J Jayalalithaa
-
తలైవి: ఎంజీఆర్ లుక్ రిలీజ్
నిజ జీవిత పాత్రలు చేయాలంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా మ్యాజిక్ చేయాలి. నటుడు అరవింద్ స్వామి కూడా ఈ విషయంలో సక్సెస్ సాధించినట్లే కనిపిస్తోంది. నేడు దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రమ్(ఎంజీఆర్) వర్దంతి. ఈ సందర్భంగా 'తలైవి' సినిమాలో పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు) ఎంజీఆర్ పాత్రకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి ఒదిగిపోయారు. ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడే ఆయన ‘డెంటిస్ట్’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎంజీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: బ్రెయిన్ డెడ్: ఏదైనా మిరాకిల్ జరగాలి) దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తలైవిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్‌కి విశేషమైన స్పందన లభించింది. తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు వర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా, హితేష్ తక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్) It was not just an honour to play the role of Puratchi Thalaivar MGR, but a great responsibility. I thank director A.L. Vijay & producers @vishinduri @shaaileshrsingh for having faith in me. I humbly post these pics in Thalaivar’s memory, today.#Thalaivi #MGR #ArvindSwamiasMGR pic.twitter.com/F4KY07Q4Dt — arvind swami (@thearvindswami) December 24, 2020 -
అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఎమ్జీఆర్ పాత్రలో అరవింద్ స్వామిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కంగనా రనౌత్ శనివారం విడుదల చేసింది. తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ అదిరిపోయింది. ముదురు ఆచుపచ్చ రంగు కేప్ ధరించి ఉన్న కంగనా భారీ కటౌట్.. ‘అమ్మ’ను తలపించేలా ఉంది. ‘అమ్మ’గా మారడానికి కంగనా పడిన కష్టం ఫస్ట్‌లుక్‌లో తెలుస్తోంది. జయ పాత్ర కోసం అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకున్నారు. ఇక ‘తలైవి’ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాను విబ్రీ మీడియా పతాకంపై విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా తమిళం,తెలుగు, హిందీ మూడు భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు. The legend we know, but the story that is yet to be told! Presenting #KanganaRanaut, in & as #Thalaivi. A film by #Vijay, arriving in cinemas on 26th June, 2020@KanganaTeam @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @KarmaMediaEnt @TSeries @vibri_media pic.twitter.com/lTLtcq0bsd — Team Kangana Ranaut (@KanganaTeam) November 23, 2019 -
జయలలిత.. నేనూ సేమ్ : హీరోయిన్
తమిళసినిమా: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే కంగనా చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మొదట్లో జయంరవికి జంటగా ‘ధామ్ ధూమ్’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్లో బిజీ అయి.. అక్కడ టాప్ హీరోయిన్గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో ఆమె నటించబోతున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్ క్రియేట్ అయింది. కారణం జయలలిత పాత్రలో కంగనా నటించనుండటమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు. మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్ స్పష్టం చేశారు. -
తలైవికి తలైవర్ రెడీ
తమిళసినిమా: తలైవికి తలైవర్ రెడీ అయిపోయారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె జీవిత చరిత్రతో ఆధారంగా దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తయింది. కానీ, విడుదలలోనే ఇది సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించబోతున్నారు. ఇంకోవైపు దర్శకుడు విజయ్ కూడా అమ్మ జీవితకథను ప్రతిష్టాత్మకంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీనికి తలైవి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఇందులో జయలలితగా బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘మక్కళ్తిలగం’ ఎంజీఆర్ పాత్రను నటుడు అరవిందస్వామి పోషించబోతున్నారు. ఈ మేరకు చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సో తలైవిగా కంగనా, తలైవర్‌గా అరవిందస్వామి నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీనికి బాహుబలి చిత్రం ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు ఇందూరి, సైలేశ్లు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్లో గానీ, 2020 ప్రథమార్ధంలో గానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం కంగనా భారతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు. -
అనారోగ్యంతోనే జయ మృతి
► నివేదిక సమర్పించిన ఎయిమ్స్ ► తమిళనాడు ప్రభుత్వం వెల్లడి సాక్షిప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత అనారోగ్య కారణాలతోనే చనిపోయారని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధా రమైనవంది. జయకు జరిగిన చికిత్స వివరాలను బహిరంగంగా వెల్లడించ కూడదనే నిబంధన ఉన్నా అనవసర వదంతులకు తావివ్వకూడదనే కారణంతో ప్రకటన విడుదల చేసినట్లు ప్రభుత్వ వైద్యశాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ మీడియాకు చెప్పారు. జయ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ నెల 8న నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జయకు చికిత్సలో భాగస్వామ్యులైన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు తమిళనాడు ప్రభుత్వానికి సోమవారం నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయలలిత శ్వాసకోశ ఇబ్బందితో స్పృహ కోల్పోయిన స్థితిలో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించినపుడు డీహైడ్రేషన్, జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నట్లు తేలింది. ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని ప్రారంభిం చాం. డిసెంబరు 3న జయను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులను అభినందించారు. అయితే 4న ఆమె తీవ్ర గుండెపోటుకు గురికాగా ఎక్మో చికిత్స అందజేశాం. అయినా దుర దృష్టవశాత్తూ 5వ తేదీ రాత్రి 11.30 గంట లకు జయ తుదిశ్వాస విడిచారు’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది. -
జయ వైద్య నివేదికల వెల్లడి!
-
ఎవరీ చీఫ్ సెక్రటరీ? ఏమా కథ?
సరిగ్గా ఐదేళ్ల కిందటి ముచ్చట ఇది. 2011 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు చేపట్టారు. ఆ వెంటనే పీ రామ్మోహనరావు ఆమె కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల తర్వాత జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆయన ఏకంగా యావత్ అధికార వర్గాలను విస్మయపరుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా అత్యంత కీలక పగ్గాలు చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం యంత్రాంగ పరంగానే కాదు అధికార కేంద్రపరంగానూ ఆయనను అత్యంత కీలక వ్యక్తిగా భావిస్తారు. జయలలిత మరణం తర్వాత ఆమె పాదాల వద్ద కీలకంగా ప్రముఖంగా కనిపించింది కూడా రామ్మోహనరావే. ఈ నేపథ్యంలో సహజంగానే రామ్మోహనరావు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నిజానికి మరో ఏడు నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ నల్లధనంతో పట్టుబడ్డ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రామ్మోహనరావు ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ప్రకంపనలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహనరావు 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో ఆయన తొలిసారి సబ్ కలెక్టర్‌గా సర్వీసులో చేరారు. గత జూలై 8న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. జయలలిత పార్టీ అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అప్పటి సీఎస్ కే జ్ఞానదేశికన్‌ను అర్ధంతరంగా తొలగించి.. రామ్మోహనరావును సీస్‌గా నియమించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన ఎప్పుడు కేంద్ర సర్వీసులలోకి డిప్యూటేషన్ మీద వెళ్లలేదు కానీ, 2001-03 మధ్యకాలంలో గుజరాత్ మారిటైమ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టేందుకు డిప్యూటేషన్ మీద వెళ్లారు. ఐఏఎస్ అధికారిగా పలు హోదాల్లో సేవలు అందించిన ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె నెచ్చెలి శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారని చెప్తారు. -
పెరిగిపోతున్న అమ్మ అభిమానుల మరణాలు
చెన్నై: పురచ్చితలైవి జె.జయలలిత చనిపోయారన్న వార్తను అన్నాడీఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు, మద్ధతుదారులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత సోమవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటివరకూ 280 మంది అమ్మ అభిమానులు చనిపోయినట్లు అన్నాడీఎంకే నేతలు శనివారం వెల్లడించారు. అదేవిధంగా మృతిచెందిన వారి ప్రతి కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు పార్టీ ప్రకటించింది. పార్టీ గత ప్రకటనలో 77 మంది మృతిచెందినట్లు పేర్కొనగా, మృతులసంఖ్య పెరిగిపోతుందని ప్రస్తుతం 280 మంది చనిపోయినట్లు అన్నాడీఎంకే పార్టీ పేర్కొంది. ఇందులో ఎక్కువగా చెన్నై, వెల్లూర్, తిరువళ్లూర్, తిరువన్నమలై, కుడ్డలూర్, క్రిష్ణగిరి, ఎరోడ్, తిర్పూర్ జిల్లాలలోనే జయలలిత అభిమానులు, మధ్దతుదారులు ఎక్కువగా మృతిచెందినట్లు వివరించారు. సెప్టెంబర్ 22న తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత సోమవారం రోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలో ఇంటికి తిరిగి వెళ్లనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో గుండెపోటు రావడంతో ఆరోగ్యం క్షీణించి ఆమె కన్నుమూయడంతో జయ ఇక లేరన్న ఈ నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అన్నాడీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు. -
జయలలిత ఆరోగ్యంపై మరో అప్ డేట్!
-
జయలలిత ఆరోగ్యంపై మరో అప్ డేట్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆ పార్టీ కీలకనేతలు బుధవారం తెలిపారు. ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చిందని, గతంలో మాదిరిగానే ఆమె అందరి ముందుకు త్వరలోనే వస్తారని చెప్పారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆమె పూర్తిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల్లో యథాతథంగా రాష్ట్ర పరిపాలన కొనసాగిస్తారని ఆయన దీమా వ్యక్తంచేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానుల పూజలు, ప్రత్యేక ప్రార్థనలు ఫలించి జయలలిత కోలుకుంటున్నారని చెప్పారు. సీఎం ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని అపోలో వైద్యులు చెప్పారని జయ సన్నిహితురాలు, పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతీ మీడియాకు తెలిపారు. అయితే ఆమె పూర్తిగా కోలుకునేంతవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని, ఇప్పుడిప్పుడే జయలలిత నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారని చెప్పారు. పార్టీ నేతలు, ప్రజలు చేసిన పూజలు, ప్రార్థనల వల్ల అమ్మ మళ్లీ మామూలు మనిషి అయ్యారని హర్షం వ్యక్తంచేశారు. దీపావళి పండుగకు జయలలిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతారని అక్టోబర్ 27న ప్రకటన విడుదల అవుతుందని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. గత రెండు వారాలుగా ఆమె ఆరోగ్యంపై ప్రభుత్వంగానీ, అస్పత్రి వర్గాలుగానీ హెల్త్ బులెటిన్స్ కూడా లేకపోవడంతో అమ్మ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. డీహైడ్రేషన్, జ్వరంతో బాధపడుతున్న సీఎం జయలలిత సెప్టెంబర్ 22నుంచి చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అమ్మకు సంబంధించిన హెల్త్ బులెటిన్ చివరగా అక్టోబర్ 21న విడుదలచేశారు. ఆ తర్వాత జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన, సమాచారం లేకపోవడంతో ఇది ఎన్నో అనుమానాలకు దారితీసింది. లండన్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో జయ చికిత్స తీసుకుంటున్నారు. -
చౌహాన్ చౌక భోజనం.. ఎంతో తెలుసా?
భోపాల్ : తమిళనాడులో విజయవంతమైన సీఎం జయలలిత అమ్మ క్యాంటీన్లు చూశాం.. ఇప్పుడు ఆమె బాటలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా అడుగులు వేస్తున్నారు. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు రూ.10కే కడుపునిండా భోజనం పెట్టేందుకు చౌహాన్ ప్లాన్ చేస్తున్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 25న ఈ సబ్సిడీ భోజన ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని చౌహాన్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్‌లో చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ప్లేట్ భోజనంలో రోటీ, పప్పు, కూర, అన్నం, పచ్చడి ఉంటాయని, మొదట ఈ ప్రోగ్రామ్‌ను భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లో ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అనంతరం మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ డిపార్ట్మెంట్ అడ్మిన్‌స్ట్రేషన్ కలిసి వివిధ క్యాంటిన్లలో భోజనాన్ని పేద ప్రజలకు అందించే బాధ్యతను పర్యవేక్షించాల్సి ఉంటుందని చౌహాన్ అధికారులకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. -
హిల్లరీ నిర్ణయానికి 'అమ్మే' కారణమట!
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగడానికి కారణమేంటి? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ పొందడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? దీనికంతటికీ కారణం తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత అని ఆ పార్టీ ఎమ్మెల్యే రాము చెబుతున్నారు. సాక్షాత్తూ తమిళనాడు అసెంబ్లీలో ఈ విషయం చెప్పి అమ్మభక్తి చాటుకున్నారు. రెండేళ్ల క్రితంలో అన్నాడీఎంకేలో చేరిన రాము తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 'అమెరికా చరిత్రలో ఓ మహిళ (హిల్లరీ) తొలిసారి ప్రధాన పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ ఘనతంతా అమ్మదే (జయలలిత). హిల్లరీ భారత్ పర్యటనకు వచ్చినపుడు అమ్మను కలిశారు. ఈ సమావేశానికి ఎంతో చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది. అమ్మతో మాట్లాడాక హిల్లరీ ఎంతో స్ఫూర్తిపొందారు. అమ్మ వ్యక్తిత్వం, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం గురించి తెలుసుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీచేసేలా హిల్లరీ ప్రేరణ పొందారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా నామినేషన్ పొందారు. దీనికంతటికీ కారణం అమ్మే' అని అసెంబ్లీలో రాము చెప్పారు. -
అక్కడ మన క్రీడాకారిణులు క్షేమమే!
-
అక్కడ మన క్రీడాకారిణులు క్షేమమే!
చెన్నై: సైనిక తిరుగుబాటుతో హింస తలెత్తి తీవ్ర ఉద్రిక్తంగా మారిన టర్కీలో 11మంది తమిళనాడు అథెట్లు చిక్కుకున్నారు. టర్కీలో జరుగుతున్న వరల్డ్ స్కూల్ గేమ్స్ మీట్ లో పాల్గొనేందుకు వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థినులు వెళ్లారు. ఇంతలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకోవడంతో వారి భద్రతపై ఆందోళన వ్యక్తంకాగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం వారు క్షేమంగా ఉన్నారని తెలిపింది. వారి భద్రత గురించి ఆందోళన అవసరం లేదని, టర్కీ నుంచి విద్యార్థినులు క్షేమంగా తిరిగొచ్చేలా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కోరినట్టు పేర్కొంది. ఈమేరకు టర్కీలో తమిళనాడు అథ్లెట్ల భద్రత కోసం ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాలు జారీచేశారని ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ కోసం పలు భారత్ నుంచి 148 బాలలు వెళ్లగా.. వారు ప్రస్తుతం భద్రమైన జోన్ లో ఉన్నారని, అందులోనే 11మంది తమిళనాడు క్రీడాకారులు కూడా ఉన్నారని, జూలై 18న ఈ క్రీడలు ముగించుకొని వారు స్వదేశానికి తిరిగిరానున్నారని భారత రాయబార కార్యాలయం తమకు తెలియజేసిందని, కాబట్టి వారి భద్రత కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. -
హిల్లరీకి అమ్మ అభినందనలు
చెన్నై: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల చరిత్రలో ప్రధాన రాజకీయ పార్టీ తరపున తొలి మహిళా అభ్యర్థిగా నామినేషన్ పొందిన హిల్లరీ క్లింటన్‌ను అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. 2011లో అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ భారత్ పర్యటకు వచ్చిన విషయాన్నిజయలలిత గుర్తుచేసుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ నామినేషన్ పొందిన సంగతి తెలిసిందే. 'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీ తరపున నామినేషన్ పొందిన తొలి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ గర్వపడాల్సిన, సంతోషించాల్సిన విషయమిది. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలలో ఓ పార్టీ నుంచి మీరు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నామినేషన్ పొందడం అసాధారణ విషయం. ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధికారతకు పాటుపడతారని, గళం వినిస్తారని ఆశిస్తున్నా' అని జయ అభినందన సందేశంలో పేర్కొన్నారు. -
స్నేహ బంధమా!
ఎన్డీఏ, అన్నాడీఎంకేల మధ్య స్నేహబంధానికి బీజం పడే రీతిలో అమ్మ జయలలిత ఢిల్లీ పర్యటన సాగి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేంద్రానికి అన్నాడీఎంకే ఎంపీల మద్దతు తప్పనిసరి కావడం, అప్పుల్లో ఉన్న తమిళనాడుకు కేంద్రం నిధులు అవసరం కాబట్టి స్నేహపూర్వక మద్దతు దిశగా ఈ పర్యటనలో చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక, పీఎం నరేంద్ర మోదీ ముందు 29 వినతులను అమ్మ జయలలిత ఉంచి వచ్చారు. అవన్నీ పాతవే అయినా, అమలు తప్పనిసరి కావడం, నిధుల కోసం విన్నవించారు. ఒక్క రోజు అమ్మ పర్యటనను బ్రహ్మరథంతో అన్నాడీఎంకే వర్గాలు విజయవంతం చేశారు. ♦ ప్రధాని మోదీతో అమ్మ భేటీ ♦ మోదీ ముందు 29 వినతులు ♦ నిధుల కోసం వేడుకోలు ♦ విన్నపాలు పాతవే..అయినా..కొత్తగా ♦ ఢిల్లీలో తమిళ సీఎం జయలలిత ♦ పార్టీ వర్గాల బ్రహ్మరథం సాక్షి, చెన్నై: ఆరోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సిద్ధమయ్యారు. దీంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం చోటు చేసుకుంది. పలు ముసాయిదాల అమలుకు కేంద్రం పడుతున్న పాట్లు, అన్నాడీఎంకేకు కలిసి వచ్చే అంశంగా మారినట్టు చెప్పవచ్చు. ఇందుకు కారణం ఉభయ సభల్లో యాభై మంది ఎంపీలతో దేశంలోనే అతి పెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే అవతరించడమే. ఈ పరిస్థితుల్లో అమ్మ ఢిల్లీ పర్యటనలో ఎంపీల మద్దతు ను కూడ గట్టుకునే దిశగా ప్రధాని మోదీ చర్చలు, తమిళనాడు ప్రగతికి నిధుల వరద లక్ష్యంగా అమ్మ విన్నపాలు సాగ వచ్చని సర్వత్రా భావించారు. అందుకు తగ్గట్టుగానే ఈ పర్యటన సాగి ఉండే అవకాశాలు ఎక్కువే అని, స్నేహ పూర్వక మద్దతు కేంద్రానికి అన్నాడీఎంకే ఇచ్చే దిశగా చర్చలు జరిగి ఉండొచ్చని రాజకీ య వర్గాలు భావిస్తుండడం గమనార్హం. అమ్మ పర్యటన: ఉదయం పదకొండున్నర గంటలకు చెన్నై నుంచి మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకున్న జయలలితకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూధనన్ పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు. అక్కడి నుంచి నెచ్చెలి శశికళ , ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. సరిగ్గా ఒకటి యాభై గంటలకు ఢిల్లీకి చేరుకున్న అమ్మకు అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై నేతృత్వంలో ఉభయ సభల్లోని అన్నాడీఎంకే ఎంపీలు, ఢిల్లీలోని పార్టీ వర్గాలు తరలి వచ్చి అమ్మకు ఘనస్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు దారి పొడవున పుష్పాలను చల్లుతుండగా, అమ్మ కాన్వాయ్ తమిళనాడు భవన్‌కు చేరుకుంది. అక్కడ ఎనిమిదో బెటాలిన్ ప్రత్యేక పోలీసు విభాగం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి రెండు గంటల పాటుగా విశ్రాంతి తీసుకున్నారు. సరిగా నాలుగుగంటల 40 నిమిషాలకు అక్కడి నుంచి నేరుగానం.7 రేస్ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసం వైపుగా అమ్మ కాన్వాయ్ బయలు దేరింది. 4.45 నిమిషాల నుంచి యాభై నిమిషాల పాటుగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 29 విన్నపాలు : ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహ పూర్వక, రాజకీయ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రగతి పథకాల విషయంగా చర్చలు జరిగినట్టు సమాచారం. కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినట్టు, జీఎస్టీ తదితర ముసాయిదాల్లో సవరణల దిశగా సూచనలు ఇచ్చినట్టు తెలిసింది. ముసాయిదాల విషయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చే రీతిలో చర్చలు సాగినా, ప్రధాని నరేంద్ర మోదీ ముందు 29 రకాల విన్నపాలను అమ్మ జయలలిత ఉంచడం గమనార్హం. ఇవన్నీ పాతవే అయినా సరికొత్తగా ఇప్పుడు అమలు చేయాల్సిన అవశ్యం ఉన్న అంశాలు. ఇందులో కచ్చదీవులు, జాలర్ల సమస్య, ముల్లై పెరియార్వ్యవహారం, కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పు, జల్లికట్టు వంటి అంశాలు ఉండటం కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టినట్టే. ఈ ఇద్దరి మధ్య సాగిన భేటీలో తమిళనాడు ప్రగతి, విన్నపాల మీద పరిశీలించి అమలు దిశగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం గమనార్హం. తదుపరి అక్కడి నుంచి తమిళనాడు భవన్‌కు చేరుకున్న జయలలితను కేంద్ర సహాయ మంత్రులు నిర్మల సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ భేటీ కావడం విశేషం. ఈ భేటీలో వైజాగ్ నుంచి చెన్నై వరకు సరుకు రవాణా నిమిత్తం సాగనున్న కారిడార్ నుంచి తూత్తుకుడి, కులచల్ వరకు విస్తరించేందుకు తగ్గ సమాలోచన సాగినట్టు నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు.ఒక రోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చెన్నైకు సీఎం జయలలిత చేరుకున్నారు. వినతుల్లో ముఖ్యమైనవి కొన్ని.. ♦ ముల్లై పెరియార్ వ్యవహారంలో కేరళ సర్కారు తీరుపై ఆగ్రహం. 142 నుంచి 152 అడుగులకు నీటి మట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి. ♦ నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతం, అవినాశి - అత్తి కడవు పథకానికి కేంద్రం నిధులు ♦ కేంద్రం నుంచి వివిధ పథకాలు,సంక్షేమ కార్యక్రమాలకు రావాల్సిన నిధులు బకాయిలతో పాటుగా సక్రమంగా విడుదల చేయాలి. ♦ శ్రీలంకకు దారాదత్తం చేసిన తమిళ భూభాగం కచ్చదీవుల్ని తిరిగీ స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలి. ♦ జాలర్లపై జరుగుతున్న దాడుల్ని వివరిస్తూ, ఆ దేశ చెరలో ఉన్న బందీలందర్నీ విడుదల చేయించాలి. మళ్లీ దాడులు పునరావృతం కాకుండా శ్రీలంకతో చర్చలు జరపాలి. ♦ విద్యుత్, వ్యవసాయ రంగాలకు కేటాయింపులు పెంచాలి. ♦ చెన్నైలో మెట్రో రైలు రెండో దశ పనులకు అనుమతి ఇవ్వాలి. నిధుల కేటాయింపులు త్వరితగతిన జరగాలి. ఎంఆర్టీఎస్కు అనుమతి ఇవ్వాలి. ♦ గ్రామీణ,ఆరోగ్య, నగర, విద్య, ఐటీ రంగాల బలోపేతానికి తగ్గట్టుగా పూర్తి సహకారం అందించాలి. ♦ కావేరి జల వివాదంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును త్వరితగతిన అమలు పరచాలి. కావేరి అభివృద్ధిమండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. మేఘదాతులో డ్యాం నిర్మాణానికి కర్నాటక ప్రయత్నాల్ని అడ్డుకోవాలి. ♦ మద్రాసు హైకోర్టులో తమిళం అధికారిక భాషగా ప్రకటించారు. తమిళంలో వాదనలకు అనుమతి త్వరితగతిన ఇవ్వాలి. ♦ తమిళనాడుకు నిత్యవసర వస్తువుల పంపిణీలో కోతల్ని విధించకుండా సక్రమంగా పంపిణీ చేయాలి. ♦ తమిళుల సాహస, సంపద్రాయ క్రీడ జల్లికట్టకు మళ్లీ అనుమతి దక్కే విధంగా చట్ట సవరణలు చేయాలి. ఆహార భద్రతా చట్టంలో తమిళనాడుకు మినహాయింపులు ఇవ్వాలి. ♦ జౌళి, చిరు వర్తకులకు అభ్యున్నతిని కాంక్షించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా మూత బడ్డ నోకియాను మళ్లీ తెరిపించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాలి. ♦ కొచ్చిన్ నుంచి బెంగళూరుకు తమిళనాడులోని ఏడు జిల్లాల్లోని పంట పొలాల మీదుగా తీసుకెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ పనుల్ని నిలుపుదల చేసి, జాతీయ రహదారి గుండా పనులు చేపట్టాలి. -
మోదీ ముందు 29 డిమాండ్లు ఉంచిన అమ్మ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. జయలలిత 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మోదీకి అందజేశారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని, కావేరి జలవివాదాల పరిష్కారానికి బోర్డు ఏర్పాటు చేయాలని జయలలిత కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అన్నాడీఎంకే చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించి, జయలలిత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ వేర్వేరుగా పోటీచేసినా.. ఎన్డీయే ప్రభుత్వంలో అమ్మ పార్టీ చేరవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. -
అమ్మ ఇంటి వద్ద కమ్ముకున్న నిశ్శబ్దం
