linga
-
పెంగ్విన్ మూవీ రివ్యూ
టైటిల్: పెంగ్విన్ జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నటీటులు: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నిత్య తదితరులు నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరాం రచన- దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ సంగీతం: సంతోష్ నారాయణ్ ఛాయాగ్రహణం: కార్తీక్ పళని బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ స్టూడియోస్ విడుదల: అమెజాన్ ప్రైమ్ (జూన్ 19) లాక్డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోగా మరికొన్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే "అమృతరామమ్" చిత్రం ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ కూడా ఓటీటీకే ఓటేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం.. కథ: రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిథమ్‌కు పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులిద్దరూ అడవిలో అంగుళం అంగుళం జల్లెడ పట్టినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్లో చూపినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు.. రిథమ్ తప్ప! ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్పటికీ ఆమె తన అన్వేషణ మానదు. ఈ క్రమంలో ఆమె గౌతమ్(రంగరాజ్)ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు సడన్‌గా రిథమ్‌కు అజయ్ కనిపిస్తాడు. ఇన్నిరోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితోపాటు అపహరణకు గురైన ఆరుగురు పిల్లలు బతికే ఉన్నారా? అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు? గర్భంతో ఉన్న కీర్తి అతడిని ఎలా ఎదుర్కొంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (లాక్డౌన్ ఎఫెక్ట్: అమెజాన్‌లో ఏడు సినిమాలు) విశ్లేషణ: ప్రారంభ సన్నివేశంలోనే దర్శకుడు కథను ముందుగా పరిచయం చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు స్టోరీ లైన్ అర్థమై కథలో లీనమయ్యేందుకు సిద్ధపడతాడు. తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ప్రథమార్థంలో పట్టును చూపించినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. ఎక్కువగా దర్శకుడు రిథమ్(కీర్తి)ని హైలెట్ చేయడానికే ప్రయత్నించాడని కొట్టొచినట్లు కనిపిస్తుంది. సినిమా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథ బాగానే ఉన్న కథనంలో కొన్ని లోపాలతో కొన్నిచోట్ల గజిబిజిగా అనిపిస్తుంది. ఇక సినిమాలో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులే ఉండటం కూడా ఓ మైనస్. (మిసెస్ సీరియల్ కిల్లర్: ఒక్కసారి చూడ్డమే ఎక్కువ) కథ చివర్లో వచ్చే ట్విస్ట్ చూసి ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం. పైగా మొదటి నుంచి సీరియల్ కిల్లర్‌ను భయంకరంగా చూపిస్తూ చివర్లో మాత్రం కీర్తి కోసం అతడి బలాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. అజయ్‌ను ఎత్తుకుపోవడానికి గల కారణం కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ అంశాలను పక్కపెడితే థ్రిల్లర్ చిత్రాలిష్టపడేవారు తప్పకుండా ఓ సారి "పెంగ్విన్"ను చూసేయొచ్చు. నటనా పరంగా చూస్తే ఈ సినిమాను కీర్తి సురేశ్ తన భుజాలమీద మోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ముందు మిగతా పాత్రలేవీ పెద్దగా కనిపించవు. ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాట.. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. (అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?) ప్లస్ పాయింట్స్ కీర్తి సురేష్ నటన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంకేతిక బృందం పనితీరు మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు -
యస్...అంటున్నారా?
సౌతిండియాలో సోనాక్షి సిన్హా ఒక్కటంటే ఒక్క సినిమా ‘లింగ’లో నటించారు. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ‘యస్’ అనేశారు. మరి, ఇప్పుడూ ‘యస్’ అంటున్నారా? లేదా? అనేది ఎదురు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడీ బాలీవుడ్ బ్యూటీని ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, అందగాడు అరవింద్ స్వామికి జోడీగా నటించమని అడిగారు. సిద్ధిఖీ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా ‘భాస్కర్ ద రాస్కెల్’ను తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో అరవింద్ స్వామి హీరో. మొదట రజనీకాంత్‌ను ఈ రీమేక్‌లో నటించమని సంప్రదించారు. ఆయన ‘నో’ చెప్పేసరికి, అరవింద్ స్వామికి అవకాశం వచ్చింది. మాతృక తీసిన సిద్ధిఖీనే ఈ తమిళ రీమేక్‌కీ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో కూడా నయనతారను నటించమని అడగ్గా.. ఓసారి చేసిన పాత్రలో రెండోసారి నటించే ఉద్దేశం లేదని చెప్పారట! దాంతో సోనాక్షి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె కూడా కథ వినడానికి అంగీకరించారట. మరి, విన్నాక సోనాక్షి ఏమంటారో? వెయిట్ అండ్ సీ. -
రిలీజ్‌కు ముందే రజనీ రికార్డ్
గతంలో రజనీకాంత్ సినిమా అంటే షూటింగ్ కోసమే రెండేళ్లు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కుర్ర హీరోల నుంచి వస్తున్న పోటీ కారణంగా రజనీ కూడా స్పీడు పెంచక తప్పలేదు. కొచ్చాడయాన్ వరకు స్లోగా సినిమాలు చేస్తూ వచ్చిన రజనీకాంత్, లింగా సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాను కేవలం ఐదు నెలల్లో పూర్తిచేసి రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం రజనీ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా విషయంలో కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ సినిమాను కూడా కేవలం ఐదు నెలల్లోనే పూర్తిచేశాడు రజనీ. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరుగుతుండటం ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తోంది. లింగా సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. దాదాపు 100 కోట్ల మార్క్‌ను రీచ్ అయ్యింది. దీంతో పాజిటివ్ టాక్ ఉన్న కబాలి కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కబాలి సినిమాకు తమిళనాట రూ. 120 కోట్ల వరకు బిజినెస్ జరిగిపోయింది. ఇక విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న రజనీ అక్కడ కూడా భారీ బిజినెస్‌ను టార్గెట్ చేశాడు. మలేషియా రైట్స్ 10 కోట్లకు, యూఎస్ రైట్స్ 8.5 కోట్లకు, ఆస్ట్రేలియా రైట్స్ 1.5 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. ఇక తెలుగులో కూడా సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజనీ, కబాలి బిజినెస్ రూ. 30 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
లింగాకి స్పూఫ్ రాబోతుందా..?
-
లింగ... డిసైడ్ చేశాడట..
చెన్నై: లింగ సినిమా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ....ఎక్కు తొలిమెట్టు... కొండను ఢీకొట్టు...అంటూ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కొంతసొమ్ము చెల్లించడానికి 'దళపతి' ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎంత డబ్బు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ధృవీకరించారు. సమస్య పరిష్కారమైందనీ, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన విరమించారని ఆయన ప్రకటించారు. కాగా లింగ సినిమా పంపిణీ దారులకు , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌కు మధ్య గత రెండు నెలలుగా వివాదం నడుస్తోంది. తాము నష్టపోయిన సుమారు 35 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగి ఉద్యమించారు. గత నెలలో రజనీ ఇంటిముందు భిక్షాటన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ సరనస అనుష్క, సోనాక్షి హీరోయిన్లుగా, డిసెంబర్ 12, 2014లో భారీ అంచనాలతో రిలీజైన మూవీ లింగ. రజనీకాంత్ సినీ జీవితంలో డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలను మూటగట్టుకుంది. -
లింగా నష్ట పరిహారం చెల్లిస్తాం
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లింగా చిత్రప్రదర్శనలో డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని చెల్లించేందుకు ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అంగీకరించారు. భారీ అంచనాలతో నిర్మితమైన లింగా చిత్రానికి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అయితే అనుకోని విధంగా చిత్రం ఘోర పరాజయం పాలైంది. చిత్ర హీరో రజనీకాంత్ జోక్యం చేసుకొని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ అయ్యేలా చూడాలని డిస్ట్రిబ్యూటర్లు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తొలుత అంగీకరించలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన తీవ్రతరం కావడంతో రజనీ జోక్యం చేసుకోక తప్పలేదు. నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలను రజనీ కోరగా అందుకు వారు అంగీకరించారు. లింగా డిస్ట్రిబ్యూటర్లు తమకు జరిగిన నష్టం లెక్కల వివరాలను నిర్మాతకు అందజేశారు. మరో మూడు రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది. తన చిత్రాల వల్ల ఎవరూ నష్టపోరాదని భావించిన రజనీకాంత్ గతంలో బాబా చిత్రానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా తానే చెల్లించారు. అయితే లింగా చిత్రానికి నష్టంలో కొంతభాగం చెల్లిస్తారని తెలుస్తోంది. నిర్మాత నుంచి సొమ్ము ముట్టిన తరువాత మీడియా సమావేశం పెట్టి రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు. -
'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ
-
'లింగా'కు సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ
చెన్నై : రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'లింగా' చిత్రానికి సివిల్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తమ కథను లింగా చిత్ర దర్శకుడు, రచయిత కాపీ కొట్టారంటూ రవిరత్నం అనే చిత్ర నిర్మాత వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. శుక్రవారం మధ్యాహ్నం లోగా రూ.10 కోట్లు న్యాయస్థానానికి కట్టి సినిమా విడుదల చేసుకోవచ్చని ఆదేశించింది. కాగా రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 'లింగా' విడుదల కానుంది. కోర్టు ఆదేశాన్ని తాము గౌరవిస్తామని లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తెలిపారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని ఆయన చెప్పారు. రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సెన్సార్ బోర్డ్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. -
అప్పట్లో ఏమీ తెలిసేది కాదు!
‘‘నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా నటిస్తా. అలాగని నా శైలిని వదలుకోను. ఓ పాత్ర తీరుతెన్నులను దర్శకుడు చెప్పిన తర్వాత, ఒకవేళ నేనే ఆ పాత్ర అయితే ఎలా ఉంటానో.. ఊహిం చుకుని నటిస్తా’’ అంటున్నారు అనుష్క. ‘బాహుబలి, రుద్రమదేవి, లింగా, ఎన్నయ్ అరిందాల్’.. ఇలా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారీ బ్యూటీ. ఇటీవల ఓ సందర్భంలో నటిగా రంగప్రవేశం చేసిన తొలినాళ్లను అనుష్క గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం ఎలా ఉంటుందనే విషయంపై తనకు కనీస అవగాహన ఉండేది కాదని అనుష్క చెబుతూ -‘‘సినిమాల్లోకి రాక ముందు నేను సాదా సీదా అమ్మాయిని. చాలా నిరాడంబరంగా ఉండేదాన్ని. అప్పట్లో మేకప్ వేసుకోవడం కూడా తెలియదు. ఇక కెమెరా యాంగిల్స్ గురించి ఏం తెలుస్తుంది! కానీ, ఓ నాలుగైదు సినిమాలు చేసిన తర్వాత ఫిలిం మేకింగ్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే, కెమెరా యాంగిల్స్ కూడా తెలుసుకున్నాను. అప్పట్నుంచీ నాదైన శైలిలో నటించడం మొదలుపెట్టాను. తెరపై చూస్తున్న రెండున్నర గంటల సినిమా కోసం పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను’’ అని చెప్పారు. ‘పోటీలో ఉన్న ఇతర నాయికలు హిందీ సినిమాలు చేస్తున్నారు కదా! మీరెందుకు చేయడంలేదు?’ అనే ప్రశ్న అనుష్క ముందుంచితే -‘‘హిందీ సినిమా చేయాలి కాబట్టి అని చేస్తే బాగుండదు. బాలీవుడ్ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఏదీ కొత్తగా అనిపించలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అన్నారామె. -
రాజకీయాలపై రజనీకాంత్ వ్యాఖ్యలు
-
రాజకీయాలపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లింగా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''రాజకీయాలంటే నాకు భయంలేదు. కానీ రాజకీయాలలోకి రావడం నా చేతులలో లేదు. దేవుడి అంగీకారం ఉండాలికదా? దేవుడి దయ ఉంటే ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుంది. రాజకీయాలలో ఉండే లోతు, అక్కడి పరిస్థితులు నాకు తెలుసు'' అన్నారు. ** -
రజనీకాంత్ ముఖ్యమంత్రి అయితే చూడాలని...
చెన్నై: సూపర్ స్టార్ ముఖ్యమంత్రి పదవి చేపడితే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి అని సినీ దర్శకుడు అమీర్ విజ్క్షప్తి చేశారు. చెన్నైలో ఆదివారం జరిగిన 'లింగ' ఆడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీ సార్ రాజకీయాల్లోకి రావాలి. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజకీయాల్లోకి వస్తారని కోరుకుంటున్నాం అని అమీర్ అన్నారు. 'లింగ' టైటిల్ తో ధనుష్ తో ఓ సినిమాను రూపొందించాలని అమీర్ అనుకున్నారు. కాని రజనీ సినిమా కోసం లింగ టైటిల్ ను అమీర్ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని లింగ దర్శకుడు కేఎస్ రవికుమార్ కూడా పిలుపునిచ్చారు. -
సూపర్ స్టార్ పై సెటైర్స్ వేస్తున్న హీరోయిన్స్
-
అప్పటి కన్నడ హిట్‌కు ఇప్పుడు రీమేక్?
బెంగళూర్‌లో బస్ కండక్టర్‌గా చేసినప్పుడు ఎంత నిరాడంబరంగా ఉండేవారో సూపర్ స్టారయ్యాక రజనీకాంత్ అలానే ఉంటున్నారు. అప్పట్లో ఆయన కన్నడ చిత్రాలను చూస్తుండేవారట. అలా చూసినవాటిలో స్వర్గీయ కన్నడ రాజ్‌కుమార్ నటించిన ‘బంగారద మనుష్య’ ఒకటి. 1972లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రాన్ని ఎప్పటికైనా రీమేక్ చేయాలని రజనీ ఆలోచన. రాజ్‌కుమార్ చేసిన పాత్ర విపరీతంగా నచ్చిందని, ఆ పాత్రచేయాలని రజనీకి ఉందని ఆయన ఆప్తమిత్రుడు రాజ్ బహదూర్ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. వాస్తవానికి ‘లింగా’కన్నా ముందే రజనీ ఈ చిత్రంలోనే నటించాల్సి ఉందట. అయితే అప్పటికే ‘లింగా’కి డేట్స్ కేటాయించేయడంతో ఆ రీమేక్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారని బహదూర్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘లింగా’ తర్వాత రజనీ నటించే చిత్రం ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘లింగా’కి దర్శకత్వం వహిస్తున్న కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలోనే రజనీకి ఈ సినిమా చేయాలని ఉందట. ఏదేమైనా, నలభై ఏళ్ల క్రితం చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలని రజనీ అనుకుంటున్నారంటే.. అదెంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవచ్చు. -
లింగాలో స్పెషల్ సాంగ్ తో మెరవబోతోందా...?
-
వచ్చే ఏడాది పెళ్లా..?
‘ఇంతకీ నీ పెళ్లెప్పుడు?’... పెళ్లీడులో ఉన్న ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ప్రశ్న ఇది. సినిమా తారలైతే దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. అనుష్క ఈ జాబితాలోకే వస్తారు. పెళ్లి గురించి అడిగితే... ‘మీ అందరికీ చెప్పే చేసుకుంటా’ అని చెప్పుకుంటూ వచ్చారు అనుష్క. ఇప్పుడు పెళ్లి గురించి ఓ నిర్ణ యానికొచ్చేశారని సమాచారం. ఇటీవల ఓ కొత్త దర్శకుడు అనుష్కకు కథ చెప్పడానికి వెళ్లాడట. ‘లింగా’ షూటింగ్ లొకేషన్లో వీరి మీటింగ్ జరిగిందని తెలిసింది. కథ అనుష్కకు విపరీతంగా నచ్చేసిందట. అయినప్పటికీ పచ్చజెండా ఊపలేదని వినికిడి. ‘‘నేను ‘బాహుబలి’ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అందుకని కొత్త సినిమాలేవీ అంగీ కరించే పరిస్థితిలో లేను’’ అని అనుష్క ఆ దర్శకునితో అన్నట్లు భోగట్టా. ‘బాహుబలి’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సో.. వచ్చే ఏడేది అనుష్క పెళ్లి చేసుకుంటారా? ఏమో ఓ ఏడాది ఆగుదాం.. విషయం తెలిసిపోతుంది. -
రంగస్థలంపై రజనీ?
వెండితెరపై రజనీకాంత్ కనిపిస్తే చాలు... అభిమానుల పరవశానికి హద్దుండదు. తెరముందు నిలబడి మంగళహారతులిచ్చేస్తుంటారు. అలా కాకుండా...కళ్ల ముందే స్వయంగా నటిస్తే? ఇక చెప్పేదేముంది! వారి ఉద్వేగాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే సాధ్యమైనంతవరకూ సూపర్‌స్టార్ షూటింగ్‌లు అవుడ్డోర్‌లో పెట్టరు. ఈ కారణంగానే... ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ చూసే అదృష్టం జనానికి అరుదైపోయింది. అయితే... రజనీ తోడల్లుడు, నటుడు, రచయిత అయిన వైజీ మహేంద్రన్ ఆ అదృష్టాన్ని ప్రేక్షకులకు కల్పించే పనిలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కోసం ఆయన ఓ నాటకం రాశారు. దీంట్లో రజనీకాంత్‌ని నటింపజేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు మహేంద్రన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని రోజుల క్రితం రజనీని కలిసినప్పుడు, ‘మీ కోసం ప్రత్యేకంగా ఓ నాటకం రాశా. అందులో మీరు నటించాలి’ అనడిగాను. త్వరలో ఆ విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. నేను అడిగితే రజనీ కాదనరనే నమ్మకం ఉంది. బహుశా ‘లింగా’ తర్వాత నా నాటకంలో నటిస్తారేమో’’ అని చెప్పారు. అంటే... త్వరలోనే రంగస్థలంపై సూపర్‌స్టార్ సూపర్ స్టైల్‌ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉందన్నమాట! -
‘లింగ’ చిత్రీకరణ అనుమతి రద్దు చేయండి
శివమొగ్గ :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపుదిద్దుకుంటున్న లింగ షూటింగ్ వివాదం రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపుతోంది. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. మంగళవారం పర్యావరణ ప్రేమికుల ఒక్కూట ఆధ్వర్యంలో షూటింగ్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని అదనపు కలెక్టర్ నాగరాజ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త నా.డిసౌజా మాట్లాడుతూ... ప్రముఖ జల విద్యుత్కేంద్రమైన లింగనమక్కి వద్ద లింగ షూటింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. లింగనమక్కి డ్యాం సమస్యాత్మక ప్రదేశం కావడంతో పాటు పర్యాటకాన్ని పూర్తిగా నిషేధించారని, అదే విధంగా వీడియోలు, ఫొటోలు తీయడం నిషిద్ధమన్నారు. అలాంటి ప్రదేశంలో షూటింగ్ అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. తక్షణమే ప్రభుత్వం లింగనమక్కి డ్యాం పరిసరాల్లో ఎటువంటి సినిమాలకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని డిసౌజా సలహా ఇచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా నిబంధనలు పాటించాలని ప్రభుతానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఒక్కూట సంఘం నాయకులు పరిసర రమేశ్, డాక్టర్ శేఖర్ గౌళర్, అశోక్ యాదవ్, మహదేవ ప్ప, ఆన ంద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రిలాక్స్‌కావాలి బాసూ
యంత్రంలా పని చేస్తున్న నటి అనుష్కకు రిలాక్స్ కావాలట. తమిళంలో రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో భారీ చారిత్రాత్మక చిత్రాలు బాహుబలి, రుద్రమదేవి చేస్తున్నారు. వీటిలో బాహుబలి, రుద్రమదేవి చిత్రాలకు దాదాపు రెండేళ్లకు పైగా పని చేస్తున్నారు. ఇలాంటి సంచలన చిత్రాల్లో ఒకదానికి తరువాత ఒకటి చేస్తూ, ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నటిస్తూ వస్తున్నారు. అదే విధంగా ఈ చిత్రాల షూటింగ్‌ల కోసం చెన్నై టూ హైదరాబాద్, బెంగుళూర్ తదితర ప్రాంతాలకు గాలిలోనే విహంగ పయనం (విమానయానం) చేయాల్సి వస్తోంది. ఎంతయినా అనుష్క కూడా మనిషే కదా? అందులోనూ మగువ. కాస్త రిలాక్స్ చాలా అవసరం. ఇలాంటి విశ్రాంతి సమయాన్ని కోరుకుంటున్నారు. చిత్రాల ఒత్తిడి వల్ల సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం నటిస్తున్న రజనీకాంత్ లింగా, అజిత్ చిత్రాలతో అనుష్క నటించాల్సిన సన్నివేశాలు దాదాపు పూర్తి అయ్యాయి. అలాగే తెలుగు చిత్రాల షూటింగ్‌లకు చిన్న విరామం దొరకడంతో అమ్మడు రిలాక్స్ కోసం పది రోజులపాటు సినిమా ప్రపంచానికి దూరంగా నచ్చిన ప్రాంతాల్లో స్వేచ్చా విహారానికి రెడీ అవుతున్నారు. విశేషం ఏమిటంటే ఆమె విహార యాత్ర ప్రాంతాలను కూడా వెల్లడించడానికి నో అంటున్నారట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక మొబైల్ కంపెనీకి అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. తన విహార యాత్రను ముగించుకుని వచ్చిన తరువాత ఆ వాణిజ్య ప్రకటన కోసం నటించనున్నారని తెలిసింది. -
‘లింగ’నమక్కి వద్ద సినిమా షూటింగ్ వద్దేవద్దు
చిత్రీకరణకు ఇచ్చిన అనుమతి రద్దు చేయాలని పరిసర ప్రేమికులు డిమాండ్ శివమొగ్గ : ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం వద్ద ‘లింగ’ సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న ఈ జలాశయం వద్ద సినిమా చిత్రీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సరికాదని పరిసర ప్రేమికులు పేర్కొంటున్నారు. చిత్రీకరణకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని శివమొగ్గ నగర పరిసర ప్రేమికుల ఒక్కోట అధ్యక్షుడు పరిసర రమేశ్ ఆదివారం ఇక్కడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కోట్లాదిరూపాయల వ్యయంతో లింగనమక్కిడ్యాం వద్ద ఇప్పటకే సెట్టింగ్‌లు వే శారు.వందలాది మంది కళాకారులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తే ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందనేది చిత్ర నిర్మాణయూనిట్ నిర్వాహకుల భయం. ఈ నేపథ్యంలో ఇక్కడ షూటింగ్‌ను త్వరగా ముగించాలని నిర్ణయించుకున్నారు. సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదు జలాశయం వద్ద సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం సరైంది కాదని పరిసర పోరాటదారుడు పరిసర రమేశ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లింగనమక్కి డ్యాం ప్రదేశం అత్యంత సూక్ష్మమైందని, ఈ డ్యాం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న నేపథ్యంలో వీడియో, ఫొటోల చిత్రీకరణను కూడా నిషేధించారని గుర్తు చేశారు. అయితే సినిమా చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం అవైజ్ఞానికమని పేర్కొన్నారు. సినిమా చిత్రీకరణకు ఇచ్చిన అనుమతులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ ఇక్కడ సినిమాల షూటింగ్‌లు నిర్వహించరాదని డిమాండ్ చేస్తూ ఈనెల 26 తేదీన శివమొగ్గ జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి మనవి పత్రం అందిస్తామని రమేశ్ పేర్కొన్నారు. -
ఇంత చెత్త హోటలా..
తన జీవితంలో ఇంతకు ముందెప్పుడూ బస చేయని చెత్త హోటల్లో లింగా చిత్ర యూనిట్ తనకు రూమ్‌ను కేటాయించిందని బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. కర్ణాటకకు చెందిన రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పస్తుతం కర్ణాటకలో చిత్రీకరణ జరుపుకుంటోంది. నటి సోనాక్షి సిన్హా బాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్నారన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈమె సీనియర్ హిందీ నటుడు శత్రుఘ్నసిన్హా కూతురు. అయితే సోనాక్షి తన బసకు కనీస వసతులు కూడా లేని చెత్త హోటల్‌ను కేటాయించారని చిత్ర యూనిట్‌పై ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇంటర్నెట్లో పేర్కొనడంతో కలకలం రేకెత్తించింది. ఈ విషయం రజనీ దృష్టికి రావడంతో ఆయన దిగ్భ్రాంతి చెందారని సమాచారం. అయితే సోనాక్షి ఫిర్యాదు గురించి లింగా చిత్ర నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ స్పందిస్తూ జోగ్‌ఫాల్స్ సమీపంలో మంచి హోటళ్లు ఎక్కువ లేవన్నారు. ఉన్నవాటిలో మంచి హోటళ్లను ఎంపిక చేసి చిత్ర యూనిట్‌కు బస ఏర్పాటు చేశామని వివరించారు. అయితే సోనాక్షి సిన్హా ఇంటర్నెట్లో ఫిర్యాదు చేసిన విషయం గురించి తనకు తెలియదన్నారు. పలువురు ఈ విషయమై ప్రస్తావించడంతో సోనాక్షిసిన్హా తన ఫిర్యాదును నెట్ నుంచి తొలగించారు. -
ఆరోగ్యంగా ఉన్నా : రజనీకాంత్
అభిమానలు కోరుకున్నంత కాలం, నటుడిగా కొనసాగుతానని రజనీకాంత్ అన్నారు. ఇంతకు ముందు ఈ ఇండియన్ సూపర్ స్టార్ గురించి పలు రకాల వార్తలు ప్రచారమయ్యాయి. రజనీ రాజకీయాల్లోకి రావాలని, వస్తున్నారని, భవిష్యత్ రాజకీయాలకు కేంద్ర బిందువు ఆయనేనంటూ ప్రచారాలు విస్తృతంగా సాగారుు. రాజకీయ రంగ ప్రవేశంపై ఒక దశలో రజనీకి ఆయన అభిమానుల ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం రజనీకాంత్ ప్రస్తుతం లింగా చిత్ర షూటింగ్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం ఒకటి. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అందాల భామ అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఇటీవల రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారని, తూలి కింద పడిపోయారనే వదంతులు ఆయన అభిమానులకు తీవ్ర కలవరం కలిగించాయి. వారి కలతను తీర్చే విధంగా రజనీ గురువారం తన ఆరోగ్యం గురించి, తాను నటిస్తున్న లింగా చిత్రం గురించి వెల్లడించారు. లింగా చిత్ర షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. షూటింగ్లో పాల్గొనడానికి రజనీ గురువారం వేకువజామున చెన్నైలో విమానం ఎక్కి మంగళూరు విమానాశ్రయూనికి చేరుకున్నారు. ఆయనని చూసిన అక్కడ పని చేసేవారు తమ స్నేహితులు, సన్నిహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో 20 నిమిషాల్లోనే ఆ ప్రాంతం వందలాది అభిమానులతో కిటకిటలాడింది. రజనీ దరిచేరాలని, ఆయనతో ఫొటోలు దిగాలని అభిమానులు ప్రయత్నించారు. అయితే విమానాశ్రయ అధికారులు, రజనీ రక్షణ వలయం వారిని నిలువరించింది. అనంతరం రజనీ విలేకరులతో ముచ్చటిస్తూ కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో చాలా నీరసించానన్నారు. భగవంతుని దయవల్ల, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనా ఫలం కారణంగా తనకు పునర్జన్మ కలిగిందన్నారు. ప్రస్తుతం తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. ఎలాంటి సమస్యలేదని యథాతథంగా షూటింగ్లో పాల్గొంటున్నానని చెప్పారు. లింగా షూటింగ్ కోసం మంగుళూర్ దాని పరిసర కొండ ప్రాంతాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. మంగుళూర్ చాలా సుందరమైన నగరంగా పేర్కొన్నారు. ఇక్కడ 50 రోజుల వరకు బస చేసి లింగా షూటింగ్లో పాల్గొంటానన్నారు. తన అభిమానులు కోరుకున్నంత వరకు నటిస్తానని చెప్పారు. లింగా చిత్రం అభిమానులకు తన పుట్టిన రోజు కానుకగా ఉంటుందని రజనీ వెల్లడించారు. -
నా విజయ రహస్యం ఇదే
విజయం అంతస్తు, గౌరవ మర్యాదలతోపాటు ఆనందాన్ని, అందాన్ని పెంచుతుంది. అందుకే అలాంటి విజయం కోసం పోరాటం. ఈ నిరంతర పోరులో విజయం సాధించిన నటి అనుష్క. తమిళం, తెలుగు భాషల్లో మేటి నటిగా వెలిగిపోతున్న ఈ బ్యూటీ విజయాల బాట వేసిన చిత్రం అరుంధతి అన్నది తెలిసిన విషయమే. ఆ తరువాత వేట్టైక్కారన్, సింగం, సింగం-2 అంటూ తమిళంలో విజయాలను చవిచూశారు. ప్రస్తుంత రజనీకాంత్ సరసన లింగా, అజిత్‌కు జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతోపాటు తెలుగులో చారిత్రాత్మక చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు. నటిగా దశాబ్దం దాటినా విజయపథంలో సాగుతున్న అనుష్క తన సక్సెస్ సీక్రెట్ గురించి వివరిస్తూ తన చిత్రాలు విజయవంతంగా ఆడుతున్నాయని, ఇది సంతోషకరమైన విషయమన్నారు. తన చిత్రాల విజయం కోసం తాను పాటించే మూడు అంశాలు ముఖ్యమయినవన్నారు. వాటిలో ప్రధానమైనది కథ అన్నారు. మంచి కథాంశం ఉన్న చిత్రాలను మాత్రమే అంగీకరిస్తున్నట్లు తెలిపారు. రెండో అంశం కథనం బాగా వచ్చిందా అన్న విషయం గురించి చూస్తానన్నారు. ఇక మూడో అంశం దర్శకుడు ప్రతిభావంతుడా, కాదా అన్న విషయాన్ని ధృడపరచుకుంటానన్నారు. ఈ అంశాలే తన విజయానికి ప్రధాన అంశాలని అనుష్క వివరించారు. మరో విషయం ఏమిటంటే హీరోయిన్లకు అందం చాలా అవసరం అన్నారు. శరీరాకృతికి కట్టుబాట్లు ఉంచుకోవాలని తెలిపారు. శారీరక అందంతోపాటు మానసిక అందం కూడా అవసరమని చెప్పారు. ఇందుకు శారీరక వ్యాయామం ఎంతో తోడ్పడుతుందని అనుష్క పేర్కొన్నారు. -
శంకర్ మనసు రోబో 2 వైపు మళ్లింది!
-
రన్నింగ్ రైల్లో రజనీ ఫైట్
రన్నింగ్ రైల్లో రజనీకాంత్ అదిరే ఫైట్ చేశారట. ఈ విషయం లింగా చిత్ర యూనిట్ చెబుతోంది. రన్నింగ్ రైల్లో ఫైట్స్ అనేది రజనీ చిత్రాలకు హిట్ సెంటిమెంట్ అని చెప్పవచ్చు. 1980లలో రజనీకాంత్ నటించిన మురట్టుకాళై, అన్బుక్కు నాన్ అడిమై చిత్రాల్లో ట్రైన్ ఫైట్స్ ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. అలాగే 2010లో నటించిన ఎంది రన్ చిత్రంలో రజనీ రైల్లో పోరాడే దృశ్యాలు అలరించాయి. ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా కోచ్చడయాన్ వంటి ప్రయోగాత్మక చిత్రం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రం లింగా. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు ప్రతినాయకులుగా దేవ్‌సింగ్, టాలీ వుడ్ నటుడు జగపతిబాబుతోపాటు హాలీవుడ్ నటుడొకరు నటిస్తున్నారు. ఈ చిత్రంలో చోటు చేసుకున్న రన్నింగ్ రైలు పోరాట దృశ్యాల్ని ఇటీవల చిత్రీకరించారు. ఈ పోరాట సన్నివేశం లింగా చిత్రంలో ప్రత్యేకతను సంతరించుకుంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు కాల ఘట్టాల్లో జరిగే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్ మైసూరులో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్‌ను ప్రస్తుతం హైదరాబాద్ భారీ సెట్లో జరుగుతోంది. లింగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
సోనాక్షితో నటించడం ఇబ్బందిగా ఉందన్న రజనీకాంత్
‘ఒక హీరోను ఇంతగా అభిమానిస్తారా? ఇంతగా ఆరాధిస్తారా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సోనాక్షీ సిన్హా. ప్రస్తుతం రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లొకేషన్లకు అభిమానులు పోటెత్తుతున్న తీరు చూసి సోనాక్షి పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా వెలిబుచ్చారు. ‘‘దక్షిణాదిన సినిమా తారలను దేవుళ్లతో సమానంగా అరాధిస్తారని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిజంగా రజనీ సార్ పాపులారిటీ సాధారణమైనది కాదు. ‘సూపర్‌స్టార్’ అనే బిరుదుకు ఆయనే అలంకారం. ఇంత స్టార్డమ్ ఉండి కూడా ఆయన అంత నిరాడంబరంగా ఎలా ఉండగలుతున్నారో అర్థం కాదు. ఈ సినిమాతో నేను రజనీ అభిమాని అయిపోయాను. ఓ రోజు లొకేషన్లో...‘మీతో నటించడానికి ముందు కాస్త తడబడ్డాను. కానీ... ఇప్పుడు ఓ గొప్ప అనుభూతిని పొందుతున్నాను’ అన్నాను. దానికి ఆయన... ‘‘నాకు మాత్రం నీతో నటించడం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే... నువ్వు నా మిత్రుని కూతురువి. అంటే నాకూ కూతురు లాంటి దానివే. అందుకే’ అని బదులిచ్చారు’’ అని సోనాక్షీ సిన్హా వివరించారు. -
లింగాలో మరో ముద్దుగుమ్మ
-
సూపర్ స్టార్‌తో సినిమా నా అదృష్టం
విదేశీ భామలు భారతీయ చిత్రాల్లో నటించడం కొత్త కాదు. అయితే, ఎక్కువ శాతం నృత్యగీతాల్లో కనిపిస్తుంటారు. ఎమీ జాక్సన్ వంటి ఏ కొందరో కథానాయికలుగా కూడా ఇక్కడ రాణిస్తుంటారు. ఇప్పుడు మరో విదేశీ భామ మన భారతీయ చిత్రంలో మెరవనున్నారు. అది కూడా తొలి చిత్రంతోనే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ విదేశీ అందం పేరు ‘లారెన్ జె ఇర్విన్’. రజనీ సరసన ‘లింగా’లో నటిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో నటిగా, గాయనిగా, నృత్యకారిణిగా చేశానని, రజనీ సరసన నటించడం తన అదృష్టమని లారెన్ తెలిపారు. కొంచెం కొంచెం తమిళ్ నేర్చుకుంటున్నానని ముద్దు ముద్దుగా అన్నారు. ఇదిలా ఉంటే.. ‘లింగా’లో ఇప్పటికే అనుష్క, సోనాక్షీ సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో లారెన్ పాత్ర వస్తుందని సమాచారం. రజనీ కాంబినేషన్లో లారెన్ తొలి సన్నివేశం చేసినప్పుడు, ‘బాగా నటించావు’ అని ఆయన అభినందించారట. ఆ విషయాన్ని తెగ ఆనందపడిపోతూ చెప్పారు లారెన్. -
రక్షణగా 50 మంది పోలీసులు... 30 మంది బౌన్సర్లు!
ఇటీవల ఓ ప్రముఖ బాలీవుడ్ చానల్లో ప్రసారమైన ఓ కథనం... బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా ఇమేజ్‌ని అమాంతం పెంచేసింది. రజనీకాంత్ ‘లింగా’ చిత్రంలో సోనాక్షి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ అందాలభామ షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో ఆ పరిసరాల్లో రక్షణ కవచంలా టైట్ సెక్యూరిటీని చిత్రం యూనిట్ ఏర్పాటు చేసిందని, యూనిట్ విజ్ఞప్తి మేరకు యాభై మంది పోలీసులు ఈ షూటింగ్ పరిసరాలను పహారా కాస్తున్నారని, అంతేకాక 30 మంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారని ఆ కథనం సారాంశం. ఇప్పటివరకూ దక్షిణాదిన చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు నటించారు కానీ, ఎవరికీ ఇవ్వనంత సెక్యూరిటీని సోనాక్షికే ఇచ్చారంటే... ఆమె ఇమేజ్‌ని ఎలా అంచనా వేయాలి? అని బాలీవుడ్లో అందరూ అనుకుంటున్నారట. అయితే... ఈ కథనాన్ని సోనాక్షి తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘సెక్యూరిటీ ఏర్పాటు చేసిన మాట నిజం. కానీ అది నా కోసం అనుకోవడం అమాయకత్వం. అక్కడ లొకేషన్లో ఉంది సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆ మాటను మరిచిపోతే ఎలా’’ అని అసలు విషయాన్ని బయటపెట్టారు సోనాక్షి. ఈ కథనం గురించే ‘లింగా’ ప్రొడక్షన్ మేనేజర్ సురేశ్ కుమారస్వామి మాట్లాడుతూ -‘‘లొకేషన్లో సూపర్‌స్టార్ ఉన్నారని తెలిస్తే... తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీస్ సెక్యూరిటీ సహాయం తీసుకుంటాం. ఇది సూపర్‌స్టార్ ప్రతి సినిమాకూ జరిగే తంతే. అయితే... ఈ దఫా రజనీ సార్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్ కూడా తోడయ్యారు. అందుకే ఈ హంగామా’’ అన్నారు. -
'ఆ' వివాదమే రజనీ సినిమా కథా వస్తువా!
-
రజనీ చిత్రం ప్రారంభోత్సవం
రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రం పూజా కార్యక్రమం మైసూరు చాంముండేశ్వరి ఆలయంలో శుక్రవారం జరిగింది. రజనీ యానిమేషన్ చిత్రం అయిన కోచ్చడయాన్ ఈ నెల తొమ్మిదో తేదీ విడుదల కానుంది. ఆరు భాషల్లో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మరో చిత్రంలో కొత్త గెటప్‌లో రజనీ నటిస్తున్నారు. ఈ చిత్రానికి లింగా అనే పేరును పెట్టారు. రజనీ పరమ శివ భక్తుడు. ఇది వరకే అన్నామలై, అరుణాచలం అనే శివుని పేర్లతో తీసిన చిత్రాల్లో నటించారు. ఇవన్నీ విజయం సాధించారుు. ప్రస్తుతం కొత్త చిత్రానికి లింగా అనే పేరును సూచించడం ఆయనకు ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రం షూటింగ్ మైసూర్లో 45 రోజుల పాటు జరగనుంది. ఇందు కోసం అక్కడ సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం రజనీ, లింగా చిత్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మైసూర్లో గల చాముండేశ్వరి ఆలయానికి వెళ్లారు. రజనీ ఈ చిత్రం కోసం ప్రత్యేక గెటప్‌లో అక్కడికి చేరుకున్నారు. రజనీ స్నేహితుడైన కన్నడ నటుడు అంబరీశ్, ఆయన సతీమణి నటి సుమలత అక్కడికి వచ్చారు. చాముండేశ్వరి అమ్మవారి ముందు క్లిప్పింగ్ బోర్డు, స్క్రీన్ ప్లే పుస్తకాన్ని ఉంచి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రజనీకి డెరైక్టర్ కె.ఎస్.రవికుమార్‌కు అంబరీశ్ పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో రజనీ కాంత్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలిసింది. లింగా చిత్రంలో హీరోయిన్లుగా అనుష్క, సోనాక్షి సిన్హాలు ఎంపికైన విషయం తెలిసిందే. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్.రత్నవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు.