సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జై సింహా’ | Jai Simha censored and gets UA | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 5 2018 10:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Jai Simha censored and gets UA - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జై సింహా’. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. భారీ యాక్షన్స్ సీన్స్ తో రూపొందిన ఈ సినిమాలో ద్వితీయార్థం హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా వైజాగ్ లో చిత్రీకరించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాలయ్య అభిమానులను అలరిస్తుందంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement