ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఫీజు కట్టకున్నా, హాజరు కాకపోయినా పరీక్ష రాయొచ్చనే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ ప్రయివేట్ జూనియర్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులందరూ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష రాస్తే, ఇక నాణ్యమైన విద్యతో పాటు, బయోమెట్రిక్ హాజరు ఎందుకని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు