాలదని, ప్రజా బలం ముఖ్యం అన్న విషయాన్ని పార్టీలు గుర్తించాలని హితవు పలికారు. ప్రజలు మేల్కొవాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రజల కోసం ఎవరు మంచి చేశారోనన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని, రాష్ట్ర ప్రయోజనాల్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ తమ నిర్ణయాన్ని తీసుకోవాలని పిలుపు నిచ్చారు. ఇక, వరికి మద్దతు ధర పేరుతో అన్నదాతల్ని మరో మారు మోసం చేస్తున్నారని మండి పడ్డారు. కంటి తుడుపు చర్యగా మద్దతు ధరను ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. కష్టాల కడలిలో ఉన్న అన్నదాతకు భరోసా ఇచ్చే విధంగా మద్దతు ధరను ప్రకటించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. -
ఆ తప్పునకు బాధ్యులెవరు?
సాక్షి, చెన్నై : ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నివేదిక దాఖలు చేసి, తప్పు చేసిన వ్యవహారానికి బాధ్యత వహించేదెవ్వరు అని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే కోర్టుకు నివేదిక చేరి ఉండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముల్లై పెరియార్ డ్యాంకు ఎల్‌టీటీఈల రూపంలో ముప్పు ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉండడం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో రాద్దాంతం బయలు దేరింది.ప్రతి పక్షాలు,తమిళాభిమాన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నాయి. అయితే, తప్పును కప్పి పుచ్చుకునే రీతిలో ఆ నివేదికతో తమకు సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం జత పరిచిన నివేదికలో ఎల్‌టీటీఈల ప్రస్తావన వచ్చి ఉన్నదని, దీనికి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం, రాద్దాంతం చేస్తున్న వాళ్లపై విమర్శలు గుప్పిస్తూ, తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడాన్ని డిఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులెవ్వరు : మంగళవారం కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పు తాము చేయలేదంటూ దాటవేత దోరణి అనుసరిస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లో కేంద్రం తన నివేదికను జత పరిచిన విషయం ఎలా తెలియకుండా ఉంటుందని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే నివేదిక కోర్టుకు ఎలా చేరి ఉంటుందని ప్రశ్నించారు. అయితే, సీఎంకు తెలియకుండా ఆ నివేదికకు ఆమోదం తెలపడంలో తమరి పాత్ర ఉందా..? అని ప్రశ్నించారు. ఎందు కంటే, ప్రజా పనుల శాఖ మంత్రిగా తమరు ఉండటం వల్లే, తమరికి కూడా తెలియకుండా ఆ నివేదిక ఎలా జత పరిచి ఉంటారోనని మండి పడ్డారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడంతో పాటుగా , ఎల్టీటీలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును తాము ఎత్తి చూపితే , అది విమర్శ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తాను, తదనంతరం రాందాసు, వైగో, ఇలా అన్ని పార్టీల నాయకులు ప్రశ్నించే వరకు , ఎల్‌టీటీఈల గురించి ఆ నివేదికలో ఏమున్నదో తెలియక పోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నివేదిక ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం జయలలిత తనను, అధికారుల్ని ప్రశ్నించి సమాచారం రాబట్టారని ఓ పన్నీరు సెల్వం పేర్కొనడం గమనించాల్సి విషయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రతి పక్షాలు గళం విప్పే వరకు , జరిగిన తప్పు తమరెందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. తప్పు జరిగిన విషయానికి వివరణ ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా..? అని ప్రశ్నించారు. వివరణ ఇచ్చారు సరే, జరిగిన తప్పుకు బాధ్యులెవరు అన్నది స్పష్టం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆ పార్టీలే లక్ష్యం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు మూడు పార్టీలను తన వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యం తో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహరచనల్లో పడ్డారు. వారికి గాలం వేయడం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, డీఎండీకే నేత విజయకాంత్ మెట్టు దిగేనా..? అన్న ప్రశ్నను డీఎంకే వర్గాలే లేవదీస్తుండడం గమనార్హం. సాక్షి, చెన్నై : వరుస పరాజయాలతో ఢీలా పడ్డ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎట్టకేలకు బలోపేతం లక్ష్యంగా పార్టీని జిల్లాల వారిగా పునర్విభజించక తప్పలేదు. జిల్లాల వారిగా పదవుల్లో కొత్త వాళ్లకు చోటు కల్పించారు. రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి, తాజా పరిణామాలు పెద్ద షాకే అని చెప్పవచ్చు. నిర్దోషిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత బయట పడడం, సీఎంగా పగ్గాలు చేపట్టడంతో తదుపరి కార్యచరణ మీద కరుణానిధి దృష్టి పెట్టి ఉన్నారు. జయలలిత హవాకు కల్లెం వేయడం లక్ష్యంగా ప్రతి పక్షాల్ని ఏకం చేసిన మెగా కూటమికి వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో తాజాగా తమ కుటుంబ వేడుకకు అన్ని పార్టీలను ఆహ్వానించే పనిలో పడ్డారు. అయితే, వీరిలో అందరూ కలసి వచ్చే అవకాశాలు లేని దృష్ట్యా, ప్రధానంగా మూడు పార్టీల మీద కన్నేసి ఉన్నారు. ఆ మూడు పార్టీలే కీలకం రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న డీఎండీకేకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ బాగానే ఉన్నది. ఇక, కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉంది. అలాగే, వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు దక్షిణ తమిళనాడులో కొంత మేరకు బలం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తమ వెంట పుదియ తమిళగం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌లు ఉండడంతో, మిగిలిన ఆ మూడు పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో వ్యూహ రచనల్లో నిమగ్నం అయ్యారు. తమ కుటుంబ వేడుకకు హాజరయ్యే ఆ మూడు పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ నేతృత్వంలోని టీఎంసీ తమతో చేతులు కలిపే అవకాశాలు లేని దృష్ట్యా, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను నమ్మలేని పరిస్థితి ఉన్నందున,ఆ ఇద్దర్ని పక్కన పెట్టేందుకు డీఎంకే సిద్ధం అయినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇక, వామపక్షాల దారి ఎటో అన్నట్టుగా ఉండడంతో, కలిసి వస్తే వారిని అక్కున చేర్చుకునేందుకు సైతం వ్యూహ రచన చేసి ఉండడం గమనించాల్సిన విషయం. డీఎంకేతో కలిసి నడిచేందుకు ఎండిఎంకే సిద్ధంగానే ఉన్నట్టుగా ప్రచారం సాగుతున్నది. ఆ పార్టీ నుంచి డిఎంకే గూటికి చేరి అధికార ప్రతినిధిగా చెలామణిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ అందుకు తగ్గ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. కేఎస్ రాధాకృష్ణన్ ద్వారా డీఎంకే అధిష్టానం నుంచి కొన్ని హామీలను తీసుకున్న తర్వాతే వైగో తన స్పష్టతను వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, డీఎంకేతో కలసి నడిచేందుకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధంగా ఉన్నా, తమ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడక తప్పలేదు. ఇక, చిక్కంతా డీఎంకే అధినేత విజయకాంత్ రూపంలో డీఎంకేకు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలకు వల వేయడం లక్ష్యంగా, ఆయా పార్టీ వర్గాలతో వ్యవహరించాల్సిన తీరు, తదితర అంశాలతో పాటుగా ప్రజల్లోకి వెళ్లడం కోసం అస్త్రాలు సిద్ధం చేయడానికి సోమవారం జిల్లాల కార్యదర్శుల సమావేశానికి సైతం కరుణానిధి పిలుపు నిచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయకాంత్ తగ్గేనా విజయకాంత్‌కు రాష్ట్రంలో బలం ఉన్నా, తన నోటి దురుసు తనం, దూకుడుతో కమెడియన్‌గా మారుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ జపం చేస్తున్న విజయకాంత్‌కు ఎన్నికల సమయంలో షాక్‌లు తగిలే అవకాశాలు ఎక్కవే. అన్నాడీఎంకేతో బీజేపీ దోస్తి కట్టిన పక్షంలో ప్రత్యామ్నాయం మీద ఆయన దృష్టి పెట్టక తప్పదు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యేందుకు వెనుకాడని విజయకాంత్, డీఎంకేతో దోస్తి విషయంగా ఏ మేరకు మెట్టు దిగుతారోనన్నది వేచి చూడాల్సి ఉంది. ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి విరుగ్గం బాక్కంలోని విజయకాంత్ ఇంటికి వెళ్లేందుకు తొలుత డీఎంకే కోశాధికారి స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఇంటికి రావొద్దని, పార్టీ కార్యాలయానికి రావాలని ఆయన సూచించి ఉన్నారు. స్టాలిన్ వచ్చి వెళ్లగానే, తన కార్యాలయాన్ని కూల్చి వేసిన వాళ్లను, అదే చోట మెట్లు ఎక్కేలా చేశానంటూ తన వాళ్లతో విజయకాంత్ వ్యంగ్యంగా మాట్లాడినట్టు సంకేతాలు వెలువడడం గమనార్హం. -
ఇదే తుది తీర్పు కాదు: కరుణానిధి
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి స్పందించారు. ఇదే తుది తీర్పు కాదని వ్యాఖ్యానించారు. ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పు చివరిది కాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టులను మించిన కోర్టు మనస్సాక్షి అని మహాత్మగాంధీ అన్నారని విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కోర్టు తీర్పుపై జయలలిత ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి కొనసాగిస్తానని చెప్పారు. -
బలోపేతమే లక్ష్యం: కనిమొళి
సాక్షి, చెన్నై : ప్రజల్లో మమేకమై బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మహిళా నేతలకు డీఎంకే మహిళా విభాగం కార్యదర్శి, ఎంపీ కనిమొళి పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆదివారం అరివాలయంలో ఆమె మహిళా విభాగం నేతలతో భేటీ అయ్యారు. డీఎంకే మహిళా విభాగం నాయకులతో కనిమొళి ఉదయం గంటన్నర పాటుగా భేటీ అయ్యారు. ఆ విభాగం బలోపేతం, మహిళ మన్ననలు అందుకునే రీతిలో కార్యక్రమాల నిర్వహణ, అధినేత ఎం కరుణానిధి పుట్టినరోజు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఇక ప్రతి మహిళా విభాగం నాయకురాలు, కార్యకర్త ప్రజల్లో మమేకమై బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. అనంతరం మీడియాతో కనిమొళి మాట్లాడుతూ, తిరుపతి శేషాచలం ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఏపీ ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉందన్నారు. పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు దెబ్బతినే విధంగా వ్యవహరించ కూడదని హితవు పలికారు. వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి ముత్తుకుమార స్వామి మరణం వెనుక ఉన్న మిస్టరీ బయటకు రావాలంటే కేసును సీబీఐకు అప్పగించాల్సిందేని, ఇందు కోసం డీఎంకే మహిళా విభాగం ఉద్యమించబోతోందన్నారు. అదుపులో.. ముత్తుకుమార స్వామి మృతి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌కుమార్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం అగ్రి అసిస్టెంట్ వందవాసికి చెందిన వెంకటేషన్‌ను అదుపులోకి తీసుకుని సీబీసీఐడీ వర్గాలు విచారిస్తున్నాయి. -
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కుష్బు
కాంగ్రెస్‌లో గ్రూపులు లేవని అందరిదీ ఒకే గ్రూప్ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి కుష్బు అన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ప్రత్యేక గౌరవం, మర్యాద అని వ్యాఖ్యానించారు. పదవి దక్కించుకున్న కుష్బుకు సత్యమూర్తి భవన్లో ఘన స్వాగతం లభించింది. సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఉన్నత పదవిని కుష్బు దక్కించుకున్నారు. ఆ పార్టీలో ప్రత్యేక గ్లామర్‌గా అవతరించిన కుష్బు వాక్ చాతుర్యాన్ని గుర్తించిన అధిష్టానం అందుకు తగ్గ పదవిని అప్పగించింది. ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన కుష్బు బుధవారం సత్యమూర్తి భవన్‌కు వచ్చారు. అధికారిక హోదాతో పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టిన ఆమెకు పార్టీ వర్గాలు ఘన స్వాగతం పలికాయి. నాయకులు చిరంజీవి, రామచంద్రన్, జ్యోతి, తదితరులు పుష్ప గుచ్ఛాలను అందించి ఆహ్వానం పలికారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో సత్యమూర్తి భవన్‌కు రావడం విశేషం. అనంతరం సత్యమూర్తి భవన్లో మీడియాతో కుష్బు మాట్లాడారు. తన మీద నమ్మకంతో అతి పెద్ద బాధ్యతను అప్పగించిన తమ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ పరంగా తనను ఉన్నత పదవిలో చూడాలని ఈవీకేఎస్ కాంక్షించే వారని, అందుకు తగ్గట్టుగానే అతి పెద్ద పదవిని పార్టీ అధిష్టానం అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. తాను పార్టీలోకి వచ్చి ఐదు నెలలవుతోందని, ఈ కాలంలో తనను పార్టీలోని నాయకులు అందరూ తమ ఇంట్టి బిడ్డగా ఆదరించారన్నారు. రాష్ట్ర పార్టీలో గ్రూపులు లేవని, అందరిదీ కాంగ్రెస్ అనే ఒకే ఒక గ్రూప్ మాత్రమేనన్నారు. మీడియా మాత్రమే వేర్వేరుగా నాయకుల్ని చూపిస్తూ, గ్రూపుల్ని అంటగట్టుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుంటే, కామరాజర్ లేరని, కామరాజర్ లేకుంటే కాంగ్రెస్ లేరని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడి వీధి పోరాటాల లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంటే తనకు ఎంతో గౌరవం అని, ఆయన మీద ప్రత్యేక మర్యాద ఉందని మరో ప్రశ్నకు కుష్బు సమాధానం ఇచ్చారు. -
నాశనమై పోతారు
సాక్షి, చెన్నై : డీఎంకేను నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్న వాళ్లంతా నాశనమైపోతారు! అని ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి శాపనార్థాలు పెట్టారు. డీఎంకే ‘నా పార్టీ కాదు, మన పార్టీ’ అని వ్యాఖ్యానించారు. తన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వరుస పతనాలతో డీలా పడ్డ డీఎంకేను కరుణానిధి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే పనిలో పడ్డారు. అదే సమయంలో డీఎంకేకు వ్యతిరేకంగా మీడియాల్లో కథనాలు హల్చల్ చేస్తున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని, కరుణానిధి కుటుంబంలో విబేధాలు తాండవం చేస్తున్నాయన్న ప్రచారం జోరందుకుంది. స్టాలిన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించండంలో కరుణానిధి వెనక్కు తగ్గడం మరింత వివాదానికి ఆజ్యం పోసిందని, డీఎంకే మరింతగా చలికిలబడే స్థాయికి చేరిందన్న కథనాలు కరుణానిధిలో ఆగ్రహాన్ని తెప్పించాయి. తన కుటుంబం మీద, డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలకు ముగింపు పలకడంతోపాటుగా ఆ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న వాళ్లపై శాపనార్థాలు పెట్టే పనిలో కరుణానిధి ఉన్నారు. ఇందుకు వేదికగా డీఎంకే తీర్మానాల విశదీకరణ సమావేశాన్ని నిర్వహించారు. గత వారం డీఎంకే సర్వసభ్య, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కీలక తీర్మానాలు చేశారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సభల నిర్వహణకు చర్యలు తీసుకుంది. ఈ సభలకు శ్రీకారం చుట్టే విధంగా సోమవారం రాత్రి మైలాపూర్‌లో బహిరంగ సభ జరిగింది. డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, నాయకులు దురై మురుగన్, సద్గున పండియన్, దక్షిణ చెన్నై డీఎంకే కార్యదర్శి అన్భళగన్ వేదిక మీద ఆశీనులయ్యారు. ఇందులో కరుణానిధి తన ఆక్రోశాన్ని వెల్లగక్కే రీతిలో ప్రసంగం చేశారు. డీఎంకేను నిర్వీర్యం చేయాలన్న కుట్రలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేసే వాళ్లందరూ నాశనమవుతారని శాపనార్థం పెట్టారు. తాను ఏ సమయంలోనూ డీఎంకే నా పార్టీని, నా కళగం అని వ్యాఖ్యానించ లేదని, మన పార్టీ మన కళగం అని చెప్పుకునే వాడినన్నారు. డీఎంకే ఎక్కడ బల పడుతుందోనన్న భయం కొందరిలో నెలకొందని, అందుకే మన పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు కుత్రంతాలు రచించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నో ఓటముల్ని ఎదుర్కొని మళ్లీ విజయపు బాటలో నడిచిన పార్టీ డీఎంకే అన్న విషయాన్ని ఆ దుష్ట శక్తులు గుర్తెరగాలని హితవు పలికారు. డీఎంకే వాల్ పోస్టర్ పార్టీ కాదని, స్వలాభం కోసం ఆవిర్భవించిన పార్టీ కూడా కాదని, ప్రకటనలు, పబ్లిసిటీతో పబ్బం గడుపుకునే పార్టీ కాదని, ద్రవిడుల జీవితాల్లో వెలుగు లక్ష్యంగా, ద్రవిడ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న పార్టీ అన్న విషయాన్ని గ్రహించండంటూ హెచ్చరించారు. విభేదాల్లేవు : తన కుటుంబంలో విబేధాలు తారా స్థాయికి చేరినట్టు, పార్టీ చీలబోతున్నట్టుగా కథనాలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. లేకుంటే, తాను నిజాలు వెల్లడించాల్సి ఉంటుందని, పాత కాలపు కరణానిధిలా మారాల్సి ఉంటుందని శివాలెత్తారు. ఆనాటి కరుణానిధి గురించి గుర్తెరిగి ఉన్నారు కాదా, తాను మళ్లీ అదే బాణిలో పయనిస్తే తప్పులు, నిజాలన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. తన కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ స్నేహ పూరిత వాతావరణంలో, ఆనందంగా ఉంటున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్టీ బలోపేతం, అధికారం లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలాగా శ్రమించి విమర్శకుల నోటికి కళ్లెం, కుట్రదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేద్దామని ఈ సందర్భంగా పార్టీ వర్గాలకు కరుణానిధి పిలుపునిచ్చారు. తన ప్రసంగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కరుణానిధి తీవ్రంగానే స్పందించడం కొసమెరుపు. -
వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలి: కరుణానిధి
చెన్నై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడాన్ని డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్వాగతించారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. తనపై వాజపేయికి ఎంతో అభిమానం కనబరిచే వారని గుర్తు చేసుకున్నారు. పెరియార్ గా సుపరిచితులైన ద్రావిడ నాయకుడు ఈవీ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు కరుణానిధి వెల్లడించారు. -
ధైర్యముంటే రండి
సాక్షి, చెన్నై:నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి రండి అని డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సవాల్ విసిరారు. ఎలాంటి చర్చలకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీరును దుయ్యబడుతూ కరుణానిధి, డీఎంకే కోశాధికారి స్టాలిన్లు విమర్శల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. పన్నీరు లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం పెరిగింది. ఈ నేపథ్యంలో పన్నీరుకు కోపం వచ్చినట్లుంది. కరుణ, స్టాలిన్‌పై ఎదురుదాడికి దిగుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరుణానిధి, ఆయన తన యుడు స్టాలిన్ మర్యాదను మరచి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరి నాగరికత ఏమిటో తనకు తెలియదనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని సమావేశపరచాలని వారు డిమాండ్ చేస్తే తానేదో స్పందించినట్టుగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో తాము నాగరికంగా వ్యవహరించడం లేదని కరుణానిధి ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని పేర్కొన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ప్రపంచానికే తెలియనిది కాదన్నారు. తిరువారూర్ నుంచి ఎన్నికైన కరుణానిధి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సంతకాలకే పరిమితం అయ్యూరన్నారు. ఆయనకు అక్కడి ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని తెలిపారు. సొంత నియోజకవర్గం సమస్యలపై దృష్టి పెట్టని ఆయన ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద ఏ మేరకు స్పందిస్తారని ప్రశ్నించారు. జనం మరువలేదు కరుణానిధి తమ అధినేత్రి, అమ్మ జయలలితను కించ పరిచే రీతిలో గతంలో ఏ విధంగా వ్యవహరించారో ప్రజలు మరచిపోలేదని పన్నీరు సెల్వం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలడమే కాకుండా నింద మోపి తమను సస్పెండ్ చేరుుంచలేదా అని పేర్కొన్నారు. డీఎంకే సభ్యులు ఏ సమయంలో ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలుసునన్నారు. నిజంగా చిత్తశుద్ధి, ప్రజలపై గౌరవం ఉంటే సభకు ఆటకం కలిగించకుండా వ్యవహరించాలని హితవు పలికారు. అమ్మ ప్రభుత్వం ప్రజల కోసం శ్రమిస్తుంటే, పనిగట్టుకుని సభ నుంచి వాకౌట్ల రూపంలో బయటకు వెళ్లడం డీఎంకేకు పరిపాటిగా మారిందని మండి పడ్డారు. కరుణకు ధైర్యముంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని హితవు పలికారు. డీఎంకే ఎత్తి చూపే అంశాలపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. -
ఉద్యమానికి సన్నద్ధం కండి!
సాక్షి, చెన్నై: తమిళ సమాజాభ్యున్నతిని కాంక్షిస్తూ మహోద్యమానికి ప్రజలు సన్నద్ధం కావాలని డీఎంకే అధినేత ఎం కరుణానిధి పిలుపునిచ్చారు. ప్రజాహితమే లక్ష్యంగా, వారిలో చైతన్యం తీసుకురావడం ధ్యేయంగా ముందుకు సాగుదామన్నారు. నగరంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకలో కరుణానిధి ప్రసంగిం చారు. సమాజంలో, సంప్రదాయాల్లో వస్తున్న మార్పుల గురించి ఇక్కడ ప్రసంగించిన వాళ్లందరూ ఆవేదన వ్యక్తం చేశారని తన ప్రసంగంలో కరుణానిధి గుర్తు చేశారు. సమాజ హితాన్ని, తమిళ ప్రజా సంక్షేమాన్ని పరిరక్షించే రీతిలో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాజం ఎటు వెళ్తున్నదోనని అన్వేషించకుండా, వెళ్లకుండా అడ్డుకునే మార్గాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. తమిళుడు తమిళుడుగానే జీవించాలని పిలుపునిచ్చారు. తమిళులందరూ ఒకే తాటిపై ఉంటే, ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఇందులో విజయం తమిళుడిదేనన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తమిళుల మీద మరొకరు ఆధిపత్యం చెలాయించే స్థాయికి పరిస్థితుల్ని తీసుకెళ్ల కూడదని, ఏకతాటిపై ఉంటే తమిళుడి సత్తా ఏమిటో తెలిసి వస్తుందంటూ పరోక్షంగా బీజేపీ వేస్తున్న రాజకీయ ఎత్తుగడల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు తన ఆహ్వానాన్ని పంపించే విధంగా ఆ వ్యాఖ్యల్ని కరుణానిధి అందుకున్నట్టుగా అక్కడే ఉన్న డీఎంకే వర్గాలు ఈ సమయంలో గుస గుసలాడటం విశేషం. తమిళుల కోసం డీఎంకే పడ్డ శ్రమ, చేసిన కృషిని ఎలుగెత్తి చాటే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఆ దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. తమిళ సమాజం పరిరక్షణ, అభ్యున్నతే ధ్యేయంగా, తమిళ సమాజ వికాసం కోసం మహోద్యమానికి ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని తమిళ సమాజాభ్యున్నతికి పాటుపడుదామని పిలుపు నిచ్చారు. మౌనంగా ఉంటే మంచిదే: తన ప్రసంగం అనంతరం వెలుపలకు వచ్చిన కరుణానిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముల్లై పెరియార్, కావేరి తీరంలో డ్యాం నిర్మాణం గురించి సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రాజకీయాలు చేస్తున్న వాళ్లు చేస్తూనే ఉన్నారని పరోక్షంగా అధికార పక్షాన్ని ఉద్దేశించి విమర్శించారు. అసెంబ్లీకి, కేబినెట్ సమావేశానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేస్తే, పట్టించుకున్న వారు లేరంటూ, ఇక ఆ డ్యాంల విషయంలో ఏ మేరకు శ్రద్ధ చూపుతారని విమర్శించారు. అన్నాడీఎంకే సర్కారు వ్యవహారంతో పప్పు, నూనె కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయే..? అని ప్రశ్నించగా, అవినీతా, నష్టమా అన్నది తేల్చండి ముందు అని చమత్కరించారు. సీఎం పన్నీరు సెల్వం తమరిని ఉద్దేశించి మౌనంగా ఉంటే మంచిదని హితవు పలికారే...? అని ప్రశ్నించగా, సీఎం.. ఎవరో...వాళ్లు మౌనంగా ఉంటే ప్రపంచానికీ, తమిళనాడుకు మంచిదే, కాబట్టి వాళ్లు ముందు మౌనంగా ఉంటే మంచిదంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. -
‘మెగా’ సాధ్యమే!
రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భావం సాధ్యమేనని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం మహాబలి పురం వేదికగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీదకు రానుండడంతో రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరగనున్నాయో..! అన్న చర్చ బయలు దేరింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆయా పార్టీల మనోగతాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏ పార్టీ ఎవరికి మద్దతుగా వ్యాఖ్యానిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మెగా కూటమి సాధ్యమే అన్న భావనను కలిగించాయి. ఎద్దేవా: రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గతంలో తమతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ, తాజాగా అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి రాష్ట్రంలో ఎదుగుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం సాధ్యం కాని పనిగా పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకున్నా, వెలుపల మాత్రం అందరు ఎంపీలు స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. అయితే, అలాంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో లేదని, స్నేహ పూర్వక వాతావరణం లక్ష్యంగా డీఎంకే ప్రయత్నిస్తోందని చెప్పారు. అళగిరి పార్టీలో లేనందున ఆయన గురించి తానేమీ మాట్లాడబోనంటూ దాట వేశారు. ఎండీఎంకే నేత వైగోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, స్నేహ పూర్వకంగా తాము మెలుగుతామన్నారు. ఇటీవల అసెంబ్లీలో డీఎండీకేకు ఇబ్బందులు తలెత్తినప్పుడు తాము అండగా నిలిచామని, అదే విధంగా తమకు ఇబ్బందుల్ని అధికార పక్షం కల్పించినప్పుడు వాళ్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, ఇలాంటి స్నేహ పూర్వక వాతావరణం అసెంబ్లీలో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మెగా కూటమి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎంకేలు కలసికట్టుగా మెగా కూటమి ఏర్పాటుకు ఆమోదిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదిక మీదకు : మెగా కూటమి సాధ్యమే అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యానించడం ఓ వైపు చర్చకు దారి తీస్తే, ఇందుకు అనుకూలించే పరిస్థితులు మరో రెండు రోజు ల్లో రానున్నాయి. మహాబలి పురం వేదికగా గురువా రం పీఎంకే అధినేత రాందాసు మనవడు, మనవరాలి వివాహం జరగనుంది. ఇందుకు కరుణానిధి నేతృత్వం వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎండీఎంకే నేత వైగో సైతం హాజరయ్యేందుకు నిర్ణయించారు. ఈ దృష్ట్యా, మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కాబోతోండటం గమనార్హం. అదే సమయం లో డీఎండీకే నేత విజయకాంత్ సైతం ఈ కల్యాణ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నా, ఆయన వేదిక ఎక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాందా సు, వైగోను తమ వైపు తిప్పుకునే విధంగా డీఎంకే వర్గాలు వ్యాఖ్యలు చేశారుు. ఈ వేదిక మీద ఏ మేరకు పొగడ్తల వర్షం కురిసి మెగా కూటమికి దారి తీస్తాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మీద వైగో, రాందాసు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విందుకు సైతం దూరంగానే ఉన్నారు. విజయకాంత్ సైతం ఈ విందు కు దూరంగా ఉన్నా, తరచూ మోదీ జపం అందుకోవడం ఆయన మదిలో నిర్ణయం ఏమిటోనన్నది అంతు చిక్కడం లేదు. ఈ కల్యాణ వేదికను అస్త్రంగా చేసుకుని ఁమెగారూ.మార్గాన్ని సుగమం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
న్యాయం గెలిచింది
సాక్షి, చెన్నై : ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో సాగినా, చివరకు న్యాయం గెలిచిందని, చట్టానికి ఎవరూ అతీతులు కారన్నది మరో మారు రుజువైందని డీఎంకే అధినేత ఎం కరుణానిధి, డీఎండీకే అధినేత విజయకాంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌లు వ్యాఖ్యానించారు.సీఎం జయలలిత అండ్ బృందానికి జైలు శిక్ష పడిందో లేదో ఓ వైపు అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే, మరో వైపు డీఎంకే, డీఎండీకే, బీజేపీలు హర్షం వ్యక్తం చేశాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, కేసును నీరుగార్చేందుకు పలు రకాల ప్రయత్నాలు సాగినా, చివరకు న్యాయం గెలిచిందన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ పిటిషన్‌తోనే కేసు కర్ణాటక కోర్టుకు వెళ్లిందని, అందుకే తప్పు చేసిన వారికి శిక్ష పడిందని పేర్కొన్నారు. ఈ కే సులో న్యాయం గెలిచిన దృష్ట్యా, డీఎంకే వర్గాలు ఎవ్వరూ స్వీట్లు పంచడం, బాణసంచాలు పేల్చడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే డీఎండీకే అధినేత విజయకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉప్పు తింటే..నీళ్లు తాగాల్సిందే, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిందే అన్న నానుడిని గుర్తు చేస్తూ, ఇప్పుడు జరిగింది అదేనని పేర్కొన్నారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు. సీఎం హోదాలో ఉన్న జయలలితకు ఈ శిక్ష పడటం వలన తమిళనాడు పరువు ప్రతిష్టకు తీవ్ర భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత రూపంలో తమిళులు తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో కేసులు లాక్కొచ్చినా చివరకు శిక్ష పడడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఓ మీడియాతో మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసిందన్నారు. న్యాయ స్థానాలకు బీజేపీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం కల్పించిందన్న విషయం ఈ కేసు ద్వారా నిరూపితమయ్యిందన్నారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిలో ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. సీపీఐ నేత రాజా ఓ మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పు అవినీతి పరులకు ఓ హెచ్చరిక వంటిదన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఏ పదవిలో ఉన్నా సరే , తప్పు చేస్తే శిక్షించాల్సిందేనన్నారు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే, అది తమిళనాడు అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి పేర్కొంటూ న్యాయస్థానాలు ఎవరికీ చుట్టాలు కావని ఈ తీర్పు స్పష్టం చేసిందన్నారు. -
బాబు ప్రతిపాదనపై కరుణ అభ్యంతరం
చెన్నై: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య ఏర్పడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడాన్ని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. దీనివల్ల తమిళనాడులోని మూడు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని కరుణానిధి చెప్పారు. వేలూరు, తిరువళ్లూరు, కాంచీపూరం జిల్లాల ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడ్డారని అన్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాలార్ నదిపై డ్యామ్ నిర్మిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కరుణానిధి స్పందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా అప్పటి యూపీఏ భాగస్వామ్య పక్షాలు డీఎంకే, పీఎంకే వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారని కరుణానిధి గుర్తు చేశారు. 2008లో సుప్రీం కోర్టు ఈ కేసును విచారించి సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్రానికి సూచించిందని చెప్పారు. కేంద్ర జలసంఘం ఈ వివాదాన్ని పరిష్కరించేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లరాదని కేంద్రం సూచించిందని తెలిపారు. తమిళనాడు ప్రజల అంటే చంద్రబాబుకు అభిమానముందని, చెన్నై నగర వాసుల తాగునీటి కోసం తెలుగు గంగ ప్రాజెక్టును అభివృద్ధి చేశారని అన్నారు. చంద్రబాబు పాలార్ పై డ్యామ్ ప్రతిపాదన చేయడాన్ని నమ్మలేకపోతున్నాని కరుణనిధి చెప్పారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు. -
డీఎంకే ప్రక్షాళన
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న డీఎంకే సంస్థాగతంగా ప్రక్షాళన పనిలో పడింది. కోల్పోయిన జవసత్వాలను కూడగట్టేందుకు వచ్చేనెల 2వ తేదీన సమాయుత్తం అవుతోంది. డీఎంకేలో చీలికతెచ్చి అన్నాడీఎంకే అధినేతగా అవతరించిన ఎంజీ రామచంద్రన్ నాటికంటే జయలలితతోనే డీఎంకేకు చేదుఅనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాడులో అత్యంత సమ్మోహనాశక్తి కలి గిన ఎంజీ రామచంద్రన్ కంటే అధికస్థాయిలో జయ ఓటర్లను ఆకర్షించడం డీఎంకే నేతలకు మింగుడుపడడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి, యూపీఏతో తెగదెంపులు, అవినీతి అక్రమాల ఆరోపణలు, సీబీఐ కేసులతో కృంగిపోయి ఉన్న డీఎంకే లోక్‌సభ ఎన్నికలు చావుదెబ్బతీశాయని చెప్పవచ్చు. 37 స్థానాలను అమ్మ తన్నుకుపోగా, దేశ వ్యాప్తంగా ఊపు మీదున్న బీజేపీ కూటమి ఇక్కడ రెండు దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో పోస్టుమార్టం డీఎంకే ఓటమికి తగిన కారణాలను అన్వేషిస్తూ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పోస్ట్‌మార్టం మొదలుపెట్టారు. పొత్తులతో బలమైన కూటమి లేకపోవడం, జిల్లా స్థాయి కేడర్ నిర్లక్ష్యం, పార్టీలో ముఠా తగాదాలు, అభ్యర్థులకు సహాయ నిరాకరణ వంటి అనేక కారణాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఊరికే అంచనాలు వేసుకునేకంటే నిర్దిష్టమైన కారణాలను కనుగొనాలని డీఎంకే ఆశిస్తోంది. ఇందుకోసం 24 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకుంది. కరుణానిధి, స్టాలిన్ తదితర అగ్రనేతలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ వచ్చేనెల 2వ తేదీన డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నాఅరివాలయంలో సమావేశం కానుంది. మొత్తం 39 నియోజకవర్గాల్లో 7చోట్ల 3వ స్థానం, 2 చోట్ల 4వ స్థానంలోకి డీఎంకే దిగజారింది. ఇందుకు దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీ గెలుపునకు పనిచేయని జిల్లా అధ్యక్షులను గుర్తించి కొత్తవారిని నియమించాలని నిర్ణయానికి వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడంతోపాటూ ఆరోపణల తీవ్రతను బట్టి బహిష్కరించాలని భావిస్తోంది. -
డీఎంకే పార్టీ అభ్యర్థిని మట్టికరిపించండి: ఆళగిరి
ఉసిలమ్ పట్టి: డీఎంకే అభ్యర్థిని ఓడించాలంటూ బహిష్కృత నేత, కరుణానిధి కుమారుడు అళగిరి సొంత పార్టీపైనే నిప్పులు చెరిగారు. థేనీ లోకసభ స్థానం నుంచి పోటి చేస్తున్న పోన్ ముతురామలింగంను మట్టికరిపించాలని కార్యకర్తలకు అళగిరి సూచించారు. అంతేకాకుండా థేని నియోజకవర్గంలో పోన్ ముత్తురామలింగంను నాలుగవ స్థానానికి పరమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంధువును కోల్పోయిన ఓ కార్యకర్తను పరామర్శించడానికి ఉసిలమ్ పట్టి గ్రామంలో పర్యటించారు. ఉసిలమ్ పట్టి గ్రామంలో ఆళగిరికి ఘనస్వాగతం పలికిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. లౌకికవాద పార్టీగా రుజువు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలపై ఆళగిరి మాట్లాడానికి నిరాకరించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న డీఎంకే పార్టీ ప్రస్తుతం ఆపార్టీతో పొత్తుకు దూరంగా ఉంది. పార్టీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆళగిరిని పార్టీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రాధాన్యత సంతరించుకున్న కనిమొళి, అళగిరి భేటి!
చెన్నై: రాజ్యసభ ఎంపీ, సోదరి కనిమొళితో బహిషృత డీఎంకే నేత అళగిరి భేటి అయ్యారు. ప్రచారం కోసం తన తండ్రి కరుణానిధి చెన్నైకి దూరంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. తన వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కనిమొళి అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్న క్రమంలో అళగిరి కలవడం ప్రాధాన్యత నెలకొంది. టికెట్ల కేటాయింపులో స్టాలిన్ వర్గం పైచేయి సాధించారని కనిమొళి ఆగ్రహంతో ఉన్న తరుణంలో అళగిరి భేటి చర్చనీయాంశమైంది. సీఐటీ కాలనీలోని ఆమె నివాసంలో గంటకు పైగా కనిమొళితో చర్చలు జరిపారు. అయితే సమావేశ వివరాలు బయటకు రాలేదు. -
అళగిరిని పక్కన పెట్టిన డీఎంకే
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను డీఎంకే పార్టీ ఖరారు చేసింది. 35 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకె అళగిరికి ఇందులో చోటు దక్కలేదు. పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో అళగిరిని జనవరిలో తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు స్టాలిన్‌తో వారసత్వ పోరు సాగిస్తున్న అళగిరి ఇంతకుముందు తండ్రిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అళగిరికి టికెట్ వస్తుందా, రాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తొలి జాబితాలో ఈ జాబితాలో కరుణానిధి తనయుడు 8 మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించారు. 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులు, టెలికం మాజీ మంత్రులు ఎ. రాజా, దయానిధి మారన్‌లకు టికెట్లు దక్కాయి. నీలగిరి నుంచి రాజా, చెన్నై సెంట్రల్ నుంచి మారన్ పోటీ చేయనున్నారు. -
రండి..రండి!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. అందరి కన్నా ముందుగా అన్నాడీఎంకే ఎన్నికల పనుల్లో దూసుకెళుతోంది. తమ నేతృత్వంలో బలమైన కూటమి లక్ష్యం గా బీజేపీ పావులు కదుపుతూ వస్తున్నది. తొలుత ఒంటరినంటూ ప్రకటించి, ఆ తర్వాత మనసు మార్చుకున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి మెగా కూటమి లక్ష్యంగా వ్యూహ రచనలో పడ్డారు. కాంగ్రెస్, డీఎండీకేలను కలుపుకోవడం లక్ష్యంగా చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన కరుణానిధి మహా నాడు వేదికగా తన కూటమిని ప్రకటిస్తారని సర్వత్రా ఎదురు చూశారు. తిరుచ్చి వేదికగా రెండు రోజుల పాటుగా జరిగిన మహానాడు కు వీసీకే, పుదియ తమిళగం, ద్రవిడ కళగం, మనిదనేయ మక్కల్ కట్చిల నేతలు తరలి వచ్చారు. తమ ప్రసంగాల్లో ఆయా పార్టీల నేతలెవ్వరూ కేంద్రంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బీజేపీని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకే తీరును దుయ్యబట్టా రు.కేంద్రంలోని యూపీఏ, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకేలపై ఎలాంటి విమర్శలు లేకుండా మహానాడులో ప్రసంగాలు సాగాయి. చేతులు కలపండి: కూటమి పార్టీల నేతలందరూ ప్రసంగించడంతో చిట్ట చివరగా ఆదివా రం రాత్రి కరుణానిధి ప్రసంగం సాగింది. కూటమి గురించి కరుణానిధి స్పష్టమైన ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. అయితే, తన ప్రసంగం అంతా రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారును తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేందుకు, ఆ ప్రభుత్వానికి కోర్టులు వేసిన అక్షింతల్ని వివరించడానికి ఎక్కువ సమయం కేటాయించారు. తన ప్రసంగంలో కేంద్రంపై ఎలాంటి విమర్శలు ఎక్కు పెట్టక పోవడం, తీర్మానాల్లోను ఇదే తంతు సాగడంతో కాంగ్రెస్‌తో తమ బంధం గట్టిదంటూ పరోక్ష సంకేతాన్ని మహానాడు వేదికగా ఇచ్చా రు. బీజేపీపై విరుచుకు పడుతూ ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని చాటారు. చివర్లో సేతు సముద్రం ప్రాజెక్టులక్ష్యంగా శ్రమిస్తున్న వాళ్లు, మతతత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలన్నీ తనతో కలసి రావాలని పిలుపు నిచ్చారు. ఆ పార్టీలతో కలసి మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు కరుణానిధి ప్రకటించారు. మహానాడు వేదికగా మతతత్వ వ్యతిరేక పార్టీలకు కరుణానిధి పిలుపు నిచ్చినా, ఆ పార్టీల నుంచి స్పందన ఏ మేరకు వస్తుందో వేచి చూడాల్సిందే. నిరాశలో స్టాలిన్ మద్దతుదారులు: మహానాడు వేదికగా తమ నేత స్టాలిన్‌కు ప్రమోషన్ ఇస్తారని మద్దతుదారులు ఎదురుచూశారు. అయితే, ఆ ఊసేలేకుండా తన ప్రసంగాన్ని కరుణానిధి ముగించారు. దీంతో వారు నిరాశలో కూరుకుపోయారు. డీఎంకేలో అళగిరి, స్టాలిన్ల మధ్య వారసత్వ సమరం గురించి తెలిసిందే. అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దృష్ట్యా, స్టాలిన్ హోదా పెరిగినట్టే. తన వారసుడు స్టాలిన్ అన్న స్పష్టమైన నిర్ణయంతో కరుణానిధి ఉన్నా, అధికారికంగా ప్రకటించడంలో వెనక్కు తగ్గుతున్నారు. తాజా, మహానాడులో స్టాలిన్‌ను మిత్ర పక్షాల నాయకులు పొగడ్తలతో ముంచెత్తారు. డీఎంకేకు తదుపరి రథ సార థి స్టాలిన్ అని, ఆయన సీఎం కావడం తథ్యమని ఆ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల సందర్భంలో మహానాడు పరిసరాల్లో చప్పట్లు, కేరింతలు మార్మోగాయి. అక్కడే ఉన్న కరుణానిధి ఆ వ్యాఖ్యలను వింటూ బయటకు కన్పించని రీతిలో తన మదిలో ఆనందాన్ని నింపుకున్నారట!. -
ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి శనివారం చెన్నైలో స్పష్టం చేశారు. డీఎంకే పార్టీలో అవినీతి పెచ్చురిల్లిందని పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకునేందుకు త్వరలో మదురై వెళ్ల నున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఓ ప్రముఖ ఆంగ్ల చానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే పార్టీపై అళగిరి నిప్పులు చెరిగిన విషయం విదితమే. డీఎంకే పార్టీలో ప్రజాస్వామ్యం మృగ్యమైందని అన్నారు. తన తండ్రి, కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు డీఏంకే అధినేత ఎం.కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్ కాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. ఆ అంశంపై డీఎంకే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల అలగిరి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కాంత్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కరుణానిధి ఆగ్రహానికి గురైయ్యారు. దాంతో అళగిరిని కరుణానిధి తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. ఆ కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అళగిరిని బహిష్కరించడంపై ఆయన వర్గం ఆగ్రహంతో ఉండగా, స్టాలిన్ వర్గం మాత్రం ఆనందోత్సాహలతో ఉంది. కరుణానిధి కుమారులు ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ల మధ్య వర్గ పోరు ఇటీవల కాలంలో తీవ్రమైన సంగతి తెలిసిందే. -
కరుణానిధిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
-
కరుణానిధిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
సొంత పార్టీ డీఎంకేపై విమర్శలు గుప్పించి బహిష్కరణకు గురై 24 గంటలు గడవక ముందే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తొలిసారిగా శనివారం ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అళగిరి మాట్లాడారు. డీఎంకేలో ప్రజాస్వామ్యం ఎక్కడేడ్చిందనిదంటూ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని మాత్రమే డిమాండ్ చేశానని, అంతేకాని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదన్నారు. తన తండ్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అళగిరి ఈ సందర్భంగా ఆరోపించారు. సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగిన అళగిరిపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి, చిన్న కుమారుడు స్టాలిన్ల నడుమ పార్టీలో అధిపత్య కోసం చేసే పోరు పతాక స్థాయికి చేరింది. తమిళ హీరో విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. కాగా అదే స్థాయిలో బీజేపీ కూడా విజయ్ కాంత్ పార్టీతో పొత్తుకు సై అంటుంది. అయితే డీఎండీకేతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించిన డీఎంకే అధినేత కరుణానిధి, ఇప్పటికే ఆ పార్టీతో మంతనాలు పూర్తి చేశారు. కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు, మదురై ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విజయకాంత్‌ను రాజకీయ నేతగా పరిగణించబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో విజయ్‌కాంత్‌పై ఈ వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని కరుణ ఈనెల 7న తీవ్రంగా మందలించారు. పొత్తులపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని తన నివాసంలో కలసిన అళగిరిని కరుణానిధి ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆ భేటీ అయిన కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కరుణానిధి ప్రకటించారు. ఆ ప్రకటనపై స్టాలిన్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. అళగిరి వర్గం మాత్రం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతోందంటూ ఆగ్రహం వెళ్లకక్కింది. -
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
-
డీఎంకె నుంచి అళగిరి బహిష్కరణ
చెన్నై: డీఎంకేలో వారసత్వ పోరుకు ఆ పార్టీ అధినేత ఎంకె కరుణానిధి చెక్ పెట్టారు. పెద్ద కుమారుడు ఎంకె అళగిరిపై వేటు వేశారు. పార్టీ నుంచి అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించారు. పార్టీ దక్షిణ విభాగ వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్న అళగిరిని తాత్కాలికంగా సస్పెండ్ చే డీఎంకే ప్రధాన కార్యదర్శి కె అంబళగన్ తెలిపారు. పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా, డీఎండీకే అధినేత విజయకాంత్ శైలిని తప్పుబడుతూ అళగిరి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. దీనిపై కరుణానిధి తీవ్రంగా స్పందించారు. పార్టీకి, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆళగిరిపై డీఎంకె క్రమశిక్షణ చర్య తీసుకుంది. -
కరుణానిధితో ఆళగిరి భేటీ
చెన్నై: డీఎండీకేతో పొత్తుపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన నేపథ్యంలో ఎం.కె. అళగిరి తన తండ్రి ఎం. కరుణానిధిని కలిశారు. దాదాపు అరగంట పాటు తండ్రితో మంతనాలు జరిపారు. అయితే భేటీ వివరాలు బయటకు వెల్లడికాలేదు. బయటకు వచ్చిన తర్వాత అళగిరి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. బహిష్కరించాల్సి ఉంటుందని తన తండ్రి హెచ్చరించిన నేపథ్యంలో కరుణానిధిని ఆళగిరి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయన్న అంశానికి వ్యతిరేకంగా ఆళగిరి వ్యాఖ్యలే చేయడంతో ఆయనపై కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఎంతటివారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడానికీ వెనుకాడబోమని తేల్చేశారు. -
ఏర్కాడు సీటు కోసం డీఎంకే ఇంటర్వ్యూలు
సాక్షి, చెన్నై : ఏర్కాడు ఉప ఎన్నికల బరిలో దిగేందుకు డీఎంకే నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కంటే తమకు సీటు ఇవ్వాలంటూ అన్నా అరివాళయంలో దరఖాస్తులు చేసుకున్నారు. శుక్రవారం జరిగే ఇంటర్వ్యూల మేరకు అభ్యర్థిని ఆ పార్టీ అధినేత ఎం కరుణానిధి ఖరారు చేయనున్నారు. ఎమ్మెల్యే పెరుమాల్ మరణంతో సేలం జిల్లా ఏర్కాడు రిజర్వుడు నియోజకవర్గ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆ స్థానం భర్తీకి ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. దీంతో ఏర్కాడులో ఎన్నికల సందడి నెలకొంది. డిసెంబర్ నాలుగున ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 20న అన్ని ప్రక్రియలు ముగించి ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓ వైపు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. అలాగే ఎన్నికల బరిలోకి అభ్యర్థుల్ని దించేం దుకు రాజకీయ పక్షాలు ఉరకలు తీస్తున్నాయి. తమ సీటును మళ్లీ చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పావులు కదుపుతున్నారు. గెలుపు ఖాయమయ్యే అవకాశాలు ఉండడంతో తమ కంటే తమకు సీటు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సీటు పెరుమాల్ తనయుడు రాజేష్‌ఖన్నా లేదా అక్కడి పార్టీ నాయకుడు తంగమణిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. సీపీఐ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, సీపీఎం సైతం మద్దతు ప్రకటించిన పక్షంలో విజయం తమదేనన్న ధీమాను ఆ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక డీఎంకేలో సైతం సీటు కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అన్నాడీఎంకేపై వ్యతిరేకత బయలుదేరిందన్న సంకేతాలతో ఈ ఎన్నికల్ని లోక్‌సభ ఎన్నికలకు రెఫరెండంగా మలచుకునేందుకు ఆ పార్టీ వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. నేతల క్యూ గెలుపు తమ వైపు ఉంటుందన్న ధీమాతో డీఎంకే నాయకులు సీటు కోసం పార్టీ రాష్ర్ట కార్యాలయం అన్నా అరివాళయానికి క్యూ కట్టారు. బుధ, గురువారాల్లో ఎన్నికల బరిలో నిలిచే ఆశావహుల నుంచి దరఖాస్తుల్ని డీఎంకే స్వీకరించింది. అన్నా అరివాళయంలో ఈ దరఖాస్తుల్ని సేలం ఇన్చార్జ్ శివలింగం స్వీకరించారు. తమ కంటే తమకు సీటు కావాలని పదికి పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకోవడం విశేషం. వీరిలో ఇది వరకు ఎన్నికల బరిలో నిలబడి పెరుమాల్ చేతిలో ఓటమి చవి చూసిన మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వన్ కూడా ఉన్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం నాయకురాలు ధనకోడి సైతం తనకే సీటు ఇవ్వాలని అధిష్టానానికి విన్నవించుకోవడం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న వారందరికీ శుక్రవారం ఇంట ర్వ్యూలు జరగనున్నాయి. అధినేత కరుణానిధి, కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో జరిగే ఈ ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణులయ్యేవారే ఏర్కాడు బరిలో డీఎంకే అభ్యర్థిగా ఉండనున్నారు. ఇక ఈ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే కుస్తీలు పడుతుండడం కొస మెరుపు. -
రాజాను బలిపశువును చేస్తే చూస్తూ ఊరుకోం: కరుణ
టెలికాం కుంభకోణంలో మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాను బలిపశువును చేస్తే సహించేది లేదని డీఎంకే పార్టీ మరోసారి స్పష్టం చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏ రాజా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 'ఏ ఒక్కరు కూడా బలిపశువు కాకూడదు. ఎవరైనా రాజాను బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు' అని డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి మీడియాతో అన్నారు. ఈ కుంభకోణంలో జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచి శివ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో మరొకరిని నియమిస్తారా అనే ప్రశ్నకు కరుణానిధి ఘాటుగా స్పందించారు. రాజ్యసభలో బలాబలాల ఆధారంగానే జేపీసీలో తమ పార్టీ సభ్యుడికి స్థానం లభించింది అని.. ఈ కేసులో తుది నివేదిక త్వరలో వెల్లడి కానుందని కరుణానిధి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందం గురించి రాహుల్ గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళి చర్చలు జరిపారనే వార్తను కరుణానిధి ఖండించారు. అందులో వాస్తవం లేదని.. నీలాంటి మీడియా మిత్రుడు అందించిన వార్తలో వాస్తవం లేదు అని కరుణానిధి చురకలంటించారు.