Answer sheet
-
Function of the Heart: విశాల హృదయం
క్వశ్చన్ పేపర్లో ‘గుండె బొమ్మ గీసి వివిధ భాగాలను వివరించుము’ అనే ప్రశ్నను చూసిన స్టూడెంట్ మహాశయుడు ఎక్కడికో వెళ్లిపోయాడు. గుండె బొమ్మను కలర్ఫుల్గా గీయడం వరకు ఓకే. అయితే ఆ గుండెలో వివిధ భాగాలలో తాను ప్రేమించిన అమ్మాయిల పేర్లు రాశాడు. ప్రియా, నమిత, హరిత, రూప, పూజలాంటి పేర్లు రాశాడు. మరో అడుగు ముందుకు వేసి ‘ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్’ అనే హెడ్‌లైన్‌తో వారిని తాను ఎందుకు ప్రేమిస్తున్నానో రాశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనులను నవ్వులలో ముంచెత్తుతుంది. -
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్‌షీట్‌లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్‌కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్‌లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్‌షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్‌ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమంటే..!
తిరువనంతపురం: పరీక్షల్లో ఎవరికైనా ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యార్థికి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్ అండ్ సిస్టమ్స్’పరీక్షకు హాజరుకాలేకపోయాడు. అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆఫీస్ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇన్విజిలేటర్ కూడా దాన్నే విద్యార్థికి ఇచ్చాడు. పేపర్ దిద్దిన ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించి పైఅధికారులకు తెలిపాడు. దాంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసిన మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది. -
ఆన్సర్షీట్ల చోరీ కేసు.. పరారీలో సీఐ
సాక్షి, బెంగళూరు: మైసూరు వర్సిటీ ఆన్సర్షీట్ల చోరీ కేసులో మండి పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామితో పాటు మరో ఆరు మందిపై క్రిమినల్ కేసు దాఖలైంది. ఇది తెలిసి సీఐ పరారయ్యారు. మైసూరు వర్సిటీ ఉద్యోగి మహమ్మద్ నిసార్, కాంట్రాక్టు ఉద్యోగి రాకేశ్, విద్యార్థులు చందన్, చేతన్, బ్లూ డైమండ్ లాడ్జీ యజమానిపై కేసు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ 15, 17న పీజీ కోర్సు రసాయన శాస్త్రం పరీక్ష జరిగింది. ఆ తర్వాత మహమ్మద్ నిసార్, రాకేశ్‌లు కొందరు విద్యార్థుల సమాధాన పత్రాలను ఎత్తుకెళ్లి బ్లూ డైమండ్ లాడ్జీలో ఆ సమాధాన పత్రాలను ఆయా విద్యార్థులకు ఇచ్చి మళ్లీ పరీక్ష రాయించారు. లాడ్జీపై దాడి చేసిన సీఐ నారాయణస్వామి కేసు బయటకు రాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని బేరం పెట్టారు. ఈ తతంగంపై జూన్ 9న సోమసుందర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మైసూరు నగర పోలీసు కమిషనర్ చంద్రగుప్తా విచారణకు ఆదేశించారు. సీఐ పరారు కావడం చర్చనీయాంశమైంది. చదవండి: ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై బీజేపీ చెక్! -
జవాబు పత్రాలు ఇవ్వాల్సిందే!
భవిష్యనిధి కార్యాలయంలో ఈఓ, ఏఓలుగా ఉద్యోగోన్నతి కోసం నిర్వహించిన పరీక్షలో అభ్యర్థులు తెలిపిన అనేక అభ్యం తరాలలో ఎన్నింటిని ఆమోదించారు? అందరికీ సమానంగా ప్రయోజనం కలిగిం చారా? ఎంపికైన అభ్యర్థులు రాసిన సమాధాన పత్రాల ప్రతులను ఇవ్వండి అంటూ సమాచార హక్కు చట్టం కింద శైలేంద్ర కుమార్ సింగ్ అడిగారు. మొదటి మూడు అంశాలకు సమాధానం ఇచ్చారు. ఇతరుల సమాధాన పత్రాలు సెక్షన్ 8(1)(ఇ) (ట్రస్టీ హోదాలో ఇచ్చిన సమాచారం) (జె) వ్యక్తిగత సమాచారం అనే మినహా యింపుల కింద ఇవ్వనవసరం లేదని జవాబు ఇచ్చినారు. ఆబ్జెక్టివ్ తరహాతో కూడిన మూడు పరీక్షల నమూనా సమాధానాలు వెల్లడిచేశారు. శైలేంద్ర నాలుగో పరీక్ష నమూనా సమాధానాలు ఇవ్వాలని కోరారు. నాలుగోది వివరమైన సమాధానాల పరీక్ష కావడంతో వారు మోడల్ సమాధాన పత్రాన్ని తయారు చేయలేదు కనుక ప్రకటించలేదు. మొత్తం మూడు వేలమంది పరీక్ష రాస్తే కేవలం అయిదుగురు ఎంపికైనారు. తాను ఎందుకు ఎంపిక కాలేకపోయాను, ఆ అయిదుగురు ఏమేరకు తన కన్నా ప్రతి భావంతులో తెలుసుకోవడం కోసం వారి సమాధాన పత్రాలు అడుగుతున్నానని ఆయన వాదించారు. సీబీఎస్ఈ వర్సెస్ ఆదిత్య బంధోపాధ్యాయ కేసులో (2011) 8 ఎస్ సి సి 497) లో తన సొంత సమాధాన పత్రం అడిగి తీసుకునే హక్కు ఉందా లేదా అనే వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. తన పత్రం తాను చూసుకోగలిగితే తనకు ఇంకా ఎక్కువ మార్కులు రావాలని, లేదా తన సమాధానాలకు అన్యాయంగా తక్కువ మార్కులు ఇచ్చారని, కనుక వాటిని సరిచేయాలని కోరడానికి వీలవుతుంది. సీబీఎస్ఈ మూడు ప్రధానమైన కారణాలను కోర్టు ముందుకు తెచ్చింది. ఒకటి సమాధాన పత్రం తమకు ధర్మకర్త హోదాలో అభ్యర్థులు ఇచ్చిన సమాచారం కనుక ఇతరులకు ఇవ్వడం ధర్మకర్త బాధ్యతలకు భిన్నం అవుతుంది. రెండు: మూల్యాంకనం చేసిన సమాధాన పత్రం వ్యక్తిగత సమాచారం అవుతుంది కనుక ఇవ్వడానికి వీల్లేదు. మూడు: ఇతరుల సమాధాన పత్రాలు అడిగితే ఇవ్వడం సాధ్యం కాదు. అందరూ అందరి పత్రాలు అడిగితే సంక్షోభం ఏర్పడుతుంది. తాము ధార్మిక సంస్థ వంటి వారిమనీ, తమకు ధర్మకర్తల హోదాలో అందిన సమాచారాన్ని ఇతరుల ప్రయోజనాలు రక్షించడం కోసమై తాము ఇవ్వడం సాధ్యం కాదని సీబీఎస్ఈ వాదించింది. ఎవరి సమాధాన పత్రాన్ని వారు చూడాలన్నా వీల్లేదని సీబీఎస్ఈ మొండికేసింది. అభ్యర్థులు నిజానికి ఏ సమాచారమూ ఇవ్వడం లేదు. ధర్మకర్తల హోదా ప్రస్తావనే రాదు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వారు రాస్తారు. వాటికి తగిన విధంగా అధ్యాపకులు మార్కులు వేయాలి. కనుక మూల్యాం కనం చేయని పత్రాలు, చేసిన తరువాత సమాధాన పత్రాలు కూడా ధార్మికంగా దాచవలసిన సమాచారం అనడానికి ఆస్కారం లేదు. అభ్యర్థులు వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారనడం కూడా సరి కాదు. విజ్ఞాన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు తన సమాధానాలు అవి. అవి వ్యక్తిగత సూచనలు కావు.13 లక్షల మంది పరీక్ష రాసినప్పుడు ఎవరి పత్రాలు వారికి ఇవ్వాలన్నా, ఇతరుల సమాధాన పత్రాలు కావాలన్నా తీవ్ర గందరగోళం, సంక్షోభం వస్తుందని కనుక సాధ్యం కాదన్నది సీబీఎస్ఈ. 1984లో సుప్రీంకోర్టు ఇందుకు అంగీకరించిందని చెప్పింది. అభ్యర్థి తన సమాధాన పత్రాన్ని అధికారులు ఏ విధంగా మూల్యాంకనం చేశారో తెలుసుకునేందుకు తన పత్రాన్ని తాను చూసుకునే అధికారం ఉందంటూ చరిత్రాత్మకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. ధర్మకర్తల హోదాలో వచ్చిన సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ మినహాయింపులు వర్తించబోవని కూడా ప్రకటించింది. మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాలు ఈ మినహాయింపు కిందికి రావని చివరకు సీబీఎస్ఈ కూడా అంగీకరించక తప్పలేదు. 13 లక్షల మంది అభ్యర్థులలో సగం మంది అడిగినా సంక్షోభం వంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. నిజమే.. కాని అన్యాయం జరిగితే అడిగే హక్కు లేదా? లక్షలాది మంది పరీక్షలు రాసిన సందర్భాలలో ఇతరుల పత్రాలు ఇవ్వనవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సరైనవే అయినా చిన్న స్థాయిలో నియామకాలు, లేదా పదోన్నతి కోసం పరీక్షలు నిర్వహిస్తే అందులో ఎంపికైన వారి సమాధాన పత్రాలు అడిగినప్పుడు ఆచరణాత్మక ఇబ్బంది అనేది వర్తిం చదు. అయిదుగురి సమాధాన పత్రాలు ఇవ్వడంలో ఏ విధమైన సమస్యాలేదని కమిషన్ నిర్ధారించింది. పైగా నియామకాలు, పదోన్నతిలో అవినీతి నివారణ కావాలంటే పారదర్శకత తప్పదు. (CIC/EPFOG/A/2018/124927 శైలేంద్ర కుమార్ సింగ్ వర్సెస్ ఈïపీఎఫ్ఓ కేసులో జూన్ 7, 2018న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
పాస్ చేయండి సార్.. పెళ్లికి రెడీగా ఉన్నాను!
లక్నో: గతేడాది తరహాలో పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఓ విద్యార్థిని వినూత్నంగా తనను పాస్ చేయాలని కోరింది. యూపీ బోర్డు ఎగ్జామ్స్ కు హాజరైన ఓ విద్యార్థిని తన ఆన్సర్ షీటులో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ‘ సార్.. నేను ఓ అమ్మాయిని. వచ్చే జూన్ 28న నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండి. నేను ఫెయిల్ అయితే మా ఫ్యామిలీ చాలా బాధ పడుతుంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి’ అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విద్యార్థిని రాసుకొచ్చింది. తాను పెళ్లికి సిద్ధంగా ఉన్న సమయంలో పరీక్షలో ఫెయిల్ అయితే చిన్నచూపుగా ఉంటుందని చెబితే పాస్ చేస్తారని తన తెలివితేటలు చూపించింది. చదవకున్నా ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ బోర్డుకు ప్రతి ఏడాది ఇలాంటి సమాధాన పత్రాలు వేలాదిగా వస్తుంటాయని పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులైతే నేరుగా 50, 100, 500 నోట్లను ఆన్సర్ షీటుకు జతచేసి లంచం ఇవ్వజూపే వారని చెప్పారు. అయితే గతేడాది తరహా పరిస్థితి ఇప్పుడు లేదని, చదువుకుంటూనే పాస్ అవుతారని, లంచం ఇవ్వచూపాలని చూసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు సూచించారు. వీరిని పాస్ చేసినా ఏ సబ్జెక్ట్ లేని కారణంగా ఉద్యోగాల వేటలోనూ వెనుకంజలో ఉండాల్సి వస్తుందన్నారు. -
సమాధానపత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్
నరసరావుపేట: జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరై సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లిపోయిన విద్యార్థిపై విద్యాశాఖాధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ సంఘటన జరిగింది. వివరాలు... స్థానిక ప్రైవేటు కళాశాలకు చెందిన మేళా నరేంద్ర అనే జూనియర్ ఇంటర్ విద్యార్థి కెమిస్ట్రీ సబ్జెక్ట్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఎస్‌కేఆర్‌బీఆర్ జూనియర్ కళాశాలకు వచ్చాడు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే తాను రాసిన సమాధాన పత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండానే పరిగెత్తాడని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే హైపవర్ కమిటీకి సమాచారం అందించటంతో కమిటీ సభ్యుడు జె.పాల్ప్రసాదును కళాశాలకు పంపారన్నారు. ఆయన వచ్చి విచారణ నిర్వహించిన అనంతరం విద్యార్థి ఉద్దేశపూర్వకంగానే సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లాడని నిర్ధారించి, మాల్ప్రాక్టీసుగా పరిగణిస్తూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసినట్లు పాల్ప్రసాదు చెప్పారు. -
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ తీరును తప్పు పట్టిన హైకోర్టు
-
పరీక్ష కాగానే జవాబుల కాపీ!
ఆఫ్‌లైన్ పరీక్షల్లో కార్బన్‌లెస్ పేపర్లు ఇవ్వనున్న టీఎస్పీఎస్సీ సాక్షి, హైదరాబాద్: పరీక్ష రాయగానే జవాబు పత్రం కాపీని అభ్యర్థులు ఇక ముందు వెంటనే తీసుకెళ్లవచ్చు.. ప్రతి ప్రశ్నకు సంబంధించి తాము గుర్తించిన సమాధానాలను పరీక్ష ‘కీ’తో సరిచూసుకోవచ్చు.. ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించింది. వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న ఆఫ్‌లైన్ పరీక్షల్లో అభ్యర్థులకు కార్బన్‌లెస్ జవాబు పత్రాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఆబ్జెక్టివ్ టైప్‌లో నిర్వహించి అన్ని రాతపరీక్షల (ఆఫ్‌లైన్‌లో)కు ఈ విధానాన్ని అమలు చేయనుంది. తొలుత వచ్చే నెల 1న జరుగనున్న వాటర్ వర్క్ విభాగంలో మేనేజర్ పోస్టుల రాతపరీక్షలో దీన్ని అమలు చేస్తోంది. ఆఫ్‌లైన్‌లో నిర్వహించడంతో.. వాటర్ వర్క్ విభాగంలో 146 మేనేజర్ పోస్టులకు పోటీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని భావించారు. కానీ ఏకంగా 87 వేల దరఖాస్తులు రావడంతో ఆఫ్‌లైన్‌లో చేపట్టాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక అభ్యర్థులకు జవాబు పత్రాల కాపీలను అందజేసేలా కార్బన్‌లెస్ పత్రాలను వినియోగించడంపై చక్రపాణితో పాటు సభ్యులు సి.విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ లోతుగా చర్చించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కార్బన్‌లెస్ కాపీ విధానం ఉపయోగపడుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతోపాటు అభ్యర్థుల్లో ఎలాంటి అనుమానాలు తలెత్తవని, కమిషన్ పనితీరుపై నమ్మకం మరింత పెరుగుతుందని.. అందువల్ల ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ‘కార్బన్‌లెస్’ ఇలా..: ‘కార్బన్‌లెస్’ విధానం అంటే అసలు జవాబు పత్రాని (ఓఎంఆర్ షీట్)కి కింద అదేవిధంగా ఉన్న మరొక పత్రం ఉంటుంది. పైన ఉన్న అసలు పత్రంలో ఏదైనా రాస్తే.. ఆ ఒత్తిడికి కింద ఉన్న పత్రంపైన కూడా అది అచ్చు (మార్కింగ్)గా వస్తుంది. అయితే ఇందులో అచ్చుకాగితం (కార్బన్ పేపర్) ఉండదు. అందువల్లే కార్బన్‌లెస్ విధానం అంటారు. అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు ఓఎంఆర్ షీట్‌పై జవాబులను గుర్తించేటప్పుడు నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్‌ను టిక్ (వృత్తాన్ని పెన్ను/పెన్సిల్‌తో నింపడం) చేస్తారు. దీంతో కింద ఉన్న అదనపు పత్రంపై కూడా ఈ జవాబులు మార్కింగ్ అవుతాయి. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు ఇచ్చి.. అదనంగా ఉన్న కార్బన్‌లెస్ కాపీని వెంట తీసుకెళ్లవచ్చు. తాను ఏయే ప్రశ్నలకు ఏయే ఆప్షన్లను ఎంచుకున్నదీ సరిచూసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి అనుమానాలకు ఆస్కారం ఉండదు.