సమాధానపత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్ | inter student jump with answer sheet from exam center | Sakshi
Sakshi News home page

సమాధానపత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్

Published Mon, May 30 2016 8:55 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

inter student jump with answer sheet from exam center

నరసరావుపేట: జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరై సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లిపోయిన విద్యార్థిపై విద్యాశాఖాధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ సంఘటన జరిగింది. వివరాలు... స్థానిక ప్రైవేటు కళాశాలకు చెందిన మేళా నరేంద్ర అనే జూనియర్ ఇంటర్ విద్యార్థి కెమిస్ట్రీ సబ్జెక్ట్ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు ఎస్‌కేఆర్‌బీఆర్ జూనియర్ కళాశాలకు వచ్చాడు.

పరీక్ష సమయం ముగిసిన వెంటనే తాను రాసిన సమాధాన పత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండానే పరిగెత్తాడని ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే హైపవర్ కమిటీకి సమాచారం అందించటంతో కమిటీ సభ్యుడు జె.పాల్‌ప్రసాదును కళాశాలకు పంపారన్నారు. ఆయన వచ్చి విచారణ నిర్వహించిన అనంతరం విద్యార్థి ఉద్దేశపూర్వకంగానే సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లాడని నిర్ధారించి, మాల్‌ప్రాక్టీసుగా పరిగణిస్తూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు పాల్‌ప్రసాదు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement