Telangana Inter board
-
నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ మంగళవారం వెల్లడించింది. 2025లో పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు.. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని బోర్డ్ స్పష్టం చేసింది.మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.520 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.230తో కలిపి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
TS: తప్పులు లేకుండా ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా ఈసారి ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఫలితాల వెల్లడి ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం పరీక్షల విభాగం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. స్పాట్ వ్యాల్యుయేషన్, మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ, ఆన్లైన్లో మార్కుల నమోదు విధానాలపై చర్చించారు. ప్రతీ సంవత్స రం పరీక్షలు, ఫలితాల వెల్లడిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈసారి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఇదే స్ఫూర్తిని ఫలితాల వెల్లడిలోనూ కనబరచాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడికి అవసరమైతే కొంత సమయం తీసుకోవడానికైనా వెనుకాడవద్దని, అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకెళ్ళాలని అధికారులకు మిత్తల్ సూచించారు. ఆన్లైన్ ఫీడింగ్‌లో గతంలో అనేక పొరపాట్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై అధికారులు లోతుగా అధ్యయనం చేశా రు. మార్కుల నమోదులో గతంలో ఎందుకు సమస్యలొచ్చాయి? సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలా? వ్యక్తుల తప్పిదాలా? అనే అంశాలపై మిత్తల్ ఆరా తీశా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాఫ్ట్‌వేర్‌ను పూర్తిస్థాయిలో నిపుణుల చేత పరిశీలించాలని సూచించారు. పరీక్షలు రాసిన 9 లక్షల మంది విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షకు సంబంధించి దాదాపు 9 లక్షల మంది ఈసారి పరీక్ష రాశారు. ఇంతమంది మార్కుల నమోదు విషయంలో ప్రత్యేక పరిశీలనకు అధికారులను నియమించారు. అంతిమంగా అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫలితాల వెల్లడికి సిద్ధమవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఎక్కడైనా తప్పు జరిగిందని భావిస్తే, మార్కులను మాన్యువల్‌గా తెప్పించి చూడటం ఆలస్యమవ్వొచ్చు. దీన్ని దృష్టి లో ఉంచుకుని ఆన్లైన్లో వీలైనంత త్వరగా విద్యార్థి రాసిన పేపర్‌ను పరిశీలించే ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా అధైర్యపడకుండా చర్యలు తీసుకోవాలని మిత్తల్ సూచించారు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించే వీలుందని బోర్డుకు సంబంధించిన ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. మే రెండో వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెల్లడించాలనే పట్టుదలతో అధికారులున్నారు. -
స్కూల్ టీచర్లకూ ‘ఇంటర్’ విధులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యేవారికి చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఇంటర్ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది, సెకండియర్‌కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. భద్రత మరింత పెంపు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్ బోర్డ్ నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. – జయప్రదాబాయి, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు ఇంటర్ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. – నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
ఈ ఏడాదికి ‘గుర్తింపు’ ఇచ్చేద్దాం!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అనుమతులు లేక పెడింగ్‌లో ఉన్న 465 ప్రైవేటు ఇంటర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. పరీక్షలు దగ్గరపడుతున్న కారణంగానే ఈసారికి గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది నుంచి కఠినంగానే వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. కాలేజీలు ప్రారంభమయ్యేనాటికే అనుబంధ గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన అర్హతలు పరిశీలిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో ఈ సంవత్సరం దాదాపు లక్ష మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలు రాయాల్సిన ముప్పు తొలగిపోనుంది. ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉంటేనే ఆయా కాలేజీల నుంచి విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారిని ప్రైవేటు అభ్యర్థులుగా పరిగణిస్తారు. తరచూ ఇదే సమస్య ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం కొన్నేళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర అనుమతులు లేవని దరఖాస్తులు తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యత్ కోసమంటూ గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా రాష్ట్రవ్యాప్తంగా 1,475 ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వీటిలో 1,010 కాలేజీలకు అధికారులు అఫిలియేషన్ ఇచ్చారు. మరో 465 కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నట్టు ఇంటర్ బోర్డు గుర్తించింది. బహుళ అంతస్తుల భవానాల్లో నడిచే ఈ కాలేజీలకు అగ్నిమాపక శాఖ అనుమతి లేదు. ఈ కాలేజీల్లో దాదాపు లక్షమంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ అంశంపై ఇంటర్ బోర్డు అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది వరకూ అఫిలియేషన్ ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చారు. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి కాలేజీలు ప్రారంభమవడానికి ముందే అన్ని అంశాలు సమీక్షించి, అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, అఫిలియేషన్ రాకుండానే ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందే కళ్లు తెరవాలి.. అనుబంధ గుర్తింపు ప్రక్రియలో కొన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తుల బేరసారాలతో గతంలో అధికారులు దీన్నో వ్యాపారంగా మార్చారు. ప్రస్తుత కార్యదర్శి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, కాలేజీలు తెరిచేనాటికే అర్హత ఉన్న కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వాలి. అర్హత లేని కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేస్తే విద్యార్థులు గందరగోళంలో పడే అవకాశం ఉండదు. – మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ సమితి, కన్వీనర్ 28 కల్లా తేల్చేస్తాం మిగిలిపోయిన కాలేజీల అఫిలియేషన్ ప్రక్రియపై ఈ నెల 28 నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నదే మా విధానం. ఇక మీదట అనుబంధ గుర్తింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ముందునుంచే కృషి చేస్తాం. – నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
తెలంగాణ: రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. tsbie.cgg.gov.inలో ఫలితాలు చూడవచ్చు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలురకంటే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాం చంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 75.15% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 62.10% మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో (జనరల్, వొకేషనల్) రెగ్యులర్ విద్యార్థులు 68.86% మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ తీసేసి జనరల్‌లోనే చూస్తే 69.61% మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఫస్టియర్‌లోనూ 67.47% మంది బాలికలు, 52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్స రంలో 60.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ స్థానంలో ఆసిఫాబాద్, మేడ్చల్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి (వొకేషనల్ రెగ్యులర్ ప్రైవేటు మినహా) 4,44,708 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 2,82,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అం దులో ఆసిఫాబాద్ జిల్లా 80% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవ త్సర జనరల్, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులనే తీసుకుంటే 4,11,631 మంది పరీక్షలకు హాజరు కాగా 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 80% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు.. ప్రథమ సంవత్సరంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4,80,555. అందులో జనరల్ విద్యార్థులు 4,31,358 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,197 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 2,44,105 మంది బాలికలు పరీక్షలకు హాజరవగా బాలురు 2,36,450 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరంలో మొత్తంగా ఉత్తీర్ణులైన వారు 2,88,383 (60.01 శాతం) మంది ఉన్నారు. వారిలో జనరల్ విద్యార్థులు 2,63,463 మంది. వొకేషనల్ విద్యార్థులు 24,920 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 1,64,704 మంది (67.47 శాతం) ఉత్తీర్ణులవగా 1,23,679 మంది (52.30 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గ్రేడ్లవారీగా ఉత్తీర్ణులు.. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ రెగ్యులర్ విద్యార్థులు, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు 4,11,631 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో జనరల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 3,74,492 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 37,139 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 70,216 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు విద్యార్థులు 3,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలకు మొత్తంగా జనరల్, వొకేషనల్ రెగ్యులర్‌లో 2,13,121 మంది బాలికలు హాజరవగా, 1,98,510 మంది బాలురు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన మొత్తం ద్వితీయ సంవత్సర జనరల్, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థుల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో జనరల్ రెగ్యులర్ విద్యార్థులు 2,60,703 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 22,759 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 21,505 మంది, వొకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 1,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలికల్లో 1,60,171 మంది (75.15 శాతం) ఉత్తీర్ణులుకాగా పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలురులో 1,23,291 మంది (62.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అత్యధికంగా ఉత్తీర్ణత ఈసారి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా గ్రూపులతో పోలిస్తే అత్యధికంగా ఎంపీసీలో 67.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు పేర్కొంది. ఆ తరువాత బైపీపీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీఈసీలో చాలా తక్కువ శాతం మంది విద్యార్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర హాజరైన విద్యార్థులు వివరాలు.. పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం ఇంటర్లో ఉత్తీర్ణత శాతం ఏటేటాæ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదైంది. గతేడాది మినహాయిస్తే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 వార్షిక పరీక్షల్లో 60.14 శాతం ఉన్న ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత ప్రస్తుతం 68.86 శాతానికి పెరిగింది. రెగ్యులర్ విద్యార్థుల్లో మాత్రమే చూస్తే 69.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2014లో 52.65 శాతం ఉత్తీర్ణత నమోదవగా ఈసారి 61.07 శాతానికి పెరిగింది. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 4,80,555 మంది విద్యార్థులు హాజరుకాగా, 67.47 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగానే ఫలితాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు. బాలికలు 60శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ పరీక్షలను 4,11,631 మంది విద్యార్థులు రాయగా, 68.86శాతం ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలికలు 75.15 శాతం, బాలురు 62.10 శాతం పాసయ్యారు. ఇంటర్ ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాకు అగ్రస్థానం దక్కగా.. 75 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాల్యుయేషన్‌కు సహకరించిన లెక్చరర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఐసిఆర్, ఓఎంఆర్ సాంకేతికతను ఉపయోగించుకుని ఫలితాలు నిర్ణయించినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఫలితాలు www.sakshieducation.com లో చూడవచ్చు. -
నిమిషం లేటు.. మారిన ఫేటు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1339 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరానికి చెందిన 9.65లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభంకాగా, రేపటినుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:45లోపు సెంటర్ లోపలికి వెళ్లాలని నిబంధన ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఉరుకులు పరుగులతో 8గంటలకే సెంటర్ల దగ్గరకు చేరుకున్నారు. అయితే నిమిషం నిబంధన, ఇతర కారణాల వల్ల పలుచోట్ల కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినందుకు వెన్నెల రాజేశ్వరి అనే విద్యార్థినిని పోలీసులు పరీక్ష రాయటానికి అనుమతివ్వలేదు. పెద్దపల్లి : జిల్లాలోని మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో మరో ముగ్గురు విద్యార్థులు ఇంటర్ పరీక్ష రాయలేకపోయారు. హాల్ టికెట్ లేకుండా ఇద్దరు విద్యార్థులు, ఒకరు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. దీంతో సదరు విద్యార్థులు అక్కడినుంచి వెనుతిరగాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి : రామన్న పేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కాలేజీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు సెంటర్ దగ్గరకు ఆలస్యంగా రావటంతో పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. వారిలో ఐదుగురిది రామన్నపేట గవర్నమెంట్ కాలేజ్, ఒకరిది నలంద కాలేజ్‌గా గుర్తించారు. నిజామాబాద్ : జిల్లాలో ఇద్దరు విద్యార్థులు పరీక్ష మిస్ అయ్యారు. వారిలో నిజామాబాద్‌కు చెందిన గణేష్ అనే విద్యార్థి సెంటర్ పేరు సేమ్ ఉండటంతో కన్ఫ్యూజన్కు గురై మరో సెంటర్‌కు వచ్చాడు. దీంతో అధికారులు అతడ్ని బయటకుపంపించేశారు. అదేవిధంగా బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని అనిత 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లభించలేదు. -
విద్యార్థులకు విషమ పరీక్ష!
సాక్షి, హైదరాబాద్: తెల్లారితే ఇంటర్ పరీక్షలు.. అయినా ఆ కాలేజీ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. అడిగితే ఇదిగో వస్తాయి.. అదిగో వస్తాయి.. అంటూ యాజమాన్యం విద్యార్థులను మభ్య పెట్టింది. చివరికి ఇంటర్ బోర్డు అధికారులను కలసే వరకు అసలు విషయం తెలియలేదు. వారి నుంచి ఫీజులను వసూలు చేసిన యాజమాన్యం బోర్డుకు చెల్లించలేదని తెలిసింది. హైదరాబాద్ (కొత్తపేట)లోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు అసలు పరీక్షలకు ముందు మరో కఠిన పరీక్షనే ఎదుర్కొన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, మంగళవారం రాత్రి వరకు కూడా వారి హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి రాలేదు. దీంతో వారంతా ఆం దోళన చెందుతూ ఇంటర్మీడియట్ బోర్డును సంప్రదించారు. స్పందించిన ఇంటర్ బోర్డు.. ఇటు విద్యార్థులకు హాల్‌టికెట్లు అందని విషయంపై తెలంగాణ ఇంటర్ బోర్డు వెంటనే స్పందించింది. విద్యార్థుల ఫీజు చెల్లించడం మర్చిపోయామని కొత్తపేటలోని శ్రీమేధా‘వి’కాలేజీ యాజమాన్యం తెలిపిందని, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారికి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు అనుమతించామని బోర్డు తెలిపింది. 48 మంది విద్యార్థుల జాబితాతో మంగళవారం తమ వద్దకు కాలేజీ యాజమాన్యం వచ్చిందని బోర్డు వెల్లడించింది. వారి లో 11 మంది ఫస్టియర్ కాగా మిగిలిన వారు సెకండియర్ విద్యార్థులున్నారని తెలిపింది. మరో ఘటనలో హన్మకొండకు చెందిన బీఆర్ అంబేడ్కర్ వొకేషనల్ కాలేజీ కూడా మంగళవారం 30 మంది విద్యార్థుల జాబితాతో బోర్డును ఆశ్రయించింది. కాగా, వీరికి గత నెల 20నే ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు వీరిని థియరీ పరీక్షలకు అనుమతించినా ఫెయిల్ కిందే లెక్క.. అందుకే వీరిని మేలో జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవ్వాలని సూచించింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన రెండు కాలేజీల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. గత మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. మొదటి సంవత్సరం ఫలితాలను వారంలోపు విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్ మెమోలను అందుబాటులో పెట్టామని, ఈ సారి ఆన్లైన్లో ఫిర్యాదులు తీసుకుంటామని చెప్పారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు ఆయన వెల్లడించారు. ఇందులో బాలికలు 41.35 శాతం, బాలురు 35.4 శాతం పాసయ్యారని తెలిపారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చాలా బాధపడ్డారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలన్న తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు. ఇంటర్ విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
ఈ నెల మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 తుది ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్థత, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ చైర్మన్ రామచంద్రరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, ప్రవేశాల ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకంగా ఉన్న పలు అంశాలపై సీఎస్ వారితో చర్చించారు. ఫలితాల విడుదలపై తొందర అవసరం లేదని, ఏపీ ఇంటర్మీడియెట్ మార్కులతోపాటు, తెలంగాణ ఇంటర్మీడియెట్ మార్కులు కూడా వచ్చాకే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మే మూడో వారంలో ఫలితాల విడుదలకు నిర్ణయించారు. తెలంగాణ ఇంటర్ మార్కులు వచ్చాక ఎంసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల ఇంటర్ మార్కులను అందించడంలో సమస్య ఏర్పడింది. మార్కులు బయటకు వెల్లడించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో బోర్డు అధికారులు.. ఎంసెట్ అధికారులకు మార్కులు ఇచ్చేందుకు తర్జనభర్జన పడ్డారు. ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, మార్కులను ఎంసెట్ కమిటీకి అందించాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మికి సూచించారు. బయటకు వెల్లడి కావన్న షరతుతో ఈ మార్కులు అందించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఇంటర్మీడియెట్ మార్కుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామనడంతో సమస్య పరిష్కారమైంది. తెలంగాణ బోర్డు నుంచి వచ్చే వరకు నిరీక్షణ తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు తీవ్ర గందరగోళంలో పడిన నేపథ్యంలో వాటి సమాచారం ఎప్పటికి వస్తుందో అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ ఎంసెట్–2019కు మొత్తం 2,67,627 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణలో ఇంటర్ చదివినవారు 40,242 మంది ఉన్నారు. వీరిలో 14 వేల మంది వరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా తక్కినవారు అక్కడ సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇలా వేలాది సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరైనందున వారి మార్కులు కూడా వచ్చాకనే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై అక్కడి హైకోర్టు ఈ నెల 8 వరకు గడువు ఇచ్చినందున రెండో వారంలో ఆ ఫలితాలను అక్కడి బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని సీఎస్ సూచించారని సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. జూన్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించనుంది. జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జూన్ రెండో వారం నుంచి ప్రారంభించి, జూలై నాటికి ప్రవేశాలను పూర్తి చేయించి, అనంతరం తరగతుల ప్రారంభానికి వీలుగా చర్యలు తీసుకోనున్నామని ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి. -
ఇద్దరు ఉద్యోగులపై తెలంగాణ ఇంటర్ బోర్డు వేటు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా 00 గా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్ ఉమాదేవికి అయిదువేలు జరిమానాతో పాటు ఉద్యోగం నుంచి తొలగించగా, లెక్చరర్ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో తప్పిదాల కారణంగా సుమారు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ విషయం తెలిసిందే. -
మే 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 16వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1వ తేదీవరకూ, జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
ఎంసెట్ ఫలితాలపై తర్జనభర్జన!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 ఫలితాల విడుదల తేదీపై సందిగ్థత నెలకొంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎంసెట్‌ను అధికారులు పూర్తిచేసినా ఫలితాల విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. ర్యాంకులతో ఫలితాల ప్రకటనకు అవసరమైన ఇంటర్మీడియెట్ మార్కులు అందకపోవడమే దీనికి కారణం. అటు ఏపీ, ఇటు తెలంగాణ బోర్డుల నుంచి ఇంటర్ మార్కుల సమాచారం రావాల్సి ఉండడంతో సకాలంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు గ్రేడుల రూపంలో ప్రకటించిన ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్ కమిటీకి అప్పగించాల్సి ఉంది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గందరగోళంలో పడ్డాయి. మార్కులతో సంబంధం ఉన్న ర్యాంకులను ముందుగా ప్రకటించకుండా ఎంసెట్‌లో ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను ముందు ప్రకటించే అంశంపై అధికారులు ఆలోచన సాగిస్తున్నారు. ఇంటర్మీడియెట్ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులను ప్రకటిస్తారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. సకాలంలో పరీక్షలు పూర్తిచేసినా.. ఏపీ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌లో 1,85,711 మంది, అగ్రి, మెడికల్‌లో 81,916 మంది పరీక్షలు రాశారు. వీటికి సంబంధించి సెషన్ల వారీ మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ‘కీ’లను కూడా ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు వెబ్సైట్ ద్వారా ప్రకటించారు. ఈ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ శనివారంతో ముగిసింది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి, తుది ఫలితాలను ర్యాంకులతోపాటు ప్రకటించాల్సి ఉంది. ఈసారి అనుకోని అవాంతరాలు ఈసారి ఎంసెట్ ఫలితాల ప్రకటనకు అనుకోని అవాంతరాలు తప్పడం లేదు. పరీక్షలను నిర్ణీత తేదీల్లో ముగించిన అధికారులు ఫలితాలను గతంలో కంటే ముందుగా మే 1నే ప్రకటించాలని భావించారు. అయితే, ఎంసెట్ ర్యాంకులను వెల్లడించాలంటే ఆ విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన మార్కులను 75 శాతంగా, ఇంటర్లో వచ్చిన మార్కులను 25 శాతంగా తీసుకొని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మార్కుల కోసం ఏపీ, తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులకు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. అయితే, ఏపీ ఇంటర్ ఫలితాలను ఈసారి మార్కుల విధానంలో కాకుండా గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఈ ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్ కమిటీకి ఇంటర్మీడియెట్ బోర్డు అందించాల్సి ఉంది. దీనికి ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటన తీవ్ర గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి ఆలస్యమయ్యే అవకాశం ర్యాంకులు ప్రకటించాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ మార్కులు రావాలి. ఏపీ ఇంటర్ మార్కులు త్వరగా వచ్చే అవకాశాలున్నా తెలంగాణ బోర్డు నుంచి చాలా ఆలస్యమయ్యేలా ఉంది. ఆ మార్కులతో సంబంధం లేకుండా ఏపీ మార్కులు వచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేయొచ్చు. కానీ తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు దాదాపుగా 18 వేల మంది వరకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది ఏపీకి చెందినవారే. టాప్‌టెన్ ర్యాంకుల్లో కూడా సగానికిపైగా వారికే వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారిని విస్మరించి ర్యాంకులు ప్రకటించడం సరికాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే ర్యాంకులను ప్రకటించకుండా కేవలం ఆయా అభ్యర్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులను ముందుగా మే 1న ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులతో కూడిన ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. -
ఇంటర్ ఫలితాల్లో కొన్ని తప్పులు దొర్లాయి..
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను శనివారం ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు బాగున్నా, వాటి అమలులో ఫెయిల్ అయ్యారు. ఫలితాలు వెల్లడి చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. రిజల్ట్స్ వచ్చిన రెండు, మూడు గంటల్లోనే తప్పు జరిగిందని బోర్డు దృష్టికి వచ్చింది. కోడింగ్ సరిగా జరగకపోవడం వల్లే విద్యార్థుల హాజరు విషయంలో పొరపాట్లు జరిగాయి. ఓఎమ్మార్ షీట్లలో బబ్లింగ్ చేసే సమయంలో కూడా కొన్ని మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితాల ముందు డేటా అనాలసిస్ చేసి ఉంటే బాగుండేది. సర్వర్ సామర్థ్యం పెంచమని త్రిసభ్య కమిటీ సూచించింది. ఇక గ్లోబరినా ఏజెన్సీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. విద్యార్థుల ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం. 531 మంది జాగ్రఫీ విద్యార్థుల మెమోలో ప్రాక్టికల్స్ మార్కులు కనిపించలేదు. చివరి నిమిషంలో సెంటర్ మార్పుల వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఉత్తీర్ణత శాతంలో తేడాలు లేవని కమిటీ గుర్తించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. సాఫ్ట్వేర్ లోపాలు ఉండటంతో కోడింగ్, డీ కోడింగ్ సమస్యలు వచ్చాయి. గతంలో కూడా ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయి. వాటిని సరిచేసాం. ఈ తప్పులు ఊహించనవి కాదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి జరిగాయి. ఫెయిల్ అయని విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం ఉచితంగా ఇస్తాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇకపై మానవ తప్పిదాలు లేకుండా చూసుకుంటాం. అందరి సందేహాలు తొలగించేందుకు కమిటీ తెలిపిన ఆరు సూచనలను అమలు చేస్తాం.’ అని తెలిపారు. -
ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. చదవండి...(ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియెట్‌తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ ప్రొక్యూర్ మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. ‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీ వెరిఫికేషన్ కోసం 8 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా గత నాలుగు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా బోర్డు వెబ్సైట్, యాప్ ఓపెన్ కాకపోవడంతో పలు ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా స్పందించిన ఇంటర్ బోర్డు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం హైదరాబాద్‌లో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (bie.telangana.gov.in) మరియు TSONLINE ద్వారా దిగువ ఇచ్చిన కేంద్రాల్లో రీ వెరిఫికేషన్ కోసం రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా ఇంటర్మీడియెఓట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మహబూబియా జూనియర్ కాలేజీ, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ ఎంఏఎం జూనియర్ కాలేజీ, నాంపల్లి హైదరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ, ఫలక్‌నుమా, హైదరాబాద్ (మొబైల్ నెంబర్: 9848781805) ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా (మొబైల్ నెంబర్: 9848018284) జిల్లా ఇంటర్మీడియోట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా మొబైల్ నెంబర్: 9133338584) -
ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు. కాగా ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 19మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగినేనిపల్లిలో ఇంటర్ విద్యార్థిని మిథి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్ సెకండియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మరోవైపు ఇవాళ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చదవండి....(మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య) -
రెండో రోజు ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
‘గంటలు గంటలు సమీక్షలు చేసే సీఎం ఎక్కడా..?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలు, ఇంటర్ బోర్డు అవకతవకలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల గందరగోళంపై మంగళవారం ఆయన సీఎస్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల్లో తప్పామనే మనోవేదనతో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవ అని మంత్రి, మాస్ హిస్టీరియాతో ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గంటలు గంటలు సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను వదిలేసి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ ఫలితాల బాధ్యత ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వీటన్నిటిపై న్యాయ విచారణ జరగాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం.. ఫలితాలు తారుమారైన పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలుపుతుంటే నిర్బంధిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం చేశారు. పోలీస్ జులుంతో బీజేపీ కార్యకర్తలను చితకబాదారని ఆరోపించారు. ఇప్పటికే ఎంఎసెట్ మూడుసార్లు నిర్వహించారని, గ్రూప్ 2 వాయిదా వేశారని విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు తొందరపాటు చర్యలకు దిగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరీనా సంస్థ అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు దిష్టి బొమ్మలు దగ్దం చేస్తామని చెప్పారు. -
తెలంగాణ ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
ఇంటర్ బోర్టుపై కోమటిరెడ్డి ఫైర్
సాక్షి, నల్గొండ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే నిదర్శనమని, ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి, తమ జిల్లా వ్యక్తి కావడం సిగ్గుచేటన్నారు. ఆయనను వెంటనే మంత్రి పదవినుంచి డిస్మిస్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి వద్ద ఉంచుకొని అవినీతి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. రెవిన్యూ శాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏమీకాదని స్పష్టం చేశారు. -
ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ మంటలు చల్లారడం లేదు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి : బయటపడుతున్న ఇంటర్ బోర్డు లీలలు.. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యవహించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డ్ వద్దకు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ కమిటీని వేసిన సంగతి తెలిసిందే.