inter exams
-
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నా లాగా కష్టపడకుండా నా బిడ్డలు పెరగాలి.. చదువుకోవాలి. ఉన్నత స్థితిలోకి రావాలని అని తల్లిదండ్రులు పిల్లల అభివృద్ధికోసం కష్టపడతారు.వారి బంగారు భవిష్యత్తుకోసం కలగంటారు. అలాగే పిలలు అమ్మా నాన్నల్ని కాలు కిందపెట్టకుండా చూసుకోవాలి. మంచి కారు కొనాలి.. ఇల్లు కొనాలి.. ఇలా రకరకాలుగా ఊహించుకుంటారు. తమ ఆశయ సాధన కోసం పట్టుదలగా చదువుతారు. అచ్చం ఇలాగే చెన్నైలోని ఒక అమ్మాయి ఆలోచించింది. తన తల్లిదండ్రులు ఏ వస్తువునైనా ధర ట్యాగ్ చూడకుండా నచ్చింది కొనుక్కోవాలి అని కలగంది ఓ ఆటో డ్రైవర్ కూతురు. దాన్ని సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వివరాలను తెలుసుకుందాం రండి!I want to be at a place where my parents don’t see the price tag when they go to a shop,says Poongodhai, daughter of an auto-driver, who came first among GCC schools scoring 578 in the class XII board exams. Speaking in fluent English, Poongodhai of Perambur GCC school said she… pic.twitter.com/2T1Mbnz8vB— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024తాజాగా తమిళనాడు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది ఆటోడ్రైవర్ కుమార్తె పూంగోధయ్. పెరంబూర్ జీసీసీ స్కూల్‌కు చెందిన పూంగోధయ్ 578 స్కోరుతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. తన కుటుంబం, సోదరి కాలేజీ, సిబ్బంది, తన ఇలా ప్రతీ ఒక్కరూ బాగా సహక రించారంటూ ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ బికామ్, సీఏ చదవాలని కోరుకుంటోంది.Her sister Shobana breaks down responding to her sister’s success coming first among GCC schools in the 12th board examinations. Both of them are daughters of auto driver pic.twitter.com/qSS6EffAbP— Omjasvin M D (@omjasvinTOI) May 6, 2024ఒక చిన్న అద్దే ఇంట్లో నివసించే ఆమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి డొమెస్టిక్ హెల్పర్‌గా పని చేస్తుంది. తండ్రి ఆరోగ్యం అంతంత మాత్రమే. సోదరి బి.ఫార్మ్ చేస్తోంది. తండ్రి అనారోగ్యం రీత్యా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి పడుతున్న కష్టాన్ని గమనించిన అక్కా చెల్లెళ్లిద్దరూ చదువుల్లో రాణించారు. సోదరి స్కూలు ఫస్ట్ రావడంపై శోభన భావోద్వేగానికి లోనయింది. తమ బిడ్డలు రాణించడం సంతోషంగా ఉందంటూ ఆనందం ప్రకటించారు తల్లి దండ్రులు.అటు ఇది తమ టీచర్ల ఘనత అని పెరంబూర్‌లోని పాఠశాల హెచ్ఎం కూడా ఆనందాన్ని ప్రకటించారు. 6వ తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పుతామని, దీంతో విద్యార్థులు అనర్గళంగా మాట్లాడుతారని చెప్పారు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో తామిచ్చిన శిక్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. -
ఏపీలో నేటి నుండి ఇంటర్ పరీక్షలు
-
తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
-
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 28న థియరీ పరీక్షలు మొదలవుతాయని తెలిపింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 19తో ముగుస్తాయని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటికన్నా ముందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. రెండో శనివారం, ఆదివారం కూడా రెండు సెషన్స్‌లో ప్రాక్టికల్స్ ఉంటాయని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుందని బోర్డ్ తెలిపింది. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఎన్విరాన్మెంట్ పరీక్ష ఫిబ్రవరి 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం వెల్లడించింది. ఫిబ్రవరి 1నుంచి 15వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్ ► ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1. ►మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1. ►మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1. ►మార్చి 6న మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1. ►మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1. ►మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1. ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ►ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2 ►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2. ►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2 ►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2. మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2. -
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన
-
మార్చిలోనే ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నాం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. ‘‘సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయంగా నిర్ణయించాం. మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్ 20 న ఇంగ్లీష్, 22 తేదీ లెక్కలు, 23 న ఫిజికల్ సైన్స్, 26 న బయాలజీ, 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు 28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 30 న ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ ..అలాగే మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులందరూ పాసై 100 శాతం సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాం’’ అని మంత్రి బొత్స అన్నారు. ఇంటర్ ఫస్టియర్ షెడ్యూల్ మార్చ్ 1 న సెకండ్ లాంగ్వేజ్ -1, మార్చ్ 4 న ఇంగ్లీష్ పేపర్ -1, 6 న లెక్కలు పేపర్ 1 A, బోటనీ -1, సివిక్స్-1 , 9 న లెక్కలు పేపర్ 1B, జువాలజీ-1, హిస్టరీ-1, 12 న ఫిజిక్స్ -1, ఎకనామిక్స్ -1 14 న కెమిస్ట్రీ-1, కామర్స్-1,సోషయాలజీ-1,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ -1 16 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు లెక్కలు-1 ( బైపిసికి) మార్చ్ 19 న మోడర్న్ లాంగ్వేజ్- 4, జాగ్రఫీ- 1 ఇంటర్ సెకండియర్ షెడ్యూల్ మార్చ్ 2 న సెకండ్ లాంగ్వేజ్ -2, మార్చ్ 5 న ఇంగ్లీష్ పేపర్ -2, 7 న లెక్కలు పేపర్ 2 A, బోటనీ -2, సివిక్స్-2 , 11న లెక్కలు పేపర్ 2B, జువాలజీ-2, హిస్టరీ-2, 13న ఫిజిక్స్ -2, ఎకనామిక్స్ -2 15 న కెమిస్ట్రీ-2, కామర్స్-2,సోషయాలజీ-2,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-2 మార్చ్ 18 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు లెక్కలు-2 ( బైపిసికి) మార్చ్ 20న మోడర్న్ లాంగ్వేజ్- 2, జాగ్రఫీ- 2 -
వీడియో: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
-
Inter Exams 2023: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇంటర్ బోర్డ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్షలపై అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్ బోర్డ్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోందని కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మిత్తల్ సందేహం వెలిబుచ్చారు. డేటా ట్యాంపరింగ్ జరిగిందని పోలీసులకు బోర్డ్ గతంలో ఫిర్యాదు చేసింది. ప్రైవేటు ఇంటర్ కాలేజీలతో బోర్డ్‌లోని కొంతమంది అధికారులే కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలతో కొంతమందిని కీలకమైన స్థానాల నుంచి తప్పించారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించడం, దీన్ని కొంతమంది ఆక్షేపిస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పరీక్షల నిర్వహణలో అప్రమత్తతను సూచిస్తున్నాయి. పేపర్ల పంపిణీ దగ్గర్నుంచి... డేటా చోరీ వ్యవహారం తెరమీదకొచ్చిన తర్వాత ఇంటర్ బోర్డ్‌లో ప్రతీ వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. బోర్డ్‌లోని కొందరి సెల్‌ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డ్ లోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల్లో అవాంతరాలు సృష్టించే వీలుందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లోనూ ఉన్నాయి. దీంతో పరీక్ష పేపర్లు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో విధిగా సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా జవాబు పత్రాలు సురక్షితంగా చేరే వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష లపై అసత్య ప్రచారం చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాలను వాడుకునే అవకాశముందని, ఈ అంశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
తొందరపాటు నిర్ణయాలొద్దు: సబిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేదని, మంచి మార్కులు రాలేదని.. విద్యార్థులెవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు ఏడాది నష్ట పోకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెం టరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్ప టికే ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. ఈ సమయంలో విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని కళాశాల లెక్చరర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. -
పాపం! లక్ష్మీదేవి.. ఆర్టీసీ బస్సు రిపేర్.. 10 నిముషాలు పరీక్షకు ఆలస్యమవడంతో
సాక్షి, మిడ్జిల్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మీదేవి సోమవారం ఎకనమిక్స్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరింది. ఆ బస్సు మధ్యలో మొరాయించడంతో (మరమ్మతులకు గురైంది) పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు లక్ష్మీదేవిని పరీక్షకు అనుమతించలేదు. బస్సు ఫెయిల్ కావడం వల్లే పరీక్షకు ఆలస్యంగా వచ్చానని అధికారులకు చెప్పినా వినిపించుకోవడంలేదని లక్ష్మీదేవి ధర్నా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాంలాల్ నాయక్ ఆమెకి సర్ది చెప్పి పంపించారు. చదవండి👉🏾పెళ్లైన 4 నెలలకే మరొకరితో ఉంటూ పరువు తీసిందని.. ‘ఇంటర్’ మూల్యాంకన పారితోషికం పెంపు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల విధులు, మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పారితోషికాన్ని ఇంటర్ బోర్డు 25 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జవాబు పత్రం మూల్యాంకనానికి రూ.18.93 నుంచి రూ.23.66.. ఇతర విధులకు రోజుకు రూ.641 నుంచి రూ.800 లకు పెంచారు. చదవండి👇 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్ ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు -
ఈసారి పొలిటికల్ సైన్స్ ప్రశ్నపత్రంలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంస్కృతం, హిందీ పేపర్లలో తప్పులురాగా.. గురువారం పొలిటికల్ సైన్స్, ఉర్దూ మీడియం మ్యాథ్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరితో పరీక్షల విధానం ప్రహసనంగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నే మారిపోయింది రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరి గాయి. సాధారణంగా విద్యార్థులు ఏ మీడియంలో పరీక్ష రాస్తే ఆ భాషలో ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇస్తారు. ఇందులో భాష మారుతుందే తప్ప ప్రశ్నల్లో మార్పు ఉండదు. గురువారం ఇంగ్లిష్ మీడి యం పొలిటికల్ సైన్స్ పేపర్లో ఒక ప్రశ్న ఉంటే.. తెలుగు మీడియం పేపర్లో వేరే ప్రశ్న ఇచ్చారు. ప్రశ్నపత్రం సెక్షన్ ‘బి’లో ఐదు మార్కులకు 8వ ప్రశ్నగా "Point out the main provisi ons of the Independence of India Act 1947' అని ప్రశ్న ఇచ్చారు. ‘భారత స్వాతంత్య్ర చట్టం–1947లోని ముఖ్యాంశాలు రాయండి’అని దానికి అర్థం. కానీ తెలుగులో ఇచ్చిన పొలిటికల్ సైన్స్ పేపర్లో ‘భారత స్వాతంత్య పోరాటంలో హోమ్‌రూల్ ఉద్యమాన్ని వర్ణించండి’అనే ప్రశ్న ఇచ్చారు. ఇలా వేర్వేరుగా రావడంతో.. ఏ ప్రశ్నను బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది, దేనికి మార్కులు వేస్తుందని విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కొందరు ఈ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేశారు. మరికొందరు సమాధానం రాసినా మార్కులు రావేమోనని భయపడటం పరీక్ష కేంద్రాల వద్ద కన్పించింది. ఉర్దూలోనూ ఇదే తంతు గణితం పేపర్‌ను కొందరు విద్యార్థులు ఉర్దూ మీడియంలో రాశారు. అందులో ఇచ్చిన ఓ ప్రశ్న అర్థం లేకుండా ఉండటంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఒక లెక్కలో" FARJI'’అని ఇచ్చారు. అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. విద్యార్థులు ఇదేమిటని ప్రశ్నించడంతో.. ఇన్విజిలేటర్లు, పరీక్ష కేంద్రం సిబ్బంది అప్పటికప్పుడు ఆ పదం అర్థమేంటో తెలుసుకునేందుకు హైరానా పడ్డారు. ఉర్దూ భాషా నిపుణులను సంప్రదించగా.. ఆ పదం " ZARBI' అని, లెక్కలో హెచ్చింపు అని అర్థమని చెప్పారు. ఇది పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు చేరేసరికి సమయం వృధా అయింది. వరుస తప్పిదాలు.. ఎందుకిలా? ఇంటర్‌బోర్డు నిపుణుల చేత అత్యంత గోప్యంగా పరీక్ష పత్రాలను తయారు చేయిస్తుంది. మొత్తం 12 సెట్లు రూపొందిస్తారు. అందులోంచి మూడింటిని ఎంపిక చేసి.. పరీక్ష కేంద్రాలకు పంపుతారు. పరీక్షకు సరిగ్గా అరగంట ముందు ఈ మూడు సెట్లలో ఒక సెట్‌ను ఖరారు చేస్తారు. అయితే ఈ సంవత్సరం ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో కొందరు అనుకూలమైన వ్యక్తులకు బాధ్యత అప్పజెప్పారని, వారికి అనుభవం లేకపోవడమే తప్పిదాలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కుమ్మక్కైనట్టు విమర్శలొస్తున్నాయి. ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలోనే కార్పొరేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. హిందీ ట్రాన్స్‌లేటర్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం వెనుక కొందరు పైరవీకారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. ఏదేమైనా పరీక్షల విభాగంపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండ్ కూడా విన్పిస్తోంది. వేర్వేరుగా మూల్యాంకనం పొలిటికల్ సైన్స్ పేపర్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో వేర్వేరుగా ప్రశ్నలు ఇవ్వడాన్ని గుర్తిం చాం. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేర్వేరుగా మూల్యాంకనం చేపడతాం. రెండు భాషల్లోనూ రెండు ప్రశ్నలకు మార్కులు వేస్తాం. – సయ్యద్ ఒమర్ జలీల్, బోర్డు కార్యదర్శి ఇలాగైతే విద్యార్థుల్లో కంగారే.. లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు ఇలాంటి తప్పిదాలు రాకుండా చూడాలి. పరీక్ష హాల్లో విద్యార్థులు ఇలాంటి గందరగోళానికి లోనైతే.. సక్రమంగా పరీక్ష రాసే అవకాశం ఉండదు. ఆ రోజు పరీక్షపై ప్రభావం చూపుతుంది. – పరశురాములు, జూనియర్ లెక్చరర్ -
ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు!
కోదాడ (సూర్యాపేట): ఇంటర్ ఇంగ్లిష్–1 ప్రశ్నపత్రాల బండిల్ లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు దర్శనమిచ్చాయి. ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలని భావించి పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లిన తర్వాత.. తెరిచి చూస్తే కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు బయటపడటంతో అధ్యాపకులు బిత్తరపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచన మేరకు జిల్లాలోని వివిధ సెంటర్లలో మిగిలిపోయిన ప్రశ్నపత్రాలను తెప్పించారు. గంటన్నర ఆలస్యం గా 10:30 గం.కు విద్యార్థులకు పరీక్ష ప్రారంభించి 1:30 గం.కు ముగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సిటీ సెంట్రల్ జూనియర్ కళాశాలలో సోమవారం చోటుచేసుకుంది. అధికారులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ లోని 243 మంది విద్యార్థులు ఇక్కడ ఇంగ్లిష్–1 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ మేరకు కోదాడ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రశ్నపత్రాలను కస్టోడియన్స్ నుంచి తీసుకొని కళాశాల వద్దకు వెళ్లి తెరిచి చూడగా విష యం బయటపడింది. దీంతో బల్క్ సెంటర్ నల్ల గొండ నుంచి ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలు తీసుకురావడం ఆలస్యం అవుతుందని భావించిన జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం.. సమీప సెంటర్లలో విద్యార్థులకు ఇవ్వగా మిగిలిన ప్రశ్న పత్రాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాలు ఎలా మారాయన్న దానిపై బోర్డు అధికారులు నోరు విప్పడం లేదు. బోర్డు నుంచి ఇంటర్ ప్రశ్నపత్రాలు తక్కువగా వచ్చాయని ఇంటర్ బోర్డు జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. -
అవకతవకలకు ఆస్కారం లేకుండా..నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పరీక్ష కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉండబోతున్నా యని చెప్పారు. పరీక్షల నేపథ్యంలో జలీల్ గురువా రం మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నాం. పరీక్ష కేంద్రంలో జరిగే ప్రతీ కదలి కను రాజ ధాని నుంచే పరిశీలించే ఏర్పాట్లు చేశాం. మొత్తం 1,443 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటిని జిల్లా, రాష్ట్ర కార్యాలయా లకు అనుసంధానం చేశాం. ఎక్కడా పేపర్ లీకేజీకి అస్కారం లేకుండా ఆధునిక టెక్నాలజీని వాడుతున్నాం. ఎగ్జామినర్ మినహా... పరీక్ష కేంద్రంలోకి ఎవరినీ సెల్‌ఫోన్ తీసుకెళ్లనివ్వం. విద్యార్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఓఎంఆర్ షీట్లో ఏమైనా సమస్యలుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. తక్షణమే వాటిని పరిష్కరిస్తారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు’అని చెప్పారు. 15 రోజుల్లో సప్లిమెంటరీ ‘ఇంటర్ పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే మూల్యాంకనం చేపడతాం. జూన్ 24 కల్లా ఫలితాలు వెల్లడించాలనే సంకల్పంతో ఉన్నాం. మంచిర్యాల, నిర్మల్ కొత్తగా ఏర్పాటు చేసినవి కలుపుకుని 14 స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. ఫలితాలు వెలువడిన 15 రోజుల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వాటి ఫలితాలు కూడా వీలైనంత త్వరగా వెల్లడిస్తాం’అని జలీల్ వెల్లడించారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: సబిత ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాసి, మంచి మార్కులతో పాసవ్వాలని ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలుంటాయని, ప్రశ్నల చాయిస్ కూడా పెంచామని తెలిపారు. సకాలంలో పరీక్ష కేంద్రానికి వచ్చేలా ప్రణాళికబద్ధంగా వ్యహరించాలని సూచించారు. -
జేఈఈ సన్నద్ధతకు సమయమేదీ?
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022–23 నిర్వహణ విషయంలో కేంద్ర విద్యా శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గందరగోళ చర్యలే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జేఈఈ షెడ్యూల్‌ను ఆరేడు నెలలకు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నా తీవ్ర జాప్యం చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మొదటి విడత జేఈఈ మెయిన్ నిర్వహించాల్సి ఉంది. అనంతరం ఏప్రిల్ లేదా మేలో రెండో విడత పరీక్షను జరపాల్సి ఉండగా పరీక్ష షెడ్యూల్, తేదీల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించారు. విద్యార్థులకు ఇబ్బందులు.. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత, మే 24 నుంచి 29 వరకు రెండో విడత నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. అప్పటికే పలు రాష్ట్రాల ఇంటర్మీడియెట్, హయ్యర్ సెకండరీ బోర్డులు తమ పబ్లిక్ పరీక్షల తేదీలను ప్రకటించాయి. సరిగ్గా అవే తేదీల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. చివరకు ఇంటర్ పరీక్షల తేదీలను కొన్ని బోర్డులు మార్పు చేసుకున్నాయి. అప్పటికే బోర్డుల పరీక్షలతో జేఈఈ తేదీలు క్లాష్ అవుతుండడంతో ఎన్టీఏ మెయిన్ పరీక్ష తేదీలను ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నిర్వహించేలా మార్పు చేసింది. తమ తొలి షెడ్యూల్‌ను మార్పు చేసిన ఇంటర్ బోర్డులు మళ్లీ తమ పరీక్షల తేదీలను మార్చుకోవలసి వచ్చింది. జేఈఈ మెయిన్ షెడ్యూళ్ల గందరగోళంతో పలు రాష్ట్రాల బోర్డులు/సీబీఎస్ఈ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఓ వైపు ఇంటర్.. మరోవైపు జేఈఈ ఎన్టీఏ అస్తవ్యస్త షెడ్యూళ్లతో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తూనే జేఈఈ మెయిన్ రాయాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను జేఈఈ మెయిన్ తొలి విడత ముగిశాక మే 6 నుంచి 24 వరకు నిర్వహించేలా మార్పు చేశారు. దీంతో విద్యార్థులు మెయిన్ తొలి విడత పరీక్షలకు సన్నద్ధమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్ పరీక్షలు ముగిశాక అయినా జేఈఈకి సిద్ధమవుదామనుకుంటే వెనువెంటనే మెయిన్ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. ఇంటర్ పరీక్షలకు, జేఈఈకి కనీసం 60–90 రోజుల వ్యవధి అవసరమవుతుందని, కానీ ఇక్కడ ఒక్కరోజు కూడా అవకాశం లేకుండా వెంటనే పరీక్షలకు సిద్ధపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల సన్నద్ధతకు వీలుగా మెయిన్ పరీక్షల తేదీలను మార్పు చేయాలని కోరుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు, రీ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్ పరీక్షల తేదీల మార్పు కారణంగా ఇంటర్ పరీక్షల్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. చదవండి: హోలీ ఆటలో చిన్నారుల వెరైటీ.. క్యాష్ లేదా.. నో ప్రాబ్లమ్! ఫస్టియర్ షెడ్యూల్ ► మే 6(శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్ ► మే 9(సోమవారం) – ఇంగ్లీష్ ► మే 11(బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్ ► మే 13(శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ ► మే 16(సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్ ► మే 18(బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్ ► మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 ► మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి సెకండియర్ షెడ్యూల్ ► మే 7(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్ ► మే 10(మంగళవారం) – ఇంగ్లీష్ ► మే 12(గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్ ► మే 14(శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ ► మే 17(మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్ ► మే 19(గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్ ► మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 ► మే 24(మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి -
జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్ మార్పు
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2022–23 తొలి దశ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏప్రిల్ 21కు వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా జరుగుతాయి. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాలి. అయితే వివిధ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు, జేఈఈ పరీక్షలు ఒకే తేదీల్లో రావడంతో విద్యార్థుల విన్నపాల మేరకు మార్పులు చేస్తున్నట్లు ఎన్టీఏ వివరించింది. మెయిన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు యథాతథంగా కొనసాగుతాయి. పరీక్ష కేంద్రాలకు సంబంధించిన నగరాల ఇంటిమేషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. అడ్మిట్ కార్డులను ఏప్రిల్ రెండోవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ వివరించింది. ఇంటర్ పరీక్షలపై తర్జనభర్జన జేఈఈ మెయిన్ తొలి దశ షెడ్యూల్ మార్పు ప్రభావం ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలపై పడుతోంది. ఎన్టీఏ తొలుత మెయిన్ తొలి దశ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరిగే బోర్డు పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించేలా షెడ్యూల్ మార్చింది. ఇప్పుడు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు వాయిదా వేయడంతో ఇంటర్మీడియట్ పరీక్షలు మళ్లీ గందరగోళంలో పడ్దాయి. జేఈఈ పరీక్షలు జరిగే ఏప్రిల్ 25న ఇంటర్ ఇంగ్లిష్ పేపర్, ఏప్రిల్ 29న మేథమెటిక్స్ పరీక్షలు ఉన్నాయి. రెండు పరీక్షలు ఒకే రోజున వచ్చాయి. దీంతో ఇంటర్ పరీక్షలపై విద్యా శాఖ అధికారులు మంగళవారం సమావేశమవుతున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించడానికి ఏప్రిల్ 21న ఫిజిక్సు పేపర్ రోజునే జేఈఈ పరీక్ష ఉంది. దీంతో పరీక్షలను వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల తేదీలపై సందిగ్థత ఏర్పడటంతో టెన్త్ పరీక్షలపైనా దాని ప్రభావం పడవచ్చని అధికారులు చెబుతున్నారు. -
Andhra Pradesh: ఏప్రిల్ 22 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియెట్ బోర్డు వాయిదా వేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమై మే 12తో ముగుస్తాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మారిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, జేఈఈ మెయిన్–2022 మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 16–21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఇంటర్ పరీక్షల మధ్యలో జేఈఈ పరీక్షల షెడ్యూల్ ఉండడంతో విద్యార్థులకు నష్టం కలిగేలా పరిస్థితులు మారాయి. దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్షల షెడ్యూల్‌పై చర్చించింది. చివరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీన్ని ఆమోదించిన అనంతరం గురువారం మంత్రి కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆదివారాలు, సెలవు రోజులతో పాటు మధ్యలో రంజాన్ పర్వదినం ఉండడంతో మే 3, 4 తేదీల్లో పరీక్షలు లేకుండా కొత్త షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ ప్రకారం ఏప్రిల్ 22న ప్రారంభమై మే 12తో ఇంటర్ పరీక్షలను పూర్తిచేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు. నైతిక విలువలు, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షలు ఇంతకుముందు ప్రకటించిన విధంగానే మార్చి 7, 9 తేదీల్లోనే జరుగుతాయన్నారు. అలాగే, ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11 నుంచి 31వరకు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇక బెటర్మెంటు కోసం 2,500 మంది అభ్యర్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారని, అందుకే సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ పరీక్షలను కూడా ఇదే షెడ్యూల్‌తోపాటు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్ విధానం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిజిక్సు, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ఈనెల 11 నుంచి 31 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నామని, ఇందుకు జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు వివరించారు. ఇంటర్ థియరీ పరీక్షలకు పది లక్షల మంది వరకు విద్యార్థులు హాజరుకానున్నారని.. ఇందుకోసం 1,456 కేంద్రాలను, ప్రాక్టికల్ పరీక్షల కోసం 975 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అవసరమైన పక్షంలో పరీక్షా కేంద్రాలను పెంచుతామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెన్త్ పరీక్షలు యథాతథం టెన్త్ పబ్లిక్ పరీక్షలను యథాతథంగా నిర్వహించనున్నారు. వీటి తేదీల్లో ఎలాంటి మార్పులేదని మంత్రి వివరించారు. ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నెలరోజుల్లో పూర్తిచేయించి ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అలాగే, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌ను జూన్ లేదా జూలైలో నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు వివరించారు. ఇక కొత్తగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ కాలేజీల అనుమతులకు సంబంధించి ఇప్పటికే సర్వే చేయించామని, అవసరమైన మేరకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. స్కూళ్ల మ్యాపింగ్‌కు సంబంధించి మూడు కిలోమీటర్ల పైబడి ఉన్న వాటి విషయంలో అభ్యర్థనలు వస్తున్నందున పరిశీలిస్తామన్నారు. ఉర్దూ సహా ఇతర మైనర్ మీడియం పాఠశాలలు యథాతథంగానే కొనసాగుతాయని, వాటికి మ్యాపింగ్ ఉండబోదన్నారు. -
10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర బోర్డులు నిర్వహించనున్న 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించి అంతర్గత మూల్యాంకనం చేపట్టాలా, భౌతికంగా పరీక్షలు నిర్వహించాలా అనే అంశంపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ‘కరోనా కేసులు తగ్గినప్పటికీ గడిచిన రెండేళ్లుగా సమస్య తొలగలేదు. ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించడం లేదు. పరీక్షలు భౌతికంగా నిర్వహించడానికి బదులు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’ అని న్యాయవాది ప్రశాంత్ పద్మనాభన్ కోరారు. ‘బుధవారం విచారణ ప్రారంభిస్తాం’ అని జస్టిస్ ఖన్వీల్కర్ సూచించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు 10, 12వ తరగతుల పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. టర్మ్–2 పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. తమ విద్యార్థుల మార్కులను అంతర్గత మూల్యాంకన విధానం ద్వారా నిర్ణయించుకునేందుకు గత ఏడాది సుప్రీంకోర్టు కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ), సీబీఎస్ఈలకు అనుమతినిచ్చింది. ఇదే విధానం ఈసారీ అమలుకానుందో లేదో సుప్రీంకోర్టు విచారణలో తేలనుంది. -
ఏపీ, టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
తెలంగాణ: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు.. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 న ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 20 న పేపర్ 1 తెలుగు/ సంస్కృతి ►ఏప్రిల్ 22 న ఇంగ్లీష్ పేపర్ 1 ►ఏప్రిల్ 25న మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ►ఏప్రిల్ 27న మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1 ►ఏప్రిల్ 29న ఫిజిక్స్ పేపర్ 1, ఎకానమిక్స్ పేపర్1 ►మే 2న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్.. ►ఏప్రిల్ 21న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2, ►ఏప్రిల్ 23 న ఇంగ్లిష్ పేపర్ 2 ►ఏప్రిల్ 26న మాథ్స్ పేపర్ 2A, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2, ►ఏప్రిల్ 28న మాథ్స్ పేపర్ 2B, జూవాలజీ పేపర్2, హిస్టరీ పేపర్ 2 ►ఏప్రిల్ 30న ఫిజిక్స్ పేపర్ 2, ఎకానమిక్స్ పేపర్ 2, ►మే 5న కెమిస్ట్రీ పేపర్2, కామర్స్ పేపర్2 -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈసారికి అంతా పాస్
ధైర్యం కోల్పోవద్దు.. పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ధైర్యంగా మళ్లీ పరీక్షకు సిద్ధం కావాలే తప్ప పాస్ చేయాలని ఒత్తిడి తేవడం, ప్రాణాలు తీసుకోవడం మంచిది కాదు. విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలకమైన దశ. దీన్ని కూడా రాజకీయం చేయడం ప్రతిపక్షాలకు తగదు. ఆన్లైన్ పాఠాలు చెప్పాం కరోనా కాలంలోనూ ఆన్లైన్ విద్యను అందుబాటులోకి తెచ్చాం. దూరదర్శన్, టీశాట్ ద్వారా పాఠాలు చెప్పాం. ఇంటర్ విద్య బలోపేతం ప్రభుత్వ లక్ష్యం. అందుకే 620 గురుకులాలు, 172 కస్తూర్బా కళాశాలలతోపాటు సంక్షేమ పాఠశాలలను ఇంటర్ స్థాయికి పెంచాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. 10 వేల మందికి 95% మార్కులు.. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు పెట్టాం. ప్రభుత్వ కాలేజీల్లోనే తక్కువ ఫలితాలొచ్చాయనడం సరికాదు. ఆన్లైన్ విద్యపై నిందలేయడం సముచితం కాదు. 10 వేల మంది 95 శాతం మార్కులు తెచ్చుకున్నారు. – మంత్రి సబిత ఇకపై కుదరదు ఇప్పుడే చెబుతున్నాం. ఇక మీదట ఇలా పాస్ చేయడం కుదరదు. ఇప్పట్నుంచే విద్యార్థులు అందరూ కష్టపడి చదవండి. మంచి మార్కులు తెచ్చుకోండి. సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది ఫెయిల్ కావడంపై తలెత్తిన వివాదానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలు తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనివల్ల 2,35,230 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంత్రి సబిత అత్యవసరంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికీ ఉంది. అందుకే గ్రేస్ మార్కులపై సమీక్షించాం. ఫెయిల్ అయింది 2.35 లక్షల మంది. 10 మార్కులు కలిపినా 8,076 మందే పాసయ్యేలా ఉన్నారు. 15 కలిపితే 24 వేలు, 20 కలిపితే 58 వేలు, 25 కలిపితే 72 వేలు, 30 మార్కులు కలిపితే 83 వేల మంది పాసవుతారు. అయినా పెద్ద సంఖ్యలో పాసయ్యే అవకాశం లేదు. అందుకే ఉత్తీర్ణతకు కనీస మార్కులైన 35ను ఫెయిలైన వారందరికీ ఇవ్వాలని నిర్ణయించాం’ అని తెలిపారు. విద్యార్థుల మనోవేదనను గుర్తించే పాస్ చేస్తున్నామని, ఇదే వ్యాకులతతో ఉంటే సెకండియర్ దెబ్బతింటుందని భావించి పాస్ చేశామని సబిత చెప్పా. అంతే తప్ప ఎవరో ఆందోళనలు చేశారని మాత్రం కాదన్నారు. వద్దనుకుంటే సొమ్ము వెనక్కి..: రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత చెప్పారు. ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ చేయించుకోవచ్చని, అప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వబోమన్నారు. విద్యార్థులు తమ ఐచ్ఛికాన్ని ఇంటర్ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు లేకుండా అందరినీ పాస్ చేశామని, ఇంటర్ సెకండియర్‌లో విద్యార్థులు వారి సామర్థ్యాలను మెరుగుపరుచుకొనేందుకే ఫస్టియర్ పరీక్షలు పెట్టామని సబిత తెలిపారు. కానీ 51 శాతం విద్యార్థులు ఫెయిల్ కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవడం విచారకరమన్నారు. దీన్ని అడ్డుపెట్టుకొని కొన్ని రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు స్వార్థ ప్రయోజనాలకు ఆందోళనలు చేపట్టడం న్యాయం కాదన్నారు. విలేకరుల సమావేశంలో ఇంటర్ విద్య అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. -
మూడవ రోజు ముమ్మరంగా..
నాంపల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్ పరీక్షా ఫలితాల రగడ కొనసాగుతోంది. మూడవ రోజు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఫెయిలై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎంజే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచే బోర్డు కార్యాలయం గేట్లు మూసివేయడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి వారు నిరసనలు వ్యక్తం చేశారు. దీనికి తోడు సోమవారం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జాతీయ క్యాంపెయిన్ శిక్షా బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఇంటర్మీడియట్ బోర్డుకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులను, ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా వ్యాన్‌లో ఎక్కించి గోషామహల్ స్టేడియానికి తరలించారు. 90 మంది ఆందోళనకారులను బేగంబజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరినీ పాస్ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం.. కాగా బోర్డు కార్యాలయానికి తరలివెళ్లే క్రమంలో కొందరు యువకులు ట్రాఫిక్‌లో రెచ్చిపోయారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారుల చేతిలో రెండు ఆటోలు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్: ఏబీవీపీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలను బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. -
ఈ మెలుకువలు పాటిస్తే ‘ఇంటర్’ యమ ఈజీ
సాక్షి, హైదరాబాద్: ఫలితం గురించి పక్కనపెడితే.. ఇంటర్ పరీక్షల మానసిక ఒత్తిడిని తేలికగా జయించవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫస్టియర్ పరీక్షలు మొదలవుతున్న వేళ... విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్‌లను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ల ద్వారా వారిని సంప్రదించే ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో వారికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా సరిగా వినలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం పోటీ పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న భయం, ఆందోళనను పారద్రోలేందుకు సైకియాట్రిస్ట్‌లు అనేక సూచనలు చేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ పరీక్షలు గుర్తున్నది రాస్తే చాలు పాస్ గ్యారెంటీ ‘కరోనా కారణంగా చాలా రోజులుగా మేం పల్లెటూళ్లోనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేదు. పరీక్షలు రాయగలమా? అనే ఆందోళన వెంటాడుతోంది’అని నిజామాబాద్ జిల్లా మారుమూల పల్లెకు చెందిన గోవింద్ కాల్ చేశాడు. అతని మానసిక స్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ కొన్ని ప్రశ్నలు వేశాడు. తను చదివిన చాప్టర్స్‌లో అతను ఎంత పట్టు కలిగి ఉన్నాడో తెలిసిపోయింది. వాస్తవానికి ఇప్పుడా చాప్టర్లు మళ్లీ మననం చేసుకుంటే పాస్ గ్యారెంటీ. ఈ వాస్తవాన్ని చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. తమకు వస్తున్న కాల్స్‌లో ఇలాంటివి చాలా ఉంటున్నాయని ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆన్లైన్లో నేర్చుకున్న చాప్టర్లనే రివిజన్ చేసుకుంటే పాస్ మార్కులొస్తాయని వారు అంటున్నారు. ఇలా కాకుండా చదువుకొని పాఠాల కోసం హైరానా పడొద్దని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ స్కోరెలా? ‘పరీక్షలే ఉండవనుకున్నాం. ఇప్పుడు రాయాల్సి వస్తోంది. ఇంత సమయంలో ఎలా?’అనేది సైకియాట్రిస్ట్‌లకు వచ్చే ఫోన్‌కాల్స్‌లో రెండో తరహా ప్రశ్న. ‘చదివిన చాప్టర్లలో ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆన్లైన్ క్లాసుల్లో బాగా అర్థమైన వాటిల్లోంచి ప్రశ్నలు ఎంచుకోవాలి. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌తో వీటిని పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు, లెక్చరర్లతో సాదాసీదా సంభాషణలో చర్చించిన చాప్టర్లను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. సమయం ఉంటే స్నేహితులతో వీటిపై మళ్లీ చర్చించాలి’అని మానసిక నిపుణులు చెబుతున్నారు. వెన్నుతడితే పరీక్షల్లో విజయం తేలికే.. ఇంటర్ పరీక్షను విద్యార్థి చాలా తేలికగా తీసుకునే వాతావరణం తల్లిదండ్రులే కలి్పంచాలన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. రోజూ తల్లిదండ్రుల నుంచి 50 కాల్స్ వస్తున్నాయని ఓ సైకియాట్రిస్ట్ తెలిపారు. ఇందులో మధ్యతరగతి ఉద్యోగ వర్గాల వారివే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ‘అనివార్యంగానే ఇంటర్ పరీక్షలు పెడుతున్నట్లు అధికారులే చెప్పారు. దీన్ని జయించే మార్గాలనూ ఇంటర్ బోర్డు విద్యార్థుల ముందుంచింది. వీటిని అనుసరిస్తే చాలనే భావన తల్లిదండ్రులూ కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే.. సరైన రీతిలో దాన్ని దూరం చేసే బంధువులు, స్నేహితుల సలహా తీసుకుంటే సరి. ఎక్కువ మార్కులు టార్గెట్‌గా పెట్టకుండా, తెలిసినంత వరకూ రాయమని పిల్లలను ప్రోత్సహిస్తే... ఊహించినదానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలుంటుంది’అని సైకియాట్రిస్టులు వెల్లడిస్తున్నారు. మానసిక నిపుణుల సూచనలు.. ► ప్రతికూల భావజాలంతో పాటు.. సానుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవాలి. దీనివల్ల మనిషిలోని గ్రంథుల ద్వారా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. పరీక్ష సమయంలో సులువగా రాసేందుకు వీలు కల్పింస్తుంది. ►పరీక్ష రాసే విద్యారి్థపై ఆక్సిజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ గంటకు ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో సమృద్ధిగా మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. మెదడు ఎప్పటికప్పుడు సరికొత్త శక్తి నింపుకుని పనిచేస్తుంది. చదివేది తేలికగా మెమొరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ►రాత్రింబవళ్లు చదివే విధానం అనుసరించకూడదు. కనీసం రాత్రి పూట 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. మెదడులో ఉండే గదుల్లో వేడి తగ్గడమే కాకుండా, సమాచారం ఆయా గదుల్లో నిక్షిప్తమవుతుంది. మర్నాడు తేలికగా చదివింది గుర్తు చేసుకునే వీలుంటుంది. ►రోజూ కనీసం 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి. దీంతో శరీరం లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్) చూసుకోవచ్చు. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతీ అరగంటకు కొన్ని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►పరీక్షకు వెళ్లేప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. కొంత గ్యాప్ ఇచ్చి.. మరుసటి పరీక్ష మీద దృష్టి పెట్టాలి. దీంతో గతంలో చదివింది మెదడులో స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. రేపు రాయాల్సిన పరీక్షకు సమాచారం ఆన్ మోడ్‌లో ఉంటుంది. ఆత్మస్థైర్యమే విజయ రహస్యం ఇప్పటివరకూ వందల్లో ఫోన్‌కాల్స్ వచ్చాయి. సమస్య చెప్పేటప్పుడు వాళ్లల్లో ఆందోళన కన్పించేది. కౌన్సెలింగ్ తర్వాత ధైర్యం వచ్చేది. ఇంటర్ పరీక్షలను రాయగల శక్తి ప్రతీ ఒక్కరికీ ఉంది. ఫలితం ఏ విధంగా వస్తుందో.. అనే అనవసర సందేహాన్ని రానివ్వకుండా ఉంటే మంచి మార్కులు ఖాయం. ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేస్తున్నాం. చాలామంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే వాతావరణమే ఈసారి కని్పస్తోంది. – డాక్టర్ అనుపమ (ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్ట్) -
25 నుంచి తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. కాగా, కోవిడ్ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది. -
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు సెప్టెంబర్‌లో ...
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ రెండవ వారంలో నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే పరీక్ష విద్యార్థుల ఐచ్ఛికమేనని అధికారులు తెలిపారు. మరో వారంలో పరీక్షల షెడ్యూల్డ్ విడుదల చేస్తామని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఇంటర్లో చేరిన వారు దాదాపు 4.70 లక్షల మంది ఉన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చిలో వీరికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలి. కరోనా కార ణంగా వీలు కాకపోవడంతో వారందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్ చేశారు. అయితే, పరీక్షలు లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళన కొందరు విద్యార్థుల నుంచి వ్యక్తమైంది. జాతీయ పోటీ పరీక్షలకు మార్కులే కొలమానంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కోరుకునే వారికి కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పరీక్షలు పెడతామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గిందని ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో పరీక్షలు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే ద్వితీయ సంవత్సరం సిలబస్ చాలా వరకు పూర్తయిందని, ఈ సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్లడం కష్టమనే వాదన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది. పరీక్షలు జరపాలంటే కనీసం 15 రోజుల ముందు షెడ్యూల్ ఇవ్వాలి. నిబంధనల ప్రకారం షెడ్యూల్ తర్వాత పరీక్షలకు నెల రోజుల గడువు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, పరీక్షలు ఇంకా ఆలస్యమైతే తమకు ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. -
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తొలగింపు
సాక్షి, అమరావతి/బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)లో ఇంటర్మీడియెట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌లో ఇంటర్ గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25% వెయిటేజీ ఇస్తూ విద్యార్థులకు ర్యాంకులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంసెట్ మార్కులకు 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీతో మార్కులను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చేవారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీకి స్వస్తి పలికారు. టెన్త్, ఇతర తరగతుల అంతర్గత మార్కుల ఆధారంగా ఇంటర్ బోర్డు మార్కులు కేటాయించింది. పరీక్షలు జరగకుండా ఇచ్చిన ఈ మార్కులు విద్యార్థుల వాస్తవ ప్రతిభను ప్రతిబింబించకపోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాల్లో ఈ ఏడాది వరకు ఇంటర్ మార్కులకు ఇచ్చే వెయిటేజీని తొలగించాలని నిర్ణయించామన్నారు. ప్రవేశ పరీక్ష మార్కులకే 100% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఏపీ ఎంసెట్ పేరు ఏపీ ఈఏపీసెట్‌గా మార్పు ఇప్పటివరకు ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ఏపీ ఎంసెట్‌ను నిర్వహిస్తోంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ఆ కోర్సులను తొలగించారు. ఏపీ ఎంసెట్ పేరును ఏపీ ఈఏపీసెట్‌గా మార్చారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, తదితర కోర్సుల్లో ప్రవేశాలకే ఈ పరీక్ష జరుగుతుంది. ఆ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు.. కరోనాతో ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దవడంతో ఏపీ ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే బీటెక్, బీఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతాం. సెట్లో వచ్చిన మార్కులకు అడ్మిషన్లలో 100 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 19 నుంచి 25 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాం. – రామలింగరాజు, ఏపీ ఈఏపీసెట్ చైర్మన్ -
టెన్త్, ఇంటర్ ఫలితాలకు హైపవర్ కమిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారిణి ఎం.ఛాయారతన్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు. ఈ మేరకు విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. కాగా.. ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్ నేతృత్వంలోనే మరో హైపవర్ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. -
పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాం..
సాక్షి, అమరావతి: కోవిడ్ తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) చింతల సుమన్ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ పరీక్షల రద్దు కోసం దాఖలైన వ్యాజ్యాన్ని మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. -
‘లోకేశ్.. మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా?’
సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి): పరీక్షలు రద్దయ్యాయని ఆనంద పడటం తప్ప టీడీపీ నేత లోకేశ్‌కు మరొకటి తెలియదని ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు విమర్శించారు. పెద్ద పెద్ద పదజాలలు వాడి పరీక్షలకే మీరు పరీక్ష కాకండి అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ వంకతో విద్యార్థుల పరీక్షలపై రాజకీయాలు మాట్లాడటం లోకేశ్‌కు తగదని హితవు పలికారు. శుక్రవారం పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ.. ‘‘పరీక్షలంటే లోకేశ్‌కు అర్థం తెలుసా? మీరు పరీక్షలు కరెక్టుగా రాసి పాసయ్యారా? చదువుకున్న వారికే పరీక్షల నిర్వహణ వెనుక అర్థం తెలుస్తుంది. పరీక్షలు రద్దయ్యాయని సంతోషించడం తప్ప ఇంకేమైనా తెలుసా మీకు. కరోనా పేరిట పరీక్షల గురించి రాజకీయాలు చేయడం సరికాదు. పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల చదువుకు ఒక అర్థాన్నిస్తుంది. చదువుకున్న విద్యార్ధులకు పరీక్షలంటే ఒక కిక్కు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా, చదువుకున్న వ్యక్తిగా.. పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన గొప్పది. కానీ కోవిడ్ వల్ల పరీక్షలు రద్దు చేయాల్సిరావడం చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్నారు. కాగా సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశంసించింది. సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంపై విచారణ సందర్భంగా.. ఏపీ పరీక్షల రద్దు విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాది దవే మాట్లాడుతూ..''ఎన్నికల ర్యాలీలు, సభలు జరిగాయని సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. గురువారం సుప్రీం విచారణ అనంతరం ముఖ్యమంత్రి వెంటనే పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సిద్ధమైనప్పటికి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేశాము. పది రోజుల్లో హైపవర్ కమిటీ అసెస్మెంట్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31 లోపు ఫలితాలను ప్రకటిస్తుంది. దేశం మొత్తం ఒక వైపు ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక మార్గంలో వెళ్ళలనుకోవడం లేదని తాము భావించాము.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుంభ మేళాలో జరిగిన దానికి ఎవరూ బాధ్యత తీసుకోలేదంటూ'' ఆయన తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
ఏపీ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
-
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షలు నిర్వహించడానికే ముందు నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇదే మా మొదటి ప్రాధాన్యం. ఈ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదు. కానీ సుప్రీంకోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన వీలుకాదు. అందుకే పరీక్షలను రద్దు చేస్తున్నాం. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడానికి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నాం. – మంత్రి ఆదిమూలపు సురేష్ సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఎవాల్యుయేషన్ స్కీమ్‌ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్ షెడ్యూల్లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్‌గా ఇదే టైమ్ షెడ్యూల్ ఉంది. పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు టెన్త్ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్ షెడ్యూల్లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్‌గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షలు, ఫలితాల వెల్లడికి కనీసం 45 రోజులు పడుతుంది ‘12వ తరగతి (ఇంటర్మీడియట్)కు సంబంధించి మార్కులు పదిరోజుల్లోపల ఫైనలైజ్ చేయాలని, మొత్తం ఫలితాలు జూలై 31 లోపల ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయం అవసరం. దీనికి అదనంగా 15 రోజులు ముందుగా విద్యార్థులకు టైమ్‌టేబుల్ సమాచారం ఇవ్వాలి. మొత్తం ప్రక్రియ పూర్తిచేయడానికి కనీసం 45 రోజులు పడుతుందని గతంలో కూడా పలుమార్లు చెబుతూ వచ్చాం. ఆ మేరకు సమయం ఉంటేనే ప్రాసెస్ అంతా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేందుకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని ఆదేశాల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అనగా జూలై 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తిచేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రికి తెలియచేశాం. ఈ విషయంపై పూర్తిగా చర్చించాం. సుప్రీంకోర్టు గడువు తేదీలను పేర్కొంటూ చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని చెప్పింది. అంతకు ముందు ఉన్నతవిద్య ప్రవేశాలకు సంబంధించి యూజీసీకి కొన్ని ఆదేశాలు, సూచనలు ఇచ్చింది. సీబీఎస్ఈ, ఐసీఎస్సీ, స్టేట్‌బోర్డులు ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉన్నతవిద్య కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లోకి ప్రవేశాలను చేపట్టాలని యూజీసీకి ఆదేశాలు ఇచ్చి ఉంది. యూజీసీ కూడా ఉన్నతవిద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను జూలై 31 తరువాత చేపడతామని ప్రకటించింది. కనుక దేశమంతా ఒకే పద్ధతి వస్తున్న పరిస్థితుల్లో మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో, వేరే సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులో ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వీలుకాదు. ఈ పరిస్థితుల్లో ఇంటర్ థియరీ పరీక్షలు 2020–21ని రద్దుచేస్తున్నాం. అదేవిధంగా ఇవే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలను కూడా రద్దుచేస్తున్నాం..’ అని మంత్రి సురేష్ చెప్పారు. పరీక్షల నిర్వహణే మా మొదటి ఆప్షన్ ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పరీక్షల విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్థావస్థ లేనేలేదని స్పష్టం చేశారు. ‘ప్రారంభం నుంచి ఈరోజు (గురువారం) ఉదయం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేవరకు కూడా కోవిడ్–19 ప్రొటోకాల్ నిబంధనలన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామనే మేం చెబుతూ వచ్చాం. ప్రతి గదికి 15 మంది విద్యార్థులుండేలా చూడడం, భౌతికదూరం పాటించడం, కోవిడ్–19 ప్రొటోకాల్‌లోని చివరి అంశం వరకు అన్నిటినీ పాటిస్తూ పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతోనే ఉన్నాం. పరీక్షల నిర్వహణ అనేదే మా మొదటి ప్రాధాన్యం. పరీక్షల రద్దు అనేది రెండో ఆప్షన్ మాత్రమే. మా ముఖ్యమంత్రి మొదటినుంచి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని పలుసార్లు చెబుతూ వస్తున్నారు. పరీక్షలు నిర్వహించడానికే మేము ముందునుంచి ప్రయత్నిస్తున్నాం.అదే విషయాన్ని అఫిడవిట్లో కూడా స్పష్టంగా చెప్పాం. పరీక్షల విషయంలో ప్రభుత్వంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కడా లేదు. అఫిడవిట్లో కూడా పరీక్షలు ఎలా నిర్వహిస్తామో అన్న అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నాం. మొదటి నుంచి కూడా పరీక్షల నిర్వహణకు ఎన్నిరోజులు ఉండాలో చెబుతూ వస్తున్నాం. పరీక్షల నోటిఫికేషన్ నుంచి విద్యార్థులు సన్నద్ధం అవ్వడానికి తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు కనీసం 15 రోజులైనా సమయం ఇచ్చి తరువాత పరీక్షలు నిర్వహించాలి. ఇంటర్లో 7 పేపర్లున్నాయి. రోజువిడిచి రోజు పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందే షెడ్యూల్ కూడా ఇచ్చాం. జూలై 27లోగా పూర్తిచేయాలనుకున్నాం. ఆ తరువాత ఎవాల్యుయేషన్కు 15 రోజులు. అనంతరం ఇతర ప్రక్రియలను పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలనుకున్నాం. గౌరవ న్యాయస్థానం గడువులను నిర్దేశిస్తూ వాటిని అనుసరించి ముందుకెళ్లాలని ఆదేశించినందున మాకు మరో ఆప్షన్ లేదు. కోర్టు ఆదేశించిన టైమ్ షెడ్యూల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చింది’ అని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను నెలరోజుల కిందటే తాము ప్రకటించామని గుర్తుచేస్తూ ఆ షెడ్యూల్ ప్రతిని చూపారు. ‘పరీక్షలను జూలై 7 నుంచి ప్రారంభిస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాం. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడు నిర్వహిస్తారని అడగలేదు. ఎలా నిర్వహిస్తారని మాత్రమే అడిగింది. అదే విషయం చెప్పాం. ఏయే ప్రక్రియలను దశలవారీగా ఎలా నిర్వహిస్తామో కూడా కోర్టుకు చెప్పాం. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వంలో తొలినుంచి ఎలాంటి సందిగ్ధతా లేదు..’ అని మంత్రి స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ సూచనల మేరకు మార్కుల కేటాయింపు ‘ఆయా తరగతులకు సంబంధించిన మార్కులను ఏ పద్ధతుల్లో కేటాయించాలన్న దానిపై త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తాం. మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్ఈ సవివర గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఎలా అసెస్మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. చదవండి: ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ -
పరీక్షల నిర్వహణతోనే ప్రయోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాల విద్య తదుపరి ఉన్నత తరగతుల ప్రవేశాలు టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతో ముడిపడి ఉండడంతో ఇప్పుడందరి దృష్టి వీటి నిర్వహణపైనే కేంద్రీకృతమైంది. ఉన్నత తరగతుల ప్రవేశాలే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా ఈ పరీక్షల్లో సాధించే మెరిట్‌పై ఆధారపడి ఉండడంతో ఈ పరీక్షల ప్రాధాన్యత చర్చకు దారితీస్తోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పరీక్షల నిర్వహణకు ఆయా బోర్డుల అధికారులు షెడ్యూళ్లు ప్రకటించి ఏర్పాట్లు చేసినా కరోనా కేసులు పెరగడంతో వాయిదా పడ్డాయి. కేసులు తగ్గి పరిస్థితుల అనుకూలతను బట్టి పరీక్షలపై ముందుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాల విచారణతో పరీక్షలపై ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. విద్యార్థుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలు నిర్వహించకపోతే అది వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది తలెత్తిన పరిస్థితులను వారు దీనికి తార్కాణంగా చూపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఇబ్బంది రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సుల్లోకి టెన్త్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో టెన్త్ విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు గ్రేడ్లు లేకుండా పాస్ చేయడంతో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఆర్జీయూకేటీ–సెట్ పేరిట ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ సబ్జెకులపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో జరిగిన ఈ పరీక్షను లక్షమందికిపైగా టెన్త్ విద్యార్థులు రాయవలసి వచ్చింది. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రభుత్వ స్కూళ్లలో చదివే నిరుపేద విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించడానికి ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు కాగా గత ఏడాది టెన్త్ పరీక్షలు నిర్వహించనందున ఆ లక్ష్యానికి విఘాతం ఏర్పడింది. ప్రవేశపరీక్ష వల్ల ట్రిపుల్ ఐటీల్లోని 60 శాతం సీట్లు ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులకే దక్కాయి. ఇంటర్ ప్రవేశాలకూ అడ్డంకే ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గత ఏడాదిలోనే ఆన్లైన్ విధానాన్ని ఇంటర్‌బోర్డు ప్రవేశపెట్టింది. ప్రయివేటు విద్యాసంస్థలు ఇష్టానుసారం ప్రవేశాలు నిర్వహించకుండా సీబీఎస్ఈ నిబంధనలను అనుసరించి సీట్లు కేటాయిస్తూ ఆన్లైన్లో ఈ ప్రవేశాలను బోర్డు ద్వారా చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అయితే టెన్త్ పరీక్షలు జరగకపోవడం, న్యాయస్థానం తీర్పుతో గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాలు జరగలేదు. ఈ విద్యాసంవత్సరంలో కూడా టెన్త్ పరీక్షలు జరగకపోత ఆన్లైన్ ప్రవేశాలకు ఇబ్బందే. మెరిట్ ఆధారంగా కేటాయించాల్సిన సీట్లను ప్రవేటు కార్పొరేట్ సంస్థలు తమ ఇష్టానుసారం అధిక ఫీజులు చెల్లించేవారికి కేటాయించుకుంటాయి. టెన్త్ పరీక్షలకోసం ఎస్సెస్సీ బోర్డు 4,199 కేంద్రాలను ఏర్పాటుచేసింది. గదికి 15 మందికి మించకుండా నిర్ణీత భౌతికదూరం ఉండేందుకు గతంలో కన్నా 44 శాతం అదనంగా పరీక్ష కేంద్రాలను పెంచింది. ఈ తరుణంలో కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షల నిర్వహణే మంచిదన్న భావన వ్యక్తమవుతోంది. ఇంటర్ పరీక్షలు జరగకపోతే పై చదువుల ప్రవేశాలకు సమస్యే ఉన్నత విద్యాకోర్సుల్లోకి ప్రవేశాలు ఇంటర్మీడియట్లో సాధించిన మెరిట్ ఆధారంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)లో ఇంటర్మీడియట్లోని మార్కులకు 25 శాతం వెయిటేజి ఉంది. ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే ర్యాంకుల నిర్ధారణ కష్టం. పరీక్షలు పెట్టకుండా సీబీఎస్ఈ ప్రతిపాదించిన విధానంలో మార్కులు కేటాయించినా మెరిట్ విద్యార్థులకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంటర్‌లోని మార్కుల మెరిట్ ఆధారంగా బీఎస్సీ, బీకాం, బీఏ తదితర నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లోకి ఆన్లైన్ పద్ధతిలో ప్రవేశాలను కల్పిస్తోంది. ఇంటర్ పరీక్షలు లేకపోతే ఆ ప్రవేశాలకూ సమస్యే. పరీక్షల కోసం ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా 3 పులల కిందటే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. మే 5 నుంచి 1,452 పరీక్ష కేంద్రాల్లో థియరీ పరీక్షలు జరగాల్సి ఉన్నా కరోనా కేసుల దృష్ట్యా వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయినందున విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్య భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుని థియరీ పరీక్షలు కూడా నిర్వహించడమే మేలని పలువురు పేర్కొంటున్నారు. పేపర్లు కుదించి పరీక్షల నిర్వహణ మేలు టెన్త్‌లో 11 పేపర్లను 6కు కుదించి పరీక్షలు నిర్వహించేలా ఇంతకుముందు ఎస్సెస్సీ బోర్డు షెడ్యూల్ ఇచ్చింది. 6 రోజుల్లోనే పరీక్షలు ముగిసేలా ఏర్పాట్లు చేసింది. అదే పద్ధతిలో ఇంటర్మీడియట్‌లోనూ పరీక్షలు నిర్వహించడమే మంచిదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ విధానాలపై కేంద్రవిద్యాశాఖకు ప్రతిపాదనలు కూడా పంపింది. -
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
ఢిల్లీ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు ఆదేశాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. వేర్వేరు రోజుల్లో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రతి విద్యార్థికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ తదితర అంశాలను కచ్చితంగా అమలు చేస్తామని అఫిడవిట్లో పేర్కొంది. విద్యార్థుల ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడవిట్లో పేర్కొన్న ప్రభుత్వం .. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నట్లు సుప్రీంకు స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహణకు కోర్టు అనుమతి ఇవ్వాలని అఫిడవిట్లో పేర్కొంది. కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా ఏపీలో టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం -
టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల పై నేడు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
TS: సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తూ.. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. -
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సడలింపులు, ఉద్యోగుల పీఆర్సీ అమలు, కరోనా థర్డ్‌వేవ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది జీతాల పెంపు, ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణ, ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉండటంతో అన్ని వర్గాల ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్ధులు కేబినెట్లో తీసుకునే కీలక నిర్ణయాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ అమలుపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. గతంలో సీఎం శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పడే కరోనా తగ్గుముఖం పడుతూ, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేస్తారా.. సడలింపు పొడిగిస్తారా? కరోనా రెండో వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో మినహాయింపు సమయాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతు బంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఇంటర్ పరీక్షల రద్దుపై.. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్లైన్/డిజిటల్ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది. చదవండి: హుజూరాబాద్ మరో ఉద్యమానికి నాంది కాబోతోంది: ఈటల -
Telangana: నేడు పీఆర్సీ అమలు ప్రకటన!
కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. పీఆర్సీ అమలు ద్వారా ప్రస్తుత జూన్ నెలకు సంబంధించి వచ్చే జూలైలో చెల్లించనున్న జీతాలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ►పీఆర్సీ బకాయిల చెల్లింపులపైనా కేబినెట్ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది. ►లాక్డౌన్ ఎత్తివేయని పక్షంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు సమయాన్ని పొడిగించే అవకాశం. ►మరికొన్ని రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం. ►ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దు ద్వారా విద్యార్థులందరినీ పాస్ చేసే అవకాశం. ►ఒకవేళ ఇంటర్ ఫస్టియర్‌లో ఎవరైనా ఫెయిలై ఉంటే, ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులను ప్రథమ, ద్వితీయ సంవత్సరం సబ్జెక్టుల్లో కలిపి పాస్ చేసే చాన్స్. సాక్షి, హైదరాబాద్: నేడు జరగనున్న కేబినెట్ సమావేశంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజానీకం సైతం ఇందులో తీసుకునే కీలక నిర్ణయాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్ శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పీఆర్సీ అమలు అంశంపై చర్చించి ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్డౌన్ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రిమండలికి నివేదించనున్నారు. ఆర్థిక పరిస్థితులపై సమీక్షించిన అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీపై మంగళవారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని, ఆ వెంటనే ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో సోమవారం తీవ్ర చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం వారు మరోసారి కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేస్తారా.. సడలింపు పొడిగిస్తారా? కరోనా రెండో వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో మినహాయింపు సమయాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతు బంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ఇంటర్ పరీక్షల రద్దుపై.. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్లైన్/డిజిటల్ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది. -
ఇంటర్ పరీక్షలపై నిర్ణయం లాక్డౌన్ ముగిశాకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై లాక్డౌన్ ముగిశాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం కంటే.. వేచి చూడటం మంచిదన్న ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరిధిలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో దానికి సమానమైన ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలా, వద్దా? అన్న దానిపై ప్రభుత్వం ఇటీవల కసరత్తు మొదలుపెట్టింది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలిస్తే జూలై మధ్యలో పరీక్షలు నిర్వహించాలంటూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా తెలియజేసింది. అయితే జూలై మధ్య నాటికి ఇతర రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి, ఏ జాగ్రత్తలు చేపడతాయన్నది పరిశీలించి.. మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. -
ఇంటర్ పరీక్షలు వాయిదా వేశాం
సాక్షి అమరావతి: కరోనా నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. హైకోర్టు సూచనలను, పిటిషనర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం వ్యవహారంపై సమీక్షించి ఈ నెల 5 నుంచి జరపాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ సోమవారం హైకోర్టుకు తెలిపారు. పదోతరగతి పరీక్షల వాయిదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వచ్చే మూడు వారాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పదోతరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి పరీక్షల తేదీలను ఖరారు చేశారా? అని ధర్మాసనం అడిగింది. కరోనా, ఇతర పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని శ్రీరామ్ చెప్పారు. షెడ్యూల్ ఈ రోజు ఇచ్చి రెండు మూడురోజుల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు కదా.. అని ధర్మాసనం సందేహం వ్యక్తం చేయగా, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం ఇస్తామని ఏజీ తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తదుపరి విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. -
పది, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణను మే 3కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ బోర్డులను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ విజయవాడకు చెందిన ఇంటర్ విద్యార్థి పి.దర్శత్, పదో తరగతి విద్యార్థులు వేణు మాధవ్, రమేష్ చౌదరిలు హైకోర్టు లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాం: ఏజీ శ్రీరామ్ ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది బసవ ప్రభుపాటిల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది, పదో తరగతి పరీక్షలకు 5 నుంచి 6 లక్షల మంది హాజరు కానున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. పరీక్షల ప్రక్రియలో టీచర్లు, అధికారులు, సిబ్బందికి కూడా కోవిడ్ ప్రమాదం పొంచి ఉంటుంది. పరీక్షలు రద్దు చేయాలని మేము కోరడం లేదు.. కేవలం వాయిదా కోరుతున్నాం అంతే’ అని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం పలు రాష్ట్రాలు నిర్వహించే జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై ఆరా తీసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా వేయకుండా ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. పలు రాష్ట్రాలు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిసిందని ప్రభు పాటిల్ చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ స్పందిస్తూ.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోజురోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అని ప్రశ్నించింది. పెరుగుతున్నాయని శ్రీరామ్ చెప్పగా, కాబట్టే పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతున్నామని ధర్మాసనం తెలిపింది. విద్యార్థులంతా ఒకే చోట ఉండరని, వేర్వేరుగా పరీక్ష కేంద్రాలు ఉంటాయని శ్రీరామ్ తెలిపారు. కోవిడ్ సోకినవారు కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం ఐసోలేషన్‌లో ఉండి తీరాలని ధర్మాసనం గుర్తుచేసింది. దీనికి శ్రీరామ్ స్పందిస్తూ.. కరోనా వల్ల, ఒత్తిడి వల్ల ఏదయినా కారణం వల్ల పరీక్ష రాయని వారికి మళ్లీ పరీక్ష పెడతామన్నారు. పరీక్ష రాయడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుందన్నారు. -
Manabadi Nadu Nedu: నాణ్యతలో రాజీవద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పనిలో నాణ్యత (క్వాలిటీ)తో కూడిన ఆడిటింగ్ జరగాలని, అన్ని స్కూళ్లలో పనుల్లో నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు. మే, జూన్ రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా సూచించారు. మే చివరి నాటికి ‘మన బడి నాడు–నేడు’ మొదటి దశ పనులు పూర్తవ్వాలని ఆదేశించారు. జూలైలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకుసూచించారు. ‘మనబడి నాడు–నేడు’ మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిపై సీఎం జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని వివరిస్తూ వాటిని ప్రజెంటేషన్‌ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సమీక్షలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. బిల్డింగ్స్‌పై కూడా పెయింటింగ్స్ వేయండి ‘‘స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్ వేయండి. మన బడి నాడు–నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్లో నాడు ఆ స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అన్న ఫొటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అప్పుడే ఇప్పుడు చేసిన పనులకు మరింత విలువ వస్తుంది. వాటి ప్రాధాన్యత తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఆ స్కూల్‌ను ఎలా నిర్వహించాలన్న దానిపైనా వారికి అవగాహన కలుగుతుంది. స్కూళ్లలో పెయింటింగ్ పనులు, స్మార్ట్ టీవీలు, వాల్ ఆర్ట్‌తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలి. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదు. అందుకే పేరెంట్స్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలి. వాటిలో ఎక్కడా తేడా ఉండకూడదు. అలాగే మే, జూన్ నెలల్లో పూర్తిగా పనుల నాణ్యతను చూడాలి. ప్రతి స్కూల్ సందర్శించాలి. అన్నీ నోట్ చేయాలి. క్వాలిటీ ఆడిట్ పూర్తి కావాలి. టాయిలెట్ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలి. ఇంగ్లిష్ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే వారు ఏ ఇబ్బందీ లేకుండా ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పగలుగుతారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా సిద్ధం కావాలి. ఈసారి కిట్లలో ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలి. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలి. జూలైలో స్కూళ్లు తెరవగానే మనబడి నాడు–నేడు రెండో దశ పనులు మొదలు కావాలి. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు విద్యార్దుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఏ పరిస్థితిలో ఎందుకు పరీక్షలు పెడుతున్నామన్నది చెప్పాలి. నిన్న కేరళలో 10వ తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్నీ ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయి. అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు వస్తాయి? పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా? కేవలం పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.నిజానికి పరీక్షలు రద్దు చేయడం చాలా సులభం. పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నది. కేవలం విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్ గుర్తించాలి. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలని, తోడ్పాటు కావాలన్న విషయాన్ని వారందరికీ బలంగా చెప్పండి. అలాగే పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడా ఏ మాత్రం అలక్ష్యం చూపొద్దు. అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఈ పరీక్షలు నిర్వహించాలి.’’ అని సీఎం పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తెలంగాణ: టెన్త్ పరీక్షలు అవసరమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరో వారం పది రోజులు వేచి చూసి... తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటివరకు కేసుల పెరుగుదల పరిస్థితిని చూసి ముందుకు సాగితే బాగుంటుందన్న యోచనలో ఉన్నారు. మే 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న భావనలోనే ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. గతేడాదిలాగే పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేసి పాస్ చేయాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. గతేడాది ఫార్మేటివ్ అసెస్మెంట్స్ (ఎఫ్ఏ) పరీక్షలు, ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష జరిగాయి. వాటితోపాటు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించి పాస్ చేశారు. అయితే ఈసారి అవేవీ జరుగలేదు. ఒకే ఒక ఎఫ్ఏ పరీక్షను కొన్ని పాఠశాలల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో అధికారులు వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు. మే నెల మొదటివారం వరకు కరోనా వ్యాప్తిని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని, కేసులు తగ్గితే కనుక పరీక్షలు నిర్వహించాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. కేసుల వ్యాప్తి తగ్గకపోతే మాత్రం పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఫస్టియర్ పరీక్షలపై అస్పష్టత ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయంలోనూ ఆలోచన చేస్తున్నారు. కేసులు తగ్గితే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. లేదంటే మాత్రం కనీస మార్కులతో పాస్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో కనీస పాస్ మార్కులతో విద్యార్థులను ఉత్తీర్ణులను చేశారు. ఈసారి కూడా అలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాత్రం మే 1వ తేదీ నుంచి పరీక్షలు యథావిధిగా ఉంటాయని శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు. పరీక్షల రద్దు విషయంలో తామేమీ ఆలోచన చేయడం లేదని, దానిపై ఏమైనా ఉంటే ప్రభుత్వం నిర్ణయం తీసు కుంటుందని పేర్కొన్నారు. మరోవైపు ద్వితీయ సంవత్సర విద్యార్థుల విషయంలో మాత్రం పరీక్షలు ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ప్రభు త్వం ఉన్నట్లు తెలిసింది. ఉన్నత విద్యకు వెళ్లే, ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోతే సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. అయితే షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిం చాలా? లేదంటే కొన్నాళ్లు వాయిదా వేసి నిర్వహించాలా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై మరో నాలుగైదు రోజుల్లో ఉన్నతస్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. చదవండి: (టెస్టులు లక్ష.. టీకాలు లక్ష) -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు 2021 మే ఐదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ సోమవారం తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. గతేడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనందున అప్పుడు ఫస్టియర్ పరీక్షలు రాసిన వారు ఈ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పించారు. మార్చి 31 నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి ఆదివారాలు సహా ఏప్రిల్ 24 వరకు జరుగుతాయి. ప్రతి రోజు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు జరుగుతాయి. ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ పేపర్లు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష మార్చి 24న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష మార్చి 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. -
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు మే 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 23వ తేదీ వరకు మొదటి, రెండో సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉండడంతో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ విధానంలో తరగతులు కొనసాగుతున్నాయి. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అయితే పరీక్షల నిర్వహణ ఎలా చేస్తారనేది ఆసక్తిగా మారింది. కరోనా వ్యాప్తి కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఇంటర్ సిలబస్‌ను 30 శాతం తగ్గించడమే కాకుండా ఇంటర్ మొదటి ఏడాది పనిదినాలు 108కి కుదించారు. ఇంటర్ మొదటి ఏడాదికి సంబంధించి తరగతులు గతనెల 18వ తేదీన ప్రారంభమైన తరగతులు మే 4 వరకు కొనసాగుతాయి. షెడ్యూల్ మొదటి సంవత్సరం తేదీ పరీక్ష 5 సెకండ్ లాంగ్వేజ్ 7 ఆంగ్లం 10 గణితం పేపర్ 1ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం 12 గణితం పేపర్ 1బీ, జీవశాస్త్రం, చరిత్ర 15 భౌతికశాస్త్రం, అర్ధశాస్త్రం 18 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 20 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్స్ మేథ్స్ 22 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జాగ్రఫీ రెండో సంవత్సరం తేదీ పరీక్ష 6 సెకండ్ లాంగ్వేజ్ 8 ఆంగ్లం 11 గణితం పేపర్ 2ఏ, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం 13 గణితం పేపర్ 2బీ, జువాలజీ, చరిత్ర 17 భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం 19 రసాయనశాస్త్రం, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ 21 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్, బ్రిడ్జి కోర్సు మేథ్స్ 23 మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలన్నీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మార్చ్ 24న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, మార్చ్ 27న పర్యావరణ విద్య పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 24 వరకు నిర్వహించనున్నారు. -
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని రాష్ట్ర విద్యాశాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 100 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, 500 రూపాయల రుసుముతో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 2 వరకు, 1000 రూపాయల ఫైన్‌తో మార్చ్ 3 నుంచి మార్చి9 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. అర్హత కలిగిన విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలని పేర్కొంది. చదవండి: సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిదే. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉండనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. -
సెకండ్ ఇంటర్ పరీక్షలే ముందు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్–2021 మార్చి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. ఈసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షెడ్యూల్లో కాకుండా వేర్వేరుగా నిర్వహించే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా 2020–21 విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారడమే దీనికి కారణం. నిజానికి ప్రస్తుత విద్యా సంవత్సరం తరగతులు జూన్‌లో ప్రారంభం కావల్సి ఉండగా కరోనా కారణంగా నవంబర్ 2 నుంచి కేవలం సెకండియర్ తరగతులు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించాలనుకున్నప్పటికీ కోర్టు తీర్పుతో నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈనెల 18 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం రెండో విడత ప్రవేశాలు సోమవారం వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలో.. ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో ముందుగా సెకండియర్ పరీక్షలను పూర్తిచేసేందుకు బోర్డు కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. ఫస్టియర్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 11లోగా పరీక్షల ఫీజు చెల్లించాలి ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజును వచ్చేనెల ఫిబ్రవరి 11లోగా చెల్లించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలైన విద్యార్థులు (జనరల్, వొకేషనల్), కాలేజీలో స్టడీ లేకుండా హాజరు మినహాయింపు పొందిన (హ్యుమానిటీస్) విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ముందుగా సెకండియర్ పరీక్షల ఫీజు గడువును ప్రకటించడం ద్వారా పరీక్షకు ఎంతమంది విద్యార్థులు ఉంటారన్న దానిపై ఒక స్పష్టత వస్తుందని, తదనంతరం పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లుచేస్తామని బోర్డు వర్గాలు ప్రకటించాయి. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షల నిర్వహణను చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం ప్రస్తుతం సెకండియర్ చదివే విద్యార్థులు తమ ఫస్టియర్ సబ్జెక్టుల మార్కుల్లో పెరుగుదల కావాలనుకుంటే అలాంటి వారికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. కానీ, ఫస్టియర్‌లో అన్ని సబ్జెక్టులలో పాసైన వారు మాత్రమే ఈ ఇంప్రూవ్‌మెంటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫస్టియర్ పరీక్ష ఫీజు రూ.490తో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున ఇంప్రూవ్‌మెంటు పరీక్షకు చెల్లించాల్సి ఉంటుంది. కాలేజీ స్టడీ లేకుండా హాజరు మినహాయింపుతో 2021 మార్చి ఫస్టియర్, సెకండియర్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్‌లోనే పరీక్షలను రాయవలసి ఉంటుంది. అలాగే, విద్యార్థులు నేరుగా పరీక్ష ఫీజులను చెల్లించాలనుకుంటే ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఫీజుల చెల్లింపు తేదీని పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. సీఎం ఆదేశాలతో పరీక్ష ఫీజుల పెంపు నిలుపుదల ఈ ఏడాది నుంచి ఇంటర్ పరీక్షల ఫీజును పెంచాలని బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. అయితే, కోవిడ్–19ను దృష్టిలో పెట్టుకుని ఫీజులు పెంచవద్దని.. దానితో పాటు ఆలస్య రుసుమును కూడా రద్దుచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని.. దీంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష ఫీజులకు సంబంధించిన వివిధ కేటగిరీల వారీ వివరాలను బోర్డు ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో పొందుపరిచింది. -
టీవీ చూస్తుందని మందలిస్తే..
కొత్తపల్లె (పామూరు): తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్ చదివిస్తున్నారు. ఇటీవల లాక్‌డౌన్‌తో ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా పంచలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై అంబటి చంద్రశేఖర్, ఏఎస్సై డి.లక్ష్మీప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు. బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తుదనుకుంటే.. ‘మాకష్టం మాపిల్లలకు ఉండకూడదని కష్టపడి పిల్లలను చదివిస్తున్నాం. చదువుకుని మంచి ఉద్యోగస్తురాలవుతుందనుకున్న మా కుమార్తె ఇలా మాకు దూరమవుతుందనుకోలేదు. కష్టపడి చదివితే ఉద్యోగమొస్తుందనే టీవీ ఎక్కువగా చూడద్దని చెప్పా. కానీ ఇలా మమ్ములను మా కుమార్తె విడిచి శాశ్వతంగా దూరమవుతుందనుకోలేదని’ తల్లిదండ్రులు విలపించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. విద్యార్థిని ఆత్మహత్య మద్దిపాడు: ఇంటర్ పరీక్షలు ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్లవరం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం...మల్లవరం ఎస్సీ కాలనీకి చెందిన బోడిపాక కీర్తి అద్దంకిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంది. రెండు రోజుల క్రితం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మద్దిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రులకు ఒక్కటే కుమార్తె, ముగ్గురు కుమారులు కావడంతో ఇంటి మహాలక్ష్మి మరణించిందంటూ విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె పరీక్ష కోసం ఏకంగా బోటునే..
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర జల రవాణా శాఖ (ఎస్‌డబ్ల్యూటీడీ)కు చెందిన 70 సీట్ల పడవ కేవలం ఒక ప్రయాణీకురాలి కోసం అలప్పుజ జిల్లాలోని ఎంఎన్ బ్లాక్ నుంచి కొట్టాయంలోని కంజిరామ్ బయలుదేరింది. ఓ విద్యార్థినిని హెచ్ఎస్సీ (ప్లస్ వన్) పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం కేరళ ప్రభుత్వం ఏకంగా ఓ బోటునే ఏర్పాటు చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఆ వివరాలు.. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయా రాష్టాలు పరీక్షల తేదీలను వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలో ప్లస్ వన్ పరీక్షలు జరుగుతున్నాయి. సాండ్ర బాబు(17) అనే విద్యార్థిని పరీక్షలకు హాజరు కావాలి. అయితే లాక్డౌన్ కారణంగా కుట్టనాడ్ ప్రాంతంలో ప్యాసింజర్ బోట్లు నిలిపివేశారు. దాంతో ఏం చేయాలో పాలుపోని విద్యార్థిని ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు సమాచారం అందించింది. (ఇప్పుడే ముప్పెక్కువ) సాండ్రా బాబు పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు ఆమె కోసం బోటు పంపిస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారం విద్యార్థినిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడం కోసం పూర్తి అనుభవజ్ఞులైన ఐదుగురు సిబ్బందితో, 70 సీట్ల బోటును పంపించారు అధికారులు. ప్రతి రోజు సాండ్ర ఇంటి దగ్గర ఉన్న జెట్టీ నుంచి ఉదయం 11.30 గంటలకు బోటు బయలుదేరుతుంది. కంజీవరంలోని ఎస్ఎన్డీపీ హైయ్యర్ సెకండరీ స్కూల్ దగ్గర ఉన్న జెట్టీ వద్ద దింపుతుంది. ఆమె పరీక్ష అయిపోయేంత వరకు అక్కడే ఉండి తర్వాత విద్యార్థినిని ఇంటి దగ్గర వదులుతుంది. ఈ క్రమంలో సాండ్ర మాట్లాడుతూ.. ‘పాఠశాలకు చేరడానికి నాకు వేరే మార్గం లేదు. బోటు నడవకపోతే నేను పరీక్షలు రాయడం కుదరదు. దాంతో నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధికారులకు నా పరిస్థితి గురించి తెలియజేశాను. వారు నా కోసం బోటు నడుపుతున్నారు. నేను ఎస్‌డబ్ల్యూటీడీ అధికారుల మేలు ఎప్పటికి మరవలేను. నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను’ అన్నది. (నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!) ఈ సందర్భంగా ఎస్‌డబ్ల్యూటీడీ డైరెక్టర్ షాజీ వి నాయర్ మాట్లాడుతూ.. ‘సాండ్రా సహాయం కోరినప్పుడు అధికారులు మరో ఆలోచనకు తావియ్యలేదు. వెంటనే స్థానిక మంత్రిని కలిసి సమస్యను వివరించారు. బోటును నడపడానికి ఐదుగురు సిబ్బందిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అని తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్: పది, ఇంటర్ పరీక్షలు రద్దు
రాయ్‌పూర్ : దేశంలో కరోనా వైరస్ విభృంభిస్తున్న తరుణంలో మధ్యలో ఆగిన (పది, ఇంటర్) పరీక్షల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల పరీక్షలపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది, ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే అందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. (జూలైలో పది పరీక్షలు) ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా.. విద్యార్థులకు మార్కులు కేటాయించనున్నారు. దీని ఆధారంగానే పై చదువులకు ప్రమోట్ చేయనున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షులు నిర్వహించిన ఫలితాలు విడుల చేసేలోపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ అభిప్రాయపడింది. ఈనేపథ్యంలో విద్యార్థులందరనీ పాస్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, తల్లీదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే దారిలో పంజాబ్ ప్రభుత్వం కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. (ఏపీలో మరో 36 పాజిటివ్ కేసులు) ఇక తెలంగాణలోనూ పది పరీక్షలు మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. వీటిని జూన్ మొదటి వారంలో తిరిగి ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ చెబుతోంది. అప్పటిలోపు పరిస్థితి అదుపులోకే వస్తే పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు, సలహాలు చేసింది. (దూరం 250 కిమీ.. టికెట్ ధర 12వేలు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏపీ.. ఇంటర్ చివరి పరీక్ష వాయిదా
సాక్షి, విజయవాడ : కరోనా వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 23) రోజున జరగాల్సిన ఇంటర్మీడియట్ చివరి పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ ప్రకటన చేసింది. త్వరలోనే వాయిదాపడిన పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపింది. కాగా, రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనాను ఎదుర్కొవడంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎం జగన్ అన్నారు. చదవండి : ఈ నెలాఖరు వరకు ఏపీ లాక్డౌన్ : సీఎం జగన్ మార్చి 31 వరకు తెలంగాణ లాక్డౌన్ -
ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ బీటెక్ విద్యార్థి
అమీర్‌పేట: ఇంటర్ విద్యార్థికి బదులు పరీక్ష రాస్తూ్త బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఆర్నగర్లోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని దీప్‌శికా ఒకేషనల్ జూనియర్ కళాశాలలోని ఇంటర్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే విద్యార్థికి బదులుగా బీటెక్ చదువుతున్న సాయితేజ అనే మరో విద్యార్థి శుక్రవారం జరిగిన గణితం బి.2 పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాస్తున్న విద్యార్థి వయస్సు ఎక్కువగా కనిపించడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్ టికెట్‌ను తనిఖీ చేశాడు.విద్యార్థి వద్ద ఉన్న హాల్‌టికెట్‌లోని ఫోటోతో పరీక్ష రాస్తున్న విద్యార్థిని పరిశీలించడంతో అసలు విషయం వెలుగుచూసింది.దీంతో పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సాయినాథ్ తెలిపారు. -
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
-
నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు
-
ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి
-
‘ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష హాల్లోకి అనుమతి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఇంటర్ బోర్డు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేవిధంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. చివరి నిమిషంలో కళాశాల యాజమాన్యాలు వేధించకుండా, హాల్ టికెట్ జాప్యం చేయకుండా, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్నిఇంటర్ బోర్డు తీసుకొచ్చిందన్నారు. ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు, హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. దీంతో గతంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసే యాజమాన్యాలు తీరుకు చెక్ పెట్టనున్నారు. క్యూఆర్ కోడ్‌తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, ‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, ఇంటర్ బోర్డ్ తొలిసారిగా పరీక్షలు రాసే గది వివరాలు తెలిపే విధానాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ రోజు(మంగళవారం) రాత్రి 8 గంటలు నుంచి "నో యువర్ సీట్" సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1411 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నంబర్ 0866 2974130, 18002749868 వాట్సాప్ నంబర్ 9391282578 ఏర్పాటు చేశారు. -
ఇంటర్, టెన్త్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థుల సౌకర్యాలు మొదలుకొని మాస్ కాపీయింగ్ నిరోధం వరకు ప్రతి విషయంలోనూ ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 1,411 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 2,900 కేంద్రాల్లో జరిగే పదోతరగతి పరీక్షలు 6.30 లక్షల మంది రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఆ సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయిస్తామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. అక్రమాల నిరోధానికి జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్లను కేటాయించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే అవస్థలు లేకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో స్వల్ప మార్పులు చేసిన నేపథ్యంలో విద్యార్థులను సిద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాపీయింగ్ నిరోధానికి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు లీక్ సమస్యను నివారించేందుకు చీఫ్ సూపర్ వైజర్ మినహా ఎవరి వద్దా మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి పరీక్షల్లో చేసిన మార్పు ప్రకారం జవాబు పత్రం కేవలం 24 పేజీలతో ఉంటుంది. అడిషనల్ తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ఈ సారి హాల్‌టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ యాప్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి సురేష్ పరీక్షల నిర్వాహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏర్పాట్లను వివరించారు. ఇంటర్లో గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇస్తామన్నారు. కాగా ఇన్విజిలేటర్లుగా సచివాలయ ఉద్యోగుల సేవలు తీసుకుంటామని చెప్పారు. నూజివీడు ఐఐఐటీ ఘటనపై కమిటీ వేశామని, నివేదిక వచ్చాక చర్చలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. -
‘పరీక్షా’కాలం
సాక్షి, సిటీబ్యూరో: ‘పిల్లలకే కాదు..వారి భవిష్యత్తుపైగంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులకూ ఇది ఓ ‘పరీక్షా’ కాలం. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లోనే కాదు తల్లిదండ్రుల్లోనూ ప్రిపరేషన్‌పై ఆందోళన మొదలవుతుంది. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, ఆత్మ విశ్వాసాన్నిపెంపొందించాలి. అప్పుడే పిల్లలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా విజయవంతంగా పరీక్ష రాస్తారు. తద్వారా మంచి మార్కులు సాధిస్తారు’ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 4 నుంచి 23 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, 19 నుంచి ఏప్రిల్ 6 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి 450 పరీక్షా కేంద్రాల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష రాయబోతున్నారు. ఇప్పటికే అధికారిక యంత్రాంగం అంతా పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నం కాగా... పిల్లల ప్రిపరేషన్ విషయంలో తల్లిదండ్రులు కుస్తీపడుతున్నారు. సాధారణంగా వార్షిక పరీక్షలు అనగానే పిల్లల్లో తీవ్రమైన మానసిక ఆందోళన మొదలవుతుంది. ఇది చదువు...అది చదువు... ఇలా చదవాలి... అలా చదవాలి... అంటూ తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. దీంతో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికిలోనై ఇప్పటికే చదవిన అంశాలన్ని మర్చిపోతుంటారు. నిద్రాహారాలు మాని చదువుతుండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పిల్లలకు తల్లిదండ్రులు అండగా నిలవాలి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలి. ఇంట్లో చదువుకునే వాతావరణాన్ని కల్పించడంతో పాటు నిద్రాహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలపై కలెక్టర్ సమీక్ష వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎం.కృష్ణ సోమవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ, విద్యుత్, ఆర్టీసీ, జలమండలి, తపాలా, ట్రాఫిక్, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ తాగేందుకు మంచినీరు ఏర్పాటు చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, లైన్ల మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్ కోతలు లేకుండా చూడాలని సీపీడీసీఎల్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చూడాలని పోలీసులకు, అస్వస్థతకు గురైన విద్యార్థులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ప్రతి సెంటర్లో ఒక ఏఎన్ఎం సహా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కోరారు.పరీక్షల కోసం ప్రత్యేక బస్సులను నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పూర్తైన తర్వాత పేపర్లను సకాలంలో ఆయా పరీక్ష కేంద్రాల నుంచి వాల్యూయేషన్ కేంద్రాలకు చేర్చాల్సిందిగా తపాలా శాఖకు సూచించారు. ఇంట్లో వాతావరణం కీలకం విద్యార్థులకు పునశ్ఛరణ సమయం చాలా ముఖ్యమైంది. ప్రణాళికాబద్ధంగా చదివితే అధిక మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. తోటి విద్యార్థులతో కలిసి అభ్యసనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివేవారు తప్ప మిగిలిన విద్యార్థులు పాఠశాలల్లో గడిపేది రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు మాత్రమే. మిగిలిన సమయంలో ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి, వాళ్లు చదువులో రాణించేందుకు ఇంటి వాతావరణం ఎంతో ముఖ్యం. విద్యార్థులు ఇంటివద్ద చదివేటపుడు..వీలైనంతవరకూ వారిని టీవీ, కంప్యూటర్ వంటి ఉపకరణాలకు, వినోదాలకు దూరంగా ఉంచాలి. వారి ముందు సెల్‌ఫోన్ సంభాషణలు సరికాదు. పిల్లలకు ప్రత్యేక గది లేని ఇంట్లో పరీక్షల ముందు కేబుల్ కనెక్షన్ తొలగించడం అవసరం. పరీక్షల ముందు విందులు, వినోదాలు, శుభ కార్యాలకు విద్యార్థులను తీసుకెళ్లొద్దు. విద్యార్థికి సమయంతో పాటు ఏకాగ్రత కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి,మానసిక నిపుణుడు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త బాగా రాయాలనే ఆలోచనతో చాలామంది రాత్రంతా నిద్రపోకుండా చదువుతుంటారు. దీంతో తలనొప్పి మొదలై చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. కొంతమంది ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తుంటారు. ఇలా చేస్తే కళ్లు తిరిగి, స్పృహ తప్పే ప్రమాదం ఉంది. పరీక్షల సమయంలో వేళకు పౌష్టికాహారం తీసుకోవడం, నిద్రపోవడం అవసరం. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది కాబట్టి ఓ గంట ముందే కేంద్రానికి చేరుకుంటే మంచిది. పరీక్షల సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా జవాబులు రాయొచ్చు. అంతేకాదు పిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడాలి. ’చాలా తెలివైనవాడివి..అనుకుంటే ఏదైనా సాధిస్తావు..’ లాంటి పదాలను వాడుతూ ప్రోత్సహించాలి. ఏకాగ్రతను పెంచుకునేందుకు, ఒత్తిడిని అధిగమించేందుకు కొంత సమయం ఇంటి వద్ద యోగా, ధ్యానం చేయించాలి. – రాధిక, సైకాలజిస్ట్ వారం రోజుల్లో హాల్‌టికెట్లు అభ్యర్థుల హాల్ టికెట్లు మరో వారం రోజుల్లో ఆయా కాలేజీలకు అందనున్నాయి. ఫీజులు చెల్లించకపోవడంతో వారికి హాల్‌టికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నిరాకరించే అవకాశం ఉండటంతో విద్యార్థులే నేరుగా హాల్ టికెట్‌ను పొందే అవకాశం కల్పించాం. ఆన్లైన్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే వీలుకల్పించాం.–బి.జయప్రద బాయి,హైదరాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు ఆఫీసర్ -
ఇంటర్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలను కలుపుకుని పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. అనంతరం పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారదర్శక రీతిలో సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల ఇంటర్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ వహించాలన్నారు. (చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం) -
పకడ్బందీగా పరీక్షలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గతేడాది జరిగిన తప్పులు పునరావృతం కావద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. మార్చి, ఏప్రిల్‌ల్లో జరగనున్న ఇంటర్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. సోమవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణను ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల కోసం ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టమ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు, పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, సెంటర్ల ఏర్పాటు, జంబ్లింగ్ పద్ధతి, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడి ప్రక్రియలను అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. -
మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సర పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 4 నుంచి మార్చి 23 వరకు వీటిని నిర్వహించనున్నారు. ఈ మేరకు బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. నైతిక విలువలు (ఎథిక్స్), మానవ విలువలు (హ్యూమన్ వ్యాల్యూస్) సబ్జెక్టుల పరీక్షలు జనవరి 28న, పర్యావరణ విద్య పరీక్ష జనవరి 30న జరగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. జంబ్లింగ్ విధానంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించనున్నారు. ఒకేషనల్ కోర్సుల పరీక్షలు కూడా ఇవే తేదీల్లో జరుగుతాయి. ఆ పరీక్షల షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు. -
రీవెరిఫికేషన్లో 1137మంది విద్యార్ధులు ఉత్తీర్ణత
-
ఇంటర్మీడియట్లో మరో 1,137 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్ కాగా, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది. 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను మినహా మిగతావారి జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో (http://bie.telangana.gov.in/)అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ స్కానింగ్ కాపీలను మంగళవారం ఉదయంలోగా వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. మిగిలిన 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలోనూ జవాబుపత్రాల పరిశీలన జరిపినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న 23 మందిలో 20 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైనట్టు తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులు అంతకుముందే ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. ఒక విద్యార్థి 3 పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆ మూడు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిందని వివరించింది. జూన్ 12 తర్వాత ఫీజు వెనక్కి... ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించిన 21,537 విద్యార్థుల ఫీజులను వచ్చే నెల 12వ తేదీ తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల అందరి జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగానే చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఫీజులను తిరిగి ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. తక్కువ మార్కులు వచ్చాయని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను మూడు రోజుల్లో తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది. కాగా, రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగి పాస్ అయిన విద్యార్థులే కాకుండా మొదట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగినా పాస్ కాని విద్యార్థులు వేలల్లో ఉంటారని తల్లిదండ్రులు అంటున్నారు. అలా ఎంతమందికి మార్కులు పెరిగాయో, వారి వివరాలను కూడా బోర్డు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంతమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయో తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు తాజా ఫలితాల వెల్లడిలోనూ కొంచెం గందరగోళం చోటుచేసుకుంది. ఫలితాల్లో కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లు రెండుమూడు సార్లు పునరావృతమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
గ్లోబరీనా వల్లే సమస్యలు
సాక్షి, హైదరాబాద్: గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వల్లే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు చోటు చేసుకున్నాయని, ఆ సంస్థ వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీంతో ఆ సంస్థను కూడా తమ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చా లని అభ్యర్థిస్తూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బుధవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కు ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి హైకోర్టును కోరారు. అది సాధ్యం కాదని స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం, విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఇంప్లీడ్ పిటిషన్‌పై ఆ రోజున విచారణ జరుపుతామంది. ఇంటర్ పత్రాల మూల్యాంకనం సక్రమంగా జరగకపోవడం వల్లే విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు, బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అచ్యుతరావు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ ముందుంచాలం టూ విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇందులో భాగంగా బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా అచ్యుతరావు తరఫు న్యాయవాది గ్లోబరీనా సంస్థను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుకు అనుమతి కోరారు. అనుమతినిచ్చిన ధర్మాసనం అత్యవసర విచారణకు నిరాకరించింది. ప్రభుత్వ కమిటీ అదే తేల్చింది.. గ్లోబరీనా నిర్లక్ష్యం వల్లే ఇంటర్ పత్రాల మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చిందని అచ్యుతరావు తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇంటర్ పత్రాల మూల్యాంకన కాంట్రాక్ట్‌ను గ్లోబరీనా రూ.4.35 కోట్లకు దక్కించుకుందన్నారు. అయితే ఈ ఒప్పందంపై ఏ సంతకాలు లేవని ప్రభుత్వ కమిటీ తేల్చిందని వివరించారు. పెరిగిన అవసరా లకు అనుగుణంగా తగిన సాంకేతిక, మానవ వనరులు గ్లోబరీనా వద్ద లేవన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో కూడా లోపాలున్నాయని, దీనిపై అనేక మంది ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. అంతిమంగా అటు బోర్డు, ఇటు గ్లోబరీనా సంస్థల నిర్వాకం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరారు. -
మే 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 16వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1వ తేదీవరకూ, జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
తెలంగాణలో అసమర్థ పాలన: రాపోలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితా ల్లో తీవ్ర అన్యాయానికి గురైన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు వద్ద చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం కంటికి కనిపించవా? అని ప్రశ్నించారు. విద్యార్థుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైనందుకు బాధ్యుడిగా విద్యా శాఖ మంత్రి రాజీనామా చేస్తారా అని విద్యార్థి లోకం ఎదురు చూస్తోందన్నారు. గ్లోబరీనా సంస్థకు ప్రభుత్వ పెద్దలకు ఉన్న అనుబంధంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సంశయం ఏర్పడటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుకొచ్చి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. -
ఒక్క నిమిషం.. ఆలోచించండి!
ఓటమి గెలుపునకు నాంది... ఓడిపోయామని నిరుత్సాహానికి గురికాకుండా మరింత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని తదుపరి విజయంకోసం శ్రమించాలి. విజయం సాధించి చూపాలన్న కసిని పెంచుకోవాలి. ఓటమితో కుంగిపోతే చంద్ర మండలానికి వెళ్లగలిగేవాళ్లమా? ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఆధునిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చేవా? ఎన్నో ఓటముల తరువాత కానీ ఆయా రంగాల్లోని శాస్త్రవేత్తలు విజయం సాధించారన్నది అంతా గుర్తించాలి. అలాగే పరీక్ష తప్పినంత మాత్రన కోల్పోయేది ఏమీ లేదు. ‘మనం’ అనేవాళ్లం ఉంటే.. ఉజ్వలమైన భవిష్యత్ మనముంగిటే చేరుతుంది. విజయాలు కూడా మనసొంతమే అవుతాయి. ఆలోచించండి..! శ్రీకాకుళం న్యూకాలనీ: ఏప్రిల్, మే నెలలు పరీక్షా ఫలితాలు విడుదలయ్యే సమయం. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పలు ఉన్నత కోర్సుల ఫలితాలు వెలువడుతుంటాయి. ఇప్పటకే శుక్రవారం ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు కొంతమందికి తియ్యదనాన్ని.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగల్చడం సహజం. గ్రేడింగ్ విధానంలో వెలువడిన ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు అర్భుత ఫలితాలను సాధించి, రాష్ట్రస్థాయిలో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో జిల్లాకు చెందిన మరికొంత మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆవేదనకు గురి చేస్తున్నారు. పరీక్ష తప్పామన్న ఆవేదనతో, తమ స్నేహితులు, బంధువుల వద్ద తలెత్తు కోలేమోనని క్షణికావేశానికి లోనవుతున్నారు. గతంలో పరీక్ష ఫలితాల ప్రభావంతో ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. మరిందరు సమాచారం బయటకు తెలీయనీయడం లేదు. ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా... మేలో పదో తరగతి, డిగ్రీ, పలు ప్రెవేశ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రశాంతంగా ఆలోచించాలి... ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే చాలని, అనవసరంగా ఆందోళనకు, ఒత్తిడికి గురై, తప్పుడు దారులు వెతకరాదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు వంటిదని, అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పులు చేయను.. అనే విధంగా దానిని సరిదిద్దు కునేందుకు మళ్లీ ప్రయత్నిస్తే, విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఉత్తీర్ణత సంతోషాన్ని, బలాన్ని ఇస్తే.. ఓటమి విజయానికి బాటలు వేస్తుందన్న నిత్య సత్యాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని సూచిస్తున్నారు. కష్టపడి చదవాలి. మంచిమార్కులు సాధించాలన్న లక్ష్యంతో దూసుకుపోవాలి. మన చిత్తశుద్ధిలో లోపం లేకుంటే ఫలితం ఎలా ఉన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదని విద్యావేత్తల అభిప్రాయం. తల్లిదండ్రులూ.. ఇవి మీకే.. ♦ తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పాస్ కాలేదనో వారిని మందలించ వద్దు. ♦ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చుతూ హేళనగా మాట్లాడకూడదు. ♦ ఫలితాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ♦ ఫలితాలు అనుకూలంగా వస్తే ఫరవాలేదు. ప్రతికూలంగా వస్తే.. వారు తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అటువంటి సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి. ♦ జరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మీమున్నామన్న భరోసాను ఇవ్వగలగితే వారికిక తిరుగేలేదు. విద్యార్థులకు సూచనలు.. ♦ పాస్, ఫెయిల్ అన్నవి అత్యంత సాధారణ విషయాలుగా భావించాలి. ♦ జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించవచ్చన్న సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. ♦ ఫలితాలతోనే జీవితం ముడిపడి ఉందని భావించకూడదు. ♦ అనుకూల ఫలితాలైతే ఫర్వాలేదు. అదే ప్రతికూలమైతే సానుకూలంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. ♦ వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మరోసారి పునశ్చరణ చేసుకోవాలి. ♦ మన ప్రయత్న లోపం లేనప్పుడు జరిగిన పొరపాటుకు కారణాలను విశ్లేసించుకోవాలి. ♦ జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా మనసులో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి. ♦ ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులతో చర్చించి వారి నైతిక మద్దతు పొందాలి. ♦ జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెప్పుకుంటే 90 శాతం భారం దిగిపోయినట్లేనని గ్రహించాలి. ♦ విజయం మనదేనని నిశ్చయించుకుని, పట్టుదలతో చదువుతూ పూర్తిస్థాయిలో ఏకగ్రత పెంచుకోవాలి. ♦ వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి. ♦ పై సూచనలను ఆచరించడానికి ప్రయత్నించాలే తప్ప, ఫెయిలైనంత మాత్రన ప్రాణాలు తీసుకోవాలనే కఠిన నిర్ణయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు. ♦ తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి. పది రెండుసార్లు తప్పాను నేను పదో తరగతి రెండు సార్లు తప్పాను. మూడో సారి పాసయ్యాను. అంతమాత్రాన ఎటువంటి నిరుత్సాహానికి గురికాలేదు. పైగా ఆరోజు ఫెయిలవ్వడమే అదృష్టమని ఎప్పుడూ భావిస్తుంటాను. అదే నాలో కసి పెంచింది. అదే స్ఫూర్తిగా తీసుకుని ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా అన్నింటిలోనూ ప్రతిభ కనబరచ గలిగాను. చివరికు నేను డిగ్రీ చదవుకున్న కళాశాలకే ప్రిన్సిపాల్ అయ్యే అదృష్టాన్ని సొంతం చేసుకోగలిగాను. విద్యార్థులు ఎటువంటి నిరుత్సాహానాకి గురికావద్దు. ఉజ్వలమైన భవిష్యత్ ముందు ఉందనే విషయాన్ని ఎప్పుడూ మరవకండి.– బమ్మిడి పోలీసు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ -
ఇంటర్మీడియెట్ ప్రశ్నపత్రం లీక్!
సత్తెనపల్లి/సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్న పత్రం లీకైందనే వార్త గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం కలకలం రేపింది. పరీక్ష ప్రారంభానికి గంట ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం ఇంటర్మీడియెట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణ చేపట్టారు. గుంటూరు ఆర్ఐవో జెడ్ఎస్ రామచంద్రరావు, డీఈసీ మెంబర్ సి.హెచ్.వెంకటరమణ హుటాహుటిన సత్తెనపల్లి చేరుకున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నపత్రాలు తీసే సమయంలో సీసీ పుటేజీలు, సెంట్రీ రికార్డులు, పరీక్ష కేంద్రాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కస్టోడియన్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులను విచారించారు. అనంతరం ఆర్ఐవో విలేకరులతో మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో ఇంటర్ కెమిస్ట్రీ ప్రశ్న పత్రం లీక్ అయినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాలన్నింటిని పోలీసు స్టేషన్లో డిపాజిట్ చేశామని, ఉదయం 8.30 గంటలకు మెసేజ్ ప్రకారం ఎంపికచేసిన సెట్ ప్రశ్నపత్రాన్ని కస్టోడియన్ల సమక్షంలో సీఎస్‌లు, డీవోలు విత్‌డ్రా చేసుకుని తీసుకెళ్లారన్నారు. సత్తెనపల్లిలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం 8.45 గంటల తరువాతే ప్రశ్నపత్రాల కవర్లు తెరిచారని చెప్పారు. ముందుగా లీక్ కావడానికి ఆస్కారం లేదని, అంతా తప్పుడు ప్రచారమేనని తేల్చిచెప్పారు. లీక్ కాలేదు: ఇంటర్ బోర్డు మంగళవారం నాటి కెమిస్ట్రీ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు విద్యార్థులను ఆందోళనకు గురిచేసిన నేపథ్యంలో దీనిపై ఇంటర్మీడియెట్ బోర్డు వివరణ ఇచ్చింది. అన్ని అంశాలను పరిశీలించాక లీక్ కాలేదని తేలిందని బోర్డు ప్రకటన విడుదల చేసింది. అయితే గుంటూరు ఆర్ఐవోకు ప్రశ్నపత్రం 11.15 గంటలకు వాట్సప్‌లో వచ్చిందని, ఎక్కడినుంచి వచ్చిందో తేల్చడానికి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించామని పేర్కొంది. -
వైరలవుతోన్న స్మృతి ఇరానీ మెసేజ్
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇది పరీక్షా సమయమే. ఈ విషయంలో సామాన్యుల నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఒకేలా స్పందిస్తారు. ఇందుకు తాను మినహాయింపు కాదంటున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. తొలిసారి ఇంటర్ బోర్డు ఎగ్జామ్ రాయబోతున్న కొడుకుకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు స్మృతి ఇరానీ. ప్రస్తుతం ఈ స్టోరి తెగ వైరలవుతోంది. స్మృతి ఇరానీ తన కుమారుడు జోహర్‌ని ఉద్దేశిస్తూ.. ‘నా తొలి సంతానం నేడు చాలా బాధ్యతయుతమైన పౌరుడిగా, ప్రేమ కల్గిన వ్యక్తిగా ఎదిగాడు. ఈ రోజు తొలిసారి ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. తన కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాడు. నాతో ఎప్పుడు ఓ మాట అంటుంటాడు.. అమ్మ నేను నీ కంటే పొడవయ్యాను అని కానీ తనకు తెలియదు.. తల్లి ఆశీర్వాదం బిడ్డ పెరిగేంత వరకూ మాత్రమే కాక జీవితాంతం తోడుంటుందని. సంతోషంగా ఉండు’ అంటూ పోస్ట్ చేసిన ఈ మెసేజ్ నెటిజన్లకు తెగ నచ్చింది. మీ కుమారుడు మీ పేరు నిలబెడతారు మేడమ్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram This first born of mine has grown up to be a loving & responsible young man. Wrote his first 12 th board exam today, will leave home soon in pursuit of his dreams. Keeps telling me ‘Ma ab aap height mein chote ho gaye mujhse’ . Does not know ‘har Ma ki dua hai ki uska bachcha sirf height mein nahi, balki Jeevan mein usse aage badhe. Khush rahe aur tarraki kare. @zohrirani_21 ❤️#weekendvibes ❤️❤️❤️ A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Mar 2, 2019 at 1:11am PST -
పైసల కోసం ఇంటర్ పరీక్ష రాస్తూ..
చంచల్‌గూడ: పైసల కోసం ఇంటర్ విద్యార్థి బదులుగా పరీక్ష రాస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన శుక్రవారం సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సురేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ నయీం ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతూ అదే ప్రాంతంలోని స్టూడెంట్ పాయింట్ కోచింగ్ సెంటర్లో ట్యూషన్‌కు వెళ్లేవాడు. కోచింగ్ సెంటర్లో క్యాషియర్‌గా పని చేస్తున్న ఖాలేద్ రెయిన్ బజార్‌కు చెందిన తన స్నేహితుడు మహ్మద్ సోహేల్ నయీంకు పరిచయం చేశాడు. సోహేల్‌కు బదులుగా నయీం పరీక్ష రాసేందుకు గాను ఇద్దరి మధ్య రూ. 2 వేలకు ఒప్పందం కుదిర్చాడు. ఇందులో భాగంగా శుక్రవారం ఐఎస్ సదన్‌లోని గోకుల్ కాలేజీ పరీక్షా కేంద్రంలో సోహెల్ బదులుగా మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్న నయీం వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా, అందులో మరో విద్యార్థి ఫొటో ఉండటంతో స్క్వాడ్‌కు సమాచారం అందించింది. కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు నయీంతో పాటు సోహేల్‌ను అరెస్టు చేసిన సైదాబాద్ పోలీసులు రిమాండ్ తరలించారు. -
విద్యార్థులకు తొలి ‘పరీక్ష’
ఇంటర్ విద్యార్థులకు ‘తొలి’ రోజే పరీక్ష తప్పలేదు. అసౌకర్యాల నడుమ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్భాటంగా అధికారులు ప్రకటనలు చేశారు. అయితే జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్ష సమయం అవుతున్నా ఏర్పాట్లు చేస్తూ కనిపించారు. పలు కేంద్రాల్లో తాగునీటికి సౌకర్యం లేక విద్యార్థులు అవస్థ పడడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటి గదుల్లోనే పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏఎన్ఎంలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా అంతంత మాత్రంగానే ఏర్పాటు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేయడంతో విద్యార్థులకు ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎంత ముందుగా బయలుదేరినా.. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీఆర్ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, మెజార్టీ కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాల్లో సరిగా వెలుతురు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చీకటిలోనే పరీక్ష రాసిన పరిస్థితి నెలకొంది. కొన్ని కేంద్రాల్లో నామమాత్రంగా ఒక లైటు బిగించి చేతులు దులుపుకున్నారు. ప్రతి రూముకు తాగునీటి వసతి కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్ట లేదు. చాలా కేంద్రాల్లో పరీక్షకు అరగంట ముందుగా ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ కేంద్రలో పరీక్షకు అరగంట ముందు సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. రూముల్లో కూడా కుర్చీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ సిబ్బంది వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. ప్రతి కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు వైద్య కిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా అవి కనిపించలేదు. పరీక్ష ప్రారంభమైనా కూడా ఏఎన్ఎం ఎవరూ రాకపోవడం గమనార్హం. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు సైతం నామమాత్రపు విధులు నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు మాత్రమే ఒక కానిస్టేబుల్ రావడం విశేషం. నెల్లూరులో ట్రాఫిక్ కష్టాలు అభివృద్ధి పేరుతో అధికారులు నగరంలో ఎక్కడపడితే అక్కడ రోడ్లను తవ్వేశారు. ఏ ప్రాంతంలోనూ పూర్తిస్థాయిలో పనులు చేసిన పరిస్థితి లేదు. దీంతో ఉదయం సమయంలో ఒకవైపు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో వాహనాలు, మరో వైపు పాఠశాలలకు విద్యార్థులను తీసుకు వెళ్లే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు టెన్షన్ పడ్డారు. ప్రధానంగా స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్, వీఆర్సీ, ఆర్టీసీ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆయా కూడళ్లలో పోలీసులు కనిపించలేదు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసుశాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పరీక్ష ముగిసిన తర్వాత కూడా విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. చాలా మంది తల్లిదండ్రులు బైక్‌లతోనే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. కేంద్రాల వద్ద కోలాహలం.. ఆలయాలు, ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం కనిపించింది. దేవాలయాల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, బంధువులు కూడా రావడంతో రద్దీగా కనిపించింది. విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లను కళాశాల బయట డిస్ప్లేలో ఉంచారు. ఈ నేపథ్యంలో నంబర్లు చూసుకునేందుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గమిగూడారు. విద్యార్ధులు పరీక్ష రాసేందుకు గదిలోకి వెళ్లగా తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల వద్ద బయట నిరీక్షించారు. మాస్ కాపీయింగ్ ఆరోపణలు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో మాస్ కాపీయింగ్క పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలే మాస్ కాపీయింగ్‌కు తెరలేపారన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, తోటపల్లిగూడూరు, చేజర్ల, అల్లూరు, సౌత్‌మోపూరు, రాపూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగిందని తెలిసింది. 820 మంది విద్యార్థులు గైర్హాజరు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90 కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 27610 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 26790 మంది హాజరయ్యారు. 820 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. జనరల్‌కు సంబంధించి 26510 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 25793 మంది హాజరయ్యారు. 717 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఒకేషనల్‌కు సంబంధించి 1100 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 997మంది హాజరయ్యారు. 103 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ సత్యనారాయణ డీకేడబ్ల్యూ, వీఆర్ కళాశాలలతో పాటు మరో రెండు కళాశాలలను తనిఖీలు నిర్వహించారు. సిటింగ్, స్క్వాడ్ అధికారులు జిల్లాలో 63 కేంద్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
-
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) ఎస్ సత్యనారాయణ తెలిపారు. స్టోన్‌హౌస్‌పేటలోని కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 49 ప్రభుత్వ, 41 ప్రయివేటు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులను అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. 26701 మంది ప్రథమ సంవత్సరం, 27981 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా నలుగురు ప్లయింగ్, ఐదుగురు సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీరితో పాటు హైపవర్ కమిటీ, పరీక్షల కమిటీ సభ్యులు, అబ్జర్వర్ డీవీఈఓ వెంకయ్య పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పరీక్షలకు 1252 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. వీరితో పాటు 18 మంది కస్టోడియన్స్ ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంలోని మూడు కేంద్రాలు, రాపూరు, ఉదయగిరి, కోట, డక్కిలి, వెంకటగిరి, కావలి శ్రీచైతన్య జూనియర్ కళాశాల కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో నాలుగుకు తగ్గకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామన్నారు. చేజర్ల, సౌత్మెపూరులో సెల్ఫ్ సెంటర్లు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా బయటి వ్యక్తులను నియమించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు ఐపీఈ సెంటర్ లోకేటర్ యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్లను జన్మభూమి యాప్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఏమైనా కారణాలు చూపి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోతే జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఇబ్బందుల తలెత్తితే కాల్‌సెంటర్ 0861 2320312 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో పరీక్షల బోర్డు కమిటీ సభ్యులు సురేష్‌బాబు, ఎస్పీ మౌలాలి, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలపై కెమెరా కన్ను
శ్రీకాకుళం: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూ ర్తయ్యాయి. బుధవారం నుంచి ప్రారంభం కాను న్న ఇంటర్ పరీక్షలపై సీసీ కెమెరాలతో నిఘా పె ట్టనున్నారు. గతంలో సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రమే ఈ కెమెరాలను వినియోగించేవారు. ఈ ఏడాది అన్ని కేంద్రాల్లోనూ వినియోగించాలని ఆదేశాలు జారీ కావడంతో ఇప్పటికే దాదాపు పరీక్ష కేంద్రాలన్నింటిలో కెమెరాల అమరిక పూర్తి చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు 105 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 27 నుంచి ప్రథమ సంవత్సర, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు పూర్తయ్యాయి. థియరీ పరీక్షలకు జిల్లా నుంచి 59,614 మంది హాజరు కానున్నారు. వీరిలో మొదటి ఏడాది జనరల్ విద్యార్థులు 27,357 మంది కాగా, 1694 మంది వొకేషనల్ విద్యార్థులు, రెండో ఏడాది జనరల్ విద్యార్థులు 25,625 మంది కాగా, వొకేషనల్ విద్యార్థులు 1501 మంది పరీక్ష రాయనున్నారు. ప్రైవేటు అభ్యర్థులు జనరల్ నుంచి 3347 మంది, వొకేషనల్విభాగం నుంచి 90 మంది పరీక్షకు హాజరు కానున్నారు. వీరందరికీ రెండు రోజులుగా ఆన్లైన్లో హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యాన్ని కల్పించారు. 105 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిలో 39 ప్రభుత్వ, ఒక మోడల్ స్కూల్, 6 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలు, మూడు ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలు, ఒక కో ఆపరేటివ్ జూనియర్ కళాశాల, 55 ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు పరీక్షల్లో అక్రమాలకు తెరలేపుతున్నాయని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధికారులు ఈ నిర్ణ యం తీసుకున్నారు. పరీక్షలకు అవసరమైన మెటీరియల్ ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్లకు శనివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశా రు. ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య తీవ్రంగా ఉండగా, సమీప కళాశాలల నుంచి ఫర్నీచర్‌ను సమకూర్చుకోవాలని సంబంధిత పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు అందాయి. పోలీసు, వైద్య, ఆరోగ్యశాఖ, రవాణా శాఖ అధికారులతో పరీక్షలు జరిగిన కాలంలో సంబంధిత శాఖలు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష తేదీలు ఇలా ప్రథమ సంవత్సరం 27న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 1న ఇంగ్లీషు, 5న గణితం–1ఎ, బోటనీ, సివిక్స్, 7న గణితం–1బి, జువాలజీ, హిస్టరీ, 9న ఫిజిక్స్, ఎకనామిక్స్, 12న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 14న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ బ్రిడ్జి కోర్సు, 16న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫి ద్వితీయ సంవత్సరం 28న సెకండ్ లాంగ్వేజ్, 2న ఇంగ్లీషు, 6న గణితం –2ఎ, బోటనీ, సివిక్స్, 8న గణితం–2బి, జువాలజీ, హిస్టరీ, 11న ఫిజిక్స్, ఎకనామిక్స్, 13న కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 15న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ బ్రిడ్జి కోర్సు, 18న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు జరగనున్నాయి. -
ఈసారైనా.. 50 శాతం దాటుతుందా?
విద్యార్థి భవిష్యత్తును మలుపు తిప్పే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,273 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే కొత్తగా జిల్లా ఏర్పాటయ్యి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఇంటర్లో జిల్లా ఫలితాలు 50 శాతం దాటలేదు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రతీవారం స్లిప్ టెస్టులు నిర్వహించారు. దీంతో కనీసం ఈ సారైనా ఫలితాలు మెరుగవుతాయా? అనే ఆశలు అందరి మదిలో మెదులుతున్నాయి. పాపన్నపేట(మెదక్): జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 7 ఆదర్శ, 2 సాంఘిక సంక్షేమ పాఠశాలలతోపాటు మరో 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 15,273 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. ఒక నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. ఈ ఏడాది జూన్, జూలైలో జరిగిన లెక్చర్ల బదిలీలు ఆగస్టులో విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లు, ఎన్నికల విధులు కొంత వరకు విద్యాసంవత్సరానికి ఆంతరాయం కలిగించాయనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా గల 29 పరీక్ష కేంద్రాల్లో 26 జంబ్లింగ్ సెంటర్లు, 3 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్లయింగ్ స్క్వాడ్, డెక్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, బోర్డు పరిశీలకులు నిరంతరం పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఉదయం 8గంటలకు ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలో నిర్ణయిస్తారు. మూడేళ్లుగా.. జిల్లా ఏర్పడిన తరువాత ఇంటర్ ఫలితాలు ఎప్పుడు కూడా 50శాతాన్ని దాటలేదు. 2016–17 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. 2017–18లో 49శాతం ఫలితాలతో 18వ స్థానానికి దిగజారింది. ఆదర్శ, గురుకుల కళాశాలల ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల ఫలితాలు దిగజారాయి. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో 71 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 7మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక ఈ విద్యా సంవత్సరం మెరుగైన పలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి చర్యలు తీసుకున్నారు. జూన్, జూలైలో జరిగిన లెక్చరర్ల బదిలీలు, ఆగస్టు చివరి వారంలో ఆలస్యంగా గెస్ట్ లెక్చరర్లు విధుల్లో చేరడం, ఈ ఏడాది జరిగిన ఎన్నికల విధులు ఇంటర్ విద్యకు కొంత ప్రతికూల అంశాలుగా భావించవచ్చు. ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. ఈ ఏడాది ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కళాశాలలో ప్రత్యేక తరగతులు, స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి 100శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేశాం. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. –సూర్యప్రకాశ్, నోడల్ అధికారి