హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటినుంచి ఈ నెల 24 వరకూ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 1319 సెంటర్లలో ప్రాక్టికల్స్ పరీక్షకు 3,08,482 మంది విద్యార్ధులు హాజరకానున్నారు.