బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి జయలలిత అభినందనలు! | Jayalalithaa greets new BJP TN President | Sakshi
Sakshi News home page

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి జయలలిత అభినందనలు!

Published Sun, Aug 17 2014 4:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

Jayalalithaa greets new BJP TN President

చెన్నై:తమిళనాడు రాష్ట్ర విభాగానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ తమిళిసాయి సౌందర్ రాజన్(53) ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అభినందించారు. తాజాగా తమిళ బీజేపీ బాధ్యతలు తీసుకున్న సౌందర్ రాజన్ కు తన అభినందనలు అంటూ లేఖలో పేర్కొన్నారు. 'చాలా సంతోషం. తమిళ రాష్ట్ర విభాగానాకి సౌందర్ రాజన్ బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు' అంటూ జయలలిత తెలిపారు.

బీజేపీ జాతీయ సెక్రటరీగా పనిచేసిన సౌందర్ రాజన్ శనివారం తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టారు. అంతకుముందు ఇక్కడ రాధాకృష్ణన్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement