నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్! | Vaiko holds demonstration againt Mahinda Rajapaksa | Sakshi
Sakshi News home page

నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!

Published Mon, May 26 2014 1:34 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్! - Sakshi

నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!

న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో  ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. 
 
రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement