Jayalalitha Amma
-
‘జేబులో ‘అమ్మ’ ఫోటో సరే మరి రక్షణ మాటేంటి‘
చెన్నై : అమ్మ(జయలలిత) ఫోటోలను పాకెట్లో పెట్టుకు తిరిగే మీరు మహిళల రక్షణకు తీసుకునే చర్యలేంటని తమిళనాడు మంత్రులను ప్రశ్నిస్తున్నారు కమల్ హాసన్. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్ రాకెట్ కేసు విషయంలో అధికార పార్టీ మంత్రులు మౌనంగా ఉంటడం పట్ల కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళ పేరును కోయంబత్తూరు ఎస్పీ వెల్లడించారు. కానీ ప్రభుత్వం సదరు ఎస్పీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాధితులకు సంబంధించిన వీడియోలు ఎలా లీక్ అయ్యాయి. వీటన్నింటికి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉందం’టూ కమల్ ప్రశ్నించారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం బాధితుల పేర్లను వెల్లడించి వారిని అవమానిస్తుందంటూ కమల్ హాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన వారిలో అధికార పార్టీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బెయిల్ మీద విడుదలవ్వడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ కేసులో డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ కుటుంబీకులకు సంబంధాలు ఉన్నాయంటూ గత మూడు రోజులుగా వార్తాచానళ్లలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలను జయరామన్ ఖండించారు. ఇదిలా ఉండగా ఈ భారీ సెక్స్ రాకెట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలిపారు. ప్రసుత్తం ఈ కేసును సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక పొల్లాచ్చి అత్యాచారాలకు నిరసనగా విద్యార్థి లోకం గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలు గురువారం తీవ్రరూపం దాల్చాయి. చెన్నై, పొల్లాచ్చి, కోయంబత్తూరు, కరూరు, తంజావూరు, వేలూరు తదితర నగరాల్లో విద్యార్థులు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిపారు. విద్యార్థి సంఘాలన్నీ ధర్నాలు, రాస్తారోకో జరపటంతో ఆ నగరాలన్నీ దద్దరిల్లిపోయాయి. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో మాయమాటలతో మోసపుచ్చి 200లకు పైగా పాఠశాల, కళాశాల విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన నలుగురు సభ్యులున్న ముఠాను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
అమ్మ పేరు అమ్మే
తల్లికి ఒక పేరు ఉంటుందని పిల్లలకు గుర్తుండదు. తమకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే. అయినా ఎంత మంచి పేరున్నా ‘అమ్మ’ అనే పేరు కన్నా మంచి పేరు ఉంటుందా?! హీరోలు కథల్లో ఉంటారు. సినిమాల్లో ఉంటారు. పాఠకులను, ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుంటారు, జీవితాలకు కావల్సినంత స్ఫూర్తిని నింపుతుంటారు. అయితే అలాంటి హీరోలు జీవితంలోనూ ఉంటారు. అసలు ఎవరి జీవితానికి వాళ్లే హీరోలు. మనలో ప్రతి ఒక్కరి దగ్గరా మన జీవితాలకే కాదు మరో పదిమందికి స్ఫూర్తినిచ్చే ప్రేరణశక్తి ఉంటుంది. అలాంటి ఒక ప్రేరణ, ఒక స్ఫూర్తి ప్రదాత మా అమ్మ అంటోంది నికితా శెట్టి. ఈ అమ్మాయిది ముంబై. ‘మా అమ్మ పర్వతాలను కదిలించేటంత ప్రేమను పంచుతుంది. ఆమెలో ఓ పోరాటయోధురాలు ఉంది. స్థిరంగా ఉంటూ సమస్యల్ని సంయమనంతో చక్కదిద్దే చాతుర్యమూ ఉంది. నా జీవితంలో నేను చూసిన ఏకైక హీరో ఆమె. ఒక్కమాటలో చెప్పాలంటే ‘మా అమ్మ ఉక్కుమహిళ’ అంటోంది నికిత ఉద్వేగంగా. ఇటీవల ఆమె తల్లి గొప్పతనం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. బాధ్యతల బరువు ‘‘మా అమ్మ పదహారేళ్లకే తల్లిలేని పిల్లయింది. మా అమ్మమ్మ కేన్సర్‌తో పోయింది. ఆమె పోవడంతో ఆ ఇంటిని ఓ కుదుపు కుదిపేసినట్లయింది. మా అమ్మకు వచ్చిన కష్టం తల్లిని కోల్పోవడం ఒక్కటే కాదు. వాళ్ల నాన్న ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ క్షణం నుంచి ఆ ఇంటి బరువును మోయాల్సిన బాధ్యత ఆమె మీద పడింది. తమ్ముళ్లకు, చెల్లికి తల్లి అయింది. కాలేజీకి పోతూ సాయంత్రాలు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసింది. ఆ వంద రూపాయలే ఇంటి సరుకులకు ఆధారం. డిగ్రీ పూర్తి కాగానే డైమండ్ వ్యాపార దుకాణంలో ఉద్యోగంలో చేరి చిన్న పిల్లలను చదివించే బాధ్యత తలకెత్తుకుంది. చెల్లికి పెళ్లి చేసింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంది. కష్టాలకు ఎదురీత ‘‘నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం ఒక ఒడ్డుకు చేరిందనే అనుకుంది అమ్మ. నిండా ఐదేళ్లు గడిచాయో లేదో 1999లో ఓ ప్రమాదం. అమ్మ జీవితంలో అది ఒక హఠాత్పరిణామం. నాన్న పోవడం ఆమెను మరింతగా రాయిలా మార్చేసింది. కష్టాలకు ఎదురీదడానికి తనను తాను మరింత దృఢంగా మార్చుకుంది. తన జీవితానికి అన్నీ తానే, తనకు ఆసరాగా ఎవరూ లేరనే వాస్తవం ఆమెలో నిర్వేదాన్ని నింపలేదు. నాకు అమ్మానాన్న తానే అయి తీరాలనే నిజం ఆమెను నడిపించింది. నాన్న పోయిన ఆరేళ్లకు మేము సొంత ఫ్లాట్‌కు మారాం. బ్యాంకు లోన్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ వంటి క్లిష్టమైన పనులన్నీ సొంతంగా చేసుకుంది. వర్కింగ్ ఉమన్, ఇండిపెండెంట్ ఉమన్ ఎలా ఉంటే సొసైటీలో మనగలదో ఆమెను చూసి నేర్చుకోవాలి. నమ్మకమే.. శక్తి ‘‘నాకు ఊహ తెలిసిన తరవాత ఇన్నేళ్లలో అమ్మ పని నుంచి సెలవు తీసుకున్నది పది రోజులే. తనకు ఎదురైన ప్రతి సవాల్‌కూ సమాధానం వెతుక్కుంటూ సాగిపోయేది అమ్మ. నాకు ఎందులోనూ తక్కువ చేయకుండా, నన్ను ఎప్పుడూ ఫస్ట్‌గా ఉంచడానికే ప్రయత్నిస్తుండేది. అలాగని నన్ను మరీ గారాం చేస్తూ ఏమీ పెంచలేదు. చాలా స్ట్రిక్టుగా ఉండేది. కొంచెం ఓల్డ్ స్కూల్ పెంపకం మా అమ్మది. నాకు మంచి ఫ్రెండ్ కూడా అమ్మే. ‘నీకింత ధైర్యం, శక్తి ఎక్కడ నుంచి వస్తాయి? అని అడిగితే, ‘ఈ విశ్వంలో ప్రతి దానిని నడిపించేది దేవుడు. ఆ దేవుడే నన్ను కూడా నడిపిస్తున్నాడు. ఆ నమ్మకమే నా శక్తి’ అంటుంది. నేను అమ్మలో సగం అయినా కాగలనా అనిపిస్తుంటుంది. నేను చూసిన రియల్ హీరో ఆమె. నేను ఈ రోజు సగర్వంగా నిలబడగలిగానంటే అమ్మ వల్లనే’’ అని చెప్పింది నికిత. ఈ పోస్ట్‌కి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే... నికితా శెట్టి తన కథనంలో ఆద్యంతం ‘మా అమ్మ మాఅమ్మ’ అంటూనే చెప్పింది తప్ప అమ్మ పేరు చెప్పనేలేదు. పిల్లలకు తల్లికి ఒక పేరు ఉంటుందని గుర్తుండదు. తనకు జన్మనిచ్చిన ఆ మూర్తి పేరు.. అమ్మ. అంతే. – మంజీర -
అందరు ఉన్నా..తాగేందుకు నీళ్లు పోయలేదు...
శాలిగౌరారం (తుంగతుర్తి) : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కొడుకులు..తొలిదైవంగా భావిస్తారు. ఆ తల్లిని..ఈలోకం విడిచే వరకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన వారు కనీస మానవ విలువలను మరిచి తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండికూడా పెట్టకుండా మాడుస్తూ ఇంటినుండి బయటకు తరిమేశారు. ఈ హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మాధారంకలాన్ గ్రామానికి చెందిన తీగల యాదమ్మ(80)కు ప్రస్తుతం వివాహితులైన ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. యాదమ్మ భర్త వెంకయ్య 15 సంవత్సరాల క్రితమే మృతిచెందాడు. దీంతో యాదమ్మ తన ఇద్దరు కొడుకుల వద్దనే ఉంటూ జీవించింది. అన్నదమ్ముల మధ్య తల్లి పోషణ విషయంలో తగాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యాదమ్మకు రెండవ కుమారుడి ఇంటిఆవరణలో ప్రత్యేకంగా ఒక రేకులగదిని నిర్మించారు. కానీ కోతుల వీరంగాలతో ఆ గది రేకులు మొత్తం ధ్వంసమయ్యాయి. ఇదిలాఉండగా పెద్దకుమారుడు కుటుంబీకులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండవ కుమారుడు మాత్రం గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లికి నిర్మించిన గదికి తిరిగి పైకప్పు వేసేందుకు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడంతో పట్టించుకోలేదు. ఆమె పైకప్పులేని ఇంట్లో ఉండలేక పలుమార్లు గ్రామపెద్దలను, చివరకు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. గ్రామపెద్దల మాటలను కూడా తన కుమారులు పట్టించుకోకపోవడంతో మూడేళ్ల క్రితం ఇళ్లు వదిలి వెళ్లింది. అప్పటినుంచి రెండు సంవత్సరాలు నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు దేవాలయం వద్ద ఉంటూ యాచకవృత్తిపై ఆధారపడి జీవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అక్కడివారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న యాదమ్మ కుమార్తెలు తమవద్దనే ఉండేందుకు రమ్మని తల్లిని కోరారు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఐదు నెలల క్రితం యాదమ్మ నకిరేకల్ వచ్చి అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకొని ఆసరా పింఛన్ సాయంతో జీవించింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా మర్రూరుకు చెందిన ఆమె రెండవ కుమార్తె తన ఇంటికి తీసుకెళ్లి సాకుతోంది. విషయం తెలుసుకున్న యాదమ్మ పెద్ద కుమారుడు దశరథ తన చెల్లెలుకు పలుమార్లు ఫోన్‌చేసి దుర్భాషలాడాడు. దీంతో యాదమ్మ ముగ్గురు కుమార్తెలు శుక్రవారం తమ తల్లిని తీసుకొని మాధారంకలాన్ వచ్చారు. తల్లిని అన్నల ఇంట్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా వారు తమ ఇంట్లోకి తీసుకురావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో వారు చేసేదేమీలేక పెద్దకుమారుడు దశరథ ఇంటిముందు ఉన్న కానుగుచెట్టకింద తల్లిని వదిలి వెళ్లిపోయారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికి పరిమితమైన ఆ వృద్ధతల్లి శుక్రవారం నుంచి వీధిలోని చెట్టుకిందనే జీవచ్ఛవంలా పడిఉంది. చుట్టుపక్కలవారు వృద్ధురాలు పడే నరకయాతనను చూడలేక మంచీళ్లు ఇవ్వడంతోపాటు బుక్కెడన్నం పెట్టి ప్రాణం కాపాడారు. కానీ ఆమె కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాల్లు అటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం శోచనీయం. -
అమ్మ.. ఓ సేవా శిఖరం
నగరంలోని నల్లపాడు రోడ్డులో మూడంతస్తుల భవనం..అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నడుపుతున్న ఓ ఆశ్రమం. ఇక్కడ ఒక్కో అంతస్తు ఎక్కే కొద్దీ సమాజంలో పాతాళానికి చేరిన మానవత్వపు ఛాయలు అమృతమంటి ఊటలా ఉబికివస్తుంటాయి. ఆరు పదులు దాటిన వయసులో నా అనే వాళ్లు విసిరేసిన బతుకులు అమ్మ ప్రేమలో ఆదరువు పొందుతుంటాయి. విధి రాతకు వాడిన పసిమొగ్గలు విద్యా కుసుమాలై వికసిస్తుంటాయి. అనాథ శవాల ఆత్మఘోషలు అనంతలోకాల నుంచి ట్రస్ట్‌ను ఆశీర్వదిస్తూ ఉంటాయి. ఈ ఆశ్రమంలోనే ఓ మూలన నిరాడంబర రూపం, నిర్మలమైన మనసుతో ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న మౌనమునిగా సమాజ జీవచ్ఛవానికి సేవ అనే ఊపిరిపోస్తూ ఉంటారు. గుంటూరు(పట్నంబజారు): ఎక్కడో విశాఖ నుంచి భార్యాబిడ్డలతో గుంటూరు వచ్చిన 24 ఏళ్ల చంద్రశేఖర్ ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక రోజు అనాథ మృతదేహాం రోడ్డుపై పడి ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు.. మనసు వికలమైపోయింది..వెంటనే ఆ శవాన్ని భుజాన వేసుకుని వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశాడు. ఇది జరిగి సరిగ్గా 28 ఏళ్లు. అప్పుడే అనుకున్నాడు ఏ ఒక్క శవం అనాథగా మిగిలిపోకూడదని. అంతే అమ్మ చారిటీబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో జ్ఞానప్రసన్నగా మారారు. దాతల సహకారంతో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 35 వేలకుపైగా అనాథ శవాలకు పెద్ద కొడుకయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమనుషులం కదా>్పటు చేసి స్వయంగా అనాథ శవాలను తానే తీసుకొస్తారు. అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కాశీ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో మృతదేహాన్ని శుభ్రపరుస్తారు. చితాభస్మాన్ని కాశీలో కలుపుతారు. అనాథ శవాలే కాదు..అద్దె ఇళ్లలో వారైనా.. అద్దె నివాసాల్లో శవాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోరు. ఇలాంటి వారి కోసం ఒక భవంతి ఏర్పాటు చేశారు. ఉచితంగా వారికి మృతదేహాన్ని భధ్రపరిచే బాక్సులను ఇస్తారు. 11 రోజులపాటు జరిగే కార్యక్రమాలు అక్కడే నిర్వహించి సంబంధిత ఖర్చులు ఆయనే భరిస్తారు. నిత్యం నగరంలోని ఒక ఆలయంలో పేదలకు అన్నదానం చేయటంతో పాటు, ట్రస్ట్ ఆటోల్లో రైల్వేస్టేషన్, జీజీహెచ్, అరండల్ ఓవర్ బ్రిడ్జి, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో 500 మందికిపైగానే అనార్తుల ఆకలి తీరుస్తున్నారు. అమ్మలకు...అమ్మై.. ఆరుపదులు దాటిన పండుటాకులు.. ఉన్న వారు ఉండి పట్టించుకోని అభాగ్యులు కొంత మంది..ఏ దిక్కు లేకుండా దీనస్థితిలో ఉన్న వారు మరికొందరు. ఒక్కొక్కరిదీ..ఒక్కో గాధ. వీరందరికీ అమ్మ ట్రస్ట్ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆశ్రమం ద్వారా 15 మంది అనాథలను అక్కున చేర్చుకుంది. చిన్నారులకు పెద్దదిక్కులా... విధి చిన్నచూపు చూసి కొంత మంది అనాథలైతే..పేదరికంలో మగ్గుతున్న మరి కొందరు చిన్నారులు.. వీరందికీ అమ్మ ట్రస్ట్ ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రస్తుతం 30 మంది వరకు చిన్నారుల ట్రస్ట్ భవనంలో ఉంటూ కాన్వెంట్ చదువులకు వెళుతున్నారు. మనుషులం కదా మనుషులం కదా అందరికీ సేవ చేయాలి. ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలి. అనాథ రోడ్డుపై పడి ఉంటే మా ఆశ్రమం మనసు అంగీకరించదు. అందుకే ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుంటాం. అనాథ శవాలను ఆశ్రమంలోని వారు అన్నదమ్ముల్లా సాగనంపుతాం. ఆశ్రమ ఆస్తులన్నీ ట్రస్ట్ పేరుతోనే ఉంటాయి. అనాథలైన..అనాథ మృతదేహాలైనా ఉంటే 9848792228, 8341314440 నంబర్లకు ఫోన్ చేయండి.: స్వామి జ్ఞానప్రసన్న, ఆశ్రమ నిర్వాహకులు -
అమ్మా.. నే చదువుకుంటా!
► భిక్షాటన చేయనన్న బాలిక ► చిత్రహింసలు పెట్టిన మారు తల్లి ► పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు అమ్మా... అందరి పిల్లల్లా నేనూ చదువుకుంటా.. ఆనక ఉద్యోగం చేసి నిన్నూ సాకుతా.. అన్నీ బానేవుండీ అడుక్కోవాలంటే సిగ్గుతో చచ్చిపోతున్నా.. రోడ్డున పోయేవారు ఇదేం బతుకని ముఖంమీదే తిడుతుంటే... సిగ్నళ్ల దగ్గర పోకిరోళ్లు అదోలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నా.. నేనీ బిచ్చమెత్తలేను.. నన్నొదిలెయ్... తల్లి గాని తల్లి వద్ద పదిహేనేళ్ల బాలిక ఆక్రందన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆ తల్లి మనసు కరగలేదు. మాట విననందుకు... తన ఆదేశాలు ధిక్కరించినందుకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టిందా మారు తల్లి. కర్రతో గొడ్డును బాదినట్టు బాది... చేతిపై వాతలు పెట్టి... ప్రత్యక్ష నరకం చూపింది. ఈ బాధలు తట్టుకోలేక బాలిక సోమవారం పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగలక్ష్మి (15) మూడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులిద్దరూ చిన్నప్పుడే చనిపోవడంతో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను పెంచుకుం టానంటూ ఏడేళ్ల క్రితం బాలికను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో భిక్షాటనకు పెట్టింది. రోజూ రూ.250 తీసుకురాకపోతే వాతలు పెట్టేది. అర్ధరాత్రి అయినా.. వానొచ్చినా.. టార్గెట్ పూర్తి చేయనిదే ఇంటికి రావడానికి వీల్లేదని హెచ్చరించింది. జ్వరం వచ్చినా... ఆరోగ్యం బాగా లేకున్నా.. ఆ దీన స్థితి చూసి మరిన్ని డబ్బులు జోలెలో పడతాయంటూ చౌరస్తాలో కూర్చోబెట్టేది. అయితే వయసు పెరుగుతుండటంతో నాగలక్ష్మికి భిక్షాటన నామోషీగా అనిపించింది. రోజూ చౌరస్తాలో తాను పడుతున్న బాధలు, ఇబ్బందులను తల్లికి చెప్పింది. ఇకపై ఆ పని చేయలేనని, చదువుకుంటానని వేడుకుంది. ఇంట్లో కూర్చున్నందుకు తల్లి రోజూ ఒంటిపై వాతలు పెట్టి, చితకబాది హింసించడం మొదలుపెట్టింది. ఇవి భరించలేక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తానా ఇంటికి పోనని, ఏదైనా ఆశ్రమంలో చేర్పించి, ఈ పాడు జీవితం నుంచి విముక్తి కల్పించాలని పోలీసులను ప్రాథేయపడింది. పునరావాస కేంద్రానికి తరలింపు: స్పందించిన పోలీసులు మారు తల్లిని స్టేషన్‌కు రప్పించారు. నాగలక్ష్మి తన బిడ్డేనని ఆమె వాదించింది. అందుకు ఆధారాలు చూపాలని పోలీసులు కోరగా... నీళ్లు నమిలింది. తనలాగే మరికొందరిని జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు చౌరస్తాల్లో నియమించిందని, సాయంత్రం కాగానే డబ్బులు వసూలు చేసుకొని వెళ్తుందని నాగలక్ష్మి పోలీసులకు తెలిపింది. నాగలక్ష్మిని పోలీసులు నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. -
లక్ష్యం ఒకటే..ఉత్తర్వులు వేరు
- ఏప్రిల్ 15–22 వరకు ‘అమ్మ ఒడి’ నిర్వహణ - 24 నుంచి మే 10 వరకు ‘మన ఊరు మన బడి’ - 23 నుంచి వేసవి సెలవులు ప్రకటన ... అంతలోనే ఈ ఉత్తర్వు - ఎస్.ఎస్.ఏ.కు ... విద్యాశాఖకు కొరవడిన సమన్వయం - తలలు పట్టుకుంటున్న క్షేత్రస్థాయి అధికారులు రాయవరం: లక్ష్యం ఒక్కటే ... ఉత్తర్వులు వేర్వేరుగా రావడంతో విద్యాశాఖ అయోమయానికి గురవుతోంది. మొన్నటి వరకు విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు విద్యాశాఖ ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. రెండు కార్యక్రమాల లక్ష్యం బడి ఈడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే. ఒకే కార్యక్రమం నిర్వహణ కోసం విద్యాశాఖ, ఎస్.ఎస్.ఏ. వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడంపై రెండు శాఖల మధ్య ఉన్న సమన్వయలోపం బట్టబయలైంది. గందరగోళంలో ఉపాధ్యాయులు.. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు ‘అమ్మ ఒడి’ కార్యక్రమం పేరుతో బడిఈడు చిన్నారులను బడిలో చేర్చుకునే కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్టు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు నిర్వహించారు. ఆయా పాఠశాలల పరిధిలో ఐదేళ్లు పైబడిన విద్యార్థులను ఒకటో తరగతిలో చేర్చుకునే చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాల పరిధిలో ర్యాలీలు నిర్వహించి, తల్లిదండ్రులతో అవగాహనా సమావేశాలు ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ‘అమ్మ ఒడి’ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లాలో 30,240 మందిని ఒకటో తరగతిలో చేర్పించారు. .మే 10వరకు ‘మన ఊరు మన బడి’ ‘అమ్మ ఒడి’ పేరుతో ఎస్ఎస్ఏ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు తిరిగి ‘మన ఊరు మన బడి’ పేరుతో చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పించాలని, 5వ తరగతి పూర్తయిన వారికి 6వ తరగతిలో చేర్పించాలని, 7వ తరగతి పూర్తయిన వారిని 8వ తరగతిలో చేర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న కార్యక్రమాలు గత వారం రోజులుగా ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు ఒకటే కావడం గమనార్హం. పైగా ప్రస్తుత వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలి. ఒకే ఆశయంతో విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క విద్యాశాఖా మంత్రి ఈ నెల 23 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించగా... అధికారులు సెలవుల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రకటించడం విశేషం. నవ్వులపాలవుతున్నాం... ఒకే కార్యక్రమాన్ని రెండుసార్లు నిర్వహించడం హాస్యాస్పదం. విద్యాశాఖలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయలేమిని బయటపెడుతోంది. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయు. ఇదేమి ఉత్తర్వులు... ఒకే కార్యక్రమంపై విద్యాశాఖ, ఎస్ఎస్ఏ వేర్వేరుగా ఉత్తర్వులు ఇవ్వడం సమన్వయలోపాన్ని బట్టబయలు చేస్తోంది. విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఉపాధ్యాయుల మధ్య గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నారు. ఎస్సీఈఆర్టీ, ఎస్ఎస్ఏ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మధ్య సమన్వయం కొరవడింది. – టి.కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్. -
ఉద్యమస్థాయిలో కృషి చేద్దాం
–ప్రభుత్వ బడుల్లో చిన్నారుల చేరికలు పెంచుదాం –సర్వ శిక్షాభియాన్ పీవో శేషగిరి భానుగుడి(కాకినాడ సిటీ) : ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప«థకాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరిచేందుకు ఉద్యమస్థాయిలో పనిచేయాలని సర్వశిక్షాభియాన్ పీవో మేకా శేషగిరి కోరారు. ‘ప్రభుత్వ బడి–అమ్మ ఒడి, పదితర్వాత పెళ్ళి కాదు 11’ కార్యక్రమాలపై సర్వశిక్షాభియాన్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, బడిబయట పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా ఐక్యంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిబ్బందికి, ఐఈఆర్టీలకు సూచించారు. ఇన్చార్జి డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు చాలా మెరుగుపడ్డాయని, వసతులు, విద్యాభివృధ్ధి పథకాలలో ప్రైవేటు పాఠశాలలకు అందనంత స్థాయిలో ప్రభుత్వపాఠశాలలు ఉన్నాయని చెప్పారు. తల్లిదడ్రులు అవగాహనారాహిత్యంతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల ఉచ్చులో పడుతున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ విద్యను పూర్తిచేసుకున్న చిన్నారులకు వర్సిటీ స్నాతకోత్సవం రీతిలో పట్టాలు ప్రదానం చేశారు. డీఈవో కార్యాలయం నుంచి బాలాజీచెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ శారదాదేవి, వివిధ మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఐఈఆర్టీలు, అంగన్వాడీలు, సర్వశిక్షాభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. -
పథకాలకు అమ్మ పేర్లు తీసేయండి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా దోషేనని తేలినందువల్ల ప్రభుత్వ పథకాల్లో ఆమె పేరును తీసేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ డిమాండ్ చేశారు. తమిళనాట ప్రభుత్వ పథకాలు అన్నింటికీ ముందు 'అమ్మ' పేరు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పళనిస్వామి తన టేబుల్ మీద జయలలిత ఫొటో పెట్టుకుని, ఆమెకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతే సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారని, జయలలిత చూపిన మార్గంలో ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారని గుర్తుచేశారు. మహిళలకు రాయితీపై టూ వీలర్లు ఇచ్చే పథకానికి అమ్మ టూ వీలర్ స్కీం అని పేరుపెట్టారని, అది తగదని.. ప్రభుత్వం రాజ్యాంగపరంగా నడుచుకోవాలని రాందాస్ చెప్పారు. కావాలనుకుంటే పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు జయలలితకు నివాళులు అర్పించుకోవచ్చు గానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కాదని ఆయన చెప్పారు. అమ్మ మంచినీళ్లు, అమ్మ ఫార్మసీ, అమ్మ విత్తనాలు, అమ్మ సిమెంట్, అమ్మ స్పెషల్ క్యాంప్, అమ్మ రుణపథకాలు, అమ్మ థియేటర్లు, అమ్మ మెటర్నిటీ సంజీవి పథకం... ఇలాంటి పథకాలన్నింటికీ ప్రభుత్వ పథకాలుగా పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని రాజ్యాంగ ప్రకారం నడపాల్సిందిగా ముఖ్యమంత్రికి గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించాలని రాందాస్ కోరారు. -
అమ్మ ఛాయిస్ ఐశ్వర్యే!
అమ్మ.. చిన్నమ్మ... ఇప్పుడు తమిళనాట ఎక్కడ చూసినా ఈ ఇద్దరు అమ్మల గురించే. ఆ మాటకొస్తే పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ ఇద్దరు అమ్మల గురించి మాట్లాడుకుంటున్నారు. అమ్మ (జయలలిత) చనిపోయాక సీన్లోకి చిన్నమ్మ (శశికళ) రావడం, రాజకీయంగా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. ఆ సంగతలా ఉంచితే... అమ్మ జీవితం ఆధారంగా సినిమా చేయాలని కొంతమంది దర్శక–నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి చర్చల గురించి ఎలా ఉన్నా, బతికున్న రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకవేళ తన జీవితం ఆధారంగా సినిమా చేస్తే, అందులో ఐశ్వర్యారాయ్ నటిస్తే బాగుంటుందని స్వయంగా అమ్మే చెప్పారు. ‘‘నేను యవ్వనంలో ఉన్నప్పటి పాత్రకు ఐశ్వర్యారాయ్ చక్కగా సూటవుతారు. ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కూడా నటించడం పెద్ద కష్టమేమీ కాదు. నటిగా ఐశ్వర్యకు అపారమైన ప్రతిభ ఉంది’’ అని ఆ ఇంటర్వ్యూలో జయలలిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా మణిరత్నం తీసిన ‘ఇద్దరు’లో జయలలితను గుర్తుచేసే పాత్రలో ఐశ్వర్య నటించిన విషయం గుర్తుకు రాక మానదు. ఇప్పుడు అమ్మ జీవితకథతో ఎవరైనా సంప్రదిస్తే ఆమె ఏమంటారో! వెయిట్ అండ్ సీ! ఇదిలా ఉంటే... ఆల్రెడీ కన్నడ హీరోయిన్ రాగిణీ ద్వివేది హీరోయిన్గా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో దర్శకుడు ఫైజల్సైఫ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. -
అమ్మ ఒళ్ళోతలపెట్టి పడుకోవాలనుంది!
అమ్మలో సృష్టికారకత్వమైన బ్రహ్మతత్త్వమే కాదు, స్థితి కారకత్త్వమైన విష్ణుతత్త్వం కూడా ఉందని చెప్పుకుంటున్నాం. రక్షకత్వం అమ్మ నరనరానా జీర్ణించుకుని ఉంటుంది. ఇది చంటితనంలో పాలివ్వడంలోనే కాదు, బిడ్డకు ఎన్నేళ్ళ వయసొచ్చినా, పుట్టిన కొడుకు కృతఘ్నుడే అయినా వాడు నూరేళ్ళు బతకాలని అమ్మ కోరుకుంటుంది. నోములు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు అన్నీ బిడ్డ క్షేమం కోరే చేస్తుంది. ఆమెకు ఎంత వయసొచ్చినా ఇది అమ్మ లక్షణం.. అమ్మ స్థితికారకత్వం. శరీరం విడిచిపెట్టిన తరువాత అంత్యేష్ఠి సంస్కారం మంత్రవైభవంతో చెప్తారు. జీవుడు శరీరాన్ని వదలి వెళ్ళే దశల్లో చివరన వ్యానవాయువనేది జీవుడిని, శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అలా పట్టుకుని ఉన్నప్పుడు – కన్నబిడ్డలనే కాదు, జ్ఞాతులందరినీ అపేక్షిస్తుంది. అందుకే జ్ఞాతులు 11 రోజులు మైలపడతారు. వారి సంక్షేమంకోసం కొడుకు 11వ రోజున శ్మశానంలోనే ఆనంద హోమం చేస్తాడు. ఆ సమయంలో కొడుకు వెళ్ళి శవరూపంలో ఉన్న అమ్మతో ఒకమాట చెప్తాడు. ‘‘పిచ్చితల్లీ ! శరీరం జర్జరీభూతమయి పోయింది. ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటావు మా మీద వ్యామోహం! అమ్మా! మేం సంతోషంగా ఉన్నాం. వదిలిపెట్టేయ్ శరీరాన్ని. వెళ్ళిపో. పోయి మంచి శరీరాన్ని పొంది రా. మళ్ళీ లోకంలో పుణ్యకర్మలు చేసుకో. వదిలిపెట్టెయ్’’ అని కొడుకు చెప్పిన మంత్రానికి వదిలేస్తుంది శరీరాన్ని. అప్పటివరకు వదలదు. శిథిలమయిపోయిన భవనం మీద తన యాజమాన్య హక్కు పెట్టుకున్నట్లు జీవుడు (తండ్రికానీ, తల్లికానీ) శరీరాన్ని పట్టుకుని ఉంటాడు. కొడుకు చెప్పిన మంత్రంతో వదిలేస్తాడు. అదీ వాళ్ళిద్దరి అనుబంధం. అమ్మ కడుపులో నుంచి బయటికి రావడంతో నాభీబంధం (బొడ్డు) తెగిపోవచ్చు. కానీ హృదయ సంబంధం మాత్రం తెగదు. కొడుకు ధార్మికుడైతే ఆ హృదయ సంబంధం ఉన్నందుకు ఎక్కడ ఉన్న పితృదేవతలనైనా ఉద్ధరించగలడు. ఇక్కడ గయా శ్రాద్ధం పెట్టి ఎవరినైనా ఉద్ధరించగలడు. అటువంటి కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి అమ్మ అంటే రక్షకత్వం. శిశువు జన్మించిన నాటినుండి నాలుగు లేదా ఆరు నెలల వరకూ శిశువు శరీరానికి కావలసిన సమస్త పోషకవిలువలున్న పాలు పరమ పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తయరయ్యేది ఒక్క అమ్మలోనే – అని డాక్టర్లు చెబుతుంటారు. నేను చెబుతున్నది సనాతన ధర్మశాస్త్రాలలోది కాదు, సనాతనం కేవలం ‘మాతృదేవోభవ’ అన్నది. పుస్తకాల్లో డాక్టర్లు రాసిన మాట మీతో మనవి చేసుకుంటున్నా. అమ్మ అన్నం తిన్నందుకు అమ్మలో పాలు ఊరవు. బిడ్డ చప్పరిస్తే వాడి ఆకలి తీరలేదన్న భావనచేత ఊరతాయట. వాడి కడుపు నిండుతుంటే అమ్మకు ఆరోగ్యం కలుగుతుందని రాశారు. అంత గొప్ప స్వరూపం అమ్మలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టే అమ్మ విష్ణువు. అమ్మను మించిన రక్షకుడు లోకంలో ఉండరు. అందువల్ల ‘‘మా అమ్మగారా... నా వద్దే ఉంటున్నారండీ’’ అనకు. అది చాలా తప్పు మాట. ‘‘నా అదృష్టమండీ, నాకిన్నేళ్ళు వచ్చినా అమ్మ చేతి అన్నం తింటున్నాను’’ అని అనాలి. అంతే తప్ప ‘అమ్మకు నేను అన్నం పెడుతున్నా’ననడం కృతఘ్నత. సృష్టికారకుడైన బ్రహ్మ, స్థితికారకుడైన విష్ణువులే కాదు, లయ కారకుడైన రుద్రుడి అంశ కూడా అమ్మలో ఉంది. ఆమెలో ఉన్నది శివశక్తి. చాలా మంది రుద్రుడు అనగానే ఆయన చంపేస్తాడనుకుంటారు. అలా అర్థం చేసుకోకూడదు. అలా అయితే శివార్చనలు ఎందుకుంటాయి లోకంలో? అలా ఉండదు. లయ కారకుడైన రుద్రుడు మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు. ఒకటి – నిత్య ప్రళయం. రోజూ చేసేది నిత్య ప్రళయం. మనకు పరమేశ్వరుడు జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. వీటిని విచ్చలవిడిగా వాడేసారనుకోండి. అవి అలసిపోతాయి. వాటికి మళ్ళీ శక్తి కావాలి. మనం పడుకున్నప్పుడు రుద్రుడు మనకు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి, మనం ఆ సుఖం అనుభవిస్తుండగా ఇంద్రియాలన్నింటికీ పటుత్వమిస్తాడు. అంటే అవి కోల్పోయిన శక్తిని మళ్ళీ ఇస్తాడు. దీనిని నిత్య ప్రళయమంటారు. రెండవది – ఆత్యంతిక ప్రళయం, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమిస్తాడు. మూడవది – మహా ప్రళయం. అంటే జీవుడు తనను పొందలేకపోతే యుగాంతంలో తానే జీవుడిని పొందేస్తాడు. మైనపు ముద్ద నల్లపూసల మీద పడ్డట్లు తనని పొందలేకపోయిన జీవులను మహా ప్రళయంతో పరమాత్మ తానే పొందేస్తాడు. ఇవి మూడూ చేస్తాడు. అందుకే ఆయన శివుడయ్యాడు. అమ్మలో శివాంశ ఉంటుంది. ఎలా అంటే... అమ్మ చేసే చాలా గొప్ప పని నిద్రపుచ్చడం. అమ్మదగ్గర పిల్లలు పడుకున్నంత తేలిగ్గా మరెక్కడా పడుకోరు. పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నా, అమ్మ ఒక్కసారెత్తుకుని ఇలా జోకొడితే చాలు... అమ్మ స్పర్శతగలగానే... నిద్రలోకి జారుకుంటారు. అమ్మ నోటిమాటవింటే చాలు.. నిద్రపోతారు. అమ్మ నిద్రాకాలిక సుఖాన్నిస్తుంది. అమ్మ ఒడిలో నిద్రపోవాలన్న కోరికకు కృష్ణ పరమాత్మ అంతటివాడు పరవశించిపోయాడు. అమ్మంటే తెలియని పరమాత్మ... అమ్మ ఒడిచేరేటప్పటికి నిద్రపోయాడు. ఇక మనమెంతటి వాళ్ళం! అమ్మ ఒడికి సమానమైనది లేదు. అది శివపర్యంకం. అమ్మ శివస్వరూపమై ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంది. నిత్య ప్రళయం చేస్తుంది. ఇది అమ్మలోని రుద్రాంశ. -
అమ్మ జీవితంపై పోటా పోటీగా చిత్రాలు
-
దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని ప్రకటించిన దాసరి, తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. దాసరి అనారోగ్య సమస్యలతో పాటు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన వడ్డీకాసులవాడు సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు ప్రాజెక్ట్‌లను పక్కకు పెట్టేసిన దాసరి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు. తాజాగా అమ్మ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాసరి స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం
సాక్షి, చెన్నై : తమిళనాడులో అమ్మ డీఎంకే అనే కొత్త పార్టీ ఆవిర్భవించింది. ద్రావిడ ఇయక్కంలో ఒకప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్ కుమారుడు ఇనియన్ సంపత్ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అన్నాడీఎంకేను ఆంగ్లంలో జాతీయ స్థాయిలో ఏఐడీఎంకే, రాష్ట్రంలో ఏడీఎంకే అని పిలుస్తుంటారు. ఈ పిలుపులో గందరగోళాన్ని సృష్టించే విధంగా మరో ఏడీఎంకే ఆవిర్భవించింది. అమ్మ సేనల్ని ఆకర్షించే విధంగా, అన్నాడీఎంకేలో గందరగోళాన్ని రేకెత్తించే విధంగా అమ్మ డీఎంకే (ఏడీఎంకే)ను చెన్నైలో ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే జెండాను పోలిన జెండాను తన ఇంటిపై ఎగుర వేశారు. అన్నాడీఎంకే జెండాలో రెండాకుల చిహ్నం ఉండగా, అమ్మ డీఎంకే జెండాలో జయలలిత విక్టరీ సంకేతంతో చిహ్నాన్ని పొందుపరిచారు. -
త్వరలో అమ్మా అన్నాడీఎంకే!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మరో ద్రవిడ పార్టీ పురుడు పోసుకోనుంది. అన్నాడీఎంకే పగ్గాలను శశికళకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ’అమ్మా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ పేరున పార్టీ ఆవిర్భవించనున్నట్లు సమాచారం. ఈ పార్టీకి ఓ సీనియర్ మంత్రి తెరవెనుక ఉండి సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. పోయస్గార్డెన్ను ఖాళీ చేయనున్న శశికళ.. పార్టీలో తనకు అనుకూలమైన వాతావరణం పెరిగి పగ్గాలు చేతికి రావాలంటే పోయస్‌గార్డెన్ ఇంటిని ఖాళీ చేయడం మంచిదని శశికళ భావిస్తున్నారు. ‘ఈ బంగ్లాను స్మారక మండపంగా మార్చేందుకు నేను సిద్ధం. అందుకే ఖాళీ చేయబోతున్నా. జయ మేనకోడలు దీపకు చెందిన ఆస్తులేమైనా ఉంటే అప్పగిస్తా’ అని సన్నిహితులతో శశికళ అన్నట్లు సమాచారం. మరోపక్క అన్నాడీఎంకేను ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ మొదట్నుంచీ విభేధిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ మంగళవారం పోయస్‌గార్డెన్ వెళ్లి శశికళతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. -
అమ్మ మరణంతో మరోసారి రీ షూట్
కన్నడ నటి రాగిణీ ద్వివేది ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం అమ్మ. ఈ సినిమా జయలలిత జీవితకథ ఆదారంగా తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని అంగీకరించకపోయినా.. లీడ్ యాక్ట్రస్ రాగిణీ మాత్రం ఇది అమ్మ జీవిత చరిత్రే.. తను అమ్మ పాత్రలోనే నటిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటోంది. కన్నడ వివాదాస్పద దర్శకుడు ఫైసల్ సైఫ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయ మరణం తరువాత రీ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. గతంలోనూ జయ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సమయంలో అమ్మ సినిమాను రీషూట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆమె మరణం తరువాత రీషూట్‌కు వెళుతుండటంతో ఇది నిజంగానే జయలలిత బయోపిక్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. తన్వీ ఫిలింస్ బ్యానర్‌పై సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మళయాల, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాండల్‌వుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న రాగిణీ.., అమ్మ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మరిన్ని వివాదాలకు తెర తీసే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. -
బల్గేరియా నుంచి హుటాహుటిన వచ్చిన అజిత్
-
బల్గేరియా నుంచి హుటాహుటిన వచ్చిన అజిత్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారన్న వార్త తెలియగానే ప్రముఖ హీరో అజిత్ బల్గేరియా నుంచి చెన్నైకి హుటాహుటిన వచ్చారు. జయలలిత గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించిన సమయంలో ఆయన బల్గేరియాలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ వార్త తెలియడంతో వెంటనే షూటింగ్ రద్దుచేసుకొని అజిత్ మంగళవారం అర్ధారాత్రికి చెన్నై చేరుకున్నారు. అప్పటికే మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీంతో చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన అజిత్ ఆమెకు కన్నీటి నివాళులర్పించారు. అర్ధరాత్రి సమయంలో భార్య షాలినీతో కలిసి అజిత్ అమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తన తాజా చిత్రం షూటింగ్లో భాగంగా అజిత్ బల్గేరియాలో చిక్కుకుపోయాడని, అందుకే అమ్మ అంత్యక్రియలలోపు ఆయన రాలేకపోయారని, దీంతో విమానాశ్రయం నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి అజిత్ శ్రద్ధాంజలి ఘటించారని సన్నిహితులు తెలిపారు. జయలలిత-హీరో అజిత్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అజిత్‌ను జయలలిత తన కొడుకుగా భావిస్తారని చెప్తారు. ఈ నేపథ్యంలో జయలలిత వారసుడిగా అన్నాడీఎంకేలో అజిత్ చేరే అవకాశముందని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావొచ్చునని అంటున్నారు. ఒక తరుణంలో జయలలిత వారసుడిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అజిత్ చేపట్టవచ్చునని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
జయ అంత్యక్రియలకు వైఎస్సార్సీపీ నేతలు
హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ అమ్మ అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం చెన్నైకు బయలు దేరి వెళ్లారు. జయలలితకు వైఎస్సార్సీపీ తరఫున నేతలు ఘనంగా నివాళులర్పించనున్నారు. -
ఇక ‘అమ్మ’ కల్యాణ మండపాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే అమ్మ బ్రాండ్లతో తరిస్తున్న ఆ రాష్ట్ర ప్రజలకు పురచ్చి తలైవీ శనివారం మరో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. తమిళనాడు ప్రజలకు ఇక అమ్మ కల్యాణ మండపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగానే రూ.83కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో ఈ కల్యాణ మండపాలను ప్రభుత్వం నిర్మించనుంది. కల్యాణ మండపాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు జయలలిత తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు,సహకార సంఘాలు ఆధ్వర్యంలో మండపాల నిర్మాణం చేపట్టనుంది. వరుడు,వధువులతో పాటు అతిథి గదులు, భోజనశాల, వంటగది ఉండే ఈ కల్యాణ మండపాలలో ఎయిర్ కండిషనర్ సదుపాయం కూడా ఉంటుంది. తోండియార్ పేట, వెలాచెరి, అయపాక్కం, పెరియార్ నగర్, కొరట్టార్ (చెన్నై), అన్నానగర్ (మధురై), అంబ సముద్రం (తిరునల్వేలి), సేలం, కొడున్గైయార్( తిరువళ్లూరు), వడమాలైపేట (తిరుపూర్)లో కల్యాణ మండపాలు నిర్మాణం చేపట్టనుంది. అలాగే మురికివాడల్లో పేదల కోసం రూ.1800 కోట్లతో 50వేల గృహాలు నిర్మించనున్నట్లు జయలలిత ప్రకటన చేశారు. కాగా జయ...ఆ రాష్ట్ర ప్రజలకోసం ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు,‘అమ్మ’ సిమెంట్, ‘అమ్మ’ ఉప్పు అమ్మ జిమ్‌లు ... ఇలా పలు పథకాలు ప్రారంభించి ప్రజల మన్ననలు పొందుతున్నారు. -
చౌహాన్ చౌక భోజనం.. ఎంతో తెలుసా?
భోపాల్ : తమిళనాడులో విజయవంతమైన సీఎం జయలలిత అమ్మ క్యాంటీన్లు చూశాం.. ఇప్పుడు ఆమె బాటలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా అడుగులు వేస్తున్నారు. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు రూ.10కే కడుపునిండా భోజనం పెట్టేందుకు చౌహాన్ ప్లాన్ చేస్తున్నారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను పురస్కరించుకుని సెప్టెంబర్ 25న ఈ సబ్సిడీ భోజన ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని చౌహాన్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్‌లో చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక ప్లేట్ భోజనంలో రోటీ, పప్పు, కూర, అన్నం, పచ్చడి ఉంటాయని, మొదట ఈ ప్రోగ్రామ్‌ను భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్పూర్లో ప్రారంభిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. అనంతరం మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నట్టు అధికారులు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ డిపార్ట్మెంట్ అడ్మిన్‌స్ట్రేషన్ కలిసి వివిధ క్యాంటిన్లలో భోజనాన్ని పేద ప్రజలకు అందించే బాధ్యతను పర్యవేక్షించాల్సి ఉంటుందని చౌహాన్ అధికారులకు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. -
చిట్టి అమ్ము.. అమ్మగా ఎలా మారింది?
తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కోమలవల్లి సినీరంగంలోకి ఎలా ప్రవేశించింది? మైనారిటీ తీరకముందే మెచ్యూర్డ్ క్యారెక్టర్లు చేసి సినీరంగంలో సంచలనాలు ఎలా సృష్టించింది? జయలలిత.. అంటే కేవల స్క్రీన్ నేమేకాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అనేంతగా ఎదిగేందుకు ఆమెకు సహకరించిందెవరు? తనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన ఎంజీ రామచంద్రన్ తో ఆమె అనుబంధం ఎలాంటిది? ఆయన మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి.. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం వెనుక ఎలాంటి తెగువ ప్రదర్శించారు? పురుషాధిక్య పోకడలు అడుగడుగునా కనిపించే భారతదేశంలో మీసం తిప్పే మగ నాయకులు సైతం ఆమెకు పాదాభివందనాలు చేస్తారు.. నిజంగా జయ దేవతా? 68ఏళ్ల ముదిమి వయసులోనూ ఉల్లాసంగా పనిచేయడానికి ఆమెకు శక్తి ఎక్కడి నుంచి వస్తోంది? ఏ బలం ఆమెనింత బలవంతురాలిని చేసింది? అసలు.. నాటి చిట్టిపొట్టి అడుగుల చిన్నారి అమ్ము.. నేడు అమ్మగా ఎలా మారింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రూపుదిద్దుకున్నదే 'అమ్మ'(జయలలిత: జర్నీ ఫ్రం మూవీ స్టార్ టు పొలిటికల్ క్వీన్) పుస్తకం. ప్రముఖ జర్నలిస్టు వాసంతి రచించిన ఈ మినీ బయోగ్రఫీలో జయలలిత జీవితంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఆసక్తికరంగా పొందుపర్చారు. జయ చిన్నతనం నుంచి 2015లో ఆరోసారి సీఎంగా ప్రమాణం చేసేంతవరకు జరిగిన సంఘటనలను ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. 200 పేజీల 'అమ్మ' ధర రూ.299 మాత్రమే. సెప్టెంబర్ 7న విడుదల కానున్న 'అమ్మ'ను అమెజాన్ లో రూ.224కే పొందొచ్చు. -
మళ్లీ...
ప్రశంస పొందిన కథ ‘శశి’ ‘రియాజ్’... ‘శశి... అమ్మీ’.... ‘ఏమైంది అమ్మీకి? ఏంటలా ఉన్నావు?’ ‘అమ్మీ ఐసియులో ఉంది పది రోజుల నుండి. నిన్ను చూడాలనుందని పేపర్ మీద నీ పేరు రాసింది’ గొంతు ఏడుస్తున్నట్టుగా ఉంది. ‘నే వస్తున్నా. ధైర్యంగా ఉండు. అమ్మీకి ఏమీ కాదు’ కాల్ కట్ చేశాను. కాని వెళ్లాలా వద్దా అని- ఒక నిమిషం ఆలోచించాను. వెళ్లకుండా ఉంటే? కాని రియాజ్ అమ్మీ గుర్తుకొచ్చింది. తెల్లగా పాలరంగులో ఉండే మనిషి. ‘పరీ’... అని పిలిచేది. ‘పరీ అంటే ఏంటి అమ్మీ?’ అని అడిగాను ఒకసారి. ‘దేవకన్య బేటీ’... అంది. ‘అంత అందంగా ఉంటావ్ నువ్వు’ అని కూడా అంది. దేవకన్యలు పెళ్లిళ్లకు కాపురాలకు పనికిరారు. నేను కూడా పనికి రానని ఆమె అనుకున్న రోజులను ఎలా మర్చిపోవడం? ఇప్పుడు వెళితే అవన్నీ గుర్తుకే వస్తాయి. కాని చావు బతుకుల్లో ఉన్న మనిషి. ఎందుకు బాధ పెట్టడం? అరగంటలో పని ముగించుకొని బయట కార్ స్టార్ట్ చేశాను. కాకినాడ నుండి ఏలూరుకు నాలుగు గంటల ప్రయాణం. వద్దన్నా ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లవుతోంది రియాజ్‌తో మాట్లాడి. ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఒకే ఊళ్లో కలిసి తిరిగాం. ఎప్పుడు చూసినా నూగు గడ్డంతో అందంగా ఉండేవాడు. చూసి నవ్వేవాడు. బదులు నవ్వకుండా ఉండటం సాధ్యం కాలేదు. నలుగురైదుగురం గ్రూప్‌గా ఉండేవాళ్లం. ఆ గ్రూప్‌లో మళ్లీ మేమిద్దరం ప్రత్యేకం. అందరి ఇళ్లకు వెళ్లేవాళ్లం. అందరికీ అందరం తెలుసు. మా ప్రేమ తెలియకుండా ఉంటుందా? ‘మన పెళ్లి జరుగుతుందనిపించడం లేదు’ ఒకరోజు బెంగగా అన్నాడు. ‘ఏం?’ ‘అమ్మీ ఒప్పుకోవడం లేదు’ ‘ఏం?’ ‘అన్నయ్య కూడా’ ‘ఏం?’ ‘నువ్వు నమాజ్ చదవలేవు. మా పద్ధతులూ ఏమీ తెలియవు అంటున్నారు’ ‘మా ఇంట్లో కూడా అంతే. మన పూజలు పద్ధతులు నీకు తెలియవు వద్దు అన్నారు. నేను వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా. నువ్వూ చెయ్’ కాని చేయలేకపోయాడు. రియాజ్ చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. అన్నయ్య మాట ఎన్నడూ కాదనలేనట్టుగా పెరిగాడు. అమ్మీకి కూడా ఎప్పుడూ ఎదురు చెప్పిన పిల్లాడు కాదు. రియాజ్‌కి తన మనవరాలికి ఇచ్చి చేయాలని పెద్దావిడ కోరిక. అలా అని కూతురికి ఎప్పుడో మాటిచ్చింది. ఇప్పుడు కాదంటే తమ మీదే ఆశ పెట్టుకున్న మనవరాలి జీవితం ఏమౌతుందోనని ఆమె భయం. ఆ రోజు సాయంత్రం రియాజ్ ఆమెతో మార్కెట్‌కు వెళుతూ నేను ఎదురుపడితే చూపిస్తూ అడిగాడు- ‘శశి లేకుండా నేను బతకలేను అమ్మీ’... ‘దాన్నే చేసుకుంటానంటే మాత్రం నేను చచ్చిపోతారా’ నేను చేతులు పట్టుకున్నాను. ‘ఒప్పుకోండి అమ్మీ, సంతోషంగా ఉంటాము. విడిపోయి ఎలా బతకాలో ఊహకి కూడా రావడంలేదు’ ‘బేటీ... నువ్వు మంచిపిల్లవు. మంచిపిల్లలానే ఉండు. నాకు నువ్వు చెడ్డ కావడం నీకు నేను చెడ్డ కావడం నాకు ఇష్టం లేదు’ కొడుకును తీసుకుని వెళ్లిపోయింది. నా అంత ధైర్యవంతుడు కాదు రియాజ్. సున్నితమైన మనసు. ఈ గొడవలతో మానసికంగా కుంగిపోతున్నాడు. నేనే ఏదో ఒక దారి వెతుకుతానని ఆశపడుతున్నాడు. కాని పెద్దావిడ మొండికేసింది. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది ఊహించని సంఘటన. లొంగక తప్పలేదు. అక్క కూతురు నాజియాతో రియాజ్ పెళ్లి ఖాయమైంది. అంచుల్లో అత్తరు రాసి ఎల్లో కలర్లో ఉన్న కార్డ్ మీద గ్రీన్ లెటర్స్‌తో వచ్చిన వెడ్డింగ్ కార్డ్‌ను చూసి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ మేం కలవలేదు. మాట్లాడుకోలేదు. ఊరు మారినా ఫోన్ నెంబర్ మారినా చిన్న మెసేజ్ పెట్టుకుంటాం. అంతే. పదేళ్ళ నుండి అతని నంబర్, చిరునామా చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ రోజు ఫోన్ కాల్‌తో అది తప్పేలా లేదు. ఉద్వేగంగా ఉందని అర్థమవుతూ ఉంది. ఎంత ప్రయత్నించినా కారు వేగం ఇంతకు మించి తగ్గించలేకపోతున్నాను. మధ్య మధ్యలో అమ్మీ ఇక బతకదేమో అనే ఆలోచన వచ్చినప్పుడు కొంచెం ఆందోళనగా అనిపిస్తోంది. ఎందుకంటే రియాజ్‌కి అమ్మీ అంటే ప్రాణం. ఎంత ప్రాణం అంటే నన్ను కూడా కాదనుకునేంత ప్రాణం. ‘రియాజ్.... ధైర్యంగా ఉండు... ప్ల్లీజ్ ధైర్యంగా ఉండు... నే వచ్చేస్తున్నా’ నాలో నేను మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాను. స్నేహితులు చెప్పారు- రియాజ్ వాళ్ల అన్నయ్యతో కూడా మాట్లాడటం మానేశాడట. నాతో పెళ్లికి సపోర్ట్ చేయలేదని కోపం అట. పిచ్చోడు. రక్తసంబంధాలు వద్దనుకుంటారా ఎవరైనా. ఎప్పుడొచ్చిందో ఏలూరు వచ్చేసింది. అప్పటికి సాయంత్రం ఐదయ్యింది. రియాజ్ హాస్పిటల్ అడ్రస్ మెసేజ్ పెట్టాడు. దాని ప్రకారం చేరుకుని కార్ పార్క్ చేసి హాస్పిటల్ వైపు చూస్తూ కూచున్నాను. రియాజ్‌కి కాల్ చేయాలి. ఇంతలో వాళ్ల అన్నయ్య సర్ఫరాజ్ గేటు దగ్గర కనిపించేడు. నన్ను చూసి లోపలికి వెళ్లి ఐదు నిమిషాల తరువాత నేరుగా నా కారు వైపు వచ్చాడు. కారు దిగి నిలబడ్డాను. ‘రా.. శశి’... అనుసరించమంటూ ముందుకు దారి తీశాడు. మౌనంగా వెంబడించాను. ర్యాంప్ మీద నడుచుకుంటూ మూడో అంతస్తులోని ఐసియు వద్దకు చేరాం. సర్ఫరాజ్ ఐసియులోకి వెళ్లి అక్కడున్న సిబ్బందితో మాట్లాడి బయటకొచ్చాడు. ‘లోనికి వెళ్లి అమ్మీని కలువు శశీ’ చల్లగా ఉంది ఐసియు లోపలికి అడుగు పెట్టాను. సిబ్బంది బ్లూ గౌన్ తొడిగి స్లిప్పర్స్ చూపించి వాటిని వేసుకొని వెళ్లమన్నారు. ఒక బెడ్ మీద రకరకాల ట్యూబులు, వైర్ల మధ్య అమ్మీ కనిపించింది. మంచానికి అతుక్కుపోయినట్టు కనిపిస్తోంది. చేయి మీద నరాలు బయటకొచ్చేశాయి. శ్వాస భారంగా ఆడుతోంది. సగం మూసిన కళ్ళు, సగం తెరిచిన నోరు... చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నా ధైర్యంగా రెక్కల కష్టం మీద పిల్లలని పెంచి పెద్ద చేసిన అమ్మీ ఈమేనా? అమ్మీ... అరచేతిని నిమిరాను. కళ్ళు తెరిచింది. దగ్గరగా జరిగి నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాను... ‘ఎలా ఉన్నావు అమ్మీ’... కళ్ళలో కన్నీళ్లు ఉబికి బయటకు వచ్చాయి. వారిస్తూ వేళ్ళతో మెత్తగా తుడిచాను. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. పెదాలు కదులుతున్నాయి కానీ మాట బయటకు రావటం లేదు. ‘ఏమీ కాదు అమ్మీ... అందరూ బావుంటారు. రియాజ్, సర్ఫరాజ్ అందరూ బాగానే ఉంటారు’ శక్తి కూడగట్టుకుంటూ అడిగింది - ‘మరి నువ్వూ’ ‘నేను కూడా బాగున్నా అమ్మీ. ఉద్యోగముంది. బతుకుతున్నా’ సంతోషంగా ... అనే మాట అనలేక పోయాను. కళ్ల నుంచి వేడి కన్నీటి బొట్లు ధారగా జారాయి. తప్పు చేసిన దానిలా తలవొంచుకుంటూ అంది- ‘మాఫ్ కరో బేటా... క్షమిస్తావా నన్ను? పువ్వు సంతోషంగా లేదు... తీగ సంతోషంగా లేదు... క్షమిస్తావా నన్ను...’ ఈ ఒక్క మాట చెప్పడానికే పిలిపించిందా? అందుకోసమే బతికి ఉందా? ‘అలా అనకండి అమ్మీ.. ప్లీజ్ అలా అనకండి. మీరు ప్రశాంతంగా ఉండండి ప్లీజ్’ ఏదో గొణుక్కున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో స్టాఫ్ వచ్చారు. ‘మేడమ్... ఆవిడని ఇక రెస్ట్ తీసుకోనివ్వండి’ ఆమె వైపు చూడకుండా చివుక్కున తిరిగి ఐసియు నుండి బయటపడి అక్కడ ఉన్న బల్ల మీద కూలబడ్డాను. భోరున ఏడుపు వచ్చింది. పక్కనే నిలబడ్డ సర్ఫరాజ్ మాటలు లేనట్టుగా ఉండిపోయాడు. కాసేపటికి అన్నాడు- ‘రియాజ్ నీ కార్ దగ్గర ఉన్నాడు’ కార్ దగ్గరకు వచ్చాను. రియాజ్ కనిపించ లేదు. కార్ స్టార్ట్ చేసి అలాగే కూర్చున్నాను. రెండో నిమిషంలోనే వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు. ఒక్క క్షణం చూశాను. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఆ మెరుపు, ఆ నవ్వు... మాయమైపోయాయి. పదేళ్ళు చాలా పెద్ద కాలం కదా. కారు స్టార్ట్ చేసి ముందుకు నడిపించాను. రియాజ్ ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. కారు పోనిస్తున్నాను. ఎక్కడికని తను అడగలేదు. నేను చెప్పలేదు. పావుగంట తర్వాత కారు ఊరి పొలిమేర్లలో ఉన్న గుడి దగ్గర ఆపాను. విశాలమైన గ్రౌండ్ ప్రశాంతమైన సాయంత్రం... ఒకప్పుడు వారానికి ఒకసారైనా ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇద్దరం. అక్కడే రావిచెట్టు ఉంటుంది. అదే మా స్పాట్. ఎప్పటిలాగే నేను కాళ్లు ముడుచుకుని కూచున్నాను. ఎప్పటిలాగే కాళ్లు కిందకు జార్చి రియాజ్ కూచున్నాడు. తన అరచేతుల్ని మూస్తూ, తెరుస్తూ వాటి వైపే చూస్తున్నాడు. ఆ వేళ ఆ సాయంత్రం పదేళ్ల ఎడబాటుకు సాక్షీభూతం. ‘రియాజ్... మాట్లాడు’ తల అడ్డంగా ఊపి కింద పెదవిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అలాగే ఉండిపోయాడు. తెరిచిన తన అరచేతిలో చెయ్యి వేశాను. చప్పున ఇంకో చెయ్యి దాని మీద వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఏడుస్తున్నాడు. చూస్తున్నాను. ‘ఇక నా వల్ల కాదు శశి... నాతో నేను పోరాడుతూ, జీవితంలో పోరాడుతూ పూర్తిగా ఓడిపోయాను. ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? ఈ బాధ పదేళ్లయినా తగ్గదే. దీన్ని జీవితమంటారా?’ నేను ఏమీ మాట్లాడలేదు. ఏమి చెప్పి ఓదార్చాలి? రియాజ్ సంతోషంగా లేడు, తను కూడా లేదు. బతుకుతున్నారు. జీవించటం లేదు. అంతకు మించి మార్గం ఏమైనా ఉంది. నాకు తెలుసు నేను అధైర్యపడితే రియాజ్ అస్సలు చూడలేడని. ‘అలా మాట్లాడకు రియాజ్. ధైర్యంగా ఉండు. ఇటు చూడు. నేనెంత ధైర్యంగా ఉన్నానో చూడు’ రియాజ్ ముఖాన్ని నా వైపు తిప్పుకున్నాను. నన్ను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు. ఒకప్పటి మెరుపు ఒక్క క్షణం మళ్లీ తన కళ్లలో వెలిగింది. ‘అందంగా ఉన్నావు శశీ... చాలా అందంగా ఉన్నావు. ఎప్పటిలానే’... చిన్నగా నవ్వాను. ‘అవునూ నువ్వేంటి ఇంత పొట్ట పెంచావు?’ పొట్ట మీద చిన్నగా కొడుతూ అడిగాను. ఇద్దరం ఒక్కసారిగా నవ్వేశాం. ‘పిల్లలు ఎలా ఉన్నారు రియాజ్? ఏమి చేస్తున్నారు?’ పిల్లలు అనగానే రియాజ్ పెదాల మీద చిరునవ్వు. ఇలా ఆనందంగా ఉంటే ఎంత అందంగా ఉంటాడు... అనిపించింది. ఊహూ... పక్కన కూర్చుంటే సరిగా కనబడటం లేదు. లేచి నిల్చున్నాను రియాజ్ చెప్పులలో కాళ్లు పెట్టి నెమ్మదిగా అక్కడే తన ముందు అటూ ఇటూ నడుస్తున్నాను. రియాజ్ నా కాళ్లవైపే చూస్తున్నాడు. కుడి అరికాలు వంపులో ఉన్న పుట్టుమచ్చ, దాన్ని ఎన్నిసార్లు ముద్దాడాడో నాకే గుర్తులేదు. అప్పట్లో ఉన్న పట్టీలు, మువ్వలు ఇప్పుడు లేవు. నాకు ఎప్పుడూ ఇష్టముండేది కాదు మువ్వలంటే. రియాజ్ కోసం వేసుకునేదాన్ని. ‘చెప్పు రియాజ్’ ‘పిల్లలు బాగున్నారు. రోషినీ అయిదవ తరగతికి వచ్చింది. చాలా పెద్దదైపోయిందన్న భావన తనకి. లేనిపోని గాంభీర్యం నటిస్తుంది. నీలాగా బట్టల పిచ్చి. షాప్‌కి తీసుకెళితే వంద తీయించి ఒకటి సెలక్ట్ చేస్తుంది.’ కూతురి గురించి ఆనందంగా మాట్లాడు తుంటే రియాజ్ వైపు రెప్పార్పకుండా చూశాను. ‘మరి ఆసిఫ్?’ ‘వాడా, వాడు నాకంటే పెద్ద వెధవ అవుతాడు శశి. వాడి మీద టీచర్ల నుండి రోజు కంప్లైంట్స్. వాడు నాకొద్దు. నువ్వు తీసుకెళ్లి పెంచుకో వాడిని’ నవ్వుతూ అన్నాడు. నవ్వడానికి ప్రయత్నించాను. నా కళ్లలో బాధ, గొంతులో వణుకు గమనించాడు. పదేళ్లలో ఏం మారిందని? తన ముందు నెమ్మదిగా అడుగులు కదిలిస్తున్న అదే అమ్మాయిని. రెండు చేతులూ పట్టుకున్నాడు. ‘పెళ్లి చేసుకోవా ఇక?’ మౌనంగా ఉన్నాను. ‘నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నట్లే నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటానుగా’ ‘నేను బాగానే ఉన్నాను. నమ్ము ప్లీజ్.’ ‘నమ్మను’ ‘శశి. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఇప్పటికైనా మన కోసం మనం జీవించవచ్చేమో...’ రెండు చేతులు గట్టిగా పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు. నెమ్మదిగా విడిపించుకుని పక్కనే కూచున్నాను. ‘ఆ ఆలోచన కూడా రానివ్వకు రియాజ్. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి. పిల్లలు నాజియా వాళ్లేం తప్పు చేశారు? వాళ్లు పూర్తిగా నీ బాధ్యత. జాగ్రత్తగా చూసుకో వాళ్లని.’ ‘మరి నువ్వు? నువ్వు నా బాధ్యత కాదా? నువ్వు ఒంటరిగా అలా ఉండిపోయావన్న బాధ నన్ను ప్రతిక్షణం చంపేస్తుంది తెలుసా?’ ‘అది మనిద్దరి నిర్ణయం. నేను నిజంగా బాగానే ఉన్నాను’ ‘నువ్వు చాలా మొండిదానివి, నా మాట వినవు’. లేచి నిలబడ్డాను. ‘పద.. అన్నయ్య నీ కోసం ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా మాట్లాడుకుంటున్నారా మీరిద్దరూ?’ ‘పదేళ్ల తర్వాత ఇప్పుడే మాట్లాడటం అన్నయ్యతో’ అన్నాడు దూరంగా చూస్తూ. ‘అలా ఉండకు రియాజ్. సర్ఫరాజ్ తప్ప నీకెవరున్నారు? కోపాలు వదిలెయ్.’ ‘ఆ రోజు తను నావైపు ఉంటే అమ్మీ ఒప్పుకునేదే’ ‘వదిలేయి ప్లీజ్. అనవసరంగా నీ మనసుని ఇంకా కష్టపెట్టుకోకు. అందరితో కలిసి ఉండు. నీ జీవితం అన్ని విధాలుగా బాగుండాలి. నువ్వు బాధ్యతగా ఉండాలి. అలా ఉంటానని మాటిస్తావా రియాజ్’ తను చెయ్యి చాచింది. ‘ఇవ్వను. అస్సలు ఇవ్వను’ రెండు చేతులూ కట్టుకుంటూ అడ్డంగా తలాడించాడు రియాజ్. తనెప్పుడూ అంతే చిన్న పిల్లాడిలా మారాం చేస్తాడు. కానీ తన మాట ఎప్పుడూ కాదనడు. ‘పద వెళదాము’. చెయ్యి పట్టుకుని పైకి లేపాను. ఇష్టం లేకుండానే లేచాడు. కార్ స్టార్ట్ అయింది. మళ్లీ బిగుసుకుపోయాడు. కారు హాస్పిటల్ వద్దకు చేరింది. ‘శశి...’ ‘దిగి వెళ్లి పో రియాజ్.’ దిగాడు. నా విండో వైపు వచ్చాడు. చేయి తాకాలని అనుకున్నాడు. కాని అవకాశం ఇవ్వక స్టీరింగ్ మీదే నా చేయి బిగించి ఉంచాను. వెళ్లిపోతున్నాడు. అందమైన రియాజ్. మంచి మనసున్న రియాజ్. నన్ను ప్రేమిస్తూనే ఉన్న రియాజ్. ఒక్క క్షణం గట్టిగా పిలవాలనిపించింది. వెనక్కు పిలవాలనిపించింది. కాని- ఆగాను. అతి కష్టం మీద నన్ను నేను కూడగట్టుకున్నాను. దేవుడా... ఏంటిది? ఈ ముగిసిన కథలోకి మళ్లీ రావడం... మళ్లీ ఈ జ్ఞాపకాలను తిరగదోడుకోవడం... తెగిన దారాన్ని అతుకులు పెట్టాలనుకోవడం... దూరంగా ఉండటంలోని కష్టం కంటే ఈ కష్టం ఎక్కువగా ఉంది. మెల్లగా కారు స్టార్ట్ చేసి కాసేపటిలోనే హైవే మీదకు చేరుకున్నాను. కారు కూడా కుదుపులు సర్దుకుని ముందుకు పరిగెట్టడానికి సిద్ధమవుతూ ఉంది. రేర్ వ్యూ మిర్రర్లో దూరమవుతున్న ఊరు కనిపిస్తూ ఉంది. బహుశా రెండు మూడు రోజులలో అమ్మీ చనిపోయిన ఫోన్ రావచ్చు. రియాజ్ మళ్లీ కాల్ చేయవచ్చు. కాని ఇక తను రాకపోవచ్చు. ఎప్పటికీ రాకపోవచ్చు. బాధను మిగిల్చే అనుభవంలోకి మళ్లీ మళ్లీ ఎందుకు రావడం? మలుపు దాటితే కొత్తగా వేసిన రోడ్డు కనిపిస్తూ ఉంది. అటుగా ఎక్సిలరేటర్ తొక్కాను. - సంజీవని కుసుమ్ -
లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే
జవదేకర్ జోస్యం సాక్షి, చెన్నై: రాష్ట్రంలోకి లోకాయుక్తా వస్తే, అమ్మ మళ్లీ జైలు కెళ్లినట్టే. అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నినాదం ఆమె నోటి మాటే, అని చమత్కరిస్తున్నారు. రాష్ర్టంలో అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాజకీయ పక్షాలన్నీ నినాదాల్ని అందుకుని ఉన్నాయి. ఇందులో బీజేపీ కూడా ఉంది. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి, కాంగ్రెస్ ఇలా ఎవరికి వారు విడుదల చేసుకున్న మేనిఫెస్టోల్లో ‘లోకాయుక్తా’ నినాదం తప్పని సరిగా ఉన్నాయి. అవినీతిని రూపు మాపాలంటే లోకాయుక్తాతోనే సాధ్యం అన్నట్టుగా ప్రచారాల్లో గళం విప్పే పనిలో పడ్డాయి. ఇంతవరకు బాగానే, ఉన్నా లోకాయుక్తా వస్తే మాత్రం జైలుకు వెళ్లేది జయలలితే అని గంటాపథంగా జవదేకర్ వ్యాఖ్యానిస్తుండడం గమనించాల్సిన విషయమే. చెన్నైలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన జవదేకర్ జయలలితను ఉద్దేశించి సెటెర్లు విసిరారు. గతంలో ఇంటికి 20 లీటర్ల ఉచిత మినరల్ వాటర్ అని ప్రకటించి లీటరు రూ. పదికి అమ్ముకున్న వాళ్లు, విద్యుత్ మిగులు అని ఎన్నికల ఫీట్లు చేస్తున్న వాళ్లు, ఇప్పుడేమో లోకాయుక్తా అన్న నినాదం అందుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. లోకాయుక్త అమ్మ పెదవి నోటి మాటకే పరిమితం. అది అమలయ్యేది డౌటే. ఎందుకంటే, అది వస్తే జైలుకు వెళ్లేది జయలలితే అని చమత్కరించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తు ల కేసు సుప్రీంలో వి చారణలో ఉన్నం దు, రాష్ట్రంలో లోకాయుక్తా అవసర మా..? అని పెదవి విప్పే అన్నాడీఎంకే వాళ్లూ ఉన్నారు. అదే సమయంలో లోకాయుక్త వస్తే, అమ్మ ఒక్కట్టేనా...?తాతయ్య అండ్ ఫ్యామిలీ వెళ్లదా..? అని జవదేకర్‌కు ప్రశ్నల్ని సంధించే వాళ్లు ఉండడం ఆలోచించాల్సిందే. అవినీతిలో డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందే అని వ్యాఖ్యానించే కమలం పెద్ద, ఒక్క అమ్మకే జైలు అని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. -
వాళ్లను కూడా వదలని 'అమ్మ'
కోయంబత్తూర్: 'అమ్మ' నూతన వధూవరులను కూడా వదలటం లేదు. ఏకంగా వారి నుదుటిపైనే నిలిచింది. అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ ఫార్మసి, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఆముదం, అమ్మ అవార్డులు, అమ్మ థియేటర్. ఇలా అనేక పథకాలు ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి ప్రారంభించించినవే. తాజాగా ఈ జాబితాలో వివాహాలు కూడా చేరాయి. పెళ్లిల్లో కూడా ఇప్పుడు జయలలిత ఫోటోలు దర్శనమిస్తున్నాయి. అది కూడా వధూవరుల నదుటిపై ఉంచిన బాసికాలపై. జయలలితను ఆమె అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి 24న జయలలిత 68వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. దీంతో పురచ్చి తలైవీ పుట్టినరోజు వేడుకలను అభిమానులు శుక్రవారం నుంచే ప్రారంభించారు. దీనిలో భాగంగా కోయంబత్తూర్‌లోని ఉడుమలైపెట్టైలో 68 జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అమ్మ హాజరు వ్యక్తిగతంగా కాలేకపోయినా... పెళ్లికూతురు, పెళ్లికొడుకు నుదిటి కట్టిన బాసికాల నుంచి ఆశీర్వదిస్తారని జయలలిత అభిమానులు అంటున్నారు. కాగా, వధూవరుల నుదుటిపై ఉన్న బాసికాలపైనే కాకుండా, వారి చేతుల్లో ఉన్న బొకెలతో పాటుగా, ఈ కార్యక్రమం నిర్వహించిన వేదిక పరిసరాల్లో మొత్తం అమ్మ ఫోటోలతో నిండిపోయాయి. -
'అన్నింటికి అమ్మేంటి.. ఆ ప్రచారమేంటి?'
మదురై: తమిళనాడులో అమ్మ పేరిట పథకాలు రావడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల పేర్లకు అమ్మ, పురుచ్చి తలైవి(విప్లవాత్మక నేత) అని చేర్చడం, ఆ పేరిట ప్రకటనలు ప్రచురించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీ రథినం అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మున్ముందు అలాంటి ప్రకటనలు అలాంటి పనులు చేయకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించాలని అందులో కోరారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును ఇలా పథకాల పేరిట వ్యక్తిగత ప్రచారానికి ఉపయోగించకుండా ఉండేలా చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రచారం చేసుకునేందుకే పథకాల పేర్లు పెడుతున్నారని, వాటి ప్రకటనల్లో కూడా ఆమె పేరును చేరుస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. అమ్మ కాల్ సెంటర్, అమ్మ మైక్రో లోన్స్ స్కీమ్స్ అంటూ ప్రతిరోజు దినపత్రికల్లో వేల కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారని కూడా పిటిషనర్ అందులో పేర్కొన్నారు. -
వరద సాయం ఏదమ్మా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లేందుకు వీలుగా అమ్మ కాల్సెంటర్లను సీఎం జయలలిత మంగళవారం ప్రారంభించారు. 1100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదుచేసుకోవచ్చని జయ తెలిపారు. ఒక రోజుకు 15వేల సమస్యలను నమోదు చేసేందుకు వీలుగా 138 మంది సిబ్బందిని కాల్సెంటర్లో నియమించారు. ఈ కాల్‌సెంటర్లు బుధవారం నుండి వాడుకలోకి వచ్చాయి. తొలిరోజైన బుధవారం నాడు వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ సుమారు 2వేల ఫోన్ కాల్స్‌రాగా వీటిల్లో ఎక్కువశాతం వరద సహాయం గురించినవని సిబ్బంది తెలిపారు. 30 లక్షల మందికి పైగా వరద సహాయం అందుతుందని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందులో కొందరికి వరద సహాయం అందింది. పండుగ సమయాల్లో వరద సహాయకాల పంపిణీకి బ్రేకు పడింది. వరద సహాయం పొందని వారంతా అమ్మ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఎపుడు అందిస్తారని ప్రశ్నించారు. విమర్శలు: తమిళనాడు ప్రభుత్వం తరపున అట్టహాసంగా ప్రారంభమైన అమ్మ కాల్‌సెంటర్ ఆరంభంలోనే హంసపాదుగా మారిందనే విమర్శలు సైతం వినపడ్డాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు సేవలందిస్తామని ప్రభుత్వం ప్రకటించగా రెండో రోజునే అపసవ్యంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. 1100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే ‘ ఈ ఫోన్ నెంబరు అందుబాటులో లేదు’ అంటూ సమాచారం వచ్చిందని కొందరు పేర్కొన్నారు. ప్రజల చెవిలో పూలుపెట్టే చర్యని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎద్దేవా చేశారు. -
తమిళనాట" అమ్మ కాల్ సెంటర్"
-
మరో సేవ
♦ అమ్మ కాల్ సెంటర్ ఆవిర్భావం ♦ ప్రజా సమస్యల పరిష్కారానికి మరో వేదిక ♦ ప్రారంభించిన సీఎం జయ ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా అమ్మ కాల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. అమ్మ కాల్ సెంటర్‌కు టోల్‌ఫ్రీ నంబరు 1100కు ఫోన్ చేయడం ద్వారా ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయాన్ని అందుకోవచ్చు. చెన్నై టీనగర్లో నెలకొల్పిన అమ్మ కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ సిమెంట్, అమ్మ ఫార్మసీలు, అమ్మ మినరల్ వాటర్ బాటిల్, అమ్మ అముదం స్టోర్లు సేవలందిస్తున్నాయి. అమ్మ థియేటర్లకు ఏర్పాటు చేయాలని చెన్నై కార్పొరేష్న్ ప్రణాళికలు సిద్ధం చేసింది. అమ్మ పేరుతో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు ప్రజాదరణ పొందాయి. నామమాత్రం ధరకు ఆహారం లభించే అమ్మ క్యాంటీన్లు బహుళ ప్రజాదరణ పొందడంతోపాటు ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచాయి. తాజాగా అమ్మ కాల్‌సెంటర్:ఈ కోవలోకి తాజాగా అమ్మ కాల్ సెంటర్ వచ్చి చేరింది. పేద, బలహీన, బడుగు వర్గాలు ప్రభుత్వ పరంగా తాము ఆశిస్తున్న సేవలు, సమస్యలపై పరిష్కారాల కోసం సచివాలయంలో సీఎం ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఈ విభాగం ద్వారా నేరుగా లేదా పోస్టల్ శాఖ ద్వారా ఫిర్యాదులు పంపవచ్చు. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థులను శాఖాపరంగా విభజించి ఆయా శాఖల అధికారులకు పంపుతారు. సమస్యను పరిష్కరించగానే సంబంధిత వ్యక్తికి సమాచారం ఇస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మరింత వేగం పాటించేందుకు వీలుగా అమ్మ కాల్‌సెంటర్ సేవలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చెన్నై టీ నగర్లో నెలకొల్పిన కాల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ప్రజలు తమ కోర్కెను విన్నవించుకునే వెసులుబాటును కల్పించారు. చెన్నైలోని ఈ కాల్‌సెంటర్ 24 గంటలు సేవలందించేలా అందుబాటులోకి తెచ్చారు. తొలిదశగా రోజుకు 15 వేల విజ్ఞప్తులను నమోదుచేయగల సామర్థ్యం కలిగిన 138 సిబ్బందిని నియమించారు. ప్రజల స్పందనను బట్టీ సిబ్బంది సంఖ్యను పెంచుతారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా టెలిఫోన్ల ద్వారా సంబంధిత శాఖలకు పంపుతారు. ఏ శాఖకు, ఏ అధికారికి సదరు విజ్ఞప్తిని పంపారో ఆ వివరాలను, చేపట్టిన చర్యలను సంబంధిత వ్యక్తికి ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలుపుతారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమ్మ సీడ్స్‌కు శ్రీకారం
సేవా కేంద్రాల్లో విక్రయం తిరుచ్చి, మదురైలకు డాబా గార్డెన్ విస్తరణ కొత్త ఏడాది ‘అమ్మ’ పేరిట మరో పథకం అమల్లోకి వచ్చింది. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాల్ని అందించేందుకు అమ్మ సీడ్స్‌ను ప్రవేశ పెట్టారు. అమ్మ సేవా కేంద్రాల్లో ఈ సీడ్స్ చౌక ధరకే విక్రయించనున్నారు. ఇక, డాబా గార్డెన్స్, ఇంటి తోటను తిరుచ్చి, మదురై నగరాలకు విస్తరించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక అమ్మ(జయలలిత)పేరుతో పథకాలను అమలు చేస్తూ వస్తున్న విష యం తెలిసిందే. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, వాటర్, కూరగాయ ల దుకాణాలు, సిమెంట్స్ తదితర పథకాలు జోరుగా సాగుతూ వస్తున్నాయి. తాజాగా అన్నదాతల ప్రగతి లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న సీఎం జయలలిత, తాజాగా వారికి నాణ్యమైన విత్తనాలు చౌక ధరకే అందించేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా విత్తన అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. అన్నదాతలు, విత్తన ఉత్పత్తి దారులు, వ్యవసాయ నిపుణుల సమన్వయంతో అమ్మ సీడ్స్ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారు. శనివారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అమ్మ సీడ్స్ విక్రయానికి సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. సర్టిఫైడ్ విత్తనాలు చౌక ధరకే అమ్మ సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే, చెన్నై, కోయంబత్తూరులలో మీరే పండించండి...నినాదంతో విజయవంతంగా సాగుతున్న డాబా గార్డెన్, ఇంటి తోట సాగుబడికి వస్తున్న స్పందన ఆధారంగా ఈ పథకాన్ని తిరుచ్చి, మదురైలలోనూ అమలు చేయడానికి నిర్ణయించారు. ఇక, వ్యవసాయ శాఖ నేతృత్వంలో విరుదునగర్ జిల్లా అరుప్పుకోటైలో కోటి 40 లక్షలతో నిర్మించిన విక్రయ కేంద్రాన్ని, రూ. 28 కోట్లతో నిర్మించిన ఆధునిక గిడ్డంగులు, విత్తన శుద్ధీరణ కేంద్రాలు, తదితర భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయలలిత ప్రారంభించారు. -
'అమ్మ' పేరుతో మరో పథకం
చెన్నై: అన్నా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. 'అమ్మ' పేరుతో మరో పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమం కోసం జయలలిత 'అమ్మ సీడ్స్' పథకాన్ని ప్రారంభించారు. గతంలో తమిళనాడు అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు.. రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని ఆరంభించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తమిళనాడులో 'అమ్మ సర్వీస్ సెంటర్ల' ద్వారా ఈ విత్తనాలను పంపిణీ చేయనున్నారు. జయలలిత గతంలో అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ సాల్ట్ తదితర పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
అమ్మ మరో కానుక
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు కానుకగా 16 రకాల వస్తువుల పంపిణీకి మంగళవారం సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. సచివాలయంలో ఐదుగురు పిల్లల తల్లులకు బాక్సుల్ని అందజేశారు. చెన్నై: గర్భిణులకు పౌష్టికాహార పథకం, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ప్రసూతి వైద్య సేవలు, శిశు సంరక్షణ, బిడ్డ, తల్లి ఆర్యోగ భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే శిశువులకు కానుకల పంపిణీకి సిద్ధమయ్యారు. ఆరోగ్య బీమా పథకంలో చేసిన మార్పులు చేర్పులు, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి ప్రసూతి పథకం మేరకు ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే పిల్లల కోసం అమ్మ శిశు సంక్షేమ కానుక పేరిట సికొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కానుకల పంపిణీ : సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో ఐదుగురు పిల్లల తల్లులకు కానుకను సీఎం జయలలిత అందజేశారు. చిన్నపాటి సూట్ బాక్సు రూపంలో ఉన్న ఈ కానుకలో రూ. వెయ్యి విలువగల వస్తువుల్ని పొందుపరిచారు. ఇందులో టవల్, చిన్నపాటి చేతి పరుపు, సోప్, ఆయిల్, న్యాప్కిన్, పౌడర్, షాంపు తదితర 16 రకాల వస్తువుల్ని ఉంచారు. ఈ కానుకల పంపిణీ నిమిత్తం ఈ ఏడాదికి గాను రూ. 67 కోట్లను కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించి శిశువులకు అక్కడికక్కడే ఈ కానుకల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖకార్యదర్శి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. -
'అమ్మ' విరాళం రూ.100 కోట్లు
కొల్లాం(కేరళ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నమామి గంగే' ప్రాజెక్టుకు ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయి దేవి భూరి విరాళం ప్రకటించారు. రూ.100 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 11న మాతా అమృతంగమయి మఠంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి రూ.100 కోట్ల డీడీ అందజేయనున్నారు. ఈ మొత్తంతో గంగా నది పరివాహక ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించనున్నారు. 'నమామి గంగే'కు తమ వంతు అందించే విషయంపై మార్చి 28న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో అమ్మ చర్చలు జరిపారని అమృతంగమయి మఠం వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణకు ముందుకు వచ్చిన అమ్మకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పినట్టు తెలిపింది. ప్రజారోగ్య రక్షణకు, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో 2010లో అమల భారతం కాంపెయిన్(ఏబీసీ) కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించింది. దీని ద్వారా లక్షలాది వాలంటీర్లు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపింది. -
భారంగా అమ్మ
అమ్మ క్యాంటీన్ల నిర్వహణ అధికారులకు భారంగా మారుతోంది. ఈ క్యాంటీన్లతో పెరిగిన పని భారాన్ని తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నారు. స్వచ్ఛంద సంస్థల గుప్పెట్లోకి అమ్మ క్యాంటీన్లను తీసుకెళ్లే యోచనలో పడ్డారు. ఇందుకు తగ్గ పరిశీలన పర్వం ప్రారంభమైంది. త్వరలో నిర్ణయం వెలువడే అవ కాశాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై : పేదలకు ఆ క్యాంటీన్ ఓ వరం. కారు చౌక కే అక్కడ లభిస్తున్న అల్పాహారంతో కడుపు నిండుతోంది. రుచి, సుచికరంగా తమకు ఇడ్లీ, సాంబార్, పెరుగన్నం, లెమన్ రైస్, చపాతీ తదితర పదార్థాలు లభిస్తుండడంతో అందరూ ఆ క్యాంటీన్ల బాట పడుతున్నారు. ‘అమ్మ’ చల్లంగా ఉండాలని దీవిస్తున్నారు. ఇది ప్రజాదరణ పొందుతూ వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత(అమ్మ) పేరుతో కొలువు దీరిన ఈ క్యాంటీన్లు. తొలుత చెన్నైలోనూ, తదనంతరం దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లకు, ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణల్లోనూ ఈ క్యాంటీన్ల కొలువు దీరుతూ వస్తున్నాయి. ఈ క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ నుంచి వడ్డింపు వరకు అన్ని బాధ్యతల్ని మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. ఆయా క్యాంటీన్లకు ఆయా ప్రాంత కార్పొరేషన్ల పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని రకాల వస్తువుల్ని సరఫరా చేయడం జరుగుతూ వస్తున్నది. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సైతం వస్తున్నది. అయితే, నిర్వహణ బాధ్యత అధికారులకు భారంగా మారుతున్నది. భారంగా ‘అమ్మ’ : రాజధాని నగరం చెన్నైలో 250 వరకు , ఇతర కార్పొరేషన్లలో తలా పదిహేను , ఇరవైకు పైగా క్యాంటీన్లు ఉన్నాయి. అలాగే, అన్ని జిల్లా ఆసుపత్రుల్లో, ప్రధాన ఆసుపత్రుల్లోనూ కొలువు దీర్చి ఉన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణ కార్పొరేషన్ అధికారులకే అప్పగించి ఉన్నారు. కార్పొరేషన్లలోని సంబంధిత విభాగాల్లో తమ విధులతో పాటుగా, ఈ క్యాంటీన్లు తమకు అదనపు భారంగా మారడంతో అధికారులు, సిబ్బందికి పని భారం తప్పడం లేదు. అదనపు బాధ్యతలతో కార్పొరేషన్లలో తాము చేయాల్సిన విధులకు ఆటంకం కల్గుతుండడంతో, తాము చేస్తున్న పర్యవేక్షణ, నిర్వహణా పనుల్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా చేయించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. స్వచ్ఛంద గుప్పెట్లోకి : అమ్మ క్యాంటీన్లకు లభిస్తున్న ఆదరణ, ఇతర రాష్ట్రాలకు సైతం పాకింది. ఆయా రాష్ట్రాలు అమ్మ క్యాంటీన్లను ఆదర్శంగా చేసుకుని, తమ రాష్ట్రాల్లోనూ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పని భారంతో ఈ క్యాంటీన్లను స్వచ్చంద సంస్థల గుప్పెట్లోకి తీసుకెళ్లే యోచనలో అధికార యంత్రాంగం ఉన్నది. ఇందుకు తగ్గ పరిశీలన ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టి ఉన్నారు. రాష్ట్రంలోని పదివేల పాఠశాలల్లో అమల్లో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంతో పాటుగా అమ్మ క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణను స్వచ్చంద సంస్థలకు అప్పగించే విధంగా ఈ పరిశీలన సాగుతున్నది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం స్వచ్చంద సంస్థల ద్వారా సాగుతున్న దృష్ట్యా, వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగి ఉన్నది. ఈ పరిశీలన ప్రక్రియతో స్వచ్చంద సంస్థల ద్వారా అమ్మ క్యాంటీన్లలో మరింత నాణ్యతతో కూడిన పదార్థాలను అందించే విధంగా అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. లాభాపేక్షతో కాకుండా, ప్రజా సేవ లక్ష్యంగా పనిచేసే స్వచ్చంద సంస్థలకు మాత్రమే ఈ క్యాంటీన్లను అప్పగించే విధంగా కసరత్తులు సాగుతున్నాయి. త్వరలో తుది నిర్ణయం తీసుకుని, ఆమోదం కోసం సీఎం దృష్టికి నివేదికను అధికారులు తీసుకెళ్లబోతున్నారు. అయితే, తన పేరిట పేదల కడుపు నింపుతున్న అమ్మ క్యాంటీన్లను, ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వచ్చంద గుప్పెట్లోకి అప్పగించేందుకు సీఎం జయలలిత ఏ మేరకు అంగీకరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే. -
ఇక దేశవ్యాప్తంగా 'అమ్మ ఉప్పు'
అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్ తరహాలో కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మ ఉప్పు పథకాన్ని ఇకపై దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. డబుల్ ఫోర్టిఫైడ్, లో సోడియం, రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో ఐయోడైస్డ్ వంటి పేర్లతో మూడు రకాల ఉప్పు ప్యాకెట్లను మార్కెట్ కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్న తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్.. ఇకపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జయలలిత సర్కార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 21న ప్రారంభమైన అమ్మ ఉప్పు పథకం ద్వారా 5కేజీల నుంచి 20 కేజీల ఉప్పు ప్యాకెట్లను రూ. 14 నుంచి రూ. 25 ధరలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ఆసుపత్రుల క్యాంటీన్లకు కూడా అమ్మ ఉప్పు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఏఐఏడీఎంకే అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను ఆమె అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే సంగతి తెలిసిందే. -
అటవీ శాఖా మంత్రిగా ఆనందన్
చెన్నై,సాక్షి ప్రతినిధి: మాజీ మంత్రి ఆనందన్‌కు మళ్లీ మంత్రి పదవి దక్కింది. అమ్మ కేబినేట్లో అటవీశాఖామంత్రిగా చేరబోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత జైలు కెళ్లిన తరువాత సీఎం పగ్గాలు చేపట్టిన పన్నీర్‌సెల్వం మంత్రి వర్గంలో ఆనందన్ ఉన్నారు. మే 23వ తేదీన జయ మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సమయంలో ఆనందన్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఈ దశలో తిరుప్పూరు ఎమ్మెల్యే ఆనందన్‌ను అటవీశాఖా మంత్రిగా మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు జయ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ రోశయ్య ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేశారు. 9న మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిగా ఆనంద న్ పదవీ ప్రమాణం చేస్తారు. -
ఇక అమ్మ అవార్డులు
అమ్మపేరుతో వెలుస్తున్న అనేక పథకాల వరుసలోకి తాజాగా అమ్మ అవార్డు చేరబోతోంది. తమిళభాష ప్రాచుర్యానికి పాటుపడే ప్రతిభావంతులైన మహిళలకు అమ్మ అవార్డులను ప్రదానం చేయాలని అన్నాడీఎంకే మహిళా విభాగం సిద్ధం అవుతోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు వాసులకు అమ్మ అంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనే సంగతి అందరికీ తెలిసిందే. పార్టీ శ్రేణులతోపాటూ ప్రజలు సైతం అమ్మ అనే పదానికే అలవాటు పడిపోయారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలకు అమ్మ అనే నామకరణం చేశారు. ప్రభుత్వ పరంగా అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మశీలు, అమ్మ సిమెంట్, అమ్మ అముదం మార్కెట్లు, అమ్మ మినరల్ వాటర్ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా అమ్మ క్యాంటీన్లు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. అమ్మ క్యాంటీన్లలో అతి తక్కువ ధరకే మూడుపూటలా ఆహారం దొరకడంతో పేదలేకాదు, మధ్య తరగతివారు సైతం ఆకర్షితులైనారు. ఇలా అనేక పథకాలు ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. చెన్నై కార్పొరేషన్ పరిధిలో అమ్మ థియేటర్లకు రూపకల్పన సాగుతోంది. హైక్లాస్ థియేటర్లకు దీటుగా నిర్మితమయ్యే ఈ అమ్మ థియేటర్లు హైక్లాస్ అనుభవాన్ని అతితక్కువ ధరకే ఆస్వాదించేలా నిర్మించనున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పరంగా సాగుతున్న అమ్మ పథకాలు కాగా, పార్టీ పరంగా సైతం అమ్మ పేరును ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు మహిళా విభాగం నిర్ణయించింది. తమిళభాష కృషీవలురకు అవార్డులు: ఇప్పటి వరకు అమలులో ఉన్న అమ్మ పథకాలు చౌక ధరలకు పలు ఉత్పత్తులు, ఆహారం అందిస్తుండగా, తమిళభాషాభి వృద్దికి పాటుపడేవారి కోసం అమ్మ అవార్డులు సిద్ధం అవుతున్నాయి. తమిళ భాషాభిమానం మెండుగా గల ప్రజానీకంలో నేటి తరం తమిళభాష జ్ఞానానికి దూరం అవుతున్నట్లు పార్టీ భావిస్తోంది. విదేశాల్లో ఉన్నత చదువుల మోజులో మాతృభాషపై మమకారాన్ని కోల్పోతున్న నేటి తరం వారిని ఉత్తేజితులను చేసే మహిళలకు అవార్డులను ప్రదానం చేయాలని సంకల్పించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడే పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో, పాఠశాలల్లో తమిళభాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ పాటుపడే మహిళలకు అవార్డులను అందజేస్తారు. అలాగే మహిళలు తమ పిల్లలకు సైతం మాతృభాషను బోధించాల్సి ఉంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి జయలలిత పేద మహిళల వివాహానికి 4 గ్రాముల మాంగల్యం, రూ.50 వేలు ఆర్థిక సాయం, ఆహారభద్రత కోసం 20 ఉచితంగా 20 కిలోల బియ్యం, మిక్సీలు, గ్రైండర్లు,ఫ్యాన్లు ఇస్తున్నారు. ఈ కోవలో అన్నాడీఎంకే పార్టీ తరపున ఇకపై అమ్మ పేరిట అవార్డులను సైతం ప్రదానం చేయనున్నారు. -
మా అమ్మ కాజల్
మదర్స్ డే స్పెషల్ హిందీలో కాజల్ అంటే కాటుక... కళ్లని చల్లగా ఉంచే కాటుక. కనురెప్పలా కాపాడుకునే అమ్మలాంటి కాటుక. ⇒ నా స్నేహితురాలు, సలహాదారు, మార్గదర్శకురాలు, నా నమ్మకం, నా ధైర్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే మా అమ్మ గురించి ఎంతైనా చెప్పొచ్చు. తనతో నా రహస్యాలు మొత్తం చెప్పుకునేంత చనువు ఉంది. మా అమ్మ ముందు నాకు ఏ దాపరికమూ లేదు. మా చిన్నప్పుడు మా అమ్మ ఉద్యోగం చేసేది. అప్పుడు నాకేం అనిపించలేదు ఇప్పుడు ఆలోచిస్తే ఇంటినీ, ఉద్యోగాన్నీ ఎలా బ్యాలెన్స్ చేసిందా? అనిపిస్తోంది. ⇒ అప్పుడేమో మమ్మల్ని చదివించడానికి, మా ఆలనా పాలనా చూసుకోవడానికి తను ఒత్తిడికి గురయ్యేది. ఇప్పుడూ అంతే. నేను ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు చేయగలుగుతున్నానంటే దానికి కారణం మా అమ్మే. ఆవిడ సహకారం లేకపోతే నేనీ స్థాయికి వచ్చేదాన్ని కాదు. ⇒ బాల్యంలో మా వేలు పట్టుకుని నడిపించిన మా అమ్మ, మేం పెద్దయ్యాక కూడా వదల్లేదు. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటాం. మాతో పాటు తనూ వస్తుంటుంది. మాకు అమ్మ చేతి వంట తినే అవకాశం చాలా తక్కువ. ఆ విషయం తనకెప్పటికీ కొరతగానే ఉంటుంది. అందుకే, వీలు కుదిరినప్పుడల్లా స్వయంగా వంట చేసి, తినిపిస్తుంటుంది. ⇒ మా అమ్మ అందరితో ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరి మనసూ నొప్పించదు. అదెలా? అని నేనే ఆశ్చర్యపోతుంటాను. మా అమ్మతో పరిచయం ఉన్నవాళ్లెవరూ తనని ఇష్టపడకుండా ఉండలేరు. అసలీ ప్రపంచంలో మా అమ్మలాంటి అమ్మ ఉంటుందా? అనే సందేహం నాకు లేకపోలేదు. ⇒ మా అమ్మ చాలా సున్నిత మనస్కురాలు. దానివల్ల జరగకూడదని ఏదైనా జరిగినప్పుడు.. అది చిన్నదైనా సరే చాలా ఉద్వేగపడిపోతుంటుంది. అందుకని మా అమ్మ మనసు కొంచెం కఠినంగా మారితే బాగుంటుందనిపిస్తుంటుంది. అంతకు మించి ఆమెలో నేనే మార్పూ కోరుకోవడంలేదు. ⇒ అమ్మ కోసం ఒక్క రోజేంటి? 365 రోజులూ కేటాయించవచ్చు. ‘మదర్స్ డే నాడు’ తనను సంతోషపెట్టేసి, మిగతా రోజుల్లో నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. బహుమతులుగా వస్తువులివ్వాలనుకోను. మా అమ్మ ప్రేమను వస్తువులతో వెలకట్టడం నాకు నచ్చదు. ⇒ భవిష్యత్తులో పెళ్లి చేసుకుని, నేను తల్లవుతా. అప్పుడు మా అమ్మలాంటి ‘అమ్మ’గా ఉంటా. పూర్తిగా మా అమ్మలా కాకపోయినా అందులో సగం ఉన్నా, నా పిల్లలు మంచి పౌరులవుతారని నా నమ్మకం. ⇒ మా అమ్మ తనకోసం షాపింగ్‌కి వెళుతుంది. కానీ, ఇంటికొచ్చేటప్పుడు మా కోసం ఏదైనా కొని తెస్తుంటుంది. తన గురించి దాదాపు మర్చిపోతుంది. ఒక తల్లి తన బిడ్డలను ఏ స్థాయిలో ప్రేమిస్తుందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. ⇒ ఈ ‘మదర్స్ డే’కి నేను మలేసియాలో ఉంటాను. ఓ సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళుతున్నా. నేనెక్కడికి వెళ్లినా మా అమ్మ దాదాపు నాతో పాటే ఉంటుంది. మదర్స్ డే కోసం నేనేదీ ప్లాన్ చేయలేదు. మా అమ్మ ఆనందం కోసం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి. మా అమ్మ నా దగ్గర్నుంచీ ఏమీ ఆశించదు. వృత్తిపరంగా నా ఎదుగుదలను ఆశిస్తుంది. అలాగే, నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అదే మంచి బహుమతిలా భావిస్తుంది. ఇప్పుడు చెప్పండి.. ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్ ఇన్ ది వరల్డ్’ అంటే అతిశయోక్తి కాదు కదా. - డి.జి.భవాని, కవర్ ఫొటో: శివమల్లాల పేరు: కాజల్ అగర్వాల్ తల్లిదండ్రులు: వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ చెల్లెలు: నిషా అగర్వాల్ పుట్టింది: ముంబై చదువు: బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా నటి కాకముందు: మోడలింగ్ తొలి చిత్రం(హిందీ): ‘క్యూం! హో గయా నా’ (చెల్లెలి పాత్ర) తొలి చిత్రం (తెలుగు): లక్ష్మీ కల్యాణం -
నన్ను పస్తుపెట్ట లేదు
అమ్మ జ్ఞాపకం మనిషి ప్రకృతికి దూరమవుతున్నాడు. మనిషి స్వచ్ఛత కోల్పోతున్నాడు, సహజత్వాన్ని కోల్పోతున్నాడు. కొన్నిసార్లు మనిషితనాన్నే కోల్పోతున్నాడు. కానీ... అమ్మ... తనలోని అమ్మతనాన్ని ఎప్పటికీ కోల్పోదు. అదే అమ్మతనంలోని గొప్పతనం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత గొప్ప కవికైనా అమ్మ గురించి పూర్తిగా చెప్పగలిగే పాండిత్యం ఉండదని నమ్ముతాను. తనకు తెలిసిన భాషలో, తెలిసిన పదాలతో, నేర్చుకున్న పాండిత్యంతో ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. కానీ అమ్మప్రేమ గురించి చెప్పాలంటే ఏ పాండిత్యమూ చాలదు. వినమ్రంగా ఆమెకు తలవంచడం, ఆమె ఒళ్లో తలపెట్టుకుని ఆమె ఆత్మీయస్పర్శను ఆస్వాదించడమే. అమ్మ ప్రేమను కరువు తీరా ఆస్వాదించిన జీవితం నాది. అది అనిర్వచనీయమైన అనుభూతి. సంపదలో పుట్టి పెరిగిన చాలామందికి అందనంత ప్రేమను మా అమ్మ పేదరికంలోనూ పంచింది మా అమ్మ. పేదరికంలోనూ మమ్మల్ని గారాబంగా, సంస్కారం నేర్పించి పెంచింది మా అమ్మ. నా పాటల్లో సాగే లాలిత్యానికి, అనురాగానికి ప్రేరణ మా అమ్మే. ‘పురిటిలో నీ తనువు పచ్చి పుండయినా... నా ఆకలి పాల జున్నుకుండ’ వంటి ప్రయోగాలు చేయగలిగానంటే అమ్మ పంచిన ప్రేమతోనే సాధ్యమైంది. వెన్నెల్లో మచ్చ ఉంటుందేమో, నీటిలో నాచు ఉంటుందేమో కానీ అమ్మ ప్రేమలో స్వచ్ఛత మాత్రమే ఉంటుంది. పుడమి తల్లికి, కన్నతల్లికి మరేదీ సాటిరాదు. నేను తింటుంటే! మా అమ్మ ఇప్పటికీ మమ్మల్ని చంటిబిడ్డల్లాగానే అనుకుంటుంది. నేను అన్నం తిన్నంత సేపు నా ఎదురుగానే ఉంటుంది. తన కంటితో చూస్తే తప్ప నేను తృప్తిగా కడుపు నిండా తిన్నానని చెప్పినా ఆమెకు తృప్తి ఉండదు. ఆమె కంటితో చూస్తేనే సంతోషం. చిన్నప్పుడు మాకు జ్వరమొస్తే రాత్రంతా ఆమెకూ నిద్ర ఉండేది కాదు. జ్వరం తగ్గి మేము తిన్న తర్వాతనే ఆమె అన్నం తినేది. పంట గింజలు మాకు పెట్టి మా అమ్మానాన్న పరిగి గింజలతో కడుపు నింపుకునే వారు. డెబ్బైలలో వచ్చిన తీవ్రమైన కరువు రోజుల్లోనూ మమ్మల్ని పస్తు పెట్టలేదు. మా కడుపు నింపడానికి వాళ్లు కడుపు మాడ్చుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అమ్మ ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదంటే నమ్ముతారా? ఆమెకు బిడ్డలైన మమ్మల్నే కాదు ఎవరినీ పల్లెత్తు మాట అనే తత్వం కాదు. ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసి మేము తిరిగి బదులు చెప్పబోతే వారిస్తుంది. ‘రోజులు గడిస్తే ఏది నిజమో వారే తెలుసుకుంటారు. అప్పటి వరకు ఓపిక పట్ట’మని చెబుతుంది. ‘రోజులు గడిస్తే కాయ పండవుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టాలె’ అంటుంది. ఆమెతో మాట్లాడుతుంటే సాహిత్యకారుల ప్రసంగం వింటున్నట్లు ఉంటుంది. తప్ప సాధారణ పల్లె మహిళ మాట్లాడినట్లు ఉండదు. చిన్నప్పుడు మంగళహారతులు, శ్రుతితో కూడిన పాటలు పాడిన అనుభవం ఆమెది. తన భావాన్ని ఎంత సున్నితంగా చక్కటి మాటలతో చెబుతుంది. తాత్విక మూర్తి! చేతిలో డబ్బు లేని రోజుల్లోనే కాదు, మేమిప్పుడు సంపాదిస్తున్న రోజుల్లోనూ తన కోసం ఏమీ కావాలనుకోదు. నేను డబ్బిచ్చినా కూడా ‘నాకెందుకు బిడ్డా డబ్బులు’ అంటుంది. హైదరాబాద్‌లో పెద్ద డాక్టర్‌కి చూపిస్తానంటే తెలకపల్లిలో ఆమె ఎప్పుడూ చూపించుకునే డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి దగ్గరే చూపించుకుంటుంది. జీవితం ప్రశాంతంగా, ఘర్షణలు లేకుండా జీవించాలనే సత్యాన్ని ఆమె ఆచరించి చూపించింది. నాకిప్పటికీ ఏ కష్టమొచ్చినా ఆమె దగ్గరకెళ్లి కూచుంటే... చల్లటి మాటలతో బాధను మైమరిపిస్తుంది. అమ్మ గురించి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. చెబుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయి. ఆ ప్రేమ ఎప్పటికీ కావాలని గుండె ఆర్ద్రమవుతుంది. వెంకన్న సొంతూరు: మహబూబ్‌నగర్ జిల్లా, తెలకపల్లి మండలం, గౌరారం పుట్టింది: 1965,వైశాఖ పౌర్ణమి రోజు అమ్మ: ఈరమ్మ, నాన్న... నరసింహ చదువు: ఎంఎ తెలుగు లిటరేచర్ ఉద్యోగం: నాగర్‌కర్నూల్ కో ఆపరేటివ్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తింపు: రచయిత, గాయకులు -
నా ఫ్రెండ్స్... అమ్మకీ ఫ్రెండ్సే...
అమ్మ జ్ఞాపకం నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ ధాన్యం కొట్లో పనిచేస్తోందంట. అక్కడే నేను పుట్టానట. అప్పట్లో ఆడవాళ్లు పురుడొచ్చేవరకు పనిచేస్తూనే ఉండేవాళ్లు. నేను పుట్టిన పద్నాలుగో రోజు మా అమ్మమ్మ చనిపోయిందట. నా చిన్నతనం, నా బాల్యం ఏడు రంగుల ఇంద్రధనుస్సంత అందమైంది. యాభై మందున్న ఉమ్మడి కుటుంబంలో మా గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. నా బాల్యంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆంక్షలు లేని స్వేచ్ఛ ఉండేది. మమ్మల్ని ఎవరూ ఏమీ అనేవారు కాదు. మా అమ్మ నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు ఒక్క జ్ఞాపకం కూడా లేదు. అలాగని విపరీతంగా పట్టించుకుని ప్రేమించిన జ్ఞాపకం కూడా లేదు. నాన్న వ్యాపారం తుకారాం వ్యాపారమే... నేను చదువుకోవడం కొరకు చాలా పోరాటమే చేశాను. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేని అమ్మ ఏం చేయగలుగుతుంది? అష్టకష్టాలు పడి ఎన్నో అడ్డంకుల్ని దాటి, డిగ్రీ వరకు చదువుకోగలిగాను. ఉమ్మడి కుటుంబంలో అమ్మ ఎన్నో కష్టాలు పడింది. నాన్న వ్యాపార నిర్వాకాల వల్ల కష్టాలు పడింది. నాన్నకి శ్రమ చేయడం తప్ప కల్లాకపటం తెలియదు. అలాంటి వాడు వ్యాపారం చేస్తే తుకారాం వ్యాపారమే అవుతుంది. నాన్న చనిపోయాక మా కుటుంబం చాలా కష్టాలు పడింది. 1979లో నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగం వచ్చింది. ఒక గది రూ.60కి అద్దెకు తీసుకుని అమ్మని, తమ్ముడిని తీసుకొచ్చేశాను. అలా వచ్చిన అమ్మ 2005 మే నెలలో చనిపోయేవరకు నాతోనే ఉండిపోయింది. నా జీవితంలో ఎగుడుదిగుడులకి, ఎదుగుదలకి అమ్మ ప్రత్యక్ష సాక్షి. నా స్వేచ్ఛకి తను ఏనాడూ అడ్డుపడలేదు. ‘ఇలా చెయ్యి అలా చెయ్యి’ అని ఎప్పుడూ నాకు చెప్పలేదు. నేను ఏం చేసినా కరెక్టుగా, కచ్చితంగా చేస్తానని అమ్మకి గొప్ప నమ్మకం. నేను నాస్తికత్వాన్ని నా జీవితాచరణగా ఎంచుకుని, ఒక నాస్తికుణ్ని ఇష్టపడి, అతనితో కలిసి ఉంటానని చెప్పినప్పుడు తను నన్నేమీ అనలేదు. అమ్మ సాక్షిగా పెళ్లి... నేను రిజిస్టర్ పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాత్రం... సంప్రదాయ పద్ధతిలో చేసుకోమని అడిగింది. నేను సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనని, తాళి, మట్టెలు, నల్లపూసలు లాంటివి వేసుకోనని కచ్చితంగా చెప్పాను. నేనలా దృఢంగా చెప్పేసరికి తను ఇంకేమీ అనలేదు. నీ ఇష్టం అంది. 1981లో మేమిద్దరం అమ్మ సాక్షిగానే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఎప్పటికీ నాతోనే ఉంటుందని అతనికి ముందే చెప్పాను. నేను అత్తారింటికి వెళ్లలేదు. నా సహచరుడే ఒక చిన్న పెట్టెతో నా గదికి వచ్చేశాడు. నా సహచరుడు మా అమ్మని ‘అమ్మా!’ అనే పిలిచేవాడు. అమ్మకు నాతోపాటు బయటకి రావడం ఇష్టం. తనకి తెలియని రచయిత్రి లేదు. అందరితో కలివిడిగా మాట్లాడేది. నా ఫ్రెండ్స్ తనకీ ఫ్రెండ్సే. అమ్మకి జీవితం పట్ల ఎంతో ప్రేమ. తనకి మంచి మంచి రంగుల చీరలన్నా, నగలన్నా ఎంతో ఇష్టం. శరీరం పట్ల ఎంతో శ్రద్ధ. అన్నీ శుభ్రంగా, శుచిగా ఉండాలి. ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ. తానే ఓ హెర్బల్ ఆయిల్ తయారుచేసుకుని తలకి పట్టించేది. ఆశ్చర్యంగా నిగనిగలాడుతూ జుట్టు మొలుచుకొచ్చింది. చివరి దశలో మంచం మీద ఉన్నప్పుడు కూడా తనను చూడ్డానికి వచ్చేవాళ్లకి ఆ హెర్బల్ ఆయిల్ ఎలా తయారుచేసుకోవాలో చెబుతుండేది. అమ్మకి చివరి స్నానం చేయించిన రోజున వీపంతా పరుచుకున్న నల్లని జుట్టు అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. జీవితం పట్ల తన ప్రేమకి నిదర్శనంలా నిగనిగలాడుతూ పరుచుకున్న తన ఉంగరాల జుట్టు కన్నీళ్ల మధ్య నానాటికీ కనిపిస్తూనే ఉంటుంది. - కొండవీటి సత్యవతి, ‘భూమిక’ ఎడిటర్ -
తల్లి డయానా...
అమ్మ జ్ఞాపకం బ్రిటిష్ యువరాజులు ప్రిన్స్ విలియమ్,ప్రిన్స్ హేరీలు ఇప్పటికీ తల్లి డయానాను ప్రేమగా గుర్తు చేసుకుంటుంటారు. వారి బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న వారిద్దరూ, ఆమె ఆకస్మిక మరణంతో తమ జీవితాల్లో ఏర్పడిన చీకటి నుంచి తేరుకునేందుకు చాలాకాలమే పట్టిందని, ఇప్పటికీ ఆమె లేని లోటు బాధిస్తూనే ఉంటుందని అంటారు. తమకు సురక్షితమైన జీవితాన్ని ఇచ్చేందుకు ఆమె అడుగడుగునా తపన పడేదని, ప్రతిరోజూ నిద్రించే ముందు తమను ముద్దాడేదని, ఆమె ముద్దుతోనే తమ దినచర్య ముగిసేదని ప్రిన్స్ హేరీ చెబుతారు. -
భగవంతుని రూపం ‘అమ్మ’
కొమరగిరిపట్నం (ఉప్పలగుప్తం) : అమ్మ భగవంతుని స్వరూపమని, సృష్టికర్తగా.. స్థితికర్తగా పరబ్రహ్మ స్వరూపిణిగా ‘అమ్మ’ నిరంతరం కీర్తింపబడుతుందని, అమ్మను మమ్మీగా పిలిచే నేటి యువతకు అమ్మ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పుస్తకం ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్టు నడింపల్లి సీతారామరాజు రచించిన ‘అమ్మ’ పుస్తక ఆవిష్కరణ సభ న్యూక్లియర్ శాస్త్రవేత్త(ఎన్ఎఫ్సీ) బ్రహ్మశ్రీ జి.వి.రామకృష్ణమూర్తి అధ్యక్షతన అల్లవరం మండలం కొమరగిరిపట్నంలోని అమృతవనంలో ఆదివారం జరిగింది. సభలో పాల్గొన్న పలువురు అమ్మ గురించి తమలో దాగి ఉన్న భావోద్వేగాలను వ్యక్తీకరించారు. తొలుత పుస్తకాన్ని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ ఆదిశక్తి అని.. ఆమె అమ్మగా మానవాళిపై మమతానురాగాలు కురిపిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి ప్రతిబిడ్డా రుణపడే ఉంటాడని, ఆ పేగు బంధంలో ఉన్న మమకారాన్ని స్పృశిస్తూ నడింపల్లి సీతారామరాజు పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమ్మంటే తనకు ఎంత ప్రాణమో సభకు వివరించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ భగవంతుని ప్రతిరూపమే అమ్మ అని, జన్మ సార్ధకతకు అమ్మే మూలమని, అమ్మ తనకు జన్మనివ్వబట్టే ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌కందా, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సృష్టిలో అమ్మ గొప్పతనాన్ని సభికులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, ఆంధ్రాబ్యాంక్ మాజీ డెరైక్టర్ పరసా పరమేశ్వరరావు, రాష్ట్ర ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, ఏఐకేఎఫ్ కోశాధికారి డి.ఎస్.ఎన్.రాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, అమలాపురం ఆర్డీఓ జి.గణేష్ కుమార్, వయో వృద్ధుల జ్ఞాన ఆశ్రమ నిర్వాహకులు ఆర్.శ్రీరామరాజు కూడా మాట్లాడారు. అమ్మపుస్తకాన్ని ప్రముఖ రచయిత, సినీ గేయ పరిశోధకుడు డాక్టర్ పైడిపాల సమీక్షించారు. ‘పురాణ మహిళలు- వారి పాత్ర’ న్యూక్లియర్ శాస్త్రవేత్త జి.వి రామకృష్ణమూర్తి, ‘భూదేవి సీతమ్మతల్లి-ఆదర్శనారి’పై అల్లూరి రామభద్రరాజు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కొమరగిరిపట్నం గ్రామ సర్పంచ్ కడలి రామనాథం శెట్టి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, పెన్మత్స సీతారామరాజు, పెన్మత్స చిట్టిరాజు, పి.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
'అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా'.. 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య
బెంగళూరు: 'అమ్మా ఐ లవ్ యూ' అంటూ నాలుగేళ్ల చిన్నారి తన తల్లికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు నగర పరిధిలోని యలహంకకు చెందిన ఈ చిన్నారి నాలుగో తరగతి చదవేది. బాలిక తల్లి ఓ గార్మెంట్ ఫ్యాకర్టీలో పనిచేస్తోంది. కాగా బాలిక గత పది రోజులుగా స్కూలుకు వెళ్లలేదు. 'అమ్మా వారంపైగా స్కూలుకు వెళ్లలేదు. దయచేసి నన్ను క్షమించు. నేను ఎక్కడికెళ్లినా నీతోనే ఉంటా. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా' అని ఆ చిన్నారి తన తల్లికి లేఖ రాసింది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బాలికను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అమ్మా.. నన్ను కాపాడు
ఖతర్ నుంచి కన్నపేగు ఘోష కుటుంబ భారాన్ని మోయడానికి ఖతర్ వెళ్లిన యువతి కష్టాల్లో చిక్కుకుంది. అక్కడ నరకం చూస్తున్నానని నెల క్రితం తల్లికి ఫోన్లో చెప్పిన యువతి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు.. ఎనిమిదేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా, పెద్ద దిక్కుగా ఉన్న సోదరుడు మంచం పట్టాడు..ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లిన యువతి సమాచారం అందకపోవడంతో ఆ తల్లి పడ రాని పాట్లు పడుతోంది.. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అమ్మా.. నన్ను రక్షించు, దేశం కాని దేశానికి పంపించావు, వాళ్లు ఇక్కడ నరకం చూపిస్తున్నారు, నీవు నన్ను త్వరగా రప్పించుకో లేకపోతే నా ప్రాణాలు పోతాయి’’ అని ఓ యువతి ఖతర్ దేశం నుంచి నగరంలోని తన తల్లికి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో ఆ తల్లి తన కూతురు కోసం తల్లిడిల్లుతోంది. ఎనిమిదేళ్ల క్రితం భర్త మృతి.. మంచం పట్టిన పెద్ద కుమారుడు... కాటేదాన్‌కు చెందిన మాధవి , సత్యనారాయణ దంపతులు. వీరికి కుమారులు కార్తీక్ (20), అర్జున్ (18), కూతురు లత (22) సంతానం. పాతబస్తీలో ఓ వెల్డింగ్ షాపులో పనిచేసే సత్యనారాయణ ఎనిమిదేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అయినా మాధవి ధైర్యం కూడగట్టుకుని కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లల్ని చదివించింది. రెండేళ్ల క్రితం చేతికి ఎదిగిన కొడుకు కార్తీక్ పురానాపూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి నేటికి కూడా ఇంట్లో మంచంమీదే ఉండే పరిస్థితి. మరోపక్క అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం చాలా కష్టంగా నడుస్తోంది. ఈ స్థితిలో వనితా కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన లత తాను కూడా కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే చార్మినార్‌కు చెందిన రషీద్ మాధవికి పరిచయం అయ్యాడు. జీతం రూ.13 వేలని నమ్మించి.. ఖతర్ దేశంలో మా వదినే ఇంట్లో పనిచేసేందుకు లతను పంపిస్తే నెలకు రూ.13 వేలు వ స్తాయి, అప్పులన్నీ తీర్చ వచ్చని రషీద్ ఆమెతో నమ్మబలికాడు. కుటుంబ భారం మోయడానికి లత ఖతర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. రషీద్ లతకు పాస్‌పోర్టు ఇప్పించి, జనవరిలో ఖతర్‌కు పంపించాడు. నాలుగైదు నెలలు లత అక్కడ బాగానే ఉందని మాధవికి రషీద్ చెప్పేవాడు. కాగా గత నెల మొదటి వారంలో లత తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా ఇక్కడ నాకు నరకం చూపిస్తున్నారు, నన్ను వెంటనే తీసుకెళ్లు, ఇక్కడుంటే చంపేస్తారు అని కన్నీరుమున్నీరైంది. రషీద్‌తో మాట్లాడి తీసుకువస్తానని ఆమెకు ధైర్యం చెప్పింది. తన కూతురుకు ఏదో అపాయంలో ఉందని భావించిన మాధవి, రషీద్ వద్దకు వెళ్లి తన కూతురు గురించి అడిగింది. వెంటనే తన కూతురు కావాలని కోరింది. రషీద్‌ను గట్టిగా నిలదీయడంతో రెపో మాపో రప్పిస్తానని సముదాయించాడు. ఖతర్‌లో ఉన్న రషీద్ వదినకు ఫోన్‌చేసిన మాధవికి ‘‘ నీ కూతురు ఎక్కడికో వెళ్లిపోయింది, బతికుంటే వస్తుందిలే అని నిరక్ష్యంగా సమాధానం చెప్పడంతో, నెల రోజులు పూర్తయినా కూతురు జాడ లేకపోవడంతో వారం రోజుల క్రితం పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించింది. అయితే వారు స్పందించలేదు. కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి చూసి తట్టుకోలేకనే భారాన్ని భుజాన వేసుకున్న నా కూతురు లత విదేశాల్లో ఉద్యోగం చేసేందుకు వెళ్లి ఆపదలో చిక్కుకుందని మాధవి సాక్షితో తన ఆవేదనను వ్యక్త పర్చింది. తన కూతుర్ని రక్షించి క్షేమంగా నగరానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. ఇదిలావుండగా దుబాయ్‌లో అరబ్‌షేక్ చేతుల్లో చిక్కుకున్న నగరానికి చెందిన ఓ మహిళను చైతన్యపురి పోలీసులు స్పందించి ఆమెను రక్షించి క్షేమంగా నగరానికి వారం రోజుల క్రితం రప్పించారు. అలాగే లతను కూడా రప్పించాలని ఆమె కోరుతుంది. -
‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి...!’
ఆధునిక సాహిత్యం - అస్తిత్వవాద ధోరణులు స్త్రీవాద కవిత్వం అంతర్జాతీయ మహిళా దశాబ్ది (1975- 85) స్ఫూర్తితో తెలుగులో స్త్రీవాద కవిత్వం రూపుదిద్దుకుంది. ఆంగ్లంలో వర్జీనియా ఉల్ఫ్ రాసిన ‘ఎ రూమ్ ఆఫ్ ఒన్స ఓన్’, మిల్లెట్ రాసిన ‘సెక్సువల్ పాలిటిక్స్’ వంటి గ్రంథాల ప్రభావం కూడా దీనిపై ఉంది. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీ అణచివేతకు గురవుతోందనీ, లైంగికత్వం, సంతానోత్పత్తి వంటివి పురుషాధిక్య సంబంధాలని స్త్రీ వాదుల ఆరోపణ. పురుషాధిక్యత నశించాలనీ, అన్ని రంగాల్లో మహిళల సమానహక్కులను, స్వేచ్ఛను పరిరక్షించాలనీ, స్త్రీలు మూఢాచారాల ముసుగులో పడకూడదన్న ఆశయాలతో, అస్తిత్వ నిరూపణ లక్ష్యంతో స్త్రీవాద కవిత్వం ప్రారంభమైంది. తొలి స్త్రీవాద కవితగా 1972లో ఓల్గా రాసిన ‘ప్రతి స్త్రీ నిర్మల కావాలి’ అనే కవితను విమర్శకులు గుర్తించారు. 1980 నుంచి వచ్చిన స్త్రీవాద కవితలను త్రిపురనేని శ్రీనివాస్ ‘గురి చూసి పాడేపాట’ పేరుతో 1990లో తొలి స్త్రీవాద కవితా సంకలనాన్ని ప్రచురించారు. 1984లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సావిత్రి రాసిన బందిపోట్లు కవితా ఖండిక సంచలనం సృష్టించింది. తర్వాత నీలిమేఘాలు (1993) సంకలనంలో ఈ కవిత చోటు చేసుకుంది. 1993లో నీలిమేఘాలు కవితా సంకలనాన్ని శతాధిక కవయిత్రుల కవితలతో అస్మిత ప్రచురించింది. అందులో వసంతా కన్నాభిరామన్ రాసిన ‘స్త్రీగా రాయటమంటే’, ఓల్గా రచించిన ‘సంకెళ్లు తెగుతున్న సంగీతం’ వ్యాసాలు స్త్రీవాద దృక్పథాన్ని, సిద్ధాంత పరిధిని వివరించాయి. స్త్రీవాద కవితా ధోరణిపై ఎన్నో వాదాలూ, వివాదాలూ చెలరేగాయి. ఈ వివాదాలన్నింటినీ ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ఎస్. సూర్యప్రకాశ్ సంకలనకర్తగా అ.ర.సం. 1997లో ప్రచురించింది. ఎన్.గోపి, ఎండ్లూరి సుధాకర్, భగ్వాన్, ఆశారాజు వంటి కవులు కూడా స్త్రీవాద ధోరణితో కవితలు రాశారు. ఎండ్లూరి సుధాకర్ ‘షమ్మా’, శిఖామణి ‘పూల బజార్’ వంటి సంకలనాలను ప్రచురించారు. ప్రముఖ స్త్రీవాద కవితా సంపుటాలు 1. జయప్రభ: పైటను తగలెయ్యాలి, వామనుడి మూడో పాదం (1988) 2. రేవతీ దేవి: శిలాలోలిత (1980) 3. కొండేపూడి నిర్మల: సందిగ్ధ సంధ్య(1986), నడిచే గాయాలు (1990), మల్టీ నేషనల్ ముద్దు (1992) 4. పాటిబండ్ల రజని: ఎర్రజాబిళ్ల ఎరీనా, అబార్షన్ స్టేట్మెంట్ 5. మంధరపు హైమావతి: సూర్యుడు తప్పిపోయాడు 6. విమల: వంటిల్లు, సౌందర్యాత్మక హింస (కవితా ఖండికలు) 7. తూర్లపాటి రాజేశ్వరి: తాళికట్టిన మృగం 8. బి. పద్మావతి: గుక్కపట్టిన బాల్యం 9. అలిశెట్టి ప్రభాకర్: వేశ్య (కవితా ఖండిక) 10. ఆశారాజు: అద్దంలో ప్రతిబింబం స్త్రీవాద నవలలు, కథలు కోకొల్లలుగా వచ్చాయి. తొలి స్త్రీవాద నవల రంగనాయకమ్మ ‘జానకి విముక్తి’. ‘స్వేచ్ఛ’, ‘మానవి’, ‘ఆకాశంలో సగం’ ఓల్గా ప్రసిద్ధ నవలలు. మల్లాది సుబ్బమ్మ ‘వంశాకురం’, కుప్పిలి పద్మ ‘మూడుపాయల జలపాతం’ వంటివి మరికొన్ని ప్రముఖ నవలలు. దళితవాద కవిత్వ ధోరణి అంబేద్కర్ తాత్వికత పునాదిగా, జ్యోతిబా పూలే ఆశయాలు లక్ష్యంగా 1990ల్లో దళితవాద కవితాధోరణి ఆవిర్భవించింది. తొలి రోజుల్లో హరిజన, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వారి సమస్యల చిత్రీకరణను విస్తృత పరిధిలో దళిత సాహిత్యంగా భావించారు. దళిత వర్గాలు సృష్టించిందే దళిత సాహిత్యంగా కొందరు పేర్కొన్నారు. ఈ భావన సరైంది కాదు. దళిత వర్గాల అభ్యున్నతి కోసం అగ్రవర్ణాలవారు సృష్టించిన సాహిత్యం కూడా దళిత సాహిత్యమే అవుతుంది. అయితే దళితేతరుల సాహిత్యం కంటే దళితుల సాహిత్యం వాస్తవ రూపానికి అద్దం పడుతుంది. ‘ఆయా సమస్యలు అనుభవిస్తున్న దళితుడి అభివ్యక్తి లోనూ, ఆత్మాశ్రయరీతిలోనూ గాఢత చోటు చేసుకుంటుంది’ అనే కొండపల్లి సుదర్శన రాజు అభిప్రాయం అమోదయోగ్యంగా ఉంది. జాషువా, బోయి భీమన్న, కుసుమ ధర్మ న్న, కొలకలూరి ఇనాక్, కత్తి పద్మారావు వంటి వారి కవిత్వంలో దళిత ఉద్యమ స్పృహ బలంగా ఉంది. గరిమెళ్ల సత్యనారాయణ, వంగపండు, మాష్టార్జీ వంటి వాళ్లు పాటల ద్వారా దళిత చైతన్యాన్ని కలిగించారు. ‘గబ్బిలం’ జాషువా తొలి దళిత కావ్యం. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ బోయి భీమన్న విశిష్ట దళిత కావ్యం. దళిత కవితా ఉద్యమం రూపుదిద్దుకున్న తర్వాత వి. సిమ్మన్న, కొండపల్లి సుదర్శన రాజు ఆధ్వర్యంలో తొలి దళిత కవితాసంపుటి ‘దళిత కవితా సంకలనం’ 1991లో వెలువడింది. జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకుడిగా దళిత గీతాలు సంకలనం 1993లో వచ్చింది. జి. లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ సంపా దకత్వంలో ‘పదునెక్కిన పాట’ 1996లో కవితా సంకలనాన్ని ప్రచురించారు. దళిత కవులు, దళిత నాయకస్తుతి, దళిత సంఘీభావ కాంక్ష, దళితుల కర్తవ్య బోధ, మను వు నిరసన, శంబూక, ఏకలవ్యుల సంస్మరణ, దళితుల రాజ్యాధికారం, రిజర్వేషన్ల పరిరక్షణ వంటి అంశాలు కవితా వస్తువులుగా దళిత కవితలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. దళిత ఉద్యమస్ఫూర్తితో నవలలు, కథలు, నాటికలు అసంఖ్యాకంగా వస్తున్నాయి. ముస్లింవాద కవితా ధోరణి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇటీవల బలంగా వస్తున్న అస్తిత్వవాద కవితా ధోరణి ఇది. హిందూ మతఛాందస వాదుల తీరును ముస్లిం కవులు జీర్ణించుకోలేకపోయారు. బాబ్రీ మసీదు విధ్వంసంతో గాయపడ్డ ముస్లింల ఉనికి కోసం, హక్కుల పరిరక్షణ కోసం ముస్లిం కవితా ధోరణి ఆవిర్భవించింది. దళిత కవితా ధోరణిలో మైనార్టీలను భాగస్వాములుగా పేర్కొన్నా.. వీరి ప్రత్యేక అస్తిత్వం కోసం స్కైబాబా సంపాదకత్వంలో తొలి ముస్లింవాద కవితా సంపుటి ‘జల్ జిలా’ 1998లో ప్రచురించారు. ఈ సంపుటిలో సమాజ ప్రగతి కాంక్షతో, వారి హక్కుల పరిరక్షణ కోసం వజీర్ రహ్మాన్, ఇస్మాయిల్, స్మైల్, దేవీప్రియ, సుగమ్ బాబు వంటివారి కవితలున్నాయి. ముస్లిం స్త్రీవాద కవిత్వాన్ని ‘షాజహానా’ బురఖా నిరసనతో ప్రారంభించారు. యన్. రజియాబేగం ‘అల్లానే అన్నాడు’, షంషాద్ బేగం ‘పర్సనల్ లా’ వంటి కవితా ఖండికలు పాఠకుల్లో ఆలోచన రేకెత్తించాయి. ముస్లింవాద నవలలు, కథాసంపుటాలు ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నాయి. ఇటీవల అస్తిత్వవాదాల్లో భాగంగా బీసీ వాద, ప్రాంతీయ వాద కవితా ధోరణుల వంటివి రూపుదిద్దుకుంటున్నాయి. అనుభూతి వాద కవితా ధోరణి అనుభూతి కవిత్వం అంటే అనుభూతికి సంబంధించిందని, అనుభూతి కోసం ప్రాధాన్యతనిచ్చే కవిత్వమని అర్థం. కవి తాను పొందిన అనుభూతిని కవిత్వంలో చక్కగా ఆవిష్కరిస్తాడు. అనుభూతి కోసం అన్వేషిస్తూ దాన్ని సాహితీ జగత్తులో సాక్షాత్కరింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అది అనుభూతి కవిత్వం అవుతుంది. కవి ఏ అనుభవంతో చెప్పాలనుకున్నాడో అదే భావన పాఠకుడికి కలిగేలా చేయడమే ఈ కవిత్వ లక్ష్యం. అనుభూతి కవిత్వాన్ని గురించి ప్రముఖ విమర్శకులు ఆర్.యస్. సుదర్శనం ‘అనుభూతి కవిగా గుర్తు పట్టడానికి ప్రధానమైన లక్షణం కవిత చదివిన తర్వాత మిగిలేది ఒక సందేశం, ఒక భావనం, ఒక దృక్పథం కాకుండా కేవలం అనిర్దిష్టమైన అనుభూతి కావాలి. అది పోలికలు, పదాల అల్లిక, ఇంద్రియ సంవేదన రేకెత్తించే వర్ణనల్లో దేని ద్వారానైనా కావచ్చు. కానీ అందులోని నవ్యత హృదయానికి అనుభూతిగా మిగలాలి’ అని నిర్వచించారు. ఆచార్య జి.వి. సుబ్ర హ్మణ్యం, గుంటూరి శేషేంద్రశర్మ, మాదిరాజు రంగారావు, అద్దేపల్లి రామమోహనరావు వంటి వారు ఈ కవిత్వాన్ని ఒక శాఖగా గుర్తించారు. ఏ ఇజానికి కట్టుబడనని నిర్దిష్టంగా చెప్పిన ఆధునిక కవి తిలక్. ఈయన రచించిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిని అనుభూతవాద కవిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా విమర్శకులు పేర్కొన్నారు. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం అనుభూతి వాద కవులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మాదిరాజు రంగారావు, వేగుంట మోహన ప్రసాద్, ఇస్మాయిల్, అజంతా, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటివారు అనుభూతి వాద కవులు. ప్రముఖ అనుభూతివాద కవితా సంపుటాలు ఆర్. యస్. సుదర్శనం - నిశాంతం చలం - సుధ ఇస్మాయిల్ - చెట్టు నా ఆదర్శం, మృత్యు వృక్షం, చిలుకలు వాలిన చెట్టు, రాత్రివచ్చిన రహస్యపు వాన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ - అనుభూతి గీతాలు వేగుంట మోహనప్రసాద్ - చితి-చింత, రహస్తంత్రి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ- వెలుతురు పిట్టలు. మాదిరి ప్రశ్నలు 1. ‘పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని పంతులు గారన్నప్పుడే భయంవేసింది’ అని పేర్కొన్న కవయిత్రి? 1) ఓల్గా 2) సావిత్రి 3) జయప్రభ 4) హైమావతి 2. ‘బతకడానికి నానాచావులు చస్తున్న వాళ్లం, చావడానికి మా దగ్గరకు రాకండి’ అని పేర్కొన్న కవయిత్రి? 1) వాణీ రంగారావు 2) ఓల్గా 3) జయప్రభ 4) రాజేశ్వరి 3. ‘అయ్యో! పాలింకిపోవడానికున్నట్లు మనసింకి పోవడానికి మాత్రలుంటే ఎంత బాగుండు’ అన్నవారు? 1) సత్యవతి 2) రేవతీ దేవి 3) పాటిబండ్ల రజని 4) బి. పద్మావతి 4. ‘నవ్వే నక్షత్రంలా అమ్మకావాలి, నాన్న చేత తన్నులు తినని అమ్మకావాలి’ అని కోరుకున్న కవయిత్రి? 1) సుమతి 2) రేవతీ దేవి 3) నిర్మల 4) బి. పద్మావతి 5. ‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే, నాది బహి ష్కృత శ్వాస’ అని చెప్పిన కవి? 1) శిఖామణి 2) ఎండ్లూరి సుధాకర్ 3) మద్దూరి నగేష్‌బాబు 4) సుదర్శన రాజు 6. ‘కవిని నేను వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన దళిత కవిని నేను’ అని ప్రకటంచినవారు? 1) కత్తి పద్మారావు 2) ఇనాక్ 3) శిఖామణి 4) సతీష్‌చందర్ 7 . ‘పంచముడంటే ఐదో వేలు లేనివాడని మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు’ అని పేర్కొన్న కవి? 1) సతీష్ చందర్ 2) మద్దూరి నగేష్ బాబు 3) సిమ్మన్న 4) సుదర్శన రాజు 8. ‘రిజర్వేషనంటే సౌకర్యమో, సదుపాయమో కాదు తండ్రీ! అదొక పచ్చబొట్టు,అదొక ప్రాథమిక హక్కు’ అన్న కవి? 1) ఏకాంబరం 2) కత్తి పద్మారావు 3) మద్దూరి నగేష్‌బాబు 4) సతీష్ చందర్ 9. ‘అంటరానివసంతం’ నవలా రచయిత? 1) ఇనాక్ 2) జి. కళ్యాణరావు 3) చల్లపల్లి స్వరూపరాణి 4) స్వర్ణలత 10. ‘పువ్వులమ్మి అమ్మి పుప్పొడిని కోల్పోయిన వాళ్లం, గిన్నెలకు మాట్లేసి మాట్లేసి సొట్టబోయిన వాళ్లం’ అని ఆవేదనతో చెప్పిన కవి? 1) ఖాదర్ 2) అఫ్సర్ 3) జావేద్ 4) సయ్యద్ గఫార్ 11. ‘ఈ దేశ పటాన్ని చుట్టచుట్టి నీ కింద పెట్టుకోవడానికి అది నీ అయ్య జాగీరు కాదు’ అని నిరసించిన కవి? 1) గఫార్ 2) అఫ్సర్ 3) దిలావర్ 4) కరీముల్లా 12. ‘నేను కసాయిబును కాదు అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్థాన్ని దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ని’ అని చెప్పిన కవి? 1) ఇక్బాల్ చంద్ 2) అఫ్సర్ 3) దిలావర్ 4) గౌస్ మొహిద్దీన్ 13. మొదటి మైనారిటీ వాద నవల? 1) పుట్టుమచ్చ 2) వెండిమేఘం 3) నీలినీడలు 4) రేగడి విత్తులు 14. ‘అయిదు నెలలకే నాలుగు నెలల కడుపు చేసి తలాక్ ఇచ్చి వెళ్లగొడతాడని నాకేం తెలుసు, నా పర్సనల్ లాయే నాకిది చాలన్నప్పుడు ఇక దేనికి మొరపెట్టుకోవాలి’ అని సగటు ముస్లిం స్త్రీ ఆవేదనను చెప్పిన కవయిత్రి? 1) షాజహాన్ 2) రజియా సుల్తాన్ 3) షంషాద్ బేగం 4) మొహజబీన్ 15. ఈ దేశం కేలండర్ పై తారీఖులం అని ప్రకటించిన కవులు? 1) విప్లవ కవులు 2) దిగంబర కవులు 3) మైనార్టీ కవులు 4) పైగంబర కవులు 16. ‘పద్యాన్ని లోతుగా తవ్వుతున్నాడు కవి. టన్నుల కొద్దీ మన్నుకింద, టన్నుల కొద్దీ మనస్సు కింద ఇంత లోతుగా దీన్ని ఎవరు పాతేశారో తెలీదు’ అన్న కవి? 1) శ్రీకాంత శర్మ 2) శేషేంద్రశర్మ 3) ఇస్మాయిల్ 4) వై. శ్రీరాములు 17. ‘పరుగెత్తిన వాళ్ల పాదాల గుర్తులు రేపటికి బాటలు పరుస్తాయి’ అని పేర్కొన్న కవి? 1) ఇస్మాయిల్ 2) మోహన్ ప్రసాద్ 3) శ్రీకాంత శర్మ 4) రేవతీ దేవి సమాధానాలు 1) 2; 2) 2; 3) 3; 4) 4; 5) 2; 6) 3; 7) 1; 8) 3; 9) 2; 10) 4; 11) 2; 12) 3; 13) 2; 14) 3; 15) 2; 16) 3; 17) 3. -
చెన్నైలో అమ్మ క్యాంటీన్ల పరిశీలన
-
మురిపాల మిఠాయిలు
ఎప్పటిలాగే ఆ రోజు కూడా శ్రీకృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నుంచి వెన్నపెరుగులు దొంగిలించి తిన్నాడు... అక్కడితో కడుపు నిండలేదు... అమ్మని మీగడ పాలు అడిగితే తిడుతుందని భయం వేసి... ‘అమ్మా! పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావుగా, కడివెడు పాలు ఇవ్వవూ’ అని గోముగా అడిగాడు. అవి తాగినా కడుపు నిండలేదు... ‘అమ్మా! పాలుపెరుగులతో ఏవైనా కొత్త మిఠాయిలు చేసిపెట్టవూ’ అన్నాడు మురిపెంగా... చిన్నికృష్ణుని మాటలకు యశోద ముచ్చటపడింది. అంతే క్షణంలో కొత్త కొత్త వంటలు చేసింది... కన్నయ్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమగా తినిపించింది... పనీర్ ఖీర్ కావలసినవి: పాలు - ఒకటిన్నర కప్పులు; పనీర్ తురుము - అర కప్పు; కండెన్స్డ్ మిల్స్ - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఏలకుల పొడి - అర టేబుల్ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా) తయారి: పెద్ద పాత్రలో పాలు, పనీర్ తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతూ, పాలను మరిగించాలి కండెన్స్డ్ మిల్క్ జత చే సి ఐదారు నిమిషాలు ఉంచి దించేయాలి ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తీసేయాలి పిస్తా తరుగు పైన చల్లి చల్లగా అందించాలి. చాకో స్వీట్ కావలసినవి: డార్క్ చాకొలేట్ తురుము - 75 గ్రా; పల్లీలు + బాదం పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు; తురిమిన పనీర్ - 150 గ్రా (కాటేజ్ చీజ్); కాఫీ పొడి - అర టీ స్పూను; కోకో పొడి - టీ స్పూను; పంచదార పొడి - 75 గ్రా.; బాదం పప్పులు - 8; చాకో చిప్స్ - అలంకరిచండానికి తగినన్ని తయారీ: డార్క్ చాకొలేట్‌ను అవెన్‌లో ఒక నిమిషం ఉంచి కరిగించి బయటకు తీసి స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చాకొలేట్ మౌల్డ్‌లో పల్చగా ఒక పొరలా పోయాలి బాణలిలో పల్లీలు, బాదంపప్పులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి ముక్కలుముక్కలుగా వచ్చేలా చేయాలి పనీర్‌ను పొడిపొడిలా చేసి రెండు నిమిషాలపాటు చేతితో మెత్తగా చేయాలి. పంచదార, కాఫీ పొడి, కోకో పొడి, పల్లీలు + బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా తయారుచేసి, చాకొలేట్ టార్ట్ మౌల్డ్స్‌లో ఉంచి, సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి చాకో చిప్స్‌తో అలంకరించి చల్లగా అందచేయాలి. మావా కాజు శాండ్విచ్ కావలసినవి: మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా తయారి: ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి. స్ట్రాబెర్రీ శ్రీఖండ్ కావలసినవి: నీరు పూర్తిగా తీసేసిన పెరుగు - కప్పు; మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు - అర కప్పు; క్రీమ్ - పావు కప్పు; పంచదార - 2 టీ స్పూన్లు; స్ట్రాబెర్రీలు - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో ముందుగా పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి క్రీమ్, మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు జత చేసి మరోమారు కలిపి, మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. (నాలుగు కప్పుల పెరుగును మూట గడితే ఒక కప్పు పెరుగు తయారవుతుంది) మలై పేడా కావలసినవి: చిక్కటి పాలు - రెండున్నర కప్పులు; పల్చటి పాలు - రెండున్నర కప్పులు; కుంకుమ పువ్వు - కొద్దిగా; నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; పంచదార - 4 టీస్పూన్లు; పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారీ: నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి. సేకరణ: డా ॥వైజయంతి -
మరో ‘అమ్మ’ పథకం
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే పాలనతోనేగాక, ‘అమ్మ పథకాల’ పేరుతో మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు జయలలిత ప్రభుత్వం మరో అమ్మ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు రూ.1000 విలువైన ‘అమ్మ’ బేబీకేర్ కిట్‌ను బహుమతిగా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం నాటి అసెంబ్లీలో ప్రకటించారు. నిరక్షరాస్యులు, పేద ప్రజలుకొందరు ఇంటి వద్దనే మంత్రసాని పర్యవేక్షణలో ప్రసవాలను సాగిస్తుంటారు. ఈ విధానం ఎంతో ప్రమాదకరమని తెలిసినా ఆస్పత్రి ప్రసవాలకు నేటికీ మొగ్గుచూపడం లేదు. సాధారణ ప్రసవాన్ని సైతం డాక్టర్లు సిజేరియన్గా మార్చేస్తారనే దురభిప్రాయం కొందరి ప్రజల్లో నాటుకుని పోవడమే ఇందుకు ప్రధాన కారణమని భావించవచ్చు. ఆస్పత్రి ప్రసవాలపై ప్రభుత్వాలు ఎంతగానో ప్రచారం చేసినా ఇంకా ఎంతో కొంత శాతం ఇళ్లవద్దనే సాగుతున్నాయి. ప్రజల్లో పూర్తిస్థాయి మార్పు తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వాస్పత్రుల్లో ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవిస్తే తల్లీ, బిడ్డలకు అవసరమైన 16 రకాల వస్తువులను ఉచితంగా పొందవచ్చని సీఎం తెలిపారు. ఈ వస్తువులన్నీ ప్రధానంగా పసిబిడ్డకు అవసరమ్యే వస్తువులతో అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. పసవానంతరం తల్లికి సౌభాగ్య లేహ్యం, బిడ్డకు అవసరమయ్యే టవల్, జీరోసైజ్ దుస్తులు, పరుపు, వల, నాప్కిన్స్,100 మిల్లీలీటర్ల నూనెడబ్బా, 60 మిల్లీ షాంపు ప్యాకెట్లు, సోప్ బాక్స్, చెప్పులు, నెరుుల్ కటర్, బిడ్డను ఆడించేందుకు మెుత్తని బొమ్మ, చేతిని శుభ్రం చేసుకునే ఆయిల్, ఇలా రూ.1000 విలువ చేసే 16 వస్తువులు ఈ కిట్‌లో పొందుపరుస్తారు. దీంతోపాటు ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రూ.2 70 కోట్లతో అత్యవసర చికిత్సా విభాగాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల సహాయంతో డయాలసిస్ సౌకర్యాన్ని సైతం ప్రవేశపెడుతున్నట్లు ఆమె చెప్పారు. అమ్మ క్యాంటీన్లలో అదనపు సౌకర్యాలు అమ్మ క్యాంటీన్లకు అనుబంధంగా అదనపు సౌకర్యాలను కల్పించనున్నారు. అమ్మ క్యాంటీన్ల సముదాయంలో విశ్రాంతి గృహాలను సైతం నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. చెన్నైతోపాటూ ఐదు జిల్లాల్లో ఈపథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రధానంగా బేల్దారి కూలీలను దృష్టిలో ఉంచుకుని ఈ విశ్రాంతి గృహాలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. రూ.3.87 కోట్లతో 106 దేవాలయాల్లో అన్నదాన పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, రూ.50 కోట్లతో తిరువన్నామలై, రామేశ్వరంలలోని దేవాలయాల్లో భక్తులకు వసతి గృహాలను నిర్మించనున్నట్లు ఆమె చెప్పారు. -
16 ఐటమ్స్‌తో అమ్మా బేబీ కేర్ కిట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. నవజాత శిశువులకు.... అమ్మా బేబీ కేర్ కిట్ పేరుతో ముఖ్యమంత్రి జయలలిత మరో పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వానికి రూ.67 కోట్లు ఖర్చు కానుంది. ఈ విషయాన్ని జయలలిత మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు ఈ పథకం వర్తిస్తుంది. వెయ్యి రూపాయల విలువ చేసే ఈ కిట్‌లో పుట్టిన బిడ్డకు కావల్సిన 16 వస్తువులు ఉంటాయి. ఇందులో టవల్, బేబీ డ్రస్, బేబీ బెడ్, ప్రొటక్షన్ నెట్, న్యాప్కిన్, బేబీ ఆయిల్, షాంపు, సాచెట్, సోప్ బాక్స్, సోప్, నెయిల్ క్లిప్పర్, టాయ్, ఓ గిలక్కాయ్తో పాటు తల్లికి హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో పాటు సోప్ ఉంటుంది. కాగా జయలలితకు తమిళనాడు ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు ‘అమ్మ’. ఈ పేరుతో ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఫార్మసీలు, అమ్మ అముదం స్టోర్లు, అమ్మ వాటర్ బాటిళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు సగటు జీవి ఏకైక వినోద సాధనమైన సినిమాను నిరుపేదలకు సైతం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో వారికి అందుబాటు ధరల్లో అమ్మ థియేటర్లను ప్రవేశపెడుతోంది. అలాగే నాణ్యమైన, సరసమైన ధరలకు రైతులకు 'అమ్మ సీడ్స్' పేరుతో విత్తనాలను అందుబాటులోకి తేనుంది. -
ఇక ‘అమ్మ అముదం’
- రాష్ట్రంలో 300 అమ్మ రేషన్ షాపులు - వంద ధాన్యం కొనుగోలు కేంద్రాలు - వర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు - అసెంబ్లీలో జయలలిత వెల్లడి చెన్నై, సాక్షి ప్రతినిధి: చౌకధరకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘అమ్మ అముదం’ దుకాణాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, సహకార సంఘాల పరిధిలో ఇప్పటికే 137 దుకాణాలు సేవలు అందిస్తున్నాయని అన్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిసేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా రూ.30.17 కోట్ల వ్యయంతో అమ్మ అముదం షాపులను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. సుమారు 23 రకాల ఆహార ధాన్యాలను వీటి ద్వారా విక్రయించనున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అముదం, చింతామణి పేర్లతో చౌకధర దుకాణాలు సేవలందిస్తున్నాయి. ఇకపై వాటి స్థానంలో అమ్మ అముదం పేరుతో నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే రూ.16 కోట్లతో తవుడు నూనె కర్మాగారాన్ని సైతం నెలకొల్పనున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయదారులకు న్యాయమైన వడ్డీతో రుణాలను అందించేందుకు రూ.12.54 కోట్లను సహకార సంఘాలకు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. అంతేగాక రాష్ట్రంలో 4,530 సహకార సంఘాల భవనాలను రూ.6.90 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్లడంలో భాగంగా రూ.9 కోట్లతో షోలింగనల్లూరులో ప్రత్యేక శిక్షణా కేంద్రాలను నెలకొల్పనున్నట్లు జయ చెప్పారు. అంతేగాక రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లోని 1112 అధ్యాపకుల ఖాళీలను ఈ ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 84,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన 39 గిడ్డంగులను రూ.112.57 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పట్టణాలకు, నగరాలకు తమ దిగుబడులను తరలించే రైతుల కష్టాన్ని నివారించేందుకు రూ.35 కోట్లతో వంద కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. వీటిలో 75 కేంద్రాలు కేవలం వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని ఆమె చెప్పారు. వాకౌట్: సమ్మెలో భాగంగా పడవలకు తెల్లజెండాలను ఎగురవేసి ఈనెల 2వ తేదీన కచ్చదీవుల వరకు తమిళ జాలర్లు నిరసన ప్రదర్శన చేస్తున్న అంశంపై మాట్లాడేందుకు మనిదనేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) సభ్యులు జవహరిల్లా కోరగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
పట్టెడు అన్నం పెట్టలేక..
గుర్రంపోడు :అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపునిచ్చే వ్యక్తి నాన్న. బతుకు సమరంలో వె న్నంటూ ఉంటూ భరోసానిచ్చే దైవం. అలాంటి నాన్న అనారోగ్యానికి గురైతే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమారులు కనికరం లేకుండా వీధినపడేశారు. ఆస్తిపాస్తులు పంచుకున్న వారికి నాన్న పోషన భారమై బతికుండానే కాటిక సమీపంలో పడవేసిన సంఘటన గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రా మంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఆమలూరుకు చెందిన బొమ్ము మల్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం నల్లగొండకు వలసవెళ్లింది. మల్లయ్యకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమారుడు కృష్ణయ్య తాపిమేస్త్రిగా, చిన్న కుమారుడు వెంకన్న ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న 10 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. ఇల్లు కూలిపోయింది. భార్య 15ఏళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో నల్లగొండలో కొడుకుల వద్దే ఉంటూ ప్రైవేట్ సంస్థల్లో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమం లో రెండేళ్ల క్రితం మల్లయ్య కాలికి గాయం కావడం, అప్పటికే షుగర్ వ్యాధి ఉండడం, మానసిక స్థితిలోపించి మంచానపడ్డాడు. దీంతో తండ్రిని పోషించే విషయంలో ఇద్దరు కుమారుల మధ్య గొడవ మొదలైంది. ఏడాదిగా తండ్రికి వైద్యం అందిస్తూ పోషిస్తున్న చిన్న కుమారుడు వెంకన్న తండ్రిని తీసుకవెళ్లమని తన సోదరుడు కృష్ణయ్యకు ఇటీవల చెప్పాడు. కానీ తాను పో షించలేనని పేర్కొనడంతో వెంకన్న శుక్రవారం మల్లయ్యను ఆమలూరుకు తీసుకువచ్చి గ్రామ శివారులో శ్మశానానికి ఆనుకుని ఉన్న సొంత భూమిలో గుడారం వేసి అందులో ఉంచి కులపెద్దలను ఆశ్రయించాడు. ఆదివారం పెద్ద కుమారుడు కృష్ణయ్యను ఫోన్లో సంప్రదించగా తండ్రితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నట్లు గ్రామస్తులు, కులపెద్దలు తెలిపా రు. దీంతో చేసేదేమిలేక తిండి తిప్పలు లేక పస్తులుం టున్న బొమ్ము మల్లయ్యకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మరో అమ్మ పథకం
నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా అమ్మ పేరుతో రాష్ట్రంలో మరో పథకం వెలిసింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ‘అమ్మ ఉపాధి కల్పన-శిక్షణ’ పథకం కింద అవకాశాలు క ల్పించనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి 31 నాటి సమాచారం ప్రకారం రాష్ట్రంలో 9.68లక్షల చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక విధానంలో దేశానికే మార్గదర్శకంగా నిలవాలనే ఆకాంక్షతో ఆయా పరిశ్రమలకు అవసరమైన వృత్తినిపుణులను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అమ్మ... పథకం ద్వారా 18-25 ఏళ్ల నిరుద్యోగులను ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఎంపిక చేసి పరిశ్రమల్లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. శిక్షణా కాలంలో ఆయా పరిశ్రమలు నెలకు రూ.5 వేలు భత్యం చెల్లించేలా చూస్తామని తెలిపారు. ఈ పథకం కింద 25 వేల మందికి శిక్షణ నిస్తుండగా వీరిలో 30 శాతం మహిళలుంటారని చెప్పారు. ఈ పధకం అమలుకు రూ.32.50 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారు పరిశ్రమల్లో శాశ్వత ఉద్యోగాలు పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆరోగ్య సంరక్షణా చర్యల్లో భాగంగా రూ.130 కోట్లతో కాంచీపురం జిల్లా చెంగల్పట్టులో హెల్త్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 330 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ హెల్త్సిటీని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రామనాథపురం జిల్లా కడలాడిలోని 500 ఎకరాల ప్రభుత్వ భూమిలో సముద్రపునీటిని మంచినీటిగా శుద్ధిచేసే యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ యూనిట్ కోసం 50 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను అక్కడే నెలకొల్పుతామని పేర్కొన్నారు. తిరువళ్లూరు జిల్లాలో రెండురోజులుగా జరుగుతున్న ఘర్షణలను అదుపులోకి తెచ్చేందుకు గ్రామాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 54,439 అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయండి: ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకు అవకాశం లేకుండా డీఎంకే సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ ఇతర ప్రతిపక్షాలు గురువారం స్పీకర్ ధనపాల్కు వినతి పత్రం సమర్పించాయి. డీఎండీకే, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, వామపక్షాల సభ్యులు స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలుసుకుని విన్నవించారు. -
అమ్మ... అమ్మ... అమ్మ... అమ్మ
అమ్మ అమ్మా మాయమ్మ అమ్మంటేనే నీవమ్మా.... అంటూ తమిళ తంబిలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు, పురచ్చితలైవి కుమారి జయలలితను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాది అత్యంత తక్కువ ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పొంగల్ అంటూ ఆమె ప్రారంభించిన 'అమ్మ క్యాంటీన్' పథకం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జయలలిత అదే బాటలో పయనిస్తూ...'అమ్మ కూరగాయల మార్కెట్', 'అమ్మ మినరల్ వాటర్' పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆ పథకాలు తమిళనాట ప్రజలను మరింత దగ్గర చేసింది. దీంతో జయలలిత ఇప్పుడు అమ్మ మెడికల్ షాపులను ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ఈ 'అమ్మ కాన్సెఫ్ట్'తో తమిళనాడు ప్రజల మనసులు 'చోరీ' చేసింది. అమ్మ కాంటీన్ ప్రారంభంతోనే జయలలిత అదృష్టం సునామీలా సుడి తిరిగింది. అందుకే తమిళనాట ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం అవతరించిన తర్వాత ఒక పార్టీ ఇన్ని లోక్‌సభ స్థానాలను జయలలిత కైవసం ఇదే మొదటిసారి. అంత 'అమ్మ' చలవే అని పలువురు అభిప్రాయపడ్డుతున్నారు. అందుకే అమ్మకు తమిళ ప్రజలు ఓట్లు గుద్ది పారేశారు. దేశవ్యాప్తంగా మోడీ హావా నడుస్తున్నా... బీజేపీతో పాటు ఏఐఏడీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ డీఎంకే సోదిలో లేకుండా పోయాయి. ఇప్పుడు ఇంకే అమ్మ పథకం వస్తుందో అని తమిళ నాట ప్రజలు అతృతతో ఎదురు చుస్తున్నారు. అమ్మ ఇలా 'అమ్మ' కాన్సెఫ్ట్‌తో ముందుకు దూసుకుపోతే వచ్చే రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఏఐఏడీఏంకే విజయ ఢంకా మోగించడం ఖాయమని తమిళనాట తీవ్రంగా చర్చ జరుగుతుంది. -
తమిళనాడులో ‘అమ్మ’ ఉప్పు
చెన్నై: తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ పేరుతో మరో నిత్యావసర వస్తువును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెట్ కన్నా తక్కువ రేటులో మూడు రకాలైన ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పును ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ బ్రాండులో ‘లో సోడియం’, ‘డబుల్ ఫోర్టిఫైడ్’, ‘రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ సాల్ట్’ రకాల ఉప్పు బహిరంగ మార్కెట్లో లభ్యమవుతుంది. వీటి రేటును వరుసగా రూ. 21, రూ. 14, రూ.10గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే రకాల ఉప్పును వివిధ కంపెనీలు వరుసగా రూ. 25, రూ. 21, రూ.14కు అమ్ముతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇక ఈ ఉప్పు తయారీ కార్యక్రమాన్ని తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ చేపట్టింది. ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం ‘అమ్మ’ బ్రాండ్‌తో కేంటిన్లు, మినరల్ వాటర్ బాటిళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ అధినేత్రి జయలలితను ‘అమ్మ’ అని సంబోధిస్తారనే సంగతి విదితమే. -
మార్కెట్లోకి ‘అమ్మ’ ఉప్పు
సాక్షి, చెన్నై:రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో అమ్మ ఉప్పు బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. మూడు రకాల ప్యాకెట్లలో వీటిని విక్రయించనున్నారు. కిలో ధర రూ.10, 14, 21గా నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడో సారి పగ్గాలు చేపట్టిన జయలలిత సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజా హితాన్ని కాంక్షిస్తూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఓ వైపు ఉచిత పథకాలు, మరో వైపు అభివృద్ధి పనులు రాష్ట్రంలో వేగవంతం అయ్యాయి. పేదలను దృష్టిలో ఉంచుకుని అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్స్, కూరగాయల దుకాణాల ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అమాంతంగా పెరుగుతూ వస్తున్న ఉప్పు ధరలకు క ళ్లెం వేస్తూ, ప్రైవేటు ధరల నియంత్రణ లక్ష్యంగా ఉప్పు విక్రయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోటో: 32: ఫోటో: 33: సీబీసీఐడీ కార్యాలయం ప్రారంభోత్సవం దృష్టి కేంద్రీకరించింది. రామనాధపురంలోని ప్రభుత్వ ఉప్పు ఉత్పత్తి కేంద్రం ద్వారా సీఎం జయలలిత ముఖ చిత్రంతో అమ్మ పేరిట ప్యాకెట్ల రూపంలో వీటిని మార్కెట్లోకి విడుదల చేశారు. మార్కెట్లోకి విడుదల : సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో మూడు రకాల ప్యాకెట్లను సీఎం జయలలిత మార్కెట్లోకి విడుదల చేశారు. తొలి ప్యాకెట్‌ను జయలలిత చేతుల మీదుగా మంత్రి తంగమణి అందుకున్నారు. తొలి విడతగా ఈ ప్యాకెట్లు అముదం, సహకార దుకాణాల్లో విక్రయించనున్నారు. డీలర్ల నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాల్లోను వీటిని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కిలో ఐరన్ - అయోడియం ఉప్పు ధర రూ.14గా, శుద్ధీకరించిన తక్కువ మోతాదు అయోడియం ఉప్పు ప్యాకెట్ ధర రూ.21గా, సోడియం ఉప్పు ధర రూ.10గా నిర్ణయించారు. ప్రజల ఆరోగ్య క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఉప్పు ప్యాకెట్లను రూపొందించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వృత్తి శిక్షణ: మార్కెట్లోకి ఉప్పు విడుదల అనంతరం సిప్ కాట్లలో శిక్షణ కేంద్రాలను సీఎం జయలలిత ప్రారంభించారు. తిరునల్వేలి, తిరువళ్లూరు, కాంచీపురం సిప్ కాట్లలో వృత్తి శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కాంచీపురంలోని ఒరగడం సిప్ కాట్లో 2.52 ఎకరాల స్థలంలో రూ. కోటి 80 లక్షలతో శిక్షణా కేంద్రం పనులను ముగించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన జయలలిత, సిప్ కాట్లకు స్థలాలను కేటాయించిన కుటుంబాల్లో ఉన్న యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 1200 మంది శిక్షణ పొందడంతోపాటుగా, వారికి కావాల్సిన అన్ని రకాల వసతులను ఈ కేంద్రంలో కల్పించి ఉన్నారు. సీబీసీఐడీ భవనం ప్రారంభం : ఎగ్మూర్‌లో సీబీసీఐడీ విభాగం కోసం రూ.పది కోట్ల వ్యయంతో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. స్వయంగా ఎగ్మూర్‌కు వెళ్లి ఈ భవనాన్ని సీఎం జయలలిత ప్రారంభించారు. కన్యాకుమారి, సేలం, తిరునల్వేలి, దిండుగల్, తంజావూరు, కాంచీపురం, విల్లుపురం, విరుదునగర్, కడలూరు, తిరుచ్చిల్లో రూ.65,58,73,000తో పోలీసు కుటుంబాల కోసం నిర్మించిన 873 గృహాలను ప్రారంభించారు. సేలం, కోవిల్ పట్టి, తిరునల్వేలి, తెన్ కాశి, కన్యాకుమారి, తూత్తుకుడి, తేని, దిండుగల్, కోవిల్ పట్టి, మదురై, పెరుంగుడి తదితర ప్రాంతాల్లో రూ. 16 కోట్ల ఆరు లక్షల 37 వేలతో 34 పోలీసు స్టేషన్లకు నిర్మించిన పక్కా భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పోలీసు విభాగానికి సంబంధించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలతో పాటుగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పు కొను.... 'అమ్మా' అను
ఉప్పు తిన్న విశ్వాసం చాలా గట్టిదంటారు. 'మీ ఉప్పు తిన్నాను. ఇక మీ వాడిని' అని అనడం చాలా పాత మాట. తమిళ నాడు ముఖ్యమంత్రి ఉప్పు తినిపించి మరీ ఓటర్ల విశ్వాసం పొందాలనుకుంటున్నారు. అందుకే ఆమె బుధవారం నుంచి తమిళనాట ప్రజలకు చవక ధరకు ఉప్పును అందించబోతున్నారు. ఈ ఉప్పుకు 'అమ్మ ఉప్పు' అని పేరు పెట్టారామె. ఇప్పటికే అమ్మ ఫుడ్ అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది. ఇప్పుడు వీటికి అమ్మ ఉప్పు జత కలిసింది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరుకుతుంది. తమిళ నాట ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అంటారు. కాబట్టి ఈ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. ఇలా ఈ ఉప్పు ప్యాకెట్ తో కార్పొరేషన్ కు స్వామికార్యం, అధికార అన్నా డీఎంకెకి స్వకార్యం సిద్ధిస్తున్నాయి. -
తమిళనాడులో ’అమ్మ సాల్ట్’ పధకం
-
‘అమ్మ’ ఉప్పు
సాక్షి, చెన్నై: పేదలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘అమ్మ’ పేరిట ఉప్పు విక్రయాలకు శ్రీకారంచుట్టింది. మూడు రకాల అమ్మ సాల్ట్ ప్యాకెట్లను బుధవారం నుంచి మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక సుపరి పాలనే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పేదవర్గాల్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల కోసం ల్యాప్ టాప్‌లు, సైకిళ్లు, ఉచిత పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూ, పాదరక్షల్ని అందిస్తోంది. నగరాల్లోని పేద కార్మికులు, చిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో కడుపు నింపే విధంగా అమ్మ క్యాంటిన్లను కొలువు దీర్చింది. అలాగే రూ.పదికే అమ్మ మినరల్ వాటర్ బాటిళ్లు, చౌక ధరకే కూరగాయల విక్రయం.. ఇలా అనేక పథకాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉప్పు ఉత్పత్తి మీద దృష్టి పెట్టింది. అమ్మ సాల్ట్ : మార్కెట్లలో ఉప్పు ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఉప్పు విక్రయాలకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో రామనాథపురంలో ఉప్పు ఉత్పత్తి నిలయం, పరిశ్రమను ఇటీవల నెలకొల్పారు. ఇక్కడ ముందుగా నిర్ణయించిన మేరకు వంద టన్నుల ఉప్పు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంతో ఇక ప్యాకెట్ల ద్వారా మర్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రకాల ప్యాకెట్లలో ఉప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఐరన్ - ఆయోడియం, శుద్ధీకరించిన ఆయోడియం, సోడియం ఉప్పులను మూడు రకాల ధరలతో విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్యాకెట్లకు అమ్మ పేరును నామకరణం చేశారు. సీఎం జయలలిత ముఖ చిత్రంతో ఆకర్షణీయ ప్యాకింగ్‌తో సిద్ధం చేసిన ఈ ఉప్పు బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. చెన్నైలో ఉదయం జరిగే కార్యక్రమంలో ఈ ప్యాకెట్లను సీఎం జయలలిత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మొదటి రకం రూ.పది, రెండో రకం రూ.16, మూడో రకం ఉప్పు రూ.21గా ధర నిర్ణయించినట్టు సమాచారం. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అముదం దుకాణాలు, సహకార దుకాణాల్లో లభిస్తాయి. అలాగే, కాస్త ఎక్కువ ధరతో బయటి దుకాణాల ద్వారా వీటిని విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉప్పు విక్రయాలకు శ్రీకారం చుట్టడంతో ఇక ప్రైవేటు ఉప్పు మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు సంస్థల్ని నమ్ముకుని ఉప్పు ఉత్పత్తిలో ఉన్న తూత్తుకుడి, కడలూరు, నాగపట్నం పరిసరాల్లోని ఉత్పత్తిదారుల్లో ఆందోళన నెలకొంది. సీబీసీఐడీకి పక్కా భవనం రాష్ట్ర సీబీసీఐడీకి పక్కా భవనం సిద్ధమైంది. గిండిలో ఇది వరకు సీబీసీఐడీ విభాగ ప్రధాన కార్యాలయం ఉండేది. అయితే ఈ విభాగానికి ప్రత్యేకంగా ఓ భవనం నిర్మించేందుకు ఇటీవల రాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. ఎగ్మూర్‌లో ఉన్న పాత కమిషనరేట్ ఆవరణలో రూ.పది కోట్ల వ్యయంతో ఐదు అంతస్తులతో భవనాన్ని ఆగమేఘాలపై నిర్మించారు. అన్ని రకాల వసతులు, హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని బుధవారం సీఎం జయలలిత ప్రారంభించబోతున్నారు. మంగళవారం ఈ భవనంలో చేసిన ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ రామానుజం, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌లు పరిశీలించారు. -
ఇక మార్కెట్ లోకి 'అమ్మ ఉప్పు'
చెన్నై: దిగువ తరగతి ప్రజలకు తక్కువ ధరలకే ఆహారాన్ని అందించే పథకంలో భాగంగా అమ్మ క్యాంటిన్ లను ప్రారంభించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత .. మరో కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. మంగళవారం తమిళనాడు సాల్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ ప్రోడక్ట్ కు 'అమ్మ సాల్ట్' నామకరణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అమ్మ సాల్ట్ లో మూడు రకాల ఉప్పును మార్కెట్ లోకి విడుదల చేశారు. డబుల్ ఫార్టీఫైడ్, రిఫైన్ డ్ ఫ్రీ ఐయోడైజ్డ్, తక్కువ సోడియం రకాలతో అందుబాటులోకి తెచ్చారు. అమ్మ క్యాంటిన్, అమ్మ వాటర్ తర్వాత అమ్మ ఉప్పును సంక్షేమ పథకాల్లో జయలలిత చేర్చారు. -
అమ్మకు సలాం
-
అమ్మ... ఎక్కడైనా అమ్మే
క్రిస్మస్, వాలెంటైన్స్ డే తర్వాత మాతృదినోత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారాన్ని మాతృదినోత్సవంగా ఎన్నో దేశాలు జరుపుకొంటున్నాయి. మాతృదినోత్సవాన్ని జరుపుకునే దేశాలు... వివరాలు... అమెరికా: అమెరికాలో ఆ రోజున అందరూ తమ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉత్సవాలు జరుపుకొంటారు. అమ్మ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు చేస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. ప్రతి ఇంటిలోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఇంటింటా పండగ వాతావరణం నిండిపోతుంది. ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో కూడా మాతృదినోత్సవం ఘనంగా జరుపుతారు. కెనడా: కెనడా దేశంలో మాతృదినోత్సవం నాడు గులాబీరంగు దుస్తులు ధరిస్తారు. తల్లికి బహుమతులు ఇస్తారు. న్యూజిలాండ్: న్యూజిలాండ్ దేశంలో మాతృదినోత్సవాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహిస్తారు. బహుమతులతో తమ పిల్లలను గౌరవించుకుంటారు. అమ్మమ్మలు, నానమ్మలను కూడా ఆ రోజున గౌరవిస్తారు. కేక్‌లు కోస్తారు. ఆ రోజున తల్లులకు విశ్రాంతి ఇచ్చి, ఇంటి పనులన్నీ పిల్లలే చేస్తారు. ఐర్లాండు: ఐర్లాండులో మాతృదినోత్సవాన్ని మే నెలలో వచ్చే నాలుగో ఆదివారం, మెక్సికోలో మే నెల పదో తేదీన మాతృదినోత్సవం జరుపుకొంటారు. అన్ని పాఠశాలలలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. భారతదేశం: మన భారతదేశం విషయానికి వస్తే, తల్లిని పూజించే సంప్రదాయం యుగయుగాలుగా ఉంది. రామాయణ, భారత, భాగవతాలలోనూ మనకు తల్లిని గౌరవించే తీరు కనబడుతుంది. ఈ యుగంలోనూ ఎందరో సామ్రాజ్య అధినేతలు తమ తల్లులను ప్రతి సందర్భంలోనూ పూజించేవారున్నారు. దండయాత్రకు వెళ్ళినా, విజయం సాధించి వచ్చినా ముందుగా తల్లినీ, ఆ తర్వాత దైవాన్నీ పూజించేవారు. ఇక ఆధునిక యుగంలో మాతృదినోత్సవం సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఆరంభమైందని చెప్పవచ్చు. ప్రతి పండగ సమయంలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ తల్లికి పాదాభివందనం చేసే పద్ధతి, ఆచారం మనకు ఉంది. అవన్నీ ఉండగా, ప్రత్యేకించి ఈ మాతృదినోత్సవం చేసుకోవడాన్ని పాశ్చాత్య దేశాల సంస్కృతిగా చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు.ఏది ఏమైనా, ఏ దేశంలోనైనా భవిష్యత్తుకు బాటలు వేసే చిన్నారులను తన కడుపులో నవమాసాలు మోసి క్షేమంగా ఈ ప్రపంచానికి అందిస్తున్న అమ్మకు శతకోటి వందనాలు! -
అమ్మ అంత్యక్రియల్లోనూ అదే తీరు
బంగారప్ప తనయుల గొడవ అనుచరులతో సహా బాహాబాహీకి యత్నం సన్నిహితుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఇంతే శివమొగ్గ, న్యూస్‌లైన్ : రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుటుంబ కలహం మరో సారి రచ్చకెక్కింది. బంగారప్ప సతీమణి శకుంతలమ్మ అంత్యక్రియల సందర్భంగా బుధవారం ఆమె తనయులు కుమార, మధు బంగారప్పలు దాదాపు బాహాబాహీకి సిద్ధపడగా, వారి అనుచరులు కూడా తమ నాయకుల బాటలోనే నడిచారు. బంగారప్ప కుటుంబ సన్నిహితులు, శ్రేయోభిలాషులు జోక్యం చేసుకుని గొడవ మరింత పెద్దది కాకుండా నివారించగలిగారు. బంగారప్ప అంత్యక్రియల్లోనూ ఆయన కుమారులిద్దరు గొడవ పడిన సంగతి తెలిసిందే. శకుంతలమ్మ పార్థివ శరీరాన్ని బుధవారం అంతిమ దర్శనం కోసం ఉంచినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. అంత్య సంస్కారాలను నిర్వహిస్తున్న సందర్భంలో మధు బంగారప్పతో పాటు సోదరి గీతా శివ రాజ్ కుమార్, కుటుంబ సభ్యులు అనిత, సుజాతలు ఓ పక్క నిలబడి ఉన్నారు. కుమార బంగారప్ప మరో వైపు నిల్చుని శ్రాద్ధ కర్మలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఆదిలోనే గొడవ ఉదయం కుమార బంగారప్ప తన కుటుంబ సభ్యులతో సొరబ తాలూకా కుబటూరు నివాసానికి వచ్చిన సమయంలో మధుతో మాటా.. మాటా పెరిగింది. గీతా సైతం కుమార వెంట వచ్చిన బంధువుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మధు, కుమారల వర్గీయులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిద్దరినీ చెరో వైపు తీసుకెళ్లారు. వారి మద్దతుదారులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఇద్దరూ అంత్య సంస్కారాలు నిర్వహించాలని కుటుంబ శ్రేయోభిలాషులు సూచించడంతో గొడవ సద్దుమణిగింది. అంతిమ దర్శనం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం కన్ను మూసిన శకుంతలమ్మను వాహనంలో కుబటూరుకు బుధవారం అర్ధరాత్రి తీసుకు వచ్చారు. బంగారప్ప నివాసంలో పార్థివ శరీరాన్ని ఉంచి తుది దర్శనానికి అవకాశం కల్పించారు. అనంతరం వాహనంలో భౌతిక కాయాన్ని సొరబ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానానికి తరలించి ప్రజల దర్శనానికి అవకాశం కల్పించారు. బంగారప్ప అంతిమ సంస్కారాలను నిర్వహించిన స్థలం వద్దే శకుంతలమ్మ చితికి నిప్పంటించారు. సాయంత్రానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
రూపాయికే ఇడ్లీ
బెంగళూరులో అమ్మ క్యాంటీన్ సాక్షి, బెంగళూరు : స్థానిక కళాసిపాళ్యలోని నాగేశ్వరగార్డన్‌లో ‘అమ్మమెస్’ను అన్నా డీఎంకే రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే.ఆర్ కృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ రూపాయికి ఒక ఇడ్లీ చొప్పున అమ్మమెస్లో విక్రయిస్తారు. నెల రోజుల తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, రాష్ట్రంలోని పేదలకు పౌష్టికాహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చౌకధరల క్యాంటీన్లను ప్రారంభించాలని కృష్ణరాజు పేర్కొన్నారు. ఈ విషయమై ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినితిపత్రం అందిస్తామన్నారు. కాగా, తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మమెస్లు దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్
న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్' దేశ రాజధానిలో అందుబాటుకి వచ్చింది. తమిళనాడు భవన్లో 'అమ్మ క్యాంటిన్'లో ఒక్కరూపాయికే ఇడ్లీలు లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. పొంగల్ పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. దీనితో పాటు లెమన్ రైస్ , సాంబార్ రైస్ అయిదు రూపాయలకు దొరుకుతోంది. దాంతో ఢిల్లీ వాసులు అమ్మ క్యాంటిన్లో పొంగల్ వేడుకలు జరుపుకుంటున్నారు. అమ్మ క్యాంటిన్ ధరలు ఆకర్షించటంతో...వారు పెద్ద ఎత్తున తమిళనాడు భవన్‌కు చేరుకుని పొంగల్, ఇడ్లీ రుచి చూస్తున్నారు. కాగా కేవలం మూడు రోజుల మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
అమ్మలా ఆదుకుంటూ...
గుర్ల, న్యూస్‌లైన్: ‘సంపద సుఖాన్నిస్తే... సేవ తృప్తినిస్తుంది.’ మన పెద్దలు చెప్పిన అపురూపమైన మాట ఇది. ఈ వాక్యాన్ని అక్షరాలా పాటిస్తున్నారీ మాస్టారు. గంట కొట్టగానే పుస్తకం తెరిచి, మళ్లీ గంట కొట్టగానే పుస్తకం మూసి బడి నుంచి బయటపడే ఉపాధ్యాయుడు కాదాయన. గురువంటే విద్యతో పాటు విలువలు కూడా బోధించాలని, బోధించిన విలువలను చేసి చూపాలని మనసా వాచా నమ్ముతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పేరు పురుషోత్తమరావు. పేరుకు తగ్గట్టే నలుగురికీ మంచి చేస్తూ ఉత్తమ గురువుగా ప్రశంసలు అందుకుంటున్నారాయన. ఆయన స్థాపించిన సంస్థే అమ్మ సేవా సొసైటీ. డబ్బులు లేక చదువు ఆపేస్తున్న విద్యార్థులను, చలికాలంలో అవస్థలు పడుతున్న అభాగ్యులను, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని రక్షిస్తూ ఈ సంస్థ అందరి మన్ననలు అందుకుంటోంది. ఈ సంస్థ విజయం సాధిం చడం వెనుక ఉన్న ప్రధాన కారణం పురుషోత్తమరావు మాస్టారే. గుర్ల మండలంలోని పాలవలస దగ్గరున్న నల్ల చెరువు ఎంపీపీ స్కూ లులో ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడే అయినా ప్రవృత్తి రీత్యా సంఘ సంస్కర్త కూడా. తన నెల జీతంలో మూడు వంతులు ప్రజాసేవకే ఆయన ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు తయారు చేయడం, ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సాయం చేయడం, సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం ఆయన ప్రత్యేకతలు. కేవలం సమాజ సేవలోనే కాదు బోధనలో కూడా ఆయన పేరెన్నికగల వారే. ఓ సారి స్కూలు పరిశీలనకు వచ్చిన ఎంపీ ఝాన్సీలక్ష్మి వద్ద ఓ నాలుగో తరగతి విద్యార్థితో ఏకధాటిగా ఇంగ్లిష్‌లో మాట్లాడించి ఔరా అనిపించారు. అలాగే చుట్టుపక్కల బాగా చదివే పేద పిల్లలను గుర్తించడం వారిని అమ్మ సొసైటీ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి చదివించడం వంటివి కూడా చేస్తున్నారు. ఇంతవరకు ఈయన 60 మంది విద్యార్థులను ఇంజినీరింగ్, మెడిసిన్, డీఈడీ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంటర్ చదివించారు. ఈ విద్యార్థులకు ఫీజులు కట్టడంతో పాటు భోజన, వసతి సదుపాయాలు కూడా చూస్తున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం తన బాధ్యత అని, అందుకోసమే ఈ ప్రయత్నమని ఆయన అంటుంటారు. -
అమ్మ క్యాంటిన్లో చపాతి
తక్కువ ధరకే టిఫిన్, భోజనాల అమ్మకాలతో ఆకట్టుకున్న అమ్మ క్యాంటిన్లో త్వరలో చపాతీ ప్రవేశించనుంది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి (జీహెచ్)లో వినియోగదారుల సౌకర్యార్థం చపాతీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: పేద, బడుగు తరగతి ప్రజలకు చేరువకావడమే లక్ష్యంగా సాగుతున్న అమ్మ పాలనలో అనేక పథకాలు అమలులోకి వచ్చాయి. వీటిల్లో అమ్మ క్యాంటిన్ల పథకం ఎంతో ఆకట్టుకుంది. ఒక్క రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకు సాంబార్ అన్నం, పెరుగన్నం అందిస్తున్నారు. నగరంలోని 200 వార్డుల్లోనూ అమ్మక్యాంటిన్లు వెలిశాయి. వైద్య చికిత్సల కోసం రాష్ట్రం నలుమూలల నుంచేకాక, పొరుగురాష్ట్రాల నుంచి వచ్చేరోగులతో కిటకిటలాడే జీహెచ్‌లో సైతం అమ్మ క్యాంటిన్ వెలిసింది. గత నెల 20వ తేదీన సీఎం జయలలిత ప్రారంభించారు. జీహెచ్‌లోని రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది, ఆటో కార్మికులకు అమ్మ క్యాంటిన్ వసతిగా మారింది. గత 15 రోజుల్లో 75 వేల ఇడ్లీ, 13 వేల పొంగల్, 13 వేల సాంబారన్నం, 8 వేల పెరుగున్నం అమ్మకాలు సాగాయి. రోజూ పెద్ద సంఖ్యలో క్యూ కట్టడంతో పోలీసు బందోబస్తు అనివార్యమైంది. ప్రస్తుతం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం మాత్రమే అందుతోంది. రాత్రి వేళల్లో అందుబాటులో హోటళ్లులేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలో రాత్రి వేళల్లో కేవలం రూ3లకు చపాతి, దాల్, కుర్మా అమ్మకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ క్యాంటిన్లో ఏర్పాట్లు ప్రారంభమైనాయి. మరో పదిరోజుల్లో చపాతీ అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉందని చెన్నై కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. -
తల్లే తొలి స్నేహితురాలు
అది 1998వ సంవత్సరం. మార్చి నెల. నా జీవితంలోకి ఓ కొత్త ఆనందం ప్రవేశించింది. ఓ అనిర్వచనీయమైన అనుభూతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది... నా చిట్టితండ్రి సాత్విక్ రూపంలో. అమ్మా అన్న పిలుపును నాకు తొలిసారి రుచి చూపించిన నా తొలి సంతానం సాత్విక్. బుజ్జి బుజ్జి కాళ్లు, చిన్ని చిన్ని చేతులు... ఓ అందమైన పుష్పాన్ని చూస్తున్నట్టుగా ఫీలయ్యాను. వాడిని తొలిసారి చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు... ప్రపంచంలో ఎవరూ పొందని గొప్ప విజయమేదో పొందినంత గర్వపడ్డాను. ఇదే ఆనందం నాకు రెండేళ్ల తరువాత మరోసారి దక్కింది. మా పాప శృతి పుట్టింది. ఓహ్... ఇక నాకు ప్రపంచంలో మరేదీ అక్కర్లేదనిపించింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాల వరకూ నాకు నా పిల్లలు తప్ప మరెవరూ కనిపించలేదు. వాళ్ల సంతోషం తప్ప ఇంకేమీ కనిపించలేదు నా కంటికి. అంతకుముందు నేను ఉద్యోగం చేసేదాన్ని. కానీ పిల్లల కోసం మానేశాను. నా పిల్లల ముద్దొచ్చే ముఖాలను చూడటంతో మొదలై... వాళ్లను నిద్రపుచ్చి పక్కమీదకు చేరడంతో నా రోజు ముగిసేది. నేనో పోస్ట్ గ్రాడ్యుయేట్‌నని, ఉద్యోగినని మర్చిపోయాను. నా పిల్లలకు తల్లిని అన్న ఒకే ఒక్క విషయమే గుర్తుంది నాకు. ఓ బిడ్డకు జన్మనివ్వడమే పునర్జన్మను పొందడమనుకుంటే... ఆ పుట్టిన బిడ్డలను పెంచి పెద్ద చేయడం ఓ పెద్ద తపస్సు తల్లికి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వాళ్లతో పాటు మనమూ ఎదగాలి. నేను కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మరీ కోప్పడనుగానీ... చేయకూడనిది చేస్తే వెంటనే సరిచేస్తాను. దానిలో తప్పేంటో, ఎందుకలా చేయకూడదో వివరిస్తాను. ఈ పని అన్నిటికంటే కష్టమైనది. ఎందుకంటే, కాస్త మనం ఎక్కువ మాట్లాడినా వాళ్ల మనసులు నొచ్చుకుంటాయి. ఆ బాధ నుంచే వారికి భయం పుడుతుంది. ఆ భయం కాస్త హద్దు దాటిందంటే, మన పిల్లల దృష్టిలో మనం విలన్లయిపోవడం ఖాయం. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా దృష్టిలో తల్లే పిల్లలకు మొదటి స్నేహితురాలు. స్నేహం దేనినైనా చెప్పుకునే స్వేచ్ఛనిస్తుంది. నా పిల్లలకు నా దగ్గర ఆ స్వేచ్ఛ ఉండాలి. నేనేదో అంటానన్న భయంతో ఏదీ దాచిపెట్టకూడదు. అందుకే మా తల్లీపిల్లల బంధాన్ని స్నేహబంధంగా మార్చేసుకున్నాను నేను! - అరుణా శేఖర్, వైజాగ్ (సాక్షి పాఠకురాలు) -
ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి
వేలూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ నందగోపాల్ అన్నారు. వాలాజ సమీపంలోని వేలం గ్రామ పంచాయతీలో అమ్మ పథకం కింద లబ్ధిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో అమ్మ పథకం కింద పలు సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. వాటిని అర్హులైన వారికి అందజేయడంలో అధికారులు అలసత్వం వహించరాదన్నారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో పలు పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు. అనంతరం 33 మంది లబ్ధిదారులకు చెక్కులను కలెక్టర్ అందజేశారు. గ్రామ పంచాయతీలోని రేషన్ దుకాణాన్ని పరిశీలించి కార్డుదారులకు సక్రమంగా బియ్యం, పప్పు, చక్కెర తదితర నిత్యావసర వస్తువులు సక్రమంగా అందజేస్తున్నారా లేదా అని కార్డుదారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులను ఇతర రాష్ట్రాలకు తరలకుండా చూడాలన్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బియ్యం సరఫరా చేసే సమయంలో తప్పనిసరిగా కార్డుదారుల సంతకం తీసుకోవాలని సూచించారు. ఆర్డీవో ప్రియదర్శిని, తహశీల్దార్ రాజేంద్రన్, ప్రత్యేక తహశీల్దార్ రాజశేఖర్, రెవెన్యూ అధికారులు సత్యమూర్తి, సత్య, గ్రామ సర్పంచ్ కుమరేషన్, అధికారులు పాల్గొన్నారు. -
ఆడపిల్ల అని..
అమ్మా.! నవమాసాలు మోసి జన్మనిచ్చినందుకు సంతోషం.. నీ గర్భంలో ఉండి తంతున్నప్పుడు నీవు పడే ఉలికిపాటును చూసి నా రాక కోసం ఆతృత పడుతున్నావని ఆనందపడేదానిని.. నా బంగారు తల్లి అని ముద్దులతో ముంచెత్తుతావని భావించాను.. ఎందుకమ్మా నన్ను పుట్టిన రెండు రోజులకే వదిలించుకున్నావు.. ఆడపిల్లను అనా? మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : ‘‘అమ్మా నవమాసాలు నన్ను నీ పొత్తిళ్లలో మోశావు. కడుపారా కన్నావు. కానీ నేను పుట్టీ పుట్టగానే ఎందుకమ్మా వదిలివెళ్లావు. జీవితాంతం నన్ను మోయలేనని అనుకున్నావా.. అమ్మ ప్రేమకు దూరం చేశావు. ఆడబిడ్డనై పుట్టడమే నా తప్పా..’’ రెండు రోజుల ఆ చిన్నారికి మాటలొచ్చి ఉంటే ఇలాగే బాధపడేదేమో. కానీ.. ఆలోచించే జ్ఞానం కూడా రాని ఆ పసికందు.. అమ్మకు దూరమై ఇప్పుడు ఏడ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఈ హృదయ విదారకర ఘటన సోమవారం మందమర్రి మండలంలో వెలుగుచూసింది. ఇదీ సంగతి.. మందమర్రిలోని కేకే2 గని సమీపంలోని గఫూర్ దర్గా ద్వారం వద్ద రెండు రోజుల పసికందును ఓ తల్లి వ దిలి వెళ్లింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దర్గా పక్కన పత్తి చేనుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న యువకుడు పిండి రమేశ్‌కు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా ఆడ శిశువు కనిపించింది. అప్పటికి ఇంకా కళు ్లకూడా తెరవని ఆ పసిపాప శరీరానికి చీమలు పట్టి ఉండడంతో రమేశ్ పాపను చేతుల్లోకి తీసుకొని చీమలను దులిపివేశాడు. విషయూన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే సీఐ రఘనందన్ 108ను పిలిపించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. అరుుతే ఈ పాప ఎవరి బిడ్డ అరుు ఉంటుందనే వివరాలు వెలుగుచూడలేదు. ఎన్ని పథకాలుండి ఏం లాభం ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు ఓ కారణం.. ఆయూ పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఆడ పిల్లల్ని పోషించని స్థితిలో చిన్నారులను కడుపులోనే చంపివేయడం, లేదా కన్న తర్వాత చె ట్ల కింద, ముళ్ల పొదల్లో వదలివేయడం జరుగుతోంది. ఆడ పిల్లల్ని అదుకుంటామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి లాంటి పథకాలను మాతృమూర్తులు విశ్వసించడం లేదో ఏమో గానీ సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -
నిన్న అమ్మ క్యాంటిన్.. నేడు అమ్మ మినరల్ వాటర్!
చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జే జయలలిత 'అమ్మ మినరల్ వాటర్' పేరుతో మరో కొత్త పథకాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఇటీవల జయలలిత 'అమ్మ క్యాంటిన్' ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమ్మ మినరల్ వాటర్ పథకం ద్వారా ప్రజలకు 10 రూపాయలకే లీటర్ మంచినీటిని అందించనున్నారు. గుమ్మడిపొండి వద్ద ట్రాన్స్ పోర్ట్ డిపార్డ్ మెంట్ ఏర్పాటు చేసిన మూడు లక్షలు లీటర్ల కెపాసిటి గద వాటర్ ప్లాంట్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళనాట కొత్త పథకాన్ని ఆరంభించారు. తొలి మినరల్ బాటిల్ ను రవాణా శాఖ మంత్రి వీ సెంథీల్ బాలాజీ వద్ద జయలలిత కొనుగోలు చేశారు. అమ్మ క్యాంటిన్ పథకం కోసం ఏర్పాటు చేసిన సహకార దుకాణాల్లో కూరగాయలు, బియ్యంతోపాటు మినరల్ వాటర్ ను కూడా అందించేందుకు జయలలిత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమ్మ మినరల్ వాటర్ ను బస్ స్టేషన్లతోపాటు దూర ప్రాంతాలకు ప్రయాణించే బస్సుల్లో కూడా విక్రయిస్తామన్నారు. అమ్మ క్యాంటిన్ లో ఇడ్లీ ఒక్క రూపాయి, పొంగల్, సాంబార్, లెమన్ రైస్ ఐదు రూపాయలకు, పెరుగు అన్నం 3 రూపాయలకు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
‘అమ్మ’ భాషను ప్రోత్సహించా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలుగు భాష గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ దినకర్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం సమీకృత కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతివేగంగా కనుమరుగవుతున్న భాషలో తెలుగు ఉండటం శోచనీయమన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ మాతృ భాషలో విద్యాబోధన చేపట్టడం వల్ల చెప్పాలనుకున్న విషయాన్ని విద్యార్థులకు సులభంగా చెప్పవచ్చన్నారు. తెలుగు భాష సంస్కృతి, గొప్పతనాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బోధించాలన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు గిడుగు రామమూర్తి వంటి కవులు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తెలుగు భాషలోని కఠిన పదాలను వాడుక భాషలోకి మార్చి అందరికి అర్థమయ్యేలా గిడుగు రామమూర్తి విశేష కృషి చేశారన్నారు. ఏజేసీ మూర్తి మాట్లాడుతూ దేశభాషలందు తెలుగు లెస్స అనే విధంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తెలుగు నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. నన్నయ్య, తిక్కయ్య, ఎర్రప్రగడ వంటి వారు భాషాభివృద్ధికి సాహితీ పరంగ విశేష కృషి చేశారన్నారు. డీఈఓ రమేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాల ప్రకటనలు తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు భాషకు కృషి చేసిన ఉపాధ్యాయులు ఎండీ షరీఫ్, ఉండ్రాల్ల రాజేశం, సంపత్‌కుమార్ తెలుగులో పది పాయింట్లు సాధించిన ప్రత్యుష తండ్రిని కలెక్టర్ సన్మానించారు. సమావేశంలో యువజన సంక్షేమ శాఖాధికారి రాంచంద్రయ్య, ఎంఈఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ పాలులో ఎన్నో రకాల పోషకాలు
తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలు, యాంటీబాడీస్, పెరుగుదలకు దోహదపడే అనేకమైన సంక్లిష్ట అంశాలు ఉంటాయి. ఈ పెరుగుదలకు దోహదపడే అంశాలు అటు బిడ్డ భౌతికంగా పెరగడంతో పాటు, మానసిక వికాసానికీ... ఇలా రెండు రకాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. వాటి గొప్పదనాన్ని వివరించాలంటే ఒక్కటే ఒక్కమాట... తల్లిపాలకు బదులు ఇవ్వడానికి మార్కెట్లో చాలా రకాలైన ఫార్ములా ఫీడ్స్ ఉన్నాయి. కానీ అవేవీ తల్లిపాలకు సాటిరావు. స్వాభావికమైన తల్లిపాలు ఇచ్చే పోషకాలు, రక్షణలో వందోవంతు కూడా ఇవ్వలేవు. ఆగష్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వాటి గొప్పదనాన్ని అర్థం చేసుకుని, అవగాహన కల్పించుకోడానికి ఉపయోగపడేదే ఈ కథనం. తల్లిపాలపై పెరిగే పిల్లలు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను స్వాభావికంగానే సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నా... మన అధ్యయనానికి అందేవి సుమారు 400 రకాల వేర్వేరు పోషకాలు మాత్రమే. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాలకు అస్సలు సాటిరావు. ప్రధాన అంశాలేమిటంటే... నీరు: ఈ పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది. ప్రోటీన్లు: పాలలో 75 శాతం వరకు ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్రొటీన్లు నైట్రోజన్‌ను కలిగి ఉంటాయి. ఇక నైట్రోజన్ లేకుండా ఉండే పోషకాలు సైతం ఉంటాయి. యూరియా, న్యూక్లియోటైడ్స్, పెప్టైడ్స్, ఫ్రీ అమైనో ఆసిడ్స్, డీఎన్ఏలు వంటి చాలా రకాలైన పదార్థాలు ఉంటాయి. కొవ్వులు: శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో పాటు సుదీర్ఘమైన గొలుసుల్లా ఉండే లాంగ్ చైన్ పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. పిండిపదార్థాలు: ఇందులో కార్బోహైడ్రేట్స్ అని ఇంగ్లిష్‌లో పిలిచే పిండిపదార్థాలు కూడా ఉంటాయి. ల్యాక్టోజ్ అన్నది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్. ఇతర పోషకాలు: పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి. పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. అందుకే తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. అయితే ఇక్కడొక చిన్న జాగ్రత్త పాటించాలి. తల్లి తినే పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. లేకపోతే వాటిపై ఉండే క్రిమిసంహారక రసాయనాలు తల్లిలోకి, అక్కడినుంచి బిడ్డకు ఇచ్చే పాలలోకీ ప్రవేశించి, బిడ్డ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయి. అందుకే వాటిని బాగా కడిగాక మాత్రమే తినాలని గుర్తుంచుకోండి. పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. తల్లి ఎన్ని నీళ్లు తాగాలంటే... ఆమెకు మూత్రం పసుపు రంగులో రానట్లుగా ఉండేలా చూసుకోవాలి. తల్లిపాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశనగ పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్-సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. తల్లిపాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహారపదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్-డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి. పాలిచ్చే తల్లి తీసుకోకూడని ఆహారాలు : కెఫిన్ ఉండే పదార్థాలు: పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం చాలా పరిమితంగా రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు. సముద్రపు చేపలు: చేపలు మంచి పౌష్టికాహారమే అయినా... కొన్ని రకాల సముద్రపు చేపల్లో మెర్క్యులరీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మెర్క్యులరీ బిడ్డలో నాడీవ్యవస్థ ఎదుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది. పైగా కొన్ని రకాల సముద్రపు చేపలు తీసుకున్న తర్వాత పట్టే పాలు బిడ్డకు అలర్జీ కలిగించవచ్చు. అందుకే బిడ్డకు పాలుపట్టే సమయంలో సముద్రపు చేపలను ఆహారంగా స్వీకరించకపోవడమే మంచిది. బిడ్డకు పట్టే పాలు... తల్లికీ చేస్తాయి మేలు బిడ్డకు పాలు పట్టడం అటు తల్లికీ అనేక రకాలుగా మేలు చేస్తుంది. బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని... పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు... ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. పాలిచ్చే తల్లుల బరువు స్వాభావికంగా తగ్గుతుంది. అంటే పాలు ఇస్తున్నంత కాలం వాళ్లు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అంశంతో పాటు బరువు పెరగకపోవడం వల్ల బరువు రిస్క్ ఫ్యాక్టర్‌గా గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. పాలిచ్చే తల్లుల్లో పాలు పడుతున్నంతకాలం ప్రకృతి సిద్ధంగానే గర్భధారణ జరగకుండా రక్షణ ఉంటుంది. అంటే పాలు పట్టడం ఒకరకంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది. (అయితే అంతమాత్రాన అసలే గర్భధారణ జరగదని చెప్పలేం. కాబట్టి ఆ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనదలచిన దంపతులు గర్భనిరోధక సాధనాలను వాడాల్సిందే). పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది. పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ. పాలివ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ పాలిచ్చే తల్లుల్లో మేను కూడా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది. పాలివ్వకపోతే ప్రమాదమే... బిడ్డకు తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లికి చాలారకాల నష్టాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కొన్ని... బిడ్డకు పాలు పట్టని తల్లులకు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మెనోపాజ్ పూర్తయ్యాక (లేదా కొన్ని సందర్భాల్లో మెనోపాజ్ రాకముందే) చాలా రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్‌కు అవకాశాలు ఎక్కువ. ఎముకలు పెళుసుగా మారి, తేలిగ్గా విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లిపాలతో అటు బిడ్డకూ, ఇటు తల్లికీ, మరోవైపు సమాజానికీ... ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు/ పోతపాలు వంటివి జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి. ఆస్తమా: తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితోపాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (ఛైల్డ్‌హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లిపాలు పట్టడం చాలా అవసరమని ప్రతి తల్లీ, ప్రతి కుటుంబమూ గుర్తెరగాలి. నిర్వహణ: యాసీన్