10న దాసరి సంతాప సభ | Dasari Narayanarao Condolence Meet on June 10th | Sakshi
Sakshi News home page

10న దాసరి సంతాప సభ

Published Thu, Jun 8 2017 1:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

10న దాసరి సంతాప సభ

10న దాసరి సంతాప సభ

ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈ నెల 10వ తారీఖున నిర్వహించనున్నట్టుగా తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు. దాసరి మంచి ఫాంలో ఉన్న 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు.

అందరూ అందుబాటులో ఉన్న సమయంలో సంతాప సభ నిర్వహించాలన్న ఉద్దేశంతో  ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement