c kalyan
-
కలవరం సినిమా మొదలుపెట్టిన 'హిట్ లిస్ట్' హీరో
విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కలవరం. సిఎల్ఎన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ నిర్మితమవుతోంది. శశాంక్ కథ అందించిన ఈ చిత్రానికి హనుమాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస సంగీతం అందించాడు. వెంకట్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. శనివారం (జనవరి 4న) ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ చేతుల మీదుగా కలవరం చిత్రాన్ని లాంచ్ చేశారు.ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. ఇది బాలచందర్, భాగ్య రాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తీయగలిగే మంచి కథ ఉన్న సినిమా. చిన్న సినిమాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చిన్న సినిమాలకు తోడ్పాటు కల్పించాలి. చిన్న చిత్రాలకు షోలు ఎక్కువ ఇవ్వడం, అదేవిధంగా మినీ థియేటర్లు కట్టి సపోర్ట్ ఇవ్వాలి. కలవరం చాలా మంచి టైటిల్. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి హీరో హీరోయిన్లకు, చిత్రయూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ.. ఈ కథ చెప్పిన వెంటనే నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాం అని నిర్మాత శోభ రాణి గారు హామీ ఇచ్చారు. వెంటనే చెన్నై వెళ్లి హీరోకి కథ చెప్పాము. హీరో విజయ్ కనిష్కకు కూడా ఈ కథ చాలా నచ్చి మనం ఈ సినిమా చేస్తున్నామన్నారు. ఈ రోజు ఇలా గ్రాండ్‌గా ప్రారంభించాం. నన్ను నా కథను నమ్మి నాకే అవకాశం ఇచ్చిన శోభ రాణికి, హీరో విజయ్ కనిష్కకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ : మా నాన్న విక్రమం తమిళంలో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో వసంతం, చెప్పవే చిరుగాలి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. నా మొదటి సినిమా హిట్ లిస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ తండ్రి పేరు నిలబెట్టావ్ అన్నారు. ఆ మాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు ఈ కలవరం కథ విన్నాక అంతకంటే ఎక్కువ ఎగ్జయిటయ్యాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మంచి సినిమాలు, కొత్త టాలెంట్ ఇంకా ఎంతోమంది మీ ముందుకు వస్తారు అన్నారు.కథా రచయిత శశాంక్. పి మాట్లాడుతూ.. కథ వినగానే ఈ సినిమా మనం చేస్తున్నామని సపోర్ట్ చేసిన నిర్మాత శోభారాణికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను, డైరెక్టర్ హనుమాన్ కలిసే స్క్రిప్ట్ తయారు చేశాం. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. నిర్మాత శోభారాణి గారు మాట్లాడుతూ.. కలవరం అనే టైటిల్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. శశాంక్, హనుమాన్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అదే కష్టంతో ఇష్టంగా ఈ సినిమాని పూర్తి చేస్తాము. అడగ్గానే మా సినిమా ఓపెనింగ్‌కు వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రంలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. వారి గురించి త్వరలోనే వివరాలు విడుదల చేస్తాము అన్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
టాలీవుడ్లో చాలా సమస్యలు ఉన్నాయి.. సి.కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన దిల్ రాజు పదవీకాలం పూర్తవగా.. తాజాగా ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఇకపోతే ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం తర్వాత భరత్ భూషణ్ తోపాటు సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)'ఈ రోజు గెలిచిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరూ మాటకు కట్టుబడి ఉంటారు. అందరు కలసి మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి అందరం సమష్టిగా ముందుకు వెళ్తాం. గెలిచిన వారందరికీ సభ్యులందరి మద్దతు ఉంటుంది' అని సి.కల్యాణ్ అన్నారు. జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఛాంబర్ అంతా ఓ కుటుంబం. ఇండస్ట్రీలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అందరం కలసి చర్చిస్తాం. దేశంలోని ఇతర సినీ ఇండస్ట్రీని ఒకతాటి పైకి తీసుకొచ్చి ముందుకెళ్తాం' అని చెప్పుకొచ్చారు.ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడు భరత్ భూషణ్ మాట్లాడుతూ.. 'నా విజయానికి సహకరించిన ఈసీ సభ్యులకు, మిత్రులకు పేరు పేరునా కృతజ్ఞతలు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను' అని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: నా కూతురును ట్రోల్ చేశారు.. నాన్న సూసైడ్ అని పెట్టారు: రాజీవ్ కనకాల) -
ట్విన్స్ హీరోలుగా వస్తోన్న తికమకతాండ.. రిలీజ్ ఎప్పుడంటే?
హరికృష్ణ, రామకృష్ణ, యాని, రేఖ నిరోషా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కించిన చిత్రం తికమకతాండ. ఈ చిత్రానికి వెంకట్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ..' తికమకతాండ డైరెక్టర్ వెంకట్ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ట్విన్స్ టెక్నీషియన్స్‌గా వచ్చి హీరోలుగా ఎదిగారు. ట్విన్స్ రామ్, హరి ఇద్దరూ హీరోలుగా తెలుగ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. హీరోయిన్లు యాని, రేఖ నిరోషా అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ గెలుపు
-
Live: TFCC ఎన్నికలు... గెలుపు ఎవరిదీ...?
-
TFCC Election 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు
►తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు ►వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు ►కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్ ►ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్ ►మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు ►తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ►ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్. ►డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్.. ►తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి గా దిల్ రాజు ఎన్నిక దాదాపు ఖాయం. ►తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు. ►ఫైనల్ రిజల్ట్ ►అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు.. ►మొత్తం ఓట్లు - 48 ►మెజారిటీ మార్క్ - 25 ►ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5.. ►డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజుకి 6, సి కళ్యాణ్ కి 6. ►స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ (4) దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1. ►ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16) దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8. ►కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4) ► తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ భారీ విజయం ► నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు ► దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. ► డిస్ట్రిబ్యూషన్ విభాగంలో ఇరు ప్యానెల్ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు. ► స్టూడియో సెక్టార్లో నలుగురికి గాను దిల్‌రాజ్ ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపొందారు. ► తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో దిల్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉంది. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి.కల్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి. ► మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు అయిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ 3:30 నిమిషాలకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 891,స్టూడియో సెక్టార్ నుంచి 68,డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి రికార్టు స్థాయిలో పోలింగ్ జరిగింది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై.. 6 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు(మధ్యాహ్నం 3 గంటలు) 1233 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 810 , స్టూడియో సెక్టార్ నుంచి 68, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 355 ఓట్లు నమోదయ్యాయయి. ► ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ► మధ్యాహ్నం 1.30 గంటల వరకు 1035 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 650, స్టూడియో సెక్టార్ నుంచి 65, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 320 ఓట్లు నమోదయ్యాయి. ►సినీ ప్రముఖులు సురేశ్ బాబు, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, జీవిత తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటంన్నింటిని పరిష్కరించే సామర్థ్యం ఎవరికి ఉందో ఆలోచించి ఓటు వేయాలని నటి, దర్శకురాలు జీవిత విజ్ఞప్తి చేశారు. కోవిడ్ టైమ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ చూసిందని, అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను దిల్ రాజు వర్గానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం 710 ఓట్లు పోలైయ్యాయి. వాటిలో ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 450, స్టూడియో సెక్టార్ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 210 ఓట్లు నమోదయ్యాయి. ► చాంబర్ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది’ అన్నారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఉదయం 10.45 వరకు దాదాపు 232 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ లో 95 ఓట్లు, స్టూడియో సెక్టార్ లో 35 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 102 ఓట్లు పోలైయ్యాయి. ► టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విజేతలను సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ►ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. ► టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 1600 మంది సభ్యులు ఉన్నారు. ► ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. -
కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజుకు సహాయం చేసింది నేనే.. కానీ ఇప్పుడు
-
నాలుగేళ్లు ఇండస్ట్రీని సర్వనాశనం చేసారు.. ప్రొడ్యుసర్ గిల్డ్ పై నిర్మాత సి. కళ్యాణ్ ఫైర్
-
మంచి చేయడానికే పోటీ చేస్తున్నా
‘‘చలనచిత్ర వాణిజ్య మండలి (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఎన్నికల్లో అధ్యక్షునిగా, ప్యానల్ సభ్యులుగా నిజాయతీగా సేవ చేసేవాళ్లను ఎన్నుకోండి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఈ నెల 30న చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సి. కల్యాణ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి మాట్లాడుతూ– ‘‘గతంలో నేను పో టీ చేయాలనుకున్నప్పుడు కొందరు నిర్మాతలు ‘యూఎఫ్ఓ, క్యూబ్’ వంటి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నాను. కానీ, వాళ్లు సభ్యుల శ్రేయస్సు కోసం కృషి చేయలేదు. అందుకే.. అందరికీ మంచి చేయాలనే ఆశయంతో పో టీ చేస్తున్నాను’’ అన్నారు. -
నాలుగేళ్లలో సర్వ నాశనం.. ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్‌పై సి.కల్యాణ్!
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చామని తెలిపారు. తొలిసారిగా నిర్మాతలకు మెడి క్లైమ్ తీసుకొచ్చింది తానేనని అన్నారు. అయితే నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. దాసరి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగానని వెల్లడించారు. (ఇది చదవండి: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్?) కానీ గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనమైందని విమర్శలు చేశారు. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తామని అన్నారు. ఈ సారి నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉందని కల్యాణ్ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ..' గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది. పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి. ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను. డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ' అంటూ విమర్శలు గుప్పించారు. ఫిల్మ్ ఛాంబర్ గురించి మాట్లాడుతూ..' ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్‌కు సేవ చేసేవాళ్లే కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు. ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల్లో పోటీపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్‌లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. దిల్ రాజు పక్కనున్నవాళ్లకు పోస్టులు కావాలి.' అని అన్నారు. (ఇది చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) -
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికల సందడి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, శుక్రవారంతో అంటే జూలై 21తో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ క్రమంలోనే జూలై 30న ఎలక్షన్స్ జరగనున్నాయి. నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇకపోతే సి.కల్యాణ్ ఇప్పటికే టాలీవుడ్లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ వర్క్ చేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. (ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని పార్క్ హోటల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా గౌతం రెడ్డి మాట్లాడారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల రికార్డులు బ్రేక్: రానా కామెంట్స్ వైరల్) గౌతం రెడ్డి మాట్లాడుతూ.. 'దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఈ కార్యక్రమం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. 99 రూపాయలకే సినిమా మొత్తం కుటుంబం చూడవచ్చు. ఈ 99 రూపాయ ప్లాన్ 24 గంటలు పని చేస్తుంది .' అని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఎంతో మేలు: గుడివాడ అమర్నాథ్, ఐటీశాఖ మంత్రి దేశంలో ఎక్కడ లేనివిధంగా ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సెప్ట్ రాష్ట్రంలో తీసుకువచ్చామని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సినిమా ఫ్యామీలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే చూసే అవకాశం ఉంటుందని తెలిపారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..' ఫస్ట్ డే పస్ట్ షో కొత్త కాన్సప్ట్‌తో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ఫిల్మ్ ఇండ్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 80 శాతం సినిమాలు రిలీజ్ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఒక్కొసారి సినిమాలు విడుదలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. అటువంటి సినిమాలకు పస్ట్ డే పస్ట్ షో ప్లాట్ ఫామ్ ఎంతో ఉపయోగడుతుంది.' అని అన్నారు. చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి వరం: రమాసత్యం నారాయణ, నిర్మాత నిర్మాత నారాయణ మాట్లాడుతూ..'చిన్న సినిమాలు బతకాలంటే ఓటీటీ తరువాత ఫైబర్ నెట్ అవసరం. ప్రజలకు నవ రత్నాలను సీఎం జగన్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి పదో వరంగా ఫస్ట్ డే ఫస్ట్ షో ఇచ్చారు. 99 రూపాయలకే ఇంటిల్లిపాది సినిమా హాయిగా సినిమా చూడవచ్చు.' అని అన్నారు. అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. -
ముగిసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ ఎన్నికలు జరిగాయి. నిర్మాత మండలిలో మొత్తం 1134 మంది ఉండగా.. 678 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో దిల్ రాజు, సి కళ్యాణ్, పోసాని కృష్ణ మురళి, మైత్రి రవి కిరణ్, స్రవంతి రవి కిషోర్, ఠాగూర్ మధు సునీల్ కుమార్ రెడ్డి, నాగబాబు, అశ్వినిదత్, తదితరులు ఉన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. అధ్యక్ష బరిలో నిర్మాతలు దామోదర ప్రసాద్, జెమినీ గణేష్‌లు ఉన్నారు. దామోదర ప్రసాద్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మద్దతు ప్రకటించగా.. జెమినీ కిరణ్‌కు సీ.కల్యాణ్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ప్రొగ్రెసివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్ పేరుతో దామోదర ప్రసాద్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్యానెల్ పేరుతో జెమినీ కిరణ్ బరిలోకి దిగారు. -
ప్రొడ్యూసర్ గిల్డ్‌పై సి.కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
-
దిల్రాజును తప్పుదారి పట్టించారు, దుష్ప్రచారం చేస్తున్నారు : సి. కల్యాణ్
సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. దిల్‌రాజు, సి. కల్యాణ్ ప్యానెల్ వేరు వేరే కాదని, నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దిల్ రాజుతో తనను పోలుస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు సుమారు 80 చిన్న సినిమాలు తీశానని, ఎవరిని మోసం చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. ప్రొడ్యూసర్ గిల్ట్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. గిల్డ్‌లో 27 మంది సభ్యులున్నారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలనే నిర్మాతల మండలి పరిష్కరించింది. 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్ , నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా రేపు(ఫిబ్రవరి 19)న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి. కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
ఆయనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం.. సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. టీఎఫ్‌పీసీ (TFPC) కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారని ఆరోపించారు. మా సభ్యుల్లో కె.సురేష్ బాబుని మూడేళ్లు, యలమంచిలి రవిచంద్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదని ఆయన అన్నారు. నిర్మాతల మండలికి గొప్ప చరిత్ర ఎప్పుడు అలాగే ఉండాలనేదే మా కోరిక అని తెలిపారు. హైదరాబాద్‌లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో కల్యాణ్ మాట్లాడారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. కొందరు నిర్మాతలు ఛాంబర్ దగ్గర టెంట్‌వేసి సమస్యలపై పోరాడుతున్నట్లు ప్రకటించి లేనిపోని అపనిందలు వేశారని అన్నారు. నిర్మాతలమండలికి ఎలక్షన్లు జరపడం లేదంటూ కామెంట్లు చేశారు. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని.. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవచ్చన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'టీఎఫ్‌పీసీ కమిటీపై సోషల్ మీడియాలో కొంతమంది ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతున్నారు. అలాంటి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఆర్గనైజేషన్‌కి ఎవరు చెడ్డ పేరు తేవాలని చూసిన ఊరుకోం. ఎలక్షన్స్ జరగట్లేదు అని కొంతమంది ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. మాకు ఎలాంటి పదవి వ్యామోహం లేదు. మా కౌన్సిల్లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఇంత అమౌంట్ పోగవ్వడానికి కారణం దాసరి నారాయణ రావు గారే. మా సభ్యులలో కె సురేశ్ కుమార్ మూడేళ్లు మాత్రమే సస్పెండ్ చేశాం. యలమంచిలి రవి కుమార్‌ను జీవిత కాలం బహిష్కరిస్తున్నాం. ఇకమీద తెలుగు చలనచిత్ర మండలికి ఆయనకి శాశ్వతంగా ఎలాంటి సంబంధం ఉండదు. 40 ఏళ్ల ఈ సంస్థలో ఇలా ఎవరూ చేయలేదు. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది. నేను తప్పు చేసినా నాపై చర్యలు తీసుకోవచ్చు.' అని అన్నారు. ఫిబ్రవరి 19న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్: కల్యాణ్ వచ్చేనెలలో తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఉంటాయని సి.కల్యాణ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 19న ఓటింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్‌తో పాటు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఎలక్షన్స్ కోసం ఒక పది మంది సభ్యులు టెంట్లు వేశారని కల్యాణ్ ఆరోపించారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఒకసారి ఒక పదవిలో ఉంటే మళ్లీ పోటీ చేయనని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 19న తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు. ఫిబ్రవరి 1 నుంచి 6 వ తేదీ వరకు నామినేషన్స్ ఒకరు ఒక్క పోస్ట్‌కు మాత్రమే పోటీ చేయాలి 13వ తేదీ వరకు నామినేషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఎన్నికల అధికారిగా కె.దుర్గ ప్రసాద్ అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ ప్రభుత్వాలను కోరతాం: కల్యాణ్ సినిమా పరిశ్రమపై ప్రభుత్వాల తీరును గురించి ప్రస్తావించారు సి కల్యాణ్. ఆంధ్రాకి సినిమా పరిశ్రమ వెళ్తుందని నేను అనుకోవట్లేదన్నారు. కొందరు పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారని సి.కల్యాణ్ అన్నారు. అవి ఏవి కూడా టీఎఫ్పీసీలో భాగం కాదన్నారు. నంది అవార్డులు కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రలో నంది అవార్డులు, తెలంగాణలో సింహా అవార్డులు త్వరగా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో మా ఫిలిం ఇండస్ట్రీ తరుపున అవార్డులను మేమే ఇస్తామని కల్యాణ్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ఫండ్ వివరాలు వెల్లడించిన కల్యాణ్ ఇక కౌన్సిల్ ఫండ్ గురించి మాట్లాడుతూ.. ' మా కౌన్సిల్ లో ప్రస్తుతం రూ.9 కోట్ల ఫండ్ ఉంది. ఇంత అమౌంట్ రావడానికి దాసరి నారాయణ రావు గారే. మాకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. మూవీ టవర్స్‌లో రెండు కోట్ల 40 లక్షలు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది 10 కోట్లకు చేరింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అకౌంట్స్ అన్ని ఈసీలో పాస్ అయినవే అని అన్నారు. వాటితో ఎలాంటి సంబంధం లేదు అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఉన్న సౌత్ ఇండియా ఫిలింఛాంబర్ .. దానికి అనుబంధంగా తెలుగు చలన చిత్ర మండలి, ప్రొడ్యూసర్ కౌన్సెల్ ఉన్నాయని తెలిపారు. అంతే కానీ ఆంధ్ర ఫిలిం ఛాంబర్, ఆంధ్ర ఫిల్మ్ ఫెడరేషన్ వంటి సంస్థలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. పదవులు కోసం కొన్ని సంస్థలు పెడుతున్నారు. అవి ఏవి కూడా మా సంస్థలో భాగం కాదని కల్యాణ్ స్పష్టం చేశారు. -
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాస
-
నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం
తెలుగు నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్‌పై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీకాలం ముగిసినా నిర్మాత మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని ఆందోళనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక సభ్యుడు వీడియో తీయగా..అతనిపై అధ్యక్షుడు సీ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా సి. కల్యాణ్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమాని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు సినిమాలకు కాకుండా.. కన్నడ, తమిళ చిత్రాలకు థియేటర్లు ఇవ్వడం సరికాదని, ఇలా చేస్తే బడాస్టార్ల సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోవచ్చని అభిప్రాయపడ్డారు. అలా జరిగితే మన పరువు మనమే తీసుకన్న వాళ్లం అవుతామన్నారు. కన్నడ, తమళ్‌లో మొదట వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆ తర్వాతే ఇతర భాషల సినిమాలకు థీయేటర్లు ఇస్తారని పేర్కొన్నారు. మనం కూడా మారాలని, డబ్బుకోసం కాకుండా.. సినిమాని బ్రతికించుకోవడం కోసం కష్టపడాలన్నారు. ఈ విషయంలో డైరెక్టర్‌గా చాంబర్ ఏం చేయలేదని, గిల్డ్ ఉన్నా పెద్దగా ఎలాంటి ఉపయోగం లేదని నిర్మాత సి కల్యాణ్ వ్యాఖ్యానించారు. చదవండి: షూటింగ్లో గాయం, పెను ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్ మాల్దీవుల్లో యాంకర్ రష్మీ రచ్చ.. వీడియో వైరల్ -
'వారీసు' వివాదం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు : నిర్మాత
‘‘ఈ మధ్య 30రోజులు షూటింగ్ ఆపడమనేది అట్టర్ ఫ్లాప్ షో. చిన్న చిత్రాల నిర్మాతలు రిలీజ్ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం దొరుకుతుందని సమ్మెకి సమ్మతించా. అయితే సమ్మె వల్ల ఏం జరగదని నాలుగు మీటింగ్స్‌లోనే అర్థమైంది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించినా వాటి పరిష్కారం జరగలేదు. సినిమా పరిశ్రమ బతికుందంటే కొత్తగా వచ్చే నిర్మాతల వల్లే’’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘చెన్నైలో సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 200 కోట్లతో ‘కల్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్’ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సదరన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కు మించి అవార్డ్స్‌ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు. చిరంజీవిగారి సినిమా నిర్మాతలుగానీ, బాలకృష్ణగారి మూవీ నిర్మాతలుగానీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు రిలీజ్ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సంటేజ్లోకి మారిస్తే బాగుంటుంది. కానీ, కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు. సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రెండో ఊరు అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు మాత్రమే వెళుతున్నారు.. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండరని భావిస్తాను. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరో ఒకరు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి మాత్రం ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఉంది. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమా పూర్తయింది. అలాగే బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్ పున:ప్రారంభంపై ప్రకటన
‘‘చిత్రపరిశ్రమలోని సమస్యలు పరిష్కరించడానికి షూటింగ్స్ నిలిపివేసినప్పటి నుంచి పలు సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాం. ఇందులో భాగంగా అందర్నీ సమన్వయ పరచడానికి ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌కు చెందిన యూనియన్స్, కౌన్సిల్స్‌తో చర్చించాం. సెప్టెంబర్ 1నుంచి యథావిధిగా షూటింగ్స్ చేసుకోవచ్చనే నిర్ణయానికి వచ్చాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆగస్ట్ 1నుంచి షూటింగ్‌లు నిలిపివేసిన విషయం విదితమే. సెప్టెంబర్ 1నుంచి షూటింగ్స్ పునః ప్రారంభించుకోవచ్చని మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలు వెల్లడించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉన్నాయి. వీపీఎఫ్ చార్జీల విషయంలో క్యూబ్, యూఎఫ్‌ఓలతో సంప్రదించి, అగ్రిమెంట్ విధానంలో నిర్ణయాలను తీసుకున్నాం. అలాగే టికెట్స్, తినుబండారాలు వంటివాటి ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాయి. పెద్ద సినిమాలకు బడ్జెట్ బట్టి టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. మరికొన్ని క్రాఫ్ట్స్‌తో చర్చించి ఈ నెల 30న పూర్తి విషయాలను వెల్లడిస్తాం’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ముందుగా షూటింగ్స్ ప్రారంభించాలనుకునేవారు ఫిల్మ్ చాంబర్‌ను సంప్రదిస్తే ఈ నెల 25 నుంచి అనుమతులు ఇస్తాం’’ అన్నారు. -
షూటింగ్ బంద్‌ను ఒక మహాయజ్ఞంలా ప్రారంభించాం: సి. కల్యాణ్
C Kalyan Dil Raju Comments After Telugu Film Chamber Of Commerce Meeting: సినిమా షూటింగ్‌లు బంద్ అయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గురవారం (ఆగస్టు 4) భేటీ అయింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. అనంతరం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్‌ల బంద్ విషయంలో నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు లేవు. సమస్యల పరిష్కారం కోసమే చిత్రీకరణలు ఆపాం. సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌ల బంద్‌ని ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించాం. అయితే బయట అందరూ ఏవేవో చెబుతుంటారు.. వాటిని నిర్మాతలు పట్టించుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ, కౌన్సిల్ జనరల్ సెక్రటరీల ఆధ్వర్యంలో పనులు డివైడ్ చేసుకొని ముందుకు వెళుతున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి, చర్చిస్తున్నాం. వాటిలో సినిమాలు రిలీజ్ అయిన ఎన్ని వారాలకు ఓటీటీకి వెళితే ఇండస్ట్రీకి మంచిది అని చర్చించేందుకు ఓ కమిటీ వేసుకున్నాం. థియేటర్స్‌లో వీపీఎఫ్ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై మరో కమిటీ వేశాం. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్‌పై కూడా ఓ కమిటీ వేశాం. ప్రొడక్షన్లో వృథా ఖర్చు తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్ ఎన్ని గంటలు చేయాలనేదానిపై చర్చించేందుకూ మరో కమిటీ వేశాం. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం’’ అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కొవిడ్ పాండమిక్ తరువాత సినిమా పరిశ్రమ వర్కింగ్ కండిషన్లో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున నిర్మాతలకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. కానీ మీడియాలో మాత్రం చాలా వేరే విధంగా రాస్తున్నారు. కాబట్టి ఛాంబర్ తరుపున ఏదైతే బులెటిన్ ఇస్తామో అదే రాయండి'' అని తెలిపారు. మండలి కార్యదర్శి శ్రీ. టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ''ఇవాళ ప్రేక్షకులు థియేటర్‌కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో పరిశ్రమను ఓక తాటిపై ఇండస్ట్రీ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యం తో ఓటీటీకి సినిమా ఎప్పుడు ఇవ్వాలి? సామాన్యుడు థియేటర్ కు రప్పించడానికి టికెట్ రేట్స్ ను రీదనేబుల్గా తగ్గించలానే విషయాలపై కృషి చేస్తున్నాం. ఆ తరువాత వర్కర్స్ వేజేస్ విషయమై ఫెడరేషన్ తోను, కాస్ట్ ప్రొడక్షన్ విషయమై దర్శకులు మీటింగుల్లోనూ, ఆర్టిస్టుల సహకారం కొరకు మా అసోసియేషన్ తోను, సంప్రదింపులు చేస్తున్నాం. గతంలో ఎన్టీరామారావు గారు, అక్కినేని నాగేశ్వర్ రావు గారు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లోనే రూ. 10 వేలు తీసుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడారు. రెండోది డిజిటల్ ఛార్జీలు నిర్మాతలకు చాలా భారంగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలి. పర్సంటేజ్ సిస్టమ్‌లో చిన్న సినిమాకు, ఒక పర్సంటేజ్ అని, పెద్ద సినిమాకు ఒక పర్సంటేజ్ అని ఎక్జిబిటర్స్ అడుగుతున్నారు. ఈ సమ్యసలన్నీ చర్చించడం కోసం సినిమాల షూటింగ్‌లు వాయిదా వేయడం జరిగింది. దీన్ని మీరు స్ట్రైక్ అనొద్దు. బంద్ అనొద్దు. ఇండస్ట్రీకు పూర్వ వైభోవం తీసుకొని రావడానికి మేము అందరం పని చేస్తున్నాము. దయచేసి మీడియా వారికీ ఒక చిన్న విన్నపం గిల్డ్ మీటింగ్ అని రాయకండి, కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే పేరెంట్ బాడీ, కాబట్టి మీటింగులు అన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసికట్టుగా పని చేస్తూ.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడము, నష్టపరచడము మా ఉద్దేశ్యము కాదు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి శతధా ధన్యవాదాలు. వాళ్ల ఆదరణ మూలంగా ప్రపంచంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకొంటున్నాం. అలాంటి ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి ప్రేక్షకులకు టికెట్ రేట్స్ భారంగా ఉండకూడదని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్ లతోను సంప్రదింపులు జరుగుతాయి'' అని తెలిపారు. -
షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
-
ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉంది: సి కల్యాణ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాతల మండలి సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లతో ఫిలిం చాంబర్లో నిర్మాతల మండలి భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాగా, షూటింగ్స్ బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. తమ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనేది అవాస్తవమన్నారు. ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కతాటిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో కొత్త సినిమాలు వంటి అంశాలు నిర్మాతల మండలి భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఓటీటీ, వీపీఎఫ్ చార్జెస్, టిక్కెట్ ధరలు, నిర్వహణ వ్యయం వంటి అంశాలపై ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి. కళ్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా.. భేటీకి ముందు తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టార్ చైర్మన్ టి.ఎస్ రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటీటీల వల్ల థియేటర్లు, డిస్ట్రీబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పెద్ద సినిమాలను 8 వారాలు, చిన్న సినిమాలు 4 వారాల తర్వాతే ఓటీటీలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 14 ఏళ్ల నుంచి అమలవుతున్న డిజిటల్ ఛార్జీలను యధాతథంగా కొనసాగించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టిక్కెట్ల విక్రయం జరపాలన్నారు. రెంటల్ విధానంలో మార్పులు చేసి ఆక్యుపెన్సీలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ జూమ్ మీటింగ్ తమ డిమాండ్లను తెలియజేస్తామన్నారు. -
షూటింగ్స్ బంద్‌పై వీడని సస్పెన్స్!
టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్ కానున్నాయంటూ గతకొన్నిరోజులుగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా దీనిపై నిర్మాత సి.కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్‌లు బంద్ చేయాలా? లేదా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను యథాతథంగా కొనసాగనిచ్చి కొత్త సినిమాలు మాత్రం షూటింగ్ మొదలు పెట్టకుండా ఆపాలా? అన్న విషయాలపై చర్చిస్తున్నామన్నాడు. అలాగే ప్రేక్షకులకు టికెట్ రేట్లను అందుబాటులోకి తేవడం, ఓటీటీలపై చర్చించామని తెలిపాడు. ఈ నెల 23న అన్ని విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యాక ఫిలిం చాంబర్ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు. బుధవారం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టికెట్ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ సమస్యలు, మేనేజర్ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్ సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్న కుమార్, జెమిని కిరణ్, వడ్లపట్ల మోహన్, నట్టి కుమార్, ఏలూరి సురేందర్ రెడ్డి, అభిషేక్ నామా, వైవీఎస్ చౌదరి, యలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు. చదవండి: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! దుమ్ము లేపుతున్న లైగర్, కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలంతే -
ఐదుగురు ప్యారలల్ మనుషుల మధ్య జరిగే 'మరో ప్రపంచం'..
Maro Prapancham Trailer Released: చక్ర ఇన్ఫోటైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్‌పై కిలారు నవీన్ దర్శకత్వంలో నిర్మాత వెంకటరత్నం నిర్మిస్తోన్న చిత్రం ‘మరో ప్రపంచం’. వెంకట్ కిరణ్, సురైయ పర్విన్, యామిన్ రాజ్, అక్షిత విద్వత్, శ్రీనివాస్ సాగర్ ప్రధాన తారాగణంగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరెక్కింది. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అలాగే మరో గెస్ట్ సాగర్ కె చంద్ర, సాయి కిరణ్ అడివి సినిమా పోస్టర్ లుక్‌ను రిలీజ్ చేశారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతకు అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఈ ట్రైలర్ చూపించాడు. నాకు నచ్చి ఈ కార్యక్రమానికి వచ్చాను. మనందరిలోనే చాలా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి.. అలాంటిది ఓ ఐదుగురి ప్యారలల్ లైఫ్‌లో అలాంటి మార్పులు జరిగితే ఎలా ఉంటుంది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. మంచి ప్రయోగం. అలానే క్వాలిటీతో చిత్రీకరించారు. మ్యూజిక్ డైరెక్టర్ శాండీ ఆర్ ఆర్.. సినిమాకు హైలెట్ అవుతుందని అనుకుంటున్నా. ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని.. అలాగే నిర్మాతకు, డైరెక్టర్, ఆర్టిస్టులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. చదవండి: ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. ప్రొడ్యూసర్ వెంకటరత్నం మాట్లాడుతూ.. ‘‘కష్టం అంతా దర్శకుడు నవీన్‌దే. నేను జస్ట్ డబ్బు పెట్టాను అంతే. సబ్జెక్ట్ అండ్ ఆర్టిస్టులను నమ్మాను.. వారందరూ 200 పర్సెంట్ న్యాయం చేశారు. ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దవాళ్లు చెబుతుంటారు.. దాన్నే లీడ్ తీసుకొని 5 ప్యారలల్ మనుషులు మధ్య జరిగే కథే మరో ప్రపంచం. గుడ్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ''ప్యారలల్ యూనివెర్సల్ కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తున్నాం. టీమ్ అంతా కొత్తవారే అయినా ప్రొడ్యూసర్ సినిమా చేయడానికి ముందుకు రావడం సంతోషం. ఇంకో మూవీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చారు.. అందుకే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని మాటిస్తున్నా'' అని డైరెక్టర్ నవీన్ తెలిపారు. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ -
సినీకార్మికుల సమ్మె సక్సెస్, వేతనాల పెంపుకు సమ్మతమే!
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపుకు దిల్ రాజు నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ జరుగుతాయి. కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. దిల్ రాజు చైర్మన్‌గా శుక్రవారం ఉదయం 11 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అవుతుంది' అని చెప్పారు. వేతనాల పెంపుపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హర్షం వ్యక్తం చేశారు. 'వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్ని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటాము. రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాము అని తెలిపారు. చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
నిర్మాతల్లో ఐక్యత లేదన్న మోహన్ బాబు, స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు
Producers Council President C Kalyan Respond On Mohan Babu Comments: ఇండస్ట్రీ పెద్ద ఎవరనే అంశం ప్రస్తుతం టాలీవుడ్లో రచ్చకు దారి తీసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో లెవనెత్తిన అంశంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. మా ఎన్నికల అనంతరం దీని ఊసే మరిచిపోయిన క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండలేనని, ఇద్దరు గొడవ పడుతుంటే దాన్ని పరిష్కరించడానికి ముందుకు రానంటూ ఆయన చెప్పిన అనంతరం మోహన్ బాబు రాసిన బహిరంగ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: ఇండస్ట్రీ పెద్ద అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుమన్ అప్పటి నుంచి పరిశ్రమకు పెద్ద ఎవరనే దానిపై సినీ ప్రముఖులు ఎవరి అభిప్రాయాన్ని వారు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు సినీ పరిశ్రమకు రాసిన లేఖలో ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు.. నిర్మాతలు.. డిస్ట్రీబ్యూటర్లు కాదన్నారు. అంతేగాక టికెట్ల విషయంలో అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదంటూ నిర్మాతల్లో ఐక్యత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన లేఖపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కల్యాణ్ స్పందించారు. చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్ గారూ.. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అన్ని సమస్యలపై ప్రభుత్వాలతో చర్చిస్తూనే ఉంది. మోహన్ బాబు ఫ్యామిలీ అంతా సినిమా రంగంలోనే ఉంది. ఆయన ముందుండి సమస్యని పరిష్కరిస్తానంటే ఆయన వెంట నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నిర్మాతల్లో ఐక్యత లేనందు వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు కూడా నిర్మాతే. అయన కొడుకు కూడా నిర్మాతే. ఈ సమస్యల్ని ముందుండి పరిస్కరిస్తామంటే మేమంతా ఆయనతో పాటు ఉంటాం’ అని అన్నారు. మరి దీనిపై మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. -
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలని ఉంది
ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో సత్యదేవ్ హీరోగా గోపీ గణేష్ దర్శకత్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబరు 9 సి. కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ♦ టికెట్ రేట్లను మరీ ఇంతగా తగ్గించడం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్. ♦ ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం అడిగాం, కానీ మీడియా వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం. ♦ శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. ఆ తర్వాత హిట్ అయింది. సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి. ♦ చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. ♦ ప్రస్తుతం సినీ పరిశ్రమకి ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు. ♦ పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు. ♦ ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది. ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్. ♦ గాడ్సే సినిమా ఈ రోజు షూటింగ్ పూర్తయ్యింది. అలాగే మా బ్యానర్లో రానా నటిస్తున్న 1945 సినిమాకి సంబంధించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. ♦ రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. ♦ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. రామానుజాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయన కూడా చేయాలనుకుంటున్నారు. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను. ♦ గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్దరికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ♦ తమిళనాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో చూపిస్తాను అంటూ ఆ గిఫ్ట్ ఏంటో చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచాడు నిర్మాత కళ్యాణ్. -
ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చలు చాలా ఆనందకరమని టాలీవుడ్ నిర్మాత సి.కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సహకారం ఇచ్చారని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా అని తెలిపారు. దివంగత వైఎస్సార్ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్ కూడా అలాగే చేస్తున్నారని ప్రశంసించారు. కాగా ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. చదవండి: ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ ఆన్లైన్ టికెట్ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్ పేర్కొన్నారు. దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. అన్ని సమస్యలపై చర్చించాం ఆన్లైన్ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు. మరో సమావేశం ఉంటుంది సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు. -
‘బ్యాట్ లవర్స్’..
మణి సాయితేజ, హాసినీ రాయ్ జంటగా ఎ.రాబిన్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాట్ లవర్స్’. దీక్షిక సమర్పణలో కొండ్రాసి ఉపేందర్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. ‘‘క్రికెట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు’’ అన్నారు ఉపేందర్. ‘‘గ్రామీణ నేపథ్యంలో కథ ఉంటుంది’’ అన్నారు ఎ.రాబిన్ నాయుడు. మణి సాయితేజ, హాసినీ రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్, సినిమాటోగ్రాఫర్ సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
సి.కల్యాణ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: హఫీజ్‌పేట భూములకు సంబంధించి దాఖలైన కేసులో సినీ నిర్మాత సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సర్వే నంబర్ 80లో కొంతభూమి అంశంలో సి.కల్యాణ్‌కు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సాహెబ్బాదీ హమీదున్నీసా బేగం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిష న్ను బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఫైనల్ డిక్రీ పొందక ముందే ఆ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడతారని సి.కల్యాణ్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సి.కల్యాణ్ తరఫు న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ ఫైనల్ డిక్రీ వచ్చిందని చెబుతుండగా.. హైకోర్టు తీర్పులో ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని స్పష్టంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ సి.కల్యాణ్, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. చదవండి: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతపై కేసు నమోదు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సి కల్యాణ్ పేరుతో షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా?
‘‘కరోనా తర్వాత మా ‘గాడ్సే’ సినిమా ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘తల్లితండ్రులు, యువకులు ఆలోచించే విధంగా చదువు నేపథ్యంలో ‘గాడ్సే’ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా? అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి, జూన్ లేదా జూలై నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సత్యతో ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చేశాను. ఇప్పుడు ‘గాడ్సే’ చేస్తున్నాను. ప్రతి దేశంలో ఉన్న, జరుగుతున్న పాయింట్‌ని టచ్ చేసి బిగ్ స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాం’’ అన్నారు గోపీ గణేష్ పట్టాభి. ‘‘నా జీవితంలో ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్ మాస్టర్’ చాలా ముఖ్యమైన సినిమాలు. ‘బ్లఫ్ మాస్టర్ 2’ ఎప్పుడు చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ చిత్రానికి రెండింతలు గొప్పగా ఉండే సినిమా ‘గాడ్సే’’ అన్నారు సత్యదేవ్. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేయస్ రామారావు, నటులు ప్రకాశ్ నాగ్, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు..
థియేటర్ నిండితే సినిమా వాళ్లకు కడుపు నిండినంత ఆనందం. కోవిడ్ అన్‌లాక్ వల్ల అర్ధాకలితో నడుస్తున్నాయి థియేటర్స్. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఫుల్ మీల్స్ టికెట్ ఇచ్చింది. 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చంది. ఇనియ పొంగల్ నల్ వాళ్తుగళ్ చెప్పింది. తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలన్న మాట. పొంగల్ పండుగ నిండుగా జరుపుకోమంది. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కీ 100 శాతం సీటింగ్ అనుమతి వస్తుందా? మన సంక్రాంతి కూడా నిండుగా జరుగుతుందా? కోలీవుడ్ ఖుషీ ఖుషీ సోమవారం కోలీవుడ్ ఇండస్ట్రీ ఖుషీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్ సిస్టమ్ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీయం పళని స్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్ విజయ్. ఆయన నటించిన ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్రబృందాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అయితే థియేటర్స్ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిని అన్‌లాక్ చేసినప్పుడు థియేటర్స్ సగం సీటింగ్‌తో నడపడమెందుకు? అనేది ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ నిండుగా కనపడబోతున్నాయి. మనకూ 100శాతం సీటింగ్ ఉంటుందా? 50 శాతం సీటింగ్ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్), దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్’ విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి కోరతారా? నిర్మాతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ► మన దగ్గర కూడా థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది. – సి. కల్యాణ్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు ► యాభై శాతం సీటింగ్ కెపాసిటీ విషయమై ఎంహెచ్ఎ (హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి ఓ లేఖ అందింది. తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని ఉపయోగించుకుని వంద శాతం సీటింగ్ కెపాసిటీకి జీవో పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ గురించి రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. – నిర్మాత డి. సురేశ్‌బాబు -
ప్రేమిస్తే విలువ తెలుస్తుంది
దిలీప్, శ్రావణి జంటగా ఆనంద్ కానుమోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. గురు రాఘవేంద్ర సమర్పణలో ఎ. మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్, ఆడియోను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, ‘‘ఈ సినిమా మంచి హిట్ అయి చిత్రనిర్మాతకు పేరుతో పాటు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు మోహన్ రెడ్డి. ‘‘ఇష్టమైనవి దక్కాలంటే ముందు మనం దాన్ని ప్రేమించాలి. అది దక్కిందా? లేదా? అనేది తర్వాత విషయం. కానీ ప్రేమిస్తే వాళ్ల విలువ మనకు తెలుస్తుందని చెప్పే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ కానుమోలు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: వివేక్ రఫీ ఎస్కే. -
ఓటు వేసిన దర్శకుడు వివి వినాయక్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘చిత్రపురి కాలనీ సొసైటీ’ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. ప్రముఖ నటుడు భానుచందర్, గిరిబాబు, దర్శకుడు వివి వినాయక్ తదితర సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాలుగు ప్యానెల్స్ పాల్గొనగా.. మన ప్యానెల్, సత్యమేవ జయతే ప్యానెల్ పోటీ పడుతున్నాయి. పదకొండు మంది కమిటీ సభ్యుల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో ప్యానెల్లో 11 మంది అభ్యర్థులు ఉంటారు. చదవండి: చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు మన ప్యానెల్ తరఫున నిర్మాత సి. కళ్యాణ్, సత్యమేవ జయతే ప్యానెల్ తరఫున ఓ. కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 16 బూత్‌ల్లో పోలింగ్ నిర్వహించారు. చిత్రపురి కాలనీ సొసైటీలో మొత్తం 4,810 ఓట్లు ఉన్నాయని, పోలింగ్ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల ఆఫీసర్ అరుణ తెలిపారు. ఎన్నికల తుది ఫలితాలు సాయంత్రం 7 గంటలకు వెల్లడించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సినీ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 67 ఎకరాల స్థలం కేటాయించి చిత్రపురి కాలనీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
రెమ్యునరేషన్లపై స్పందించిన కల్యాణ్
సాక్షి, హైదరాబాద్ : నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం తగ్గింపుపై ప్రముఖ సినీ ప్రొడ్యూసర్, నిర్మాత మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ స్పందించారు. రెమ్యునరేషన్‌ను20 శాతం తగ్గించమని అడగడంలోనే నిర్మాతల అసమర్ధత వెల్లడవుతోందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘నిర్మాతలు పని కల్పించేవాళ్లు.. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది వాళ్లే.. కాకపోతే 20 శాతం తగ్గించమని అందరినీ అడగడంలోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోంది. గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని అభాసుపాలు చేస్తున్నారు. అది సరైనది కాదు. కూర్చుని మాట్లాడుకోవాలి. నిర్మాతల్లో యూనిటీ లేకపోతే కష్టం. నిర్మాతల్లోనే కొందరు దొంగల్లాగా మారి, అవతలివారిని ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదు’అని కల్యాణ్ అభిప్రాయపడ్డారు. (చదవండి : పారితోషికం కట్) కాగా, రోజుకు 20 వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్టులకు 20 శాతం.. సినిమాకు ఐదు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు 20 శాతం చొప్పున తగ్గించాలని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్(ఏటీఎఫ్ పీజీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఇండస్ట్రీ నష్టాన్ని ఎలా అధిగమించాలి?
‘తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని ఎలా అధిగమించాలి? ఎవరెవరు ఏయే త్యాగాలు చేయాలి? అనే అంశంపై అన్ని శాఖలవారూ చర్చిస్తున్నాం. ఈ చర్చలకు అందరూ పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ఈ సమావేశాల వివరాలను త్వరలో తెలుపుతాం’’ అన్నారు. -
ఫిల్మ్ ఛాంబర్లో మంత్రి, సినీ ప్రముఖుల భేటీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల సినిమా షూటింగ్స్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రప్రభుత్వం సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతినిచ్చిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లపై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ పెద్దలతో కలిసి ఫిల్మ్ ఛాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు హాజరయ్యారు. (రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్) చదవండి: షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్
‘‘రామానాయుడుగారంటే మాకు ఓ హీరో, రోల్‌మోడల్. దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తులు. సినీ పరిశ్రమ, దాని అనుబంధ కార్యాలయాలన్నీ అభివృద్ధి కావడానికి రామానాయుడుగారే కారణం. ఆయన జయంతిని మేం గొప్పగా జరుపుకుంటాం. ఆయన్ను తలచుకునే సినిమా స్టార్ట్ చేస్తాం. రామానాయుడుగారి వారసుడిగా అభిరామ్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ –‘‘రామానాయుడుగారు లేకుంటే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఫిలిం నగర్, హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. రామానాయుడుగారి పేరుతో ఏది మొదలుపెట్టినా అది సక్సెస్. చెన్నారెడ్డి, దాసరి నారాయణరావు, రామానాయుడుగార్లు ఫిలింనగర్‌కు దేవుళ్లులాంటి వారు’’ అని అన్నారు. ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. వారి ఫాలోయర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్లో మంచి సినిమాలు రావడానికి నాయుడుగారి ప్రోత్సాహం ఉంది’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ‘‘మా తాతగారు భౌతికంగా లేకున్నా మానసికంగా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు’’ అన్నారు అభిరామ్. ఈ కార్యక్రమంలో రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్, కేఎస్ రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్య నారాయణ, జె. బాలరాజు రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
9న సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఈ నెల 9న సినీ పెద్దలు సమావేశం కానున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్‌కు చెందిన అందరినీ ఆహ్వానించామన్నారు. అయితే జూన్ 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రావటం లేదన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతామని సి. కళ్యాణ్ పేర్కొన్నారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’) ఇక ఇదే సమావేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవే అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశం అయిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవి నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూడా సినిమా షూటింగ్‌ల అనుమతిపై చర్చించారు. అయితే ఈ సమావేశాలకు తనను ఆహ్వానించలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..) -
త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికిరణ్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా కూడా పాల్గొన్నారు. -
దాసరి లేని లోటు తెలుస్తోంది
‘‘కరోనా వల్ల ఇండస్ట్రీకి జరిగిన నష్టాన్ని దాసరిగారైతే మరోలా కాపాడేవారు. దాసరిగారిని తలుచుకోని రోజు లేదు’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. శనివారం దర్శకరత్న దాసరి నారాయణరావు 3వ వర్థంతి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ ప్రముఖులు దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘దాసరిగారు లేని లోటు కనిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తాం’’ అన్నారు. ‘‘మేం దాసరిగారి దగ్గర పని చేయలేదు. అయినా ఆయన మనుషులం అని గర్వంగా చెప్పుకుంటాం’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ‘‘ప్రతి ఒక్కరికీ విలువ ఇచ్చి మాట్లాడేవారు దాసరిగారు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ బర్తీ చేయలేరు’’ అన్నారు నిర్మాత ప్రసన్న కుమార్. ‘‘నేను బతికి ఉన్నంత కాలం దాసరిగారి జయంతి, వర్థంతి జరిగేలా చూస్తాం. ప్రతి ఏడాదీ దాసరి అవార్డ్స్ కొనసాగిస్తాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. శ్రీకాంత్, రేలంగి నరసింహా రావు, రాజా వన్నెం రెడ్డి, తాండవ, పీడీవీ ప్రసాద్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 300 మందికి ఫుడ్ ప్యాకెట్లు, స్వీట్ ప్యాకెట్లు పంచిపెట్టారు రామసత్యనారాయణ. -
టాలీవుడ్లో ముదురుతున్న వివాదం
-
నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ
ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌లు ప్రారంభించాలి? థియేటర్లు మళ్లీ ఎలా ఓపెన్ చేయాలి? అనే విషయాల గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి గురువారం నటుడు బాలకృష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా, ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అంట. వార్తల ద్వారా, పత్రికల ద్వారా విషయం తెలుస్తోంది. అంచలంచెలుగా షూటింగ్స్‌కి అనుమతి ఇస్తారని తెలిసింది’’ అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ‘‘చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను? వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్ యాదవ్‌తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు’’ అన్నారు బాలకృష్ణ. నోరు అదుపులో పెట్టుకోండి : నాగబాబు ఈ విషయంపై నటుడు నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నాగబాబు మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్ ఎలా ప్రారంభించాలని తలసాని శ్రీనివాస యాదవ్‌తో కలసి చిరంజీవిగారింట్లో నాగార్జునగారు, రాజమౌళిగారు, అరవింద్‌గారు, సురేశ్‌బాబుగారు, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు, నిర్మాతలందరూ చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. చాలా తక్కువ మందినే పిలిచారు. ఆ మీటింగ్ నేపథ్యం ఏంటో సరిగ్గా తెలియదు. ఇవాళ బాలకృష్ణగారి కామెంట్స్ చూశాను. ఆయన్ను మీటింగ్‌కి పిలవకపోవడం తప్పా? ఒప్పా నాకు తెలియదు. పిలిచారా పిలవలేదా? అని ఈ మీటింగ్స్‌ని నిర్వహించినవాళ్లను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణ మీద ఉంది. పిలవలేదని కోప్పడ్డారు. సరే.. కోప్పడ్డానికి రీజన్ ఉంది. కానీ ‘భూములు పంచుకుంటున్నారు’ అని నోరు జారారు. మిమ్మల్ని పిలవకపోవడం కరెక్ట్ అని నేను అనను. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అయ్యుంటుంది. వేరే కారణం అయ్యుండొచ్చు. ఆ కారణం తెలుసుకొని అడిగినా తప్పు లేదు. కానీ భూములు పంచుకుంటున్నారన్న మాట నిర్మాతగా, నటుడిగా నాకు బాధ కలిగించింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతానంటే కరెక్ట్ కాదు. మీకంటే పదిరెట్లు ఎక్కువ మాట్లాడటానికి చాలా మంది ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి బాలకృష్ణగారూ. ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప, భూములు పంచుకోవడానికి ఎవ్వరూ వెళ్లలేదు. మమ్మల్ని కూడా చాలామంది పిలవలేదు. ఆ మాటలేంటి? ఇండస్ట్రీ మీద మీకున్న గౌరవం ఇదా? మీరు కేవలం ఇండస్ట్రీనే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారు. ఇండస్ట్రీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పడం మీ బాధ్యత. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్తే మీకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్‌ని ఎలా నాశనం చేశారో, సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో మీ తెలుగు దేశం పార్టీని నమ్మినవాళ్లను అడిగితే తెలుస్తుంది. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు. ఒక హీరో మాత్రమే. కంట్రోల్‌గా మాట్లాడటం నేర్చుకోండి’’ అన్నారు. మాలో విభేదాలు లేవు – నిర్మాత సి. కల్యాణ్ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘మీటింగ్స్ అన్నీ నిర్మాతల తరఫునుంచి, స్టూడియోల సైడ్ నుంచి జరుగుతున్నాయి తప్పితే ఆర్టిస్టుల నుంచి కాదు. ఆర్టిస్టుల ఇబ్బందులు చెప్పడానికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఉంది. దాని నుంచి నరేశ్‌గారు, జీవితగారు హాజరయ్యారు. ఎవరితో ఏది చర్చించాలంటే ఇండస్ట్రీ వాళ్లను పిలుస్తుంది. ఇండస్ట్రీలో ఉండే ఎవరైనా ఇండస్ట్రీని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ముందుకు వస్తే వాళ్ల వెనక ఉండటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నమే (గురువారం) బాలకృష్ణగారికి అన్నీ వివరించాను. ఆయన సంతృప్తిగానే ఉన్నారు. ఈ విషయం మీద ఇక చర్చలు ఉండవనుకుంటున్నాను. ఇక మీటింగ్స్ ఉండకపోవచ్చు. బాలకృష్ణగారు మా హీరో. ఆయన మనిషిగా నేను ఇందులో పాల్గొంటున్నట్టే లెక్క. మాకు ఇద్దరు ముఖ్యమంత్రులూ ముఖ్యం. అందరం ఒకటే. ఇక్కడ గ్రూపులు లేవు. దాసరిగారు ఉన్నప్పుడు అన్నీ ఆయన భుజాన వేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవిగారిని మేమే అడిగాం. నాగార్జునగారూ వచ్చారు. బాలకృష్ణగారు కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడ ఎవరు అవసరమైతే వాళ్లను పిలుచుకుని వెళ్లడానికి మేం రెడీ. పని జరగడం ముఖ్యం. మేం ఏ పార్టీలకు సంబంధించిన వాళ్లం కాదు. బాలయ్యగారు వస్తానంటే ఎవరైనా వద్దంటారా? మాలో విభేదాలు లేవు. బాలయ్యను సొంత బ్రదర్‌లా భావిస్తాను’’ అన్నారు. -
లొకేషన్లు ఫ్రీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు
ఆంధ్ర ప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, స్టూడియోలు, ల్యాబ్స్ నిర్మాణానికి స్థలాలు, ఇండస్ట్రీ వర్గానికి హౌసింగ్‌కు అవసరమైన స్థలాలను కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఏపీ సీయం జగన్మోహన్ రెడ్డిని కోరుతూ ఓ లేఖ రాసింది. నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్ బుధవారం ఈ లేఖను ఏపీ టెలివిజన్ మరియు చిత్ర పరిశ్రమాభివృధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డికి, విజయ్‌చందర్‌కు అందించారు. ఏపీలో షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్టు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌కి ఈ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చైన్నై నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలను నిర్మించుకోవడానికి ఉదారంగా స్థలాలు కేటాయించారని ఈ లేఖలో ప్రస్తావించారు. -
మా ప్రయత్నాన్ని ఆదరించారు
‘‘రూలర్ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మేం ఓ మంచి ప్రయత్నం చేశాం.. మా ప్రయత్నానికి విజయాన్ని అందించారు. సి.కల్యాణ్‌గారితో నేను చేసిన మూడో సినిమా ఇది. మంచి కథా విలువలున్న చిత్రం చేయాలని భావించే ఆయనకు నా తరఫున, అభిమానుల తరఫున కృతజ్ఞతలు’’ అని బాలకృష్ణ అన్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రూలర్’. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (డిసెంబర్ 20) విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ పరుచూరి మురళిగారు మంచి కథ, డైలాగ్స్‌ను అందించారు. ఈ కథలో మంచి సందేశాన్ని కూడా చొప్పించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఆర్టిస్టుల దగ్గర నుంచి తనకు ఏం కావాలో రాబట్టుకునే దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌గారు. ఆయన నిర్మాతల దర్శకుడు కూడా. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జై సింహా’ తర్వాత మా కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. మా కాంబినేషన్లో వచ్చే తర్వాతి చిత్రం ‘రూలర్’ కంటే మంచి చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు వెరీ హ్యాపీ’’ అన్నారు వేదిక. ‘‘జైసింహా’ తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన ‘రూలర్’కి సినిమాటోగ్రఫీ అందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు కెమెరామేన్ రాంప్రసాద్. ‘‘కల్యాణ్‌గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పరుచూరి మురళి అన్నారు. -
సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను
‘‘చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీలను అలవరుస్తుంది’’ అన్నారు కేయస్ రవికుమార్. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన ‘రూలర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రవికుమార్ చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘రూలర్’ సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళి చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్న మార్పులతో ‘రూలర్’ సినిమా చేశాం. మొదట అనుకున్న కథను వద్దనుకోవడానికి పెద్ద కారణాలు లేవు. ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది. సినిమాలోని ఈ సినిమా బాలకృష్ణగారి అభిమానులకే కాదు... ఇతర ప్రేక్షకులకూ నచ్చుతుంది. ‘జై సింహా’ తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో ‘రూలర్’ చేశాను. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు బరువు తగ్గారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి వర్కౌట్స్ చేసేవారట. ► నా కెరీర్లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘రూలర్’ సినిమాని బాలకృష్ణగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే చేశా. తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలకృష్ణగారు సెట్లో కోప్పడతారు. అది కూడా అన్ని సందర్భాల్లో కాదు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరగకపోతే సెట్లో నేనూ షార్ట్ టెంపరే. ► నా కెరీర్ మొదట్లో దాదాపు పదేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడు సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా... ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను. ► ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేసుకుంటే పెద్ద స్టార్స్‌తో సినిమా లను కూడా త్వరగా పూర్తి చేయవచ్చు. ‘రూలర్’ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి ‘స్నేహాంకోసం’ సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ సినిమా చేసేటప్పుడే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమాకి డైలాగ్స్ రాసుకున్నాను. పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి. నటీనటులకు లొకేషన్లో నటించి చూపిస్తాం కాబట్టి దర్శకులకు కూడా నటన వచ్చేస్తుంది. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలో ఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు. -
ఆ స్ఫూర్తితోనే రూలర్ చేశాం
‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘రూలర్’. ఇందులో వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు. బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్ రవికుమార్ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను. ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్’ అనే పేరు బాలకృష్ణగారికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్లా ఉపయోగపడతాయి. సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు. కేఎస్ రవికుమార్ సూపర్ డైరెక్టర్. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్ రవికుమార్. ‘‘బాలకృష్ణగారు ఈజ్ గ్రేట్’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్. కథానాయికలు సోనాల్ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాత సి. కల్యాణ్ 60 వ పుట్టినరోజు వేడుక
-
సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు
‘‘చిన్న సినిమాలు మాత్రేమే తీస్తాను అని ఒట్టు పెట్టుకుని బడ్జెట్ దాటకుండా చిత్రాలు తీస్తున్నాడు రామ సత్య నారాయణ. ఒక ఫ్లాప్ తీస్తే ఆ నిర్మాత మళ్లీ సినిమా తీయలేని పరిస్థి తులున్న ఈ రోజుల్లో హిట్, ఫ్లాప్‌కి అతీతంగా సేఫ్‌గా సినిమాలు తీస్తున్నాడు. ఈ ‘శివ 143’ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. శైలేష్ సాగర్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ 143’. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను హైదరాబాద్ వచ్చినçప్పుడు ఓనమాలు దిద్దించారు కళ్యాణ్‌గారు. నేను ఇన్ని సినిమాలు తీశానంటే అది ఆయన నేర్పిన విద్యే’’ అన్నారు. ‘‘భీమవరం టాకీస్ బ్యానర్లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది’’ అన్నారు శైలేష్ సాగర్. ఈ చిత్రానికి కెమెరా: సుధాకర్, సంగీతం: మనోజ్. ∙రామసత్యనారాయణ, ఐషా, సి.కల్యాణ్, శైలేష్ సాగర్, డీఎస్ రావు -
కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్
‘‘దర్శకుణ్ణి అవుదామని ఇండస్ట్రీకి వచ్చి, మెళకువలు నేర్చుకున్నాను. అనుకోకుండా నిర్మాత అయ్యాను. 2020లో కచ్చితంగా ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తాను. హీరో ఎవరు? అంటే నేనే అవ్వొచ్చేమో!(నవ్వుతూ)’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. నేడు ఆయన పుట్టినరోజు(డిసెంబరు 9) సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో పంచుకున్న విశేషాలు.... ►నెల్లూరులోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన నాకు సి. కల్యాణ్ అనే ట్యాగ్ సంపాదించి ఇచ్చింది ఇండస్ట్రీయే. దర్శకులకు దాసరి నారాయణరావుగారు ఎలా ఉంటారో నిర్మాతలకు డి. రామానాయుడుగారు అలా. రామానాయుడుగారే నాకు స్ఫూర్తి. ►కొత్త సినిమా నిర్మాతలు లేకపోతే ఇండస్ట్రీకి మనుగడ లేదు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నవారే సినిమా తీయాలి.. కొత్తవారు సినిమా తీయకూడదంటే ఆరు నెలల్లో ఇండస్ట్రీ మూతపడిపోతుంది. ఇప్పుడున్న నిర్మాతలందరూ ఒకప్పడు కొత్తవారే. ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలని చిరంజీవిగారితో ఇటీవలే మాట్లాడాను. ‘నాకు ఏదో పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నట్లుగా ఉన్నావ్’ అన్నారాయన. త్వరలోనే ఆ బాధ్యతలు తీసుకుంటారనుకుంటున్నా. ►వేరే ఇండస్ట్రీల్లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియోలు, ఆర్టిస్టులు వేర్వేరుగా ఉంటారు. కానీ టాలీవుడ్లో వీరందరూ ఇంటర్లింకై ఉన్నారు. ఆ నాలుగు సెక్టార్స్ని అండర్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులో సాగదు. ఏదో ఒక రోజు పేలక తప్పదు. ఈ రోజుల్లో ఏడాదికి దాదాపు 280 సినిమాలు విడుదలవుతుంటే... స్టార్స్ సినిమాలు వచ్చేది కేవలం 30 నుంచి 50 సినిమాలే. ఒక పెద్ద స్టార్ ఏడాదికి ఒక సినిమా చేస్తాడు. అతను ఎన్ని సినిమాలు చేసినా వారికి పనిచేసే స్టాఫ్ ఒకరే. మ్యాగ్జిమమ్ 40శాతం మారతారు. నేను నోరు విప్పితే చాలామందికి చెమటలు పడతాయి. ►గతంలో చిత్ర పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరఫున వెళ్లి చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గిల్డ్ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ఎవరూ శాశ్వితం కాదు. నేను కూడా. తెలంగాణలో, ఆంధ్రలో వేర్వేరు ప్రభుత్వాలు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గ్రూపులయ్యాయి. చిరంజీవిగారి దగ్గరికి వెళితే ఒక ట్యాగ్.. బాలకృష్ణగారి దగ్గరికి వెళితే మరో ట్యాగ్.. పవన్ కల్యాణ్ వద్దకు వెళితో ఇంకో ట్యాగ్ కట్టేస్తున్నారు. థియేటర్స్, క్యూబ్‌లు చేతిలో పెట్టుకుని ఉండేవార ంతా ఒక్కటై వ్యాపారం చేస్తున్నారు. ఆ నలుగురి చేతుల్లో థియేటర్స్ ఉన్నాయనడం తప్పు. థియేటర్స్‌ని లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తుండటాన్ని తప్పు అనలేం. ►బాలకృష్ణగారితో నా మూడో సినిమా ‘రూలర్’. భవిష్యత్‌లో ఇంకా సినిమాలు చేస్తాం. ఉత్తరప్రదేశ్‌లో సెటిలైన తెలుగువాళ్ల కథ ‘రూలర్’. ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ లేదు. బాలకృష్ణ– దర్శకుడు వీవీ వినాయక్ కాంబినేషన్లో తప్పకుండా మరో సినిమా నిర్మిస్తాను. -
రొమాంటిక్ రూలర్
ప్రేయసితో ప్రణయ గీతాలా పన చేస్తున్నారు బాలకృష్ణ. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘రూలర్’. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. సి.వి. రావ్, పత్సా నాగరాజు సహ–నిర్మాతలు. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు బాలకృష్ణ. అందులో ఒకటి పోలీసాఫీసర్. మరొకటి ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ మున్నార్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ఓ మెలోడీ సాంగ్‌ను బాలకృష్ణ, వేదికలపై చిత్రీకరిస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ‘రూలర్’ చిత్రం డిసెంబరు 20న విడుదల కానుంది. -
బోల్డ్ కంటెంట్ కథలో భాగమే
‘‘ఆర్డీఎక్స్ లవ్’ కథ ఏ హీరోయిన్‌కైనా చెబితే ఫస్ట్ సీన్‌కే గెటవుట్ అంటారు. అంత బోల్డ్‌గా ఉంటుంది. ఈ కథతో కొందరి హీరోయిన్లను సంప్రదించాను. 70 రోజులు ఒక్క సినిమాకు డేట్స్ ఇచ్చే బదులు మూడు కమర్షియల్ సినిమాల్లో కనిపించవచ్చు అనేవారు. అంత వ్యాపార ధోరణిలో ఆలోచించారు’’ అని దర్శకుడు భాను శంకర్ అన్నారు. తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్‌పుత్ జంటగా భాను శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి. కల్యాణ్ నిర్మించారు. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా భాను శంకర్ చెప్పిన విశేషాలు. ► పక్కా వాణిజ్య అంశాలున్న చిత్రం ఇది. మెసేజ్‌తో పాటు బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది. అది కూడా కేవలం కథలో భాగమే. యూత్‌ని టార్గెట్ చేయడం కోసం చేసింది కాదు. బహిరంగంగా మాట్లాడని టాపిక్‌లను ఈ సినిమాలో చూపించాం. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజ్ అయిన రెండో రోజే ఈ సినిమాలో హీరోయిన్గా పాయల్‌ను కన్ఫర్మ్ చేశాం. పాయల్‌కు కథ బాగా నచ్చి 70 రోజులు డేట్స్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె చాలా బాగా చేసింది. ఈ సినిమాతో తను సౌందర్య, అనుష్క రేంజ్‌కు వెళ్తుంది. ► సినిమాలో ఒక పాత్ర చేస్తే నిజ జీవితంలో కూడా అలానే ఉంటామేమో అని కొందరు ఆర్టిస్టులు భయపడతారు. భయపడితే గొప్ప ఆర్టిస్టులు ఎలా అవుతారు? మా చిత్ర టీజర్ రిలీజ్ అయినప్పుడు ‘బీ గ్రేడ్ సినిమానా?’ అంటూ పాయల్‌కి సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. దాంతో తను భయపడింది. ‘కామెంట్ చేసేవాళ్లు కేవలం టీజరే చూశారు, నీకు సినిమా మొత్తం తెలుసు కదా? నువ్వు ఎందుకు భయపడతావు?’ అని చెప్పాను. ► రొమాంటిక్ సినిమాకు, ‘సి’ గ్రేడ్ సినిమాకు చాలా వ్యత్యాసం ఉంది. రొమాన్స్ పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఉంటుంది. పెద్దవాళ్లు చేస్తే ఒకలా చూసి, చిన్నవాళ్లు చేస్తే మాత్రం విమర్శిస్తారా? ► ఇప్పటికీ అభివృద్ధి చెందని గ్రామాల పరిస్థితులను మా సినిమాలో వివరించాం. అందుకు సెల్ సిగ్నల్ కూడా లేని ఒక ఊర్లోనే 45 రోజులు షూటింగ్ చేశాం. ఈ సినిమా విడుదల తర్వాత నెక్ట్స్ సినిమా ఏంటని ఆలోచిస్తాను. -
సెట్లోకి వెళ్లాలంటే కిక్ ఉండాలి
‘‘ఆర్ఎక్స్ 100’ అనే సినిమా చేయడానికి ముందు తెలుగు సినిమాల్లోకి రావడానికి నాకు ఆరేళ్లు పట్టింది. చాలా తెలుగు సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చినా సెలెక్ట్ కాలేదు. ‘ఆర్ఎక్స్ 100’ సూపర్ హిట్ కావడంతో ‘ఓవర్‌నైట్ స్టార్’ అని సంబోధిస్తున్నారు. ‘ఓవర్‌నైట్ స్టార్’ని కావడం వెనక ఆరేళ్ల కష్టం ఉంది’’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల జంటగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి.కల్యాణ్ నిర్మాత. ఈ నెల 11న ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా పాయల్ రాజ్‌పుత్ చెప్పిన విశేషాలు. ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కొంచెం బోల్డ్‌గా కూడా ఉంది. ఇలాంటి బోల్డ్ సినిమా మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనిపించింది? చేశాను. రొటీన్ పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో అలివేలు అనే సోషల్ వర్కర్ పాత్రలో కనిపిస్తాను. తన ఊరికి వచ్చిన సమస్యను పోరాడి గెలవడానికి అలివేలు ఎంత దూరం వెళ్లిందనేది కాన్సెప్ట్. ► ఇందులో నా ఫైట్స్ నేనే చేశాను. డూప్ పెడతాం అన్నా కూడా నేనే చేస్తాను అని చేశాను. మోకాలి దగ్గర చిన్న ఫ్రాక్చర్ కూడా అయింది (నవ్వుతూ). ఈ సినిమా ద్వారా చాలా పరిమితులను పుష్ చేశాను. బయట మాట్లాడటానికి ఇబ్బంది పడే విషయాలను ఈ సినిమాలో చర్చించాం. ఈ సినిమా షూటింగ్ నాకు మంచి ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఢిల్లీ, ముంబైలో పెరిగాను. ఈ సినిమా కోసం 45 రోజులు పాపికొండల్లోని ఒక ప్రాంతంలో ఉన్నాం. నా రూమ్‌లోకి అప్పుడప్పుడూ కప్పలు వచ్చేవి. కష్టపడ్డాం అని కంప్లయింట్ చేయడం లేదు. ఇదో మంచి జ్ఞాపకం లాంటిది. ప్రతిరోజూ సెట్లోకి వెళ్లాలంటే ఏదో కిక్ ఉండాలి. డబ్బు కోసమే సినిమా చేయను. ► తెలుగు సినిమా చేసే ముందు నా మాతృభాష పంజాబీలో కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు వరుసగా తెలుగు సినిమాలే చేస్తుంటే పంజాబీ ఫ్యాన్స్ అందరూ ‘పాయల్ పంజాబ్’ వచ్చేయ్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ది బెస్ట్ అని నేను భావిస్తున్నాను. బాలీవుడ్‌కి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతాను. ప్రస్తుతం ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ఓ సినిమా చేస్తున్నాను. -
సినిమా సంఘటనలతో బజార్
‘‘మీనా బజార్’ సినిమా టీజర్ బాగుంది. సినిమా ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ ‘మీనా బజార్’ సినిమా మంచి విజయం సాధించి, రెండో భాగం కూడా రావాలని కోరుకుంటున్నా’’ అని సి.కళ్యాణ్ అన్నారు. మధుసూదన్, శ్రీజిత ఘోష్ జంటగా రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబ్లు్యడబ్లు్యడబ్లు్య.మీనాబజార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ని సి. కల్యాణ్ విడుదల చేశారు. ‘‘కన్నడలో ఒక సినిమా చేశాను. తెలుగులో మొదటి చిత్రమిది’’ అన్నారు రానా సునీల్ కుమార్ సింగ్. ‘‘మన చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’అన్నారు మధుసూదన్. -
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
‘‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్. బాగా పాపులర్ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరరెక్కిన ఈ సినిమా మొదటి పోస్టర్‌ను నిర్మాత సి.కల్యాణ్, రెండో పోస్టర్‌ను శ్రీనివాస్ రెడ్డి బావ, పులివెందులకు చెందిన వ్యాపారవేత్త దంతులూరి కృష్ణ విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి విజయాలను సాధించే దర్శకుడు శ్రీను. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్‌ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘నేను ఈ సినిమా రషెస్ చూశా. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఆర్టిస్ట్‌ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు దంతులూరి కృష్ణ. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ కానూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్ కెమెరామెన్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ షాప్ కుర్రాడి కథ
‘రంగస్థలం, మహానటి, గుణ 369’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ ఆచంట హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నేను నా నాగార్జున’. ఆర్.బి. గోపాల్ని దర్శకునిగా పరిచయం చేస్తూ జియన్ఆర్ క్రియేషన్స్ పతాకంపై గుండపు నాగేశ్వరరావు నిర్మించారు. ఆగస్టు 29న హీరో నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ వేడుక నిర్వహించారు. ఈశ్వర్ పెరావళి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత మళ్ల విజయప్రసాద్, ట్రైలర్‌ని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ విడుదల చేశారు. మహేష్ ఆచంట మాట్లాడుతూ– ‘‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ ఆపేసి చిన్న చిన్న పాత్రలు చేస్తున్న నేను ఏ అవకాశం వస్తే ఆ సినిమా చేశాను. ‘రంగస్థలం’కి ముందే ఈ చిత్రం చేశాను. ఒక సైకిల్ షాప్ కుర్రాడి కథ ‘నేను నా నాగార్జున’. కథ విన్నప్పుడు మా ఊరిలో రాంబాబు అనే సైకిల్ షాప్ కుర్రాణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమా చేశా. చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘అష్టకష్టాలు పడి ఈ సినిమా పూర్తి చేశాం. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. మంచి తేదీ చూసుకొని త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గుండపు నాగేశ్వర రావు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్, నిర్మాతలు మళ్ల విజయప్రసాద్, రామ సత్యనారాయణ, సాయివెంకట్, బసిరెడ్డి, టి.ప్రసన్నకుమార్, బాలాజీ నాగలింగం, దర్శక–నిర్మాత బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు
‘‘డీ సినిమాను అందరూ ప్రోత్సహించాలి. నిర్మాతల కష్టాన్ని పైరసీ ద్వారా వృథా చేస్తున్నారు. దీన్ని ఖండించాలి. త్వరలో అన్ని రాష్ట్రాల్లో ‘డీ’ సినిమా సేవలు రానున్నాయి. బసిరెడ్డిగారు ఈ టెక్నాలజీ తీసుకురావడం సంతోషం’’ అన్నారు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్. పైరసీని అరికట్టడానికి ‘డీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్’ డెమోను ఏఎంబీ సినిమాస్‌లో ప్రారంభించారు. ‘డిజిక్వెస్ట్’ ఇండియా లిమిటెడ్ సీఎండీ బసిరెడ్డి మాట్లాడుతూ– ‘‘పైరసీ నిర్మూలన కోసం రెండేళ్లు ట్రై చేశాం. కొత్త టెక్నాలజీలో పైరసీ ప్రొటక్షన్ ఇమిడి ఉండటం విశేషం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కామర్స్, డిజిక్విస్ట్ ఇండియా సమాన భాగస్థులుగా దీన్ని ముందుకు తీసుకెళతారు’’ అన్నారు.తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ పి.రామ్మోహన్ రావ్ మాట్లాడుతూ– ‘‘పైరసీని అరికట్టడానికి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి. డిజిటల్ డెలివరీ రేట్స్ నిర్మాతలందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇండస్ట్రీలోని వారందరూ దీనికి సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కె.మురళీ మోహన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ వడ్లపట్ల, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాల గోవింద్ మూర్తి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, దర్శకుడు వీర శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కిర్రాక్ లుక్
‘లుక్ అదిరింది. కిర్రాక్ లుక్. భలే ఉంది కొత్త లుక్...’ ఇదిగో ఇలానే రెట్టించిన ఉత్సాహంతో బాలకృష్ణ అభిమానులు ఆనందపడిపోతున్నారు. బాలకృష్ణ తాజా చిత్రంలో ఆయన లుక్ విడుదల కావడమే ఇందుకు కారణం. నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. వాన్‌డైక్ బియర్డ్ (ఒక రకమైన గడ్డం)తో స్టైలిష్‌గా కనిపించారు బాలకృష్ణ. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. సి.వి. రావ్, పర్సా నాగరాజు సహ–నిర్మాతలు. -
సెప్టెంబర్ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక
సినీ నిర్మాణంలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కీలక పాత్ర వహిస్తారు. అలాంటి తెలుగు సినీ ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకను సెప్టెంబర్ 8న గచ్చిబౌలి ఇన్డోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, ప్రొడ్యూసర్స్ కెఎస్ రామారావు, దిల్ రాజు దర్శక మండలి అధ్యక్షుడు ఎన్ శంకర్, మా అధ్యక్షుడు నరేష్ వికె, జీవిత రాజశేఖర్, ట్రెజరర్ రాజీవ్ కనకాల తదితరులు పాల్గొని సెప్టెంబర్ 8 జరిగే తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ సభ విజయవంతం కావడానికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిసిపిఇయు అధ్యక్షుడు అమ్మిరాజు, జెనరల్ సెక్రటరీ ఆర్ వెంకటేశ్వర్ రావు, కోశాదికారి సతీష్, ఆడిటర్ వివేక్ పాల్గొని సెప్టెంబర్ 8న జరిగే వేడుకను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఈరోజున దాసరి గారు ఉంటే ఈ కార్యక్రమం మరో రేంజ్లో ఉండేది. ఆయనకు అన్ని విభాగాల పట్ల ఉన్న ప్రేమ అలాంటిది. ఒకసినిమా స్టార్ట్ అవడానికి ముందే ప్రొడక్షన్‌ఎగ్జిక్యూటివ్స్ వర్క్‌స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. ఈ యూనియన్‌కి నిర్మాతల మండలి తరపున కావాల్సిన సహాకారం తప్పకుండా అందిస్తాం’ అన్నారు. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు మాట్లాడుతూ ‘ఒక మూవీ స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యేవరకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ పాత్ర చాలా ముఖ్యం. ఒక సినిమాకు నిర్మాతలుగా మా పేరు పడినా వారిదే ఎక్కువ కష్టం ఉంటుంది. అలాంటి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వెల్ ఫేర్ కోసం జరుపుతున్న ఈ కార్యక్రమానికి మా వంతు సహాకారం అందిస్తాం’అన్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ‘సినిమా మొదలయ్యి ప్యాకప్ అయ్యే వరకూ తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌కీ రోల్ పోషిస్తారు. లొకేషన్లో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. అలాంటి సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక గ్రాండ్ సక్సస్ కావడానికి యావత్ సినీ పరిశ్రమ మొత్తం అండగా ఉంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమాన్ని జెమిని టీవీ, శ్రేయాస్ మీడియా అద్వర్యంలో నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ సెలెబ్రిటీస్ హాజరవుతారు. దీని ద్వారా వచ్చే ఫండ్‌ను టిసిపిఇయు సభ్యుల వెల్ ఫేర్ కోసం ఉపయోగిస్తారు.. -
పాయల్ బాంబ్
ఆర్డీఎక్స్ భారీ పేలుడు పదార్థం. కనిపిస్తున్న స్టిల్ చూస్తుంటే పాయల్ రాజ్‌పుత్ ఆర్డీఎక్స్ బాంబ్‌ని తలపిస్తున్నారు కదూ? తేజస్ కంచెర్ల, పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. శంకర్ భాను దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. -
అన్నపూర్ణమ్మ మనవడు
సీనియర్ నటులు అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ పోషించారు. నర్రా శివనాగేశ్వర్ రావు (శివనాగు) దర్శకత్వంలో యం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ పతాకంపై యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ– ‘‘ చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. శివనాగు చాలా క్రమశిక్షణ ఉన్న దర్శకుడు. నా మనవడిగా నటించిన మాస్టర్ రవితేజ పుట్టుకతోనే నటన నేర్చుకొని వచ్చాడు’’ అన్నారు. యమ్.ఎన్. ఆర్ చౌదరి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషం. శివనాగు ఎంతో అందంగా ఈ చిత్రం తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో ఆడియో, అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే చిత్రమిది. 200లకు పైగా థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని శివనాగు అన్నారు. ‘‘శివనాగుగారి దర్శకత్వంలో ‘దేవినేని’ సినిమా చేస్తున్నాను. సినిమా మీద ఎంతో ఇష్టంతో పని చేస్తారాయన’’ అన్నారు హీరో తారకరత్న. సీనియర్ పాత్రికేయులు వినాయక రావు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గిరికుమర్(గిరి), సంగీతం: రాజ్ కిరణ్. -
దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు, సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటీగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం సాధించకపోయినా ఆ ప్యానల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్‌లు ఈసీ సభ్యులుగా విజయం సాధించారు. 12 మంది ఈసీ మెంబర్లలో 9 మంది సీ కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందగా, ఇద్దరు దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటి చేసి విజయం సాధించారు. 20 మంది సెక్టార్ మెంబర్స్‌లో 16 మంది మన ప్యానల్ నుంచి విజయం సాధించగా, నలుగురు యాక్టివ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. ఫిలిం చాంబర్లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్ విభాగం నుంచి నారాయణ దాస్ నారంగ్‌ను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్: నారాయణ్‌దాస్ నారంగ్ వైస్ ప్రెసిడెంట్లు : దిల్ రాజు, ముత్యాల రామదాసు సెక్రటరీ : దామోదర్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ : నట్టికుమార్, భరత్ చౌదరి ట్రెజరర్ : విజయేందర్ రెడ్డి -
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సి.కల్యాణ్
‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడిగా నిర్మాత సి.కల్యాణ్ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల్లో ‘మన కౌన్సిల్–మన ప్యానెల్’ విజయం సాధించింది. నూతన అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఎన్నికలు సజావుగా జరగడానికి సహకరించిన వారికి, గెలిపించిన ప్రతి ఒక్కరికీ మా మన ప్యానెల్ తరపున ధన్యవాదాలు. మా మీద ఈర్ష్యతోనే, బాధతోనో, కోపంతో, మరేదో ఇబ్బందుల్లో ఉండటం వల్లో ఈరోజు ఓటింగ్‌కి రాలేకపోయిన వారికి కూడా థ్యాంక్స్. ఎలాంటి ఎన్నికలు లేకుండా ఆర్గనైజేషన్ విడిపోయింది. దాన్ని ఒకటిగా కలుపుదామనే సదుద్దేశంతో నేను, ప్రసన్నకుమార్, ఆది శేషగిరిరావు, మల్టీడైమన్షన్ రామ్మోహన్రావుగారు, చదలవాడ శ్రీనివాసరావుగారితో చర్చించి అందరం ఒక తాటిపై ఉండాలని నిర్ణయించుకున్నాం. పదవీ వ్యామోహమో ఏమో కానీ.. ఓ ఆర్గనైజేషన్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోయాడు’’ అన్నారు. కొత్త కమిటీ ఇదే... సి.కల్యాణ్ అధ్యక్షుడిగా ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా కె.అశోక్‌కుమార్, వై.వి.ఎస్.చౌదరి, కార్యదర్శిగా టి.ప్రసన్నకుమార్, జాయింట్ సెక్రటరీగా మోహన్ వడ్లపట్ల, ట్రెజరర్‌గా చదలవాడ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌గా కె.అమ్మిరాజు, అశోక్‌కుమార్ వల్లభనేని, బండ్ల గణేశ్, ఆచంట గోపీనాథ్, పల్లి కేశవరావు, శివలెంక కృష్ణప్రసాద్, జి.వి.నరసింహారావు, ఎస్.కె.నయీమ్ అహ్మద్, పరుచూరి ప్రసాద్, టి.రామసత్యనారాయణ, వి.సాగర్, వజ్జా శ్రీనివాసరావు, పి.సునీల్‌కుమార్ రెడ్డి, కామిని వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు గెలుపొందారు. -
ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షునిగా సి కళ్యాణ్
హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా సి కళ్యాణ్ గెలుపొందారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతల మండలి ఎన్నికల నిర్వహించాల్సి ఉండగా.. ఈ సారి చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు నేడు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానల్, పి. రామకృష్ణ గౌడ్ ప్యానల్లు తలపడ్డాయి. నిర్మాతలు సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. మొత్తంగా 477 ఓట్లు పోలవగా, సి కళ్యాణ్‌కు 378, ఆర్కే గౌడ్‌కు 95 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లను చెల్లనివిగా గుర్తించారు. తక్కువ సంఖ్యలో ఓట్లు రావడంతో ఆర్కే గౌడ్ డిపాజిట్ కోల్పోయారు. -
కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు
‘‘ఒకప్పుడు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి.. లాంటి దర్శకులు నాకు ఇచ్చిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’తో మా ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు. ‘కల్కి’ సినిమాతో దాన్ని అందుకుంటామనే నమ్మకముంది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. ‘కల్కి’ మూవీ హానెస్ట్ ట్రైలర్‌ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథలతో కొత్త దర్శకులు నన్ను సంప్రదించొచ్చు. సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడవేగ–2’ తెరకెక్కబోతోంది. చిరంజీవిగారి సినిమాలను కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నట్టు నా సినిమాలకు నా కూతుర్లు సపోర్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘1983 నేపథ్యంలో సాగే పీరియాడికల్ చిత్రమిది. కొత్త ఫార్మాట్లో ఉంటుంది. సాయితేజ కథ ఇచ్చాడు. ఎవరి కథనీ కాపీ కొట్టలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ఓ సాధారణ ప్రేక్షకుడిలా క్లైమాక్స్ కోసం ఉత్కంఠగా చూశాను. థియేట్రికల్ రైట్స్ ఒక్కరే తీసుకోవడం విశేషం. రిలీజ్‌కి ముందే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు సి.కళ్యాణ్. ‘‘గరుడవేగ’ కన్నా ‘కల్కి’ పెద్ద విజయం సాధిస్తే.. దీన్ని మించి ‘గరుడవేగ–2’ తీస్తాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
శివ పెద్ద దర్శకుడు కావాలి
మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22.’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్ లోగో ఆవిష్కరణ, టైటిల్ ఎనౌన్స్మెంట్ కార్యక్రమం శనివారం జరిగింది. లోగోను సి. కల్యాణ్ ఆవిష్కరించగా, టైటిల్‌ను వీవీ వినాయక్ ఎనౌన్స్ చేశారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. క్రమశిక్షణ, డెడికేషన్ ఉన్నవాడు. బీఏ రాజుగారి ద్వారా శివకు ఈ సినిమా చాన్స్ వచ్చింది అనుకుంటారు అందరూ. కానీ తానే సొంతంగా దర్శకునిగా అవకాశం దక్కించు కున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘22’. ఈ రోజు జూన్ 22. వచ్చే నెల 22న రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. శివ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వెబ్ సిరీస్‌తో తన టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకొని సినిమా చాన్స్ దక్కించుకోవటం సామాన్యమైన విషయం కాదు. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ట్రెండ్ మార్క్ అయ్యిందో అలా శివకు ‘22’ ట్రెండ్ మార్క్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు మారుతి. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జయగారు ఎక్కడున్నా సంతోషిస్తారు. శివ దర్శకుడు అవ్వాలని బలంగా ఆమె కోరుకునేది. తక్కువ టైమ్‌లో శివ దర్శకునిగా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. శివ మాట్లాడుతూ– ‘‘మారుతి, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్ గార్ల దగ్గర దర్వకత్వ శాఖలో చేశాను. నేను వెబ్ సిరీస్ చేసిన ప్రొడక్షన్లోనే సినిమా చేసే అవకాశం రావటం హ్యాపీగా ఉంది. దర్శకురాలు బి.జయగారు మా అమ్మ అని అందరికీ తెలుసు. ఆమె దగ్గర ప్రొడక్షన్ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. నా స్ట్రగుల్స్‌లో తోడుగా ఉంటూ ప్రతిక్షణం ముందుకు నడిపించారు మా నాన్న బీఏ రాజు’’ అన్నారు. ‘‘డైరెక్టర్ శివగారు నాకు వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చారు. మళ్లీ తన సినిమాలో హీరోగా చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రూపేష్. ‘‘ఫలక్నామా దాస్’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సలోని. నిర్మాత కొండా కృష్ణంరాజు, సంగీత దర్శకులు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
30న నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రతి రెండేళ్లకోసారి నిర్మాతలమండలి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఈసారి జరగాల్సిన ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు నిర్మాతల మండలి ఎన్నికలు జూన్ 30న జరగనున్నాయి. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్, ప్రసన్నకుమార్ కలిసి ‘మన కౌన్సిల్– మన ప్యానెల్’ అనే నినాదంతో ముందుకు వచ్చారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతల మండలి నిర్మాతల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబడింది. నిర్మాతలందరం ఒక గ్రూప్‌గా ఏర్పడి నిర్మాతల మండలి బలంగా ఉండాలని పి.రామ్మోహన్రావు, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, చదలవాడ శ్రీనివాసరావు లాంటి పెద్దలందరూ ముందుకొచ్చారు’’ అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నిజానికి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా అర్హులకు తగ్గ పదవులిచ్చి నిర్మాతల మండలి స్ట్రాంగ్‌గా ఉండాలన్నదే మా కోరిక. కానీ సమయాభావం వల్ల సభ్యులందరూ అందుబాటులో లేని కారణంగా ఎన్నికలు జరపక తప్పటం లేదు’’ అన్నారు. టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో చాలా సమస్యలున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా మిగిలిన సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి అర్హులైన, ఆసక్తి ఉన్న సభ్యులకి పదవులిస్తాం’’ అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మన ప్యానెల్’,‘గిల్డ్ప్యానెల్’ పోటీ పడనున్నాయి. ఈ కార్యక్రమంలో వైవీయస్ చౌదరి, నిర్మాతలు మోహన్ వడ్లపట్ల, రామసత్యనారాయణ, అశోక్ వల్లభనేని తదితరులు పాల్గొన్నారు. -
బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
-
కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ–కె.ఎస్.రవికుమార్– సి.కల్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్. -
రామరసం
‘దేవస్థానం, విశ్వదర్శనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన జనార్థన మహర్షి తన తర్వాతి చిత్రాన్ని ‘పిబరే రామరసం’ పేరుతో తెరకెక్కించనున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు జనార్థన మహర్షి పుట్టినరోజు సందర్భంగా ‘పిబరే రామరసం’ విశేషాలను తెలుపుతూ– ‘‘రామ రావణుల యుద్ధం జరిగిన వందేళ్ల తర్వాత లంకలోని రాక్షస స్త్రీలు తమ బిడ్డలకు సీతారాముల కథని చెబుతారు. తర్వాతి తరాలలో రాక్షస గుణాలను ఎలా తొలగించారు? అనే అంశంపై కథ ఉంటుంది. రాక్షసులు తనివి తీరా తాగి, తరించిన రామరసమే ఈ ‘పిబరే రామరసం’’ అన్నారు. ‘‘రామాయణసారంతో రూపొందనున్న ఈ చిత్రంలో సీత పాత్రను ఓ ప్రముఖ హీరోయిన్ చేస్తారు. త్వరలో ఇతర విశేషాలు తెలియజేస్తాం’’ అని సి.కల్యాణ్ అన్నారు. -
భావోద్వేగ ప్రేమకథ
హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారారు. ఆమె సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘మను చరిత్ర’. ‘ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జాయ్’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా, ‘లై’ ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్గా నటిస్తున్నారు. భరత్ కుమార్ పి. దర్శకత్వం వహిస్తున్నారు. ఆపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎన్.శ్రీనివాస్ రెడ్డి, కాజల్ అగర్వాల్ మేనేజర్ పి.రాన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కాజల్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ అజయ్ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సుధీర్ వర్మ, నిర్మాత సాహు గారపాటి స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఎమోషనల్ ఇన్టెన్స్ లవ్‌స్టోరీ ఇది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. నిర్మాతలు అనిల్ సుంకర, రాజ్ కందుకూరి, అనిల్ కన్నెగంటి, ‘మధుర’ శ్రీధర్, కృష్ణ చైతన్య, కొండా విజయ్‌కుమార్, రాధాకృష్ణ, శివ నిర్వాణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సÐŒ . -
వీకెండ్ పార్టీ ఛలో ఛలో
‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. ఇప్పుడాయన శ్రీనివాస్‌తో కలిసి ‘గీతా.. ఛలో’ వంటి మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రష్మికా మండన్నా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. ‘గీతా.. ఛలో’ టైటిల్ క్యాచీగా ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే రష్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ‘గోల్డెన్‌స్టార్’ గణేశ్, రష్మికా మండన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. ‘వీకెండ్ పార్టీ’ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో ఈ నెల 26న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో సీడీలను సి.కల్యాణ్ ఆవిష్కరించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, దర్శకుడు వీఎన్ ఆదిత్య, నిర్మాతలు శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బాలాజీ నాగలింగం తదితరులు ఈ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ చిత్రం రూ.30 కోట్లు వసూలు చేసింది. ‘గీతగోవిందం’ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలోనూ ఉన్నాయి. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా ఇది’’ అన్నారు. దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ముందుగా తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాం. కుదరలేదు. ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఆమె తప్ప ఎవరూ సరిపోరని డబ్ చేస్తున్నాం. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం’’ అన్నారు. -
ప్లాన్ ఏంటి?
మహేంద్ర, మమత కులకర్ణిలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతనదర్శకుడు బి.ఎల్.ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘ప్లానింగ్’. అలీషా ప్రత్యేక పాత్రలో నటించారు. సాయి గణేష్ మూవీస్ పతాకంపై టి.వి. రంగసాయి నిర్మించిన ఈ సినిమాకి ఉదయ్ కిరణ్ సంగీతం అందించారు. ఈ చిత్రం పాటలను నిర్మాత సి. కళ్యాణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విజువల్స్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేకుండా ప్రస్తుతం మంచి సినిమాలు తీస్తున్నారు. మహేంద్ర చక్కగా నటించారు. రంగసాయి కళాతృష్ణతో సినిమాలు తీస్తున్నారు. ఆయన మరిన్ని చిత్రాలు చేయాలి’’ అన్నారు. ‘‘దర్శక–నిర్మాతలు ఎంతో చక్కని ప్లానింగ్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు కొరియోగ్రాఫర్, హీరో మహేంద్ర. ‘‘ఐటమ్ సాంగ్‌తో కెరీర్ ప్రారంభించిన నేను కథానాయిక అయ్యాను. దక్షిణ భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను’’ అన్నారు మమత కులకర్ణి. ‘‘మాకు వెన్నుదన్నుగా నిలిచిన కళ్యాణ్‌గారు, స్నేహితులందరికీ ధన్యవాదాలు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా చెక్ చేసుకుని స్క్రిప్టును ఫైనలైజ్ చేసి, సినిమా తీశాం’’ అన్నారు రంగసాయి. ఈ వేడుకలో నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్, దర్శకుడు భాను కిరణ్, సంగీత దర్శకుడు ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: బి. ధనుంజయ్, బి. దేవి, నిర్వహణ: బి.భూలక్ష్మి. -
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
పురాతన కట్టడాలు, కోటలు, కొండలు... అడవులు, కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు... బాంబులు ఉన్నాయి.. బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగులు తీసే మనుషులు ఉన్నారు.. గ్రామ పెద్దలు, గుమిగూడిన మనుషులున్నారు.. నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల నడుమ, వివిధ వర్గాల ప్రజల మధ్య ‘కల్కి’ కదిలాడు.. కదనరంగంలోకి గొడ్డలి పట్టి దిగాడు. అతడి కథేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. పైన చెప్పినందంతా టీజర్లో వచ్చిన సన్నివేశాలే. అయితే ఈ టీజర్లో ఒక్క డైలాగ్ లేకపోవడం విశేషం. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘1980 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. రాజశేఖర్‌గారు పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పటివరకూ పని చేసిన యాక్టర్స్‌లో మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ రాజశేఖర్‌గారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి టీజర్‌కు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘టీజర్‌కు వస్తున్న స్పందన వింటుంటే సంతోషంగా ఉంది. రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు సి.కళ్యాణ్. అదా శర్మ, నందితా శ్వేత, పూజిత పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, సిద్ధూ జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
ప్లానేంటి?
మహేంద్ర, కులకర్ణి మమతలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు బి.యల్ ప్రసాద్ రూపొందించిన లవ్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్లానింగ్’. టి.వి. రంగసాయి నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేయగా, ఫస్ట్‌లుక్‌ని నిర్మాత మోహన్‌గౌడ్, కోటేశ్వరరావు, ఉర్కుందప్ప, ధనలక్ష్మీ రిలీజ్ చేశారు. అలీషా రంగసాయి టి.వి. ఉర్కుందప్ప, అస్మిత, ఆదిత్య, చైతన్య, సంతోష్, సుప్రీమ్ సాయి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్ కిరణ్, నిర్వహణ: బి.భూలక్ష్మీ, సహ నిర్మాతలు: బి. ధనుంజయ, బి.దేవి, కెమెరా: ఏడుకొండలు. -
నవ్వు కోసం పరుగు
యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్ ’ అనేది ఉపశీర్షిక. గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత సి.కల్యాణ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘యోగేశ్వర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నాడు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ లేకుండా చాలా ఈజ్‌తో నటించాడు. సాయి శివాజీ డ్యాన్స్ మాస్టర్‌గా నాకు పరిచయం. మంచికథను ఎంచుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు’’ అన్నారు. నటుడు సుమన్ మాట్లాడుతూ– ‘‘గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో ఓ సినిమా చేయాలని అంటుంటే నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ, ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో నేనూ ఒక ముఖ్య పాత్ర పోషించాను’’ అన్నారు. ‘‘పరారి’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది’’ అన్నారు వి.వి. గిరి. ‘‘హీరోగా నాకు తొలి చిత్రమైనా సహ నటుల నుంచి ఎంతో నేర్చుకున్నా. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు యోగేశ్వర్. ‘‘వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిస్తోన్న చిత్రమిది’’ అన్నారు సాయి శివాజీ. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, నటులు శ్రవణ్, గౌతమ్‌రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి. -
చిన్న సినిమా బతకాలి
‘‘ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఒకప్పుడు చిన్న చిత్రాలు తీసినవారే. చిన్న సినిమా బతకాలి. ప్రేక్షకులు చిన్న సినిమాలను సపోర్ట్ చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ ప్రచారంలో భాగం అయితేనే ఆ సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకుడికి అర్థమవుతుంది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. సాక్షీ చౌదరి, అభినవ్ సర్దార్ జంటగా ఆది శేషసాయి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాగ్నెట్’. లార్డ్ శివ క్రియేషన్స్‌పై ఎం.శివారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ఆది శేషసాయి రెడ్డి మాట్లాడుతూ– ‘‘తల్లిదండ్రులు పట్టించుకోకపోతే పిల్లల జీవితాలు ఎలా నాశనం అవుతాయి? అనేది ముఖ్యకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు కిషన్ కావాడియా, కెమెరామేన్ తోట వి. రమణ, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత వెలిగొండ శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
థ్రిల్.. సస్పెన్స్.. హారర్
‘‘స్వయంవద’ సినిమా మోషన్ పోస్టర్, టీజర్ బాగున్నాయి. ఇటీవలి కాలంలో హారర్ జోనర్ సినిమాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా విజయం సాధించాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా వివేక్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వయంవద’. లక్ష్మీ చలన చిత్ర పతాకంపై రాజా దూర్వాసుల నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని సి. కల్యాణ్ ఆవిష్కరించారు. వివేక్ వర్మ మాట్లాడుతూ– ‘‘హారర్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, సస్పెన్స్ అంశాల చుట్టూ కథ నడుస్తుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అసభ్యకర సన్నివేశాలు ఉండవు. కథను నమ్ముకుని చేశాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులకు మా చిత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అని రాజా దూర్వాసుల అన్నారు. ‘‘రాజా, నేను ప్రొడక్షన్ మేనేజర్లుగా కలిసి పని చేశాం. తను మంచి స్నేహితుడు. నిర్మాతగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు. ఆదిత్య అల్లూరి, అనికా రావు, నటులు లోహిత్, రామ్ జగ¯Œ , నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అదే మా సక్సెస్
‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్ కరెంట్‌గా డ్రంకన్ డ్రైవ్ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో శ్రీపాద విశ్వక్ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కల్కి’ టీజర్ విడుదల
-
హారర్ జోనర్ సినిమాలు హిట్టే
‘‘నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకే ఆ నేపథ్యంలో చాలా సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ హిట్టే. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్నా సినిమాపై ప్యాషన్‌తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్జోషిగారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సచిన్ జోషి, నర్గిస్ ఫక్రి జంటగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రైనా సచిన్‌జోషి, దీపెన్ ఆమిన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పాటల్ని విడుదల చేశారు. సచిన్ జోషి మాట్లాడుతూ– ‘‘నేను చాలా కాలంగా హారర్ జోనర్లో ఓ సినిమా చేయాలనుకుంటన్న టైమ్‌లో భూషణ్ పటేల్ ‘అమావాస్య’ కథ చెప్పారు. ఇదొక క్లాసిక్ హారర్ మూవీ. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వి.ఎఫ్.ఎక్స్. వర్క్‌ను ఉపయోగించాం. హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాని ప్రేక్షకులకు అందించాలని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మా టీం అంతా చాలా కష్టపడటం వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది’’ అని భూషణ్ పటేల్ అన్నారు. ‘‘మొదటిసారి ఒక హారర్ సినిమాలో నటించాను’’ అని నటుడు అలీ అస్గర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
అంతకుమించిన సంతోషం లేదు
‘‘లోకంలో ఎవరికైనా పని దొరకడమన్నదే గ్రేట్. దానికంటే సంతోషమైన విషయం ఏదీ ఉండదు. నాకు పని కల్పించి, నాతో పని చేయించుకుంటూ సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులకు కృతజ్ఞతలు’’ అని రాజశేఖర్ అన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా, అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయికలుగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. శివాని–శివాత్మిక సమర్పణలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి’ సినిమా టీజర్ విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘గరుడవేగ’ సినిమా తర్వాత ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించి, ఈ కథ ఓకే చేశాం. ‘గరుడవేగ’ కి ప్రవీణ్ సత్తారుతో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ప్రశాంత్ వర్మతోనూ అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా’’ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘శేషు’ తర్వాత రాజశేఖర్‌గారితో నేను చేస్తున్న చిత్రమిది. నేను చిన్న సినిమాలు చేసేటప్పుడు లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని, నన్ను నిర్మాతను చేశారు జీవిత–రాజశేఖర్ దంపతులు’’ అన్నారు. ‘‘అ!’ చిత్రానికి ముందే ‘కల్కి’ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ, కుదరలేదు. ఒక ఫ్రాంచైజీ తరహాలో ఈ సినిమాకు సీక్వెల్స్ చేయాలనుంది. అన్నీ కుదిరితే రాజశేఖర్‌గారి తర్వాతి బర్త్ డేకి ‘కల్కి 2’ మొదలవుతుంది. నా అభిమాన నటుడు రాజశేఖర్‌గారికి ఈ పుట్టిన రోజు కానుకగా నేను ‘యాంగ్రీ స్టార్’ అనే బిరుదు ఇస్తున్నా’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘గరుడవేగ’ కి ముందు మళ్లీ సక్సెస్‌లోకి వస్తామా? లేదా? అనుకున్న రోజులు ఉన్నాయి. మన వెనుక ఎన్ని కోట్లు ఉన్నా కెరీర్‌ని కొనలేం. అటువంటి సమయంలో ‘గరుడవేగ’ వచ్చింది. ఇప్పుడు ‘బాహుబలి’ గురించి మాట్లాడుతున్నప్పుడు ‘గరుడవేగ’ గురించి కూడా మాట్లాడుతుండటంతో సంతోషంగా ఉంది’’ అన్నారు జీవిత. శివానీ, శివాత్మిక, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రపాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి. -
హార్రర్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘రహస్యం’
శైలేష్ , శ్రీ రితిక జంటగా సాగర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రహస్యం. ఈ సినిమాను భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య హాజరు కాగా సి.కల్యాణ్, శివశక్తి దత్తా, రాజ్ కందుకూరి, యంగ్ హీరో మానస్, శివ శంకర్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. నిర్మాత రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యారు. తను నాకు ఆత్మీయుడు. మంచి సినిమాను తీయటంతో పాటు దాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చేస్తారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకువవస్తుందని భావిస్తున్నాను. చిన్న చిత్రాల ద్వారా కూడా డబ్బు ఎలా సంపాదించాలన్నది రామ సత్యనారాయణ గారిని చూసి నేర్చికోవాలన్నారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. రామసత్యనారాయణ సినిమాను ప్రేమించే వ్యక్తి, వంద చిత్రాలను తీసిన తెలుగు నిర్మాతగా రామానాయుడు గారు, రామ సత్యనారాయణ నిలిచిపోతారు. తన సినిమా ఫంక్షన్ అంటే అది నా సినిమా ఫంక్షన్ లానే ఉంటుంది. రహస్యంతో తాను లాభాలను సాందిచాలని ఆసిస్తున్నానన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ..కంటెంట్ బాగుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ఆడుతుంది. లేదంటే ప్రేక్షకులు ఎలాంటి మోహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. రహస్యం కంటెంట్ ఉన్న చిత్రం. ఈ సినిమాను ముందు నుంచి ప్రమోట్ చేస్తొన్న వివి.వినాయక్, పూరీ జగన్నాథ్,రామ్ గోపాల్ వర్మ, రాజ్ కందుకూరి, శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. రోశయ్య గారి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి. ఈ సినిమాను విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ షో వేసి చూపిస్తామన్నారు. -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
న్యాయం చేస్తా
సినీ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం జరిగింది. ఈ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్ నారాయణ్ వల్లూరు నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 20మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు సినిమా రంగం నుంచి నిర్మాత సి. కల్యాణ్ ఓ కమిటీ మెంబర్‌గా స్థానం సంపాదించారు. ఆర్టికల్ 33,1984 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుందని, జూలై 31న ఈ కమిటీ నియామకం పూర్తయిందని సి. కల్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ– ‘‘దేశవ్యాప్తంగా ఎంతో పోటీ ఉన్నా ఒక తెలుగు వ్యక్తికి అవకాశం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి న్యాయం జరిగేలా చూస్తాను. ముఖ్యంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా చాలా ముఖ్యం. ఈ నెల 17న ‘ఝాన్సీ’ సినిమా, 24వ తేదిన ‘లక్ష్మీ’ చిత్రాలు మా సంస్థ నుండి విడుదలవుతున్నాయి. ఆ సినిమాలు విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. -
హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్ కల్యాణ్‌గారు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా హిట్ సాధించాలి. ఎ.ఎల్. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు క్రిష్. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్ చేసిన కల్యాణ్‌గారికి థ్యాంక్స్. హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్ సినిమా అనే కంటే ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్ డ్యాన్సర్’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు రాజ్ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గురుశిష్యుల కథ
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేష్, దిత్య బండే ముఖ్య తారలుగా దర్శకుడు ఏ.యల్. విజయ్ తెరకెక్కించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఓ రియాలిటీ షో విజేతగా నిలిచిన బేబి దిత్య బండే ఈ సినిమాతో నటిగా పరిచయం కానుంది. ఈ సినిమా హక్కులను నిర్మాత సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్. రవీంద్రన్ నిర్మాతలు. ఈ సినిమాలో దిత్యకు డ్యాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తారు. ‘‘రిలీజైన టీజర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభుదేవా డ్యాన్సింగ్ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆడియోను ఈ నెల 12న, సినిమాను 24న రిలీజ్ చేయబోతున్నాం. సామ్ సీఎస్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘సినిమా తీసే వరకే పెద్దది, చిన్నది అని నిర్మాత అనుకుంటాడు. హిట్ అయ్యాక ఏదైనా ఒకటే. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఈ వేడుకకు వచ్చా’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ఖయ్యూం, గౌరవ్ హీరోలుగా, మధులగ్నదాస్, అధియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ లవ్ స్టోరీ’. శేఖర్ చంద్ర దర్శకత్వంలో అవధూత లక్ష్మీ సమర్పణలో లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్‌పై అవధూత గోపాల్‌రావు నిర్మించారు. భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సి.కల్యాణ్ విడుదల చేసి, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయివెంకట్లకు అందించారు. ‘‘20 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించిన అనుభవంతో ఈ సినిమా నిర్మించా. మా అబ్బాయి గౌరవ్ ఈ చిత్రంలో ఓ హీరోగా నటించాడు. ఆగస్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు గోపాల్‌రావు. -
త్రివిక్రమ్ ఐదేళ్ల తరువాత..!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో ముందు వరసలో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అజ్ఞాతవాసి ముందు వరకు వరుస విజయాలతో సత్తా చాటిన త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే అత్తారింటికి దారేది సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లోనే తెరకెక్కాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ సినిమా కూడా ఇదే బ్యానర్లో తెరకెక్కుతోంది. కానీ ఐదేళ్ల విరామం తరువాత త్రివిక్రమ్ బయటి బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది తరువాత త్రివిక్రమ్ ఇతర బ్యానర్లలో సినిమాలు చేయలేదు. ఇన్నాళ్ల తరువాత నాని హీరోగా సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు. నాని, త్రివిక్రమ్‌లు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసిన వెంటనే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కనుంది. -
‘ఎన్టీఆర్’ని పక్కన పెట్టేశారా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో కూడా తేజ దర్శకుడిగా కొనసాగారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు తాను ఎన్టీఆర్‌కు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక దశలో బాలయ్యే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరింత ఆలస్యమవుతుండటంతో బాలయ్య మరో సినిమా ప్రారంభించాలనుకుంటున్నారట. చాలా రోజులుగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సీ కల్యాణ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి ఈ సినిమాను ముందుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట నందమూరి నటసింహం. అయితే ఈ విషయంపై ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
16 ఏళ్ల తరువాత అదే కాంబినేషన్లో..
కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ మరో సినిమాకు అంగీకరించారు. ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ (ఎన్టీఆర్ బయోపిక్) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాజా మరో సినిమాను ఫైనల్ చేశారు బాలకృష్ణ. జై సింహా సినిమాను నిర్మించిన సీ కల్యాణ్ బ్యానర్లో మరో సినిమాను చేయనున్నాడు బాలయ్య. ఈ సినిమాను మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. 2002లో వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించారు బాలయ్య, 16 ఏళ్ల తరువాత మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ సినిమాను మేలో ప్రారంభించి 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలాప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ మఫ్టీ కి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. -
చీప్ పబ్లిసిటీ కోసం చిత్రసీమపై అభాండాలు
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సినీ రంగంపై పలువురు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. కొందరు టీవీల్లో కనిపించటం కోసమే అన్నం పెట్టిన చిత్రసీమ పరువు బజారున పడేస్తున్నారు. చీప్ పబ్లిసిటీ కోసమే చిత్రసీమపై అబాండాలు వేస్తున్నారు. గతంలో ఇలా కామెంట్లు చేసిన చాలా మంది కనుమరుగయ్యారన్నారు. ఇటీవల బాలయ్య హీరోగా జై సింహా సినిమాను నిర్మించి కళ్యాణ్ తర్వలో బాలకృష్ణ హీరోగా మరో సినిమాను నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మే 27న సినిమాను ప్రారంభిస్తామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. -
భారీ వసూళ్లు సాధించిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజై మంచి వసూళ్లు సాధించింది. సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న బాలయ్య జై సింహా సక్సెస్ తో మరోసారి ఆ సెంటిమెంట్ నిజమని ప్రూవ్ చేశాడు. ఇప్పటి వరకు ఈ సినిమా 35.85 కోట్ల షేర్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 28.25 కోట్లు షేర్ రాబట్టగా.. కర్ణాటకలో 4.30 కోట్లు, ఇతర రాష్ట్రాల నుంచి 2.10 కోట్లు, ఓవర్ సీస్ నుంచి 1.20 కోట్ల షేర్ సాధించింది. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మురళీమోహన్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు గౌతమిపుత్ర శాతకర్ణి ఫేం చిరంతన్ భట్ సంగీతమందించారు. -
ఇద్దరం కలిసి సక్సెస్‌మీట్ పెడతాం
‘‘రీమిక్స్ సాంగ్స్ కావాలని నేనెప్పుడూ అడగలేదు. అది డైరెక్టర్స్ ఛాయిస్. ఆ రీమిక్స్‌కి నా బెస్ట్ ఇవ్వటానికి కృషి చేస్తాను. నాలుగు రీమిక్స్ సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ, బాధ్యతగా చేశాను’’ అన్నారు సాయిధరమ్ తేజ్. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ వల్ల కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్‌లో ఎంత ఇంటిలిజెంట్‌గా బిహేవ్ చేసి, తన వాళ్లను కాపాడుకుంటాడనే పాయింట్‌తో నా క్యారెక్టర్ని బిల్డ్ చేశారు.మనకి హెల్ప్ చేసినవాళ్లను ఎప్పుడూ మరచిపోకూడదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్లకు ఉండాలనే మెసేజ్ ఉంది. ► ఫస్ట్ టైమ్ ఫుల్ లñ ంగ్త్ కమర్షియల్ మూవీ చేశా. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందనే చేస్తాం. అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం. ► వినాయక్‌గారు ఏం చెప్పినా చేసేస్తాం. ఆయన అడిగే విధానం అంత బావుంటుంది. అంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం మన డైలాగ్స్ మీద, మన షాట్స్ మీద పెట్టుకొని ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్‌తో చేస్తే ఇలా ఉంటుందా? అనిపించింది. నాలో మా ఇద్దరి మావయ్యలు కనిపిస్తారని, వినాయక్‌గారు దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఆడియన్స్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆకుల శివగారు రాసిన కథకు ఆయన స్టైల్లో స్క్రీన్‌ప్లే రాశారు. నేనెంత ఇంటెలిజెంట్ అంటే ఒక 60 పర్సెంట్ అనుకుంటున్నాను. కానీ నా గురువులందరూ ఇంటెలిజెంట్సే. ► నా లాస్ట్ సినిమాల్లో చేసిన తప్పులు ఎనలైజ్ చేసుకుంటున్నాను. డైరెక్టర్స్ అనుకున్నట్టుగానే తీశారు కానీ ఆడియన్స్ ఆశించింది ఇవ్వలేకపోయాం. అది ఎవ్వరి తప్పు కాదు. సినిమా అంటేనే కలñ క్టివ్ ఎఫర్ట్. ఎవర్నీ బ్లేమ్ చేయడానికి లేదు. ► వరుణ్, నేను ఒకేసారి రావాలనుకోలేదు. అది తెలియకుండా జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేశాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ కదా అని చేతులు ఎత్తేశాం. కానీ నాకనిపించింది ఇద్దరం ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్కే వేరని. మా మెగా హీరోస్ ఇంతమంది అయ్యేసరికి ఇలా రిలీజ్ డేట్ ఇష్యూ అవుతోంది అంటే.. మాకు ఇదో టెస్ట్ అనుకుంటాను. ప్రేక్షకులకు రెండు సినిమాలు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా సినిమాలు హిట్ అయ్యాక వరుణ్, నేను కలిసి సక్సెస్ మీట్ పెడతాం. ⇒ మీ స్పెషల్ ఫ్రెండ్ రెజీనా ఈ మధ్య ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడి, కెరీర్ పాడు చేసుకున్నా అన్నారు. మీ ఒపీనియన్? ► క్లోజ్ ఫ్రెండే.. కాదనడంలేదు. కానీ తన పర్సనల్ విషయాల గురించి నేను కామెంట్ చేయదలచుకోలేదు. -
అలాంటి కథలు నాకు చెప్పటం లేదు : సాయి ధరమ్
మెగా ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఈ శుక్రవారం ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ మెగా హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న సాయి ధరమ్ తేజ్‌ను డిఫరెంట్ సినిమాలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘దర్శకులెవరు నా దగ్గరకు అలాంటి కథలు తీసుకురావటంలేదు. నేను కూడా కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సమాధానమిచ్చారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి, ఇంటిలిజెంట్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుండగా సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వినాయక్ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. -
తెలివిగా తీశారని ప్రేక్షకులు అంటారు
‘‘నా సినిమాలు సూపర్ హిట్ సాధించకపోవచ్చు. నా కెరీర్లో సూపర్ ఫ్లాప్ సినిమా లేదు. బ్యాడ్ లేదా వల్గర్ సినిమాలను కల్యాణ్ తీశాడని అనిపించుకోలేదు. సెట్ అయ్యే ప్రాజెక్ట్ కోసమే తపన పడతాను. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని ఎగబడలేదు. రామానాయుడిగారిని స్ఫూర్తిగా ఫీలయ్యి కెరీర్లో ముందుకు సాగుతున్నాను. ఈ జర్నీ ఎక్కడ ఆగుతుందో తెలీదు. నిర్మాతగా వంద చిత్రాలను కంప్లీట్ చేయాలన్నది నా ప్రయత్నం’’ అన్నారు నిర్మాత సి. కల్యాణ్. సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్పై సి. కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఈ ఏడాది ‘జై సింహా’ చిత్రంతో నిర్మాతగా నాకు శుభారంభం జరిగింది. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వీవీ వినాయక్‌గారు దర్శకత్వం వహించిన ‘ఇంటిలిజెంట్’అందరి అంచనాలను మించేలా ఉంటుందన్న నమ్మకం ఉంది. తేజూ కెరీర్ గ్రాఫ్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుంది. తేజూ డ్యాన్స్ ఇరగదీశాడు. చాలా కష్టపడ్డాడు. ‘ఇంటిలిజెంట్’ చూసిన తర్వాత, వీళ్లు చాలా ఇంటెలిజెంట్‌గా తీశారని ప్రేక్షకులు అనుకుంటారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. వినాయక్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే ఆడుతూ పాడుతూ సినిమాను కంప్లీట్ చేశాం. ► ఒకే టైమ్‌లో మోహన్‌బాబుగారి ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్’.. ఇంకా వేరే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ నెక్ట్స్ డే ‘తొలి ప్రేమ’ రిలీజ్ అవుతుంది. మోహన్‌బాబుగారి ఇంటి నుంచే నా సినీ ప్రయాణం మొదలైంది. నాగబాబు, వరుణ్‌తేజ్‌లతో మంచి ఎటాచ్మెంట్ ఉంది. మా సినిమాతో పాటు రిలీజ్ కానున్న అన్ని సినిమాలూ ఆడాలి. ► న్యూమరాలజీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. సుమన్ హీరోగా ‘నేటి న్యాయం’ చిత్రంతో నేను డైరెక్టర్‌గా పరిచయం కావాల్సింది కానీ కుదర్లేదు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. నిర్మాతగా 70వ సినిమా ‘ఇంటిలిజెంట్’. కథలో ఇన్వాల్వ్ అవుతాను. కాకపోతే నా ఆలోచనలను సూచనలుగా పరిశీలించమని డైరెక్టర్‌కు చెబుతాను. ► ఓ చిన్న డైరెక్టర్‌తో ‘భారతి’ అనే సినిమాను తీయబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను. శివ దర్శకత్వంలో రానా హీరోగా చేస్తున్న ‘1945’ చిత్రం ఫైనల్ స్టేజ్‌లో ఉంది. వినాయక్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నా. -
మెగా హీరోకు ప్రభాస్ హెల్ప్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇంటిలిజెంట్. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌కు మరో స్టార్ హీరో సాయం చేయనున్నాడు. ఇంటిలిజెంట్ సినిమాలో తొలి సింగిల్‌ను బాహుబలి స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయత్రం 4 గంటలకు ఈ పాట సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. #Baahubali Prabhas Will be releasing #Inttelligent 1st single " Let's Do " today @ 4 P. M#InttelligentOnFeb9th #VVVinayak@IamSaiDharamTej @ProducerCKalyan @Itslavanya @MusicThaman @adityamusic pic.twitter.com/jh8mISSAcd — CK Entertainments (@CKEntsOffl) 28 January 2018 -
జైసింహా సక్సెస్ మీట్
-
తప్పు కాదు కావాలనే అలా..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగో రిలీజ్ చేయగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈసినిమా టైటిల్ లోగోలో ఇంటిలిజెంట్ పదం ఇంగ్లీష్‌లో స్పెల్లింగును మార్చి రాశారు. ‘INTELLIGENT’ స్పెల్లింగ్ ను ‘INTTELLIGENT’గా రాశారు. దీంతో పోస్టర్ లో తప్పు వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంపై బిఏరాజు క్లారిటీ ఇచ్చారు. న్యూమరాలజీ కరెక్షన్ కారణంగానే స్పెల్లింగ్ ను మార్చి రాశారని తెలిపారు. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న సాయి ధరమ్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్న వినాయక్ సినిమాను సక్సెస్ చేసేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. That is Not a spelling mistake !! You know that it is spelled according to Numerology, because you are too 'INTTELLIGENT' #Intelligent — BARaju (@baraju_SuperHit) 22 January 2018 -
టాలీవుడ్లో కలకలం రేపిన ఐటీ దాడులు
-
జై సింహా, అజ్ఞాతవాసి నిర్మాతలకు షాక్
సాక్షి, హైదరాబాద్: పలువురు సినీ ప్రముఖుల కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) అధికారులు బుధవారం దాడులు చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన జైసింçహా చిత్ర నిర్మాత సి.కల్యాణ్, పవన్‌కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబుతో పాటు మరో నలుగురు సినీ ప్రముఖుల కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తొలుత కృష్ణానగర్‌లోని సి.కల్యాణ్ కార్యాలయంలో ఆరుగురితో కూడిన ఐటీ అధికారుల బృందం దాడి చేసి.. ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఆయన నివాసంలోనూ సోదాలు చేసింది. జైసింహా చిత్రంతోపాటు త్వరలో వీవీ వినాయక్, సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్లో తలపెట్టిన భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన లెక్కలు, పెట్టుబడుల వివరాలను, ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను సేకరించినట్లు సమాచారం. -
‘జై సింహా’ మూవీ రివ్యూ
టైటిల్ : జై సింహా జానర్ : ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా సంగీతం : చిరంతన్ భట్ దర్శకత్వం : కేయస్ రవికుమార్ నిర్మాత : సి. కళ్యాణ్ సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ తో పాటు బాలయ్యకు లక్కీ సెంటిమెంట్స్ అయిన టైటిల్ లో సింహా, హీరోయిన్ గా నయనతారలను కూడా రిపీట్ చేసిన ఈ సినిమా మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందా..? చాలా కాలం తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కేయస్ రవికుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. (సాక్షి రివ్యూస్)కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ యాక్షన్. జై సింహాతో మరోసారి తన ఇమేజ్ తగ్గ క్యారెక్టర్ తో అభిమానులను అలరించాడు బాలకృష్ణ. తన మార్క్ పంచ్ డైలాగ్ లు, మాస్ ఎలిమెంట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య డాన్స్‌లు అభిమానులను ఖుషీ చేస్తాయి. బాలయ్య జోడిగా నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో నయనతార నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)నటషా దోషి, హరిప్రియల పాత్రల నిడివి చాలా తక్కువ.. కనిపించిన కాసేపు నటనతో పాటు, గ్లామర్ తోనూ మెప్పించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో తన మార్క్ చూపించాడు. విలన్లుగా కాళకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు ఆకట్టుకున్నారు. ఇటీవల వెండితెర మీద పెద్దగా కనిపించని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాతో తిరిగి సత్తా చాటుతాడని భావించారు. కానీ మరోసారి బ్రహ్మీ కామెడీ ఆశించిన స్థాయిలో అలరించలేదు. విశ్లేషణ : దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా జోడించి ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశించే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్) ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అక్కడక్కడ కథనం నెమ్మదించి విసిగిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై సింహా’. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. భారీ యాక్షన్స్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమాలో ద్వితీయార్థం హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలయ్య అభిమానులను అలరిస్తుందంటున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’
నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా జై సింహా. ఈ సినిమాలో నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ 102వ సినిమాగా తెరకెక్కుతున్న ‘జై సింహా’ శుక్రవారంతో దుబాయ్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. బాలయ్య, నయనతారలపై ఒక పాట, బాలయ్య నటాషా జోషిలపై మరో పాట దుబాయ్ లో చిత్రీకరించారు. ఈ రెండు పాటలతో షూటింగ్ మొత్తం పుర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘దుబాయ్ లో 30 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నటాషా ల మధ్య డ్యూయోట్ సాంగ్‌ను జానీ మాస్టర్ నేతృత్వంలో, 20 మంది యూరోపియన్ డ్యాన్సర్స్ తో బాలయ్య నయనతారలపై మరో లవ్లీ సాంగ్ ను బృంద మాస్టర్ నేతృత్వంలో చాలా లావిష్ గా చిత్రీకరించాం. డిసెంబర్ నెలాఖరుకు చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా ‘జై సింహా’ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. -
చిన్ననిర్మాతలను ఆదుకునే స్వభావం ఉండాలి – సి. కల్యాణ్
‘‘కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారు చిన్న నిర్మాతలే కావొచ్చు. కానీ, వారే భవిష్యత్తులో పెద్ద నిర్మాతలుగా ఎదుగుతారు. అందుకే, ప్రతి చిన్న నిర్మాతను ఆదుకునే స్వభావంతో చిత్ర పరిశ్రమలోని వాళ్లు ముందుకు రావాలి. ‘రాఘవేంద్ర మహత్యం’ సినిమా పాటలు బాగున్నాయి. రవీంద్రగోపాల్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని ఆకాంక్షిస్తున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. రవీంద్రగోపాల్ టైటిల్ రోల్లో నటించి, నిర్మించిన చిత్రం ‘రాఘవేంద్ర మహత్యం’. మంత్రాలయం అన్నది ఉపశీర్షిక. పీసీ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో కృష్ణచంద్ర దర్శకత్వంలో రూపొందింది. ప్రమోద్‌కుమార్ స్వరపరచిన ఈ సినిమా పాటల సీడీని సి. కల్యాణ్ రిలీజ్ చేసి, చిత్ర సమర్పకులు గోపాల నారాయణకు అందించారు. రవీంద్రగోపాల మాట్లాడుతూ– ‘‘గతంలో రజనీకాంత్, రాజ్‌కుమార్ వంటి ప్రముఖులు రాఘవేంద్రస్వామి సిన్మాలు చేశారు. ఇప్పుడు వస్తున్న మా సినిమాలో కథ ఎక్కువగా ఉండటంతో పాటు వాటికి భిన్నంగా ఉంటుంది. చక్కటి భక్తిరస దృశ్యకావ్యంగా తీశాం. పాటలు, శ్లోకాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. నాకెలాంటి ఇమేజ్ లేకపోవడంతో చూసినవారికి కేవలం పాత్రే గుర్తు ఉంటుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రమోద్‌కుమార్, దర్శకుడు బాబ్జీ, పాటల రచయిత తైదల బాపు, నటుడు అశోక్‌కుమార్, నిర్మాత మోహన్‌గౌడ్ పాల్గొన్నారు. -
షూటింగ్‌లకు విశాఖ అనువైన ప్రదేశం
సింహాచలం: సినిమా షూటింగ్‌లకు విశాఖ ఎంతో చక్కనైన ప్రదేశమని, రానున్న రెండు మూడేళ్లలో ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్‌లు జరుగుతాయని, ఆ విధంగా పరిశ్రమని అభివృద్ధి చేయబోతున్నామని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. కప్ప స్తంభానికి మొక్కుకుని స్వామికి అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా తాను నిర్మిస్తున్న జై సింహా సినిమా విశేషాలను తెలిపారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి ఫైవ్‌స్టార్ ఫెసిలిటీస్‌తో వృద్ధాశ్రమాలు ఉండాలని భావిస్తున్నానన్నారు. -
వైజాగ్ బీచ్ రోడ్డులో బాలకృష్ణ ధర్నా..!
నందమూరి బాలకృష్ణ వైజాగ్ బీచ్‌రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లపై మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరించారు. నిర్మాత సి కళ్యాణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య నటించిన సినిమాల్లో సింహ అనే పేరుతో వచ్చిన సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు మంచి విజయాలు సాధించిన నేపథ్యంలో జై సింహ కూడా ఘనవిజయం సాధిస్తుందని భావిస్తున్నారు. -
కోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత
స్థలాన్ని కాజేస్తున్నారంటూ సినీ సి. కల్యాణ్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లో ఉన్న ప్లాట్ నం. 31/బిలో డాక్టర్ టి. శ్రీనివాసులు, టి.విమలాదేవిలకు చెందిన 1182 గజాల స్థలాన్ని జ్యోతి కన్స్ట్రక్షన్స్కు 1998లో డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చారు. అయితే జీహెచ్ఎంసీ అనుమతితో 11 ప్లాట్లు నిర్మించి విమల్ బిల్డింగ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన 11 మందికి విక్రయించారు. అనంతరం ఆ కాంట్రాక్టర్ నిర్మాణానంతరం మిగిలిపోయిన 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. స్థల యజమానులు శ్రీనివాసులు, విమలాదేవితో పాటు బిల్డర్ ఎంవీఎస్. శేషగిరిరావులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 66 కు చెందిన డాక్టర్ టి.శ్రీనివాసులు, విమలాదేవిలకు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 5లో 1188 గజాల స్థలం ఉండగా ఈ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 17కు చెందిన జ్యోతి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎం.వీ.ఎస్ శేషగిరిరావుకు అప్పగించారు. 11 ప్లాట్లు విక్రయించగా 2015లో రోడ్డు విస్తరణలో అపార్ట్‌మెంట్‌కు చెందిన 202 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ సేకరించింది. అపార్ట్మెంట్ నిర్మాణం తర్వాత మిగిలి ఉన్న 380 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ అనుమతుల్లో చూపించిన స్థలాన్ని పూర్తిగా ప్లాట్దారు లకే పంచాల్సి ఉండగా ఈ ముగ్గురూ పథకం ప్రకారం కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 18,790 చదరపు అడుగుల స్థలాన్ని 11 మంది ప్లాట్ ఓనర్లకు పంచుతూ విడివిడిగా ఒప్పందం చేశారని ఇప్పుడు మిగులు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బాలయ్య షూటింగ్లో నయన్
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు (మంగళవారం) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో నయన్ పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. 'సింహా, శ్రీరామరాజ్యం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణగారి కెరీర్లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది' అన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నారు. -
10న దాసరి సంతాప సభ
ఇటీవల మరణించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు సంతాపసభను ఈ నెల 10వ తారీఖున నిర్వహించనున్నట్టుగా తెలిపారు. దాసరి సమకాలీనులైన తెలుగు సినీ ప్రముఖుల చాలా మంది ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగానే సంతాప సభ ఆలస్యమయ్యిందని తెలిపారు. దాసరి మంచి ఫాంలో ఉన్న 80ల నాటి స్టార్స్ చాలా మంది ప్రస్తుతం చైనాలో ఉన్నారు. అందరూ అందుబాటులో ఉన్న సమయంలో సంతాప సభ నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈనెల 10న సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా సి.కళ్యాణ్ తెలిపారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఈ సభకు ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ హాజరవుతారని తమ మధ్య ఎలాంటి గ్రూపుల్లేవని తెలిపారు. -
నిర్మాత కొడుక్కి పోలీసు నోటీసులు
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సభ్యుడి పర్సులో నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు తస్కరించారు. ఆన్లైన్లో తన అకౌంట్లోకి డబ్బును మార్చుకున్న ఘటనలో ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ తనయుడు వరుణ్‌కుమార్‌కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే వ్యాపారి బిక్కిన శ్రీనివాస్ ఎఫ్ఎన్సీసీలో స్విమ్మింగ్ చేయడానికి వచ్చి పర్సును పక్కన పెట్టాడు. ఆయన తిరిగి వచ్చి సరికి పర్సు కనిపించలేదు. అందులో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. గంట వ్యవధిలోనే ఆయన అకౌంట్లో నుంచి రూ.2.12 లక్షలు ఆన్లైన్ ద్వారా బదిలీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలు, బ్యాంకు అంకౌట్లు తనిఖీ చేసి ఇందుకు కారకుడిగా సి. కల్యాణ్ కొడుకు వరుణ్‌కుమార్‌ను గుర్తించారు. ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా డీఐ వెంకటేశ్వర్‌రెడ్డి ఈ నోటీసు జారీ చేశారు. -
మా ఫ్యామిలీపై నోరు పారేసుకోవడం సరికాదు
-
అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు
తమపై సినీ నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలను మరో నిర్మాత సి. కళ్యాణ్ ఖండించారు. నట్టి కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అసలు ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబరు ఇస్తే.. నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు. కుమార్ జీవితం అంతా బ్లాక్మెయిల్, నీలిచిత్రాల మయమని ఆరోపించారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలను కూడా నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేస్తారన్నారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలుంటే వాటిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కుమార్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశంలో చర్చించి తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నామన్నారు. తమిళనాడులో కూడా ఇతడికి సినిమా సంబంధాలతో పాటు.. అక్కడ కేసులు వేసి బ్లాక్ మెయిల్ చేసిన సందర్భాలున్నాయని తెలిపారు. నయీంతో లింకులు ఉన్నవాళ్లు సినిమా పరిశ్రమలో ఎంతటి పెద్దవాడైనా అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, శిక్షించవచ్చని తెలుగు సినీ పరిశ్రమ తరఫున చెబుతున్నామన్నారు. అసలు నట్టికుమార్ కుటుంబమే మోసాలు చేస్తుందని సి.కళ్యాణ్ ఆరోపించారు. ఆయన కొడుకు అమెరికాలో చదువుకోడానికి వెళ్తుంటే ఫోన్ చేసి, ఏదో ప్రాజెక్టు రిపోర్టు చేయాలంటూ తాను తీసిన ఎటో వెళ్లిపోయింది మనసు క్లిప్పింగులు కావాలని అడిగారని.. సరే కదా అని ఇస్తే ఆ సినిమాను నెట్లో పెట్టారని చెప్పారు. దీనిపై తన భాగస్వాములు నెట్లో సినిమా ఉందేంటని అడిగారన్నారు. దాంతో నట్టి కుమార్‌కు తాను ఫోన్ చేసి, నీ కొడుకును అరెస్టు చేసే పరిస్థితి వస్తోందని చెబితే.. బతిమిలాడుకుని తీసేశాడని చెప్పారు. క్రైస్తవ మతం పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడం, అన్నదానాల పేరుతో వసూళ్లు నిజం అవునా కాదా అని ప్రశ్నించారు. పోస్టర్లు వేసుకుని ఆ పేరుతో డబ్బులు దండుకుంటారన్నారు. సినీ పరిశ్రమలో చాలామంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారని, ఎవరూ కూడా ఎందుకులే అని ప్రెస్ ముందుకు రావడం లేదని తెలిపారు. విశాఖలో బ్యాంకులలో ఓవర్ డ్రాఫ్టుల పేరుతో ఓ కుంభకోణం జరిగిందని, అది త్వరలోనే బయటకు రానుందని అన్నారు. వైజాగ్ నుంచి ఇతడిని తన్ని తరిమేశారని చెప్పారు. అతడు థియేటర్ కొన్నట్లు చెబితే తాను ఓపెనింగ్‌కు వెళ్లానని, కానీ ఆ థియేటర్ లీజుకు తీసుకున్నట్లు ఆ తర్వాత తెలిసిందని అన్నారు. వాటి పేరుతో బ్యాంకుల్లో ఓవర్‌డ్రాఫ్ట్ లావాదేవీలు నడిపించాడని చెప్పారు. -
అతడి జీవితమే బ్లాక్మెయిల్, నీలిచిత్రాలు
-
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
-
ఫిల్మ్ నగర్ ప్రమాదంపై సి కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. అసలు కల్చరల్ క్లబ్లో నిర్మిస్తున్నది భవనం కాదని, అది కేవలం పోర్టికో అని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి క్లబ్ సభ్యులంతా బాధ్యత వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ప్రమాదస్థలిని జీహెచ్ఎంసీ క్లూస్ టీం పరిశీలించింది. నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్, ఇసుకను సేకరించింది. బిల్డింగ్ కూలిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి దత్తాత్రేయ పరిశీలించారు. కార్మిక శాఖ ద్వారా బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాదంపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో విపత్తులు ఎదురైతే ఎదుర్కోవడానికి సరైన సిబ్బంది లేరని, ఈ విషయంపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామని ఆయన తెలిపారు. పేద కూలీలను ఆదుకోవాని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కోరారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
వర్మకు క్లాస్ తీసుకున్న కళ్యాణ్
మీరు చూసినా చూడకపోయినా నాకు నచ్చిందే తీస్తాననే వర్మకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందట. తను చెప్పింది వేరేవాళ్లు వినాలేగాని తను ఎవ్వరి మాట వినను అన్ని గట్టిగా చెప్పే వర్మ, ఓ నిర్మాత చెప్పిన మాటలతో పూర్తిగా మారిపోయానని చెపుతున్నాడు. తన సినిమా రిలీజ్ సమయంలో ఎదో ఒక వ్యాఖ్యతో వార్తల్లో ఉండాలని ప్రయత్నించే వర్మ తాజాగా ఎటాక్ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఎటాక్ ఆడియో రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆ సినిమా డైరెక్ట్ చేయటం వెనుక కారణాలను వివరించాడు. ఐస్ క్రీం, ఐస్ క్రీం 2 సినిమాల తరువాత వర్మను కలిసిన నిర్మాత సి కళ్యాణ్, నువ్వు చేయాల్సింది ఇలాంటి సినిమాలు కాదు.., అంటూ హితోపదేశం చేశాడట. వెంటనే జ్ఞానోదయం అయిన వర్మ ఎటాక్ సినిమాను రూపొందించినట్టుగా చెప్పాడు. సాధారణంగా తాను ఎవరి మాట వినని బహిరంగంగానే చెప్పే వర్మ, సి కళ్యాణం చెప్పిన మాటలతో నేను మారాను అనటం అంత నమ్మశక్యంగా లేదంటున్నారు సినీ జనాలు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఎటాక్ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల ఆలస్యం అయ్యింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్ లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 1న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఒకే బ్యానర్లో రెండు సినిమాలు
వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. రచయితలతో వివాదాలు, తరువాత మహేష్ బాబుతో చేసిన ఆగడు సినిమా ఫెయిలవ్వటం, తిరిగి కోన టీంతో కలిసినా.. బ్రూస్ లీ సినిమా పరాజయం పాలవ్వటం లాంటి సమస్యల తరువాత శ్రీనువైట్ల డీలా పడిపోయాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న శ్రీనువైట్ల తిరిగి సినిమా మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడు. జ్యోతిలక్ష్మి సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సి.కళ్యాణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్, వరుణ్ తేజ్‌ల కాంభినేషన్లో లోఫర్ సినిమాను నిర్మించాడు. ఈ నెల 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా సక్సెస్ మీద ఎంతో నమ్మకంగా ఉన్న కళ్యాణ్ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వలో సినిమా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫెయిల్యూర్స్‌లో ఉన్నా.. దర్శకుడిగా శ్రీనువైట్లకు స్టార్ ఇమేజే ఉంది. ఈ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వరుసగా రెండు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు కళ్యాణ్. మరి ఈ సినిమాలతో అయిన శ్రీనువైట్ల సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. -
ఇదే కొనసాగితే ఉద్యమాలే!
‘‘చాలాకాలం తర్వాత పూర్తి ప్రాఫిట్‌తో నేను రిలీజ్ చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా యాభై శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది శుభసూచకం’’ అని సి.కల్యాణ్ అన్నారు. హన్సిక ప్రధాన పాత్రధారిణిగా సుందర్.సి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘అరణ్మణై’. ఈ చిత్రాన్ని ‘చంద్రకళ’గా సి. కల్యాణ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్వేతలాన, వరుణ్, తేజ, సి.వి.రావు నిర్మాతలు. నేడు విడుదల కానున్న ఈ సినిమా గురించి సి.కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఇందులో హీరోయిన్ అమ్మవారి భక్తురాలు. ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ పండే సమయంలో దారుణంగా హత్యకు గురై.. ప్రేతాత్మగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. ‘అరుంధతి’ని గుర్తు చేస్తుందీ సినిమా’’ అని చెప్పారు. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా విడుదల విషయంలో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావిస్తూ -‘‘లీజు విధానానికి నేను వ్యతిరేకం కాదు. ‘ఆ నలుగురు’, ‘ఆ ముగ్గురు’ అని మాట్లాడటం కూడా సబబు కాదని పలు సందర్భాల్లో చెప్పాను. కానీ... ఇంత పలుకుబడి ఉండి, ఇంత సర్కిల్ ఉన్న నాకే ఈ సినిమా విడుదల చేయడం కష్టమైందంటే.. ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి? లీజు విధానాన్ని చూపిస్తూ మధ్య స్థాయి నిర్మాతల్ని, పంపిణీదారుల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఈ పరిస్థితులే కొనసాగితే ఉద్య మాలు జరుగుతాయి. అది ఎవరికీ మంచిది కాదు. నేను ఛాలెంజ్‌గా తీసుకొని ఫిష్ వ్యాపారి బాబూరావుతో కలిసి నైజాంలో 125 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నా. మొత్తం మీద 400 థియేటర్లలో సినిమా విడుదలవుతుంది’’ అని చెప్పారు సి.కల్యాణ్. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు జనరల్ సెక్రటరీగా ఎంపికవడం పట్ల ఆనందాన్ని వెలిబుచ్చుతూ -‘‘దక్షిణభారత చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షునిగా నా సేవలను గుర్తించడం వల్లే నాకు ఈ గౌరవం లభించింది. మన సమస్యలన్నింటినీ పొందుపరచి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి మెమొరాండం ఇవ్వనున్నాం’’ అని తెలిపారు. నాగచైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తాను ప్రారంభించిన ‘దుర్గా’ చిత్రం ఆగిపోలేదనీ, త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందనీ, అయితే... దర్శకుడు మారతాడనీ, శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మరో సినిమా నిర్మిస్తాననీ సి.కల్యాణ్ చెప్పారు. వరుణ్‌తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
'అంతర్ముఖం' పుస్తకావిష్కరణ
-
ఒక రోజు ఏం జరిగింది?
యువనటుడు శ్రీకాంత్, గీతాంజలి, జే ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఒక రోజు’. ‘ఏం జరిగింది’ అనేది ఉపశీర్షిక. తడకల రాజేష్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.కల్యాణ్ ఆడియో సీడీని ఆవిష్కరించి, శక్తి రమేష్‌కి అందించారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన కొడాలి వెంకటేశ్వరరావు, రామసత్యనారాయణ, మోహన్ వడ్లపట్ల, ముత్యాల రాందాసు సినిమా విజయంపై ఆకాంక్ష వెలిబుచ్చారు. ప్రేమ, ప్రణయం, హాస్యం మేళవించిన వినోద భరిత చిత్రమిదని, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని రాజేష్ తెలిపారు. చిత్రం యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.