Dasari Narayanarao
-
టాలీవుడ్లో విషాదం... గుండెపోటుతో నిర్మాత మృతి
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూశారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దివంగత దాసరి నారాయణరావుకు ఈయన బంధువు అవుతారు. దాసరి పద్మకు సోదరుడి వరుస. తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేసిన బోసుబాబు ఆ తర్వాత నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' వంటి చిత్రాలను నిర్మించారు. బోసుబాబు మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ మూవీకి డేట్ ఫిక్స్, ఆ రోజే లాంచ్! -
దాసరి కుటుంబంలో ఆస్తి పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: దివంగత దర్శకనిర్మాత దాసరి నారాయణరావు ఇంట ఆస్తి వివాదం మరోసారి రాజుకుంది. ఆయన కొడుకులు దాసరి అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న రాత్రి అరుణ్ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా తన తమ్ముడు నుంచి ప్రాణహానీ ఉందని పోలీసులే రక్షణ కల్పించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభు విజ్ఞప్తి చేశారు. సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్‌గా నిలిచినటువంటి దివంగత దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి పంచాయితీ నెలకొనడం పట్ల ఆయన అభిమానులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి త్వరగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన గౌరవాన్ని కాపాడాలని పలువురు వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. ‘ ఈ నెల 24న రాత్రి దాసరి అరుణ్‌తో పాటు అతడి డ్రైవర్ మా ఇంటి గేటు దూకి లోపలికి వచ్చాడు. మద్యం తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ నా భార్య, నాపై దాడి చేశాడు. అంతేకాకుండా మా నాన్న బీరువా తెరవడానికి ప్రయత్నించాడు. మా నాన్న(దాసరి) రాసిన వీలునామా ప్రకారం ఆయన మనవరాలు, నా కూతురు ఈ ఇంటికి అర్హురాలు. ఆస్తుల కోసం దాసరి అర్జున్ దౌర్జన్యం చేస్తున్నాడు. సి. కళ్యాణ్, మురళీమోహన్, మోహన్‌బాబు వంటి సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించి పరిష్కరించాలి. అదేవిధంగా దాసరి అరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని అన్నారు. -
ఇంటికి చేరుకున్న దాసరి ప్రభు!
బంజారాహిల్స్: దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) ఆచూకీ అభ్యమైంది. గత కొన్ని రోజులుగా అదృశ్యమైనట్టు భావిస్తున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గతవారం దాసరి ప్రభు అదృశ్యమైనట్టు ఆయన మామ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న దాసరి ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. (చదవండి: మిస్టరీగానే దాసరి ప్రభు అదృశ్యం) నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దాసరి ప్రభు తిరిగి రాలేదని, అప్పటినుంచి ఆయన కనిపించడం లేదని, ఎంత వెతికినా ఆయన జాడ తెలియడం లేదని కుటుంబసభ్యులు గతవారం పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాసరి ప్రభు మరోసారి అదృశ్యం కావటంతో కుటుంబ కలహాలే కారణమని భావించారు. -
దాసరి కుమారుడు అదృశ్యం
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు కనిపించటం లేదంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రభు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్ చేసిందంటూ ఆరోపించారు. దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాసరి ప్రభు మరోసారి అదృశ్యం కావటంతో కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్నారంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవారో ఊహించవచ్చు. దర్శకరత్న డా. దాసరి నారాయణరావు అలాంటివారే. 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమయ్యారు. సినీ కార్మికుల పక్షాన నిలిచిన ఆయన వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. రేపు దాసరి జయంతి. ఈ సందర్భంగా ఈ వారం ‘దాసరి’ స్పెషల్ క్విజ్ 1. దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమైంది 1972లో ‘తాతమనవడు’తో. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ఎర్రబస్సు’లో మంచు విష్ణు హీరోగా నటించారు. 2014లో విడుదలైన ఆ సినిమాతో దర్శకరత్న మొత్తం ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారో తెలుసా? ఎ) 100 బి) 120 సి) 90 డి) 151 2. దాసరి తన కెరీర్ మొత్తంలో పది రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసిన సినిమా ‘నీడ’. ఆ చిత్రం ద్వారా మహేశ్‌బాబు బాల నటునిగా, రమేశ్‌బాబు హీరోగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని రెండో హీరో పాత్రలో ఓ నటుడు పరిచయమయ్యారు. అతనెవరో తెలుసా? ఎ) చంద్రమోహన్ బి) హరనాథ్ బాబు సి) ఆర్. నారాయణమూర్తి డి) ఈశ్వరరావు 3. రచయితగా, దర్శకునిగా దాసరి చాలా నంది అవార్డులు అందుకున్నారు. నటునిగా నంది అవార్డు అందుకున్న మొదటి సినిమా పేరేంటి? ఎ) మామగారు బి) నాయుడుగారి కుటుంబం సి) సూరిగాడు డి) యంఎల్‌ఏ ఏడుకొండలు 4. ఓ ప్రముఖ నటునికి దాసరి నారాయణరావు చెప్పిన కథ నచ్చి 1,116 రూపాయల పారితోషికాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చారు. దాసరి దర్శకత్వంలో ఆ సినిమాను ప్రారంభించాలనుకున్నారు. నిర్మాతకు వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాసరికి మొదట అడ్వాన్స్ ఇచ్చిన ఆ హీరో ఎవరు? ఎ) శోభన్ బాబు బి) అక్కినేని నాగేశ్వరరావు సి) ఎన్టీఆర్ డి) ఎస్వీ రంగారావు 5. దర్శకునిగా దాసరి దాదాపు 150 సినిమాలు చేస్తే, నటునిగా చిరంజీవి 150 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. దాసరి కొంచెం సీనియర్ అయినా ఇద్దరూ దాదాపుగా సమకాలీకులే. దాసరి దర్శకత్వంలో చిరంజీవి ఎన్ని చిత్రాలు చేశారో తెలుసా? ఎ) 8 బి) 4 సి) 2 డి) 1 6. కథే హీరో అంటూ చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసిన దాసరి తెలుగులో అందరి టాప్ స్టార్స్‌ని డైరెక్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో నటించిన కథానాయకుడు ఎవరో కనుక్కోండి. ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) అక్కినేని నాగేశ్వరరరావు డి) ఎన్టీఆర్ 7. దాసరి మొదట రచయితగా పనిచేసి దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. తర్వాతి కాలంలో ఆయన నిర్మాతగా మారారు. నిర్మాతగా ఆయన మొదటి సినిమా పేరేంటి? ఎ) గోరింటాకు బి) స్వయంవరం సి) శివరంజని డి) సంసారం–సాగరం 8. ఓ ఇతిహాసాన్ని నాలుగు భాగాలుగా దాసరి తెరకెక్కించాలనుకున్నారు. ఆ సినిమాతో దర్శకుడిగా రిటైర్ కావాలనుకున్నారు. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. దాసరి ఇష్టపడిన ఆ కథ చెప్పుకోండి చూద్దాం. ఎ) మహాభారతం బి) రామాయణం సి) భాగవతం డి) కురుక్షేత్రం 9. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) బాలకృష్ణ (అంజిగాడు) డి) రాజబాబు 10. ‘ఒక లైలా కోసం తిరిగాను లోకం..’ అనే పాట అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోనిది. ఆ పాట రచయితెవరు? ఎ) వేటూరి బి) శ్రీశ్రీ సి) కృష్ణశాస్త్రి డి) దాసరి 11. దాసరి శిష్యుల్లో ఓ దర్శకుడు మాత్రం గురువుగారిలా 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆ శిష్యుడు ఎవరో తెలుసా? ఎ) రవిరాజా పినిశెట్టి బి) కోడి రామకృష్ణ సి) రాజా వన్నెంరెడ్డి డి) రేలంగి నరసింహారావు 12. ‘జ్యోతి బనే జ్వాలా’ అనే బాలీవుడ్ చిత్రంలో రాజేశ్ ఖన్నా హీరోగా నటించారు. ఆ సినిమాకు మాతృక కృష్ణంరాజు హీరోగా నటించిన ఓ తెలుగు సినిమా. ఆ సినిమా పేరేంటి? ఎ) రంగూన్ రౌడి బి) కటకటాల రుద్రయ్య సి) తాండ్ర పాపారాయుడు డి) ఉగ్రనరసింహం 13. దాసరి దర్శకత్వంలో 1972లో ప్రారంభమైన నిర్మాణ సంస్థ ఇప్పటికీ సినిమాలు తీస్తూ చాలా యాక్టివ్‌గా ఉంది. ఆ నిర్మాణ సంస్థ పేరేంటో తెలుసా? (చిన్న క్లూ: ఆ సంస్థ మొదటి సినిమా ‘బంట్రోతు భార్య’) ఎ) వైజయంతీ మూవీస్ బి) దేవీ ఫిలింస్ సి) గీతా ఆర్ట్స్ డి) పద్మాలయా పిక్చర్స్ 14. ‘స్వర్గం–నరకం’ చిత్రం దాసరికి దర్శకునిగా మంచి పేరు సంపాదించింది. ఆ చిత్రంలో ఓ హీరోగా ఈశ్వరరావు ముందే హీరోగా సెలెక్ట్ అయ్యారు. సెకండ్ హీరోగా నటించి తర్వాతి కాలంలో మంచి ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఆ నటుడెవరో తెలుసా? ఎ) మురళీ మోహన్ బి) మోహన్‌బాబు సి) రామ్మోహన్ డి) నరసింహరాజు 15 దాసరి దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకొంది. ఆ చిత్రంలో ఏయన్ఆర్ హీరోగా నటించగా ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటించారు. అందులో ఒక హీరోయిన్ జయసుధ మరో హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) జయప్రద బి) శ్రీదేవి సి) విజయశాంతి డి) రాధి 16. సూపర్‌స్టార్ కృష్ణతో దాసరి తీసిన మొదటి చిత్రం ‘రాధమ్మ పెళ్లి’. దాసరి దర్శకత్వం వహించినవాటిలో కృష్ణ మూడు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. వారిద్దరి కాంబినేషన్లో మొత్తం ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? ఎ) 9 బి) 6 సి) 12 డి) 8 17. దాసరి దర్శకత్వం వహించిన మొదటి చిత్రంలోని తాత పాత్ర రాసినప్పుడు ముందు ఎస్వీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని రాయలేదు. దాసరికి ఎంతో ఇష్టమైన నటుడు, స్నేహితుడి కోసం రాశారు ఆ పాత్రను. పారితోషికం విషయంలో ప్రాబ్లమ్ వచ్చి ఆ పాత్రను ఆ నటుడు చేయలేదు. ఎవరా నటుడు? ఎ) పద్మనాభం బి) కైకాల సత్యనారాయణ సి) నాగభూషణం డి) రావు గోపాల్‌రావు 18. 1979లో దాసరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గోరింటాకు’. కె. మురారి నిర్మించిన ఆ చిత్రంలో దాసరి అక్కా అని ఎంతో ఆప్యాయంగా పిలిచే సావిత్రి ఓ పాత్రలో నటించారు. శోభన్‌బాబు హీరోగా నటించిన ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) సుజాత బి) సుహాసిని సి) సుమలత డి) శ్రీప్రియ 19. సహజనటిగా పేరు తెచ్చుకొన్నారు జయసుధ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన నటి జయసుధ. ఆమె ఆయన దర్శకత్వంలో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 29 బి) 17 సి) 19 డి) 24 20. దాసరి సినీ పరిశ్రమకు రాకముందు పాలకొల్లులో ఉన్నప్పుడు కావిడి మెడలో వేసుకొని పండ్లు ఆమ్మేవారు. ఆయన ఏ పండ్లను అమ్మారో తెలుసా? ఎ) మామిడి పండ్లు బి) పనస పండ్లు సి) సపోటా పండ్లు డి) అరటి పండ్లు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) సి 5) డి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) డి 11) బి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
ఆయన్ని పిలవకపోవడం సరికాదు: మోహన్‌బాబు
సాక్షి, పాలకొల్లు: దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్‌బాబు తప్పుబట్టారు. ఆయనను పిలవకపోవడం సరికాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం ముద్రగడను మోహన్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని చెప్పారు. ‘అనుకున్నది సాధించాలన్న పట్టుదల గల వ్యక్తి ముద్రగడ. తనను నమ్ముకున్నవారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ ఈ ప్రాంతంలో ఉండటం గర్వకారణమ’ని మోహన్‌బాబు అన్నారు. శనివారం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో దాసరి కాంస్య విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఇందులో మోహన్‌బాబుతో పాటు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, కవిత, హేమ, ప్రభ, సి. కళ్యాణ్, రేలంగి నరసింహారావు, ధవళ సత్యం, రాజా వన్నెంరెడ్డి, రవిరాజా పినిశెట్టి, చోటా కె నాయుడు, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దాసరి బయోపిక్ తీస్తే సహకరిస్తా దర్శకరత్న, తన గురువు దాసరి నారాయణరావు బయోపిక్‌ను ఎవరైనా తెరకెక్కిస్తే పూర్తిగా సహకరిస్తానని మోహన్‌బాబు అంతకుముందు చెప్పారు. దాసరి జీవితచరిత్రను సినిమా తీసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయాలని సూచించారు. ఎవరైనా ముందుకు వస్తే తాను పూర్తిగా అండగా ఉంటానని పునరుద్ఘాటించారు. సినీ జగత్తులో దాసరి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, తనలాంది వందల మంది కళాకారులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ఘనత దాసరికే చెందుతుందన్నారు. -
నన్ను పెద్ద కొడుకు అనేవారు
‘‘నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దాసరి అయితే నా కుటుంబానికి నెత్తిన పాలు పోసింది ఈ క్షీరపురి ప్రజలే’’ అని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక గాంధీబొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్ బాబు మాట్లాడుతూ – ‘‘గురువు గారు దాసరి నారాయణరావు ‘నాకు ఏదైనా అయితే నా పెద్ద కొడుకు మోహన్ బాబు ఉన్నాడు’ అనేవారు. సినీ నటుడిగా జన్మనిచ్చిన తండ్రి విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో ఆవేదనతో కూడినది. నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నాను.. ఈ కార్యక్రమానికి నేను ఆనందంతో రాలేదు. ఎంతో బాధతో తప్పని పరిస్థితుల్లో వచ్చాను. భక్తవత్సలంనాయుడు నామకరణంతో ఇండస్ట్రీలో ప్రవేశించిన నాకు 1975లో మోహన్ బాబుగా పేరు పెట్టారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, హీరోగా ఇలా అనేక క్యారెక్టర్లకు ఎంపిక చేసి నాకెంతో గుర్తింపును తీసుకువచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌ల పక్కన నటించే చాన్స్ కల్పించారు. ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆయన బతికుండగానే నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ లో దాసరి పేరున ఆడిటోరియాన్ని నిర్మించి ఆయనకు అంకితమిచ్చాను. పదిమందికి ఉపయోగపడి భారతదేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి దాసరి. నటుడిని శాసించిన వ్యక్తి. కొమ్ములు తిరిగిన నటుడైనా దాసరి వద్దకు వచ్చి మీ సినిమాలో నాకు ఒక చాన్సు ఇవ్వండని అడిగారే తప్ప నా వద్ద కథ ఉంది.. నా సినిమాలో పనిచేస్తారా అని ఏ నటుడినీ అడగని దర్శకుడు. ఇలాంటి మహానుభావుడికి ప్రభుత్వం 5 గజాల స్థలం కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లి గజం స్థలం అడగలేదు. గతంలో పాలకొల్లులో లలితకళాంజలి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాను. ఏటా ఒక విద్యార్థికి నా పాఠశాలలో 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకూ ఉచితంగా విద్యనందిస్తానని చెప్పాను. ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, తణుకు వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఎంపీలు గోకరాజు గంగరాజు, ఎం.మురళీమోహన్, సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, రవిరాజా పినిశెట్టి, దవళ సత్యం, రేలంగి నరసింహారావు, దాసరి కుమారుడు తారకప్రభు, సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు. -
మే 4న డైరెక్టర్స్ డే
మే 4... దర్శకరత్న డా. దాసరి నారాయణరావు పుట్టినరోజు. నూట యాభైకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. దాసరి భౌతికంగా దూరమైనా తాను అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. మే 4న ఆయన జయంతిని పురస్కరించుకుని ఆ రోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించింది తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం. ‘‘స్వర్గీయ దాసరి నారాయణరావుగారి జయంతి సందర్భంగా మే 4న ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో వేడుక నిర్వహించనున్నాం. తెలుగు దర్శకుల సంఘం సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు’’ అని దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ తెలిపారు. -
10న దాసరి సంతాప సభ
ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈ నెల 10వ తారీఖున నిర్వహించనున్నట్టుగా తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు. దాసరి మంచి ఫాంలో ఉన్న 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు. అందరూ అందుబాటులో ఉన్న సమయంలో సంతాప సభ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు. -
దాసరి అంతిమయాత్ర: ఫ్యాన్స్ కేకలపై బన్నీ ఆగ్రహం
హైదరాబాద్: సమయం, సందర్భం పట్టించుకోకుండా ఇటీవల ప్రతిచోటా ఆయా హీరోల ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా దాసరి నారాయణరావు అంతిమయాత్రలోనూ అభిమానులు ఇదేవిధంగా శృతిమించి ప్రవర్తించారు. దివికేగిన దర్శకరత్న దాసరి నారాయణరావుకు నివాళులర్పించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు. దాసరి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం బన్నీ వెళ్తుండగా అతని అభిమానులు శృతిమించి ప్రవర్తించారు. విషాద సందర్భంలోనూ డీజే, డీజే అంటూ కేకలు పెట్టారు. దీంతో చిర్రెత్తిపోయిన బన్నీ అభిమానులవైపు చాలా ఆగ్రహంగా చూశాడు. కేకలు వేయొద్దంటూ వారికి వేలెత్తి చూపించారు. అభిమానులు పెద్దసంఖ్యలో బన్నీ చుట్టుముట్టడంతో వారి నుంచి తప్పించి.. తిరిగి ఆయనను వాహనంలోకి చేర్చడం బౌన్సర్లకు కొంచెం కష్టసాధ్యంగా మారింది. -
ఫ్యాన్స్ కేకలపై బన్నీ ఆగ్రహం
-
దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు
-
దాసరి కోడలు సంచలన వ్యాఖ్యలు
దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై తనకు అనుమానాలున్నాయంటూ ఆయన పెద్ద కోడలు సుశీల సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి కన్నుమూసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను చూడటానికి వెళ్లానని, అప్పుడు తనను అనుమతించలేదని, తనను అనుమతించకపోవడంపైనా అనుమానాలున్నాయని ఆమె చెప్పారు. తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నా తన భర్త నుంచి తాను ఇంకా విడాకులు తీసుకోలేదని తెలిపారు. తన మామగారు గతంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. అంత ఆరోగ్యమైన మనిషి ఇంత హఠాత్తుగా ఎలా అనారోగ్యం పాలయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల 4న తాను మామగారి దగ్గరకు వెళ్లానని, ఆయన తనతో మంచిగా మాట్లాడారని చెప్పారు. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని హామీ ఇచ్చినట్టు చెప్పారు. ‘ఇంకొక చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వారాలు ఆగి రండి. కూర్చుని మాట్లాడుకుందాం’ అని దాసరి తనకు చెప్పారని అన్నారు. తమకు దాసరి ఆస్తిలో భాగం ఏమీ ఇవ్వలేదని, తమకు తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన అన్నారని వివరించారు. తన మనవడిని దగ్గరకు తీసుకుంటానని దాసరి అన్నారని, ఇంతలోనే ఆయన మరణించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని సుశీల చెప్పారు. ఆమె వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
సినీ దిగ్గజానికి కన్నీటి వీడ్కోలు
► అధికార లాంఛనాలతో దర్శకరత్న దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తి ► చితికి నిప్పంటించిన పెద్ద కుమారుడు ప్రభు.. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు ► దాసరి అంతిమయాత్రకు వెల్లువలా జనం.. సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, అశేష ప్రజానీకం కన్నీటి వీడ్కోలు నడుమ బుధవారం మొయినాబాద్‌లోని తోలుకట్టలోని ఆయన ఫాంహౌస్ పద్మ గార్డెన్స్‌లో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాసరి పద్మ సమాధి పక్కన ఏర్పాటు చేసిన చితిపై దాసరి భౌతిక కాయాన్ని ఉంచారు. పెద్ద కుమారుడు తారక హరిహర ప్రభు చితికి నిప్పంటించారు. పోలీసులు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న దాసరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దాసరి కుమారులు ప్రభు, అరుణ్, కుమార్తె సౌభాగ్య, మనుమలు, మనవరాళ్లు కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. భారీ ప్రదర్శనగా అంతిమయాత్ర ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ దాసరి పార్థివదేహాన్ని ఆయన నివాసం వద్ద ఉంచారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలింఛాంబర్‌కు ప్రదర్శనగా తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫిలించాంబర్‌లో ఉంచిన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. పద్మాలయా స్టూడియో, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మొయినాబాద్ చేరుకుంది. అభిమానులు, రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జనసంద్రమైన ఫిలింనగర్.. సినీప్రపంచానికి ఆత్మీయ బంధువైన దాసరికి సినీలోకం కడసారి నీరాజనాలు పలికింది. దాసరిని కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ఫిలించాంబర్ వరకు జనసముద్రాన్ని తలపించింది. ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా నేనున్నానంటూ భరోసానిచ్చి వారి సమస్యను పరిష్కరించే దాసరి లేని లోటు ఊహించ లేకపోతున్నామని పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నివాళులర్పించిన ప్రముఖులు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పరకాల ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి, వి.హనుమంతరావు, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు రోజా, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్, కాజా సూర్యనారాయణ, టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, నన్నపనేని రాజకుమారి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తదితరులు దాసరి పార్థివదేహానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు కృష్ణ, విజయనిర్మల, మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, ప్రకాశ్‌రాజ్, తనికెళ్ల భరణి, కె.విశ్వనాథ్, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ ప్రసన్న, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్, అల్లు అర్జున్, ఆది పినిశెట్టి, నాజర్, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, అలీ, హేమ, ‘మా’అధ్యక్షుడు శివాజీరాజా, రాజేంద్రప్రసాద్, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, బోయపాటి శ్రీను, దిల్‌రాజు, ఆర్.నారాయణమూర్తి, శ్రీకాంత్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, ఉత్తేజ్, సుమ, రాజీవ్ కనకాల, సుద్దాల అశోక్‌తేజ, గద్దర్ తదితరులు దాసరికి కన్నీటి వీడ్కోలు పలికారు. డి.సురేశ్‌బాబు, సి.కళ్యాణ్ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించారు. దాసరి ఒక వ్యవస్థ: చంద్రబాబు దాసరి వ్యక్తి కాదని, ఓ వ్యవస్థ అని, ఆయనలేని లోటు పూడ్చలేనిదని చంద్రబాబు అన్నారు. బడుగు బలహీనవర్గాలకు ఆయన అండగా నిలిచారని, సినీకార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. సినీ రంగంలో ప్రతి ఒక్కరికీ అండదండలను అందజేసిన దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నట్లు రోజా, అంబటి తెలిపారు. దాసరి లేని లోటు తమకు పూడ్చలేనిదని ఉత్తమ్ అన్నారు. దాసరి మృతిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ సంతాప సందేశాన్ని పంపారు. దాసరి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. భార్య సమాధి పక్కనే.. దాసరి 15 రోజులకొకసారి, పండుగలప్పుడు ఫాంహౌస్‌కు వచ్చేవారని ఫాంహౌస్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. ఆయన వచ్చినప్పుడల్లా తన సమాధిని భార్య పద్మ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలని చెప్పేవారన్నారు. -
దాసరి అంత్యక్రియలు పూర్తి
-
అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు
-
అధికార లాంఛనాలతో దాసరి అంత్యక్రియలు
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, నిర్మాత దాసరి నారాయణరావు అంత్యక్రియలు కుటుంబసభ్యులు, ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మొయినాబాద్ మండలం తోల్కట్ట సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రం పద్మా గార్డెన్స్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు... తండ్రి చితికి నిప్పంటించారు. అంతకు ముందు ఫిల్మ్‌చాంబర్ నుంచి దాసరి అంతిమ యాత్ర జరిగింది. దాసరిని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాగా నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు సైతం ఇక్కడే నిర్వహించారు. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] -
'అంధగాడు' చిత్రం దాసరికి అంకితం
దాసరి మరణంతో ఇండస్ట్రీ ఒకసారిగా దిగ్బ్రాంతికి గురైంది. పాత తరం నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే కాదు... ఈ జనరేషన్ సినీ ప్రముఖులు కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న అంధగాడు సినిమాను దాసరి అంకితమిస్తున్నట్టుగా వెల్లడించారు ఆ చిత్ర నిర్మాతలు. 'ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాలకు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రాసుకున్న దర్శకరత్న డా.దాసరినారాయణరావుగారు పరమపదించడం మమ్మల్ని ఎంతో బాధకు గురి చేసింది. ఇండస్ట్రీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చి నిలబడి న్యాయం చేకూర్చే గొప్ప వ్యక్తి దాసరిగారు. మంచి చిత్రాలకు ఆదరణ ఉండాలని, చిన్న నిర్మాతలు బావుండాలని కోరుకునే శ్రేయోభిలాషి ఆయన. మా ఎ.కె.ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌కు వెన్నంటి నిలిచారు. ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడే దాసరిగారు మా సంస్థలో వచ్చిన ప్రతి సినిమాను ఆయన వీక్షించి యూనిట్‌కు తన ఆశీస్సులను అందచేసేవారు. . భౌతికంగా దాసరిగారు మనల్ని విడిచి పెట్టినా, ఆయన సినిమాల రూపంలో ఎప్పటికీ మన మధ్యనే ఉంటారు. మా సంస్థకు దాసరిగారు అందించిన సహాయ సహకారాలను మరచిపోలేం. మా బ్యానర్లో విడుదలవుతున్న 'అంధగాడు' చిత్రాన్ని దాసరిగారికి అంకితమిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్న'ట్టుగా తెలిపారు. -
స్పైడర్ టీజర్ లాంచ్ వాయిదా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా టీజర్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు ఇండస్ట్రీ, ప్రేక్షకులు బాధలో ఉండటంతో టీజర్ రిలీజ్‌ను చిత్రయూనిట్ వాయిదా వేశారు. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సెట్స్ మీద ఉన్న తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా టీజర్‌ను రిలీజ్ చేస్తుంటారు. అయితే దాసరి మరణంతో కృష్ణ తన పుట్టిన రోజు వేడుకలు చేయవద్దని అభిమానులను కోరారు. అదే సమయంలో మహేష్ కూడా స్పైడర్ టీజర్‌ను ఒక రోజు వాయిదా వేశారు. స్పైడర్ టీజర్ గురువారం(01-06-2017) ఉదయం 10.30 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. -
దాసరి-పద్మల ప్రేమకథ మొదలైందిలా..
హైదరాబాద్: అస్థిర బంధాలు అధికంగా కనిపించే సినీరంగంలో దాసరి నారాయణరావు- పద్మ జంటది అరుదైన ప్రస్థానం. సినిమాలతో సమానంగా భార్య పద్మను ప్రేమించిన దాసరి.. ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచిన ఆయన.. తన పద్మ చెందకే వెళ్లిపోయారు. నారాయణరావు-పద్మలది ప్రేమవివాహం. అసలు వాళ్లిద్దరూ ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారంటే.. దాసరి నారాయణరావుకు చెన్నై కంటే హైదరాబాద్ అంటేనే ఇష్టం. సినీపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న తొలిరోజుల్లోనే ఆయన భాగ్యనగరికి వచ్చేశారు. ఇక్కడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న చార్మినార్ (వీఎస్టీ) సిగరెట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం చేశారు. ఆ తరువాత హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లోనూ పనిచేశారు. సమాంతరంగా నాటకరంగంపైనా దృష్టిసారించారు. రవీంద్రభారతి, గాంధీభవన్, త్యాగరాయగానసభల్లో వందలాది నాటకాలు ప్రదర్శించారు. ఓసారి సొంత ఊరు(పాలకొల్లు)కు బయలుదేరిన ఆయన.. తన చెల్లెలకి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు.. ‘షాపు వాడు ఏ సైజు కావాలి?’ అని ప్రశ్నించడంతో దాసరికి ఏం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు పక్కనే నిల్చుని గాజులు కొంటున్న ఓ అమ్మాయి చెయ్యిని చూపించి ‘ఈ సైజువి కావాలి’ అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు పద్మ! నాటకాలపట్ల ఆసక్తికలిగిన ఆమె.. నారాయణరావును చూడగానే ‘మీరు నాటకాలు వేస్తారుకదా. గాంధీభవన్‌లో మీ ప్లే చూశా’నని అన్నారట. అలా మొదలైనవారి పరిచయం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేదాకా, అటుపై గాఢమైన ప్రేమగా మారింది. కొద్ది రోజులకే పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పద్మ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆమె తల్లిదండ్రులు సరేనన్నారుకానీ, నారాయణరావు కుటుంబం మాత్రం పెళ్లికి అభ్యంతరం తెలిపింది. అయినాసరే ఇద్దరూ ఒక్కటయ్యారు. సొంత పిల్లలు ముగ్గురే (కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్, కూతురు హేమాలయ కుమారి) అయినా, ఇండస్ట్రీలో కొన్ని వందల మందికి దాసరి-పద్మలు అమ్మానాన్నలయ్యారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించిన నటీనటులు, టెక్నీషియన్లు.. ఆ అమ్మానాన్నలతో తమ అనుబంధాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. -
దర్శకరత్న దాసరి సినిమాలు..
దర్శకరత్న దాసరి నారాయణరావు మంగళవారం సాయత్రం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ మూలస్థంబాన్ని కోల్పోయింది. దాసరి సినీ పరిశ్రమకు ఎనలేని కృషి చేశారు. ఆయన 151 సినిమాలకు దర్శకత్వం, 53 సినిమాలకు నిర్మాతగా, 250 సినిమాలకు డైలాగ్ రైటర్‌గా వ్వవహరించారు. 18 సినిమాలకు పాటలు కూడా రాశారు. దాసరి కృషికి రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డలు లభించాయి. 1970 దశకంలో.. తాత మనవడు (1972) (మొదటి సినిమా) సంసారం సాగరం (1973) బంట్రోతు భార్య (1974) ఎవరికి వారే యమునా తీరే (1974) రాధమ్మ పెళ్ళి (1974) తిరుపతి (1974) స్వర్గం నరకం (1975) బలిపీఠం (1975) భారతంలో ఒక అమ్మాయి (1975) దేవుడే దిగివస్తే (1975) మనుషులంతా ఒక్కటే (1976) ముద్దబంతి పువ్వు (1976) ఓ మనిషి తిరిగి చూడు (1976) పాడవోయి భారతీయుడా (1976) తూర్పు పడమర (1976) యవ్వనం కాటేసింది (1976) బంగారక్క (1977) చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977) ఇదెక్కడి న్యాయం (1977) జీవితమే ఒక నాటకం (1977) కన్యాకుమారి (1978) దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978) కటకటాల రుద్రయ్య (1978) శివరంజని (1978) స్వర్గ్ కరక్ (హిందీ, 1978) (స్టోరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) గోరింటాకు (1979) కళ్యాణి (1979) కోరికలే గుర్రాలైతే (1979) నీడ (1979) పెద్దిల్లు చిన్నిల్లు (1979) (నటుడు, దర్శకుడు) రాముడే రావణుడైతే (1979) రంగూన్ రౌడీ (1979) ఊఫ్ఫేణా (1980) 1980 దశకంలో.. జ్యోతి బనే జ్వాల (హిందీ, 1980) బండోడు గుండమ్మ (1980) భోళా శంకరుడు (1980) బుచ్చిబాబు (1980) సర్కస్ రాముడు (1980) దీపారాధన (1980) ఏడంతస్తుల మేడ (1980) కేటుగాడు (1980) నట్చతిరమ్(1980)(తమిళం) పాలు నీళ్ళు (1980) సర్దార్ పాపారాయుడు (1980) సీతారాములు (1980) శ్రీవారి ముచ్చట్లు (1980) స్వప్న (1980) (దర్శకత్వం) యే కైసా ఇన్సాఫ్ (1980) ప్యాసా సావన్ (1981) (దర్శకత్వం) అద్దాల మేడ (1981) ప్రేమాభిషేకం (1981) ప్రేమ మందిరం (1981) ప్రేమ సింహాసనం (1981) బొబ్బిలి పులి (1982) (స్టోరి, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) గోల్కొండ అబ్బులు (1982) జగన్నాథ రథచక్రాలు (1982) జయసుధ (1982) కృష్ణార్జునులు (1982) మెహిందీ రంగ్ లాయేగీ (హిందీ, 1982) ఓ ఆడది ఓ మగాడు (1982) రాగదీపం (1982) స్వయంవరం (1982) యువరాజు (1982) ప్రేమ్ తపస్య (హిందీ, 1983) బహుదూరపు బాటసారి (1983) మేఘసందేశం (1983) ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983) పోలీస్ వెంకటస్వామి (1983) రాముడు కాదు కృష్ణుడు (1983) రుద్రకాళి (1983) ఊరంతా సంక్రాంతి (1983) యాద్గార్ (హిందీ, 1984) ఆశాజ్యోతి (1984) ఆజ్ కా ఎమ్మెల్యే, రాం అవతార్(1984) అభిమన్యుడు (1984) హైసియత్ (హిందీ, 1984) జగన్ (1984) జస్టిస్ చక్రవర్తి (1984) పోలీస్ పాపన్న (1984) యుద్ధం (1984) జఖ్మి షేర్ (హిందీ, 1984) వఫాదార్ (హిందీ, 1985) (దర్శకత్వం) బ్రహ్మముడి (1985) ఏడడుగుల బంధం (1985) లంచావతారం (1985) పెళ్ళి మీకు అక్షింతలు నాకు (1985) తిరుగుబాటు (1985) ఆది దంపతులు (1986) ధర్మపీఠం దద్దరిల్లింది (1986) తాండ్ర పాపారాయుడు (1986) ఉగ్ర నరసింహం (1986) ఆత్మ బంధువు (1987) బ్రహ్మ నాయుడు (1987) మజ్ను (1987) నేనే రాజు – నేనే మంత్రి (1987) హిట్లర్ (1997) (Actor) విశ్వనాథ నాయకుడు (1987) బ్రహ్మ పుత్రుడు (1988) ఇంటింటి భాగోతం (1988) కాంచన సీత (1988) ప్రజా ప్రతినిధి (1988) లంకేశ్వరుడు (1989) (రచయిత, దర్శకత్వం) బ్లాక్ టైగర్ (1989) మాత్ కీ లడాయి (హిందీ, 1989) నా మొగుడు నాకే సొంతం (1989) టూ టౌన్ రౌడీ (1989) 1990 దశకంలో.. అహంకారి (సినిమా)మా అల్లుడు (1990) అమ్మ రాజీనామా (1991) (నటుడు, దర్శకత్వం) నియంత (1991) రాముడు కాదు రాక్షకుడు (1991) అహంకారి (1992) సూరిగాడు (1992) సుబ్బారాయుడి పెళ్ళి (1992) మామగారు (1991) వెంకన్నబాబు (1992) సంతాన్ (1993) అక్క పెత్తనం చెల్లెలి కాపురం (1993) కుంతీ పుత్రుడు (1993) మామా కోడలు (1993) బంగారు కుటుంబం (1994) నాన్నగారు (1994) కొండపల్లి రత్తయ్య (1995) మాయా బజార్ (1995) ఒరే రిక్షా (1995) విశ్వామిత్ర (1995) కళ్యాణ ప్రాప్తిరస్తు (1996) ఒసే రాములమ్మ (1997) గ్రీకువీరుడు (1998) 2000 దశకంలో.. అడవి చుక్క (2000) కంటే కూతుర్నే కను (2000) (స్టోరి, మాటలు, పాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం) సమ్మక్క సారక్క (2000) చిన్నా (2001) కొండవీటి సింహాసనం (2002) (నిర్మాత, దర్శకత్వం) రైఫిల్స్ (2002)ఫూల్స్ (2003) మైసమ్మ ఐపీఎస్(2007) (కథా రచయిత) ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007) మేస్త్రీ 2009 యంగ్ ఇండియా 2010 పరమ వీరచక్ర 2011 ఎర్రబస్సు 2014 (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'నోట మాటలు రావడం లేదు'
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మృతి సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. దాసరి ఇంటికి చేరుకుని ఆయన బౌతికకాయాన్ని దర్శించుకున్న అనంతరం టాలీవుడ్ 'రాములమ్మ' విజయశాంతి మీడియాతో మాట్లాడారు. 'అసలు మాటలు రావడం లేదు. నేను ఇంకా షాక్‌లో ఉన్నాను. దాసరిగారు ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన ఓ గొప్ప దార్శనికుడు. ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని' నటి విజయశాంతి తెలిపారు. 'సునామీ వస్తే ప్రజలు ఎలా అయిపోతారో.. దర్శక దిగ్గజం దాసరి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక సినీ ఇండస్ట్రీ అలా అయిపోతుంది. ఇండస్ట్రీలో కార్మికుల నుంచి దర్శకులు, నిర్మాతలకు సమస్యలు వచ్చినా నిమిషాల్లో పరిష్కరించే వ్యక్తి దాసరి' అని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. పెద్ద దిక్కును కోల్పోయాం ఒక తెలుగు దర్శకుడిగా అన్ని 151 చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడే కెప్టెన్ అని నిరూపించిన వ్యక్తి దాసరిగారు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు అండగా నిలబడే వ్యక్తి కూడా ఆయనే. తెలుగు చిత్రసీమకు ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేం. దాసరిగారి దర్శకత్వంలో అహంకారి అనే సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో ఆయనతో చేసిన జర్నీ మరచిపోలేను. ఆయన మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. దాసరిగారి కుటుంబంతో కూడా మాకెంతో సన్నిహితంగా ఉంటారు. దాసరినారాయణరావుగారి మరణం మాకు, కుటుంబానికే కాదు, తెలుగు చిత్రసీమకే తీరనిలోటు. దాసరి వంటి దర్శకుడు మళ్ళీ రాడు, రాలేడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ దేవణ్ణి వేడుకుంటున్నాను. - డా.రాజశేఖర్, జీవిత 'నన్ను నటుడిగా ఆదరించి ఆశీర్వదించిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో దాసరి గారు ప్రథములు, అటువంటి గొప్ప మనిషి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు' అని నటుడు శ్రీవిష్ణు అన్నారు. దాసరి నారాయణరావు మృతి కళా రంగానికి తీరనిలోటు. దాసరితో నాకు ప్రత్యేక అనుబంధం ఉందిని ప్రజా గాయకుడు గద్దర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక వ్యక్తిగా నాపై దాసరి గారి ప్రభావం చాలా ఉంటుంది. అలాంటి మనిషి మరణ వార్త నన్ను ఎంతగానో బాధించింది. - నటుడు, దర్శకుడు రవిబాబు నా సినిమాల్లో తెలుగుదనం ఎక్కువగా ఉండాలనే ఆలోచన దాసరి గారి వల్లనే వచ్చింది. ఆయన సినిమాలు నాపై చూపిన ప్రభావం అలాంటిది. అలాంటి వ్యక్తి మరణం నన్ను కలచివేసింది. - దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి -
ఆత్మీయ అనుబంధం
- జిల్లాలో మూడుసార్లు పర్యటించిన దర్శకరత్న కర్నూలు(కల్చరల్): సుప్రసిద్ధ సినీ దర్శకులు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుకు కర్నూలు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. జిల్లాలో దాసరి మూడుసార్లు పర్యటించి స్థానిక నాయకులు, కళాకారులు, రచయితలతో ముచ్చటించారు. దివంగత కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో దాసరి నారాయణరావుకు అత్యంత స్నేహపూర్వక అనుబంధం ఉండేది. చక్కని రాజకీయ సామాజిక విలువలు కలిగిన నేతగా విజయభాస్కర్‌రెడ్డిని దాసరి ఎంతగానో ఆదరించే వారు. విజయభాస్కర్‌రెడ్డి పరమపదించినపుడు ఆయన అంత్యక్రియల సందర్భంగా అంతిమయాత్రలో కర్నూలు నగర వీధుల్లో నడుచుకుంటూ పాల్గొన్నారు. స్థానిక కిసాన్ఘాట్ వద్ద జరిగిన అంత్యక్రియల్లో ఆయన భాస్కర్‌రెడ్డి భౌతికాయం వద్ద విషణ్ణవదనంతో నివాళులు అర్పించి కోట్ల కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించారు. విజయభాస్కర్‌రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డితోనూ దాసరికి ఆత్మీయ అనుబంధం ఉంది. కర్నూలులో సుప్రసిద్ధ చలన చిత్రనటుడు శోభన్‌బాబు విగ్రహావిష్కరణ సందర్భంగా దాసరి నారాయణరావు 2011 మే నెలలో కర్నూలును సందర్శించారు. అభిమానుల మధ్య దాసరి నారాయణరావు స్థానిక కిడ్స్ వరల్డ్ సమీపంలో ఆనందోత్సాహాల నడుమ శోభన్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సునయన ఆడిటోరియంలో శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శోభన్‌భాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఆహ్వానం మేరకు తాను కర్నూలుకు వచ్చానని, శోభన్‌బాబుతో తనకున్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. 2004 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా దాసరి నారాయణరావు కర్నూలు, డోన్, ప్యాపిలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కళాకారులు, రచయితలతో.. 2015 డిసెంబర్ 27న కర్నూలు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, బనగానపల్లె అరుణభారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డిలు దాసరి నారాయణరావును హైదరాబాద్‌లో కలిసి ఆయనతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. రాజారెడ్డి రచించిన మానవ జీవనయానం అనే పుస్తకాన్ని దాసరి ఆయన స్వగృహంలో ఆవిష్కరించి రచయితలతో గంటసేపు ముచ్చటించారు. కర్నూలు రచయిత ఇనాయతుల్లా రచించిన నిచ్చెన పుస్తకాన్ని అందుకొని అందులోని కర్నూలు మాండలికాన్ని ఆయన కొనియాడారు. కర్నూలు గజల్ గాయకుడు మమహ్మద్మియా పాడిన గజల్‌ను ఆసాంతం విని ఆనందోత్సాహంతో అభినందించారు. కర్నూలు జిల్లా రాయలసీమలో ప్రత్యేకతను సంతరించుకొందని.. కర్నూలు అంటే తనకు ప్రత్యేక అభిమానమని ఈ సందర్భంగా ఆయన రచయితలు, కళాకారులతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాసరి మృతి పట్ల లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు మియా, ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. దాసరి మా సంస్థ గౌరవ సలహాదారు నాకు దాసరి నారాయణ రావుతో ఆత్మీయ అనుబంధం ఉంది. 2011లో నేను హైదరాబాద్ వెళ్లి, కర్నూలులో శోభన్‌బాబు విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించిన వెంటనే ఆయన మారు మాట్లాడకుండా నా ఆహ్వానాన్ని మన్నించి కర్నూలుకు విచ్చేశారు. శోభన్‌బాబుతో బావా బావా అనుకునే ఆత్మీయ బంధుత్వం తనకు ఉందని దాసరి గుర్తు చేశారు. 1975లో దాసరి తొలిసారిగా బలిపీఠం అనే సినిమాను శోభన్‌బాబుతో తీసి సూపర్‌హిట్ సాధించడంతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. - సుధాకర్‌బాబు, శోభన్‌బాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ -
‘సినిమా రంగ అంబేద్కర్ దాసరి’
హైదరాబాద్: క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్లుగా దాసరికి ముందు, దాసరి తర్వాత అని చెప్పుకోవాల్సిందేనని, అంత గొప్పస్థానానికి దాసరి నారాయణరావు ఎదిగారని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో దర్శక రత్న దాసరి నారాయణ రావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన పార్ధీవ దేహాన్ని కిమ్స్ ఆస్పత్రిలో చూసిన అనంతరం నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ కుల,మత, లింగ, బడుగు, బలహీన వర్గాలు అనే తేడా లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి సినిమా రంగంలో జీవితాన్నిచ్చిన గొప్పవ్యక్తి దాసరి నారాయణరావు అని అన్నారు. సినిమా రంగంలో దాసరి ఒక అంబేద్కర్లాంటివారని చెప్పారు. -
దాసరి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అని, అన్నారు. దశాబ్దాల పాటు దాసరి తెలుగు సినీ రంగానికి పెద్ద దిక్కుగా ఉన్నారని, సినిమా రంగంలో ఆయన ఒక యుగకర్త అని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన మహా దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, పత్రికాధిపతిగా, మంచి మనిషిగా దాసరి ఎప్పటికీ చిరస్మరణీయులని వైఎస్ జగన్ అన్నారు. దాసరి తెలుగు సినిమా రంగంలతో ఒక విప్లవాన్ని సృష్టించారని, కథే హీరోగా ఆయన తిరుగులేని చిత్రాలను నిర్మించారని పేర్కొన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. Deeply saddened to know of the demise of Dasari NarayanaRao garu, an Indian cinema legend. Heartfelt condolences to his family members. — YS Jagan Mohan Reddy (@ysjagan) 30 May 2017 -
భోరున విలపించిన మోహన్ బాబు
-
భోరున విలపించిన మోహన్ బాబు
హైదరాబాద్ : దాసరి నారాయణరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్థంభాన్ని కోల్పోయామని నటుడు మోహన్ బాబు అన్నారు. దాసరి లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా మీడియా ఎదుట భోరున విలపించారు. దాసరి తనకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడని, నటనలో తనకు ఓనమాలు నేర్పిన గురువు అని చెప్పుకొచ్చారు. తనకు నటుడిగా గుర్తింపునిచ్చిన దాసరి గారి మరణాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ సాయినాధుని సాక్షిగా కోరుకొంటున్నాని మోహన్ బాబు అన్నారు. తనకు నటుడుగా దాసరి జన్మినిచ్చారన్నారు. నటుడిగా తనకో జీవితాన్ని ప్రసాదించారని తెలిపారు. కన్నతల్లి కన్నా ఎక్కువగా తన గురువు దాసరి, ఆయన సతీమణి వద్దే ఎక్కువ సమయాన్ని గడిపానని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. అస్తమించిన తెలుగు శిఖరం: బోయపాటి శీను ‘దర్శక ద్రోణాచార్యుడు మా దాసరి గారు మా మధ్య లేరనే వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం తెలుగు సినిమాకి తీరని లోటు.ఆయన చూపిన బాటలో మా దర్శకులం అందరం నడిచి.. ఆయన ఆశయాన్ని నెరవేరుస్తాం’ అని అన్నారు. అలాగే దాసరి లేని లోటు తీర్చలేనిదన్నారు సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. ఆయన అసమాన ప్రతిభావంతుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఉదయం పత్రికలో పని చేసినప్పుడు దాసరితో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
దర్శకత్వంలో తొలి ప్రపంచ రికార్డు దాసరిదే
హైదరాబాద్: తీవ్ర అనారోగ్యం కారణంగా కన్నుమూసిన దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు ప్రపంచ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారి 100 సినిమాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. అలాగే, 151 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 1974లో తాతా మనవడు సినిమాతో.. వెండితెరకు పరిచయం అయినా దాసరి తొలి సినిమాకే నంది అవార్డు అందుకొని రికార్డు సృష్టించారు. ఆ తర్వాత తీసిన స్వర్గం-నరకం సినిమాకు, 1983లో మేఘ సందేశం, 1992లో మామగారు సినిమాలకు నంది అవార్డులు అందుకున్నారు. దాసరి నారాయణరావు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. మేఘ సందేశం, శివరంజని, గోరింటాకు, ఏడంతస్థుల మేడ, స్వయంవరం, ప్రేమాభిషేకం, బొబ్బిలిపులి, తాండ్ర పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు, మజ్ను, ఓసేయ్ రాములమ్మ, అమ్మ రాజీనామా, మామగారు వంటి అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఎర్రబస్సు. దాదాపు 53 సినిమాలు నిర్మించిన దాసరి 250కి పైగా చిత్రాలకు డైలాగ్ రైటర్ కూడా పనిచేశారు. దాసరి 1986లో ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. -
దాసరి దేవుడు, నా సర్వస్వం...
