దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..? | Dasari Narayanarao movie on Amma | Sakshi
Sakshi News home page

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?

Published Tue, Jan 3 2017 1:30 PM | Last Updated on Mon, May 28 2018 4:09 PM

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..? - Sakshi

దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానని ప్రకటించిన దాసరి, తరువాత ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశాడు. దాసరి అనారోగ్య సమస్యలతో పాటు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన వడ్డీకాసులవాడు సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు ప్రాజెక్ట్లను పక్కకు పెట్టేసిన దాసరి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు.

తాజాగా అమ్మ అనే టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాసరి స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement