పగబట్టిన పాము కథ
అదో అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటారు. తెలియక ఆ యువకుడు చేసిన ఓ పని వల్ల ఒక పాము అతనిపై పగబడుతుంది. మహా భక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడాలనుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’. ఈ చిత్రాన్ని ‘నాగలాపురం’ పేరుతో కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘శివరామరాజు’లో చెల్లెలి పాత్ర, ‘మా అల్లుడు వెరీ గుడ్డు’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మోనిక ఈ చిత్రంలో హీరోయిన్. రాఘవ్ హీరో. ప్రేమ, పగ, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రమని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మంగమ్మ, దర్శకత్వం: చార్లెస్.