రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని...
రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని...
Published Sun, Nov 16 2014 2:44 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
చెన్నై: సూపర్ స్టార్ ముఖ్యమంత్రి పదవి చేపడితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అని సినీ దర్శకుడు అమీర్ విజ్క్షప్తి చేశారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'లింగ' ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలి. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి వస్తారని కోరుకుంటున్నాం అని అమీర్ అన్నారు. 'లింగ' టైటిల్ తో ధనుష్ తో ఓ సినిమాను రూపొందించాలని అమీర్ అనుకున్నారు. కాని రజనీ సినిమా కోసం లింగ టైటిల్ ను అమీర్ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని లింగ దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement