నాటకమే జీవితం.. | life is acting.. | Sakshi
Sakshi News home page

నాటకమే జీవితం..

Published Mon, Jul 14 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

నాటకమే జీవితం..

నాటకమే జీవితం..

‘రంగస్థలంపై 53 ఏళ్ల అనుభవం నాది. దాదాపు ఎనిమిదివేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటా. ఆత్మతృప్తి కోసం నాటకాన్ని ఇష్టపడతా. భుక్తికోసం సినీ, టీవీ రంగాలపై ఆధారపడక తప్పడం లేదు’ అని తమిళ సినీ, రంగస్థల నటుడు వైజీ మహేంద్రన్ అన్నారు. గవర్నర్ నరసింహన్ తనకు పెద్ద అభిమాని అని, తన డ్రామాలన్నింటినీ సతీసమేతంగా వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తారని చెప్పారు. తమిళంలో శివాజీ గణేశన్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తన అభిమాన నటులని చెప్పారు. మద్రాసు తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే నగరం హైదరాబాదేనని చెప్పారు. భాగ్యనగరంతో తనకు గల అనుబంధంపై మహేంద్రన్ ‘సిటీ ప్లస్’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే...
 
హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం..
హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం నాది. హైదరాబాద్ తర్వాత ఇప్పుడిప్పుడే వైజాగ్‌ను ఇష్టపడుతున్నా. ‘సీతారాముల సినిమాగోల’ టీవీ సీరియల్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. కుటుంబ సభ్యులు మొత్తం కలసి ఆహ్లాదకరంగా పగలబడి నవ్వుతూ నా నాటకాలు చూడాలనేదే నా ఆశయం. అయితే, నాటకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. స్పాన్సర్ల సౌజన్యంతోనే ప్రదర్శనలు చేస్తున్నాం.
 
తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలానుబంధం
తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలంతో అనుబంధం ఉంది. ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉన్నట్లు లేదు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు నలభై, వైజాగ్‌లో పది ప్రదర్శనలు చేశాను. తొలిసారిగా 1971లో ‘నవగ్రహం’ సినిమాలో నటించా. హిందీ, తెలుగు, తమిళం, మలయాళాలలో దాదాపు 300 సినిమాల్లో నటించా. ఇటీవల తమిళంలో నిర్మించిన రామానుజన్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్‌లోనూ నటించా. నేను నటించిన వాటిలో ‘రగస్యం... పరమరగస్యం’ నాటకం బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఆ నాటకాన్ని 700 సార్లు ప్రదర్శించా. ఇప్పటికీ అందులో కాలేజీ స్టూడెంట్ వేషం
 
నేనే వేస్తా. నటవారసత్వం
మా నాన్న వైజీ పార్థసారథి దక్షిణాదిలోనే గొప్ప రంగస్థల నటుడు. నాన్న నుంచే నాకు నట వారసత్వం వచ్చింది. ఆయన స్థాపించిన యునెటైడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (యూఏఏ) సంస్థ ద్వారానే ఎదిగాను. తమిళనాడు సీఎం జయలలిత కూడా అప్పట్లో యూఏఏ సభ్యురాలే.
 
నాటక రంగానికి చావు లేదు
నాటక రంగానికి చావు లేదు. నెలకు యాభై సిని మాలు వస్తున్నాయి. అందులో నిలిచేవి రెండు మూడే. నాటకాలకు మాత్రం ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. శ్రీలంక, బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, హాంకాం గ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, డెన్‌మా ర్క్, స్వీడన్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో నాటకాలు వేశాను. రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్కసారైనా..వందల సినిమాలు, వేల డ్రామాల్లో నటించాను కానీ రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్క సినిమాలోనైనా నటించాలని నా ఆశ.     
     ..:: కోన సుధాకర్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement