![The Child Wrote a Film Dialogue on the Last Page of the Answer Sheet](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/student-main.jpg.webp?itok=FC8_hrqM)
సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ప్రతీరోజూ మనకు వింతలు, విచిత్రాలను చూపిస్తుంటుంది. వీటిలో కొన్ని వారేవా అనిపిస్తుంగా, మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇదేవిధంగా సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ తెగ నవ్విస్తుంటారు.
సోషల్ మీడియాలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. హాల్ టిక్కెట్లలో ఒక విద్యార్థి పేరుకు బదులు మరొకరి పేరు రావడం, ఎగ్జామ్ సెంటర్‌లో తప్పులు రావడం లాంటివి మనం ఇంతవరకూ చూసివుంటాం. అలాగే సమాధాన పత్రంలో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాయడం, ఏవో విజ్ఞప్తులు, అభ్యర్థనలు చేయడం లాంటివాటి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అయితే దీనికి భిన్నంగా ఒక తెలివైన విద్యార్థి ఆన్సర్ షీట్‌లో ఏమి రాశాడో తెలిస్తేఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక టీచర్ ఎవరో విద్యార్థి ఆన్సర్ షీట్ చెక్ చేస్తూ కనిపిస్తారు. ఆయన వీడియోను దగ్గరకు తీసుకురమ్మని సైగలు చేయడం కూడా కనిపిస్తుంది. తరువాత కెమెరాను ఆన్సర్ షీట్‌పై ఫోకస్ చేయమని ఆ టీచర్ చెప్పడాన్ని గమనించవచ్చు. తరువాత ఆయన మాట్లాడుతూ ‘ఈ కుర్రాడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు.
Define Aura 🗿 pic.twitter.com/MHzKmXZKlX
— Prof cheems ॐ (@Prof_Cheems) February 7, 2025
పేపర్ చివరిలో రాసినది కూడా సరైన సమాధానమే’ అంటూ ఆ కుర్రాడు సమాధాన పత్రంలో చివర రాసిన వాక్యాన్ని చూపిస్తారు. ఆ కుర్రాడు ‘అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురుచూస్తున్నప్పడు.. విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు’ అని రాశాడు. దీనిని చూపించిన తరువాత టీచర్ ఆ ఆన్సర్ షీట్‌పై 80కి 80 మార్కులు వేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను @Prof_Cheems పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటిరకూ 2 లక్షల 92 వేల మంది వీక్షించారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్‌రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం!
Comments
Please login to add a commentAdd a comment