రంగస్థలంపై రజనీ? | Rajinikanth at YG Mahendran Drama Festival | Sakshi
Sakshi News home page

రంగస్థలంపై రజనీ?

Published Mon, Sep 15 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

రంగస్థలంపై రజనీ?

రంగస్థలంపై రజనీ?

 వెండితెరపై రజనీకాంత్ కనిపిస్తే చాలు...  అభిమానుల పరవశానికి హద్దుండదు. తెరముందు నిలబడి మంగళహారతులిచ్చేస్తుంటారు. అలా కాకుండా...కళ్ల ముందే స్వయంగా నటిస్తే? ఇక చెప్పేదేముంది! వారి ఉద్వేగాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే సాధ్యమైనంతవరకూ సూపర్‌స్టార్ షూటింగ్‌లు అవుడ్డోర్‌లో పెట్టరు. ఈ కారణంగానే... ఆయన లైవ్ పెర్‌ఫార్మెన్స్ చూసే అదృష్టం జనానికి అరుదైపోయింది. అయితే... రజనీ తోడల్లుడు, నటుడు, రచయిత అయిన వైజీ మహేంద్రన్ ఆ అదృష్టాన్ని ప్రేక్షకులకు కల్పించే పనిలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కోసం ఆయన ఓ నాటకం రాశారు.
 
  దీంట్లో రజనీకాంత్‌ని నటింపజేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు మహేంద్రన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని రోజుల క్రితం రజనీని కలిసినప్పుడు, ‘మీ కోసం ప్రత్యేకంగా ఓ నాటకం రాశా. అందులో మీరు నటించాలి’ అనడిగాను. త్వరలో ఆ విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. నేను అడిగితే రజనీ కాదనరనే నమ్మకం ఉంది. బహుశా ‘లింగా’ తర్వాత నా నాటకంలో నటిస్తారేమో’’ అని చెప్పారు. అంటే... త్వరలోనే రంగస్థలంపై సూపర్‌స్టార్ సూపర్ స్టైల్‌ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉందన్నమాట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement