జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని తింటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి.. మన కడుపు నింపడం కోసం కడుపు మాడ్చుకుని పనిచేసే ఇలాంటి డెలివరీ బాయ్ ల యోగక్షేమాలు కూడా పట్టించుకోండని ఒక ఐఏఎస్ అధికారి నెటిజెన్లను కోరారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.
బాగా బిజీగా ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్ పార్సిల్ అందించిన తర్వాత అక్కడే పార్కింగ్ ఏరియాలో తన బైక్ వద్ద నిలబడి ప్లాస్టిక్ కవర్లో తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారుగా తింటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోయే ఈ సన్నివేశాన్ని అవనీశ్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో అప్లోడ్ చేయగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా.. "ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి గురించి కూడా కొంచెం పట్టించుకోండి.." అని రాశారు.
इस मौसम में इनका भी ख्याल रखें. pic.twitter.com/Rf2kHs4srk
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) June 20, 2023
ఈ వీడియోకు వీక్షకుల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందించారు. అలాంటి వారికి మీకు తోచినది పెట్టి వారి కడుపు నింపమని, కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇచ్చి వారి గొంతు తడపమని అభ్యర్థిస్తున్నారు నెటిజన్లు.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి జీవన విధానం తేలికైపోయింది. వైవిధ్యమైన, నోరూరించే ఆహారాల్లో ఏది కావాలంటే అది ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు నచ్చిన ఐటమ్ నిముషాల్లో మన ముందు వాలిపోతుంది. కానీ దాని వెనుక ఇలాంటి ఎందరో శ్రామికుల కష్టం దాగుంది. కుటుంబ పోషణ కష్టమైన ఈ రోజుల్లో, వారు ఆకలికి ఓర్చుకుని ఎదుటివారి ఆకలిని తీరుస్తున్నారన్న విషయాన్ని మరువకూడదు.
ఇది కూడా చదవండి: 106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
Comments
Please login to add a commentAdd a comment