
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డ్ మంగళవారం వెల్లడించింది. 2025లో పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు.. నిర్ణయించిన తేదీల్లో సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా ఫీజు చెల్లించాలని బోర్డ్ స్పష్టం చేసింది.

మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులు రూ.520 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు ప్రాక్టికల్స్, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూ.230తో కలిపి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment