Tamil film
-
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్‌లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
టాలీవుడ్ పై దుల్కర్ డామినేషన్
-
Vaazhai Movie Review: ఈ అరటిపండు చాలా చేదు!!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘వాళై’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం తినే అరటిపండు నోటికి ఎంత తియ్యగా ఉంటుందో, అది మన నోటి దాకా రావడానికి ఎన్ని జీవితాలను చేదు చేస్తుందో చెప్పిన చిత్రం ‘వాళై’. ఈ సినిమా మాతృక తమిళమైనా తెలుగులో డబ్ అయి హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. 1999 ఫిబ్రవరి 22న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీ వాయుగుండం ప్రాంత పరిధిలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో బతికి బయటపడ్డ వ్యక్తి అందించిన సమాచార రూపమే ఈ ‘వాళై’ సినిమా. ఈ విషయాన్ని సవివరంగా దర్శకుడు సినిమా ఆఖర్లో చెప్పారు. ఈ సినిమాకి మారీ సెల్వరాజ్ దర్శకుడు. ప్రముఖ వర్ధమాన తమిళ నటులు కలైరాసన్, నిఖిలా విమల్ ఈ సినిమా ముఖ్య తారాగణం. ఇక కథాంశానికొస్తే... శివానందన్, శేఖర్ మంచి స్నేహితులు. బాగా పేద కుటుంబం నుండి వచ్చిన పిల్లలు. ఇద్దరూ ప్రభుత్వ బడిలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉంటారు. వారమంతా బడికి వెళ్ళి వారాంతంలో ఓ రూపాయి సంపాదించడం కోసం అరటి గెలలు కోసే పనికి ఊరితో పాటు వెళుతూ ఉంటారు. శివానందన్ చదువులో మంచి తెలివిగలవాడు, ఈ అరటిపండ్లు కోసే పని అస్సలు నచ్చదు తనకు. క్లాసులో సైన్సు పాఠాలు చెప్పే పూంగొడి టీచర్ అంటే శివానందన్‌కు చాలా ఇష్టం. ఇక అరటిపండ్లు కోయడానికి ఆ ఊరి తరఫున ఖని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తుంటాడు. అరటి గెలల వ్యాపారికి, ఊరికి మధ్యలో బ్రోకర్‌గా ముత్తురాజ్ వ్యవహరిస్తుంటాడు. ముత్తురాజ్‌కు, ఖనికి కూలీ డబ్బుల మధ్య వైరం ఏర్పడి ఖని మీద ముత్తురాజ్ ద్వేషం పెంచుకుంటాడు. ఓ రోజు శివానందన్ అరటి గెలల పని నుండి తప్పించుకొని ఆకలితో ఓ అరటి తోటలోకి వెళ్ళి అరటిపండ్లు తినబోతాడు. అంతే... ఆ తోట యజమాని శివానందన్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టగా స్పృహ తప్పి ఓ కొలనులో పడిపోతాడు. తను లేచి కళ్ళు తెరిచేసరికి ఊరంతా ఏడుస్తుంటుంది. శివానందన్ తల్లితో పాటు అక్క, తోటి స్నేహితుడు శేఖర్, ఖనితోపాటు దాదాపు 19మంది ఊరువాళ్ళు చనిపోయి పడి ఉంటారు. అసలు వీళ్ళంతా ఎలా చనిపోయారు? ఆ తరువాత శివానందన్ పరిస్థితి ఏంటి అన్నది ‘వాళై’ సినిమాలోనే చూడాలి. రోజు వారీ కూలీ చేసుకుని బతికే జీవితాలు ఎలా ఉంటాయన్న స్థితిగతులను ఎంతో హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు. ఈ సినిమాని మనం తెర మీద చూస్తున్నట్టుండదు... జీవితాలను చూస్తున్న ఫీల్ కలుగుతుంది. సినిమాలో కొంచెం ల్యాగ్ ఉన్నా మనసుకు హత్తుకుంటుంది. తినే పండు మనకు తియ్యగా ఉన్నా ఆ పండు మన దాకా రావడానికి ఎంతమంది జీవితాలను చేదు చేసిందో అని చెప్పేదే ఈ ‘వాళై’ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
"సాలా" సినిమాకు అల్లు అర్జున్ బెస్ట్ విషెస్
ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ "సాలా". ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 23న) రిలీజ్ అయింది. ఈ క్రమంలో హీరో ధీరన్, హీరోయిన్ రేష్మ వెంకటేష్, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, డైరెక్టర్ ఎస్ డీ మణిపాల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మీట్ అయ్యారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సాలా సినిమాకు బెస్ట్ విషెస్ అందించారు. తన మిత్రుడు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు సాలా సినిమా కోలీవుడ్‌లో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అల్లు అర్జున్ కోరారు. సాలా సినిమాను రాయపురంలోని ఫేమస్ పార్వతీ బార్ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఎస్ డీ మణిపాల్ రూపొందించారు. Icon Star #AlluArjun met and greeted the Team #Saala for the Big Success 💐#SaalaFromTomorrow #AWarForABarIn Cinemas Aug 23 rd 🥁@alluarjun @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @ManipaulSd @dheeran_offl_ @Reshmavenkat01 @ravindranathDP @Theeson_Music @dir_buvan… pic.twitter.com/axwDR2CPbw— Nikil Murukan (@onlynikil) August 22, 2024 -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్‌లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్‌కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్‌లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
టార్గెట్ ధనుష్..తమిళ ఇండస్ట్రీలో సంచలనం
-
ఓటీటీకి వచ్చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'. ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన రసవతి ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా (తమిళం), సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసమే సింప్లీసౌత్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు రసవతి పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ తమ పాత్రల్లో మెప్పించారు.ఈ చిత్రం కొడైకెనాల్ నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఇందులో నిఖిలా శంకర్, దీప, అరుల్ జోతి, రిషికాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్, జిఎమ్ సుందర్, రేష్మా వెంకటేష్, సుజిత్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Rasavathi will be streaming on Amazon prime, Aha and simply south ( in simply south excluding India) from June 21st. #Rasavathi @iam_arjundas @actortanya @Reshmavenkat01 @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz @SureshChandraa… pic.twitter.com/f5ElM8y7O0— Santhakumar (@Santhakumar_Dir) June 19, 2024 -
యాచకుడిగా మారిన హీరో..
కొన్ని చిత్రాల టైటిల్స్ ప్రారంభంలోనే హైప్ తీసుకొస్తాయి. బ్లడీ బెగ్గర్ టైటిల్ కూడా అదే కోవలోకి వస్తుంది. కోలమావు కోకిల, డాన్, బీస్ట్, జైలర్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మూవీతో నిర్మాతగా మారుతున్నారు. ఫిలమెంట్ ఫిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తన శిష్యులును, ఇతర ప్రతిభావంతులైన నూతన దర్శకులను ప్రోత్సహించనున్నారు. బ్లడీ బెగ్గర్వారితో కలిసి మంచి కథా చిత్రాలను నిర్మించనున్నట్లు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో భాగంగా తొలి ప్రయత్నంగా బ్లడీ బెగ్గర్ అనే చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో కవిన్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం ద్వారా నెల్సన్ వద్ద చాలా కాలంగా పని చేస్తున్న శివబాలన్ ముత్తుకుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. బిచ్చగాడి గెటప్‌లో ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు నెల్సన్, నటుడు రెడిన్ కింగ్స్లీ, కవిన్, శివబాలన్లు నటించిన ఓ ఫన్నీ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే బ్లడీ బెగ్గర్ పేరుతో కవిన్ బిచ్చగాడి గెటప్‌లో ఉన్న పోస్టర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే కవిన్ హీరోగా నటించిన స్టార్ మూవీ తమిళనాట నేడే (మే 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: నేరుగా ఓటీటీకి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే? -
మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించే స్టోరీ.. ఓటీటీలో చూసేయండి..
నలుగురమ్మాయిలు పడ్డ కష్టాలు.. వాటి నుంచి బయటపడేందుకు చేసిన పోరాటమే కన్నగి కథ! అమ్ము అభిరామి, విద్య ప్రదీప్, షాలిని జోయ, కీర్తి పాండియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ తమిళ సినిమాకు యశ్వంత్ కిషోర్ దర్శకత్వం వహించారు. ఆ నాలుగు పాత్రలు.. మాకే ఎందుకిన్ని కష్టాలు అనిపించేలా ఉంటాయి. స్కైమూన్ ఎంటర్టైన్మెంట్, ఈ5 ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ గణేశ్, ధనుష్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రమే వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో చడీచప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అప్పుడు తమిళ వర్షన్ మాత్రమే రిలీజైంది. తాజాగా హిందీ, తెలుగు వర్షన్‌ను ప్రైమ్‌లో అందుబాటులోకి తెచ్చారు. సినిమా రిలీజైన రెండున్నర నెలల తర్వాత తెలుగు వర్షన్ తీసుకురావడం విశేషం. #atmsuggestions #Kannagi pic.twitter.com/LqE8jTkYbm — Addicted To Memes (@Addictedtomemez) March 3, 2024 చదవండి: సడన్‌గా భార్యకు సీమంతం చేసిన భర్త.. కన్నీళ్లు పెట్టుకున్న నటి -
అప్పుడు ఐటం సాంగ్‌తో అదరగొట్టింది.. ఇప్పుడు హీరోయిన్గా
హాస్యనటుడు సతీష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విత్తైక్కారన్. వైట్ కార్పెట్ ఫిలిమ్స్ పతాకంపై కె.విజయ్ పాండి నిర్మించిన ఈ చిత్రం ద్వారా వెంకీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సిమ్రాన్ గుప్తా హీరోయిన్గా నటించారు. ఈమె మంచి డాన్సర్, మోడల్ కూడా! 2014లో డీడీ నేషనల్ టీవీ నిర్వాహకులు నిర్వహించిన డాన్స్ పోటీల్లో సిమ్రాన్ గుప్తా టైటిల్ విన్నర్ కావడం గమనార్హం. ఆ తరువాత మోడలింగ్‌లో రాణించిన ఈమె తెలుగులో అన్వేషి అనే చిత్రంలో నాయకిగా నటించారు. అదేవిధంగా హిందీలోనూ జహాన్ చార్ యార్ అనే చిత్రంలో నటించారు. తమిళంలో హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్ చిత్రంలో సిండాక్కారన్ అనే ఐటెం సాంగ్‌లో ఆయనతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా విత్తైక్కారన్ చిత్రంతో మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. కాగా ఇంతకుముందు సిమ్రాన్ తన నటనతో తమిళం, తెలుగు భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. మరి ఈసారి సిమ్రాన్ గుప్తాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సి ఉంది. విత్తైకారన్ సినిమా వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే కామెడీ కథా చిత్రమని చెప్పారు. ఇందులో నటుడు ఆనంద్‌రాజ్, మధుసూదనరావు, దర్శకుడు సుబ్రమణ్య శివ, జాన్ విజయ్, ఆసిఫ్ అలీ, శ్యామ్స్ స్వామినాథన్ ముఖ్యపాత్రలు పోషించినట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: 25వ పెళ్లి రోజు.. వారితో కలిసి సెలబ్రేషన్స్.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గొడవలు.. -
నిండు గర్భిణిగా కనిపించనున్న నా సామిరంగ బ్యూటీ!
హీరోయిన్లకు బలమైన పాత్రలు అరుదుగానే లభిస్తుంటాయి. అలా జైలర్ చిత్రం ఫేమ్ మీర్నా మీనన్‌కు బర్త్‌మార్క్ అనే లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించే అవకాశం లభించింది. విక్రమ్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన, నిర్మాత బాధ్యతలను శ్రీరామ్ శివరామన్, విక్రమ్ శ్రీధరన్ నిర్వహిస్తున్నారు. సబీర్ కల్ల రక్కల్, ఇంద్రజిత్, ఫోర్కొడి, బి ఆర్ వరలక్ష్మి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని, ఉదయ్ తంగవేలు చాయాగ్రహణం అందిస్తున్నారు. డైరెక్టర్ ఈ సినిమా విశేషాలను గురించి తెలుపుతూ.. ఇది జెనీ అనే యువతి చుట్టూ తిరిగే కథా చిత్రమని చెప్పారు. ఇందులో ఏడు నెలల గర్భిణి పాత్రలో మిర్నా అద్భుతంగా నటించారన్నారు. చిత్రంలో చాలా కీలకమైన ఈ పాత్రలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో ఈమె పేరు పరిశీలనకు వచ్చిందన్నారు. ఆమె ఆ పాత్రకు కరెక్ట్‌గా నప్పుతారని భావించినట్లు చెప్పారు. కథను అర్థం చేసుకుని జెనీ పాత్రలో ఆమె జీవించారన్నారు. ఈ పాత్రకు ఆమెను మినహా వేరే ఎవరినీ ఊహించలేమన్నారు. మిర్నా మీనన్ ఇంతకుముందు మలయాళంలో బిగ్ బ్రదర్, తమిళంలో బుర్ఖా, జైలర్, తెలుగులో నా సామిరంగ చిత్రాలలో నటించారని.. వాటన్నింటికంటే పూర్తిభిన్నంగా బర్త్‌మార్క్ చిత్రంలో ఆమెను చూస్తారని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం మిర్నా మీనన్ ఎంతగానో శ్రమించారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను 36 రోజుల్లో పూర్తి చేసినట్లు దర్శకుడు చెప్పారు. చదవండి: ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఈ ఏడాది పోటీపడుతున్న సినిమాలివే! -
10 ఏళ్ల తర్వాత హిట్ మూవీకి సీక్వెల్.. తెలుగు హీరోయిన్స్‌తో
దర్శకుడు ఎస్.ఎళిల్... విజయ్ హీరోగా 'తుళ్లాద మనం తుళ్లుమ్', అజిత్ కథానాయకుడిగా 'పూవెల్లా ఉన్ వాసన్', రాజా, ప్రభుదేవా హీరోగా 'పెన్నిన్ మనదై తొట్టు', జయంరవితో 'దీపావళి', విష్ణువిశాల్ హీరోగా 'వేలన్ను వందుట్టా వేళైక్కారన్' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించాడు. ఆ తరువాత విమల్ కథానాయకుడిగా దేసింగురాజా చిత్రాన్ని రూపొందించాడు. 10 ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా దేసింగురాజు –2 రూపొందుతోంది. ఎస్.ఎళిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మరోసారి విమలే కథానాయకుడిగా నటిస్తున్నారు. అలా ఈ సక్సెస్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఎళిల్ తన చిత్రాల్లో వినోదానికి పెద్ద పీట వేస్తాడు. పి.రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి ఐనా కీలక పాత్రను పోషిస్తున్నారు. పూజిత పొన్నాడ, హర్షిత ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూరి, యోగిబాబు, రవి మరియ, రోబో శంకర్, సింగం పులి, మొట్టై రాజేంద్రన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వేర్వేరు బాటల్లో పయనించే నలుగురు కళాశాల విద్యార్థుల ఇతివృత్తంతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దేసింగురాజు –2 ఉంటుందని దర్శకుడు తెలిపాడు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆర్.బాలకుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చదవండి: పూజా హెగ్డే ఇంట్లో తీవ్ర విషాదం..! -
మహారాణి బయోపిక్.. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నిర్మాత కూతురు!
బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ పతాకంపై జేఎం.బషీర్ నిర్మిస్తున్నారు. ఆర్.అరవింద్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషం. కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని దేవర్ మహల్లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు. మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో! -
అప్పుడు కాత్తు వాక్కుల రెండు కాదల్.. ఇప్పుడు..
నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాత్తు వాక్కుల ఒరు కాదల్ అనే పేరుతో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం రూపొందడం విశేషం. చైన్నె ప్రొడక్షన్స్ పతాకంపై ఎళిల్ అనియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాస్ రవి భూపతి కథ, కథనం, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి లక్ష్మీప్రియ, మంజుల కథానాయికలుగా నటిస్తున్న ఇందులో సూపర్ సుబ్బరాయన్, సాయి దినా, సత్య, కల్లూరి వినోద్, ఆదిత్య ఖదీర్, తంగదురై, ఫవర్ స్టార్, కబాలి విశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ గాలిని ఎవరూ చూడలేరని, అనుభూతిని మాత్రమే పొందగలరని అన్నారు. అదే విధంగా ప్రేమలో నలుపు, ఎరుపు ఎవరూ చూడలేదని దాన్ని కేవలం ఫీల్ అవగలరన్నారు. అలా ఒక నిజమైన ప్రేమ చుట్టూ తిరిగే కథా చిత్రమే కాత్తు వాక్కుల ఒరు కాదల్ అని పేర్కొన్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో ఉంటుందన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు ఎలా మోసపోతున్నారనేదాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. నేటి తరం ప్రేక్షకులకు కావలసిన ప్రేమ, వినోదం, యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్.. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ చైన్నె, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో నిర్వహించినట్లు చెప్పారు. ఈ చిత్రానికి జీకే వీ సంగీతాన్ని, రాజదురై ఎంఏ, సుభాష్ ఎన్.మణియన్ ద్వయం ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని.. -
'దాదా' హీరో కొత్త సినిమా.. అప్డేట్స్ ఇవే!
యంగ్ హీరో కెవిన్ కథానాయకుడిగా నటించిన దాదా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రానికి స్టార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి ప్యార్ ప్రేమ కాదల్ చిత్రం ఫేమ్ ఇళన్ దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్, శ్రీనిధి సాగర్ కలిసి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులోని పాటలన్నీ యూత్‌ను అలరించే విధంగా ఉంటాయంటున్నాయి చిత్ర వర్గాలు. ఈ చిత్ర ప్రోమో వీడియోను యువన్ శంకర్ రాజా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందని పేర్కొన్నారు. ఇటీవల ఇందులోని ఓ సాంగ్ కోసం భారీ సెట్ వేసి చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇది నటుడు కెవిన్ ఇంతకు ముందు నటించిన చిత్రాల కంటే భిన్నంగానూ, భారీగానూ రూపొందిస్తున్న చిత్రం అని పేర్కొన్నాయి. కాగా ఇది సినీ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమ కథా చిత్రంగా ఉంటుందట. తెర వెనుక పలు ఆసక్తికరమైన అంశాలను ఆవిష్కరించే చిత్రంగా స్టార్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న స్టార్ చిత్రాన్ని ఫిబ్రవరి 9వ తేదిన తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం -
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో రుద్రతాండవం హీరో
ద్రౌపది, రుద్రతాండవం చిత్రాల ఫేమ్ నటుడు రిచర్డ్ రిషి, పున్నగై పూ గీత, యషికా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సిలనొడిగళిల్. ఎస్కైర్ ప్రొడక్షన్స్ యూకే సంస్థతో కలిసి పున్నగై పూగీత నిర్మించిన ఈ చిత్రానికి వినయ్ భరద్వాజ్ కథ, దర్శక బాధ్యతలను నిర్వహించారు. ఐదుగురు సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ఇది సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో రిచర్డ్ రిషి లండన్‌లో పేరొందిన కాస్మోటిక్ సర్జన్‌గా నటించారన్నారు. పున్నగై పూగీత, రిచర్జ్ రిషి అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారన్నారు. అలాంటి సమయంలో ప్రముఖ మోడల్ నటి యషికా ఆనంద్ అతనికి పరిచయం అవుతుందన్నారు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడుతుందన్నారు. ఆ తర్వాత యషికా ఆనంద్ హత్యకు గురవుతుందని, ఆమెను ఎవరు ఎందుకు హత్య చేశారన్నదే చిత్ర ప్రధాన అంశం అని చెప్పారు. ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుందని లండన్ నేపథ్యాన్ని చిత్రానికి ఎంచుకున్నట్లు చెప్పారు. ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించిన యషికా ఆనంద్ ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యత కలిగిన పాత్రలో అద్భుతంగా నటించారని, రిచర్డ్ రిషి తన పాత్రకు న్యాయం చేశారని నిర్మాత తెలిపారు. సిల నొడిగళిల్ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం చిత్రం టీజర్, ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. చదవండి: గాయత్రి గుప్తాకు ఏమైంది?.. అసలా బూతులేంటి! -
30 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. నెక్స్ట్ హైదరాబాద్‌లోనే
శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.టి.కుంజుమోన్ 1993లో నిర్మించిన జెంటిల్మన్ చిత్రం సంచలన విజయం సాధించింది. 30 ఏళ్ల తరువాత కె.టి.కుంజుమోన్ ఆ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అయితే దర్శకుడు, కథానాయకుడు, సంగీత దర్శకుడు అందరూ మారిపోయారు. ఈ చిత్రానికి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్, నయనతార చక్రవర్తి జంటగా నటిస్తున్న ఇందులో 50 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అజయ్ విన్సెంట్ చాయాగ్రహణం, వైరముత్తు పాటలను, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. తొలి షెడ్యూల్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ షూటింగ్లో పలు కీలక సన్నివేశాలను, భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలిపారు. కాగా రెండో షెడ్యూల్‌ను నవంబర్ మూడో వారంలో మొదలుపెట్టి చైన్నె, హైదరాబాద్, పుదుచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తరువాత ముంబై, మలేషియా, శ్రీలంకలలో చిత్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. చదవండి: తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య ఇక లేరు -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సింగర్
విజయ్ టీవీ సూపర్ సింగర్ ఫేమ్, గాయని రాజ్యలక్ష్మి సెంథిల్ తొలిసారి కథానాయకిగా పరిచయం అవుతున్న చిత్రం లైసెన్స్. జేఆర్జీ పిక్చర్స్ పతాకంపై ఎన్.జీవానందం నిర్మించిన చిత్రం ఇది. గణపతి బాలకుమార్ దర్శకత్వం వహించిన ఇందులో నటుడు రాధారవి, ఎన్.ఆనందం, కరుప్పయ్య, గీతా కై లాసం, అభి నక్షత్ర, తాన్య అనన్య, వైయాపురి, నమో నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాశీ విశ్వనాథ్ చాయాగ్రహణం, బైజు జాకబ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లైసెన్స్ చిత్రంలో గాయని రాజ్యలక్ష్మి సెంథిల్ పాఠశాల ఉపాధ్యాయులుగా నటించారు. అభ్యుదయ భావాలు కలిగిన విద్యార్థుల కోసం ఎలా పోరాటం చేశారు? అసలు ఈమె దేని కోసం లైసెన్స్ కోరుతూ పోలీసులను ఆశ్రయించారు? ఆమె కోరిన లైసెన్స్ వచ్చిందా? ఇలా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం లైసెన్స్. ముఖ్యంగా పాఠశాల విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను, వాటిని నివారించటానికి ఉపాధ్యాయురాలు ఎంచుకున్న పోరుబాట ఏమిటి అనేది లైసెన్స్ ప్రధానాంశం. -
రారా సరసకు రారా మూవీకి 62 సెన్సార్ కట్స్!
'రారా సరసకు రారా' చిత్రానికి సెన్సార్ బోర్డు 62 చోట్ల కత్తెరకు పని చెప్పిందని నిర్మాత జయలక్ష్మి తెలిపారు. వేలూరులో చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలోనూ పోలీసులు, ఇన్స్పెక్టర్, కమిషనర్ స్థాయి నుంచి పలు సమస్యలను ఎదుర్కొన్నామని, కాట్పాడి రాజన్ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. స్కై వండర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈమె నిర్మించిన చిత్రం రారా సరసకు రారా. ఈ చిత్రానికి కేశవ్ దబర్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 3వ తేదీ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. లేడీస్ హాస్టల్లో ఒక్క రాత్రి జరిగే కథా చిత్రం అని చెప్పారు. నిత్యం పలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు రెండు గంటల పాటు హాయిగా చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు నిబంధనలు 5 ఏళ్లకు ఒకసారి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడో 1952లలో సెన్సార్ విధి విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. తమ చిత్రానికి 62 కట్స్ ఇచ్చారని తెలిపారు. అందుకే తనను 62 కట్స్ చిత్ర దర్శకుడు అంటున్నారని తెలిపారు. రారా సరసకు రారా చిత్రం టైటిల్‌కే అభ్యంతరం తెలిపారని, ఇంతకు ముందు ఎన్నో చిత్రాలకు అభ్యంతరం చెప్పినా సెన్సార్ బోర్డు తమ చిత్రానికి చాలా కట్స్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు, నటి గౌతమి సభ్యురాలిగా ఉన్న ఆ కమిటీలోనూ పలుమార్లు చర్చ జరిగిందని చెప్పారు. తాము యు సర్టిఫికెట్ కోరలేదని, వారు ఎన్ని కట్స్ చెప్పినా ఓకే చెప్పడానికి సిద్ధమయ్యామని దర్శకుడు పేర్కొన్నారు. లేడీస్ హాస్టల్లో జరుగుతున్న అనర్థాలను చెప్పడమే తమ చిత్ర ప్రధాన ఉద్దేశం అని దర్శకుడు తెలిపారు. చదవండి: ఐశ్వర్యరాయ్ బర్త్‌డే స్పెషల్.. ఏడువందల కోట్లకు పైగా ఆస్తులు -
షూటింగ్‌లకు రాకుండా తిప్పలు పెడుతున్న యోగిబాబు?
నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లక్కీమ్యాన్. నటి రేచ్చల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి నటుడు బాలాజీ వేణుగోపాల్ దర్శకత్వం వహించారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ పానీపూరికి మంచి ఆదరణ లభించిందన్నారు. తాజాగా లక్కీమ్యాన్ చిత్ర కథను నటుడు యోగిబాబుకు చెప్పగా వెంటనే నటించడానికి అంగీకరించారన్నారు. యోగిబాబును ఇండియన్ నటుడు అని చెప్పవచ్చునన్నారు. అంతటి ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ఆయన గురించి ఇటీవల పలు వదంతులు ప్రచారం అవుతున్నాయని, వాటిలో ఏమాత్రం నిజం లేదన్నారు. యోగిబాబు ఇంటిలో మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొన్నా, షూటింగ్‌కు ఇబ్బంది కలుగుతుందని, కష్టాన్ని భరిస్తూనే తమ చిత్రంలో నటించారన్నారు. కాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న శక్తి ఫిలిమ్స్ శక్తివేల్‌కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బాలాజీ వేణుగోపాల్ చెప్పినట్లుగా ఈ చిత్రం తన జీవితాన్ని తిరిగి చూసుకునేట్లు ఉందన్నారు. ఇంతకు ముందు తాను కొన్ని చిత్రాల్లో నాలుగైదు సన్నివేశాల్లో నటించినా తన పేరును ప్రచారానికి వాడుకోవడం అభిమానులను మోసం చేయడం కాదా..? అని ప్రశ్నించారు. దాని గురించి అడిగితే సమస్యగా మారుతోందన్నారు. తాను షూటింగ్‌లకు సరిగా రావడం లేదనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. షూటింగ్‌కు రాకుండా తానెక్కడికి వెళతానన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. తాను కథలను విని కాకుండా వారి కష్టాలను విని నటిస్తున్నానని యోగిబాబు వెల్లడించారు. చదవండి: చిన్నాచితకా పాత్రలకు సైతం కాంప్రమైజ్.. కెరీర్ కోసం నేనూ అడ్జస్ట్ అయ్యా..: నటి -
సూపర్ హిట్‌గా నిలిచిన గుడ్‌నైట్ మూవీ.. ఈ టీమ్ కలయికలో కొత్త చిత్రం
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం గుడ్‌నైట్. ఈ చిత్ర కథానాయకుడు మణికంఠన్, మిలియన్ డాలర్స్, ఎంఆర్పీ సంస్థలు మరో చిత్రానికి సిద్ధమయ్యారు. శ్రీగౌరిప్రియ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రేయాకృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం ఉదయం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నటుడు విజయ్‌సేతుపతి విచ్చేసి ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలను తెలుపుతూ యువతీ యువకులు సమకాలీన ప్రేమ, తద్వారా ఏర్పడే సమస్యలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, గోవా సమీపంలోని గోకర్ణం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. చిత్ర కథ జనరంజక అంశాలతోపాటు మంచి సందేశంతో కూడి ఉంటుందన్నారు. చదవండి: నాకు హద్దులు తెలుసు.. అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్ -
బకాసురన్.. కూతురి కోసం పోరాడే తండ్రి కథ!
చిత్రాలను ప్రయోగాత్మకం, ప్రయోజనాత్మకం, ప్రజానందాత్మకం అంటూ మూడు భాగాలుగా విభజిస్తే బకాసురన్ చిత్రం ప్రయోజనాత్మకం కేటగిరీలో చేరుతుంది. సమాజానికి అవసరమైన కంటెంట్‌తో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు మోహన్.జి. ఇంతకుముందు పళయ వన్నారపేట్టై, ద్రౌపది, రుద్ర తాండవం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను రూపొందించారు. తాజాగా శ్రీ దర్శకత్వంలో జీఎం ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించిన చిత్రం బకాసురన్. దర్శకుడు సెల్వరాఘవన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటరాజన్, కే రాజన్, మన్సూర్ అలీఖాన్, నటి తారాక్షి, లావణ్య మాణిక్యం, దేవదర్శిని, పి.ఎల్ తేనప్పన్, గుణానిధి, రామ్, శశిలైలా రిచా, కూల్ జయంత్, అరుణోదయన్, కుట్టి గోపి ముఖ్యపాత్రలు పోషించారు. దీనికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, ఫరూక్ బాషా చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జీటీఎం సంస్థ శుక్రవారం విడుదల చేసింది. దర్శకుడు మోహన్.జి ఈ చిత్రానికి సమాజంలో జరుగుతున్న ప్రస్తుత విషయాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. కొన్ని యధార్థ సంఘటనలను చిత్రంలో వాడుకున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల భవిష్యత్తులతో విద్యాసంస్థల అధినేతలు ఎలా ఆడుకుంటున్నారు?, పరిస్థితుల ప్రభావం కారణంగానో, మరి ఇతర కారణాల వల్లో యువతులు వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? అందుకు కొందరు యువకులు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎలా వాడుకుంటున్నారు? వంటి అంశాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన కథ చిత్రం బకాసురన్. ఇందులో వీధి భాగోతం కళాకారుడుగా దర్శకుడు సెల్వరాఘవన్ నటించారు. మాజీ సైనికుడిగా నటరాజన్, విద్యాసంస్థ అధినేతగా రాధారవి నటించారు. వీరి మధ్య జరిగే కథే బకాసురన్. అయితే ఇందులో బకాసురన్ ఎవరనేదే చిత్రంలో ఆసక్తికరమైన అంశం. కూతురి తండ్రిగా భీమరాజ్ పాత్రలో సెల్వరాఘవన్ నటన హైలైట్‌గా ఉంటుంది. ఆయన అలుపెరుగని పోరా టమే బకాసురన్ చిత్రం. -
స్వాతంత్య్ర సమరయోధురాలిగా మిస్ చెన్నై
తొలి స్వతంత్ర సమరయోధురాలు వేలు నాచియార్ జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కనుంది. దీనికి మరుదుస్క్వేర్ అనే పేరును నిర్ణయించారు. దీన్ని జే.ఎం.బషీర్ తన ఫ్రెండ్స్ సినిమా పతాకంపై నిర్మించి పెద్ద మరుదు పాత్రను పోషించనున్నారు. ఈయన ఇప్పటికే దేశీయతలైవర్ చిత్రంలో టైటిల్ పాత్ర పసుమ్ పొన్ ముత్తురామలింగ దేవర్‌గా నటిస్తున్నారు. కాగా ఇందులో వేలు నాచియార్ అనే ప్రధాన పాత్రను బషీర్ కూతురు ఆయిషా పోషించనున్నారు. ఈమె 2019లో మిస్ చెన్నై అందాల పోటీల్లో కిరీటాన్ని గెలుచుకున్నారు. నటనపై ఆసక్తితో అందుకు కావలసిన శిక్షణ పొందారు. శ్రీధర్ మాస్టర్ వద్ద డాన్స్, స్టంట్ మాస్టర్లు తవసీరాజ్, మిరాకిల్ మైఖెల్ ఫైట్స్‌లో శిక్షణ పొందారు. అదేవిధంగా మదుర్ ముత్తు లక్ష్మి వద్ద సిలంబాట్టం వంటి విలు విద్యలు నేర్చుకున్నారు. ఈ చిత్రానికి ఊమై విళిగల్, ఉళవన్ మగన్ చిత్రాల ఫేమ్ అరవింద్ రాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన ప్రస్తుతం జెఎం.బషీర్ టైటిల్ పాత్రను పోషించిన దేశీయతలైవన్ చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం విడుదల తరువాత మరుదు స్క్వేర్ చిత్రాన్ని సెట్ పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్రం వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ఈ సినిమాకు ఒక ప్రముఖ సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించనున్నారని, అదేవిధంగా చిన్న మరుదు పాత్రను పోషించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుగుతున్నాయని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. చదవండి: రెండు సీన్లు చూసి థ్రిల్ అయ్యా: అఖిల్ -
కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్న హీరో శింబు
మానాడు హిట్ తరువాత శింబు నటిస్తున్న తాజా చిత్రం వెందు తనిందదు కాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వేల్స్ ఫిలిం పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా గుజరాతీ భామ సిద్ధి ఇడ్నాని కథానాయికగా పరిచయం అవుతోంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో శింబు విభిన్న పాత్రల్లో నటించినట్లు, ఆయన గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! దాన్ని పెద్దగా పట్టించుకోం, కానీ అదే నా బ్యూటీ సీక్రెట్ -
విడుదలకు సిద్ధమైన ఫారిన్ సరకు
ఫారిన్ సరకు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నెప్టియన్ సెయ్లర్స్ పతాకంపై గోపినాథ్ నిర్మించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా విఘ్నేశ్వరన్ కుప్పసామి దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దానితో చిత్రంలో పాటు ప్రధాన పాత్ర పోషిస్తూ, సహ నిర్మాతగా బాధ్యతలను నిర్వహించారు. దీనిలో సుందర్ అనే వ్యక్తి కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే.. షిప్లో పని చేసిన ఈ ముగ్గురూ సినిమాపై ఆసక్తితో ముందుగా షార్ట్ ఫిలింస్ చేశారు. తాజాగా ఫారిన్ సరకు చిత్రంతో సిల్వర్ స్క్రీన్ రంగప్రవేశం చేశారు. ఫారిన్ సరకు అనగానే ఏదేదో ఊహించుకునే అవకాశం ఉందని, చిత్రం చూసిన తరువాత ప్రేక్షకుల భావన మారుతుందని దర్శకుడు మంగళవారం చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలిపారు. ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. అందరూ కొత్త వాళ్లు కలిసి చేసిన చిత్రం ఇదన్నారు. తమలాంటి వారికి అవకాశం కలిగించాలన్న భావనతో 300 మందిని ఈ చిత్రం ద్వారా పరిచయం చేసినట్లు తెలిపారు. గుజరాత్, తమిళనాడు రాష్టాల మధ్యలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ అని తెలిపారు. ఇది రెగ్యులర్ ఫార్ములాలో సాగే చిత్రం కాదని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. చిత్రాన్ని విడుదల చేయడమే విజయంగా భావిస్తున్నట్లు నిర్మాత గోపినాథ్ తెలిపారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొని చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: నేను ఇంతకాలం నటించకపోవడానికి కారణం ఇదే.. ప్రముఖ దర్శక-నిర్మాత రాజేంద్రప్రసాద్ మృతి