YG Mahendran
-
సెలవులు వస్తాయనీ అమ్మాయిలకు సైట్ కొట్టవచ్చని..
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి వార్తల్లోకొచ్చారు. ఈమె మీటూ వ్యవహారంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తు, సీనియర్ నటుడు రాధారవి వంటి వారిపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో సీనియర్ నటుడు వైజీ.మహేంద్రన్‌పై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై భిన్న స్వరాలు వినిపిస్తున్న విషయం, ప్రతి ప్రతి పక్ష పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు వైజీ.మహేంద్రన్ ఆదివారం చెన్నైలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువత గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోరాట కార్యక్రమాల్లో విద్యార్ధులు కళాశాలలకు సెలవులు వస్తాయనీ, ఆందోళన కార్యక్రమంలో అరెస్ట్ అయ్యి వ్యానులో కూర్చుని అమ్మాయిలకు సైట్ కొట్టవచ్చని పాల్గొంటున్నారనీ వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా వైజీ.మహేంద్రన్ వ్యాఖ్యలపై గాయనీ చిన్మయి స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ వైజీ.మహేంద్రన్ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాలసిన అవసరం లేదని అన్నారు. వారు అంతేననీ, మారరనీ చిన్మయి పేర్కొన్నారు. -
రంగస్థలంపై రజనీ?
వెండితెరపై రజనీకాంత్ కనిపిస్తే చాలు... అభిమానుల పరవశానికి హద్దుండదు. తెరముందు నిలబడి మంగళహారతులిచ్చేస్తుంటారు. అలా కాకుండా...కళ్ల ముందే స్వయంగా నటిస్తే? ఇక చెప్పేదేముంది! వారి ఉద్వేగాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే సాధ్యమైనంతవరకూ సూపర్‌స్టార్ షూటింగ్‌లు అవుడ్డోర్‌లో పెట్టరు. ఈ కారణంగానే... ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ చూసే అదృష్టం జనానికి అరుదైపోయింది. అయితే... రజనీ తోడల్లుడు, నటుడు, రచయిత అయిన వైజీ మహేంద్రన్ ఆ అదృష్టాన్ని ప్రేక్షకులకు కల్పించే పనిలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కోసం ఆయన ఓ నాటకం రాశారు. దీంట్లో రజనీకాంత్‌ని నటింపజేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు మహేంద్రన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని రోజుల క్రితం రజనీని కలిసినప్పుడు, ‘మీ కోసం ప్రత్యేకంగా ఓ నాటకం రాశా. అందులో మీరు నటించాలి’ అనడిగాను. త్వరలో ఆ విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. నేను అడిగితే రజనీ కాదనరనే నమ్మకం ఉంది. బహుశా ‘లింగా’ తర్వాత నా నాటకంలో నటిస్తారేమో’’ అని చెప్పారు. అంటే... త్వరలోనే రంగస్థలంపై సూపర్‌స్టార్ సూపర్ స్టైల్‌ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉందన్నమాట! -
నాటకమే జీవితం..
‘రంగస్థలంపై 53 ఏళ్ల అనుభవం నాది. దాదాపు ఎనిమిదివేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటా. ఆత్మతృప్తి కోసం నాటకాన్ని ఇష్టపడతా. భుక్తికోసం సినీ, టీవీ రంగాలపై ఆధారపడక తప్పడం లేదు’ అని తమిళ సినీ, రంగస్థల నటుడు వైజీ మహేంద్రన్ అన్నారు. గవర్నర్ నరసింహన్ తనకు పెద్ద అభిమాని అని, తన డ్రామాలన్నింటినీ సతీసమేతంగా వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తారని చెప్పారు. తమిళంలో శివాజీ గణేశన్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తన అభిమాన నటులని చెప్పారు. మద్రాసు తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే నగరం హైదరాబాదేనని చెప్పారు. భాగ్యనగరంతో తనకు గల అనుబంధంపై మహేంద్రన్ ‘సిటీ ప్లస్’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే... హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం.. హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం నాది. హైదరాబాద్ తర్వాత ఇప్పుడిప్పుడే వైజాగ్‌ను ఇష్టపడుతున్నా. ‘సీతారాముల సినిమాగోల’ టీవీ సీరియల్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. కుటుంబ సభ్యులు మొత్తం కలసి ఆహ్లాదకరంగా పగలబడి నవ్వుతూ నా నాటకాలు చూడాలనేదే నా ఆశయం. అయితే, నాటకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. స్పాన్సర్ల సౌజన్యంతోనే ప్రదర్శనలు చేస్తున్నాం. తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలానుబంధం తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలంతో అనుబంధం ఉంది. ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉన్నట్లు లేదు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు నలభై, వైజాగ్‌లో పది ప్రదర్శనలు చేశాను. తొలిసారిగా 1971లో ‘నవగ్రహం’ సినిమాలో నటించా. హిందీ, తెలుగు, తమిళం, మలయాళాలలో దాదాపు 300 సినిమాల్లో నటించా. ఇటీవల తమిళంలో నిర్మించిన రామానుజన్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్లోనూ నటించా. నేను నటించిన వాటిలో ‘రగస్యం... పరమరగస్యం’ నాటకం బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఆ నాటకాన్ని 700 సార్లు ప్రదర్శించా. ఇప్పటికీ అందులో కాలేజీ స్టూడెంట్ వేషం నేనే వేస్తా. నటవారసత్వం మా నాన్న వైజీ పార్థసారథి దక్షిణాదిలోనే గొప్ప రంగస్థల నటుడు. నాన్న నుంచే నాకు నట వారసత్వం వచ్చింది. ఆయన స్థాపించిన యునెటైడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (యూఏఏ) సంస్థ ద్వారానే ఎదిగాను. తమిళనాడు సీఎం జయలలిత కూడా అప్పట్లో యూఏఏ సభ్యురాలే. నాటక రంగానికి చావు లేదు నాటక రంగానికి చావు లేదు. నెలకు యాభై సిని మాలు వస్తున్నాయి. అందులో నిలిచేవి రెండు మూడే. నాటకాలకు మాత్రం ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. శ్రీలంక, బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, హాంకాం గ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, డెన్మా ర్క్, స్వీడన్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో నాటకాలు వేశాను. రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్కసారైనా..వందల సినిమాలు, వేల డ్రామాల్లో నటించాను కానీ రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్క సినిమాలోనైనా నటించాలని నా ఆశ. ..:: కోన సుధాకర్‌రెడ్డి