'అమ్మ' పేరుతో మరో పథకం
చెన్నై: అన్నా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. 'అమ్మ' పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమం కోసం జయలలిత 'అమ్మ సీడ్స్' పథకాన్ని ప్రారంభించారు.
గతంలో తమిళనాడు అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు.. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ఆరంభించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడులో 'అమ్మ సర్వీస్ సెంటర్ల' ద్వారా ఈ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. జయలలిత గతంలో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ సాల్ట్ తదితర పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.