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు. దాసరి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయడం నిజంగా అదృష్టమన్నారు. ‘ఓసే రాములమ్మ’ చిత్రంలో పాటను తనతో దాసరి పట్టుబట్టి మరీ పాడించారని వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి ఇక లేరనేది.. తెలుగు చిత్ర పరిశ్రమకు దురదృష్టకరమైన వార్త అన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ...’ దాసరి నారాయణరావు నా దేవుడు, నా జీవితం...నా సర్వస్వం. ఆయన లేకుండా ఈ రోజు సుద్దాల అశోక్ తేజ లేడు. గత 22 ఏళ్లుగా ఆయన సొంతబిడ్డలా నన్ను చూసుకున్నారు.’ అని అన్నారు. అలాగే మహోన్నత శిఖరం ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. -
దాసరి సినిమాలే ఎన్టీఆర్‌ని సీఎం చేశాయి!
హైదరాబాద్: దర్శక రత్న దాసరి నారాయణరావు తన 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. చరిత్రలో నిలిచిపోయే భారీ బ్లాక్ బస్టర్లను అందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్ పాపరాయుడులాంటి సినిమాలే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించాయనడంలో అతిషయోక్తి కాదు. అలాగే ఏ ఎన్నార్ హీరోగా ఆయన తెరకెక్కించిన మేఘసందేశం సినిమా భారీ సక్సెస్ సాధించటంతోపాటు ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మలాంటి సినిమాలతో సమాజంలోని సమస్యలను ఎత్తి చూపించారు.. మేస్త్రీ, ఎమ్మెల్యే ఏడుకొండలులాంటి సినిమాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దాదాపు తెలుగు ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దాసరి.. నటుడిగానూ స్టార్ అనిపించుకున్నారు. మామగారు, మేస్త్రీలాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొని మహానటుల సరసన నిలిచారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు. దాదాపు దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు. అంతేకాదు దర్శకుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని పరిచయం చేసిన తొలి దర్శకుడు కూడా దాసరి గారే. ఆయన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఆయనకు పద్దెనిమిదివేల అభిమానుల సంఘాలు ఉండేవి. కమర్షియల్ చిత్రాలు చేస్తూనే సామాజిక సమస్యలు ఇతివృత్తాలుగా సినిమాలు తెరకెక్కించారు. ముఖ్యంగా ఆయన సినిమాలన్ని స్త్రీ సమస్యల కథాంశాలుగా తెరకెక్కాయి. సినిమా రంగంలో జరుగుతున్న అన్యాయలపై కూడా ఆయన తనదైన అస్త్రాన్ని ప్రయోగించారు. వెండితెర వెనుక చీకటి కోణాల్ని అద్దాల మేడ, శివరంజని సినిమాలతో ప్రపంచానికి తెలిసేలా చేశారు. తరువాత బుల్లితెర మీద కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. విశ్వమిత్ర అనే హిందీ సిరీయల్తో బుల్లితెర దర్శకుడిగా కూడా మారారు.ఆయన నిర్మాణ సంస్థ ద్వారా అనేక సీరియల్స్ నిర్మించారు. సినీరంగంలో మంచి స్థానంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తరువాత కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన దాసరి మరణం సినీరంగానికే కాదు.. తెలుగు ప్రజలకే తీరని లోటు. -
ఆ ఒక్కదానికే తలవంచిన ‘దర్శక’ శిఖరం
దాసరి... ఓ దార్శనికుడు. నాలుగున్న దశాబ్దాలుగా తెలుగు సినిమా పురోగతికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న శ్రామికుడు. సమాజంలో సమస్యలపై సినిమాల ద్వారా బాణాలు సంధించిన సైనికుడు. మాటలతో మనకు మంచి బోధించిన మార్గదర్శకుడు. ఎందరో (ఏకలవ్య) శిష్యులు, దర్శకులకు గురువుగా నిలిచిన నిలువెత్తు శిఖరం. ప్రతిభావంతులు ఎందరికో నీడ ఇచ్చిన ‘దర్శక’ శిఖరం. దాసరి ప్రయాణం నవతరం దర్శకులకు పాఠం. ఆయన దర్శకుడు మాత్రమే కాదు మాటల రచయిత, పాటల రచయిత కూడా. 150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి సుమారు 250 చిత్రాలకు మాటలు, అనేక సినిమాల్లో పాటలు రాశారు. దాసరి ప్రతిభ అంత వరకేనా? కాదండోయ్! ఆయన నటుడు, నిర్మాత కూడా. తెలుగుకు మాత్రమే దాసరి పరిమితం కాలేదు. హిందీలోనూ దర్శకునిగా సత్తా చాటారు. తమిళ, కన్నడ సినిమాల్లో నటునిగా మెరిశారు. దాసరిది ఘనచరిత్ర... ప్రతిభకు చేయూత ఇచ్చిన చరిత. శిఖరం దేనికీ తలొంచి ఎరగదు. కానీ ‘దర్శక’ శిఖరం దాసరి ఒక్కదాని ముందు ఎప్పుడూ తలొంచారు. దర్శకునిగా ప్రయాణం ప్రారంభించినప్పట్నుంచి ఆ ఒక్కదాని ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆ ఒక్కటి... కథ, సినిమా కథ. తాను రాసిన కథ ఎవర్ని కోరితే వాళ్లతోనే సినిమాలు తీసిన దర్శకుడు దాసరి నారాయణరావు. తొలి సినిమా ‘తాతా మనవడు’ నుంచి మొదలుపెడితే తాజా ‘ఎర్ర బస్సు’ వరకు ఆయన దారి మార్చుకోలేదు. రెండు తరాల అగ్ర నటులతో, హీరోలతో పని చేశారాయన. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణలతో పాటు తర్వాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లతో సినిమాలు తీశారు. స్టార్ దర్శకునిగా పేరొచ్చిన తర్వాత కొత్త నటీనటులతో, తక్కువ నిర్మాణ వ్యయంలో సినిమాలు తీయడానికి వెనుకాడలేదు. కథకు పట్టం కట్టిన నిత్య కృషీవలుడు. తొలి సినిమా ‘తాతా మనవడు’లో ‘అనుబంధం అత్మీయత అంతా ఓ బూటకం’ అంటూ కన్నకొడుకు నిరాదరణకు గురైన తల్లిదండ్రల ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించారు. స్వర్గం–నరకం, మేఘ సందేశం, కంటే కూతుర్నే కను వంటి సినిమాల్లో ప్రేక్షకుల హృదయపు లోతుల్లో తడిని తట్టి లేపారు. దాసరి ఫ్యామిలీ సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ‘తాండ్ర పాపారాయుడు‘, ‘బొబ్బిలి పులి‘, ‘సర్దార్ పాపారాయుడు‘ వంటి కమర్షియల్ సినిమాలతో గర్జించారు. ‘ప్రేమాభిషేకం‘, ‘మజ్ను‘ సినిమాల్లో ప్రేమను ప్రేక్షకులకు చూపారు. ‘ఒసేయ్ రాములమ్మ’లో సమాజంలో అసమానతలను ఎత్తి చూపారు. ఈ సినిమాలు దాసరి తీసిన ఆణిముత్యాల్లో కొన్ని మాత్రమే. ‘అమ్మ రాజీనామా’, ‘సూరిగాడు’ ఇలా ఎన్నో ఎన్నెన్నో గొప్ప సినిమాలను ప్రేక్షకులకు అందించారాయన. ఆయన ప్రతిభకు మెచ్చి పలు అవార్డులు సలాం చేశాయి. రెండు జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను దాసరి అందుకున్నారు. నేపథ్యం: ‘దర్శకరత్న’ దాసరి 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. బి.ఎ. చదివారు. చదువుకునే రోజుల్లోనే నాటకాల పోటీల్లో పాల్గొన్నారు. బహుమతులు గెలుచుకున్నారు. అత్యధిక చిత్రాల దర్శకునిగా దాసరి లిమ్కా వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించారు. మేఘ సందేశం (1983), తాండ్ర పాపారాయుడు (1986), సూరిగాడు (1992), కంటే కూతుర్నే కను (2000) వంటి చిత్రాలు దర్శకుడిగా దాసరికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆశాజ్యోతి’, ‘ఆజ్ కా ఎమ్మెల్యే’, ‘రామ్ అవతార్’ చిత్రాలలో రాజేశ్ ఖన్నాను దాసరి విలక్షణమైన భిన్న పాత్రల్లో చూపించారు. నటులు మోహన్‌బాబు, ఆర్.నారాయణమూర్తి, దర్శకులు కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి ఇంకా పలువురు సాంకేతిక నిపుణుల్ని దాసరే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. రాజకీయాలు: దాసరి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ’సాక్షి’ ఎక్సలెన్సీ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది దర్శకరత్న దాసరికి ‘తెలుగు శిఖరం’అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో దాసరి మంగళవారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి ’సాక్షి’ సంతాపం తెలిపింది. -
దాసరి పరిస్థితి మళ్లీ ఇబ్బందికరం?
-
దాసరి పరిస్థితి మళ్లీ ఇబ్బందికరం?
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి మరోసారి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ కొనసాగుతోంది. గతంలో సుదీర్ఘ కాలం పాటు దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది, తర్వాత డిశ్చార్జి కాగా, వారం రోజుల క్రితం మరోసారి ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయనకు మరోసారి సర్జరరీ అయినట్లు తెలుస్తోంది. అయితే శరీరంలోని పలు భాగాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి ఎలా ఉందన్నది తెలియడం లేదు. గతంలో ఆయనకు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఆయన డయాలసిస్‌కు ఎలా స్పందిస్తున్నారో చూసిన తర్వాతే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఉదయం నుంచి బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారంటున్నారు. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం ఒకరకంగా ఆందోళనకరమైన అంశంగానే భావించాల్సి ఉంటుందని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డయాలసిస్ నెమ్మదిగా సాగే ప్రక్రియ కాబట్టి వైద్యులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటి తర్వాత హెల్త్ బులెటిన్ రావచ్చని అంటున్నారు. దీనిపై టాలీవుడ్‌కు చెందిన కొందరు నిర్మాతలు కూడా స్పందించారు. ఆయన పరిస్థితి కష్టంగానే ఉందంటున్నారు. అన్నవాహికకు రంధ్రాలు పడటంతో ఇన్ఫెక్షన్ సోకిందని చెబుతున్నారు. అయితే ఇవేవీ అధికారిక సమాచారాలు మాత్రం కావు. ఆయన సన్నిహితులు, మిత్రులు చెప్పిన విషయాలు మాత్రమే. కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సమగ్రంగా చెబితే తప్ప ఈ విషయాలను పూర్తిగా నిర్ధారించుకోలేము. ఇటీవలే ఆయన తన జన్మదినాన్ని చాలా వైభవంగా జరుపుకొన్నారు. -
ఆస్పత్రి నుంచి దాసరి నారాయణరావు డిశ్చార్జ్
హైదరాబాద్ : ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మంగళవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గత రెండు నెలలుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ జనవరి 29న దాసరి కిమ్స్‌లో చేరారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో దాసరికి గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కిమ్స్ ఆసుపత్రి సీఈవో భాస్కర్ రావు నేతృత్వంలో దాసరికి చికిత్స చేశారు. అనంతరం ఆయనను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. ప్రస్తుతం దాసరి పూర్తిగా కోలుకోవడంతో ఆయనను డిశ్చార్జి చేసినట్లు డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. -
దాసరిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శకరత్న దాసరి నారాయణరావును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం పరామర్శించారు. నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, బాలసౌరి తదితరులతో కలిసి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన ఆయన దాసరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడారు. దాసరి త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ఇంకా ఆస్పత్రిలోనే దాసరి
హైదరాబాద్ : సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని కిమ్స్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ బి.భాస్కర్‌రావు తెలిపారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ గత 35 రోజుల క్రితం దాసరి ఆసుపత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ క్లీన్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడం, కిడ్నీల పనితీరు మందగించడంతో ఆయన్ను నాలుగు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని, మూత్ర పిండాల పని తీరు కూడా మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. -
'దాసరి కోలుకుంటున్నారు'
పరామర్శించిన చంద్రబాబు, చిరు హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆసు పత్రిలో చేరిన దర్శకనిర్మాత, మాజీ కేంద్రం మంత్రి దాసరి నారాయణరావును ఏపీ సీఎం చంద్ర బాబు శుక్రవారం పరామర్శించారు. ఆయనతో పాటు రాజ్య సభ సభ్యులు చిరంజీవి, టి.సుబ్బ రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంత రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, సినీ ప్రముఖులు అల్లు అరవింద్, జయప్రద, అశ్వనీదత్, వీవీ వినాయక్, సి.కల్యాణ్, విజయబాపినీడు తదితరులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని పరా మర్శించారు. నటుడు, నిర్మాత మోహన్‌బాబు ఉదయం నుంచీ ఆసుపత్రి వద్దే ఉన్నారు. కిడ్నీ పనితీరు మెరుగుపడింది: వైద్యులు దాసరి నారాయణరావు కోలుకుంటున్నారని, ఆయన కిడ్నీ పనితీరు మెరుగుపడిందని, డయాలసిస్ అవసరం లేకుండా పనిచేస్తున్నాయని కిమ్స్ సర్జన్లు డాక్టర్ కేవీ కృష్ణ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడిందని, మరో రెండు రోజుల్లో ఆయనను సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. త్వరలోనే కోలుకుంటారు: చంద్రబాబు ‘నాతో ఎంతో సన్నిహితంగా ఉండే దాసరి నారాయణరావు అనారోగ్యానికి గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయన్ని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎంతో కులాసాగా ఉన్నారు. తొందరగా కోలుకుంటారనే విశ్వాసం ఉంది’అని చంద్రబాబు చెప్పారు. దాసరి ఎంతో హుషారుగా ఉన్నారని, మాట్లాడలేకపోతున్నా పెన్‌తో తన ‘ఖైదీ నంబర్ 150’కలెక్షన్స్ గురించి అడిగారని చిరంజీవి తెలిపారు. కలెక్షన్లు రూ.250 కోట్లు దాటాలని ఆకాంక్షించారన్నారు. చిరు, పవన్‌తో సినిమా: సుబ్బరామిరెడ్డి ‘ఇటీవలే దాసరిని కలిసినప్పుడు జాతీయ స్థాయి నాటకోత్సవాలు నిర్వహించాలని మాట్లాడుకున్నాం. అంతలోపు అనారోగ్యానికి గురయ్యారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో చిత్రం తీస్తానని ప్రకటించగానే కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ టాప్ హీరోలే. సమానమైన పాత్రలతో కథ సిద్ధం చేయగానే సినిమా మొదలు పెడతాం. అయితే ఇది రాజకీయ ఉద్దేశాలతో తీసేది కాదు’అని సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. -
రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి
మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం కిమ్స్ వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, రెండు రోజుల్లో సాధారణ వార్డుకు తరలిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆయన వెంటిలేటర్ మీద ఉండటంతో మాట్లాడలేకపోతున్నారని వివరించారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ రావడంతో.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తొలగించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉండటంతో దాసరి నారాయణరావును వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. మధ్యలో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా రావడంతో ఆయనకు డయాలసిస్ చేశారు. దాసరి ఆరోగ్యం గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు వాకబు చేశారు. తెలుగు సినీ పరిశ్రమ యావత్తు కిమ్స్ ఆస్పత్రికి తరలివచ్చి ఆయనను పరామర్శించింది. -
రెండు రోజుల్లో సాధారణవార్డుకు దాసరి
-
దాసరి ఆరోగ్యంపై ప్రముఖుల ఆరా!
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావును పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుక్రవారం పరామర్శించారు. దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు వివి వినాయక్, సినీనటి జయప్రద తదితరులు దాసరి నారాయణరావును ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కూడా దాసరి నారాయణను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని, ఆయన్ని చూశాక ధైర్యం వచ్చిందని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని చిరంజీవి మీడియాతో పేర్కొన్నరు. -
దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
-
దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు ఆరోగ్యం మెరుగవుతోందని వైద్యులు చెప్పారు. దాసరి ఆరోగ్యంపై గురువారం సాయంత్రం కిమ్స్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డయాలసిస్ అవసరం లేకుండానే దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, మూడు నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితికి వస్తుందని తెలిపారు. వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నామని వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: దర్శకుడు దాసరికి అస్వస్థత) -
దాసరికి పవన్ కల్యాణ్ పరామర్శ
-
దాసరిని పరామర్శించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న దాసరిని కలిసిన పవన్ అనంతరం డాక్టర్లతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాసరి నారాయణరావు త్వరలో కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దర్శకరత్న దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు స్టెంట్ వేయడంతో పాటు.. వెంటిలెటర్‌పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం దాసరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం
హైదరాబాద్: కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కిడ్నీల పనితీరు బాగానే ఉందని ఆస్పత్రి ఎండీ భాస్కరరావు చెప్పారు. మంగళవారం ఆయనకు డయాలసిస్ చేశామని, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. (చదవండి: ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు) -
దాసరికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్ జగన్ బుధవారం కలిశారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. (చదవండి : దర్శకుడు దాసరికి అస్వస్థత ) దాసరి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. దాసరిని పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఇతర నేతలు ఉన్నారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
రాజధాని విజన్ గ్రాఫిక్స్‌లోనేనా?
కొమ్మినేని శ్రీనివాసరావుతో దర్శకరత్న దాసరి నారాయణరావు రాజధానిని గ్రాఫిక్స్‌లో అందంగా చూపించడం మంచిదే కానీ అమరావతిని మన తరంలో చూడలేమన్నదే వాస్తవమని ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అందమైన, గౌప్పదైన రాజధానిని నిర్మిస్తామన్న సంకల్పం, విజన్ మంచిదే కానీ ఒక్క రాజధానిమీదే పూర్తి కేంద్రీకరణ చేస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అది మేలు చేయదన్నారు. చేసిన వాగ్దానాలను చంద్రబాబు నెరవేర్చలేదు కాబట్టే వచ్చే ఎన్నికల్లో ప్రభు త్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంటుందన్నారు. ముద్రగడ అనే ఉద్యమనేతను కార్నర్ చేసి, ఆసుపత్రిలో పడేసి, టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవరూ రాకుండా, కలువకుండా చేసి మానసిక హింసకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. విభజన తనను బాగా గాయపర్చింది కానీ, విభజనానంతరం తెలంగాణలో చాలాబాగా పనిచేస్తున్నారని కితా బిచ్చిన దాసరి నారాయణరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. సినీరంగం.. రాజకీయ రంగం రెండింట్లో భాసిల్లారు. మీ అనుభూతి ఏంటి? సినీరంగం నా ఊపిరి. ఎందుకంటే 9వ ఏట రంగస్థలం ఎక్కాను. అప్పట్నుంచి నటుడిగా, రచయితగా దర్శకుడిగా కొనసాగుతూ వచ్చాను. ఇక రాజకీయం అంటారా. యాదృచ్ఛికంగా జరిగింది. రాజకీయాల్లోకి వస్తానని, రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘కమ్ బ్యాక్ టు పవర్’ అనే డాక్యుమెంటరీ చిత్రం తోడుగా ఇందిరాగాంధీతో తొలి పరిచయం మొదలుకుని రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ వరకు రాజకీయాల్లో నా ప్రవేశం పూర్తిగా యాదృచ్ఛికంగానే జరిగిందని చెప్పాలి. రాజ్యసభకు రావడం, కేంద్ర మంత్రిగా పనిచేయడం అన్నీ యాక్సిడెంటల్‌గా జరిగినవే. మీరు తీసిన తాతామనవడు గొప్ప స్ఫూర్తినిచ్చిన చిత్రం కదా? ఆ చిత్ర విజయమే దాని స్ఫూర్తి ఎంత గొప్పదో చెబుతుంది. దాని విజయం మామూలు విజయం కాదు.. రెండు కలర్ పిక్చర్లు.. ఇద్దరు అగ్రనటుల సినిమాల మధ్య విడుదలైంది. ఎన్టీఆర్ చిత్రం దేశోద్ధారకుడు, నాగేశ్వరరావు చిత్రం బంగారుబాబు. రెండు సినిమాల మధ్య ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా విడుదలై 350 రోజులు ఆడిందంటే.. అది ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందో నేను మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్టీఆర్, చంద్రబాబు.. ముఖ్యమంత్రులుగా వీరిపై మీ అంచనా? ఎన్టీరామారావుది విశిష్టమైన వ్యక్తిత్వం. సినిమాల్లోనూ, రాజకీయాల్లో కూడా తనది ప్రత్యేకతే. ఆయన నిజంగా బతికుంటే భారతదేశానికి ప్రధాని అయి ఉండే వారు. చాలా స్వచ్ఛమైన వ్యక్తి. కడుపులో ఏమీ ఉండదు. దాచుకోడు. ఓపెన్‌గా ఉంటాడు. ఆ ఓపెన్నెస్సే రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసింది. ఇక బాబు గురించి ఇవ్వాళ మాట్లాడనవసరం లేదు. అవసరం వచ్చిన రోజు తప్పక మాట్లాడతాను. ముద్రగడను పలకరించడానికి వెళితే కూడా మిమ్మల్ని అరెస్టు చేశారు కదా? మనం ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, కిర్లంపూడిలో ఉన్న మని షిని చూడ్డానికి ఇన్ని నిబంధనలు, ఆంక్షలు ఉన్నట్లయితే.. అసలు ఏం జరుగుతోంది క్కడ? నిరంకుశ రాజ్యంలో ఉన్నామా. దేశంలో వాక్సా్వతంత్య్రం, భావస్వా తంత్య్రం, స్వేచ్ఛ అన్నీ పోయాయా? వ్యక్తిగతంగా బాబు మీద నాకే వ్యతిరేకతా లేదు. కానీ ముద్రగడను ఆ స్థాయిలో ట్రీట్ చేయడానికి ఏ శక్తులు బాబు వెనక పని చేశాయో నాకు తెలీదు కానీ ఇప్పటికీ నాకు బాధగానే ఉంది. ఒక మనిషిని ఆసుపత్రిలో పడేసి టీవీ చూడనీకుండా, పేపరు కూడా చదవనీకుండా, ఎవర్నీ చెంతకు రానీయకుండా, హింసాత్మకమైన పరిస్థితిని సృష్టిం చడం భరించలేకున్నాను. ఒక వ్యక్తిని కార్నర్ చేసి, మానసికంగా హింసించడానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. మీరు రిజర్వేషన్ ఇవ్వండి. ఇవ్వకపోండి. దాని గురించి నేను మాట్లాడను, వ్యక్తిగతంగా ఒక పోరాటం చేస్తున్న ఉద్యమకారుడిని ఇలా చేసేస్తే ఎలా అర్థం చేసుకోవాలి? మహాత్మాగాంధీ ఉద్యమం చేసినప్పుడు బ్రిటిష్ వాళ్లు మన దేశ స్తులు కారు. మరి వాళ్లేం చేసి ఉండాలి? ఉద్యమానికి మీరు స్వేచ్ఛనివ్వాలి. పాద యాత్రకు వెళతానంటే నేను పంపించనంటే ఎలా? అమరావతి, భూసేకరణపై మీ అభిప్రాయం? అమరావతిలో రాజధాని కట్టడమనేది చాలా అవసరం. హైదరాబాద్ వంటి రాజ ధానిని కోల్పోయిన తర్వాత అంత గొప్ప రాజధానిని మళ్లీ నిర్మించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం దాన్ని చేపట్టి పూర్తి చేయాలి కూడా. కాకపోతే రెండు పంటలు పండే ప్రాంతాన్ని బీడుభూములు చేసి, బలవంతంగా లాక్కునికూడా మేం లాక్కోలేదు వాళ్లే మాకు ఇచ్చారు అని చెబుతారా. ఇచ్చిన వారేమో బక్కరైతులు లాగేసుకున్నారు అని వాళ్లు సామాన్యంగా చెప్పగలరా.. పవర్ ఈజ్ మైటీ. అధికారం ముందు అనా మకులు ఏం మాట్లాడగలరు? కానీ నా ఉద్దేశంలో అమరావతిని మన తరంలో చూడలేం. చాలా సమయం పడుతుంది. దానికి సంబంధించి ఇంకా ఎన్నో వనరులు రావాలి. నిధులు రావాలి. కాగితాలమీద సీజీ వర్క్‌లో ఇది అమరావతి అని గ్రాఫిక్సులో చాలా అందంగా చూపించుకోవచ్చు. కానీ అవన్నీవస్తే అమరావతి చాలా గొప్ప రాజ« దాని అవుతుంది. ఆయన కల, సంకల్పం, విజన్ మంచిదే. నేను తప్పు పట్టను. కానీ పూర్తి కేంద్రీకరణ ఒక రాజధానిపైనే పెట్టేస్తే అది రాష్ట్రాభి వృద్ధికి ఎలా ప్రయోజనం చేస్తుంది? బాబు చేసిన వాగ్దానాలు, రుణమాఫీ వంటి వాటిపై మీ అభిప్రాయం? ఒక్కమాటలో చెబుతా. చేసిన వాగ్దానాలను బాబు నెరవేర్చలేదు. రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం? నాపట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. కలసి పని చేశాం. అలాంటి లీడర్ని నేను చూడలేదు. నమ్మిన మనిషికి ప్రాణం ఇస్తారు. మంచివాడా, చెడ్డవాడా, గతంలో తప్పులు చేశాడా, ఒప్పులు చేశాడా అనే విషయం పక్కనబెట్టి తనను నమ్మి వచ్చినవాడికి ప్రాణం ఇచ్చేవారు. అందుకే అంత విశ్వాసం గల మనుషులు ఆయనకు ఏర్పడ్డారు. ఏదైనా చేయాలి అనుకుంటే ఏ రూల్, ఏ సెక్షన్ అడ్డువచ్చినా సరే.. చేయాలనుకుంటే చేసేస్తారు. ఒకరిని అడగడం, చర్చిం చడం, దాన్ని పెండింగులో పెట్టడం లాంటివి చేయరు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పనితీరుపై మీ అభిప్రాయం? వండర్ఫుల్ పర్సన్. గత ఎన్నికల్లో తాను నెగ్గకపోవటం అనేది ఆయన పార్టీకి చాలా బలమైన పునాదిని కల్పించిందనుకుంటున్నాను. ఇప్పుడాయనలో చాలా పరి ణతి కనిపిస్తోంది. ఏ అంశంమీద మాట్లాడినా స్టడీ చేసి పూర్వాపరాల తోటి, గణాంకాల తోటి చెప్పగలిగిన ప్రతిపక్ష నేత జగన్. ఇది భవిష్యత్తులో చాలా మంచి చేస్తుంది. జగన్ వర్సెస్ బాబు.. దాసరి ఎటు..? దాసరి ఎటు అనేది తర్వాత చెబు తాను. నడుస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఎవరు క్యాష్ చేసుకోగలుగుతారు అనే అంశంపైనే వచ్చే ఎన్నికలు ఆధారపడి ఉంటాయి. విభజన తర్వాత ఆంధ్ర ఎలా ఉంది. కేసీఆర్ ఎలా ఉన్నారు? విభజన సమయంలో ఫీలయినమాట వాస్తవం. కానీ విభజన జరిగిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ చాలా బాగా పనిచేశారు. కేటీఆర్ ఆయనకు చాలా పెద్ద సపోర్టర్. చిన్నవయసులోనే తనలో పెద్ద పరిపక్వత వచ్చేసింది. ఇక తెలంగాణలో కేసీఆర్ చాలా తెలివిగా పగ్గాలు పట్టుకుని వెళుతున్నారు. కేంద్రంలో మోదీ పాలనపై మీ అభిప్రాయం? పెద్ద నోట్ల రద్దు వచ్చేంతవరకు నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది. కింది వర్గాలనుంచి వచ్చి ఒక స్థాయిని అందుకుని ఇవ్వాళ భారతదేశాన్నే పాలిస్తున్నారు. కానీ పెద్దనోట్ల రద్దు తొందరపడి చేయలేదు కానీ అవగాహనా రాహిత్యంతో చేశారంటాను . దీనివల్ల సాధించింది ఏమీ లేదు కానీ, పోగొట్టుకున్నది ఎక్కువ. (దాసరి నారాయణరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం క్లిక్ చేయండి) -
వెంటిలేటర్‌పై దాసరి నారాయణరావు..!
-
ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు
హైదరాబాద్: ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కిమ్స్ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరారని, ఆయనకు తగిన చికిత్స అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆయనకు డయాలసిస్ చేశామని, వెంటిలేటర్ మీద ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తున్నామని, దీనికి ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ ఎండీ, సీఈవో బొల్లినేని భాస్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడానికి ఆయనకు ఛాతి ఆపరేషన్ చేయబోతున్నామని, ఆపరేషన్ తర్వాత దాసరి ఆరోగ్య పరిస్థితిపై మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు కూడా చెపుతున్నారు. అనేక సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి నారాయణరావు అత్యధిక చిత్రాల దర్శకుడిగా లిమ్కా బుక్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటించారు. రాజకీయాలలోను దాసరి నారాయణరావు చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుల రిజర్వేషన్ ఉద్యమానికి దాసరి మద్దతు పలికారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీనంబర్ 150' వేడుకకు కూడా దాసరి హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన మోహన్‌బాబు, జయసుధ దంపతులు దాసరిని పరామర్శించేందుకు నటుడు మోహన్‌బాబు, జయసుధ దంపతులు కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో ఆపరేషన్ చేయనున్నామని, ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యులు తెలిపారు. -
అమ్మ జీవితంపై పోటా పోటీగా చిత్రాలు
-
దాసరి దర్శకత్వంలో 'అమ్మ'..?
కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తానని ప్రకటించిన దాసరి, తరువాత ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశాడు. దాసరి అనారోగ్య సమస్యలతో పాటు పవన్ కూడా రాజకీయాల్లో బిజీ కావటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే సమయంలో రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన వడ్డీకాసులవాడు సినిమా కూడా ఆగిపోయింది. ఈ రెండు ప్రాజెక్ట్‌లను పక్కకు పెట్టేసిన దాసరి, ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాను తెర మీదకు తీసుకువచ్చాడు. తాజాగా అమ్మ అనే టైటిల్‌ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాసరి స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
పుస్తకం చూశాకే నిజం తెలిసింది - దాసరి నారాయణరావు
‘‘గుంటూరు జిల్లాకు చెందిన జగదీష్ ఉభయ గోదావరి జిల్లాల సినీ ప్రముఖులపై పరిశోధనాత్మక రచనలు చేయడం అభినందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారు ఇంత మంది ఉన్నారన్న నిజం ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకం చూశాకే తెలిసింది. ఇంత మంచి ప్రయత్నం చేసిన జగదీష్‌కు అభినందనలు’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. రాజమండ్రి లో పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్న బీఎస్ జగదీష్ రచించిన ‘గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, కాశీ విశ్వనాథ్, నటుడు సారిక రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు -
ఈ ఆనందం మాటల్లో చెప్పలేను: మోహన్ బాబు
విశాఖపట్నం: ‘ఈ ఆనందం మాటల్లో చెప్పలేను.. సినీ జీవితంలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు గడిచి పోయింది. మా గురువు దాసరి నారాయణరావు, నన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధించిన అభిమానుల వల్లే నేను ఇంతవరకు ప్రయాణం సాగించగలిగాను. ఈ 40 ఏళ్ల పండుగ విశాఖలో జరుపుకునే అవకాశం రావడం నా జీవితంలో మర్చిపోలేను’ అని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు చెప్పారు. 40 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న ఆయనను ఈనెల 17న విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ‘నవరస నటతిలకం’ బిరుదుతో సత్కరించనుంది. ఈ సందర్భంగా నగరానికి విచ్చేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇదంతా గురువు గారు.. అభిమానుల వల్లే ‘ఆనాడు ఓ మారుమూల పల్లెటూరు నుంచి పొట్ట చేతపట్టుకుని చెన్నై వెళ్లాను. ఎన్నో ఇబ్బందులు పడ్డా.. ఎదురు దెబ్బలు తిన్నాను. మరెన్నో ఒడిదుడుకులు చవిచూశాను. గురువుగారు దాసరి నారాయణరావు నన్ను మోహన్‌బాబుగా మార్చి తెలుగు ప్రజలకు పరిచయం చేశారు. ఆయన ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అభిమానుల దయవల్ల ఎన్నో విజయాలందుకున్నాను. మరెన్నో శిఖరాలను అధిరోహించగలిగాను. కళామతల్లికి సేవలో అప్పుడే 40 ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియడం లేదు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కథానాయకుడిగా, నిర్మాతగా.. ఇలా సినీ జీవితంలో నా ప్రయాణం సాగింది.. సాగుతోంది. ఏ వేషం వేసినా.. ఏ ప్రయోగం చేసినా తెలుగు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో నాతో కలిసి పని చేసిన హీరోలు, హీరోయిన్లు, ప్రస్తుతతరం నటులు, సంగీత దర్శకులు, దర్శకులు ఎంతో బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరూ వచ్చి అభినందిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు ఈ వేడుకలో పాల్గొని నన్ను ఆశీర్వదించేందుకు తరలివస్తున్నారు.’ అని మోహన్‌బాబు చెప్పారు. ఆ ఖర్చుతో పేదలకు పట్టెడన్నం పెట్టండి ‘తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు కూడా ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. వారికి ఒక్కమాట చెబుతున్నా ఏ ఒక్కరూ పూల దండలతో రావద్దు. పూలదండలు.. బొకేల కోసం ఖర్చుచేసే ప్రతి రూపాయి కూడా ఎలాంటి ఆసరా లేని నిస్సహాయులకు, అన్నార్తుల కోసం వెచ్చించి పట్టెడన్నం పెట్టండి. నేను చాలా సంతోషపడతాను. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీర్వాదం ఎళ్లవేళలా ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు మీ ఆదరాభిమానాలతో కళామతల్లికి సేవ చేస్తూనే ఉంటా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. -
ఆ ఇద్దరు కలిసిపోయారా..?
రాజకీయాల్లోనేకాదు.. సినీ రంగంలో కూడా శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఉండరు. గతంలో ఢీ అంటే ఢీ అన్న వాళ్లు కూడా కలిసి పని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే బాటలో ఓ ఆసక్తికరమైన కలయిక వెండితెర మీద దర్శనమివ్వనుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి, దాసరి నారాయణరావు వర్గానికి అంత మంచి సంబంధాలు లేవన్నది అందరికీ తెలిసిన విషయమే. పలు సందర్భాలు దాసరి చేసిన కామెంట్స్‌పై మెగా హీరోలు బహిరంగంగానే స్పందించారు కూడా. అయితే అదంతా గతం.., ఇటీవల మెగా హీరో పవన్ కళ్యాణ్ దాసరి నిర్మాణంలో సినిమా చేయనున్నాడన్న వార్త ఫిలింనగర్లో బాగా వినిపించింది. పవన్ స్వయంగా దాసరి ఇంటివెళ్లి కలవటం, తరువాత తాము కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా పవన్‌తో అనుకున్న సినిమా చిరంజీవి చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజకీయాల కారణంగా దాసరి, చిరుల మధ్య దూరం కాస్త తగ్గిందన్న టాక్ వినిపిస్తోంది. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దాసరి దర్శకత్వంలో ఒక్క లంకేశ్వరుడు సినిమా మాత్రమే చేసిన చిరు, తరువాత హిట్లర్ సినిమా కోసం ఆయనతో కలిసి నటించాడు. ఆ తరువాత మెగా ఫ్యామిలీకి దాసరికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తాజాగా దాసరి నిర్మాతగా చిరంజీవి సినిమా చేస్తున్నాడన్న వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే ఈ కలయిక వెండితెర దాకా వస్తుందా.? -
అద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ అది: దాసరి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు సాక్షి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడంపై దర్శకుడు దాసరి నారాయణరావు హర్షం వ్యక్తంచేశారు. కె.విశ్వనాథ్ గారిని గౌరవించడమంటే మా దర్శకులందర్నీ గౌరవించడం అన్నారు. మాది యాబై ఏళ్ల అనుబంధమని, ఆరోగ్యకరమైన పోటీపడే మనస్తత్వంతో సినిమాలు తీసేవారిమని చెప్పారు. ఆయన సినిమాలు తాను చూసేవాడినని, తన సినిమాలు విశ్వనాథ్ గారు చూసి విమర్శలు చేసుకునేవాళ్లమని పేర్కొన్నారు. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలలో అత్యద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ 'శంకరాభరణం' అని దాసరి నారాయణరావు అన్నారు. ఆ మూవీ తర్వాత ఆయన తన స్థాయికి తగ్గకుండా కేవలం కళ కోసమే తపిస్తూ ఆ తరహా చిత్రాలు చేశారని ప్రశంసించారు. ఈ విధంగా నిరంతం శ్రమించేవారిని సత్కరిస్తున్నందుకు సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి గారిని కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు అభినందించారు. దర్శకులను ఆయన హీరో చేశారు: సిరివెన్నెల 'సిరివెన్నెల'తో తనకు ఇండస్ట్రీలో జన్మినిచ్చారని సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిలో చూసేది భౌతికనేత్రం కాదు మనోనేత్రమని తాను పాటలు రాసిన తొలి సినిమాతోనే చెప్పించారని ప్రశంసించారు. -
నేటి సినిమాకు కథతో పనిలేదు: దాసరి
దర్శకరత్నకు బొల్లిముంత అవార్డు ప్రదానం తెనాలి: కథతో పనిలేకుండా హీరో అంగీకరిస్తేనే సినిమాలు తీస్తున్న ధోరణి బాధ కలిగిస్తోందని దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన ప్రత్యేక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ కళా అవార్డును దాసరి నారాయణరావుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రదానం చేశారు. అనంతరం దాసరి మాట్లాడుతూ బొల్లిముంత శివరామకృష్ణ ‘ప్రజానాయకుడు’లో రాసిన డైలాగులను నేటి రాజకీయ నాయకులకు చూపితే వాళ్లు బతకడం కష్టమని వ్యాఖ్యానించారు. సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ వివిధ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రయోగాలు చేస్తూ శిఖర సమానుడిగా వెలుగుతున్న దాసరికి.. సమాజంలో మార్పు కోసం జీవితాంతం పోరాటం చేసిన బొల్లిముంత అవార్డును ప్రదానం చేయటం సముచితమన్నారు. పత్రికారంగ ంలో దాసరి చేసిన సేవలు గొప్పవని పేర్కొన్నారు. -
పవన్‌ని డీల్ చేయగలడా..?
కొద్ది రోజులుగా తన సినిమాల విషయంలో అభిమానులను తెగ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేది సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా కనిపించి అలరించాడు. అయితే ఆ సినిమాలో పవన్ పాత్ర పూర్తిస్థాయిలో లేకపోవటంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. గబ్బర్‌సింగ్ సీక్వల్తో చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకురాకుండా ఊరించాడు. గబ్బర్‌సింగ్ సీక్వల్కు డైరెక్టర్‌గా సంపత్ నందిని ప్రకటించినా, ఆ తరువాత పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో ఆ సినిమా చేస్తున్నాడు. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న బాబీ దర్శకత్వంలో పవన్ సినిమా అంటే అభిమానులు కూడా షాక్ అయ్యారు. మరోసారి అలాంటి షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా సూపర్ ఫాంలో ఉన్న జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడట. రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడు లాంటి సినిమాలతో కొరియోగ్రాఫర్‌గా టాప్ రేంజ్‌కు చేరుకున్నాడు జానీ మాస్టర్. అయితే చాలా రోజులుగా దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్న జానీ, దాసరి నారాయణరావుకు కథ వినిపించాడు. దాసరి కథ నచ్చటంతో పవన్ హీరోగా తాను నిర్మించాలనుకుంటున్న సినిమాను, జానీ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నాడట. మరి ఈ ప్రపోజల్‌కు పవర్ స్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
'ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం బాధాకరం'
సినీ రచయితలు సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి ఒకే రోజు మరణించడం బాధాకరమని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. సత్యమూర్తి, శ్రీనివాస చక్రవర్తి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తండ్రి, ప్రముఖ సినీ రచయిత గొర్తి సత్యమూర్తి (61) చెన్నైలోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మరో రచయిత శ్రీనివాస చక్రవర్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. -
బ్రూస్ లీకి బన్నీ సపోర్ట్
కొద్ది రోజులుగా 'బ్రూస్ లీ' సినిమా విడుదల వాయిదా వేయాలంటూ వస్తున్న కథనాలపై అల్లు అర్జున్ స్పందించాడు. 'బ్రూస్ లీ' చిత్ర యూనిట్ తన రిలీజ్ డేట్ వాయిదా వేసుకోకపోవటంపై వారిని నిందించడం సరికాదన్నాడు బన్నీ. 'బ్రూస్ లీ టీం సినిమా మొదలైన సమయంలోనే విడుదల తేదీని ప్రకటించారు. ఆ సమయంలో రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4న విడుదల అవుతుందని భావించారు. అనేక కారణాలతో రుద్రమదేవి వాయిదా పడుతూ అక్టోబర్ 9న విడుదలైంది. బ్రూస్ లీ 16న విడుదల అవుతుందన్న విషయం తెలిసే రుద్రమదేవి యూనిట్ తమ సినిమాను 9న రిలీజ్ చేశారు. పండగ సీజన్ కావటంతో రెండు సినిమాలకు స్కోప్ ఉంటుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు' అని క్లారిటీ ఇచ్చాడు అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమా తరువాత పెద్ద సినిమాలు విడుదల కావటం మంచి కాదని సోమవారం జరిగిన సక్సెస్ మీట్ లో సీనియర్ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కామెంట్ చేయగా, అదే రోజు అల్లు అర్జున్ ట్విట్టర్లో ఈ విషయంపై అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. My view about BRUCELEE release clash with RUDHRAMADEVI pic.twitter.com/qK2yjek3i2 — Allu Arjun (@alluarjun) October 12, 2015 -
దాసరి బాటలో రాజమౌళి
తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా దర్శక రత్న దాసరి నారాయణకి చాలా పేరుంది. అందుకే గతంలో సినీ రంగానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అందులో దాసరి తప్పకుండా కనిపించేవారు. సినిమా ఓపెనింగ్స్ దగ్గర నుంచి సక్సెస్ మీట్ల వరకు ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ ఆయన దర్శనమిచ్చేవాడు. అంతేకాదు తనవంతుగా చిత్రయూనిట్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ దాసరి అంటే అందరివాడన్న ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా మారిన జక్కన్న, ప్రస్తుతం ప్రతి సినిమా ఫంక్షన్ లోనూ కనిపిస్తున్నాడు. కేవలం ఫంక్షన్లకు హాజరవ్వటమే కాదు. కొత్త సినిమాల ఫస్ట్ లుక్ రిలీజ్‌ల నుంచి, ట్రైలర్ లాంచ్ ల వరకు ప్రతి విషయం పై స్పందిస్తూ అందరికీ పెద్దదిక్కుగా మారుతున్నాడు. ఆయా సినిమాలకు సంబంధించి పలు విషయాలను తన ట్విట్టర్లో షేర్ చేస్తున్నాడు. వాళ్ల నటనను, పనితనాన్ని మెచ్చుకోవటం విశేషం. -
దాసరి కుమారుడి ఇంట్లో భారీ చోరీ!
బంజారాహిల్స్ (హైదరాబాద్): మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్ నివాసంలో భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72 భారతీయ విద్యాభవన్ స్కూల్ ఎదురుగా నివసించే అరుణ్‌కుమార్ కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి శుభకార్యానికి వెళ్లారు. గురువారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బెడ్రూం అంతా చిందరవందరగా పడి ఉండటమే కాకుండా బీరువాలో ఉన్న రూ.11 లక్షలు విలువచేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ క్రై ం పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. -
బొగ్గు కుంభకోణంలో దాసరికి బెయిల్
-
బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ముందస్తు బెయిల్ లభించింది. విచారణ పూర్తయినందున పాటియాల సీబీఐ ప్రత్యేక కోర్టు దాసరి సహా నిందితులందరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధు కోడా హాజరయ్యారు. నిందితులు లక్ష రూపాయల పూచీకత్తు జమచేయడంతో పాటు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదంటూ న్యాయమూర్తి షరతు విధించారు. అలాగే సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించారు. -
'నాపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటా'
హైదరాబాద్ : తనపై పడిన మచ్చను త్వరలో తుడుచుకుంటానని ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అన్నారు. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని ఆయన సోమవారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్గేట్ స్కామ్‌లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
బొగ్గు స్కాంలో దాసరికి కోర్టు సమన్లు
-
బొగ్గు స్కాంలో దాసరి, జిందాల్, మధుకోడాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కోల్ గేట్ కుంభకోణానికి సంబంధించి బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా సహా 14 మందికి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. వారిని ఈ నెల 22వ తేదీన కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా న్యాయమూర్తి భారత్ పరాశర్ ఆదేశించారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జార్ఖండ్‌లోని అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సీబీఐ... కేంద్ర మాజీ మంత్రి దాసరితో పాటు 15 మంది వ్యక్తులు, సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ఏప్రిల్ 29న చార్జిషీటు దాఖలు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 409 కింద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
‘టామీ' లాంటి చిత్రాలు రావాలి!
- దాసరి నారాయణరావు ‘‘నిర్మాత హరిరామజోగయ్యగారు మంచి అభిరుచితో ‘టామీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చాలా ముఖ్యం. ఇలాంటివి ఇంకా రావాలని కోరుకుంటున్నా’’ అని ప్రముఖ దర్శక - నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, సీత, ఎల్బీ శ్రీరామ్, భూగీ అనే కుక్క ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘టామీ'. రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. చక్రి స్వరాలందించారు. బాబు పిక్చర్స్ పతాకంపై చేగొండి హరిరామజోగయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు ఆడియో సీడీని ఆవిష్కరించారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ ‘‘30 రోజుల్లో సినిమాళ పూర్తి చేశాం. రాజేంద్రప్రసాద్ ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. ఆయన డెడికేషన్, కమిట్మెంట్ అలాంటిది’’ అన్నారు. ప్రివ్యూను మార్చి 1న వైజాగ్‌లో ప్రదర్శిస్తామనీ, లాభాన్ని కుక్కల క్షేమం కోసం వినియోగిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, అమల, కోడి రామకృష్ణ, శివాజీ, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. -
చక్రి వాయిస్ ఇష్టం..ఐ మిస్ హిమ్
హైదరాబాద్ : ఇంత చిన్న వయసులోనే చక్రి మృతి చెందటం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు అన్నారు. ఆయన సోమవారం చక్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం దాసరి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఎర్రబస్సు చిత్రానికి చక్రి సంగీతం అందించాడని, నిజంగా ఇన్నిరోజులు అతన్ని ఎందుకు మిస్ అయ్యానా అని అనుకున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో అతనితో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అనుకున్నానని.. అయితే హఠాత్తుగా చక్రి జీవితం ఇలా ముగిసిపోతుందని అనుకోలేదన్నారు. చక్రి తనను తండ్రిగా భావించేవాడని, చివరి రోజుల్లో చాలా దగ్గరగా కలిసి ఉన్నామని దాసరి అన్నారు. చక్రీ వాయిస్ అంటే తనకు చాలా ఇష్టమని.. చక్రి వాయిస్ వినిపించడయ్యా అని అనేవాడినని..స్నేహపాత్రుడు...అందరికి కావలసినవాడు అని ...ఐ మిస్ హిమ్ అని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు.