Zomato
-
క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్ఇన్లో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు జొమాటో, స్విగ్గీలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సన్నద్ధమవుతోంది. ఈ కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతుల ద్వారా మార్కెట్ తటస్థతకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపింది. దాంతో దేశవ్యాప్తంగా వేలాది రెస్టారెంట్ల మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఎన్ఆర్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్ఆర్ఏఐ ఆందోళనకు కారణాలుప్రైవేట్ లేబులింగ్: ఫుడ్ ఐటమ్స్ డెలివరీ చేయడానికి జొమాటో, స్విగ్గీలు బ్లింకిట్ బిస్ట్రో(Blinkit Bistro), స్విగ్గీ స్నాక్(Swiggy Snacc) వంటి ప్రత్యేక యాప్‌లను ప్రారంభించాయి. దీనివల్ల మార్కెట్‌పై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని భావిస్తున్నాయి. ఇది న్యాయబద్ధమైన పోటీకి వ్యతిరేకం అని విమర్శలున్నాయి.డేటా మానిటైజేషన్: సంబంధిత వినియోగదారుల డేటాను రెస్టారెంట్లతో పంచుకోకుండా పోటీ ఉత్పత్తులను సృష్టించడానికి జొమాటో(Zomato), స్విగ్గీ పకడ్బందీ విధానలు అనుసరిస్తున్నాయి. రెస్టారెంట్ డేటాను మాత్రం తమకు అనుకూలంగా వినియోగిస్తున్నాయని ఎన్ఆర్ఏఐ పేర్కొంది.ఎన్ఆర్ఏఐ స్పందన..రెస్టారెంట్ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన పరిష్కారాలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నామని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. జొమాటో, స్విగ్గీలు మార్కెట్‌పై గుత్తాధిపత్యం సాధించకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి చేస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్జొమాటో బ్లింకిట్ బిస్ట్రోజొమాటో, స్విగ్గీ తమ వినియోగదారులకు భోజనంతోపాటు ఇతర ప్రత్యేక సేవలందించేందుకు కొన్ని యాప్‌లను ఇటీవల ప్రారంభించాయి. జొమాటో బ్లింకిట్ బిస్ట్రో పేరుతో జనవరి 10, 2025 కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. భోజనం, స్నాక్స్, పానీయాలను 10 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో డెలివరీ చేస్తామని తెలిపింది. ప్రిజర్వేటివ్స్, ఫుడ్ ప్రాసెసర్లు, మైక్రోవేవ్ ప్రాసెసింగ్ లేకుండా ఆహారాన్ని తయారు చేస్తామని హామీ ఇచ్చింది.స్విగ్గీ స్నాక్స్విగ్గీ స్నాక్ యాప్‌ను జనవరి 7, 2025న లాంచ్ చేశారు. స్నాక్స్, పానీయాలు, భోజనాలను 10-15 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నారు. తొలుత బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభించి క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
మళ్లీ జొమాటో క్విక్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది. -
10 నిమిషాల్లో అంబులెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్విక్ కామర్స్ రంగంలో సంచలనానికి బ్లింకిట్ తెరతీసింది. ఇప్పటి వరకు ఆహారం, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు పరిమితమైన క్విక్ కామర్స్(Quick Commerce) రంగంలో ఏకంగా అంబులెన్స్ సేవలకు కంపెనీ శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాతిపదికన ఈ సేవలను మొదట గురుగ్రామ్‌లో ప్రారంభించింది. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సర్వీసులను విస్తరించనుననట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..ఆక్సిజన్ సిలిండర్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ (ఏఈడీ), స్ట్రెచర్, మానిటర్, సక్షన్ మెషీన్, అత్యవసర మందులు, ఇంజెక్షన్లు ఈ అంబులెన్సులో ఉంటాయి. డ్రైవర్‌తోపాటు పారామెడిక్, డ్యూటీ అసిస్టెంట్ సైతం ఉంటారు. ‘నగరాల్లో త్వరిత, విశ్వసనీయ అంబులెన్స్(Ambulance) సేవలను అందించే విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. గురుగ్రామ్‌లో తొలి ఐదు అంబులెన్స్‌లు రోడ్డెక్కనున్నాయి. వచ్చే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. లాభం లక్ష్యం కాదు. కస్టమర్లకు సరసమైన ధరతో ఈ సేవను నిర్వహిస్తాం. దీర్ఘకాలికంగా ఈ క్లిష్ట సమస్యను నిజంగా పరిష్కరించడంలో పెట్టుబడి పెట్టాం’ అని బ్లింకిట్ సీఈవో అల్బిందర్ ధిండ్సా చెప్పారు. -
జొమాటో చరిత్రలోనే తొలిసారి.. ఒక్కడే రూ.5 లక్షల బిల్లు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' (Swiggy) 2024కు సంబంధించిన యాన్యువల్ డేటా విడుదల చేసిన తరువాత 'జొమాటో' (Zomato) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ 'బిర్యానీ' అని తేల్చి చెప్పింది. అయితే ఒక్క వ్యక్తి మాత్రం ఒక రెస్టారెంట్లో రూ. 5 లక్షల కంటే ఎక్కువ బిల్ చెల్లించినట్లు సమాచారం.2024లో జొమాటో ద్వారా 9 కోట్ల కంటే ఎక్కువ బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు సమాచారం. అంతే సెకనుకు మూడు బిర్యానీల కంటే ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి. వరుసగా తొమ్మిదో సంవత్సరం కూడా ఎక్కువమంది ఆర్డర్ చేసుకున్న ఫుడ్‌గా బిర్యానీ రెకార్డ్ క్రియేట్ చేసింది. అయితే స్విగ్గీలో రైస్ డిష్ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం అని తెలుస్తోంది.బిర్యానీ తరువాత ఎక్కువగా ఆర్డర్ చేయబడిన ఆహార పదార్థాల జాబితాలో పిజ్జా రెండవ స్థానంలో ఉంది. 2024లో జొమాటో ఏకంగా 5 కోట్ల కంటే ఎక్కువ పిజ్జాలను డెలివరీ చేసింది. ఫుడ్ విషయం పక్కన పెడితే 77,76,725 కప్పుల 'టీ', 74,32,856 కప్పుల కాఫీ ఆర్డర్లను జొమాటో స్వీకరించింది.అగ్రస్థానములో ఢిల్లీజొమాటో ఆఫర్లతో, ఢిల్లీ నివాసితులు తమ భోజన ఖర్చులపై ఏకంగా రూ. 195 కోట్లను ఆదా చేసినట్లు జొమాటో వెల్లడించింది. ఆ తరువాత జాబితాలో బెంగళూరు, ముంబై వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం భారతీయులు జనవరి 1 నుంచి డిసెంబర్ 6 మధ్య 1 కోటి కంటే ఎక్కువ టేబుల్లను రిజర్వ్ చేసుకోవడానికి జొమాటోను ఉపయోగించారు. ఇందులో ఎక్కువగా ఫాదర్స్ డే రోజు రిజర్వ్ చేసుకున్నారు.ఒకే వ్యక్తి రూ.5.13 లక్షల బిల్లుఒక్కసారికి మహా అయితే ఓ వెయ్యి లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్తే.. ఒక పది వేలు ఖర్చు అవుతుంది అనుకుందాం. కానీ బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఒక రెస్టారంట్లో ఏకంగా రూ. 5.13 లక్షలు బిల్ చెల్లించినట్లు జొమాటో వెల్లడించింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఇంత చెల్లించడం జొమాటో చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్‌కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి. -
10 రూపాయిల వాటర్ బాటిల్ ఖరీదు వంద రూపాయలా?
ఢిల్లీ: రూ.10 వాటర్ బాటిల్ రూ.100కి అమ్మడం ఏంటి? అని ప్రశ్నిస్తూ ఓ ఐటీ ఉద్యోగి ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఐటీ ఉద్యోగి పల్లబ్దే ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి అమ్ముతున్నట్లు గుర్తించాడు. ఇదే విషయాన్ని ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటాను అడిగారు.How is @zomato allowed to sell Rs. 10 water bottles for Rs. 100 at concert venues where no one is allowed to bring their own bottles?@VijayGopal_ pic.twitter.com/clQWDcIb7m— Pallab De (@indyan) December 17, 2024 ‘తాము పాల్గొన్న ఈవెంట్లో వాటర్ బాటిల్స్ నిషేదం.ఈవెంట్ నిర్వహించే వాళ్లే వాటర్ బాటిళ్లనూ అమ్ముతున్నారు. దాహం వేస్తుంది కదా అని రూ.10 వాటర్ బాటిళ్లను రెండింటిని కొనుగోలు చేశా. రూ.20 ఇచ్చా. కానీ సదరు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి నా నుంచి రూ.200 వసూలు చేశారు.‘ఎవరూ తమ సొంత వాటర్ బాటిళ్లను తీసుకురావడానికి అనుమతించని ఈవెంట్లో రూ.10 వాటర్ బాటిల్‌ను రూ.100కి విక్రయించడానికి జొమాటోకి అనుమతి ఎలా వచ్చింది? అని అడుగుతూ రెండు వాటర్ బాటిళ్ల ఫొటోల్ని ట్వీట్లో జత చేశాడు.పల్లబ్ ట్వీట్‌పై జొమాటో స్పందించింది. తాము, ఆ వాటర్ బాటిల్స్‌ను అమ్మలేదని, టికెటింగ్ పార్ట్నర్గా ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ కస్టమర్‌కు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. -
కట్టండి రూ.803 కోట్లు.. జొమాటోకు జీఎస్టీ దెబ్బ!
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకు (Zomato) జీఎస్టీ (GST) విభాగం నుంచి గట్టి దెబ్బ తగిలింది. వడ్డీ, జరిమానాతో సహా రూ.803.4 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ,పెనాల్టీతో జీఎస్టీని చెల్లించని కారణం చూపుతూ పన్ను నోటీసు వచ్చినట్లు జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది."కంపెనీకి 2019 అక్టోబర్ 29 నుండి 2022 మార్చి 31 కాలానికి సంబంధించి 2024 డిసెంబర్ 12న ఒక ఆర్డర్ అందింది. రూ.4,01,70,14,706 జీఎస్టీతోపాటు వడ్డీ, పెనాల్టీ మరో రూ. 4,01,70,14,706 చెల్లించాలని సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్, థానే కమిషనరేట్, మహారాష్ట్ర నుంచి ఆర్డరు జారీ అయింది" జొమాటో పేర్కొంది.అయితే జీఎస్టీ నోటీసులపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు జొమాటో తెలిపింది. దీనిపై తమ న్యాయ, పన్ను సలహాదారులతో సంప్రదించామని, వారి అభిప్రాయాల మేరకు జీఎస్టీ నోటీసులకు వ్యతిరేకంగా సంబంధిత అధికారుల ముందు అప్పీల్ దాఖలు చేస్తామని జొమాటో వివరించింది.సాధారణంగా కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు జొమాటో బిల్లులో మూడు అంశాలు ఉంటాయి. వాటిలో ఆహార పదార్థాల ధర ఒకటి కాగా మరొకటి ఫుడ్ డెలివరీ ఛార్జీ. సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి కంపెనీ దీని నుంచి మినహాయింపు ఇస్తుంది. ఇక మూడోది ఆహారం ధర, ప్లాట్‌ఫామ్ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. ఇందులో ఫుడ్ డెలివరీ ఛార్జీలపై ట్యాక్స్ చెల్లించడం లేదనేది జీఎస్టీ విభాగం అభియోగం. -
జొమాటో సీఈఓ గ్యారేజిలో ఇన్ని కార్లు ఉన్నాయా (ఫోటోలు)
-
మరో ఖరీదైన కారు కొన్న జొమాటో సీఈఓ: ధర ఎన్ని కోట్లో తెలుసా?
జొమాటో ఫౌండర్ అండ్ సీఈఓ 'దీపిందర్ గోయల్' తన గ్యారేజిలో మరో ఖరీదైన 'ఆస్టన్ మార్టిన్ వాంటేజ్' కారును చేర్చారు. రూ.3.99 కోట్ల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారును ఇప్పటి వరకు ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారును కొన్న మొదటి వ్యక్తిగా గోయల్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.దీపిందర్ గోయల్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గుర్గావ్లోని పార్కింగ్ వద్ద ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ ఉండటం చూడవచ్చు. ఇప్పటికే ఈయన గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ డీబీ12 కారుకు కూడా కొనుగోలు చేశారు. కాబట్టి ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ అనేది బ్రాండ్‌కు చెందిన రెండో కారు.ఆస్టన్ మార్టిన్ ఈ ఏడాది ఆగస్ట్‌లో కొత్త వాంటేజ్‌ను ప్రారంభించింది. ఇది టూ-డోర్ కూపే. ఇందులో పెద్ద గ్రిల్, వర్టికల్ ఎయిర్ కర్టెన్లు, రివైజ్డ్ బోనెట్, హై పెర్ఫార్మెన్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, మెరుగైన ఫెండర్ ఎయిర్ డక్ట్లు, రివైజ్డ్ రియర్ బంపర్, రియర్ డిఫ్యూజర్, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి.10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 15-స్పీకర్ ఆడియో సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిజికల్ టోగుల్స్ వంటి ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఇందులో చూడవచ్చు. ఈ కారులోని 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ 502.88 Bhp పవర్, 675 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 325 కిమీ కంటే ఎక్కువ.దీపిందర్ గోయల్ గ్యారేజిలోని ఇతర కార్లుదీపిందర్ గోయల్ గ్యారేజిలో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కారు మాత్రమే కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే కారెరా ఎస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
‘మీరు ముసలాడవ్వకూడదు’
వృద్ధాప్యం దరిచేరనివ్వకూడదంటూ ప్రచారం సాగిస్తున్న ఓ ప్రముఖ కంపెనీ సహవ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ తాజాగా తాను రాసిన పుస్తకంతోపాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రతివ్యక్తి వేగంగా వృద్ధాప్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని బ్రయాన్ జాన్సన్ కోరుతుంటారు. ఈమేరకు ‘బ్లూప్రింట్’ ప్రాజెక్ట్‌లో భాగంగా రివర్స్ ఏజింగ్(పెద్ద వయసులోనూ యువకుడిలా కనిపించేలా)ను ప్రమోట్ చేస్తున్నారు.బ్రయాన్ జాన్సన్ ఇటీవల తాను రాసిన పుస్తకంతో పాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసేందుకు భారత్‌లో ఆన్లైన్ పుడ్ డెలివరీ సేవలందిస్తున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్‌ను కలవనున్నట్లు సమాచారం. బ్రయాన్ జాన్సన్ వెన్మో సంస్థ సహవ్యవస్థాపకుడు. అయితే ఈయన తన కంపెనీను సుమారు రూ.6,640 కోట్లకు పేపాల్‌కు విక్రయించారు. ఈ డీల్‌తో భారీగా నగదు పోగు చేసుకున్న జాన్సన్ వైద్య నిర్ధారణలు, చికిత్సలు, తన లక్ష్యాలను సాధించడానికి కఠినమైన జీవనశైలి కోసం ఏటా 2 మిలియన్ డాలర్లు(రూ.16.6 కోట్లు) పైగా ఖర్చు చేస్తున్నారు.‘హలో ఇండియా. డోంట్ డైపై నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తి పూనమ్‌పాండే. తనకు దాని గురించి చెప్పాను. నేను డిసెంబర్ 1-3 వరకు ముంబైలో, డిసెంబర్ 4-6 వరకు బెంగళూరులో ఉంటాను’ అంటూ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో తెలియజేస్తూ ‘మర్నామత్(చనిపోకండి)’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉంచారు.ఇదీ చదవండి: రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుజాన్సన్ వృద్ధాప్య చాయలు దరిచేరకూడదని తన టీనేజ్ కుమారుడి నుంచి రక్త మార్పిడి చేసుకున్నారు. జన్యుపరమైన ఇంజెక్షన్లు చేయించుకోవడం, కఠినమైన ఆహార విధానాన్ని అనుసరించడం, రోజూ 100కి పైగా సప్లిమెంట్లను తీసుకోవడం, కఠోర వ్యాయామం.. వంటివి చేస్తూంటారు. -
ప్రత్యేక ఆఫర్‌ను ఆమోదించిన ‘జీతం లేని ఆఫీసర్’!
జొమాటో గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ను ప్రవేశపెట్టింది. అందుకు చీఫ్ ఆఫ్ స్టాప్ ఆమోదం లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇటీవల జొమాటో సీఈఓ దీపిందర్గోయల్ ఓ ప్రకటన చేస్తూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ.20 లక్షలు సంస్థకు ఇవ్వాలని చెప్పారు. అయినాసరే ఈ ప్రకటన వెలువడిన తర్వాత దాదాపు 10 వేలమంది ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వింత ఉద్యోగ ప్రకటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందించడంతో జొమాటో సీఈఓ గోయల్ స్పందిస్తూ రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాజాగా కంపెనీ ప్రారంభించిన గోల్డ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కోసం ‘స్పెషల్ వీకెండ్ ఆఫర్’ ప్రవేశపెట్టేందుకు చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆమోదం లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ పోస్ట్ కోసమే గోయల్ వింత ఉద్యోగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
క్విప్.. కొత్త రికార్డ్!
ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల దూకుడుతో నిధుల సమీకరణ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఒకపక్క పబ్లిక్ ఇష్యూల (ఐపీఓ) వరదతో కంపెనీలు లిస్టింగ్ గంట మోగిస్తుంటే... మరోపక్క, లిస్టెడ్ కంపెనీలు సైతం తగ్గేదేలే అంటున్నాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్) మార్గంలో వేల కోట్లను సమీకరించడం ద్వారా విస్తరణ, ఇతరత్రా అవసరాలను తీర్చుకుంటున్నాయి. ఈ ఏడాది క్విప్ ఇష్యూల బాట పడుతున్న లిస్టెడ్ కంపెనీల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. నవంబర్ నాటికి దాదాపు 75 కంపెనీలు ఇప్పటికే రూ.1,0,2000 కోట్లను సమీకరించాయి. దీంతో 2020 నాటి రూ.80,800 కోట్ల సమీకరణ రికార్డును బ్రేక్ చేసింది. భారీగా సమీకరిస్తున్న ఈ నిధులను కార్పొరేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవడానికి, ప్లాంట్ల విస్తరణ తదితర అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రూ.8,500 కోట్లు, కేఈఐ ఇండస్ట్రీస్ రూ.2,000 కోట్లు చొప్పున తాజాగా సమీకరించాయి. సెప్టెంబర్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.5,000 కోట్ల క్విప్ ఇష్యూను పూర్తి చేసింది. జూలైలో మెటల్–మైనింగ్ దిగ్గజం వేదాంత రూ.8,500 కోట్లను క్విప్ రూట్లో సమీకరించడం తెలిసిందే. వేదాంత ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడం కోసం వినియోగించుకుంది. అదే నెలలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.8,373 కోట్ల క్విప్ నిధులను దక్కించుకుంది. విద్యుత్ ట్రాన్స్మిషన్ కార్యకలాపాల విస్తరణ, స్మార్ట్ మీటరింగ్, రుణాల తిరిగి చెల్లింపు కోసం వీటిని వెచి్చంచనుంది. మరిన్ని కంపెనీలు క్విప్ బాటలో ఉండటంతో మొత్తంమీద ఈ ఏడాది క్విప్ సమీకరణ మరింత ఎగబాకే అవకాశాలున్నాయి.నిధులతో రెడీ... దేశీ కార్పొరేట్ దిగ్గజాలు కొత్త ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇతర కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా భారీగా విస్తరించే ప్రణాళికల్లో ఉన్నాయి. తద్వారా పోటీ కంపెనీలతో తలపడేందుకు, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నిధులను సిద్ధం చేసుకుంటున్నాయని కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు చెందిన క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ వి. జయశంకర్ పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల క్విప్ ఇష్యూకు రాగా, మరో రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్టŠస్ క్విప్ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. ఏప్రిల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కూడా విస్తరణ ప్రణాళికల కోసం రూ.5,000 కోట్ల క్విప్ నిధులను ఖాతాలో వేసుకుంది. ఇలా భారీ మొత్తాన్ని దక్కించుకున్న కంపెనీల్లో స్వాన్ ఎనర్జీ (రూ.3,319 కోట్లు), మాక్రోటెక్ డెవలపర్స్ (రూ.3,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ (రూ.3,000 కోట్లు), కోఫోర్జ్ (రూ.2,240 కోట్లు) కొన్ని. ‘వేల్యుయేషన్స్ సానుకూలంగా ఉండటం, పటిష్టమైన సెకండరీ మార్కెట్లతో పాటు పెట్టుబడులకు ఇన్వెస్టర్లు క్యూ కడుతుండటం వంటి అంశాలు లిస్టెడ్ కంపెనీల క్విప్ జోరుకు ప్రధాన కారణం. కొత్త ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ నిధులను ఖర్చు చేస్తున్నాయి. మూలధన అవసరాల కోసం చాలా లిస్టెడ్ కంపెనీలు ఇదే రూట్‌ను ఆశ్రయిస్తున్నాయి’ అని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు చెందిన ఈక్విటీ విభాగం హెడ్ దీపక్ కౌశిక్ చెప్పారు. ఏంజెల్ వన్, శ్యామ్ మెటాలిక్స్, టెక్నో ఎలక్ట్రిక్, లాయిడ్స్ మెటల్స్, క్రాఫ్టŠస్మన్ ఆటోమేషన్, చాలెట్ హోల్స్, స్టెరిలైట్ టెక్నాలజీస్ వంటివి కంపెనీలు గడిచిన కొద్ది నెలల్లో రూ.1,000–1,500 కోట్ల స్థాయిలో క్విప్ నిధులను సమీకరించాయి.క్విప్ అంటే... ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు నిధులను సమీకరించే సాధనాల్లో క్విప్ కూడా ఒకటి. అర్హతగల సంస్థాగత బయ్యర్లకు (క్యూఐబీ) ఈక్విటీ షేర్లను, పూర్తిగా–పాక్షికంగా షేర్లుగా మార్చుకోగల డిబెంచర్లు లేదా ఇతరత్రా సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులను సమకూర్చుకోవడానికి ‘క్విప్’ వీలు కలి్పస్తుంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడుల్లో విశేష అనుభవం గల, ఆరి్థకంగా బలమైన సంస్థాగత ఇన్వెస్టర్లను సెబీ క్యూఐబీలుగా నిర్దేశించింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో జొమాటో ఒకటి. ఈ కంపెనీ సీఈఓ 'దీపిందర్ గోయల్' మరో రెండేళ్లు (2026 మార్చి 31 వరకు) జీతం తీసుకోనని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) డాక్యుమెంట్లలో వెల్లడించారు.దీపిందర్ గోయల్ 2021లోనే 36 నెలలు లేదా మూడేళ్లు జీతం తీసుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనిని మరో రెండేళ్లు పొడిగించారు. అంటే 2025-26 ఆర్ధిక సంవత్సరం వరకు (మొత్తం ఐదేళ్లు) గోయల్ జీతం తీసుకోకుండా ఉంటారు. జీతం వద్దనుకున్నప్పటికీ గోయల్ జొమాటో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.దీపిందర్ గోయల్ జీతాన్ని వదులుకున్నప్పటికీ.. ఈయనకు కంపెనీలో భారీ వాటా ఉంది. నవంబర్ 25 నాటికి, జొమాటో ముగింపు షేరు ధర ఆధారంగా కంపెనీలో అతని వాటా విలువ సుమారు రూ.10,000 కోట్లు. జొమాటో షేర్స్ ఈ ఏడాది మెరుగ్గా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 125 శాతం పుంజుకుంది. -
జొమాటో క్విప్ @ రూ. 266
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు తెరతీసింది. సోమవారం ప్రారంభమైన క్విప్‌నకు షేరుకి రూ. 265.91 చొప్పున ఫ్లోర్ ధరగా నిర్ణయించింది.బోర్డు ఏర్పాటు చేసిన నిధుల సమీకరణ కమిటీ క్విప్‌నకు ఆమోదముద్ర వేసినట్లు ఫుడ్ అగ్రిగేటర్ కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ వెల్లడించారు. బ్యాలన్స్‌షీట్ పటిష్టత కోసమే పెట్టుబడుల సమీకరణ చేపట్టినట్లు తెలియజేశారు. క్విప్ నేపథ్యంలో జొమాటో షేరు బీఎస్ఈలో 2.4% బలపడి రూ. 280 వద్ద ముగిసింది. -
దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్ కారును చాలా తక్కువ మంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జాబితాలో నటుడు రణబీర్ కపూర్ ఉన్నారు. ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.ఈ కారులోని 6 లీటర్ డబ్ల్యు 12 ఇంజిన్ 650 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ కారులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: జస్ట్ నిద్రపోయాడంతేగా.. ఉద్యోగిని తీసేసిన కంపెనీకి రూ.41 లక్షల ఫైన్దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ కారును కలిగి ఉన్నారు. ఇది కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, పోర్స్చే 911 కారెరా ఎస్, లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటి కార్లు గోయల్ గ్యారేజిలో ఉన్నాయి. View this post on Instagram A post shared by Car Crazy India® (@carcrazy.india) -
జీతం లేని జాబ్.. స్పందించిన మాజీ ఉద్యోగి: ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ జీతమే లేని ఉద్యోగానికి సంబంధించి ఒక వినూత్న ప్రకటన చేశారు. జీతం ఇవ్వకపోగా.. ఉద్యోగి రూ.20 లక్షలు చెల్లించాలని మొదట్లో పేర్కొన్నప్పటికీ.. ఇప్పుడు దానిపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ జాబ్ గురించి జొమాటో మాజీ కన్స్యూమర్ ఇంజనీరింగ్ హెడ్ అర్నవ్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేసారు.చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి మొదటి ఏడాది 20 లక్షలు చెల్లించాలని పేర్కొన్నారు. రెండో ఏడాది ఆ ఉద్యోగికి రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని ప్రకటించారు. ఈ ఉద్యోగానికి ఏకంగా 18,000 మంది అప్లై చేసుకున్నారు. ఆ తరువాత గోయల్ స్పందిస్తూ.. రూ.20 లక్షలు చెల్లించడం అనేది కేవలం వడపోత కోసం మాత్రమే అని పేర్కొంటూ.. రూ.20 లక్షలు చెల్లించే స్తోమత ఉన్న అభ్యర్థుల దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.ఈ వినూత్న జాబ్ ఆఫర్ గురించి మాజీ జొమాటో ఉద్యోగి మాట్లాడుతూ.. గోయల్ ఆలోచనను సమర్ధించారు. ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి.. తాను ఎంబీఏలో చేరి నేర్చుకునేదాని కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటాడని అన్నారు. పెయిడ్ ఇంటర్న్‌షిప్ గురించి చాలామంది తెలివి తక్కువగా ఆలోచిస్తారు. జొమాటోలో జాబ్ పొందితే.. ఆ ఆలోచనను వదిలేస్తారు. మీరు మేనేజ్మెంట్ కన్సల్టింగ్ / స్ట్రాటజీలో కెరీర్ కోసం చూస్తున్నట్లయితే.. దాని విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువే అని 'అర్నవ్ గుప్తా' (Arnav Gupta) పేర్కొన్నారు.జొమాటో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు.ఇదీ చదవండి: సరైన సమయానికి.. అనువైన ఫీచర్: ఎయిర్ క్వాలిటీ ఇట్టే చెప్పేస్తుందిఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. త్వరలోనే ఉద్యోగిని ఎంపిక చేసి గోయల్ అధికారికంగా ప్రకటించనున్నారు.I know people are commenting various stupid things about "paid internship"Leaving this note here as someone who got the chance to work 1 year with @deepigoyal, if you're looking for a career in Management Consulting / Strategy, this is worth waaaay more than ₹20L!— Arnav Gupta (@championswimmer) November 20, 2024 -
జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు
ఉద్యోగంలో చేరుతున్నామంటే.. తప్పకుండా జీతం వస్తుందని అందరికి తెలుసు. అయితే జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ. 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు.ఈ వింత ప్రకటన చూసిన చాలామంది, ఇదేం ప్రకటన అనుకునే ఉంటారనుకుంటే భావిస్తే.. ఊహకందని రీతిలో 24 గంటల్లో ఏకంగా 10వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపీందర్ గోయల్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. అప్డేట్ కోసం వేచి ఉండాలని చెప్పారు.జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు. అంతే కాకుండా ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. అయితే ఆ ఉద్యోగి రూ. 20లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండో ఏడాది రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు రెజ్యూమె (Resume) కూడా పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తే సరిపోతుంది.Update 2: we have over 10,000 applications, a lot of them well thought through, mixed between -1. Those who have all the money 2. Those who have some of the money 3. Those who say they don’t have the money 4. Those who really don’t have the money We will be closing the… https://t.co/8a6XhgeOGk— Deepinder Goyal (@deepigoyal) November 21, 2024 -
‘ఉద్యోగం ఇస్తాం.. జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు విరాళం’
ఉద్యోగం ఇస్తాం.. కానీ జీతం ఉండదు.. పైగా రూ.20 లక్షలు ఉద్యోగార్థులే విరాళంగా చెల్లించాలి.. అవును మీరు విన్నది నిజమే. ఇవి ఏకంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పిన మాటలు. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు దరఖాస్తులు కోరారు. ఈమేరకు చేసిన వినూత్న ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాం. ఈ పొజిషన్లో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగార్థులకు పూర్వానుభవం అవసరంలేదు. తమ స్థానంలో చేరిన తర్వాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుంది’ అన్నారు.ఉద్యోగి రూ.20 లక్షలు విరాళం‘ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి మొదటి ఏడాది ఎలాంటి వేతనం ఉండదు. పైగా ఆ వ్యక్తి రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగి కోరికమేరకు జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళం ఇస్తుంది. రెండో ఏడాది నుంచి మాత్రం రూ.50 లక్షలకు తగ్గకుండా ఆ ఉద్యోగికి వేతనం చెల్లిస్తాం’ అని దీపిందర్ తెలిపారు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!రెజ్యూమె అవసరం లేదు‘ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసేవారు రెజ్యూమె పంపాల్సిన అవసరంలేదు. 200 పదాలకు తగ్గకుండా తమ వివరాలు తెలియజేస్తూ కవర్ లెటర్ పంపించాలి. దీన్ని d@zomato.comకు పంపించాలి’ అని చెప్పారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. రూ.20 లక్షలు ఫీజు పెట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులను దూరం చేస్తున్నట్లేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌ను దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దొరుకుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. -
తల్లీ.. నీకు సెల్యూట్!
నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్‌కోట్ యువతి తన బిడ్డను మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్‌గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఆమెను వీడియో తీసి, బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్‌కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్ నడుపుతున్నావ్.. బద్రం సిస్టర్’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
జొమాటో కొత్త యాప్ లాంచ్: ఇదెలా ఉపయోగపడుతుందంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'జొమాటో' ఎట్టకేలకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం డిస్ట్రిక్ట్ (District) పేరుతో ఓ కొత్త యాప్ లాంచ్ చేసింది. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.డిస్ట్రిక్ట్ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసింది. దీనికోసం జొమాటో రూ. 2048 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్‌లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్‌కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్‌ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్‌గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్‌కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్‌కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్‌ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్‌కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
నాలుగు లైన్ల పోస్ట్‌కు స్పందించి జాబ్ ఆఫర్!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ‘ఫుడ్ రెస్క్యూ’కు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌పై కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఆ నెటిజన్‌కు జాబ్ కూడా ఆఫర్ చేశారు. అసలు ఆ నెటిజన్ పోస్టేంటి.. సీఈఓ ఎందుకు జాబ్ ఆఫర్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.ఆహార వృథాను అరికట్టడానికి జొమాటో కొత్తగా ‘ఫుడ్ రెస్క్యూ’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృథా సమస్యను పరిష్కరించడానికి ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు జొమాటో సీఈఓ గోయల్ ఇటీవల ప్రకటించారు. కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఫుడ్‌ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024కొత్త ఫీచర్‌కు సంబంధించిన ప్రకటనపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను కొనుగోలు చేయడంలో భద్రత ప్రశ్నార్థకంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది వినియోగదారులు ఆహారం వృథా అవ్వకుండా రాయితీపై భోజన సదుపాయాన్ని కల్పించే విధానాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే బెంగళూరుకు చెందిన ప్రోడక్ట్ మేనేజర్ భాను అనే నెటిజన్ ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరిన్ని నిబంధనలు అమలు చేయాలని కంపెనీకి సూచిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.validations1.should not be applicable to COD2.Cancellation should not be allowed if the delivery reaches 500 m to the delivery point 3.Chances of 2 idiots sharing meals ordering and cancelling at the same time getting a discount place 4.< two cancellations are allowed/ month.— Bhanu (@BhanuTasp) November 10, 2024ఇదీ చదవండి: ఏఐని ఎక్కువగా వాడుతున్నది మనమే..‘ఫుడ్ రెస్క్యూ ఫీచర్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లను మినహాయించాలి. డెలివరీ పార్ట్నర్ వినియోగదారుల లోకేషన్‌కు 500 మీటర్ల పరిధిలో ఉంటే కస్టమర్లు ఆర్డర్లను రద్దు చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే స్థానంలో ఉన్న ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు ఫుడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేసిన వెంటనే పక్కనే ఉన్న మరో కస్టమర్ దాన్ని రాయితీతో తిరిగి బుక్ చేసి ఇద్దరూ షేర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరిన్ని నిబంధనలు తీసుకురావాలి. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కంపెనీ ప్రతి కస్టమర్‌కు క్యాన్సిల్ చేసే ఆర్డర్లలో పరిమితులు విధించాలి. రోజుకు గరిష్ఠంగా రెండు ఆర్డర్లు మాత్రమే రద్దు చేసేందుకు వీలు కల్పించాలి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన జొమాటో సీఈఓ ఈ సూచనలు ఇప్పటికే కొత్త ఫీచర్లో చేర్చబడినట్లు చెప్పారు. నెటిజన్ సలహాలు, ఆలోచనలను మెచ్చుకుంటూ తన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ‘ఎవరు మీరు ఏమి చేస్తారు? మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మనం కలిసి పని చేద్దాం’ అని పోస్ట్ చేశారు. -
‘తను నా కోసమే పుట్టిందనిపించింది’
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల తన భార్య గ్రేసియా మునోజ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, తన భార్య, రచయిత్రి సుధా మూర్తితో వేదిక పంచుకున్నారు. దీపిందర్ తన భార్యను ముందుగా ఎలా కలుసుకున్నారో ఈ కార్యక్రమంలో తెలిపారు.‘గ్రేసియాను కలవడానికి ముందు చాలా కాలంపాటు ఒంటరిగా ఉన్నాను. స్నేహితులను తరచు కలుస్తుండేవాడిని. అందులో ఒక స్నేహితుడు పెళ్లి చేసుకోకూడదని సలహా ఇచ్చాడు. ఇంకో స్నేహితుడు మాత్రం నాకు గ్రేసియాను పరిచయం చేశాడు. ఆ సమయంలో తాను నాకోసమే పుట్టిందనిపించింది. చాలా కొద్ది కాలంలోనే మేం కలిపిపోయాం’ అని చెప్పారు. మెక్సికోకు చెందిన గ్రేసియాను కపిల్ భారతీయ వంటకాల గురించి అడిగారు. పంజాబీ వంటకాలకు ప్రాధాన్యతనిస్తానని ఆమె చెప్పారు. ‘ఛోలే భతుర్’ తన ఫేవరెట్ డిష్ అని తెలిపారు. ఇంట్లో ‘పంజాబీ రసోయి’ తయారు చేసుకుంటారా అని కపిల్ అడిగినప్పుడు, తాము జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికే ఇష్టపడుతామని చెప్పారు.ఇదీ చదవండి: ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!గ్రేసియా మునోజ్ మోడలింగ్, లగ్జరీ ఫ్యాషన్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2022లో యునైటెడ్ స్టేట్స్లో మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ అవార్డును అందుకున్నారు. పిల్లల పోషణ, మహిళల సాధికారతపై దృష్టి సారించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీపిందర్, గ్రేసియా ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది దీపిందర్‌కు రెండో వివాహం. అతను గతంలో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచన్ జోషిని వివాహం చేసుకున్నారు.