ప్రాధాన్యత సంతరించుకున్న కనిమొళి, అళగిరి భేటి!
చెన్నై: రాజ్యసభ ఎంపీ, సోదరి కనిమొళితో బహిషృత డీఎంకే నేత అళగిరి భేటి అయ్యారు. ప్రచారం కోసం తన తండ్రి కరుణానిధి చెన్నైకి దూరంగా ఉన్న నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. తన వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కనిమొళి అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్న క్రమంలో అళగిరి కలవడం ప్రాధాన్యత నెలకొంది.
టికెట్ల కేటాయింపులో స్టాలిన్ వర్గం పైచేయి సాధించారని కనిమొళి ఆగ్రహంతో ఉన్న తరుణంలో అళగిరి భేటి చర్చనీయాంశమైంది. సీఐటీ కాలనీలోని ఆమె నివాసంలో గంటకు పైగా కనిమొళితో చర్చలు జరిపారు. అయితే సమావేశ వివరాలు బయటకు రాలేదు.