Ks Ravikumar
-
దర్శకుడు కేఎస్ రవికుమార్ ఇంట విషాదం
ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి (88) కన్నుమూశారు. తమిళ చిత్రసీమలో కమర్షియల్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న కేఎస్ రవికుమార్. 1990ల నుంచి ఎన్నో మాస్ కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో టాప్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన టాప్ దర్శకుడిగా గుర్తింపు పొందారు.కేఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అనారోగ్యంతో మరణించారని తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని చెన్నైలోని చిన్నమలై ప్రాంతంలోని దర్శకుడు కేఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2:30గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తల్లి మరణించినట్లు సోషల్‌మీడియాలో ఆయన ప్రకటించిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. రుక్మిణి అమ్మాళ్ మృతదేహానికి వారు నివాళులు అర్పిస్తున్నారు.కె.ఎస్.రవికుమార్. 1990లో వచ్చిన 'పురియాద పూజ' తమిళ్ సినిమాతో తన జర్నీ ప్రారంభించారు. కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగులో బాలకృష్ణతో జైసింహా,రూలర్ వంటి సినిమాలకు దర్శకుడిగా ఆయన పనిచేశారు. 🙏🏻 pic.twitter.com/QIgcyzw5Ja— K.S.Ravikumar (@ksravikumardir) December 5, 2024 -
గ్రాఫిక్స్‌కి సమయం ఇవ్వలేదు!
హీరో రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్ రవికుమార్ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. -
ఈ హీరో క్రేజ్, కలెక్షన్స్ చూసి రజనీకాంతే భయపడ్డారు!
సుమారు 12 ఏళ్ల గ్యాప్ తరువాత నటుడు రామరాజన్ హీరోగా నటిస్తున్న చిత్రం సామాన్యన్. ఆర్.రాకేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత వి.మదియళగన్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు రామరాజన్, ఇళయరాజా కాంబోలో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా సుమారు 23 ఏళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో రూపొందుతున్న చిత్రం సామాన్యన్. నటి నక్సాచరణ్, స్మృతి వెంకట్, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో రాధారవి, ఎంఎస్.భాస్కర్, లియో శివకుమార్, రాజారాణి పాండియన్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంతే భయపడ్డారు శుక్రవారం సాయంత్రం చైన్నెలో ఆడియో లాంచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కేఎస్.రవికుమార్, శరణసుబ్బయ్య తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కేఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. సహయ దర్శకుడిగా 9 ఏళ్లు కష్టపడ్డప్పటికీ.. తనను దర్శకుడిని చేసింది రామరాజన్నేనని చెప్పారు. ఈయన నటించిన చిత్రాలన్నీ విజయాన్ని సాధించాయని, ఒక సమయంలో రామరాజన్ గురించి నటుడు రజనీకాంత్ తనతో మాట్లాడుతూ రామరాజన్ మాస్ ఫాలోయింగ్, వసూళ్లను చూస్తుంటే తనను మించి పోతారేమోనని భయంగా ఉందని అన్నారన్నారు. 23 ఏళ్ల తర్వాత.. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. వనవాసం ముగించుకుని వచ్చిన రామరాజన్‌కు ఇక పట్టాభిషేకమేనని పేర్కొన్నారు. ఆయన పరిగెత్తే గుర్రం కాదని, పలు గుర్రాలను పరిగెత్తించిన నటుడన్నారు. రామరాజన్ చిన్న మక్కళ్ తిలగం అని దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ పేర్కొన్నారు. 23 ఏళ్ల తర్వాత ఇళయరాజా, రామరాజన్ కలిసి పని చేస్తున్న ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడం భాగ్యంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు రాకేశ్ అన్నారు. నటుడు రామరాజన్ మాట్లాడుతూ 2010లో పార్టీ మీటింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఘోర ప్రమాదానికి గురయ్యానని, వెంట్రుక వాసిలో బతికి బయట పడ్డానని, ఇప్పుడు ఈ చిత్రంలో నటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. అభిమానుల ప్రార్థనల వల్లే తాను మళ్లీ ప్రాణాలతో బయట పడ్డానన్నారు. చదవండి: కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే -
నవ్వితే చాలు.. బాలకృష్ణకు కోపం వస్తుంది
‘‘తెలుగులో బాలకృష్ణతో సినిమాలు చేశాను. ఎవరైనా బాలకృష్ణని చూసి నవ్వితే చాలు. ఆయనకు చాలా కోపం వచ్చేస్తుంది’’ అంటూ చెన్నైలో జరిగిన తమిళ చిత్రం ‘గార్డియన్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కేఎస్ రవికుమార్ అనడం వైరల్‌గా మారింది. బాలకృష్ణతో వరుసగా ‘జైసింహా’ (2018), ‘రూలర్’ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించారు కేఎస్ రవికుమార్. ఆ చిత్రాల షూటింగ్ లొకేషన్లో జరిగిన సంఘటనలనే ‘గార్డియన్’ వేదికపై పంచుకున్నట్లున్నారు. ఇంకా ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ– ‘‘ఒకరోజు లొకేషన్లో ఒక వ్యక్తి నవ్వితే.. ‘ఎందుకు నవ్వుతున్నావ్... రేయ్ ఎందుకురా నవ్వావ్.. నన్ను చూసి ఎందుకు నవ్వావ్’’ అని బాలకృష్ణ కొట్టడానికి ముందుకు వెళ్లినట్లుగా చేతులతో చూపించారు కేఎస్ రవికుమార్. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఇంకోసారి నా అసిస్టెంట్‌ని ‘ఆ ఫ్యాన్‌ని ఇలా తిప్పు’ అంటే.. అతను ఫ్యాన్ తి΄్పాడు. ఆ గాలికి బాలకృష్ణ విగ్ కాస్త చెదిరినట్లయితే అతను నవ్వాడు. ‘ఏయ్ ఎందుకు నవ్వుతున్నావ్’ అని బాలకృష్ణ అడుగుతుంటే అసలే తను నా అసిస్టెంట్.. ఎక్కడ కొట్టేస్తారేమోనని, ‘సార్ సార్.. అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ సార్..’ అన్నాను. ‘లేదు లేదు.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. ఆ΄ోజిట్ గ్యాంగ్.. చూడు ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు’ అని ఆయన అన్నారు. ఇక అప్పుడు ‘రేయ్.. వెళ్లరా ఇక్కణ్ణుంఛి’ అని అతన్ని పంపించేశాను’’ అని కూడా చె΄్పారు రవికుమార్. -
భూమిక, యోగిబాబు 'స్కూల్' మొదలైంది
నటి భూమిక, యోగిబాబు, దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న స్కూల్ చిత్రం బుధవారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. క్వాంటమ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆర్కే విద్యాధరన్, మంజు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఆర్ కె విద్యాధరన్ నిర్వహిస్తున్నాడు. బక్స్, శ్యామ్స్ ముఖ్యపాత్రలు పోసిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్యన్ గోవిందరాజన చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా స్కూల్ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో జరిగే అవినీతి అక్రమాలను ఆవిష్కరించే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథా చిత్రం స్కూల్ చిత్రం అని చెప్పారు. విద్యార్థుల దృష్టిలో సమాజంలో జరిగే ఆత్మహత్యలు, ప్రమాదాలు, అన్యాయాలు వంటి పలు ఆసక్తికరమైన సంఘటనతో చిత్రం సాగుతుందని చెప్పారు. ఇందులో విద్యార్థులను శారీరక రీత్యా పరిశోధించే ప్రధాన అధ్యాపకులుగా నటి భూమిక, విద్యార్థుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తించే పాఠశాల ఉపాధ్యాయుడిగా యోగిబాబు నటించారని చెప్పారు. పాఠశాలలో జరిగే క్రైమ్ థ్రిల్లర్ అంశాలను ఇన్వెస్టిగేషన్ చేసి అధికారిగా దర్శకుడు కేఎస్‌రవికుమార్ నటించారని తెలిపారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి మొదలవుతుందని దర్శకుడు చెప్పారు. -
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'హిట్ లిస్ట్'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
దర్శకుడు కేఎస్ రవికుమార్ తన ఆర్కే సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం 'హిట్ లిస్ట్'. నటుడు శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు విక్రమన్ వారసుడు విజయ్ కనిష్క హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీకి రవికుమార్ శిష్యులు సూర్య, కార్తికేయన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. (ఇది చదవండి : ఆ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ.. ట్రైలర్ చూశారా?) పూర్తి యాక్షన్ ఎంటర్టైన్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాత్మక కార్యక్రమాలను జరుపుకుంటోంది. టీజర్ చూస్తే ఇది మంచి యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కేఎస్ రవికుమార్ వెల్లడించారు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, సముద్ర ఖని, మునీశ్కాంత్, నటి సితార, శతి వెంకట్, ఐశ్వర్య దత్త, బాలా సరవణన్, రెడిన్ కింగ్స్ లీ, అభినక్షత్ర, కేజీఎఫ్ చిత్రం ఫేమ్ గరుడ రామచంద్రా, అనుపమా కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సి. సత్య సంగీతాన్ని అందిస్తుండగా.. రాం చరణ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. (ఇది చదవండి : జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు) -
Rajinikanth- KS Ravikumar: 'ఆ సినిమా డిజాస్టర్‌కు రజనీనే కారణం'
రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్ అంటే సక్సెస్‌కు చిరునామా అనే పేరు ఉండేది. వీరి కాంబినేషన్లో ముత్తు, పడయప్ప సెన్సేషనల్ హిట్ చిత్రాలుగా రూపొందాయి. అలాంటిది 2014లో వీరి కాంబినేషన్లో వచ్చిన లింగ చిత్రం నిరాశపరచింది. ఆ తరువాత వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు చిత్రం రాలేదు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కానీ లింగ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో రజినీకాంత్ అభిమానులు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సరిగా తెరకెక్కించలేదంటూ విమర్శలు గుప్పించారు. వాటిపై దర్శకుడు అప్పట్లో స్పందించలేదు. అలాంటిది సుమారు 8 ఏళ్ల తరువాత స్పందిస్తూ.. లింగ చిత్ర పరాజయానికి రజినీకాంత్ కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంటూ లింగ చిత్రంలో క్లైమాక్స్ లో వచ్చే బెలూన్ ఫైట్‌ను తాము ముందుగా అనుకోలేదన్నారు. ఒకసారి హైదరాబాదులో షూటింగ్ జరుగుతుండగా రజినీ అప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలని కోరారన్నారు. దీంతో ఆయనకు చూపించగా చిత్రంలో తాను కోరుకున్న సన్నివేశాలను పొందుపరచాలని ఆయన కోరారన్నారు. అయితే ఆయన చెప్పిన సూచనలు తన సహాయ దర్శకులకు కూడా నచ్చలేదన్నారు. అయినా లింగ చిత్రాన్ని రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో తగిన సమయం లేకపోవడంతో ఆయన చెప్పినట్టుగానే చిత్రాన్ని హడావుడిగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ విధంగా లింగ చిత్రం ప్లాప్‌కు రజినీకాంత్ కారణమని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు. -
రివ్యూ: ‘రూలర్’ చిత్రం ఎట్లుందంటే?
మూవీ: రూలర్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, నాగినీడు, ఝాన్సీ సంగీతం: చిరంతన్ భట్ దర్శకత్వం: కె.ఎస్ రవికుమార్ నిర్మాత: సి. కల్యాణ్ నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ హీరో సినిమా వస్తే ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు డబుల్ ధమాకానే. వారికి కావాల్సిన ఫుల్ మాస్ ఎలిమెంట్స్ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఇక తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన కెఎస్ రవికుమార్ బాలయ్య బాబుతో రెండో సారి జత కట్టి ‘రూలర్’ ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్, ట్రైలర్లతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘రూలర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? నయా లుక్స్‌లో బాలయ్య ఏ మేరకు ఆకట్టుకున్నారు? ‘రూలర్’తో బాలకృష్ణ ఈ ఏడాదిని ఘనంగా ముగించారా? అనేది రివ్యూలో చూద్దాం. కథ: ఈ సినిమా కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్ ప్రసాద్(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అర్జున్ ప్రసాద్ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు. ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్ బయల్దేరుతాడు అర్జున్. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్ను అందరూ పోలీస్ అఫీసర్ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్ మినిస్టర్ భవానీనాథ్ ఠాగూర్(పరాగ్ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్(భూమిక)లు ఎందుకు ఎంటర్ అవుతారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. నటీనటులు: ఈ సినిమాలో రెండు ఢిపరెంట్ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విషయాల్లోనూ ఇరగదీశాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్లో ఒకటే ఈలలు గోలలు. ఇక నటనకు పెద్ద స్కోప్ లేకపోయినప్పటికీ గ్లామరస్ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భూమికకు ఈ చిత్రంలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ: ‘నలభైకి పైగా అంతస్థుల గల మేడ నుంచి పడిపోతున్న ఓ యువతిని హెలికాప్టర్లో వచ్చి బాలయ్య కాపాడతాడు’. ఈ ఒక్క సీన్‌తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్ షాట్స్, ఫైట్లు హై రేంజ్లో ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు. కేవలం బాలకృష్ణ ఇమేజ్ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మలిచాడు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, ఫైట్స్, కమర్షియల్ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. బాలకృష్ణ ఎలివేషన్ సీన్లు, ఇంగ్లీష్ డైలాగ్ సోనాల్ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్, శ్రీనివాస్ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్ సక్సెస్ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి సినిమా అసలు కథలోకి ఎంటర్ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది. దీనిపై దర్శకుడు తన సీనియార్టీని ఉపయోగించి అభిమానులను కాస్త మెస్మరైజ్ చేయాల్సింది. కానీ దర్శకుడు ఏమాత్రం తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించలేదని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్. బాలయ్య ఇమేజ్ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్. ఫార్మేషన్స్, బాలయ్యకు ఆప్ట్ అయ్యే స్లైలీష్ స్టెప్పులను కంపోజ్ చేశారు. సినిమాకు మరోప్లస్ పాయింట్స్ ఫైట్స్. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్, హీరోయిన్ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్ చేశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్లో ఉండేది. ప్లస్ పాయింట్స్ బాలకృష్ణ ఎనర్జీ డ్యాన్స్ ఫార్మేషన్స్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ దర్శకత్వ విలువలు ఎడిటింగ్ సాగదీత సీన్లు సినిమా నిడివి కథనంలో కొత్తదనం లేకపోవడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను
‘‘చేసే పనిపై ఏకాగ్రతతో ఉంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. ఆ ఏకాగ్రతే క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీలను అలవరుస్తుంది’’ అన్నారు కేయస్ రవికుమార్. బాలకృష్ణ హీరోగా ఆయన దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మించిన ‘రూలర్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా కేయస్ రవికుమార్ చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘రూలర్’ సినిమాకు వేరే కథ అనుకున్నమాట వాస్తవమే. కానీ పరుచూరి మురళి చెప్పిన కథ నచ్చడంతో కొన్ని చిన్న మార్పులతో ‘రూలర్’ సినిమా చేశాం. మొదట అనుకున్న కథను వద్దనుకోవడానికి పెద్ద కారణాలు లేవు. ఉత్తరప్రదేశ్‌లోని తెలుగువారికి చెందిన కథ ఇది. సినిమాలోని ఈ సినిమా బాలకృష్ణగారి అభిమానులకే కాదు... ఇతర ప్రేక్షకులకూ నచ్చుతుంది. ‘జై సింహా’ తర్వాత వెంటనే నేను బాలకృష్ణగారితో ‘రూలర్’ చేశాను. ఈ సినిమా కోసం బాలకృష్ణగారు బరువు తగ్గారు. ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి వర్కౌట్స్ చేసేవారట. ► నా కెరీర్లో ముందుగా చిన్న సినిమాలు చేసి, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నాను. ప్రస్తుతం హీరో ఇమేజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘రూలర్’ సినిమాని బాలకృష్ణగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకునే చేశా. తన అసిస్టెంట్లు తప్పు చేసినప్పుడు మాత్రమే బాలకృష్ణగారు సెట్లో కోప్పడతారు. అది కూడా అన్ని సందర్భాల్లో కాదు. ప్రణాళిక ప్రకారం అన్నీ జరగకపోతే సెట్లో నేనూ షార్ట్ టెంపరే. ► నా కెరీర్ మొదట్లో దాదాపు పదేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. అప్పుడు సినిమా ఎలా తీయాలి? అనే దానికంటే కూడా... ఒక సినిమా ఎందుకు ఫెయిల్ అవుతుంది? సినిమాను ఎలా తీయకూడదు? ఏం తప్పులు చేయకూడదు? అనే అంశాలనే ఎక్కువగా నేర్చుకున్నాను. ► ప్రీ–ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పక్కాగా ప్లాన్ చేసుకుంటే పెద్ద స్టార్స్‌తో సినిమా లను కూడా త్వరగా పూర్తి చేయవచ్చు. ‘రూలర్’ సినిమాను నాలుగు నెలల్లో పూర్తి చేశాం. గతంలో చిరంజీవిగారి ‘స్నేహాంకోసం’ సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశాను. ఆ సినిమా చేసేటప్పుడే రజనీకాంత్‌గారి ‘నరసింహా’ సినిమాకి డైలాగ్స్ రాసుకున్నాను. పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసేప్పుడు ఈగో ఉండకూడదు. హీరో ఇమేజ్‌ని డైరెక్టర్ గౌరవించాలి. డైరెక్టర్‌ను హీరో గౌరవించాలి. నటీనటులకు లొకేషన్లో నటించి చూపిస్తాం కాబట్టి దర్శకులకు కూడా నటన వచ్చేస్తుంది. ప్రస్తుతం నేను కొన్ని తమిళ సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో రవితేజ సినిమాలో ఓ పాత్ర చేయాల్సింది. కానీ కుదర్లేదు. -
అందుకే తెలుగులో వీలు కుదర్లేదు
‘‘ఒక్కో ఇండస్ట్రీ ఒక్కోలాంటి సినిమాలు తీస్తుంది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో నేను సినిమాలు చేస్తుంటాను. పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల విభిన్నత చూపించడానికి నటిగా నాకు మంచి అవకాశం అనుకుంటాను’’ అన్నారు వేదిక. బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రూలర్’. వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ‘బాణం, విజయ దశమి, దగ్గరగా దూరంగా’ సినిమాల్లో కనిపించి వేదిక 7 ఏళ్ల విరామం తర్వాత ‘రూలర్’ అనే తెలుగు సినిమా చేశారు. ఈ సందర్భంగా వేదిక పంచుకున్న విశేషాలు... ► ఇతర భాషల్లో సినిమాలతో బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేసే వీలు కుదర్లేదు. అక్కడ వరుస చిత్రాలతో ఇక్కడ ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాను. నాకు తెలుగులో మేనేజర్ కూడా లేరు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన 3’ తమిళంలో, తెలుగులో హిట్ అయింది. నా పాత్రకు మంచి స్పందన రావడంతో ‘రూలర్’కి నన్ను సంప్రదించారు. ► బాలకృష్ణగారిలాంటి పెద్ద స్టార్ సినిమాలో అవకాశం రావడం మంచి అవకాశంగా భావించాను. కేఎస్ రవికుమార్‌గారు చాలా మంచి సినిమాలు తీశారు. ఈ సినిమాను పూర్తి చేయాలంటే ఏడాది పడుతుంది. కానీ, మూడున్నర నెలల్లో పూర్తి చేశారాయన. సి.కల్యాణ్‌గారు రాజీపడకుండా క్వాలిటీతో తెరకెక్కించారు. ► ‘రూలర్’ సినిమాలో నా పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధంగా, మరొకటి ఫుల్ గ్లామరస్‌గా ఉండేది. డామినేటింగ్‌గా ఉండే పాత్ర నాది. సప్తగిరితో కలసి కామెడీ చేస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ సినిమాలో పాత్రలానే నేనూ డామినేటింగే. కానీ నా ఫేస్ అలా కనిపించదు(నవ్వుతూ). ► బాలకృష్ణగారి ఎనర్జీ సూపర్. డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను(నవ్వుతూ). ఆయన డైలాగ్స్, యాక్టింగ్‌లో ఒక స్టయిల్ ఉంటుంది. ఆయన అందర్నీ సమానంగా చూసుకుంటారు. -
బాలయ్య లుక్ మామూలుగా లేదుగా..!
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్ గ్యాప్ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన కొన్ని లుక్స్ సోషల్ మీడియలో చాలా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి అభిమానులకి దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. చేతిలో రక్తపు కత్తి, ఒంటినిండా పసుపుకుంకుమతో యాంగ్రీ లుక్‌లో బాలయ్య కనిపిస్తుండటంతో మరోసారి బాక్సాఫీస్ దుమ్మురేపడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. తొలుత సినిమాకు సంబంధించి బాలయ్య లుక్ చూసి అందరూ క్లాస్ సినిమా అనుకున్నారు.. కానీ తాజా లుక్‌తో మాస్ అభిమానులు మరోసారి పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య లుక్ బాలయ్య లుక్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ కథానాయికగా నటిస్తోంది. భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తోంది. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న కేయస్ రవికుమార్ డైరెక్షన్లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు. కాగా ఈ సినిమా తెరకెక్కిస్తూనే బాలకృష్ణ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం. బోయపాటి శ్రీనివాస్ సినిమాకు ఇప్పటికే ఓకే చెప్పిన ఈ నందమూరి హీరో.. పూరి జగన్నాథ్‌తో కథా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. -
యాక్షన్‌కి వేళాయె
బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘బాలకృష్ణ నటిస్తోన్న 105వ చిత్రమిది. ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ గురువారం మొదలైంది. ఈ షెడ్యూల్లో భాగంగా అన్బు, అరవి ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఓ లుక్‌కి, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్, కెమెరా: సి.రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: వి.రావ్, పత్సా నాగరాజు. -
బై బై థాయ్‌ల్యాండ్!
థాయ్‌ల్యాండ్‌లో విలన్లను చితక్కొట్టారు బాలకృష్ణ. ఆ నెక్ట్స్ రెస్ట్ కోసం ప్రేయసితో కలిసి పాటలు పాడారు. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాలీ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా థాయ్‌ల్యాండ్ షెడ్యూల్ ముగిసింది. ఇరవై రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో రెండు పాటలు, కొంత టాకీ పార్టు, భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. ప్రకాష్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్, కెమెరా: సి. రామ్‌ప్రసాద్. -
బాలయ్య కొత్త సినిమా లుక్!
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ లాంగ్ గ్యాప్ తరువాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నాడు. షూటింగ్ సమయంలో ఓ అభిమానితో బాలయ్య దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో చిత్రయూనిట్ అధికారికంగా లుక్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఉన్న బాలయ్య ఈ సినిమాలో అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లు నిరాశపరచటంతో బాలయ్య అభిమానులు ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కమర్షియల్ దర్శకుడిగా పేరున్న కేయస్ రవికుమార్ డైరెక్షన్లో బాలకృష్ణ సక్సెస్‌ట్రాక్‌లోకి వస్తాడని భావిస్తున్నారు. -
బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
-
కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ–కె.ఎస్.రవికుమార్– సి.కల్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్. -
బాలయ్యా.. ఈ సినిమా కూడా లేదా?
నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ సినిమాలు బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చాయి. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ బయోపిక్ బాలయ్యకు భారీ నష్టాలతో పాటు అదే స్థాయిలో చెడ్డపేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు బాలకృష్ణ. ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసి.. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్‌తో మాస్ యాక్షన్ సినిమాకు రెడీ అయ్యాడు. అయితే తాజా సమాచారం ప్రకారం కేయస్ రవికుమార్ సినిమాను కూడా బాలయ్య చేయటం లేదట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రవికుమార్ చెప్పిన కథతో సినిమా చేస్తే సమస్యలు వస్తాయన్న ఆలోచనతో సినిమాను ఆపేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలతో నందమూరి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది. -
బాలయ్యతో ‘ఆర్ఎక్స్ 100’ బ్యూటీ
తొలి సినిమా ఆర్ఎక్స్ 100తోనే సెన్సేషన్ సృష్టించిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న పాయల్‌కు తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సీనియర్ హీరో రవితేజకు జోడిగా డిస్కోరాజా సినిమాలో, వెంకటేష్‌కు జోడిగా వెంకీ మామ సినిమాలో నటిస్తున్నారు పాయల్ రాజ్‌పుత్. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సీత సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అలరించనున్నారు. తాజాగా ఈ అమ్మడు మరో సీనియర్ హీరోతో జోడి కట్టేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మరోసారి బాలయ్యతో ఢీ!
ఎన్టీఆర్ బయోపిక్‌తో తీవ్రంగా నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ముందుగా ప్రకటించిన బోయపాటి శ్రీను సినిమాను పక్కన పెట్టి మరీ తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా మే 17న లాంఛనంగా ప్రారంభం కానుంది. గతంలో బాలకృష్ణ, రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన జైసింహా యావరేజ్ టాక్‌తో పరవాలేదనిపించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్యకు ప్రతి నాయకుడిగా జగపతిబాబు నటించనున్నారట. లెజెండ్ సినిమాతోనే విలన్‌గా మారిన జగ్గుభాయ్, ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుంది. -
రజనీకాంత్ రిటైర్మెంట్..!
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటైర్మెంట్పై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాబా సినిమా సమయంలోనే రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రజనీ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి రజనీ రిటైర్మెంట్ వార్తలు తెరమీదకు వచ్చాయి. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ సినిమాలో నటిస్తున్న రజనీ, తరువాత మరో రెండు సినిమాలు మాత్రమే చేయనున్నారట. తనతో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా, వినోద్ దర్శకత్వంలో మరో సినిమా చేసి రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై రజనీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రకటించిన రజనీ ఈ లోక్‌సభ ఎలక్షన్లకు దూరంగా ఉంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి నటనకు గుడ్‌బై చెప్పి పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నారు రజనీ కాంత్. -
నరసింహ పంచ్‌లు రజనీ రాసిన వేళ
‘నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’... ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఈ పంచ్ డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఆ డైలాగులను ఇంకా వాడుతూనే ఉన్నాం. విశేషమేంటంటే ఈ డైలాగులను రాసింది రజనీకాంతే. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పడయప్పా’. (తెలుగులో నరసింహ). శివాజీ గణేశన్, సౌందర్య, రమ్యకృష్ణ, అబ్బాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీతో ఈ సినిమా రిలీజ్ అయి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ ఇంగ్లీష్ పత్రికతో సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాలో ఫీమేల్ విలన్ (నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ) ఉండాలన్నది స్వయంగా రజనీకాంత్ ఆలోచనే. రజనీకాంత్ పొలిటికల్ స్టాండ్ ప్రకారం ఆ ఫీమేల్ విలన్ పాత్ర అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రూపొందించినది. ఒకర్ని ఉద్దేశించి రూపొందించిన పాత్ర అయినప్పటికీ అన్ని రాష్ట్రాల వాళ్లు ఎంజాయ్ చేసేంత బలమైన కథ అయ్యుండాలని చెప్పారు రజనీ. ► నీలాంబరి పాత్ర కోసం మొదట మీనా, నగ్మా పేర్లను అనుకున్నాం. కానీ ఎందుకో వాళ్లు సూట్ కారనిపించింది. ఆ తర్వాత డిస్కషన్స్‌లో రమ్యకృష్ణ పేరు వచ్చింది. ఆమె అయితే కరెక్ట్ అనుకుని, స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండానే ఫిక్స్ చేశాం. తన పాత్రకు నీలాంబరి అనే పేరుని కూడా రజనీయే సూచించారు. ► మొదట నీలాంబరి పాత్ర కోసం అనుకున్న మీనా వసుంధర పాత్రకు అయితే బావుంటుందనుకున్నాం. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రజనీకాంత్‌తో అప్పటికే ‘అరుణాచలం’లో నటించిన సౌందర్యనే హీరోయిన్గా తీసుకున్నాం. ► ‘నా దారి రహదారి, పోరా.. ఆ దేవుడే నా వైపు ఉన్నాడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’.. ఈ మూడు ఫేమస్ పంచ్ డైలాగులను రజనీకాంతే స్వయంగా రాసుకున్నారు. మేం స్క్రిప్ట్ తయారు చేసే ఆలోచనల్లో ఉంటే రజనీకాంత్ డైలాగ్స్ గురించి ఆలోచించేవారు. ► సినిమాలో రమ్యకృష్ణ వాడిన రెక్కలు విచ్చుకునే కారు నాదే. స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు నా కార్లో రజనీ, నేను తిరిగేవాళ్లం. ఈ కారు అయితే నీలాంబరి క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతుందని రజనీ తన అభిప్రాయం చెప్పారు. అదే సినిమాలో ఉపయోగించాం. ► సినిమా పూర్తయ్యేసరికి కంటెంట్ 19 రీళ్లు వచ్చింది. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేలా సినిమా రిలీజ్ ప్లాన్ చేద్దాం అన్నది రజనీకాంత్ ఆలోచన. అప్పట్లో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ సినిమాకు ఇదే ప్రాబ్లమ్. కమల్‌ను సలహా అడిగితే బావుంటుందని ఆయన్ను సంప్రదించాం. 14 రీళ్లకు సినిమాను కుదించండి అని ఆయన కూడా అనడంతో చాలా పోర్షన్ ఎడిట్ చేసేశాం. ఇప్పుడంటే డిజిటల్ అయిపోయింది. అప్పుడు ఫిల్మ్ కాబట్టి మిగిలిన భాగమంతా వృథా అయిపోయింది. . ► నీలాంబరి, నరసింహను 18 ఏళ్ల తర్వాత కలిసే సందర్భం అది. నరసింహను నిలబెట్టి తాను కుర్చీలో కూర్చుని అవమానించాలని నీలాంబరి భావిస్తుంది. నరసింహ తన స్టైల్లో అక్కడున్న కుర్చీ లాక్కొని కూర్చుంటాడు. ఇదీ సన్నివేశం. లొకేషన్‌కు వెళ్లి చూస్తే కుర్చీ లాగేంత చోటు లేదక్కడ. లక్కీగా ఊయల ఉండటంతో ఆ ఊయలను పైనుంచి కిందకు లాగి కూర్చునే సన్నివేశంగా మార్చాం. ► ‘నరసింహ’æ షూటింగ్ సమయంలో రజనీకాంత్ తరచూ వ్యాయామం చేస్తుండేవారు. కాస్ట్యూమ్స్ చేంజ్ సమయంలో రజనీకాంత్ ఫిట్ బాడీని గమనించాను నేను. రజనీ బాడీ చూపించే సన్నివేశం ఉంటే బావుంటుంది అనుకున్నాను. ఈ విషయం రజనీకు చెప్పడంతో రజనీ ఇంకా శ్రమించి ఎక్సర్సైజ్ చేశారు. ఆ సీన్లో ‘వాట్ ఏ మ్యాన్’ అనే డైలాగ్ అబ్బాస్‌తో చెప్పించాను. ‘నరసింహ’ గురించి రవికుమార్ చెప్పిన విషయాలు బాగున్నాయి కదూ. ఈ సినిమా తర్వాత రజనీతో ‘లింగా’ సినిమా డైరెక్ట్ చేశారు కేయస్ రవికుమార్. రజనీని మరోసారి డైరెక్ట్ చేయనున్నారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న ‘దర్బార్’ తర్వాత రవికుమార్ కాంబినేషన్లో ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెన్నై టాక్. -
జైసింహా సక్సెస్ మీట్
-
‘జై సింహా’ మూవీ రివ్యూ
టైటిల్ : జై సింహా జానర్ : ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ తారాగణం : నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా సంగీతం : చిరంతన్ భట్ దర్శకత్వం : కేయస్ రవికుమార్ నిర్మాత : సి. కళ్యాణ్ సంక్రాంతి బరిలో తిరుగులేని రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ ఏడాది జై సింహాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్యకు కలిసొచ్చే సంక్రాంతి సీజన్ తో పాటు బాలయ్యకు లక్కీ సెంటిమెంట్స్ అయిన టైటిల్ లో సింహా, హీరోయిన్ గా నయనతారలను కూడా రిపీట్ చేసిన ఈ సినిమా మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టిందా..? చాలా కాలం తరువాత స్ట్రయిట్ తెలుగు సినిమా చేసిన కేయస్ రవికుమార్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది. ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. (సాక్షి రివ్యూస్)కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..? కొత్తగా వచ్చిన ఏసీపీకి నరసింహానికి సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్ యాక్షన్. జై సింహాతో మరోసారి తన ఇమేజ్ తగ్గ క్యారెక్టర్ తో అభిమానులను అలరించాడు బాలకృష్ణ. తన మార్క్ పంచ్ డైలాగ్ లు, మాస్ ఎలిమెంట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య డాన్స్‌లు అభిమానులను ఖుషీ చేస్తాయి. బాలయ్య జోడిగా నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ లో నయనతార నటన కంటతడిపెట్టిస్తుంది. (సాక్షి రివ్యూస్)నటషా దోషి, హరిప్రియల పాత్రల నిడివి చాలా తక్కువ.. కనిపించిన కాసేపు నటనతో పాటు, గ్లామర్ తోనూ మెప్పించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో తన మార్క్ చూపించాడు. విలన్లుగా కాళకేయ ప్రభాకర్, అశుతోష్ రానాలు ఆకట్టుకున్నారు. ఇటీవల వెండితెర మీద పెద్దగా కనిపించని సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాతో తిరిగి సత్తా చాటుతాడని భావించారు. కానీ మరోసారి బ్రహ్మీ కామెడీ ఆశించిన స్థాయిలో అలరించలేదు. విశ్లేషణ : దర్శకుడు కేయస్ రవికుమార్ బాలయ్య ఇమేజ్ తగ్గ మాస్ క్యారెక్టర్ తో అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ నుంచి అభిమానుల ఆశించే డైలాగ్స్, సీన్స్ తో సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచాడు. సంక్రాంతి పండుగ సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను కూడా జోడించి ఆకట్టుకున్నాడు. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశించే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో అలరించలేకపోయాడు.(సాక్షి రివ్యూస్) ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అభిమానులతో విజిల్స్ వేయించాడు రత్నం. చిరంతన్ భట్ సంగీతం బాగుంది. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమా తరువాత బాలయ్యతో కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన చిరంతన్ మరోసారి మంచి మ్యూజిక్‌తో మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. అక్కడక్కడ కథనం నెమ్మదించి విసిగిస్తుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ నటన ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా నెమ్మదించిన కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘జై సింహా’కు కూడా నైట్ షోస్
బుధవారం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాకు అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జై సింహా సినిమాకు కూడా అదే పర్మిషన్ ఇచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలకృష్ణ. -
‘జై సింహా’లో అవే హైలెట్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం జై సింహా. బాలకృష్ణ సరసన నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకుడు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నందమూరి అభిమానులను అలరించే అంశాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్య మార్క్ భారీ డైలాగులు, చిరంతన్ భట్ సంగీతంతో పాటు కంటతడిపెట్టించే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయట. బాలయ్య డ్యాన్స్ మూమెంట్స్ కూడా అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నాయి. కేయస్ రవికుమార్ రేసీ స్క్రీన్ ప్లే తో పాటు సీ కళ్యాణ్ నిర్మాణ విలువలు కూడా సినిమా రేంజ్ ను పెంచాయట.