Revenge
-
‘‘మా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా?..’’ 680 మందికి నోటీసులు.. 147 అక్రమ కేసులు.. 49 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చంద్రబాబు సర్కారు వికటాట్టహాసం చేస్తోంది. అక్రమ కేసులతో వేధించడంతో పాటు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తోంది.మమ్మల్నే ప్రశ్నిస్తారా?.. అంటూ వైఎస్సార్సీపీ సో.మీ. కార్యకర్తలను, మద్దతుదారులను, సాధారణ ప్రజలనూ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. కూటమి పార్టీల మనుషులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. వాళ్లే ఫిర్యాదులు చేసి వైఎస్సార్సీపీ వాళ్లను అరెస్టులు చేయిస్తున్నారు. మరోవైపు.. జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ నేతలపైనా నీచంగా పోస్టులు పెట్టినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.కూటమి అరాచక పాలనలో గత వారం రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 680 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 49 మంది అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కొందరు పోలీసులు కూడా అతి చేష్టలకు దిగుతున్నారు.నెట్టింట కూటమి ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో ప్రశ్నించేవారిని, నిలదీసేవారిని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను ఇలా పోలీసులు ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. రెండ్రోజులు గడువు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కోర్టులకు వెళ్లాలని, రూల్స్‌కు వ్యతిరేకంగా వెళ్తున్న పోలీసులపై ప్రైవేట్ కంప్లయింట్లు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు..ఆ పార్టీ నేతలు జాతీయ మానవహక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెబుతున్నారు. న్యాయసహాయంతో పాటు అన్నిరకాలుగా సాయం అందించేందుకు విభాగాలను ఏర్పాటు చేయించారు. -
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్‌లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్‌లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
పబ్లిక్‌గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్‌గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ. -
స్థిరత్వం లేని ట్రంప్‌ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
టాటా ప్రతీకారం అలా తీరింది..!
దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్‌నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.టాటా కలను ఎగతాళి చేశారు..కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్‌ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.అసలే టాటా గ్రూప్‌నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశం కోసం డెట్రాయిట్కు వెళ్లారు.అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్‌కి తిరిగొచ్చేశారు.ప్రతీకారం ఇలా తీరింది..తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్‌బ్యాక్‌గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది. -
22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్‌ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్‌లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష
-
చంద్రబాబూ.. ఛీ అనిపించుకోకండి: కేఏ పాల్
విశాఖపట్నం, సాక్షి: ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయ దాడుల పర్వంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రాజకీయంగా కక్షలు తీర్చుకోనని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాడులకు దిగిన తన కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారాయన. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మన రాష్ట్రం ఏమైపోతోంది. ఈ వయసులో మీ పార్టీ కార్యకర్తలను మీరు అదుపు చేయలేరా?. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎలా గెలిచారో అందరికీ తెలుసు. బుద్ధి లేని మీ పార్టీ గాడిదలకు చెప్పండి. ఇంత నీచమైన స్థితికి మీ పార్టీ కార్యకర్తలు దిగజారిపోయారు. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి. చరిత్ర హీనులు కాకండి’’ అని పాల్ హితవు పలికారు. ‘‘గతంలో ఇలాంటి దాడుల్ని జగన్ పార్టీ ఏనాడూ ప్రొత్సహించలేదు. కానీ, కక్ష తీర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు మీ కార్యకర్తలు చేస్తోంది ఏంటి?. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయలేని మీరూ.. ఆరునెలలకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరు. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్లాలంటే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను వదిలేయాలి. కక్ష పూరిత రాజకీయాలు మానేసి రాష్ట్రం బాగు చేయడం కోసం పాటు పడాలి. ఇంకో 48 గంటల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. లేకుంటే మీరు రాష్ట్రాన్ని పాలించేందుకు పనికి రారని కోర్టుకు వెళ్లా. అక్కడా న్యాయం జరగకపోతే దేవుడి కోర్టుకు వెళ్తా’’ అని ఆయన హెచ్చరించారు. -
వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
భారీ లక్ష్య ఛేదనలో ‘బజ్‌బాల్’ మంత్రం పని చేయలేదు...దూకుడైన ఆటతో చెలరేగి విజయతీరం చేరాలనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగలేదు...భారత బౌలింగ్ సామర్థ్యం ముందు బ్యాటర్లు తలవంచారు...మన బౌలర్ల ప్రతిభకు తోడు స్వీయతప్పిదాలు పర్యాటక జట్టును దెబ్బ తీశాయి...కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా నాలుగో రోజే ఇంగ్లండ్‌ను పడగొట్టింది...హైదరాబాద్‌లో ఎదురైన ఓటమికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకుంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను 1–1తో సమం చేసి రాబోయే టెస్టులపై ఆసక్తిని పెంచింది. తొలి ఇన్నింగ్స్‌కంటే మరింత పదునైన బంతులతో చెలరేగిన బుమ్రా ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగా, అశ్విన్ అండగా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్నా...పెద్దగా స్పిన్ టర్న్ లేకపోయినా క్రాలీ మినహా ఎవరూ నిలవలేకపోయారు. అద్భుత ఫీల్డింగ్ భారత బలాన్ని రెట్టింపు చేసి విజయానికి బాటలు వేసింది. స్టోక్స్ సేన తాము ఆశించినట్లుగా గెలుపు పక్షాన నిలవలేకపోయినా...నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు వందల పరుగులకు చేరువగా వచ్చి గట్టి పోటీనివ్వగలిగామనే సంతృప్తితో ముగించింది. విశాఖ స్పోర్ట్స్: భారత గడ్డపై ఒక విదేశీ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సందర్భాల్లో ఆ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 276 పరుగులు...ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. కానీ చివరకు ఆ పోరాటం సరిపోక వందకు పైగా పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (132 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా...టామ్ హార్ట్లీ (47 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ ఫోక్స్ (69 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ప్రతిఘటించారు. ఈ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (9/91) మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లతో టెస్టు ఫలితాన్ని శాసించగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తాజా ఫలితం తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కొంత విరామం తర్వాత ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరుగుతుంది. రూట్, స్టోక్స్ విఫలం... ఓపెనర్ క్రాలీతో పాటు నైట్‌వాచ్‌మన్ రేహన్ అహ్మద్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) కూడా సోమవారం ఉదయం కొద్ది సేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీసినా ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒలీ పోప్ (23) ఒక్క అక్షర్ బౌలింగ్‌లోనే ఐదు ఫోర్లు బాదాడు. స్లిప్‌లో రోహిత్ సూపర్ క్యాచ్‌కు పోప్ వెనుదిరిగాడు. అయితే చెత్త షాట్‌తో రూట్ భారత్‌కు కీలక వికెట్ ఇచ్చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు గుడ్డిగా ఆడబోయిన రూట్ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జోరుకు కళ్లెం పడింది. ఆపై లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయానికి బాటలు వేసుకుంది. కుల్దీప్ బౌలింగ్‌లో క్రాలీ వికెట్ల ముందు దొరికిపోగా, డీఆర్ఎస్ ఫలితం కాస్త చర్చకు దారి తీసింది. బుమ్రా బంతికి బెయిర్‌స్టో వద్ద జవాబు లేకపోయింది. స్టోక్స్ ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నా...అతని రనౌట్‌తో జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. సింగిల్ తీసే క్రమంలో స్టోక్స్ బద్ధకంగా కదలగా...అయ్యర్ మెరుపు త్రో అతని ఆటను ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253; భారత్ రెండో ఇన్నింగ్స్ 255; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 73; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (ఎల్బీ) (బి) అక్షర్ 23; పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23; రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బుమ్రా 26; స్టోక్స్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36; హార్ట్లీ (బి) బుమ్రా 36; బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0; అండర్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–50, 2–95, 3–132, 4–154, 5–194, 6–194, 7–220, 8–275, 9–281, 10–292. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పా యింట్ల పట్టికలో భారత్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ గెలుపుతో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానానికి (52.77 పాయింట్ల శాతం) చేరుకుంది. ఆ్రస్టేలియా అగ్రస్థానంలో (55 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. -
జైలర్ మూవీ పై పగ తీర్చుకుంటున్న దళపతి ఫ్యాన్స్..
-
ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..
ఎవరికైనా ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గి, జొమాటో వంటి యాప్స్ ఉపయోగిస్తారు. కానీ ఒక యువతీ తన బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీసుకోవడానికి జొమాటో వాడింది. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఒక యువతికి తన బాయ్ ఫ్రెండ్‌తో మనస్పర్థలు రావడంతో రివెంజ్ తీసుకోవడానికి.. అతని అనుమతి లేకుండానే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా డెలివరీ బాయ్ ఆ యువకుని అడ్రస్‌కి వెళితే నేను ఆర్డర్ పెట్టలేదని, డబ్బు ఇవ్వనని వాదించాడు. (ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!) ఇలా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్‌కి మూడు సార్లు ఫుడ్ ఆర్డర్ చేసింది. మూడు సార్లు నేను ఆర్డర్ చేయలేదని ఆ యువకుడు డబ్బు ఇవ్వకుండా డెలివరీ బాయ్‌ని వెనక్కి పంపించాడు. దీంతో విసిగిపోయిన కంపెనీ నేరుగా ఆ యువతికి దయచేసి ఇలా చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay! — zomato (@zomato) August 2, 2023 -
పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..
పక్కింటివారి వలన మనం ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటాం. ఇటువంటి సందర్బాల్లో వారికి అభ్యంతరం చెప్పలేక మనకి మనమే సతమతమైపోతుంటాం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. పక్కింటివారి వ్యవహారం వలన ఆమెకు నిద్ర కూడా కరువయ్యింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఒక పని అవతలివారి ఆట కట్టించింది. ‘నిద్ర కూడా పోనివ్వడంలేదు’ ఆ మహిళ రెడిట్‌లో తన అనుభవాన్ని షేర్ చేసింది. తన పక్కింట్లో ఉన్నవారు ప్రతీరోజూ సాయంత్రం పార్టీలు నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుడటంతో ఆమెకు నిద్ర కూడా పట్టేదికాదు. వీరి ఇళ్ల మధ్య సన్నని గోడ మాత్రమే అడ్డుగా ఉన్న కారణంగా రాత్రివేళ ఆ ఇంటిలోని సౌండ్ హోరు ఈ మహిళను తెగ ఇబ్బంది పెట్టేది. దీంతో ఆ మహిళ నిద్ర పట్టక ఆ విషయాన్ని పక్కింటివారికి చెప్పింది. సౌండ్ తగ్గించాలని కూడా కోరింది. పక్కింటివారు మాట విన్నప్పటికీ.. ఆ మహిళ చెప్పింది విన్న పక్కింటివారు మ్యూజిక్ సౌండ్ తగ్గించినప్పటికీ, అక్కడి వారి మాటల హోరు కారణంగా ఆమె ఇబ్బంది ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆ ఇంటిలో ఉండటం కష్టమని ఆమెకు అనిపించింది. ఏ మాత్రం ప్రశాంతత లేదని భావించింది. ‘ఇది మా సమస్య కాదు’ ఈ విధంగా అమె ఐదు నెలల పాటు పక్కింటివారితో ఇబ్బందులను ఎదుర్కొంది. తిరిగి మారోమారు వారిని సౌండ్ తగ్గించాలని కోరింది. అయితే పక్కింటివారు ఆమెతో ‘ఇది మా సమస్య కాదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్నవెంటనే ఆమెకు ఆగ్రహం కలిగింది. దీంతో పక్కింటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వారి శైలిలోని సమాధానం చెప్పాలని.. ఈ మాట వినగానే ఆమె పక్కింటివారికి వారి శైలిలోనే సమాధానం చెప్పాలని అనుకుంది. వెంటనే ఒక పెద్ద స్పీకర్ కొనుగోలు చేసింది. ఫుల్ వాల్యూమ్‌తో రాత్రంతా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పక్కింటిలోని వారికి నిద్ర ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మహిళ దగ్గరకు వచ్చి.. మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని కోరారు. అప్పుడు ఆమె ‘ఇది నా సమస్య కాదు’ అని సమాధానం చెప్పింది. ‘ఇది పిల్లల ఆట’ ఆ మహిళ పోస్టును చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది పిల్లల ఆట’లా ఉందని పేర్కొనగా, మరొకరు ‘పక్కంటి వారు పార్టీ చేసుకునే సమయంలో మీరు పడుకుంటే అది మీ సమస్య. దానిలో వారి తప్పేమీ లేదు’ అని అన్నారు. ఇంకొక యూజర్ ‘మీరు మంచి పని చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పడం ఎంతో అవసరం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా.. -
హర్షదీప్ పై తిలక్ వర్మ రివెంజ్ మాములుగా లేదు గా..
-
ఇదేం పగరా నాయనా.. 1,100 కోళ్లను భయపెట్టి చంపడమేంది?
బీజింగ్: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది. ఏం జరిగిందంటే..? గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి. జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. దీంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’ -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’
శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్ బ్యాక్‌డ్రాప్ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్ కీ రోల్స్ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్ ప్రొడ్యూసర్: మారిశెట్టి సునీల్‌కుమార్. -
ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్‌కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది. అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్‌కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్‌ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్‌లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్‌ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్‌కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్‌ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్‌ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్‌లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్‌లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్‌పోర్ట్‌నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్‌ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
తొక్కి చంపినా కోపం చల్లారలేదా? భర్త ఆత్మ చేసిన పనట?!
నమ్మకం మనిషికి బలం.. మూఢనమ్మకం బలహీనత. కళ్ల ముందు ఏదైనా ఊహించని ఘటన జరిగితే.. అక్కడేదో ఉందనుకునే జనాలే మన చుట్టూరా ఎక్కువ!. అలాంటిదే ఈ ఘటన. ఆవేశంతో ఉన్న ఓ ఏనుగు ఓ మహిళను తొక్కి చంపడమే కాదు.. అంత్యక్రియలకు వచ్చి మరీ మళ్లీ మృతదేహంపై తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఇదంతా చూసినవాళ్లు.. చనిపోయిన ఆమె భర్తే కారణమంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఒడిశా బరిపదాలోని రాయ్‌పల్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది మయ ముర్మూ(70). మంచి నీటి కోసం గురువారం పంపు మోటర్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో దాల్మా వైల్డ్‌లైప్ శాంక్చురీ నుంచి పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఈలోపు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు దూరపు బంధువులు. ఊరేగింపు తర్వాత.. ముర్మూ మృతదేహాన్ని చితి మీద ఉంచారు. అయితే అదే సమయంలో మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమైంది అదే ఏనుగు. దీంతో జనాలంతా చెల్లాచెదురైపోయారు. ఈసారి చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి కిందపడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసి.. అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్నవాళ్లంతా భయానికి లోనయ్యారు. కాసేపు అయ్యాక వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు. మయ ముర్మూ భర్త ఏడేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆ పెద్దాయనకు భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ఒకటి ఊరిలో వినిపిస్తుందట. ఆ భర్తే ఆత్మగా మారి.. ఆ ఏనుగు ద్వారా ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని, అందుకే గ్రామస్తుల జోలికి రాకుండా ఆ ఏనుగు వెళ్లిపోయిందంటూ ఊరు ఊరంతా ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగు ప్రకోపానికి కారణం ఏదైనా ఉండొచ్చని భావిస్తున్నారు. -
పాములు పగబడతాయా.. అందులో నిజమెంత..?
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ సందర్భంగా పాముల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అవసరం. అన్ని పాములూ విషం కలిగి ఉండవు. కేవలం నాలుగయిదు రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్నిచోట్లా డాక్టర్లు ఉండరు కాబట్టి కరిచినా విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది. పాము కరిచిన తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఆ పాము మనిషిని కరవక ముందు, ఏదైనా జంతు వును కరచినట్లయితే, ఆ తరువాత మనిషిని కరచినా కూడా ప్రమాద ముండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కోరల్లో ఉండదు. ఇది తెలియక కూడా భయపడతాం. కొంతమంది తమపై పాము పగబట్టిందనీ, అందుకే కాటేసిందనీ లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నదనీ భయపడుతుంటారు. పాము పగ బట్టడం అబద్ధం. మనకి పాముని చూస్తే, ఎలా భయమేస్తుందో, పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటేనే కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలే కానీ మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాముకాటుకు గురైనా బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. – నార్నె వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు, ఏపీ హేతువాద సంఘం -
సమ్మర్‌కు తగ్గేదేలే...
-
మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి'
క్రికెట్లో సెండాఫ్స్ ఇచ్చుకోవడం.. దెబ్బకు దెబ్బ తీయడం సర్వ సాధారణం. ఉదాహరణకు.. ఒక బౌలర్ తన బౌలింగ్‌లో పదే పదే సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసి రివేంజ్ తీర్చుకోవడం ఒక స్టైల్.. లేదంటే అదే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అదే పనిగా విసిగిస్తుంటే.. నోటితో కాకుండా కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వడం మరో స్టైల్ రివేంజ్. అటు నోటితో.. ఇటు బ్యాటుతో సమాధానం ఇవ్వడం మరో రకమైన ప్రతీకారం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ''అంతకు మించి'' అనకుండా ఉండలేం. చదవండి: Viral Video: బంగారం లాంటి అవకాశం వదిలేశాడు.. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా టన్‌బ్రిడ్జ్ వెల్స్, డ్రూక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టన్‌బ్రిడ్జ్ వెల్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను వహిద్ అబ్దుల్ వేశాడు. అబ్దుల్ వేసిన అంతకముందు ఓవర్లో టన్‌బ్రిడ్జ్ వెల్స్ ఓపెనర్ ఓ రియోర్డాన్ వరుస బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు. ఇది మనసులో పెట్టుకున్న అబ్దుల్ 8వ ఓవర్లో ఒక యార్కర్ డెలివరీతో రియోర్డాన్ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో తన కాలికి ఉన్న షూ తీసి నెంబర్ డయల్ చేసి కాల్ మాట్లాడుతూ.. ''నువ్వు వచ్చిన పని ముగిసింది ఇక వెళ్లు'' అంటూ రియోర్డన్ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ క్రిస్ విలియమ్స్ ఇదంతా గమనించాడు. 'టైం రాకపోతుందా' అని విలియమ్స్ మనుసులో అనుకున్నాడో లేదో.. ఆ అవకాశం రానే వచ్చింది. వహిద్ అబ్దుల్ మరుసటి ఓవర్లో స్ట్రైకింగ్‌లో ఉన్న విలియమ్స్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. అంతే అబ్దుల్ వహిద్పై ప్రతీకారంగా తన బ్యాట్‌తో నెంబర్ కలిపి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా అబ్దుల్ వైపు చూస్తూ..''ఇప్పుడు నీ పని ముగిసింది.. ఇక బౌలింగ్‌కు రాకు'' అంటూ హెచ్చరిక పంపాడు. మొత్తానికి తన జట్టు ఆటగాడిని ఏ విధంగా అయితే అవమానించాడో.. అదే పద్దతిలో కెప్టెన్ విలియమ్స్ ప్రతీకారం తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇలాంటి రివేంజ్ ఇంతకముందు చూడలేదు.. వారెవ్వా దెబ్బకు దెబ్బ తీశాడు.. ఇది మాములు ప్రతీకారం మాత్రం కాదు.. అంతకుమించి అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: హిజాబ్ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల ఇక మ్యాచ్‌లో టన్‌బ్రిడ్జ్ వెల్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టన్బ్రిడ్జ్వెల్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ విలియమ్స్(56), అలెక్స్ విలియమ్స్(58) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డ్రూక్స్ 7.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. జో మెక్కాఫ్రీ 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. Banter you WOULD NOT like to miss 😅 C. Williams comes up with a perfect reply to his teammate's dismissal 😎@BET2BALL European Cricket League 2022 | Presented by @KibaInuWorld | @Cricket_Espana pic.twitter.com/Q8H3HMuMO0 — European Cricket (@EuropeanCricket) February 11, 2022 -
కోతిపిల్లను వేటాడి చంపిన కుక్కలు, ప్రతీకారంతో 250 కుక్కల్ని..
కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. తమకు పగ ఏర్పడితే ఎంత దూరమైనా వెళ్తామని జబ్బలు చరుస్తున్నాయి. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం. కానీ అన్ని పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన దుఃఖ బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. ఉదాహరణకు రాముడి పగ రావణ సంహారంతో ఆగలేదు. రాక్షస వంశాన్ని దాదాపు తుడిచి పెట్టింది. ఆయనంటే సర్వసమర్థుడు కాబట్టి ఆ స్థాయిలో పగ తీర్చుకున్నాడు. కానీ సాధారణ ప్రాణికి దుఃఖం, కోపం కలిగించినా ప్రతీకారం తీర్చుకునే శక్తిలేక ఊరుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రామ బంట్లుగా భావించే కోతులు మాత్రం తమకు కలిగిన బాధకు గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎంతైనా మనకు పూర్వీకులు కదా! వాటికి తెలివితేటలు ఎక్కువే. అందుకే పక్కాగా తమ ప్రత్యర్ధి వర్గంపై దాడులు చేసి వంశనాశనానికి పూనుకున్నాయి. ఇంతకూ ఇవి పగ తీర్చుకున్నది ఎవరిమీదన్నదే డౌటు కదా! వీటి వర్గ శత్రువులు కుక్కలే! ఫ్యాక్షన్ సినిమా స్టోరీని తలపించే ఈ కథ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగింది. ఏం జరిగింది? కోతులు వర్సెస్ కుక్కల పోరాటానికి కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటన బీజం వేసిందని మజల్గావ్ గ్రామస్తులు తెలిపారు. గతనెల్లో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని తెలిపారు. ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం ఆరంభించాయన్నారు. అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నారు. వీటి దెబ్బకు దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందన్నారు. కోతుల అరాచకంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమంగా కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు. లాక్డౌన్ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలో ఒక గ్రామంపై పగపట్టిన కోతి 22 కి.మీ.లు ప్రయాణించి ఆ ఊరికి చేరుకొని బీభత్సం సృష్టించింది. -
అమ్మా... నాన్నా... కొట్టొద్దు ప్లీజ్
అమ్మా నాన్నా ఒకరితో ఒకరు బాగుంటే మంచిదే. ఒకరితో ఒకరు బాగోకపోయినా పిల్లలతో బాగుండాల్సిన బాధ్యత ఉంది. కాని ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై ప్రతీకారంగా మారితేనే సమస్య. నాన్న మీద కోపం అమ్మ పిల్లల మీద చూపినా అమ్మ మీద ఆగ్రహం నాన్న పిల్లల మీద చూపినా నలిగిపోయేది ఆ పసి మనసులే. తమిళనాడులో తులసి అనే తల్లి తన రెండేళ్ల కుమారుణ్ణి భర్త మీద కోపంతో కొట్టడం వైరల్ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కలతల కాపురాలలో పిల్లలపై హింస గురించిన కథనం... రెండు రోజుల క్రితం తమిళనాడులో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక తల్లి తన రెండేళ్ల బాబును పదే పదే కొడుతూ ఆ వీడియోను రికార్డు చేసింది. ఆ పసివాడు తల్లి దెబ్బలకు తాళలేక ఏడుస్తూ తల్లి సముదాయింపు కోరుతూ ఉంటే ఆ తల్లి ఆ చిన్నారిని మళ్లీ మళ్లీ హింసించింది. ఇది బయటకు రావడంతోటే తమిళనాడు అంతా ఉలిక్కిపడింది. ఆ తల్లిని అరెస్టు చేయాలని నెటిజన్లు కోరారు. వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఆమెని అరెస్టు చేశారు. మూడు సెక్షన్లు– సెక్షన్ 323, 355, 75 కింద ఆమె ఇప్పుడు విచారణ ఎదుర్కొనాలి. ఏం జరిగింది? తమిళనాడు విల్లిపురం జిల్లాలోని గింజిలో వడివేలన్ (37), తులసి (22) భార్యాభర్తలు. వీరికి 2015లో వివాహం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు. వడివేలన్ గింజిలో కాపురం పెట్టి చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే అతడు భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని గ్రహించి ఆమెని వారించాడు. మానకపోయేసరికి ఫిబ్రవరిలో చిత్తూరులోని ఆమె పుట్టింటికి పంపాడు. పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఆమెను పుట్టింటికి పంపే ముందు ఆమె ఫోన్లో బాబును కొడుతూ రికార్డు చేసిన వీడియోలు చూశాడని ఒక కథనం. లేదా అప్పుడు రికార్డయిన వీడియోలు ఇప్పుడు బయట పడ్డాయని (అతడే బయటపెట్టాడని) ఒక కథనం. ఏమైనా కన్నతల్లి దారుణంగా తన పసిబిడ్డను కొట్టడం అందరినీ కలచి వేసింది. ఆదివారం తులసిని అరెస్టు చేసిన పోలీసులు విల్లిపురం తీసుకొచ్చారు. సైకియాట్రిస్టులు పరీక్షించి ఆమెకు ఏ మానసిక రుగ్మత లేదని నిర్థారించారు. కేవలం భర్త పట్ల కోపం, లేదా ఏదో ఒక నిస్పృహతోనే ఆమె పిల్లవాణ్ణి హింసించిందని ఒక అభిప్రాయం. ఎందుకు కొడతారు? ‘తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారంటే వాళ్లు తిరిగి కొట్టలేరని’ అని రాశాడు ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకట చలం. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు నలిగిపోవడం ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. భర్త మీద కోపంతో పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. భార్య మీద కోపంతో పిల్లల్నీ, తల్లిని హత్య చేసేంత వరకూ వెళ్లిన తండ్రులు ఉన్నారు. ఇవి తీవ్రమైన కేసులు అయితే బయటకు రానివి ఇంట్లోనే ఉండేవి పిల్లలకు మాత్రమే తెలుస్తాయి. కలతల కాపురం చేస్తున్న భార్యాభర్తలు తమ కోప తాపాలను పిల్లల మీద చూపడం, పిల్లలతో ‘నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఏ నుయ్యో గొయ్యో చూసుకునే దానిని’ అని తల్లి అనడమో ‘నీ వల్లే మీ అమ్మతో వేగాల్సి వస్తోంది’ అని తండ్రి అనో పసి మనసులను గాయపరుస్తారు. అది చాలక భార్యను కొట్టలేక పిల్లల్ని కొట్టడం, భర్తను తిట్టలేక పిల్లల్ని బాదడం చేస్తుంటారు. ఇంకా దారుణంగా పిల్లలతో మాట్లాడటమే మానేసి తమ తమ పంతాలలో ఉండిపోతారు. ఇలా పిల్లల్ని బాధించడం శిక్షార్హమైన నేరం. ఒక వైపు అయితే... తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల్ని బాధిస్తూ ఉంటే తల్లి/తండ్రి కాని వెంటనే దాని నివారణకు సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. చట్ట సహాయం లేదా కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని ఆ బాధ నుంచి రక్షించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రులు ఇద్దరూ బాధిస్తూ ఉంటే వారికి విముక్తి కలిగించాల్సిన బాధ్యత ఇరుగుపొరుగు వారిది, బంధువులది, స్నేహితులది అవుతుంది. కలహాల కాపురం దాచేస్తే దాగేది కాదు. కచ్చితంగా అయినవారికి తెలుస్తుంది. అలా తెలిశాక వారు చేయాల్సిన పని పిల్లల మీద ఏదైనా హింస జరుగుతున్నదా అని ఆరా తీయడమే. ఈ పని తప్పక చేయాలి. ఇది అంత సులువు కాకపోయినా పిల్లల మెల్లగా బుజ్జగించి ఆ విషయాన్ని రాబట్టాల్సి ఉంటుంది. లేదా అమ్మమ్మలు, తాతయ్య లు అయితే హక్కుగా కూడా నిలదీసి తెలుసుకోవచ్చు. అలా జరుగుతున్న పక్షంలో ఆ తల్లిదండ్రులను హెచ్చరించాలి లేదా పిల్లల్ని ఆ వాతావరణం నుంచి తప్పించాల్సి ఉంటుంది. బ్లాక్‌మెయిలింగ్ సాధనం భార్యాభర్తల కొట్లాటలలో పిల్లలు ఒక బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా మారటం చాలా విషాదం. సమస్య చేయి దాటేశాక భర్తను/భార్యను తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి ‘నా మాట వినకపోతే పిల్లల్ని చంపేస్తా’ అనే వరకూ వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకు శాంపిల్‌గా పిల్లలకు వాతలు పెట్టి జీవిత భాగస్వామిని భయభ్రాంతం చేయాలనుకునే తల్లి/తండ్రి ఉన్నారు. ఈ సమస్య నుంచి పిల్లలు తమను తాము కాపాడుకోలేరు. దగ్గరి బంధువులే ఒక కన్నేసి పెట్టి ఈ పిల్లల గురించి పట్టించుకోవాలి. ‘మాకెందుకులే’ అనే భయం ఉంటే కనీసం చైల్డ్ కేర్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పడమో, పోలీసులకు ఇన్ఫామ్ చేయడమో చేయాలి. తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. కుదరని సంసారం నుంచి బయటపడటం లేదా సర్దుబాటు చేసుకోవడం ఈ ప్రాసెస్‌లో భార్య/భర్త ఒకరినొకరు ఎంత ఇబ్బంది పెట్టుకున్నా ఆ వ్యవహారంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఏ మాత్రం సంస్కారం కాదని గ్రహించాలి. ఇటీవల బడులలో ‘గుడ్ టచ్’ ‘బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ‘కొట్టే తల్లిదండ్రులు’ గురించి కూడా పిల్లలు టీచర్లకు చెప్పే అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే పిల్లల్ని కొట్టే తల్లిదండ్రుల ఆగడాలు ఆగుతాయి. -
Afghanistan: అప్పుడే మొదలు.. ఇంటింటికీ వెళ్లి..
కాబూల్: తాము గతంలో పాలించినట్లు ఈ సారి పాలన ఉండదని పూర్తిగా మారినట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే వారి పలుకులకు జనసంచరంలోని తాలిబన్ల చేతలకు ఏ మాత్రం పొంతన లేదు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాలకి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంట్లిట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారట. దీని బట్టి చూస్తే అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు నరమేదాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా గతంలో నాటో దళాలకు, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ఆచూకీ దొరకకపోతే వారి కుటుంబసభ్యులను బెరిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొందర్ని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారని, ఆ బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో తెలిపింది.అమెరికా బలగాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్న సమయంలో.. నాటో దళాలు కూడా తాలిబన్ల అరాచకాలను ఎంతో సమర్థవంతంగా నిలువరించగలిగాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సహకరించిన వారి కోసం తాలిబన్లు వేట మొదలు పెట్టారంట. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయమని, లేదంటే వాళ్లను పట్టుకుని విచారించి, వారి కుటుంసభ్యులను శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు యూఎన్ తన రిపోర్ట్‌లో తెలిపింది.