చెన్నై: ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమిళనాడులో మార్పు ఆనవాయితే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అమ్మను సాగనంపుతూ.. కరుణానిధి కోసం అధికార గుమ్మం ఎదురుచూస్తున్నదని తేల్చాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో పోయిస్ గార్డెన్స్‌లోని ముఖ్యమంత్రి జయలలిత నివాసం మూగబోయింది. రేపు ఫలితాలు వెల్లువడనున్న నేపథ్యంలో ఇక్కడ గంభీరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. సోమవారం జరిగిన పోలింగ్‌లో ఓటేసిన అనంతరం తన నిచ్చెలి శశికళ నాటరాజన్‌తో కలిసి జయలలిత నివాసానికి చేరుకుంది. ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళీ, అధికార అన్నాడీఎంకే అభ్యర్థుల విజయావకాశాలపైన అందిన సమాచారాన్ని ఆమె విశ్లేషించింది. అమ్మతో చేదువార్తలను పంచుకొనే ధైర్యం పార్టీ నాయకులకు లేకపోవడంతో ఎన్నికల్లో అన్నాడీఎంకే బాగా పనిచేసిందని, మీరే అధికారంలో కొనసాగుబోతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శులు ఆమెకు నివేదించినట్టు సమాచారం. అన్ని జిల్లాల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గంభీరమైన మౌనం దాల్చినట్టు తెలుస్తోంది. జర్నలిస్టులతో ఎప్పుడోగానీ ముచ్చటించని జయలలిత మీడియాలో తన పార్టీ పట్ల వస్తున్న వార్తలను శ్రద్ధగా వీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రోజూ గంటపాటు దినపత్రికలు చదువుతూ.. నిత్యం న్యూస్ చానెళ్లు చూస్తూ ఆమె గడుపుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'అమ్మ అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చూశారు. ఒక్క దాంట్లో తప్ప అన్నింటిలోనూ అన్నాడీఎంకేకు ఘోరమైన ఓటమి తప్పదని తేలింది. ఈ ఫలితాలు చూసి అమ్మ నిశ్చేష్టురాలయ్యారు' అని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు మీడియాతో తెలిపారు. -
వామ్మో! ఆయన జయలలిత పార్టీ అభ్యర్థా?
తిరువనంతపురంలో రిక్షాలు, జీపుల్లో ఊరేగుతున్న అన్నాడీఎంకే కటౌట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నడూలేనిరీతిలో జయలలిత, ఎంజీ రామచంద్రన్ ఫొటోలతో అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం స్థానికులను ఆశ్చర్య పరుస్తున్నది. ఈ కటౌట్లలో ప్రముఖంగా కనిపిస్తున్న మరో వ్యక్తి డాక్టర్ బీజూ రమేశ్. అన్నాడీఎంకే అభ్యర్థిగా తిరువనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగారు. 'టోపీ' గుర్తుతో బరిలోకి దిగిన ఆయనను చూడగానే కేరళ రాజకీయ నాయకులు ఒకింత విస్మయానికి లోనవుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రూ. 161 కోట్ల ఆస్తులతో కేరళలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజూ రమేశ్ బార్ల కుంభకోణంలో కీలక వ్యక్తి. బార్లకు లైసెన్సుల కోసం లంచాలు ఇచ్చినట్టు బీజూ రమేశ్ చేసిన ఆరోపణలు కేరళను రాజకీయంగా కుదిపేశాయి. ఈ ఆరోపణల దెబ్బకు బలమైన రాజకీయ నాయకుడు, ఆర్థికమంత్రి కేఎం మణి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారం కుదిపేస్తుండగానే ఆయన ఏకంగా అన్నాడీఎంకే వంటి బలమైన తమిళ పార్టీ నుంచి కేరళ ఎన్నికల బరిలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2014 డిసెంబర్లో ఓ టీవీ చానెల్ చర్చలో బీజూ రమేశ్ మాట్లాడుతూ.. బార్ల అసోసియేషన్ తరఫున ఆర్థికమంత్రి కేఎం మణికి రూ. కోటి లంచంగా ఇచ్చామని వెల్లడించి సంచలనం రేపారు. అప్పుడు ఆయన బార్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఉండేవారు. బార్ల లైసెన్సుల కోసం లంచాలు తీసుకున్న వ్యవహారం చినికిచినికి.. చివరకు మణి రాజీనామాకు దారితీసింది. ఈ వివాదం నేపథ్యంలో కేరళలో ఏకంగా మద్యనిషేధాన్ని సీఎం ఊమెన్ చాందీ ప్రకటించారు. అటు సీపీఎం నేతృత్వంలో ప్రతిపక్ష కూటమి కూడా ఓట్ల కోసం మద్యనిషేధానికి మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన రమేశ్ కేరళ మద్యవిధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో జయలలిత తమిళనాడులో ప్రతిపాదించిన దఫాలవారీగా మద్యనిషేధాన్ని ఆయన సమర్థిస్తున్నారు. తాను సాదాసీదాగా ఎన్నికల బరిలోకి దిగలేదని, ప్రతిష్టాత్మకమైన తిరువనంతపురం నియోజకవర్గంలో గెలుపు తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఎంజీఆర్‌కి సీఎం జయలలిత ఘన నివాళి
చెన్నై : ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కి తమిళనాడు సీఎం జయలలిత ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఎంజీఆర్ 99వ జయంతి. ఈ సందర్భంగా చెన్నైలోని ఆయన విగ్రహానికి జయలలిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి జయలలిత స్వీట్లు పంచిపెట్టారు. తమిళనాడు శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకే పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని శనివారం పార్టీ కార్యకర్తలకు సీఎం జయలలిత సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
'అమ్మ' పేరుతో మరో పథకం
చెన్నై: అన్నా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. 'అమ్మ' పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమం కోసం జయలలిత 'అమ్మ సీడ్స్' పథకాన్ని ప్రారంభించారు. గతంలో తమిళనాడు అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు.. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ఆరంభించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడులో 'అమ్మ సర్వీస్ సెంటర్ల' ద్వారా ఈ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. జయలలిత గతంలో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ సాల్ట్ తదితర పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
అఖిలేష్ యాదవ్ థ్యాంక్స్ : జయలలిత
టీనగర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రాష్ట్ర సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో రాష్ట్రానికి పలువురు ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమిళనాడుకు రూ.25 కోట్ల రూపాయల నిధులను అందజేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో ముఖ్యమంత్రి జయలలిత అఖిలేష్ యాదవ్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు. రాష్ట్రంలో వరద నివారణ పనులు వేగవంతంగా జరుగుతున్న స్థితిలో ఇందుకు సాయపడే విధంగా తమరు అమూల్యమైన నిధిగా రూ.25 కోట్లు కేటాయించి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
నిజంగా మీరు జయలలితను అభిమానిస్తే...
చెన్నై: అన్నాడీఎంకే మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. మీరు నిజంగా జయలలితను అభిమానిస్తే సహనాన్ని పాటించాలన్నారు. మంగళవారం జయలలిత తరపున దాఖలైన పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ అభిమానులకు, అన్నాడీఎంకే మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నారనే దాఖలైన కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ లభించిందంటూ పుకార్లు రావడంతో పలు మీడియా, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వార్తల్ని ప్రసారం చేశాయి. ఆతర్వాత బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందనే వార్త బయటకు పొక్కడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో అభిమానులు,కార్యకర్తలు అవేశానికి లోనవ్వద్దని పన్నీర్ సెల్వం సూచించారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి జయలలిత అభినందనలు!
చెన్నై:తమిళనాడు రాష్ట్ర విభాగానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ తమిళిసాయి సౌందర్ రాజన్(53) ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. తాజాగా తమిళ బీజేపీ బాధ్యతలు తీసుకున్న సౌందర్ రాజన్ కు తన అభినందనలు అంటూ లేఖలో పేర్కొన్నారు. 'చాలా సంతోషం. తమిళ రాష్ట్ర విభాగానాకి సౌందర్ రాజన్ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు' అంటూ జయలలిత తెలిపారు. బీజేపీ జాతీయ సెక్రటరీగా పనిచేసిన సౌందర్ రాజన్ శనివారం తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టారు. అంతకుముందు ఇక్కడ రాధాకృష్ణన్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు.