ఎవరికైనా ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గి, జొమాటో వంటి యాప్స్ ఉపయోగిస్తారు. కానీ ఒక యువతీ తన బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీసుకోవడానికి జొమాటో వాడింది. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న ఒక యువతికి తన బాయ్ ఫ్రెండ్‌తో మనస్పర్థలు రావడంతో రివెంజ్ తీసుకోవడానికి.. అతని అనుమతి లేకుండానే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్‌తో జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా డెలివరీ బాయ్ ఆ యువకుని అడ్రస్‌కి వెళితే నేను ఆర్డర్ పెట్టలేదని, డబ్బు ఇవ్వనని వాదించాడు.
(ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!)
ఇలా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్‌కి మూడు సార్లు ఫుడ్ ఆర్డర్ చేసింది. మూడు సార్లు నేను ఆర్డర్ చేయలేదని ఆ యువకుడు డబ్బు ఇవ్వకుండా డెలివరీ బాయ్‌ని వెనక్కి పంపించాడు. దీంతో విసిగిపోయిన కంపెనీ నేరుగా ఆ యువతికి దయచేసి ఇలా చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay!
— zomato (@zomato) August 2, 2023
Comments
Please login to add a commentAdd a comment